These AP 8th Class Social Important Questions 7th Lesson ద్రవ్యం, బ్యాంకింగ్ will help students prepare well for the exams.

AP Board 8th Class Social 7th Lesson Important Questions and Answers ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 1.
ప్రాథమిక పొదుపు ఖాతాను గూర్చి వివరించండి.
జవాబు:

  1. కనీస నిల్వ అసలు లేకుండా (‘జీరో’ బ్యాలెన్స్) లేదా అతి తక్కువ ఉండవచ్చు.
  2. వ్యక్తులకు, ఖాతా తెరవడానికి, వయస్సు, ఆదాయం , జమ చేయవలసిన కనీస మొత్తం వంటి షరతులు లేవు.
  3. నెలకి నాలుగుసార్లు (ATM నుండి తీసుకొన్న వాటితో కలిపి) నగదు తీసుకోవడం అనుమతించబడుతుంది.)
  4. నగదు తీసుకొను, డిపాజిట్ చేయుట; ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాలు / చెక్ (cheque) ల ద్వారా వచ్చిన సొమ్ము జమ చేయుటవంటి సేవలు పొందవచ్చు.
  5. కేంద్ర ప్రభుత్వం వారు ప్రధానమంత్రి జనధన్ యోజన (PMJDY) స్కీం ఆగస్టు 2014లో ప్రారంభించబడింది.

దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమనగా పేద ప్రజలందరికి జీరో బ్యాలెన్స్ తో బ్యాంక్ లో ఖాతాలు తెరిచేలా సదుపాయం కల్పించారు.

ప్రశ్న 2.
చిన్న ఖాతాలకు వర్తించే షరతులు ఏవి?
జవాబు:
ఒకవేళ, ప్రాథమిక పొదుపు ఖాతా, సులభం చేసిన “Know Your Customer (KYC)” షరతులతో గనుక తెరిచినట్లయితే, ఇది చిన్న ఖాతావలె కూడా పరిగణించబడుతుంది.

  1. ఈ ఖాతాల్లో మొత్తం జమ, ఒక సంవత్సరంలో లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు.
  2. ఏ సమయంలో కూడా, ఈ ఖాతాలో గరిష్ఠ నిల్వ ఏభైవేల రూపాయలు మించి ఉండరాదు.
  3. నగదు రూపంలో గాని, ఇతర బదిలీల రూపంలో గాని తీసుకొన్న మొత్తం, ఒక నెలలో పదివేల రూపాయలు మించి ఉండకూడదు.
  4. చిన్న ఖాతాలు మొదట 12 నెలల వరకు అమలులో ఉంటాయి. ఆ తరువాత, ఖాతాదారు అధికారికంగా సమ్మతించిన పత్రాల కోసం దరఖాస్తు చేసినట్లు రుజువు సమర్షిస్తే, దీన్ని మరో 12 నెలలు పొడిగించవచ్చు.

ప్రశ్న 3.
క్రింది. పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానములిమ్ము.

కాలక్రమంలో అరుదైన, ఆకర్షణీయమైన లోహాలను మార్పిడి మాధ్యమంగా ప్రజలు ఉపయోగించటం మొదలుపెట్టారు. రాగి, ఇత్తడి, వెండి, బంగారం వంటివి పాడవ్వకుండా చాలాకాలం ఉంటాయి. చిన్న భాగాలుగా చేయవచ్చు, తేలికగా రవాణా చేయవచ్చు. ఇది కొరత వస్తువు కాబట్టి అందరూ దీనిని ఆమోదిస్తారు. ప్రజలు తమ చేతిలో ఉన్న డబ్బు విలువైనదని, ఇతరులు కోరుకొనేది అనే నమ్మకంతో అమ్మడం, కొనడం చేసేవారు. ఈ డబ్బుకి విలువ ఉందని, ఇతరులు దానిని ఆమోదిస్తారని ప్రజలకు తెలుసు కాబట్టి తమ సరుకులను డబ్బుకి అమ్ముకునేవారు. ధాన్యం, పశువుల విలువ పడిపోయినట్టు డబ్బు విలువ పడిపోతుందని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదు. అయితే వస్తుమార్పిడిలోని అన్ని సమస్యలు ఈ రకమైన డబ్బు వల్ల పరిష్కారం కాలేదు, కొత్త సమస్యలు కూడా వచ్చాయి. లోహాలతో మార్పిడి చేసేటప్పుడు ప్రతిసారీ దానిని తూకం వేయాల్సి వచ్చేది. తరవాత లోహాల నాణ్యత పట్ల వ్యాపారస్థులకు అనుమానం కలిగేది. మార్పిడిలో స్వచ్ఛమైన వెండి, బంగారం లభించకపోవచ్చు. కొంతకాలం తరవాత మార్పిడికి ఉపయోగించిన లోహనాణ్యతలో నమ్మకం పెద్ద సమస్యగా మారింది.
1) చాలాకాలం పాడవకుండా ఉండే కొన్ని లోహాలను చెప్పండి.
జవాబు:
రాగి, ఇత్తడి, వెండి, బంగారం వంటివి పాడవ్వకుండా చాలాకాలం ఉంటాయి.

