Practice the AP 9th Class Physical Science Bits with Answers 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 9th Class Physical Science Bits 6th Lesson రసాయన చర్యలు – సమీకరణాలు
సరియైన సమాధానమును గుర్తించండి.
1. C6H12O6 → C2H5OH + CO2 అనే చర్య
A) సంయోగం
B) వియోగం
C) స్థానభ్రంశం
D) ద్వంద్వ వియోగం
జవాబు:
B) వియోగం
2. BaCl2 + Na2SO4 → BaSO4 + 2NaCI అనే సమీకరణం ఈ రకం చర్యను సూచిస్తుంది.
A) స్థానభ్రంశం
B) వియోగం
C) సంయోగం
D) ద్వంద్వ వియోగం
జవాబు:
D) ద్వంద్వ వియోగం
3. నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగంలో విడుదలయ్యే ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువుల ఘనపరిమాణాల నిష్పత్తి …..
A) 1 : 2
B) 2 : 1
C) 1 : 1
D) 3 : 1
జవాబు:
A) 1 : 2
4. కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ముంచిన ఇనుపమేకు గోధుమ రంగులోకి మారి నీలిరంగు కాపర్ సల్ఫేట్ ద్రావణం రంగు కోల్పోవును. ఇది ఎటువంటి రసాయన చర్య?
A) రసాయన సంయోగం
B) రసాయన వియోగం
C) రసాయన ద్వంద్వ వియోగం
D) రసాయన స్థానభ్రంశం
జవాబు:
D) రసాయన స్థానభ్రంశం
5. x KClO3 → yKCl + zO2 సమీకరణంలో x, y, z విలువలు వరుసగా
A) 1, 2, 3
B) 3, 3, 2
C) 2, 2, 3
D) 2, 2, 2
జవాబు:
C) 2, 2, 3
6. పొడి సున్నానికి నీటిని కలిపి తడి సున్నం తయారుచేయటం ఈ రకమైన చర్య.
A) రసాయన వియోగం
B) ఉష్ణమోచక చర్య
C) ఉష్ణగ్రాహక చర్య
D) రసాయన స్థానభ్రంశం
జవాబు:
B) ఉష్ణమోచక చర్య
7. టపాసులు పేలడం అనునది. ఈ రకమైన చర్య
A) క్షయకరణం
B) భంజనము
C) ఆక్సీకరణం
D) గాల్వనైజేషన్
జవాబు:
C) ఆక్సీకరణం
8. ఒక ప్రయోగంలో విడుదల అయిన ఒక వాయువు మండుచున్న పుల్లను ఇంకా ప్రకాశవంతంగా మండించిన ఆ వాయువు ……….
A) ఆక్సిజన్
B) నైట్రోజన్
C) హైడ్రోజన్
D) కార్బన్ డై ఆక్సైడ్
జవాబు:
A) ఆక్సిజన్
9. Zn + 2 HCl → ZnCl2 + H2 అనే రసాయన చర్య కింది వాటిలో దేనికి ఉదాహరణ? ఏది?
A) రసాయన సంయోగం
B) రసాయన వియోగం
C) రసాయన స్థానభ్రంశం
D) రసాయన ద్వంద్వ వియోగం
జవాబు:
C) రసాయన స్థానభ్రంశం
10. పొడి సున్నాన్ని నీటికి కలిపితే జరిగే చర్య ఒక …………
A) స్థానభ్రంశ చర్య
B) వాయువు విడుదల చేయు చర్య
C) ఉష్ణం విడుదల చేయు చర్య
D) దహన చర్య
జవాబు:
C) ఉష్ణం విడుదల చేయు చర్య
11. 4 మోల్‌ల హైడ్రోజన్ వాయువుతో చర్యలో పాల్గొని 4 మోల్‌ల నీటిని ఏర్పరచడానికి కావలసిన ఆక్సిజన్ వాయువు మోల్‌ల సంఖ్య
A) 1 మోల్
B) 2 మోల్లు
C) 3 మోలు
D) 4 మోలు
జవాబు:
B) 2 మోల్లు
12.
