Practice the AP 9th Class Social Bits with Answers 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Social Bits 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు

I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు:

కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో వ్రాయండి.

1. తీవ్ర పని పరిస్థితులకు వ్యతిరేకంగా రాజకీయ నిరసనలు పెరిగినవి.
A) కర్మాగారాలలో
B) వ్యవసాయంలో
C) విద్యాలయాలలో
D) ఇండ్లలో
జవాబు:
A) కర్మాగారాలలో

2. ఫ్రాన్స్ తో ఇంగ్లాండ్ దీర్ఘకాలం పాటు యుద్ధంలో పాల్గొన్నది
A) 1790-1800
B) 1792-1815
C) 1795-1830
D) 1800-1850
జవాబు:
B) 1792-1815

3. సగటు వేతనాల స్థాయికి అందనంతగా ధరలు పెరిగినవి
A) చేపలు
B) గోధుమలు
C) బియ్యం
D) రొట్టె
జవాబు:
D) రొట్టె

AP 9th Class Social Bits Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

4. రొట్టె లేదా ఆహార అల్లర్లు దేశమంతటా మొదలయ్యి విస్తరించినవి
A) 1790
B) 1791
C) 1792
D) 1793
జవాబు:
A) 1790

5. యుద్ధంలో అత్యంత గడ్డు సంవత్సరం
A) 1792
B) 1793
C) 1794
D) 1795
జవాబు:
D) 1795

6. ఈ పరిశ్రమలో యంత్రాలను ప్రవేశపెట్టడం వల్ల వేలాది చేనేత కార్మికులకు పని లేకుండా పోయింది.
A) గనుల పరిశ్ర
B) పంచదార పరిశ్రమ
C) నూలు పరిశ్రమ
D) ఉక్కు పరిశ్రమ
జవాబు:
C) నూలు పరిశ్రమ

7. వ్యక్తిగత స్వేచ్ఛ, అవకాశాలలో సమానత్వం అన్నవి వీరికి వర్తిస్తాయి.
A) పెట్టుబడిదారులకు
B) భూస్వాములు
C) కార్మికులు
D) చిన్న రైతులు
జవాబు:
A) పెట్టుబడిదారులకు

8. తొలి సామ్యవాద మేధావులలో ఫ్రాన్స్ కి చెందిన ఈయన ఒకరు
A) రూసో
B) జాన్ లాక్
C) సైమన్
D) బాబెఫ్
జవాబు:
C) సైమన్

9. పారిశ్రామిక విప్లవానికి నిలయమైన దేశం
A) ఫ్రాన్స్
B) ఇంగ్లాండ్
C) రష్యా
D) జర్మనీ
జవాబు:
B) ఇంగ్లాండ్

10. సహకార గ్రామాలను నిర్మించాలని పిలుపునిచ్చినది
A) సైమన్
B) జనరల్ నాలుద్దీ
C) థామస్ మూర్
D) మాంటెస్క్యూ
జవాబు:
B) జనరల్ నాలుద్దీ

AP 9th Class Social Bits Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

11. ఫ్రెంచి విప్లవంలో ఫ్యూడల్ శక్తులను, రాజులను తరిమేసినట్లే కార్మికులు సంఘటితమై పెట్టుబడిదారులు లేకుండా చేయాలన్నది
A) ఫ్రెడ్రిక్ ఎంగెల్స్
B) కారల్ మార్క్స్
C) నెబుద్దీ
D) ఓవెన్
జవాబు:
B) కారల్ మార్క్స్

12. రష్యా కమ్యూనిస్టు విప్లవం
A) 1915
B) 1916
C) 1917
D) 1918
జవాబు:
C) 1917

13. భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించినది
A) 1920
B) 1925
C) 1930
D) 1935
జవాబు:
A) 1920