2) ప్రజలు ఏ విషయాలకు భయపడాల్సిన అవసరం లేదు?
జవాబు:
ధాన్యం, పశువుల విలువ పడిపోయినట్టు డబ్బు విలువ పడిపోతుందని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదు.

3) డబ్బు వలన వస్తుమార్పిడిలోని సమస్యలు పరిష్కారమయ్యాయా?
జవాబు:
వస్తుమార్పిడిలోని అన్ని సమస్యలు ఈ రకమైన డబ్బు వల్ల పరిష్కారం కాలేదు, కొత్త సమస్యలు కూడా వచ్చాయి.

4) డబ్బు వల్ల కలిగిన సమస్యలు ఏవి?
జవాబు:
లోహాలతో మార్పిడి చేసేటప్పుడు ప్రతిసారీ దానిని తూకం వేయాల్సి వచ్చేది. తరవాత లోహాల నాణ్యత పట్ల వ్యాపారస్తులకు అనుమానం కలిగేది. – మార్పిడిలో స్వచ్చమైన వెండి, బంగారం లభించకపోవచ్చు. కొంతకాలం తరవాత మార్పిడికి ఉపయోగించిన లోహ నాణ్యతలో నమ్మకం పెద్ద సమస్యగా మారింది.

AP 8th Class Social Important Questions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 4.
ఈ క్రింది పేరాను చదివి సమాధానములిమ్ము.

అనేక పట్టణాలు, నగరాల్లో అన్ని బ్యాంకుల, ప్రతినిధులు ప్రతిరోజూ సమావేశమై ఆ రోజు ప్రతి బ్యాంకుకీ ఇతర బ్యాంకుల నుంచి రావలసిన మొత్తాలను, అలాగే ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాలను నిర్ధారించుకుంటారు. సరిచూసిన చెక్కులు ఒకరికొకరు మార్చుకుంటారు. ఒక బ్యాంకు క్లియరింగ్ బ్యాంకు’గా పని చేస్తుంది. ఆ బ్యాంకులో మిగిలిన బ్యాంకులన్నింటికీ ఖాతాలు ఉంటాయి. బ్యాంకుల మధ్య వసూళ్లు, చెల్లింపులను ఈ క్లియరింగ్ బ్యాంకు నిర్వహిస్తుంది.

కొత్త విధానంలో అన్ని బ్యాంకులు, వాటి అన్ని శాఖలూ కంప్యూటర్ల ద్వారా అనుసంధానమై ఉన్నాయి. అన్ని బ్యాంకు ఖాతాలను, వారి సంతకాలను ఎక్కడ ఉన్న శాఖలోనైనా సరిచూసుకోవచ్చు. కాబట్టి బ్యాంకు ప్రతినిధులు కలవాల్సిన పనిలేదు. అదే విధంగా వేరే ఊళ్లో ఉన్న శాఖలకు బ్యాంకులు చెక్కులు పంపించాల్సిన అవసరం లేదు. ఒక బ్యాంకు మరొక బ్యాంకు మధ్య లావాదేవీలను అనుసంధానం చేయబడిన కంప్యూటర్లతో నిర్వహిస్తారు. దీని వల్ల పనులు చాలా తేలికగానే కాకుండా చాలా తొందరగా కూడా పూర్తవుతాయి.
1) ఎవరెవరు సమావేశమవుతారు?
జవాబు:
అన్ని బ్యాంకుల ప్రతినిధులు సమావేశమవుతారు.

2) వారు ఏమి మార్చుకుంటారు?
జవాబు:
సరిచూసిన చెక్కులు ఒకరికొకరు మార్చుకుంటారు.

