Practice the AP 9th Class Social Bits with Answers 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 9th Class Social Bits 11th Lesson ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు
I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు:
కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో రాయండి.
1. ప్రభుత్వం వీటి నిర్వహణలో చురుకైన పాత్ర పోషించవలసి ఉంది.
A) నీటి సరఫరా
B) పారిశుద్ధ్యం
C) విద్యుత్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
2. ప్రభుత్వ సదుపాయాలుగా మనకు తెలిసినవి
A) ఆరోగ్య సేవలు
B) ప్రజారవాణా
C) పాఠశాలలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
3. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం
A) జీవనోపాధి లభింపజేయడం
B) ప్రజా పంపిణీ వ్యవస్థను కల్పించడం
C) చౌకధరల దుకాణాల నిర్వహణ
D) ఆహారధాన్యాల పంపిణీ
జవాబు:
A) జీవనోపాధి లభింపజేయడం
4. ప్రభుత్వం వీటి విషయంలో ప్రధానంగా సబ్సిడీలను ప్రకటిస్తుంది.
A) ఎరువులు
B) ఆహార ధాన్యాలు
C) డీజిల్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
5. ప్రభుత్వం యొక్క ఆయా విధుల నిర్వహణకై కావల్సిన డబ్బును ప్రజల నుండి వీటి రూపంలో సేకరిస్తుంది.
A) పన్నులు
B) ఆదాయం
C) ప్రజా పంపిణీ
D) సంక్షేమ పథకాలు
జవాబు:
A) పన్నులు
6. కేంద్ర ఆర్థిక బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టునది.
A) కేంద్ర వ్యవసాయమంత్రి
B) ఆర్థికమంత్రి
C) హోంమంత్రి
D) ప్రధానమంత్రి
జవాబు:
B) ఆర్థికమంత్రి
7. బడ్జెట్ లోని ఖర్చులన్నింటిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నా వీరిని కూడా సంప్రదించుట జరుగుతుంది.
A) పారిశ్రామిక వర్గాలు
B) రైతు సమూహాలు
C) పౌర సమాజ కార్యకర్తలు
D) పై వారందరూ
జవాబు:
D) పై వారందరూ
8. ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరు
A) పన్నులు
B) పథకాలు
C) సేవాపన్ను
D) పైవన్నీ
జవాబు:
A) పన్నులు
9. పరోక్ష పన్నులకు ఉదా :
A) దిగుమతి సుంకం
B) ఎక్సెజ్ సుంకం
C) సంక్షేమం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
10. ప్రత్యక్ష పన్నుకు ఉదా :
A) ఆదాయపు పన్ను
B) కార్పొరేట్ పన్ను
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ
11. కర్మాగారం చెల్లించే పన్ను
A) ఎక్సెజ్ సుంకం
B) కస్టమ్స్ పన్ను
C) కార్పొరేట్ పన్ను
D) ఏదీకాదు
జవాబు:
A) ఎక్సెజ్ సుంకం
12. ఇతర దేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకున్నప్పుడు చెల్లించేది
A) ఎక్సెజ్ సుంకం
B) కస్టమ్స్ పన్ను
C) దిగుమతి సుంకం
D) కార్పొరేట్ పన్ను
జవాబు:
C) దిగుమతి సుంకం
13. ఉత్పత్తిదారులు చేకూర్చిన విలువకు మాత్రమే పన్ను చెల్లించేది
A) విలువ ఆధారిత పన్ను
B) వినోదపు పన్ను
C) ఇంటి పన్ను
D) ఆదాయపు పన్ను
జవాబు:
A) విలువ ఆధారిత పన్ను
14. వ్యక్తుల ఆదాయాలపై లేక కంపెనీలు, వ్యాపారాల్లో ఆర్జించే లాభాలపై నేరుగా విధించబడే పన్నులు
A) ప్రత్యక్ష పన్నులు
B) పరోక్ష పన్నులు
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
A) ప్రత్యక్ష పన్నులు
15. వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆదాయంపై విధించబడే పన్ను
A) ఆదాయపు పన్ను
B) కార్పొరేట్ పన్ను
C) కస్టమ్స్ పన్ను
D) ఏదీకాదు
జవాబు:
A) ఆదాయపు పన్ను
16. మన దేశంలో ఎక్కువమంది ప్రజలు ఆధారపడి ఉన్న రంగం
A) పారిశ్రామిక
B) వ్యవసాయిక
C) సేవా
D) పైవన్నీ
జవాబు:
B) వ్యవసాయిక
17. 1997 సం||లో ఎన్ని లక్షల మందిని ఆదాయపు పన్నులోకి లెక్కించడం జరిగింది?