14. జనాభాలో అన్ని వర్గాలకు ఓటు హక్కు విస్తరింప చేయాలన్న ఉద్యమం విస్తరించినది
A) 1800-1810
B) 1810-1820
C) 1820-1830
D) 1830-1870
జవాబు:
D) 1830-1870

15. వయోజనులైన మహిళలందరికీ ఓటు హక్కు లభించినది
A) 1928
B) 1929
C) 1930
D) 1931
జవాబు:
A) 1928

16. స్త్రీ వాదంలో మొదటి కెరటం ఓటుహక్కు రెండవ కెరటం …….
A) విద్య, వైద్యం
B) పారిశ్రామికీకరణ
C) పెట్టుబడి
D) మార్కెట్ల అన్వేషణ
జవాబు:
A) విద్య, వైద్యం

17. ఏ సమాజమైనా వర్ధిల్లాలంటే వనరులు ………… నియంత్రణలో ఉండాలి.
A) ఉత్పత్తి
B) సామాజిక
C) పరిశ్రమలు
D) ప్రభుత్వ
జవాబు:
B) సామాజిక

18. …… సం|| నుంచి నేత కార్మికులు చట్టం ద్వారా కనీస వేతనాలను కోరసాగారు.
A) 1700
B) 1650
C) 1790
D) 1750
జవాబు:
C) 1790

19. ….. లో భాగస్వాములైన అందరికీ దానిపై వాటాగా హక్కు ఉంటుంది.
A) పరిశ్రమలు
B) వనరులు
C) పంపిణి
D) ఉత్పత్తి
జవాబు:
D) ఉత్పత్తి

20. “రాజులు, పెట్టుబడిదారులు లేని కార్మికుల ఐక్యత” గురించి చెప్పినది
A) కారల్ మార్క్స్
B) ఎంగెల్స్
C) మార్క్స్ ఫిలిప్
D) సైమన్
జవాబు:
A) కారల్ మార్క్స్

AP 9th Class Social Bits Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

21. ఆస్తుల నియంత్రణ సమాజం చేతిలో ఉండాలి అని చెప్పినది …..
A) సైమన్
B) ఓవెన్
C) అరిస్టాటిల్
D) సోక్రటీస్
జవాబు:
A) సైమన్

22. యంత్రాల వల్ల ఉపాధి కోల్పోయిన వారికి ఉద్యోగ కల్పన చేయాలి అన్నది …..
A) ఎంగెల్స్
B) బాటిఫ్
C) ఓవెన్
D) జనరల్ నెలు
జవాబు:
D) జనరల్ నెలు

23. ఫ్రెంచి విప్లవం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సాధించలేకపోయింది
A) బాబెఫ్
B) లూథర్ కింగ్
C) అరిస్టాటిల్
D) ఫిషర్
జవాబు:
A) బాబెఫ్

24. 1790 లలో …… పార్లమెంటరీ శాసనసభల వంటి ప్రజాస్వామిక సంస్థలను ఏర్పాటు చేసింది.
A) రష్యా
B) ఫ్రెంచి
C) జర్మనీ
D) ఇంగ్లాండ్
జవాబు:
B) ఫ్రెంచి

25. కర్మాగారాలు, వనరులన్నిటిని కార్మికులు చేజిక్కించుకొని శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేయుట వీరి లక్ష్యం
A) లూథర్
B) ఫిషర్
C) బాబెఫ్
D) మార్క్స్, ఎంగెల్స్
జవాబు:
D) మార్క్స్, ఎంగెల్స్

26. ‘ఫ్రెంచి విప్లవకారులు’ మానవహక్కుల ప్రకటన ….. సం||లో చేశారు.
A) 1791
B) 1780
C) 1750
D) 1789
జవాబు:
A) 1791

27. మహిళలపై పురుషుల ఆధిపత్యం అంతరించాలని, ఆధిపత్యం చెలాయించే సాధనాలుగా మహిళలు మారాలని చెప్పి నది
A) నెబుద్ది
B) వర్జీనియా ఉల్ఫ్
C) జెస్సీ సీఫెన్
D) ఎంగెల్స్
జవాబు:
B) వర్జీనియా ఉల్ఫ్