3) క్లియరింగ్ బ్యాంకు ఏమి పనిచేస్తుంది?
జవాబు:
ఆ బ్యాంకులో మిగిలిన బ్యాంకులన్నింటికీ ఖాతాలు ఉంటాయి. బ్యాంకుల మధ్య వసూళ్లు, చెల్లింపులను ఈ క్లియరింగ్ బ్యాంకు నిర్వహిస్తుంది.

4) కొత్త విధానంలో కొత్తదనం ఏమిటి?
జవాబు:
కొత్త విధానంలో అన్ని బ్యాంకులు, వాటి అన్ని శాఖలు కంప్యూటర్ల ద్వారా అనుసంధానమై ఉన్నాయి.

5) దీని వలన ఫలితం ఏమిటి?
జవాబు:
దీనివల్ల పనులు చాలా తేలికగానే కాకుండా చాలా తొందరగా కూడా పూర్తవుతాయి.

ప్రశ్న 5.
ఈ క్రింది పేరాను చదివి, రెండు ప్రశ్నలను వ్రాయుము.
కాగితపు నోట్లకు కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అది మురికి అవుతుంది. చిరిగిపోతుంది. దాంతో నోట్లకు ప్లాసికను ఉపయోగించాలన్న భావన ఏర్పడింది. ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు పాడవ్వకుండా చాలాకాలం మన్నుతాయి. వీటిలో నకిలీ నోట్లను కూడా తేలికగా గుర్తించవచ్చు. ఇది నీటికి తడవదు, పర్యావరణానికి హాని చెయ్యదు.
జవాబు:

  1. కాగితపు నోట్లకు ఉన్న లోపాలేవి?
  2. పాలిమర్ నోట్లకున్న అర్హతలేవి?

ప్రశ్న 6.
మీ ప్రాంతంలో ఉన్న వాణిజ్య బ్యాంకును సందర్శించి ఈ పట్టికను నింపండి.
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్ 4

ప్రశ్న 7.
బ్యాంకులు అప్పు ఇచ్చేటప్పుడు హామీ ఎందుకు తీసుకుంటాయి?
జవాబు:
బ్యాంకు సిబ్బందికి, బ్యాంకుకు వచ్చేవారికి ఎటువంటి సంబంధం ఉండదు – మేనేజ్ మెంట్, కస్టమర్ సంబంధం తప్పు. అలాంటి సందర్భంలో బ్యాంకువారు ఎవరికి పడితే వారికి ఋణాలిచ్చి, తిరిగి వసూలు చేయలేకపోతే దివాళా తీసే పరిస్థితి వస్తుంది. అలాంటివి ఎదుర్కోకుండా బ్యాంకు అప్పులు ఇచ్చేటపుడు హామీలను తీసుకుంటాయి.

ప్రశ్న 8.
చెక్కులు మరియు డి.డి.ల మధ్య భేదాలు ఏమిటి?
జవాబు:
చెక్కులు:

  1. చెక్కుని బ్యాంకు ఖాతాదారుడు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అంటే వారి పేరు మీద వ్రాసి ఇస్తాడు.
  2. చెక్కు నుండి నగదును డ్రా చేయడానికి ఎలాంటి సేవా రుసుమును చెల్లించనక్కరలేదు.
  3. ఒక వేళ చెక్కు ఇచ్చిన వ్యక్తి account లో నగదు ఉన్నట్లయితే మనం వెంటనే ఆ చెక్కును నగదుగా మార్చుకోవచ్చు. ఎక్కువ సమయం వృథా కాదు.
  4. అయితే చెక్కు ఇచ్చిన వ్యక్తి ఖాతాలో సరిపడినంత నగదు లేకపోతే బ్యాంకులు మనకు డబ్బులు ఇవ్వవు చెక్కులను తిరస్కరిస్తాయి.

D.Dలు:

  1. D.D లను బ్యాంకులు ఇష్యూ చేస్తాయి.
  2. మనం ఏవైనా సంస్థలు అందించే సేవలు పొందాలంటే కొంతడబ్బును ముందుగా ఆ సంస్థలకు చెల్లించాలి. ఆ డబ్బును D.D ల రూపంలో చెల్లించాలి.
  3. D.D లను కట్టే సమయంలో మనం కొంత సేవా రుసుమును కట్టాలి.
  4. బ్యాంకు ఎవరి పేరు మీద D.D ని ఇస్తుందో వారు ఆ D.D ని పొందిన వెంటనే డబ్బుగా మార్చుకోవచ్చు.
  5. D.D ని డబ్బుగా మార్చడానికి 2 లేదా 3 రోజుల సమయం పడుతుంది.
  6. D.D లు ఆమోదయోగ్యమైనవి ఇది తిరస్కరింపబడవు.

