Practice the AP 9th Class Maths Bits with Answers 14th Lesson సంభావ్యత on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Maths Bits 14th Lesson సంభావ్యత

కింది వానిలో సరియైన సమాధానాన్ని ఎన్నుకొనుము.

ప్రశ్న 1.
ఒక నాణేన్ని ఎగుర వేసినపుడు “బొమ్మ” పడు సంభావ్యత ( )
(A) అల్ప సంభవం
(B) సమ సంభవం
(C) అధిక సంభవం
(D) ఏదీకాదు
జవాబు.
(B) సమ సంభవం

AP 9th Class Maths Bits 14th Lesson సంభావ్యత

ప్రశ్న 2.
ఒక పాచికను దొర్లించినపుడు ‘6’ కంటే ఎక్కువ విలువ గల సంఖ్యను పొందు సంభావ్యత ( )
(A) అల్ప సంభవం.
(B) సమ సంభవం
(C) అధిక సంభవం
(D) అసాధ్యము
జవాబు.
(D) అసాధ్యము

ప్రశ్న 3.
ఒక పాచికను దొర్లించినపుడు ఏర్పడు పర్యవసానాల సంఖ్య
(A) 1
(B) 4
(C) 6
(D) 4
జవాబు.
(C) 6

ప్రశ్న 4.
రెండు పాచికలను దొర్లించినపుడు ఏర్పడు పర్యవసానాల సంఖ్య
(A) 12
(B) 6
(C) 1
(D) 36
జవాబు.
(D) 36

ప్రశ్న 5.
ఒక నాణేన్ని ఎగురవేసిన, వచ్చు పర్యవసానాల సంఖ్య
(A) 1
(B) 2
(C) 3
(D) 4
జవాబు.
(B) 2

ప్రశ్న 6.
ఒక యాదృశ్చిక ప్రయోగంలో ఏర్పడే ఘటనలు ఖచ్చితమైనవిగాని, కచ్చితము కానివి ఏర్పడిన దానిని ……… అంటారు.
(A) గణిత ప్రయోగం
(B) యత్నం
(C) సరిసంఖ్య
(D) పర్యవసానం
జవాబు.
(B) యత్నం

AP 9th Class Maths Bits 14th Lesson సంభావ్యత

ప్రశ్న 7.
ఒక యాదృశ్చిక ప్రయోగం యొక్క పర్యవసానంను ……… అంటారు.
(A) ఘటన
(B) యత్నం
(C) అవకాశం
(D) ఏదీకాదు
జవాబు.
(A) ఘటన

ప్రశ్న 8.
ఒక నాణేన్ని ఎగురవేసిన బొమ్మ పదు సంభావ్యత
(A) 1
(B) \(\frac{1}{4}\)
(C) \(\frac{1}{2}\)
(D) \(\frac{1}{8}\)
జవాబు.
(C) \(\frac{1}{2}\)

ప్రశ్న 9.
రెండు నాణెములను ఎగురవేసిన రెండు బొమ్మలు పదు సంభావ్యత
(A) \(\frac{1}{2}\)
(B) \(\frac{1}{4}\)
(C) \(\frac{1}{6}\)
(D) \(\frac{1}{8}\)
జవాబు.
(B) \(\frac{1}{4}\)

ప్రశ్న 10.
మూడు నాణెములను ఎగురవేసిన రెండు బొమ్మలు కచ్చితంగా పడు సంభావ్యత
(A) \(\frac{1}{8}\)
(B) 8
(C) \(\frac{7}{8}\)
(D) \(\frac{3}{8}\)
జవాబు.
(C) \(\frac{7}{8}\)

AP 9th Class Maths Bits 14th Lesson సంభావ్యత

ప్రశ్న 11.
రెండు నాణెములను ఎగురవేసిన, బొమ్మ పడకుండుటకు సంభావ్యత .
(A) \(\frac{1}{8}\)
(B) \(\frac{1}{4}\)
(C) \(\frac{1}{2}\)
(D) ఏదీకాదు
జవాబు.
(B) \(\frac{1}{4}\)

ప్రశ్న 12.
ఒక నాణెమును ఎగురవేసిన ఒక బొమ్మ మరియు ఒక బొరుసు పడు సంభావ్యతల మొత్తము
(A) \(\frac{1}{2}\)
(B) \(\frac{3}{4}\)
(C) 1
(D) 0
జవాబు.
(C) 1

ప్రశ్న 13.
ఒక పాచికను దొర్లించినపుడు ఒక సరిసంఖ్య మరియు ఒక బేసిసంఖ్య ఏర్పడు సంభావ్యతల మొత్తము
(A) \(\frac{1}{2}\)
(B) \(\frac{1}{6}\)
(C) \(\frac{1}{3}\)
(D) 1
జవాబు.
(D) 1

ప్రశ్న 14.
ఒక యాదృశ్చిక ప్రయోగంలో ఏర్పడు సంభావ్యతల మొత్తము
(A) 0
(B) – 1
(C) 1
(D) \(\frac{1}{2}\)
జవాబు.
(C) 1

