These AP 8th Class Social Important Questions 24th Lesson విపత్తులు – నిర్వహణ will help students prepare well for the exams.

AP Board 8th Class Social 24th Lesson Important Questions and Answers విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 1.
ఆ వైపరీత్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు?
జవాబు:
స్థానిక ప్రభుత్వం వారు చాలా వరకు వరద ముప్పున్న ప్రాంతాల ప్రజలను ఊళ్ళోని పాఠశాలలకు, కమ్యూనిటీహాలుకు తరలించారు. వారికి ఆహార పొట్లాలు, త్రాగునీరు అందించారు. కొందరు తమ దుప్పట్లు, కట్టుకోవడానికి వస్త్రాలు అవీ దానంగా యిచ్చారు. ఈ విధంగా వైపరీత్యాన్ని ఎదుర్కొన్నారు.

ప్రశ్న 2.
మీ ప్రాంతంలో ఏదైనా వైపరీత్యాన్ని చూశారా? వివరించండి.
జవాబు:
మా ఇంటి దగ్గర ‘స్పాంజి డస్టర్లు’ తయారుచేసే చిన్న కంపెనీ ఒకటున్నది. అనుకోకుండా ఒక రోజు సాయంత్రం అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. పనిచేసేవారు జాగ్రత్తపడే లోపలే లోపలున్న ‘స్పాంజి’ మొత్తం కాలిపోయింది. పనివారికి కూడా ఒళ్ళు కాలి గాయాలయ్యాయి. దాదాపు రూ. 3,50,000 నష్టం వాటిల్లిందని దాని యాజమానులు చెప్పగా విన్నాము.

ప్రశ్న 3.
కింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వండి.
సునామీల గురించి ముందుగా పసిగట్టడం :

సునామీకి కారణమయ్యే భూకంపాల గురించి ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దాదాపు వెనువెంటనే హెచ్చరికలు జారీచేయవచ్చు. సునామీ కేంద్రం నుంచి తీరం ఎంత దూరం అన్నదాన్ని బట్టి హెచ్చరిక ఎంత ముందుగా చేయవచ్చన్నది ఆధారపడి ఉంటుంది. హెచ్చరికలో ఏ ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు.

తీరప్రాంత అలల కొలతల పరికరాలు సునామీలను తీరం దగ్గరగా గుర్తించగలవు కానీ సముద్రంలోపల ఇవి ఉపయోగపడవు. సముద్రం లోపలి కేబుళ్ల ద్వారా భూమికి అనుసంధానం చేసిన సునామీ డిటెక్టర్లు సముద్రంలో 50 కి.మీ. లోపలికి ఉంటాయి. సునామీ మీటర్లు సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.
1. సునామీకి కారణం ఏమిటి?
జవాబు:
భూకంపం.

2. హెచ్చరికలు ఎలా సాధ్యం?
జవాబు:
ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో సాధ్యం

3. హెచ్చరికలో ఏమి చెబుతారు?
జవాబు:
హెచ్చరికలో ఏ ఏ తీర ప్రాంతాన్ని ఎంత సమయంలో సునామీ తాకవచ్చో చెబుతారు.

4. సునామీ డిటెక్టర్లు ఎక్కడ ఉంటాయి?
జవాబు:
సముద్రంలో 50 కి.మీ. లోపలికి ఉంటాయి.

5. సునామీ మీటర్లు ఏం చేస్తాయి?
జవాబు:
సముద్ర ఉపరితలంపై అలజడులను గుర్తించి వాటిని ఉపగ్రహాలకు ప్రసారం చేస్తాయి.

AP 8th Class Social Important Questions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 4.
కింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులివ్వండి.

టీచర్లు, విద్యార్థులు ఒక ప్రాంత జనాభాలో సమగ్రభాగం. విపత్తులకు సంసిద్ధంగా ఉండటంలో వీళ్లకు ముఖ్యమయిన పాత్ర ఉంది. తల్లిదండ్రులు, ఇతర ప్రజలలో అవగాహన కల్పించటంలో విద్యార్థులు ముఖ్య పాత్ర పోషించవచ్చు. ఈ విషయంలో విద్యార్థులకు మార్గదర్శనం చేయటం ఉపాధ్యాయుల గురుతరమైన బాధ్యత.
1. టీచర్లు, విద్యార్థులు ఎవరు?
జవాబు:
వీరు ఒక ప్రాంత జనాభాలో సమభాగం.

2. దేనిలో వీరికి ముఖ్య మైన పాత్ర ఉంది?
జవాబు:
విపత్తులకు సంసిద్ధంగా ఉండటంలో వీళ్ళకు ముఖ్యమైన పాత్ర ఉంది.

3. విద్యార్థులు ఎవరికి అవగాహన కల్పిస్తారు?
జవాబు:
తల్లిదండ్రులకు, ఇతర ప్రజలకు.

4. విద్యార్థులకు ఎవరు మార్గదర్శనం చేస్తారు.
జవాబు:
ఉపాధ్యాయులు.

ప్రశ్న 5.
‘వాటర్ షెడ్ అభివృద్ధి’ పేరాను చదివి, రెండు ప్రశ్నలను తయారు చేయుము.
జవాబు:

 1. IWMP ని ఎవరు అమలు చేస్తున్నారు?
 2. ఏవేనీ రెండు ప్రత్యామ్నాయ జీవనోపాధుల పేర్లు రాయండి.

ప్రశ్న 6.
కరవు అంటే ఏమిటి?
జవాబు:
కరవు అన్నది వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి విపత్తు. ఒక ప్రాంతంలో సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దానిని వాతావరణ కరవు అంటారు.

AP 8th Class Social Important Questions Chapter 24 విపత్తులు – నిర్వహణ

ప్రశ్న 7.
ప్రకృతి విపత్తులలో రకాలేవి?
జవాబు:

 1. భూకంపాలు
 2. తుపానులు
 3. వరదలు
 4. కరవు
 5. సునామి
 6. కొండచరియలు విరిగిపడటం
 7. అగ్నిపర్వతాలు
  బ్రద్దలవటం మొదలైనవి.

ప్రశ్న 8.
“విపత్తుల నిర్వహణలో తీవ్రత తగ్గించే చర్యలు” అంటే ఏమిటి ? తుఫానుల విషయంలో తీవ్రతను తగ్గించే ఏవైనా రెండు చర్యలను సూచించండి.
జవాబు:

 1. విపత్తుల నిర్వహణలో తీవ్రత తగ్గించే చర్యలు అనగా విపత్తులు సంభవించటం మునపే వాటి తీవ్రతను తగ్గించుటకు, నివారించుటకు తీసుకునే చర్యలు. తుఫానులు సమయంలో నష్ట తీవ్రతను తగ్గించుకోవడానికి తీసుకోదగిన చర్యలు.
 2. తుఫాను సంభవించడానికి అవకాశం ఉన్న ప్రాంతం నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించుట.
 3. తుఫాను నుండి ప్రజలను రక్షించుటకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉండటం.
 4. తుఫానులు తరచుగా సంభవించే ప్రాంతాలలో మడ అడవుల పెంపకాన్ని ప్రోత్సహించడం.
 5. తుఫానులను తట్టుకోగలిగే సాంకేతికత, సామర్థ్యం గల నిర్మాణాలను ప్రోత్సహించటం.