A) 115 లక్షలు
B) 116 లక్షలు
C) 114 లక్షలు
D) 120 లక్షలు
జవాబు:
C) 114 లక్షలు
18. ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా దాచిపెట్టే ధనం
A) తెల్లధనం
B) నల్లధనం
C) పసుపు ధనం
D) ఎరుపు ధనం
జవాబు:
B) నల్లధనం
19. ఈ రకమైన పన్నులు ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి.
A) పరోక్ష పన్నులు
B) ప్రత్యక్ష పన్నులు
C) కార్పొరేట్ పన్నులు
D) సేవా పన్నులు
జవాబు:
A) పరోక్ష పన్నులు
20. ప్రభుత్వం వసూలు చేసిన పన్నులే …… అవుతుంది.
A) బడ్జెట్
B) రెవిన్యూ
C) సబ్సిడీ
D) ప్రణాళిక
జవాబు:
B) రెవిన్యూ
21. రాబోవు ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం , వ్యయాలను తెలియజేసే నివేదికను ఇలా పిలుస్తారు.
A) ప్రణాళిక
B) పన్ను
C) బడ్జెట్
D) ఏదీకాదు
జవాబు:
C) బడ్జెట్
22. వస్తువులు, సేవలుపై ప్రభుత్వం విధించే పన్నును ఇలా పిలుస్తారు.
A) సుంకం
B) ప్రత్యక్ష
C) బడ్జెట్ పన్ను
D) పరోక్ష
జవాబు:
D) పరోక్ష
23. పన్ను నుండి మినహాయించిన రంగం
A) వ్యవసాయపు
B) సేవల
C) రవాణా
D) పారిశ్రామిక
జవాబు:
A) వ్యవసాయపు
24. ఈ నగరంలో వంట గ్యాస్ కు వ్యాట్ లేదు
A) ముంబై
B) ఢిల్లీ
C) చెన్నై
D) హైదరాబాద్
జవాబు:
B) ఢిల్లీ
25. ప్రభుత్వం ఉత్పత్తి సంస్థల ఆదాయంపై విధించే పన్నును ఈ విధంగా పిలుస్తారు.
A) ఉత్పత్తి పన్ను
B) వినియోగ పన్ను
C) కార్పొరేట్
D) కొనుగోలు పన్ను
జవాబు:
C) కార్పొరేట్
26. విదేశాల నుండి వస్తువులు తీసుకురావడంపై విధించేపన్ను
A) ఎక్సెజ్
B) సేల్స్ టాక్స్
C) ఇన్ కంటాక్స్
D) కస్టమ్స్
జవాబు:
A) ఎక్సెజ్
27. వ్యాపార, వాణిజ్య సంస్థల వార్షిక లాభాలపై విధించే
A) కార్పొరేట్
B) ఎక్సైజ్
C) సేల్స్ టాక్స్
D) పైవన్నీ
జవాబు:
A) కార్పొరేట్
28. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నెల
A) మార్చి
B) ఏప్రిల్
C) జూన్
D) జనవరి
జవాబు:
B) ఏప్రిల్
29. బడ్జెట్ అంశాలపై ప్రభుత్వాన్ని ….. ద్వారా నియంత్రించవచ్చు.
A) పన్నులు
B) ధరలు
C) చట్టసభలు
D) వస్తువులు
జవాబు:
C) చట్టసభలు
30. రైలులో A/C టిక్కెట్టు మీద ప్రయాణం చేసేటపుడు టిక్కెట్టు మీద వేసే పన్ను
A) పన్నులు
B) ప్రయాణం
C) ధరలు
D) సేవా
జవాబు:
D) సేవా
31. ప్రభుత్వం కొన్ని నిత్యావసర వస్తువులు, ప్రధాన వస్తువులు అందరికి అందుబాటులో ఉండేలా ధరలు తగ్గించును, ఆ వస్తువుల వ్యయాన్ని ప్రభుత్వం ఇంత భరిస్తుంది. దీనిని ఇలా పిలుస్తారు.
A) సబ్సిడి
B) పన్నులు
C) సేవాపన్ను
D) పైవన్నీ
జవాబు:
A) సబ్సిడి
32. భారత ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేది పరోక్ష పన్నులు, …… శాతం సమకూరుస్తున్నాయి.