ప్రశ్న 15.
ఒక యాదృశ్చిక ప్రయోగంలో ఒక ఘటన ఏర్పడు సంభావ్యత
(A) 0
(B) 1
(C) – 1
(D) చెప్పలేము
జవాబు.
(B) 1

ప్రశ్న 16.
ఒక ప్రయోగంలో ఒక ఘటన ఏర్పడని సంభావ్యత
(A) 0
(B) – 1
(C) 1
(D) 2
జవాబు.
(A) 0

AP 9th Class Maths Bits 14th Lesson సంభావ్యత

ప్రశ్న 17.
ఒక ఘటన యొక్క సంభాష్యత విలువ ఎల్లప్పుడూ ……… ల మధ్య ఉందును.
(A) 1 మరియు 2
(B) – 1 మరియు 1
(C) -1 మరియు 0
(D) 0 మరియు 1
జవాబు.
(D) 0 మరియు 1

ప్రశ్న 18.
ఒక పేకల కట్ట నుండి తీయు పేకలపై 1 నుండి 10 వరకు గల సంఖ్యలు ఏర్పడు సంభావ్యత ( )
(A) \(\frac{2}{10}\)
(B) \(\frac{1}{10}\)
(C) \(\frac{5}{10}\)
(D) \(\frac{2}{5}\)
జవాబు.
(D) \(\frac{2}{5}\)

ప్రశ్న 19.
“ఒక నెలలో చివరిరోజు ఆదివారం” ఏర్పడు సంభావ్యత
(A) \(\frac{2}{7}\)
(B) \(\frac{1}{7}\)
(C) \(\frac{3}{7}\)
(D) \(\frac{4}{7}\)
జవాబు.
(B) \(\frac{1}{7}\)

ప్రశ్న 20.
ఒక పాచికను దొర్లించిన ఏర్పడు సమ ఘటనలు
(A) సరి సంఖ్యలు మరియు బేసి సంఖ్యలు
(B) ప్రధాన, సంయుక్త సంఖ్యలు
(C) ‘3’ inక్క గుణిజులు, ‘2’ యొక్క గుణిజాలు
(D) ‘3’ కంటే తక్కువ సంఖ్యలు, ‘B’ కంటే ఎక్కువ సంఖ్యలు
జవాబు.
(A) సరి సంఖ్యలు మరియు బేసి సంఖ్యలు

AP 9th Class Maths Bits 14th Lesson సంభావ్యత

II. క్రింది ఖాళీలను పూరింపుము.

ప్రశ్న 1.
ఒక యాదృశ్చిక ప్రయోగం యొక్క ప్రతి పర్యవసానంను ………….. అంటారు.
జవాబు.
ఘటన

ప్రశ్న 2.
ఒక నాణెంను ఎగురవేసినపుడు బొమ్మ పడని సంభావ్యత ……………
జవాబు.
\(\frac{1}{2}\)

ప్రశ్న 3.
ఒక నాణెంను ఎగుర వేసినపుడు బొమ్మ పడు సంభావ్యత ………………..
జవాబు.
\(\frac{1}{2}\)

ప్రశ్న 4.
ఒక నాణెంను ఎగురవేసినపుడు బొరుసు పడని సంభావ్యత …………….
జవాబు.
\(\frac{1}{2}\)

ప్రశ్న 5.
ఒక నాణెంను ఎగురవేసినపుడు బొరుసు పడు సంభావ్యత ……………..
జవాబు.
\(\frac{1}{2}\)

ప్రశ్న 6.
ఒక పాచికకు ………….. ముఖాలుండును.
జవాబు.
6

ప్రశ్న 7.
ఒక నాణెంను 200 సార్లు ఎగురవేసిన, బొరుసు 65 సార్లు ఏర్పడిన, బొరుసు పడు సంభావ్యత ……………..
జవాబు.
\(\frac{13}{20}\)

ప్రశ్న 8.
పై ప్రయోగంలో బొమ్మ పడు సంభావ్యత ………………
జవాబు.
\(\frac{9}{20}\)

ప్రశ్న 9.
‘ఎరుపు, నీలం, ఆకుపచ్చలు గల ఒక స్పిన్నర్‌ను ఒకసారి తిప్పినపుడు సూచిక నీలం రంగుపై ఆగు , సంభావ్యత ………………
జవాబు.
\(\frac{1}{3}\)

ప్రశ్న 10.
‘SMILE’ నుండి ‘M’ ను పొందు సంభావ్యత ………..
జవాబు.
\(\frac{1}{5}\)

AP 9th Class Maths Bits 14th Lesson సంభావ్యత

ప్రశ్న 11.
‘ROSE’ నుండి అచ్చును పొందు సంభావ్యత ………..
జవాబు.
\(\frac{1}{2}\)

ప్రశ్న 12.
1 నుండి 100 వరకు గల సంఖ్యలలో కచ్చిత వర్గమును ఎన్నుకొను సంభావ్యత …………..
జవాబు.
\(\frac{1}{10}\)