A) రసాయన సంయోగ చర్యలు
B) రసాయన వియోగ చర్యలు
C) రసాయన స్థానభ్రంశ చర్యలు
D) గ్వంద్వ వియోగ చర్యలు
జవాబు:
B) రసాయన వియోగ చర్యలు
13. క్రింది వాటిలో సరియైన తుల్య సమీకరణము
A) NaOH + Zn → NaZnO2 + H2
B) 2NaOH + Zn → Na2ZnO2 + H2
C) 2NaOH + 2Zn → 2NaZnO2 + H2
D) NaOH + 2Zn → NaZn2O2 + H2
జవాబు:
B) 2NaOH + Zn → Na2ZnO2 + H2
14. సిల్వర్ బ్రోమైడ్ రంగు……
A) ఎరుపు
B) నీలం
C) ఆకుపచ్చ
D) లేత పసుపు
జవాబు:
D) లేత పసుపు
15. ఆక్సీకరణం అనగా ………
A) ఆక్సిజన్ కలపటం
B) హైడ్రోజన్ తొలగించటం
C) ఎలక్ట్రానులను పోగొట్టుకొనుట
D) ఉష్ణవహన చర్య
జవాబు:
D) ఉష్ణవహన చర్య
16. క్షయకరణం అనగా ……
A) ఆక్సిజన్ కోల్పోవటం
B) హైడ్రోజన్ కలపటం
C) ఎలక్ట్రానులను గ్రహించుట
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
17. రసాయన వియోగానికి ఈ క్రింది వాటిలో అవసరమైనది
A) కాంతి
B) ఉష్ణం
C) విద్యుత్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
18. ఈ క్రింది వానిలో ఆక్సీకరణానికి ఉదాహరణ
A) ఇనుము తుప్పుపట్టుట
B) శ్వాసక్రియ
C) ర్యాన్సిడిటీ
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
19. ఈ క్రింది వాటిలో ఆక్సీకరణ చర్యకు ఉదాహరణ
A) కోసిన ఆపిల్ ముక్కలు రంగు మారటం
B) టపాసులు పేలటం
C) బంగాళదుంపల ముక్కలు రంగు మారటం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
20. రాన్సిడిటీని అరికట్టడానికి ఈ క్రింది వానిలో ఏది కలపాలి?
A) విటమిన్ సి
B) విటమిన్ ఇ
C) యాంటీ ఆక్సిడెంట్లు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
21. ఈ క్రింది వానిలో రసాయన మార్పు
A) బల్బు వెలగటం
B) ఇనుప ముక్క అయస్కాంతాన్ని ఆకర్షించటం
C) ఆహారం జీర్ణం అవటం
D) లోహాలు వ్యాకోచించటం
జవాబు:
D) లోహాలు వ్యాకోచించటం
22. ఈ క్రింది వానిలో భౌతిక మార్పు
A) పండ్లు పండటం
B) అగ్గిపుల్ల మండటం
C) సిమెంట్ గట్టి పడటం
D) నీరు ఆవిరిగా మారటం
జవాబు:
D) నీరు ఆవిరిగా మారటం
23. చర్యాశీలతలో భేదాల వలన జరుగు రసాయన చర్యలు
A) రసాయన సంయోగం
B) రసాయన వియోగం
C) స్థానభ్రంశం
D) ద్వంద్వ వియోగం
జవాబు:
C) స్థానభ్రంశం
24. శక్తిని బయటకు విడుదల చేసే చర్య …..
