These AP 8th Class Social Important Questions 22nd Lesson సినిమా – ముద్రణా మాధ్యమాలు will help students prepare well for the exams.

AP Board 8th Class Social 22nd Lesson Important Questions and Answers సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 1.
వివిధ విషయాలపై రకరకాల పత్రికలు ఉన్నాయి. మీ ఊరు / పట్టణంలో దొరికే పత్రికల పాత సంచికల నుంచి కరకాలున్నాయి ముఖచిత్ర పేజీలను సేకరించండి. వీటిని విషయాల వారీగా వర్గీకరించండి. వీటిని ఇంకే రకంగానైనా వర్గీకరించవచ్చా?
జవాబు:
AP Board 8th Class Social Solutions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు 1

ఇంకా ఇలాంటివి అనేక రకాలు ఉన్నాయి. వీటిని భాషనుబట్టి, కాలాన్ని బట్టి, అంశాలను బట్టి వర్గీకరించవచ్చు.

ప్రశ్న 2.
కింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.

సినిమా – వినోదరూపం :
సినిమా కంటే ముందు జానపద కళలు, జానపద నృత్యాలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, నాటకం వంటి అనేక వినోద రూపాలు ఉండేవి. కాలక్రమంలో వినోదానికి సినిమా ప్రధాన రూపంగా మారింది. సినిమాలో పాటలకు తగినంత ప్రత్యేక ప్రజాదరణ ఉంది. ఇంతకు ముందు రేడియో, ఇప్పుడు టీవి సినిమా పాటలను విడిగా ప్రసారం చేస్తున్నాయి. సినీనటులంటే ప్రజల్లో ఎంతో అభిమానముంది, అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. సినిమాల్లోని జనాదరణ పొందిన సంభాషణలు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నటీనటుల వేషధారణ, కేశాలంకరణలను ప్రజలు అనుకరిస్తున్నారు. టెలివిజన్ రాకతో సినిమాలు చూడటానికి సినిమాహాళ్ళకే వెళ్లవలసిన పనిలేకుండా పోయింది. సినిమాలు, సినిమా పాటలు, సినిమా వార్తలు ప్రసారం చేయటానికి ప్రత్యేక ఛానళ్లు లేదా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.
1. సినిమా కంటే ముందున్న వినోద రూపాలు ఏవి?
జవాబు:
సినిమా కంటే ముందు జానపద కళలు, జానపద నృత్యాలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీతం, నాటకం వంటి అనేక వినోద రూపాలు ఉండేవి.

2. సినిమా పాటలకున్న ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
వీటికి తగినంత ప్రజాదరణ ఉంది. రేడియోలు, టీవీలు వీటిని ప్రసారం చేస్తున్నాయి.

3. అభిమాన సంఘాలు ఎందుకు ఏర్పడ్డాయి?
జవాబు:
సినీనటులంటే ప్రజల్లో ఎంతో అభిమానముంది. అందుకే అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి.

4. ప్రజలు వేటిని అనుకరిస్తున్నారు?
జవాబు:
ప్రజలు నటీనటుల వేషధారణ, కేశాలంకరణలను అనుకరిస్తున్నారు.

5. సినిమాహాళ్ళకు వెళ్ళవలసిన పని ఎందుకు లేదు?
జవాబు:
సినిమాలు, సినిమా పాటలు, సినిమా వార్తలు ప్రసారం చేయటానికి ప్రత్యేక ఛానళ్ళు, ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి.

AP 8th Class Social Important Questions Chapter 22 సినిమా – ముద్రణా మాధ్యమాలు

ప్రశ్న 3.
కింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులివ్వండి.

1938, 1939 లో విడుదలైన ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ సినిమాల గురించి రంగయ్య మాటల్లో ఆనాటి ఉత్సాహం ఈనాటికీ కనపడుతోంది. అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం ‘మాలపిల్ల’లో ప్రధాన అంశం. దీంట్లోని కథానాయకుడు చౌదరయ్య గాంధేయవాది. అతడు ఉన్నత కులాల వాళ్లకు తమ పద్ధతులను మార్చుకోమనీ, నిమ్న కులాల వాళ్లకు తాగుడు మానెయ్యమనీ, చదువుకోమనీ చెబుతుంటాడు. పూజారి కొడుకు దళిత అమ్మాయితో ప్రేమలో పడతాడు. పూజారి భార్య మంటల్లో చిక్కుకుంటే ఒక దళితుడు ఆమెను కాపాడతాడు. ఈ ఘటనతో అంటరానితనం ఉండగూడదని పూజారి గుర్తిస్తాడు. దీంతో అతడు దళితులకు ఆలయ ప్రవేశం కల్పిస్తాడు. పూజారి కొడుకు, దళిత అమ్మాయి పెళ్ళిని అందరూ ఆశీర్వదిస్తారు.
1. ‘మాలపిల్ల’లో ప్రధాన అంశాలు ఏమిటి?
జవాబు:
అంటరానితనం, దళితుల ఆలయ ప్రవేశం.