ప్రశ్న 13.
మూడు నాణెములను ఒకదాని తర్వాత ఒకటి ఎగుర వేసినప్పుడు రెండు బొమ్మలను పొందు సంభావ్యత
జవాబు.
\(\frac{3}{8}\)

ప్రశ్న 14.
ఒక ఘటనను పొందు సంభావ్యతకు సూత్రము ……..
జవాబు.
AP 9th Class Maths Bits 14th Lesson సంభావ్యత Bits 1

ప్రశ్న 15.
ఒక సంచిలో 3 ఎరుపు బంతులు మరియు 8 నీలం బంతులున్నవి. ఆ సంచి నుండి ఎరుపు బంతిని తీయు సంభావ్యత ………………
జవాబు.
\(\frac{3}{11}\)

ప్రశ్న 16.
పై ప్రయోగంలో ఆకుపచ్చ బంతిని పొందు సంభావ్యత ……………..
జవాబు.
0

ప్రశ్న 17.
ఒక పాచికను దొర్లించినపుడు ఏర్పడు అనుకూల సంభావ్యతలు ……………..
జవాబు.
1, 2, 3, 4, 5, 6

ప్రశ్న 18.
ఒక పాచికను దొర్లించినపుడు వచ్చు ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్యల సంభావ్యతల మొత్తము ……………..
జవాబు.
\(\frac{5}{6}\)

ప్రశ్న 19.
మూడు నాణేలు ఎగురవేసినపుడు, కనీసం ఒక బొమ్మ పడు సంభావ్యత ………………
జవాబు.
\(\frac{7}{8}\)

AP 9th Class Maths Bits 14th Lesson సంభావ్యత

ప్రశ్న 20.
ఒక పాచికను దొర్లించినపుడు ‘2’ కంటే ఎక్కువ సంఖ్యను పొందు సంభావ్యత ……………..
జవాబు.
\(\frac{2}{3}\)

జతపర్చుము:

(i)

గ్రూపు A.  గ్రూపు B
1. ఒక నాణెమును ఎగురవేసినపుడు బొమ్మ లేక బొరుసు ఏర్పడు సంభావ్యత (A) తక్కువ సంభవం
2. ఒక పాచికను దొర్లించినపుడు 3 గుణిజములు . ఏర్పడు సంభావ్యత (B) అధిక సంభవం
3. 5 ఆకుపచ్చ మరియు 6 నల్లని బంతులు గల సంచి నుండి ఒక నల్ల బంతిని తీయు సంభావ్యత (C) కొంత సంభవం
4. ‘సహజ సంఖ్యల నుండి ‘0’ ను ఎన్నుకొను సంభావ్యత (D) సమ సంభవం
5. పూర్ణసంఖ్యల సమితి నుండి అకరణీయ సంఖ్యను ఎన్నుకొను సంభావ్యత (E) అసంభవం

జవాబు.

గ్రూపు A.  గ్రూపు B
1. ఒక నాణెమును ఎగురవేసినపుడు బొమ్మ లేక బొరుసు ఏర్పడు సంభావ్యత (D) సమ సంభవం
2. ఒక పాచికను దొర్లించినపుడు 3 గుణిజములు . ఏర్పడు సంభావ్యత (A) తక్కువ సంభవం
3. 5 ఆకుపచ్చ మరియు 6 నల్లని బంతులు గల సంచి నుండి ఒక నల్ల బంతిని తీయు సంభావ్యత (B) అధిక సంభవం
4. ‘సహజ సంఖ్యల నుండి ‘0’ ను ఎన్నుకొను సంభావ్యత (E) అసంభవం
5. పూర్ణసంఖ్యల సమితి నుండి అకరణీయ సంఖ్యను ఎన్నుకొను సంభావ్యత (C) కొంత సంభవం

AP 9th Class Maths Bits 14th Lesson సంభావ్యత

(ii)

గ్రూపు-A గ్రూపు-B
1. యొక్క గుణిజము (A) \(\frac{2}{3}\)
2. ప్రధాన సంఖ్య (B) \(\frac{1}{3}\)
3. సంయుక్త సంఖ్య (C) \(\frac{5}{6}\)
4. ’5’ కంటే తక్కువ సంఖ్య (D) \(\frac{1}{2}\)
5. ‘1’ కంటే ఎక్కువ సంఖ్య (E) \(\frac{1}{6}\)

జవాబు.

గ్రూపు-A గ్రూపు-B
1. యొక్క గుణిజము (E) \(\frac{1}{6}\)
2. ప్రధాన సంఖ్య (D) \(\frac{1}{2}\)
3. సంయుక్త సంఖ్య (B) \(\frac{1}{3}\)
4. ’5’ కంటే తక్కువ సంఖ్య (A) \(\frac{2}{3}\)
5. ‘1’ కంటే ఎక్కువ సంఖ్య (C) \(\frac{5}{6}\)