A) ఉష్ణమోచక
B) ఉష్ణగ్రాహక
C) ఉష్ణవినిమయ
D) ఉష్ణవహన
జవాబు:
A) ఉష్ణమోచక
25. శక్తిని గ్రహించే చర్య
A) ఉష్ణ మోచక
B) ఉష్ణగ్రాహక
C) ఉష్ణవినిమయ చర్య
D) పెవన్నీ
జవాబు:
B) ఉష్ణగ్రాహక
26. ఈ క్రింది వానిలో ఉష్ణగ్రాహక చర్యకు ఉదాహరణ
A) C + O2 → CO2 + Q
B) C + O2 → CO2 – Q
C) C + O2 + Q → CO2
D) పైవన్నీ
జవాబు:
A) C + O2 → CO2 + Q
27. ఈ క్రింది వానిలో ఉష్ణమోచక చర్యకు ఉదాహరణ
A) C + O2 → CO2 + Q
B) C + O2 → CO2 – Q
C) C + O2 + Q → CO2
D) B మరియు C
జవాబు:
D) B మరియు C
28. కూరగాయలు కంపోస్టుగా వియోగం చెందడం ……………. కు ఉదాహరణ.
A) ఆక్సీకరణము
B) క్షయకరణము
C) ముక్కిపోవడం
D) క్షయము చెందుట
జవాబు:
A) ఆక్సీకరణము
29. ఒక రసాయన చర్యలో ఉష్ణం గ్రహించబడి క్రొత్త పదార్థం ఏర్పడటాన్ని ……………… అంటారు.
A) ఉష్ణరసాయన చర్య
B) ఉష్ణమోచక చర్య
C) ఉష్ణగ్రాహక చర్య
D) కాంతిరసాయన చర్య
జవాబు:
C) ఉష్ణగ్రాహక చర్య
30. 2N2O → 2N2 + O ……………….. చర్యకు ఉదాహరణ.
A) రసాయన సంయోగ
B) రసాయన వియోగం
C) రసాయన స్థానభ్రంశ
D) రసాయన ద్వంద్వవియోగ
జవాబు:
D) రసాయన ద్వంద్వవియోగ
31. Ca + 2H2O → Ca(OH)2 + H2 ↑ అనేది ……………… చర్యకు ఉదాహరణ.
A) రసాయన సంయోగం
B) రసాయన వియోగం
C) రసాయన స్థానభ్రంశం
D) రసాయన ద్వంద్వ వియోగం
జవాబు:
C) రసాయన స్థానభ్రంశం
32. రసాయన సమీకరణంలో బాణం గుర్తుకు ఎడమవైపు ఉన్న పదార్థాలను ………….. అంటారు.
A) క్రియాజనకాలు
B) క్రియాజన్యాలు
C) అవక్షేపాలు
D) వాయువులు
జవాబు:
A) క్రియాజనకాలు
33. ఆపిల్, బంగాళదుంపలలో ఉండే ఎంజైమ్ …….
A) టయలిన్
B) పాలిఫినాల్ ఆక్సిడేజ్
C) టైరోసినేజ్
D) B మరియు C
జవాబు:
D) B మరియు C
34. వెండి, రాగి వస్తువులు మెరుపును కోల్పోవటాన్ని …………….. అంటారు.
A) ముక్కిపోవడం
B) తుప్పుపట్టడం
C) కుళ్ళిపోవడం
D) క్షయము చెందడం
జవాబు:
D) క్షయము చెందడం
35. ఇనుప వస్తువులపై జింక్ పూత వేయడాన్ని ………… అంటారు.
A) రాన్సిడేషన్
B) ఆక్సిడేషన్
C) రిడక్షన్
D) గాల్వనీకరణము
జవాబు:
D) గాల్వనీకరణము
36. తుప్పును నిరోధించే సామర్థ్యం గల లోహము …….
A) ఇనుము
B) బంగారం
C) ఉక్కు
D) రాగి
జవాబు:
B) బంగారం
37. ఆహారం పాడవకుండా నిల్వ ఉండుటకు ………….. విటమిన్లు కలపాలి.
A) విటమిన్ A & C
B) A & B విటమిన్
C) విటమిన్ C & E
D) విటమిన్ D & E
జవాబు:
C) విటమిన్ C & E
38. చిప్స్ తయారీదారులు, ఎక్కువకాలం నిల్వ ఉండడానికి ప్యాకెట్ లోపల …………. వాయువును నింపుతారు.