AP 8th Class Social Important Questions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 9.
చెక్కుల కంటె డి.డి.లు ఎలా ఆమోదయోగ్యమైనవి?
జవాబు:

  1. D.D లు ఎందుకు ఆమోదయోగ్యమైనవి అనగా బ్యాంకుకి ముందుగానే డబ్బులు కట్టి డి.డిలు తీసుకుంటాము. కాబట్టి అన్ని రకాల చెల్లింపులకు D.D లు ఆమోదయోగ్యమైనవే.
  2. కొన్ని సందర్భాలలో చెక్కులు ఇచ్చిన వ్యక్తి ఖాతాలో సరిపడినంత నగదు లేక పోయినట్లయితే చెక్కులు తిరస్కరించబడతాయి.

ప్రశ్న 10.
బ్యాంక్ వారు డిపాజిట్లపై చెల్లించే వడ్డీ కంటే వారు ఇచ్చే అప్పులపైన వడ్డీ ఎందుకు ఎక్కువ? Page No. 84)
జవాబు:
1) బ్యాంకు అనేది ఒక వాణిజ్య సంస్థ

2) ప్రజలు ఒక ఒప్పందం ప్రకారం అనగా బ్యాంకు వారు ఎంత అయితే వడ్డీని డిపాజిట్లకు చెల్లించుతామని చెప్పారో దానికి ఇష్టపడి ప్రజలు డిపాజిట్లు చేశారు. ఎందుకనగా వారికి అవసరం అయినప్పుడు అడిగినంత లభిస్తుందన్న నమ్మకం ప్రజలకుంది.

అయితే బ్యాంకు వారు ఇచ్చే అప్పులపై వడ్డీ ఎందుకు ఎక్కువ వసూలు చేస్తారంటే, ఆ వచ్చే వడ్డీతోనే బ్యాంకు జమచేసిన వారికి వడ్డీ ఇవ్వాలి. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి. పరికరాలు కాని నిర్వహించాలి. అద్దెలు చెల్లించాలి, బ్యాంకు నడపడానికి అయ్యే ఇతర ఖర్చులు భరించాలి. అంతిమంగా లాభాలు సంపాదించాలి. అందువలన బ్యాంకులు ఇచ్చే అప్పుల పైనే వడ్డీ ఎక్కువగా తీసుకుంటారు.

ప్రశ్న 11.
ఖాతాదారులలో చాలామంది బ్యాంకులో డబ్బు ఉంచాలని అనుకోకపోతే అది బ్యాంకు పనితీరును ఏ రకంగా ప్రభావితం చేస్తుంది?
జవాబు:
ఖాతాదారులలో చాలామంది బ్యాంకులో డబ్బు ఉంచాలని అనుకోకపోతే బ్యాంకులో సొమ్ములు నిల్వ ఉండవు. అపుడు బ్యాంకు ఇతరులకు అప్పు ఇవ్వలేదు. వారి నుండి వడ్డీలు సేకరించలేదు. దీని మూలంగా బ్యాంకు నిర్వహణ అసాధ్యమైపోతుంది.

ప్రశ్న 12.
గ్రామాలలో, పట్టణాలలో చాకలివారు, మంగలి వారు మరియు నీరటి వారు (చెరువు నీటిని కావలి కాసేవారు) మొదలగువారి, పనికి తగిన వేతనం చెల్లిస్తారా?
జవాబు:
ఈ రోజుల్లో మా తల్లిదండ్రులు వారి పనికి డబ్బు రూపంలోనే వేతనాలు చెల్లిస్తున్నారు. కాని 15 సం||రాల క్రితం వరకు వారికి ధాన్యం రూపంలోనే డబ్బులు చెల్లించేవారట.

ప్రశ్న 13.
పొదుపు ఖాతా అంటే ఏమిటి?
జవాబు:
పొదుపు ఖాతా : ఉద్యోగస్టులు మొ||న వారు ఈ ఖాతాని కలిగి ఉంటారు. పొదుపు ఖాతాలోని సొమ్ముపై కొంత వడ్డీ వస్తుంది. డబ్బు క్షేమంగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. అడిగినప్పుడు డబ్బు చెల్లిస్తానన్న హామీ బ్యాంకు ఇస్తుంది.

