Practice the AP 9th Class Maths Bits with Answers 3rd Lesson జ్యామితీయ మూలాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Maths Bits 3rd Lesson జ్యామితీయ మూలాలు

కింది వానిలో సరియైన సమాధానాన్ని ఎన్నుకొనుము.

ప్రశ్న 1.
క్రింది వానిలో అనిర్వచిత పదం
(A) బిందువు సంచలన
(B) లంబకేంద్రం
(C) త్రిభుజం
(D) వృత్తము
జవాబు:
(A) బిందువు సంచలన

AP 9th Class Maths Bits 3rd Lesson జ్యామితీయ మూలాలు

ప్రశ్న 2.
రేఖా గణితము దీనినుండి ప్రతిపాదించబడినది.
(A) గ్రీకు
(B) లాటిన్
(C) బ్రిటిష్
(D) సంస్కృతం
జవాబు:
(A) గ్రీకు

ప్రశ్న 3.
పైథాగరస్ త్రికమును ఉపయోగించిన గణిత శాస్త్రవేత్త
(A) బౌద్దాయన
(B) భాస్కరాచార్య
(C) రామానుజన్
(D) ఆర్యభట్ట
జవాబు:
(A) బౌద్దాయన

ప్రశ్న 4.
‘ది ఎలిమెంట్స్’ రచయిత ఎవరు ?
(A) పైథాగరస్
(B) థేల్స్
(C) యూక్లిడ్
(D) ప్లాటో
జవాబు:
(C) యూక్లిడ్

ప్రశ్న 5.
స్వయం నిర్దేశితాలు గల ప్రవచనాలు
(A) సిద్ధాంతాలు
(B) పరికల్పనలు
(C) స్వీకృతాలు
(D) భావనలు
జవాబు:
(C) స్వీకృతాలు

ప్రశ్న 6.
సత్యంగానీ, అసత్యంగానీ నిరూపించబడని ప్రవచనాలు
(A) స్వీకృతాలు
(B) భావనలు
(C) పరికల్పనలు
(D) సిద్ధాంతము
జవాబు:
(C) పరికల్పనలు

ప్రశ్న 7.
4 లేక అంతకన్నా పెద్దదైన ప్రతి సరిసంఖ్యను కూడా రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా వ్రాయవచ్చును అనునది ఒక
(A) స్వీకృతం
(B) పరికల్పన
(C) భావన
(D) సిద్ధాంతము
జవాబు:
(B) పరికల్పన

AP 9th Class Maths Bits 3rd Lesson జ్యామితీయ మూలాలు

ప్రశ్న 8.
సమాన రాశులను సమాన రాశులకు కూడినచో వచ్చు మొత్తాలు సమానము.
(A) పరికల్పన
(B) సిద్ధాంతము
(C) ప్రవచనం
(D) స్వీకృతం
జవాబు:
(D) స్వీకృతం

ప్రశ్న 9.
దీర్ఘచతురస్రపు కొలతల సంఖ్య
(A) 3
(B) 2
(C) 4
(D) 1
జవాబు:
(B) 2

ప్రశ్న 10.
ఘనము యొక్క కొలతల సంఖ్య
(A) 2
(B) 1
(C) 1
(D) 3
జవాబు:
(D) 3

క్రింది ఖాళీలను పూరింపుము.

ప్రశ్న 1.
ఒక తలంకు ఒకే ఒక ………………….. మరియు ……….. ఉండును.
జవాబు:
పొడవు, వెడల్పు

AP 9th Class Maths Bits 3rd Lesson జ్యామితీయ మూలాలు

ప్రశ్న 2.
రేఖ అంటే వెడల్పు లేని ………………….
జవాబు:
పొడవు

ప్రశ్న 3.
అన్ని లంబకోణాలు ………………
జవాబు:
సమానము

ప్రశ్న 4.
యూక్లిడ్ ఎలిమెంట్స్ లో ………. పుస్తకాలు ఉన్నాయి.
జవాబు:
13

ప్రశ్న 5.
వైదిక సంస్కృతంలో గల …………………….. నందు యజ్ఞ వాటికలు మరియు హోమగుండాలు నిర్మించుటలో జ్యామితీయ సూత్రాలు పొందుపరచబడినవి.
జవాబు:
శుల్బ సూత్ర

ప్రశ్న 6.
బౌద్దాయన శుల్బ సూత్రాలను సంకలనం చేసిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ……………
జవాబు:
బౌద్ధాయనుడు

AP 9th Class Maths Bits 3rd Lesson జ్యామితీయ మూలాలు

ప్రశ్న 7.
యూక్లిడ్ భావనలో బిందువు, రేఖ, తలము అనునవి …………. పదాలు.
జవాబు:
నిర్వచిత

ప్రశ్న 8.
బిందువుకు …………………. లేవు.
జవాబు:
కొలతలు

ప్రశ్న 9.
ఒక వస్తువు దాని ………………….. కంటే పెద్దది.
జవాబు:
భాగము

ప్రశ్న 10.
ఒక బిందువు నుండి గీయదగిన రేఖలు ……..
జవాబు:
అనేకము

AP 9th Class Maths Bits 3rd Lesson జ్యామితీయ మూలాలు

జతపర్చుము.

(i)

గ్రూపు – A గ్రూపు – B
1. ఒక బిందువు నుండి ఏ బిందువుకైనను రేఖను గీయగలము. (A) బౌద్దాయన

 

2. 4 లేక అంతకన్నా పెద్దదైన ప్రతి సరిసంఖ్యను కూడా రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా వ్రాయవచ్చు. (B) స్వీకృతము

 

3. త్రిభుజ అంతర కోణాల మొత్తం 180°. (C) పరికల్పనము
4. “ది ఎలిమెంట్స్” (D) సిద్ధాంతము
5. శుల్బ సూత్రాలు (E) యూక్లిడ్

జవాబు:

గ్రూపు – A గ్రూపు – B
1. ఒక బిందువు నుండి ఏ బిందువుకైనను రేఖను గీయగలము. (B) స్వీకృతము

 

2. 4 లేక అంతకన్నా పెద్దదైన ప్రతి సరిసంఖ్యను కూడా రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా వ్రాయవచ్చు. (C) పరికల్పనము
3. త్రిభుజ అంతర కోణాల మొత్తం 180°. (D) సిద్ధాంతము
4. “ది ఎలిమెంట్స్” (E) యూక్లిడ్
5. శుల్బ సూత్రాలు (A) బౌద్దాయన