A) ఆక్సిజన్
B) నైట్రోజన్
C) హైడ్రోజన్
D) క్లోరిన్
జవాబు:
B) నైట్రోజన్
39. ముక్కిపోవటం ఒక ………… చర్య.
A) ఉష్ణమోచక
B) ఉష్ణగ్రాహక
C) ఆక్సీకరణ
D) క్షయకరణ
జవాబు:
C) ఆక్సీకరణ
40. Na → Na+ +e–. ఈ చర్యలో సోడియం ……………. చెందింది.ణ.
A) ఆక్సీకరణం
B) క్షయకరణం
C) రసాయన మార్పు
D) భౌతిక మార్పు
జవాబు:
A) ఆక్సీకరణం
41. Cl + e– → Cl– ఈ చర్యలో క్లోరిన్ ……. చెందింది.
A) ఆక్సీకరణం
B) క్షయకరణం
C) రసాయన మార్పు
D) భౌతిక మార్పు
జవాబు:
B) క్షయకరణం
42. NaOH + HCl → NaCl + H2O. ఇది …………… చర్యకు ఉదాహరణ.
A) రసాయన సంయోగం
B) రసాయన స్థానభ్రంశం
C) రసాయన వియోగం
D) రసాయన ద్వంద్వ వియోగం
జవాబు:
D) రసాయన ద్వంద్వ వియోగం
43. Fe+ CuSO4 → FeSO4 + Cu లో ఎక్కువ చర్యా శీలత గల లోహం ……………..
A) Fe
B) Cu
C) S
D) O2
జవాబు:
A) Fe
44. ఆక్సీకరణం, క్షయకరణం ఒకేసారి జరిగే చర్యలను…………….. అంటారు.
A) ఆక్సీకరణ చర్య
B) క్షయకరణ చర్య
C) రెడాక్స్ చర్య
D) రసాయన వియోగం
జవాబు:
C) రెడాక్స్ చర్య
45. CuO + H2 → Cu + H2O. ఈ చర్యలో Cu0 …………….. చెందింది.
A) ఆక్సీకరణం
B) క్షయకరణం
C) మార్పు
D) క్షయము
జవాబు:
B) క్షయకరణం
46. అవక్షేపాలు ఏర్పడే చర్యలను …………….. చర్యలు అంటారు.
A) సంయోగ
B) వియోగ
C) స్థానభ్రంశ
D) ద్వంద్వ వియోగ
జవాబు:
D) ద్వంద్వ వియోగ
47. అధిక చర్యాశీలత గల లోహాలు, అల్ప చర్యాశీలత గల లోహాలను ……………… చెందిస్తాయి.
A) స్థానభ్రంశం
B) వియోగం
C) సంయోగం
D) ద్వంద్వ వియోగం
జవాబు:
A) స్థానభ్రంశం
48. విద్యుత్ విశ్లేషణలో ఏర్పడిన హైడ్రోజన్, ఆక్సిజన్ నిష్పత్తి …………
A) 1:2
B) 2:1
C) 3:2
D) 2:3
జవాబు:
B) 2:1
49. లెడ్ అయోడైడ్ అవక్షేపం రంగు ………
A) ఎరుపు
B) తెలుపు
C) పసుపు
D) జేగురు
జవాబు:
C) పసుపు
50. క్షయము చెందుట అనునది ……………. చర్య.
A) ఆక్సీకరణం
B) క్షయకరణం
C) రెడాక్స్
D) ఏదీకాదు
జవాబు:
A) ఆక్సీకరణం
51. Fe2O3 + 2Al → Al2O3 + 2 Fe ఈ చర్య దేనికి ఉదాహరణ?
A) రసాయన సంయోగం
B) రసాయన వియోగచర్య
C) రసాయన స్థానభ్రంశం
D) రసాయన ద్వంద్వవియోగం
జవాబు:
C) రసాయన స్థానభ్రంశం
52. లేత పసుపుపచ్చరంగులో ఉండే ఒక పదార్థమును సూర్య కాంతిలో ఉంచితే అది బూడిద రంగులోనికి మారుతుంది. అయితే తీసుకోబడిన పదార్థం ఏమిటి?