AP 9th Class Social Bits Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

28. ‘విలువైన సమానత్వం అన్న సిద్ధాంతాన్ని’ సాధించాలంటే వ్యక్తిగత ఆస్తిని రద్దుచేసి వాటి ఫలాలు ప్రజలకు ఇవ్వాలి అన్నది
A) రాబిన్సన్
B) ఉల్ఫ్
C) బాబెఫ్
D) ఎంగెల్స్
జవాబు:
C) బాబెఫ్

29. సామ్యవాదం మద్దతుదారులు ఈ క్రింది వారిలో ఒకరు
A) ఫక్రుద్దీన్ ఆలి
B) BJ కృపలాని
C) చరణ్ సింగ్
D) M.N. రాయ్
జవాబు:
D) M.N. రాయ్

30. ఫ్రెంచి విప్లవాలతో ఏకీభవించి గణతంత్ర, పార్లమెంటరీ ఏర్పాటు ముఖ్యమన్న వారు
A) ప్లాటో
B) సోక్రటీస్
C) రూసో
D) అరిస్టాటిల్
జవాబు:
A) ప్లాటో

31. ఉత్పత్తి సాధనాలు, ప్రకృతి వనరులు ప్రజల ఆధీనంలో ఉండాలనే సిద్ధాంతం
A) పార్లమెంటరీ
B) సామ్యవాదం
C) ఆర్థికమండలి
D) ప్రణాళికలు
జవాబు:
B) సామ్యవాదం

32. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై, లాభాపేక్ష గల విధానం
A) ఆర్థిక సరళీకరణ
B) మిశ్రమార్థిక వ్యవస్థ
C) పెట్టుబడిదారీ
D) సామ్యవాదం
జవాబు:
C) పెట్టుబడిదారీ

33. కర్మాగారాల్లో, ఉత్పత్తి చేసే కార్మికులకు ఎలాంటి ఆస్తిలేదు కాని ఉత్పత్తి జరగడానికి వాళ్ళు కీలకం అని చెప్పినది
A) J.M. కీన్స్
B) అరిస్టాటిల్
C) ఎంగెల్స్
D) కార్ల్ మార్క్స్
జవాబు:
D) కార్ల్ మార్క్స్

34. తమ జీవనోపాధి కోల్పోవటానికి కారణంగా భావించిన మరమగ్గాలపై నేత కార్మికులు దాడి చేసిన ప్రాంతం
A) లాంక్ షైర్
B) వేల్స్
C) స్కాట్లాండ్
D) ఫిలాండ్
జవాబు:
A) లాంక్ షైర్

35. 1770లో వందలాది చిన్నరైతుల భూములను శక్తిమంతులైన భూస్వాముల పెద్ద కమతాలతో కలిపే ప్రక్రియను …… అంటారు.
A) పరిశ్రమలు
B) కంచెవేయటం
C) పెట్టుబడి
D) సామ్యవాదం
జవాబు:
B) కంచెవేయటం

36. ఈ పద్ధతిలో వస్తు ఉత్పత్తి సాధనాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి.
A) సామ్యవాద
B) పెట్టుబడి
C) మిశ్రమ ఆర్థిక
D) నియంతృత్వ
జవాబు:
A) సామ్యవాద

37. ఉమ్మడి ప్రయోజనాలను బట్టి సామాజిక తేడాలుండ వచ్చు అనేది
A) సామ్యవాదం
B) మహిళల హక్కుల ప్రకటన
C) నియంతృత్వ
D) పార్లమెంటరీ
జవాబు:
B) మహిళల హక్కుల ప్రకటన