ప్రశ్న 14.
కరెంటు ఖాతా అంటే ఏమిటి?
జవాబు:
కరెంటు ఖాతా : వ్యాపారస్థులు మొ||నవారు ఈ ఖాతాను కలిగి ఉంటారు. ఈ ఖాతా నుంచి ఎన్నిసార్లయినా డబ్బులు తీయవచ్చు. జమ చేయవచ్చు. ప్రత్యేకమైన పరిమితి ఏమీలేదు. అయితే దీనిలో ఉన్న సొమ్ముకు వడ్డీ రాదు. అదనంగా సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

AP 8th Class Social Important Questions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 15.
మీకు 2000/- రూ||ల అవసరం ఉందనుకోండి. ఒక చెక్కు రాసి మీ చెల్లెలికిచ్చి నగదు తీసుకురమ్మని పంపించండి. ఏమి జరుగుతుంది?
జవాబు:
బ్యాంకు వారు దీనిని త్రిప్పి పంపుతారు. చెక్కులకు నగదు ఎవరికీ చేతి కివ్వరు. బ్యాంకులో అకౌంటు వుంటేనే, ఆ చెక్కును తీసుకుని, చెల్లెలు అకౌంట్లో వేస్తారు.

ప్రశ్న 16.
చాలాకాలం పాడవకుండా ఉండే కొన్ని లోహాలను చెప్పండి.
జవాబు:
రాగి, ఇత్తడి, వెండి, బంగారం వంటివి పాడవ్వకుండా చాలాకాలం ఉంటాయి.

ప్రశ్న 17.
ప్రజలు తమ సరుకులను డబ్బుకి ఎందుకు అమ్ముకునేవారు?
జవాబు:
డబ్బుకి విలువ ఉందని, ఇతరులు దానిని ఆమోదిస్తారని ప్రజలకు తెలుసు కాబట్టి తమ సరుకులను. డబ్బుకి అమ్ముకునేవారు.

ప్రశ్న 18.
క్లియరింగ్ బ్యాంకు ఏమి పనిచేస్తుంది?
జవాబు:
క్లియరింగ్ బ్యాంకులో మిగిలిన బ్యాంకులన్నింటికీ ఖాతాలు ఉంటాయి. బ్యాంకుల మధ్య వసూళ్లు, చెల్లింపులను ఈ . క్లియరింగ్ బ్యాంకు నిర్వహిస్తుంది.

ప్రశ్న 19.
మీకు తెలిసిన కొన్ని బ్యాంకుల పేర్లు చెప్పండి.
జవాబు:
బ్యాంకుల పేర్లు :

  1. ఆంధ్రాబ్యాంక్
  2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  3. ఇండియన్ బ్యాంక్

ప్రశ్న 20.
ఒక కాలానికి చేసిన ఫిక్స్ డిపాజిట్టుపై ప్రజలకు లభించే వడ్డీ కంటే అదే కాలానికి తీసుకున్న అప్పుపై ఎక్కువ వడ్డీ చెల్లించాలి. ఇలా ఎందుకు ఉండాలి?
జవాబు:
బ్యాంకుకి ‘ఫిక్స్ డిపాజిట్టు’ పై ఇచ్చే. వడ్డీ ఖర్చు క్రింద లెక్క అప్పుపై వచ్చే వడ్డీ ఆదాయం. ఖర్చు కన్నా ఆదాయం ఎక్కువైతేనే లాభాలుంటాయి. లేకుంటే బ్యాంకులు నష్టపోతాయి.

AP 8th Class Social Important Questions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 21.
పదివేల రూపాయలకు, వడ్డీ 8% అయితే, 5 సం||రాల తరువాత మనస్వినికి ఎంత డబ్బు వస్తుంది?
జవాబు:
వడ్డీ 8% అయితే 5 సం||రాల తరువాత మనస్వినికి దాదాపు రూ. 15,000 లు వస్తుంది.

ప్రశ్న 22.
డబ్బులు లేకుండా జరిగే మార్పిడులు ఏమైనా మీకు తెలుసా?
జవాబు:
“బార్టరు పద్ధతి” గురించి నాకు తెలుసు. వస్తువులను వస్తువులతోనే మార్చుకొనే విధానం.