A) లెడ్ అయోడైడ్
B) పొటాషియం అయోడైడ్
C) సిల్వర్ బ్రోమైడ్
D) హైడ్రోజన్ క్లోరైడ్
జవాబు:
C) సిల్వర్ బ్రోమైడ్
53. రసాయనిక చర్యలో అవక్షేపమును సూచించుటకు ఉపయోగించు బాణపు గుర్తు
A) →
B) ↑
C) ↓
D) ←
జవాబు:
C) ↓
54. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది …………. ద్రావణం.
A) ఆమ్ల
B) క్షార
C) తటస్థ
D) ద్వంద్వ స్వభావ
జవాబు:
B) క్షార
55. జింక్ సల్ఫేట్ ద్రావణం గల పరీక్షనాళికలో శుభ్రమైన ఇనుపముక్కలు ఉంచినప్పుడు ఏమి జరుగుతుందనగా ………………….
A) ద్రావణం రంగును కోల్పోయి, ఇనుపముక్కలపై జింక పూత ఏర్పడుతుంది.
B) గ్రావణం ఆకుపచ్చ రంగులోకి మారి, ఇనుప ముక్కలపై జింకప్పత ఏర్పడును.
C) ద్రావణాన్ని, ఆకుపచ్చ రంగులోకి మార్చుతూ, ఇనుపముక్కలు ద్రావణంలో కరుగుతాయి.
D) ఎటువంటి చర్య జరుగదు.
జవాబు:
D) ఎటువంటి చర్య జరుగదు.
56. ఒక విద్యారి పరీక్షనాళికలో (Pb(NO3)2) లెడ్ నైట్రోజన్ వేసి వేడిచేసినాక అందులోనుండి విడుదల అయిన వాయువులు
A) NO2 O2
B) NO2, H2
C) NO2, N2
D) NO2, CO2
జవాబు:
A) NO2 O2
57. CaCO3 ని వేడి చేయగా ఏర్పడిన పదార్థాలు
A) CaO, CO2
B) CaCO3, H2O
C) CaO, H2O
D) Ca, CO3
జవాబు:
A) CaO, CO2
58. సోడియంను నీటిలో వేసినప్పుడు అందులో ‘టప్’ మని మండి శబ్దం చేయును. దీనికి కారణం
A) నైట్రోజన్ వాయువు విడుదల
B) ఉష్ణం విడుదల అయినందువల్ల
C) H2 వాయువు విడుదల అయి మండటంవల్ల
D) ఆక్సిజన్ విడుదల అవడం వల్ల
జవాబు:
C) H2 వాయువు విడుదల అయి మండటంవల్ల
59. రాగి వస్తువులపై ఆకుపచ్చని పూతకు కారణమైన పదార్థం
A) CuO
B) CuCl2
C) Cus
D) CuSO4
జవాబు:
A) CuO
60. రంగుగల వస్తువులను విరంజనం (రంగును కోల్నో యేలా చేయడం) చేయగల పదార్థం
A) తేమగల ఆక్సిజన్ వాయువు
B) తేమ గల క్లోరిన్ వాయువు
C) తేమగల నైట్రోజన్ వాయువు
D) తేమగల కార్బన్ డై ఆక్సైడ్ వాయువు
జవాబు:
B) తేమ గల క్లోరిన్ వాయువు
61. 1 గ్రామ్ మోలార్ ద్రవ్యరాశి గల ఏదైనా వాయువులోని అణువుల సంఖ్య
A) 6.02 × 1023
B) 6.02 × 1022
C) 3.01 × 1022
D) 3.01 × 1011
జవాబు:
A) 6.02 × 1023
62. లోహాలు, ఆమ్లాలతో చర్య జరిపినపుడు వెలువడు వాయువు
A) H2
B) O2
C) N2
D) CO2
జవాబు:
A) H2
63. జింక్, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినపుడు విడుదలయ్యే వాయువు దగ్గరకు మండుచున్న అగ్గిపుల్లని తెచ్చినపుడు టప్ అనే శబ్దంతో అగ్గిపుల్ల ఆరిపోతుంది. వెలువడిన వాయువు ఏమి?