AP 9th Class Social Bits Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

38. “మొక్కజొన్న చట్టాలు” అనగా బ్రిటన్లో ….
A) చవకగా దొరికే ఆహారాన్ని దిగుమతి చేసుకోవటం
B) మొక్కజొన్న దిగుమతి
C) ఇతర దేశాలకు మొక్కజొన్న ఎగుమతి
D) ఏదీకాదు
జవాబు:
A) చవకగా దొరికే ఆహారాన్ని దిగుమతి చేసుకోవటం

39. ఉత్పత్తి అన్నది ఒక కుటుంబం అని చెప్పినది ……
A) ఫ్రెడరిక్ ఎంగెల్స్
B) కార్ల్ మార్క్స్
C) లూథర్
D) సైమన్
జవాబు:
B) కార్ల్ మార్క్స్

40. …… విప్లవం భారతదేశ జాతీయతావాదులకు స్పూర్తి నిచ్చింది.
A) రక్తరహిత
B) అమెరికా
C) రష్యా
D) ఫ్రెంచి
జవాబు:
C) రష్యా

41. భారతదేశంలో దురాచారాలను దూరం చేయటానికి …… ఒక ఆయుధమని మహిళలు గుర్తించారు.
A) విద్య
B) పోరాటం
C) తిరుగుబాటు
D) దోపిడి
జవాబు:
A) విద్య

42. ఆనాటి సామ్యవాద మద్దతుదారులలో భారత ప్రధాని
A) మొరార్జీదేశాయ్
B) నెహ్రూ
C) ఇందిరా
D) చరణ్ సింగ్
జవాబు:
B) నెహ్రూ

43. బ్రిటన్లో పారిశ్రామికీకరణ సమయంలో దినమునకు …… గంటలు పనిచేసేవారు.
A) 10-12
B) 9-12
C) 15-18
D) 8-12
జవాబు:
C) 15-18

44. రష్యా విప్లవ ప్రేరణతో భారతదేశంలో …………….. జాతీయోద్యమంలో పాలుపంచుకున్నారు.
A) ప్రభుత్వం
B) రాజకీయ నాయకులు
C) యువకులు
D) మహిళలు
జవాబు:
D) మహిళలు

45. ఫ్రాన్స్ తో ఇంగ్లాండ్ సుదీర్ఘయుద్ధం వల్ల …… ల మధ్య వాణిజ్యానికి ఆటంకం కల్గింది.
A) ఇంగ్లాండ్, యూరప్
B) వలసదేశాలు
C) పెట్టుబడి
D) ఫ్రాన్స్, రష్యా
జవాబు:
A) ఇంగ్లాండ్, యూరప్

46. క్రింది వాటిని జతపరచండి. ..
1) 1917 A) భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన
2) 1920 B) ఇంగ్లాండ్ మహిళలకు ఓటుహక్కు
3) 1918 C) రష్యాలో బోల్షివిక్ విప్లవం
A) 1 – A, 2 – B, 3 – C
B) 1 – C, 2 – A, 3 – B
C) 1 – C, 2 – B, 3 – A
D) 1 – B, 2 – A, 3 – C
జవాబు:
B) 1 – C, 2 – A, 3 – B

47. “కర్మాగారాలలో ఉత్పత్తిచేసే కార్మికులకు ఎటువంటి ఆస్తి లేదు కానీ ఉత్పత్తిలో వారే కీలకం” అని వ్యాఖ్యానించినవారు
A) బెఫ్
B) థామస్ మూర్
C) ఎంగెల్స్, మార్క్స్
D) సెయింట్ సైమన్
జవాబు:
C) ఎంగెల్స్, మార్క్స్

AP 9th Class Social Bits Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

48. ఇంగ్లండ్ లో మొక్కజొన్న చట్టాలకు మద్దతు ఇచ్చినవారు
A) పార్లమెంట్ సభ్యులు – ఉత్పత్తిదారులు
B) సైనికులు
C) పేద ప్రజలు
D) రాజకుటుంబీకులు
జవాబు:
A) పార్లమెంట్ సభ్యులు – ఉత్పత్తిదారులు