2. కథానాయకుడు ఎవరు?
జవాబు:
చౌదరయ్య.

3. ఆయన ఎవరికి మంచి చెప్పాడు?
జవాబు:
నిమ్న కులాల వాళ్ళకు.

4. ఎవరు మంటల్లో చిక్కుకున్నారు?
జవాబు:
పూజారి భార్య.

5. పూజారి ఏమి గుర్తిస్తాడు?
జవాబు:
అంటరానితనం ఉండరాదని పూజారి గుర్తిస్తాడు.

6. ఎవరికి ఆలయ ప్రవేశం జరిగింది?
జవాబు:
దళితులకు

7. ఎవరెవరికి పెళ్లి జరిగింది?
జవాబు:
పూజారి కొడుకుకి, దళిత అమ్మాయికి పెళ్లి జరిగింది.

ప్రశ్న 4.
ప్రస్తుత నాటకాలు కనుమరుగయ్యాయి. కారణం ఏమిటి?
జవాబు:
ప్రస్తుతం నాటకాలు కనుమరుగవటానికి కారణాలు :

  1. సినిమాలు చూచుటకు అలవాటు పడిన ప్రజలు నాటకాలు, చూడడానికి ఆసక్తి చూపడం లేదు.
  2. టీ.వీల్లో సినిమాలు, సీరియల్స్ కు అలవాటు పడిన ప్రజలకు నాటకాలు రుచించడం లేదు.
  3. సత్యహరిశ్చంద్ర, శ్రీకృష్ణ రాయభారం, చింతామణి వంటి పేరెన్నిక గల నాటకాలు నేటితరం యిష్టపడటం లేదు.
  4. ఈతరం యువత ఈ పద్య నాటకాలను అభ్యసించడం లేదు.
  5. ప్రజాదరణ లేకపోవడంతో నాటక సమాజాలు అంతరించిపోతున్నాయి.

ప్రశ్న 5.
‘అల్లూరి సీతారామరాజు’ సినిమాను ప్రశంసించండి.
జవాబు:
1882లో బ్రిటిషు వాళ్లు అటవీ చట్టం చేసి గిరిజనులు అడవులలో స్వేచ్ఛగా తిరగకుండా, పోడు వ్యవసాయం చేయకుండా అడ్డుకోసాగారు. బ్రిటిషువాళ్ల వేధింపులకు వ్యతిరేకంగా గిరిజనుల ఆందోళనలకు సీతారామరాజు నాయకత్వం వహించాడు. 1922 రంపా తిరుగుబాటుగా ఖ్యాతిగాంచిన పోలీసు స్టేషనులపై దాడి చేశారు. గిరిజనులు తమ సాంప్రదాయ ఆయుధాలతోనూ, స్వాధీనం చేసుకున్న ఆయుధాలతోనూ పోరాటం చేయసాగారు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిషు పాలకులు రూథర్ ఫోర్డ్ నాయకత్వంలో అస్సాం రైఫిల్స్ ను పంపించింది. ఘంటం దొర వంటి గిరిజన నాయకులందరినీ చంపేశారు. చివరికి సీతారామరాజుని కూడా కాల్చి చంపేశారు. ఈ సినిమా వ్యాపార పరంగా ఎంతో లాభాలు ఆర్జించి పెట్టింది. దీంట్లోని ‘తెలుగు వీర లేవరా …’ పాటకి జాతీయ ఉత్తమ గీతం బహుమతి లభించింది. ఈ పాటని శ్రీశ్రీగా ప్రఖ్యాతిగాంచిన శ్రీరంగం శ్రీనివాసరావు రాశాడు.

ప్రశ్న 6.
“ఆధునిక కాలంలో అన్ని కళలనూ ‘సినిమా’ నే మింగేస్తున్నది” – సొంతమాటలలో వ్యాఖ్యానించండి.
జవాబు:
“ఆధునిక కాలంలో అన్ని కళలనూ సినిమానే మింగేస్తున్నది”

  1. మనదేశంలో సినిమాలు రాకముందు నాటికలు, నాటకాలు, బుర్రకథ, హరికథా కాలక్షేపాలు ఉండేవి.
  2. ప్రజలు పగలంతా చేసిన పనిని మరచి పోవడానికి రాత్రి సమయాలలో కొంచెం సేపు వినోదం కోసం ఇవి ప్రదర్శించే వారు.
  3. పండుగల సమయాలలో దేవాలయాలలో తోలుబొమ్మలాట, భరతనాట్యం , కూచిపూడి మొ||న ప్రదర్శనలు జరిగేవి.
  4. అక్కడక్కడా సంగీత కచేరీలు కూడా నిర్వహించేవారు.
  5. కాని సినిమా వచ్చిన తరువాత, మరియు వివిధ రకాల ఛానళ్ళు వచ్చిన తరువాత ఈ పై చెప్పినవి ఏమి లేవు. చూసేవారు కూడా లేరు.

కావున సినిమానే అన్ని కళలను మింగేసింది.