Practice the AP 9th Class Maths Bits with Answers 12th Lesson వృత్తాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 9th Class Maths Bits 12th Lesson వృత్తాలు
ఈ క్రింది వానిలో సరియైన సమాధానాన్ని ఎన్నుకొనుము.
ప్రశ్న 1.
వృత్తపరిధికి సమానదూరంలో గల బిందువు ( )
(A) కేంద్రము
(B) అంతర కేంద్రము
(C) వ్యాసార్ధం
(D) పరివృత్త కేంద్రము
జవాబు.
(A) కేంద్రము
పటము నుండి (2 మరియు 3) లకు సమాధానాలిమ్ము.
ప్రశ్న 2.
వృత్త కేంద్రము ‘O’ అయిన AB ఒక ………..
(A) వ్యాసార్ధము
(B) వ్యాసము
(C) అర్ధవృత్తము
(D) స్పర్శరేఖ
జవాబు.
(B) వ్యాసము
ప్రశ్న 3.
AC మరియు ADలు ‘O’ నుండి సమాన దూరంలో ‘ ఉన్నట్లయితే
(A) AC = CO
(B) AD = DO
(C) AC = AD
(D) AO = AC
జవాబు.
(C) AC = AD
ప్రశ్న 4.
రెండు వ్యాసార్ధాలు మరియు ఒక చాపము మధ్యన ఆవరింపబడి వున్న వృత్త భాగం
(A) త్రిభుజం
(B) వృత్తపరిధి
(C) సెక్టారు
(D) వృత్త వ్యాసము
జవాబు.
(C) సెక్టారు
ప్రశ్న 5.
అధిక వృత్తఖండంలోని కోణము …….
(A) అధిక కోణము
(B) లంబకోణము
(C) సరళరేఖ
(D) అల్పకోణము
జవాబు.
(D) అల్పకోణము
ప్రశ్న 6.
అల్పవృత్త ఖండంలోని కోణము …………..
(A) అధిక కోణము
(B) శూన్యకోణము
(C) అల్ప కోణము
(D) లంబకోణము
జవాబు.
(A) అధిక కోణము
ప్రశ్న 7.
ఒక వ్యాసము వృత్తంను రెండుగా విభజించిన
(A) అసమాన వృత్తఖండాలు
(B) సమాన వృత్తఖండాలు
(C) చెప్పలేము
(D) ఏదీకాదు
జవాబు.
(B) సమాన వృత్తఖండాలు
ప్రశ్న 8.
ఒక వృత్త కేంద్రము ‘O’ అయిన ‘O’ నుండి AB జ్యాకు గల దూరం, CD జ్యాకు గల దూరము కంటే ఎక్కువైన
(A) AB = CD
(B) AB > CD
(C) AB < CD
(D) వ్యా సం = AB + CD
జవాబు.
(C) AB < CD
ప్రశ్న 9.
పటంలో ‘O’ వృత్త కేంద్రము. A మరియు C లు వృత్త పరిధిపై గల బిందువులు, AB = CD అయిన ∠AOB =
(A) ∠OAB
(B) ∠OBC
(C) ∠DOC
(D) ∠OCD
జవాబు.
(C) ∠DOC
ప్రశ్న 10.
పై పటంలో ∠AOB = ∠DOC అయిన
(A) AB = DC
(B) AB = OC
(C) DC = OA
(D) AB + CD
జవాబు.
(A) AB = DC
ప్రశ్న 11.
కింది పటంలో x విలువ
(A) 40
(B) 80°
(C) 320°
(D) 50°
జవాబు.
(B) 80°
ప్రశ్న 12.
పై పటంలో ∠C = 60° అయిన y =,
(A) 40°
(B) 80°
(C) 240°
(D) 120°
జవాబు.
(C) 240°
ప్రశ్న 13.
పటంలో ‘O’ వృత్త కేంద్రమైన
(A) EF > CD > AB
(B) EF = CD = AB
(C) AB > CD > EF
(D) ఏదికాదు
జవాబు.
(C) AB > CD > EF
ప్రశ్న 14.
పటంలో ∠AOB = ∠COD; AB = 3 సెం.మీ. అయిన CD = ……
(A) 1.5 సెం.మీ
(B) 6 సెం.మీ.
(C) 3.5 సెం.మీ.
(D) 3 సెం.మీ.
జవాబు.
(D) 3 సెం.మీ.
ప్రశ్న 15.
పటంలో OM ⊥ AB మరియు AM = 6 సెం.మీ. . ఇక్కడ ‘0’ వృత్త కేంద్రమైన AB =
(A) 6 సెం.మీ.
(B) 12 సెం.మీ.