49. M.N. రాయ్ కు ఈ క్రింది అంశంతో సంబంధం కలదు
A) డోక్లాం సరిహద్దు వివాదం
B) చంద్రయాన్
C) స్వచ్ఛ భారత్
D) భారత కమ్యూనిస్ట్ పార్టీ
జవాబు:
D) భారత కమ్యూనిస్ట్ పార్టీ

50. కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ ల అభిప్రాయంలో పెట్టుబడిదారీ విధానం :
A. చరిత్రలో ప్రగతిశీల అంశము
B. పెట్టుబడిదారులను, కార్మికులను మానవత్వం నుంచి దూరం చేసే దోపిడీ విధానము
A) A కాదు B కూడా కాదు
B) A మాత్రమే
C) Bమాత్రమే
D) A మరియు B
జవాబు:
D) A మరియు B

51. ఈ క్రింది వారిలో సామ్యవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి
AP 9th Class Social Bits Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు 1
జవాబు:
A

52. బ్రిటన్లో చేయబడిన ‘మొక్కజొన్న చట్టాలు’ వీరి ప్రయోజనాలకు ఎక్కువ వ్యతిరేకము :
A) శ్రామిక ప్రజలు
B) భూస్వాములు
C) ఉత్పత్తిదారులు
D) వృత్తి నిపుణులు
జవాబు:
A) శ్రామిక ప్రజలు

53. “సోషల్ కాంట్రాక్ట్” పుస్తకం రాసినది
A) ఫ్రెడ్రిక్ ఎంగెల్స్
B) రూసో
C) ఎరాస్మస్
D) థామస్ మూర్
జవాబు:
B) రూసో

54. క్రింది ఏ డిమాండు లుద్దిజంకు సంబంధించినది కాదు?
A) యంత్రాలను పగలగొట్టే హక్కు
B) కనీస వేతనం
C) మహిళల, పిల్లల పనిభారం తగ్గించడం
D) కార్మిక సంఘాలుగా ఏర్పడే హక్కు
జవాబు:
A) యంత్రాలను పగలగొట్టే హక్కు

55. నీ అభిప్రాయంలో ప్రజలు స్వేచ్చగా వారి అభిప్రాయాలు వెల్లడించగల ప్రభుత్వం :
A) ప్రజాస్వామ్యం
B) నియంతృత్వం
C) రాచరికం
D) భూస్వామ్యం
జవాబు:
A) ప్రజాస్వామ్యం

AP 9th Class Social Bits Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

56. పారిశ్రామిక విప్లవ కాలంలోని బాల కార్మికుల పరిస్థితి మీకు తెలుసు. అయితే మన సమాజంలో ఇంకా బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతూనే ఉన్నది. దీనిపై నీవెలా ప్రతిస్పందిస్తావు?
A) అసలు బాలకార్మిక వ్యవస్థ అనేదే ఉండకూడదు. దానిని పూర్తిగా నిర్మూలించాలి.
B) బాల కార్మికులకు వైద్య సదుపాయాలు కల్పించాలి.
C) బాల కార్మికుల వేతనాలు పెంచాలి.
D) బాల కార్మికులకు జీవిత బీమా సౌకర్యం కల్పించాలి.
జవాబు:
A) అసలు బాలకార్మిక వ్యవస్థ అనేదే ఉండకూడదు. దానిని పూర్తిగా నిర్మూలించాలి.

57. పురాతన – మధ్యయుగ యూరప్ రైతాంగంలో అధిక భాగం “కట్టుబానిసలు”గా ఉండేవారు : బానిసత్వంపై నీ వ్యాఖ్యానాన్ని గుర్తించుము.
A) పరిశ్రమలలో, గనులలో, తోటలలో పనిచేయడానికి బానిసలు అవసరం.
B) బానిసలు లేకుంటే ఉత్పత్తి ఆగిపోయి ఉండేది కనుక అది మంచిదే.
C) బానిసత్వం సహజ మానవ హక్కులకు వ్యతిరేకం.
D) బలహీనులను బానిసలను చేసుకోవడం ఒక దశలో న్యాయమే.
జవాబు:
C) బానిసత్వం సహజ మానవ హక్కులకు వ్యతిరేకం.