A) ఆక్సిజన్
B) హైడ్రోజన్
C) కార్బన్ డై ఆక్సైడ్
D) క్లోరిన్
జవాబు:
B) హైడ్రోజన్
64. ఒక రసాయన చర్య జరిగినపుడు విడుదలయ్యే వాయువు దగ్గరకు మండుచున్న అగ్గిపుల్లను తెచ్చినపుడు అగ్గిపుల్ల ప్రకాశవంతంగా మండుచున్నది. వెలువడిన వాయువు ఏది?
A) హైడ్రోజన్
B) కార్బన్ డై ఆక్సైడ్
C) ఆక్సిజన్
D) నైట్రోజన్
జవాబు:
C) ఆక్సిజన్
65. ఒక రసాయన చర్య జరిగినపుడు విడుదలయ్యే వాయువు దగ్గరకు మండుచున్న అగ్గిపుల్లను తెచ్చినపుడు అగ్గిపుల్ల ఆరిపోతుంది. అయితే వెలువడిన వాయువు ఏది?
A) కార్బన్ డై ఆక్సైడ్
B) హైడ్రోజన్
C) ఆక్సిజన్
D) నైట్రోజన్
జవాబు:
A) కార్బన్ డై ఆక్సైడ్
66. క్రింది రసాయన సమీకరణాలను పరిశీలించుము
పైన ఇచ్చిన జతలకు క్రింది వానిలో సరియైన దానిని ఎంపిక చేయుము.
A) a, b, c, d
B) a, c, d, b
C) b, c, d, a
D) b, d, c, a
జవాబు:
C) b, c, d, a
II. జతపరచుము.
i)
గ్రూప్ – ఎ | గ్రూప్ – బి |
1. ఆపిల్ | A) మిటమిన్ సి, ఇ |
2. చిప్స్ ప్యాకెట్లు | B) ర్యాన్సిడిటీ |
3. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు | C) క్రోజన్ |
4. మెరుపు కోల్పోవటం | D) నైట్రోజన్ వాయువు |
5. రుచి, వాసన మారిపోవటం | E) టైరోసినేజ్ |
జవాబు:
గ్రూప్ – ఎ | గ్రూప్ – బి |
1. ఆపిల్ | E) టైరోసినేజ్ |
2. చిప్స్ ప్యాకెట్లు | D) నైట్రోజన్ వాయువు |
3. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు | A) మిటమిన్ సి, ఇ |
4. మెరుపు కోల్పోవటం | C) క్రోజన్ |
5. రుచి, వాసన మారిపోవటం | B) ర్యాన్సిడిటీ |
ii)
గ్రూప్ – ఎ | గ్రూప్ – బి |
1. శక్తి గ్రహించటం | A) క్షయకరణం |
2. శక్తి విడుదల | B) ఆక్సీకరణం |
3. హైడ్రోజన్ కలుపుట | C) ఉష్ణగ్రాహక చర్య |
4. ఆక్సిజన్ కలుపుట | D) అవక్షేపం |
5. నీటిలో కరగని పదార్థాలు | E) ఉష్ణమోచక చర్య |
జవాబు:
గ్రూప్ – ఎ | గ్రూప్ – బి |
1. శక్తి గ్రహించటం | C) ఉష్ణగ్రాహక చర్య |
2. శక్తి విడుదల | E) ఉష్ణమోచక చర్య |
3. హైడ్రోజన్ కలుపుట | A) క్షయకరణం |
4. ఆక్సిజన్ కలుపుట | B) ఆక్సీకరణం |
5. నీటిలో కరగని పదార్థాలు | D) అవక్షేపం |