ప్రశ్న 23.
ప్రస్తుతం బ్యాంకుల లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి?
జవాబు:
ప్రస్తుతం బ్యాంకులలో లావాదేవీలు కంప్యూటర్, ఇంటర్నెట్, NEFT ద్వారా జరుగుతున్నాయి.

ప్రశ్న 24.
గ్రామీణ పేదలకు సంబంధించిన ఏవైనా నాలుగు ఉపాధి పథకాలను పేర్కొనండి?
జవాబు:

  1. సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం
  2. జవహర్ గ్రామ సమృద్ధి యోజన
  3. పనికి ఆహార పథకం
  4. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
  5. సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజన.

ప్రశ్న 25.
ఇటీవల ‘పెద్దనోట్ల రద్దు’ పర్యవసానంగా సామాన్య ప్రజలు ఎదుర్కొన్న పరిణామాలు వివరించండి.
జవాబు:

  1. కొంతమంది ప్రజలకు వారి అత్యవసరమైన వైద్య సేవలకు కూడా డబ్బు అందక ఇబ్బందిపడ్డారు.
  2. పండ్లతోటలు మరియు కూరగాయలు వారు కూడా వారు ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడ్డారు.
  3. కొన్ని కుటుంబాలలో వివాహములకు అవసరమయ్యే డబ్బు దొరకక చాలా ఇబ్బందులు పడ్డారు.
  4. పెన్షదారులు వారి పెన్షన్ కోసం బ్యాంకుల దగ్గర రోజుల తరబడి నిలబడవలసి వచ్చింది.
  5. ప్రయివేటు హాస్పటల్ లో మందుల షాపుల వాళ్ళు, మందులు ఇవ్వడానికి పాతనోట్లను అంగీకరించక ప్రజలు తమ పాతనోట్లు మార్చుకోవడానికి బ్యాంకుల దగ్గర చాలా రోజులపాటు నిలబడవలసి వచ్చింది.
  6. రైతులు మరియు రోజువారీ వేతనం పొందే వ్యవసాయ కూలీలు డబ్బులు కోసం వారు పడిన ఇబ్బందులను వర్ణించడం చాలా కష్టం.

ప్రశ్న 26.
క్రింది సమాచారం పరిశీలించి, ఇవ్వబడిన ఆర్థిక లావాదేవీ గురించి మనం తెలుసుకోగల ఏవైనా నాలుగు అంశాలను రాయండి.
జవాబు:
ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయాలు ఏమిటంటే

  1. సురేష్, సుజాతకు డబ్బులు ఇవ్వాలి.
  2. అతను క్యాష్ రూపంలో ఇవ్వకుండా చెక్ రూపంలో ఇవ్వాలనుకున్నాడు.
  3. అతను ఏ బ్యాంకుకు అయితే చెక్ ఇస్తాడో ముందు అతని అకౌంట్ లో సరిపడ మొత్తం ఉందో లేదో చూసి తరువాత సుజాత పేరుమీద క్రాస్ చెక్ వ్రాసి ఇస్తాడు.
  4. ఎందుకు క్రాస్ చెక్ ఇస్తారు అంటే వారు ఎవరి పేరు మీద అయితే చెక్ ఇస్తారో వారి పేరుమీద బ్యాంకులో అకౌంట్ ఉంటేనే ఆ చెక్ డబ్బుగా మారుతుంది. లేకపోతే ఆ చెక్ దుర్వినియోగం చేయబడుతుంది.

AP 8th Class Social Important Questions Chapter 7 ద్రవ్యం, బ్యాంకింగ్

ప్రశ్న 27.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ వలన కలిగే ఏవేని రెండు ప్రయోజనాలను రాయండి.
జవాబు:
ఇంటర్నెట్ బ్యాంకింగ్ వలన కలిగే ప్రయోజనాలు :

  1. ఖాతాదారులు తమ ఖాతాలోని నగదును బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇతర ఖాతాలలోకి జమ చేయవచ్చు.
  2. వినియోగదారులు బ్యాంకుకు వెళ్ళకుండానే తమ బిల్లులను చెల్లించవచ్చు. ఉదా : విద్యుత్ బిల్లులు
  3. ఖాతాదారులు ఇంటి వద్దనే ఉంటూ వస్తువులను కొనుగోలు చేయవచ్చు.