A) 80%
B) 64%
C) 70%
D) 36%
జవాబు:
B) 64%
33. రోడ్డు, రైలు, మార్గాల నిర్మాణం ప్రభుత్వ రవాణా వ్యవస్థను ….. నిర్వహిస్తుంది.
A) పన్నులు
B) టాటా కంపెని
C) ప్రభుత్వం
D) ప్రైవేటుసంస్థ
జవాబు:
C) ప్రభుత్వం
34. ప్రజా సదుపాయం యొక్క ముఖ్య లక్షణం ప్రజలందరూ …… పొందడం.
A) పన్నులు
B) నష్టం
C) లాభం
D) ప్రయోజనం
జవాబు:
D) ప్రయోజనం
35. ప్రజా సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండే ధరకు లభించేలా చూడాల్సిన బాధ్యత …..
A) ప్రభుత్వానిది
B) ప్రజలది
C) ఇన్ కం టాక్స్ అధికారులది
D) పన్నులు
జవాబు:
A) ప్రభుత్వానిది
36. ప్రభుత్వం యొక్క విధుల నిర్వహణకై కావాల్సిన డబ్బును ప్రజల నుండి …. రూపంలో సేకరిస్తుంది.
A) ధరల
B) పన్నుల
C) ఆదాయం
D) సర్వీస్ టాక్స్
జవాబు:
B) పన్నుల
37. ప్రభుత్వం రసాయన ఎరువులను ఫ్యాక్టరీల ధరల కన్నా తక్కువ ధరలకు లభించే విధంగా …. తోడ్పడుతుంది.
A) సంపన్నులకు
B) పన్నులు కట్టేవారికి
C) రైతులకు
D) ప్రజలకు
జవాబు:
C) రైతులకు
38. ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో ఆహారధాన్యాల పంపిణీ
A) పన్నులు చెల్లించే వారిది
B) పెట్టుబడిదారులది
C) ప్రజలది
D) ప్రభుత్వానిది
జవాబు:
D) ప్రభుత్వానిది
39. రాజ్యాంగం ప్రకారం బడ్జెట్ సంబంధిత నిర్ణయాలలో ….. పాత్ర ముఖ్య మైనది.
A) ప్రజా ప్రతినిధుల
B) ప్రజల
C) ప్రభుత్వాల
D) నల్లకుబేరుల
జవాబు:
A) ప్రజా ప్రతినిధుల
40. …… పన్ను విధానంలో ఉత్పత్తిదారు చెల్లించే పన్ను తక్కువగా ఉంటుంది.
A) కార్పొ రేట్
B) విలువ ఆధారిత
C) సేల్స్ టాక్స్
D) ఎక్సెజ్
జవాబు:
B) విలువ ఆధారిత
41. వ్యవసాయ ఆదాయాల మిద పన్ను లేకపోవటం వల్ల చాలామంది తమ ఆదాయాన్ని ….. నుండి వస్తున్న ఆదాయంగా చూపుతారు.
A) భూమి
B) వ్యాపారం
C) ధరలు
D) వస్తువులు
జవాబు:
A) భూమి
42. ఫ్యాక్టరీలలో తయారుచేసే లేదా ఉత్పత్తి చేసే వస్తువులపై …. సుంకం విధించబడుతుంది.
A) ఎక్సెజ్
B) కస్టమ్స్
C) సేల్స్ టాక్స్
D) ఇన్ కంటాక్స్
జవాబు:
A) ఎక్సెజ్
43. వస్తువులపై విధించే ఎక్సెజ్ పన్ను, అమ్మకం పన్నులను క్రమంగా ….. ఆధారంగానే నిర్ణయిస్తారు.
A) పన్నుల
B) ధరల
C) విలువ
D) వస్తువు
జవాబు:
C) విలువ
44. కేంద్ర ఆర్థికమంత్రి పార్లమెంట్ లో ప్రవేశపెట్టే …… రాబోవు ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై చేయబోయే. ఖర్చును తెలుపుతుంది.
A) ధరలు
B) ఆదాయం
C) పన్నులు
D) బడ్జెట్
జవాబు:
D) బడ్జెట్
45. వ్యక్తి ఆదాయంపై విధిస్తే అది ఈ రకపు పన్ను
A) ప్రత్యక్ష
B) పరోక్ష
C) ఇన్‌కంటాక్స్
D) పైవన్నీ
జవాబు:
A) ప్రత్యక్ష
46. ధనవంతులైనా, పేదవారైనా వస్తువులను కొన్నప్పుడు …… చెల్లించాలి.