(C) 3 సెం.మీ..
(D) 6√6 సెం.మీ.
జవాబు.
(B) 12 సెం.మీ.
ప్రశ్న 16.
పటంలో ∠OMA =
(A) 45°
(B) 90°
(C) 180°
(D) ఏదీకాదు
జవాబు.
(B) 90°
ప్రశ్న 17.
ఒక వృత్తంను తెలియజేయు బిందువుల సంఖ్య
(A) ఒకటి
(B) రెండు
(C) మూడు
(D) అనంతం
జవాబు.
(C) మూడు
ప్రశ్న 18.
ఇచ్చిన బిందువు నుండి గీయదగు వృత్తాల సంఖ్య
(A) 1
(B) 2
(C) 3
(D) అనంతం
జవాబు.
(D) అనంతం
ప్రశ్న 19.
రెండు అతలీయ బిందువుల గుండా గీయదగు వృత్తాల సంఖ్య
(A) 2
(B) 4
(C) చాలా
(D) ఏదీకాదు
జవాబు.
(C) చాలా
ప్రశ్న 20.
మూడు సరేఖీయాలు కాని బిందువుల గుండా గీయదగు వృత్తాల సంఖ్య
(A) 4
(B) 3
(C) 2
(D) 1
జవాబు.
(D) 1
ప్రశ్న 21.
పటంలో ∠ADB = ………….
(A) 45°
(B) 65°
(C) 25°
(D) 115°
జవాబు.
(B) 65°
ప్రశ్న 22.
పటంలో ∠ABC = ………..
(A) 55°
(B) 125°
(C) 35°
(D) చెప్పలేము
జవాబు.
(B) 125°
ప్రశ్న 23.
ఒక చతుర్భుజము చక్రీయమైన అది ఒక ……………………
(A) సమాంతర చతుర్భుజము
(B) ట్రెపీజియం
(C) రాంబస్
(D) దీర్ఘచతురస్రం
జవాబు.
(D) దీర్ఘచతురస్రం
ప్రశ్న 24.
ఒక చాపము కేంద్రము వద్ద ‘x°’ కోణము చేయుచున్న వృత్తపరిధిపై ఏదేని బిందువు వద్ద చేయు కోణము ………
(A) \(\frac{x^{\circ}}{2}\)
(B) 2x°
(C) x°
(D) 180° – X°
జవాబు.
(A) \(\frac{x^{\circ}}{2}\)
ప్రశ్న 25.
ఒక వృత్త కేంద్రము నుండి వృత్త జ్యాకు గీచిన లంబము దానిని ……………. చేయును.
(A) సమద్విఖండన
(B) సమాంతరము
(C) ప్రాజ్యాంతరము
(D) ఏదీకాదు
జవాబు.
(A) సమద్విఖండన
క్రింది ఖాళీలను పూరింపుము.
ప్రశ్న 1.
వృత్త జ్యా లలో పొడవైన జ్యా ………………..
జవాబు.
వ్యాసము
ప్రశ్న 2.
సమాన జ్యా లు వృత్తకేంద్రం వద్ద ……………….. . కోణాలను ఏర్పరచును.
జవాబు.
సమాన
ప్రశ్న 3.
ఒక వృత్తఖండంలోని కోణాలు ……………………..
జవాబు.
సమానము
ప్రశ్న 4.
అర్ధవృత్తంలోని కోణము ………………..
జవాబు.
లంబకోణం
ప్రశ్న 5.
త్రిభుజ శీర్షాలను తాకుతూ పోవు వృత్తం ………………..
జవాబు.
పరివృత్తం
ప్రశ్న 6.
చక్రీయ చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు ………………..
జవాబు.
సంపూరకాలు
ప్రశ్న 7.
పై పటంలో x° విలువ …………………….
జవాబు.
60°
ప్రశ్న 8.
పటంలో ‘O’ వృత్త కేంద్రము అయిన x° విలువ …………………
జవాబు.
90°
ప్రశ్న 9.
పటంలో ‘O’ వృత్త కేంద్రము అయిన x° విలువ ……………..
జవాబు.
35°
ప్రశ్న 10.
రెండు వృత్తాలు రెండు వేర్వేరు బిందువుల వద్ద ఖండించుకున్న వాటి కేంద్రాలు …………………… పై వుండును.
జవాబు.
ఉమ్మడి జ్యాల యొక్క లంబ సమద్విఖండన రేఖ
ప్రశ్న 11.
సమాన పొడవులు గల జ్యాలు …………… నుండి ……………. దూరంలో వుండును.
జవాబు.
వృత్తకేంద్రం, సమాన
ప్రశ్న 12.