58. “విలువైన సమానత్వం” అన్న సిద్ధాంతాన్ని సాధించాలంటే వ్యక్తిగత ఆస్తిని రద్దు చేసి భూమి, దాని ఫలాలు ఉమ్మడిగా అనుభవించాలని వాదించినవారు
A) ప్లాటో
B) అరిస్టాటిల్
C) బాథెఫ్
D) భగత్ సింగ్
జవాబు:
C) బాథెఫ్

59. సహకార గ్రామాలను నిర్మించాలని పిలుపునిచ్చినవారు ఎవరు?
A) ఓవెన్
B) స్టీఫెన్
C) రాబిన్సన్
D) ఎవరూ కాదు
జవాబు:
A) ఓవెన్

AP 9th Class Social Bits Chapter 16 సామాజిక నిరసనోద్యమాలు

60. యంత్రాలపై దాడి చేయడాన్ని ఒక నిరసన మార్గంగా ఎంచుకొన్న ఉద్యమం
A) లుద్దిజం
B) సామ్యవాదం
C) పెట్టుబడిదారీ విధానం
D) వలసవాదం
జవాబు:
A) లుద్దిజం

II. జతపరచుము:
i)

గ్రూపు – ఎ గ్రూపు -బి
1. ఫ్రెంచి పార్లమెంటరీ శాసనసభల ప్రజాస్వామిక సంస్థల ఏర్పాటు A) 1795
2. రొట్టె లేదా ఆహార అల్లర్లలో అత్యంత గడ్డు సంవత్సరం B) 1770
3. కంచె ద్వారా చిన్న రైతుల భూమి ఆక్రమణ C) 1917
4. భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపన D) 1790
5. రష్యా కమ్యూనిస్టు విప్లవం E) 1920

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు -బి
1. ఫ్రెంచి పార్లమెంటరీ శాసనసభల ప్రజాస్వామిక సంస్థల ఏర్పాటు D) 1790
2. రొట్టె లేదా ఆహార అల్లర్లలో అత్యంత గడ్డు సంవత్సరం A) 1795
3. కంచె ద్వారా చిన్న రైతుల భూమి ఆక్రమణ B) 1770
4. భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపన E) 1920
5. రష్యా కమ్యూనిస్టు విప్లవం C) 1917

ii)

గ్రూపు – ఎ గ్రూపు -బి
1. రాజులు, పెట్టుబడిదారులులేని కార్మికుల ఐక్యత A) బాబెఫ్
2. ‘ ఆస్తుల నియంత్రణ సమాజం చేతిలో ఉండాలన్నది B) కారల్ మార్క్స్
3. యంత్రాల వల్ల ఉపాధి కోల్పోయిన వారికి ఉద్యోగకల్పన C) ఓవెన్
4. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఫ్రెంచి విప్లవం సాధించలేకపోయిందన్నది D) సేంట్ సైమన్
5. సహకార గ్రామాలు నిర్మించాలన్నది E) జనరల్ నె లుద్దీ

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు -బి
1. రాజులు, పెట్టుబడిదారులులేని కార్మికుల ఐక్యత B) కారల్ మార్క్స్
2. ‘ ఆస్తుల నియంత్రణ సమాజం చేతిలో ఉండాలన్నది D) సేంట్ సైమన్
3. యంత్రాల వల్ల ఉపాధి కోల్పోయిన వారికి ఉద్యోగకల్పన E) జనరల్ నె లుద్దీ
4. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఫ్రెంచి విప్లవం సాధించలేకపోయిందన్నది A) బాబెఫ్
5. సహకార గ్రామాలు నిర్మించాలన్నది C) ఓవెన్