A) వేరు వేరు పన్నులు
B) సమానమైన పన్ను
C) సేల్స్ టాక్స్
D) పైవన్నీ
జవాబు:
B) సమానమైన పన్ను
47. వస్తువుల ధరలకు ….. పన్నులు కలుస్తూ ఉంటాయి.
A) ఎక్సెజ్
B) సేల్స్ టాక్స్
C) అన్నిరకాల
D) అమ్మకం
జవాబు:
C) అన్నిరకాల
48. ఆదాయపు పన్ను, కార్పొరేటు పన్నులు ఈ రకపు పన్నులు
A) ప్రత్యక్ష పన్నులు
B) పరోక్ష
C) సేల్స్ టాక్స్
D) పైవన్నీ
జవాబు:
A) ప్రత్యక్ష పన్నులు
49. భారతదేశానికి ఈ రకపు పన్నుల శాతం తక్కువగా బాధ్య త
ఉంటుంది
A) పరోక్ష
B) ప్రత్యక్ష
C) వస్తువులు
D) సేవలు
జవాబు:
B) ప్రత్యక్ష
50. భారతదేశానికి ప్రత్యక్ష పన్నుల శాతం
A) 36%
B) 64%
C) 26%
D) 50%
జవాబు:
A) 36%
51. ఎక్సైజ్ సుంకం ……… పై విధిస్తారు.
A) పంపిణీదారుల
B) టోకు వ్యాపారస్తుల
C) చిల్లర వర్తకుని
D) ఉత్పత్తిదారుని
జవాబు:
D) ఉత్పత్తిదారుని
52. కింది వాటిలో పరోక్ష పన్ను
A) సంపద పన్ను
B) బహుమతి పన్ను
C) ఆదాయ పన్ను
D) వస్తువులు మరియు సేవల పన్ను
జవాబు:
D) వస్తువులు మరియు సేవల పన్ను
53. బడ్జెట్ :
A) చేయబోయే వ్యయం
B) వచ్చే ఆదాయం
C) చేయబోయే వ్యయం మరియే వచ్చే ఆదాయం
D) వినియోగం
జవాబు:
C) చేయబోయే వ్యయం మరియే వచ్చే ఆదాయం
54. కేంద్ర బడ్జెట్ – 2017 – 18 ను లోకసభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు?
A) ఫిబ్రవరి 28, 2017
B) మార్చి 1, 2017
C) ఫిబ్రవరి 15, 2017
D) ఫిబ్రవరి 1, 2017
జవాబు:
D) ఫిబ్రవరి 1, 2017
II. జతపరచుట:
i)
గ్రూపు -ఎ | గ్రూపు – బి |
1. ప్రభుత్వ సదుపాయాలు | A) దిగుమతి సుంకం |
2. సబ్సిడీలు | B) ఎక్సెజ్ సుంకం |
3. ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరు | C) పన్నులు |
4. పరోక్ష పన్ను | D) ఆరోగ్య సేవలు, పరిశుభ్రత |
5. దిగుమతి చేసుకున్న వస్తువులు | E) ఎరువులు, ఆహార ధాన్యాలు |
జవాబు:
గ్రూపు -ఎ | గ్రూపు – బి |
1. ప్రభుత్వ సదుపాయాలు | D) ఆరోగ్య సేవలు, పరిశుభ్రత |
2. సబ్సిడీలు | E) ఎరువులు, ఆహార ధాన్యాలు |
3. ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరు | C) పన్నులు |
4. పరోక్ష పన్ను | B) ఎక్సెజ్ సుంకం |
5. దిగుమతి చేసుకున్న వస్తువులు | A) దిగుమతి సుంకం |
ii)
గ్రూపు – ఎ | గ్రూపు -బి |
1. విలువ ఆధారిత పన్ను | A) ఆదాయపు పన్ను |
2. వ్యక్తిగత ఆదాయం | B) వ్యాట్ |
3. ప్రత్యక్ష పన్ను | C) లెక్కలలోనికి చూపించని ధనం |
4. పన్ను మినహాయింపు | D) నేరుగా విధించే పన్నులు |
5. నల్లధనం | E) వ్యవసాయం |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు -బి |
1. విలువ ఆధారిత పన్ను | B) వ్యాట్ |
2. వ్యక్తిగత ఆదాయం | A) ఆదాయపు పన్ను |
3. ప్రత్యక్ష పన్ను | D) నేరుగా విధించే పన్నులు |
4. పన్ను మినహాయింపు | E) వ్యవసాయం |
5. నల్లధనం | C) లెక్కలలోనికి చూపించని ధనం |