లంబకోణ త్రిభుజంలో పరివృత్త కేంద్రము ………………
జవాబు.
కర్ణము యొక్క మధ్య బిందువు
ప్రశ్న 13.
అధిక కోణ త్రిభుజంలో పరివృత్త కేంద్రము ……………..
జవాబు.
త్రిభుజానికి బాహ్యంగా ఉండును
ప్రశ్న 14.
అల్పకోణ త్రిభుజపు పరివృత్త కేంద్రము …………….. ఉండును.
జవాబు.
త్రిభుజ అంతరంలో
ప్రశ్న 15.
వృత్తపు వ్యాసపు మధ్య బిందువు ……………….
జవాబు.
దాని కేంద్రము.
ప్రశ్న 16.
ఒకే కేంద్రాలు గల వృత్తాలు ………..
జవాబు.
ఏకకేంద్ర వృత్తాలు
ప్రశ్న 17.
∠AOB = ∠COD అయిన CD = ………..
జవాబు.
4.5 సెం.మీ.
ప్రశ్న 18.
పై పటంలో ∆AOB ≅ ∆COD ………. ప్రకారం అగును.
జవాబు.
భు.కో.భు.
ప్రశ్న 19.
ఒక వృత్తంను తెలుపుటకు కావలసిన బిందువులు ………………..
జవాబు.
3
ప్రశ్న 20.
ఒక వృత్తంలో రెండు జ్యాలు అసమానాలైన చిన్న జ్యా వృత్త కేంద్రం నుండి …………. దూరంలో ఉండును.
జవాబు.
ఎక్కువ
జతపర్చుము:
(i)
గ్రూపు – A | గ్రూపు – B |
1. అంత్య బిందువులు వృత్తంపై గల రేఖాఖండము వ్యాసం కాకుండా | A) వ్యాసార్ధం |
2. వృత్తంను రెండు సమభాగాలుగా విభజించు రేఖాఖండం | B) ఛేదనరేఖ |
3. వృత్త కేంద్రం నుండి వృత్తం పై గల బిందువుకు గల దూరము | C) జ్యా లు |
4. వృత్తంను ఒకే ఒక బిందువు వద్ద స్పృశించు రేఖ | D) వ్యాసము |
5. వృత్తంను రెండు భాగాలుగా విభజించు రేఖ | E) స్పర్శరేఖ |
జవాబు.
గ్రూపు – A | గ్రూపు – B |
1. అంత్య బిందువులు వృత్తంపై గల రేఖాఖండము వ్యాసం కాకుండా | C) జ్యా లు |
2. వృత్తంను రెండు సమభాగాలుగా విభజించు రేఖాఖండం | D) వ్యాసము |
3. వృత్త కేంద్రం నుండి వృత్తం పై గల బిందువుకు గల దూరము | A) వ్యాసార్ధం |
4. వృత్తంను ఒకే ఒక బిందువు వద్ద స్పృశించు రేఖ | E) స్పర్శరేఖ |
5. వృత్తంను రెండు భాగాలుగా విభజించు రేఖ | B) ఛేదనరేఖ |
(ii)
గ్రూపు – A | గ్రూపు – B |
1. వృత్త కేంద్రం నుండి రెండు సమాన జ్యాలకు గల దూరము | (A) సంపూరకాలు |
2. ఒక చాపము వృత్తకేంద్రం వద్ద ఏర్పరచు కోణము, ఆ చాపం మిగిలిన వృత్తంపై ఏదైనా బిందువు వద్ద ఏర్పరచు కోణంకు …… గా వుండును. | (B) లంబకోణము |
3. చక్రీయ చతుర్భుజంలో ఎదుటి కోణాలు | (C) సమానము |
4. అర్ధవృత్తంలోని కోణము | (D) సగము |
5. ఏకకేంద్ర వృత్తాల వ్యాసార్ధాలు | (E) అసమానం |
జవాబు.
గ్రూపు – A | గ్రూపు – B |
1. వృత్త కేంద్రం నుండి రెండు సమాన జ్యాలకు గల దూరము | (C) సమానము |
2. ఒక చాపము వృత్తకేంద్రం వద్ద ఏర్పరచు కోణము, ఆ చాపం మిగిలిన వృత్తంపై ఏదైనా బిందువు వద్ద ఏర్పరచు కోణంకు …… గా వుండును. | (D) సగము |
3. చక్రీయ చతుర్భుజంలో ఎదుటి కోణాలు | (A) సంపూరకాలు |
4. అర్ధవృత్తంలోని కోణము | (B) లంబకోణము |
5. ఏకకేంద్ర వృత్తాల వ్యాసార్ధాలు | (E) అసమానం |