These AP 8th Class Social Important Questions 18th Lesson హక్కులు – అభివృద్ధి will help students prepare well for the exams.

AP Board 8th Class Social 18th Lesson Important Questions and Answers హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 1.
ఈ చిత్రాన్ని వ్యాఖ్యానించుము.
AP Board 8th Class Social Solutions Chapter 18 హక్కులు – అభివృద్ధి 2
ఇది వర్షాలు కురవని సంవత్సరం
జవాబు:
ఈ చిత్రం చాలా ఏళ్ళనాటిదని వృద్ధురాలి వస్త్రధారణను, ఇంట్లోని మట్టిబానలను, కుండలను చూసి చెప్పవచ్చు. ఒకప్పుడు ధాన్యం దాచుకోవడానికి వారు ఏర్పాటు చేసుకున్న వస్తువులన్నీ నేడు ఖాళీగా ఉన్నాయి. ఒక పాత్రలో బియ్యంలో ఎక్కడో అడుగున ఉన్నాయి. వృద్ధురాలు కూడా సరియైన తిండిలేక వడలిపోయి ఉన్నది. అది కరవు కాలం అని భావించవచ్చు.

ప్రశ్న 2.
కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.

13 సంవత్సరాల పవన్ అనే బాలుడు వాళ్ల అమ్మతో కలిసి ఎంతోమంది భక్తులు సందర్శించే ఒక పుణ్యస్థలంలో ఉంటాడు. పవన్ గుడి బయట నిలబడి భక్తుల కాళ్లమీద పడి అడుక్కుంటాడు. అతడికి కొంతమంది మిగిలిపోయిన పాచి పదార్థాలు తినటానికి ఇస్తారు. కొన్నిసార్లు అతడు బరువైన సామాను మోస్తాడు, అందుకు వాటి యజమానులు కొంత డబ్బు ఇస్తారు.

అతడి తల్లి వేరొకరి ఇంటిలో పనిచేస్తుంది. ఆమె రోజుకి 12 గంటలపాటు, నెలలో 30 రోజులూ పనిచేస్తుంది. యజమానురాలే కాకుండా, చిన్న పిల్లలు సైతం ఆమెను ఇది చెయ్యి, అది చెయ్యి అని చెబుతుంటారు. అందరూ తిన్న తరవాత మిగిలిన ఆహారం ఆమెకు పెడతారు. యజమానుల ముందు ఆమె కూర్చోటానికి వీలులేదు. వాళ్లతో భయభక్తులతో మాట్లాడాలి. చిన్న చిన్న తప్పులకు, ఆలస్యానికి ఆమెను తరచు అవమానిస్తుంటారు. ఆమె కన్నీళ్లతోపాటు కోపాన్ని కూడా దిగమింగుకోవాలి. లేదంటే పని నుంచి తీసేస్తారు.
1. పవన్ వయస్సు ఎన్ని సంవత్సరాలు?
జవాబు:
13 సంవత్సరాలు.

2. పవన్ కి డబ్బులు ఎందుకు ఇస్తారు?
జవాబు:
అతడు బరువైన సామాను మోసినందుకు ఇస్తారు.

3. అతడి తల్లి ఏమి చేస్తుంది?
జవాబు:
వేరొకరి ఇంటిలో పని చేస్తుంది.

4. ఆమెకున్న ఇబ్బందులను లేదా కష్టాలను రెండింటిని చెప్పండి.
జవాబు:
1. యజమానుల ముందు కూర్చోడానికి వీలులేదు.
2. అందరూ తిన్న తరువాత మిగిలిన ఆహారం ఆమెకు పెడతారు.

5. పవన్ కాళ్ల మీద పడి ఎందుకు అడుక్కుంటాడు?
జవాబు:
వారికి జాలి కలిగి డబ్బులు ఇస్తారని

AP 8th Class Social Important Questions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 3.
కింది పేరాను చదివి జవాబులు వ్రాయుము.

ప్రజా విచారణ :
‘జన్ సునావాయి’ (అంటే ప్రజా విచారణ) పేరుతో MKSS (మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన్) సమావేశాలు నిర్వహించేది. పేదలలో చాలామంది ప్రభుత్వ పత్రాలను తమంతట తామే చదవలేరన్నది వాస్తవం. ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ పత్రంలో ఏమి ఉందో తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి వీటిని పైకి చదివి వినిపించేవాళ్లు, వివరించేవాళ్లు. చేతిపంపు వేయటానికి ఎవరెవరికి కూలీ చెల్లించారో మస్టర్/హాజరు జాబితా తెలియచేస్తుంది. మస్టర్ జాబితాలో పేర్లు ఉన్న వాళ్లు ఆ సమయంలో ఊళ్లో ఉన్నారో, లేక వలస వెళ్లారో ప్రజలు చెప్పగలుగుతారు, లేదా మస్టర్‌లో పేర్కొన్న మొత్తం వాళ్లకు చెల్లించారో లేదో చెప్పగలుగుతారు. దీని ద్వారా ఏదైనా అవినీతి జరిగి ఉంటే అది వెల్లడవుతుంది. ఇటువంటి సమావేశాల ద్వారా ప్రజలు కార్యాచరణకు పూనుకునేవాళ్లు. పత్రాలలో ఉన్న సమాచారం గురించి వివరించటానికి, సమర్ధించుకోటానికి అధికారులకు కూడా అవకాశం ఇచ్చేవాళ్లు. ఈ సమావేశాల్లో జిల్లా పాలనా యంత్రాంగం, పంచాయితీ అధికారులు కూడా పాల్గొనేవాళ్లు. అవినీతిని గుర్తించినప్పుడు సంబంధిత వ్యక్తుల మీద కేసులు నమోదు చేసేవాళ్లు.
1. ‘జన్ సునావాయి’ అంటే తెలుగులో ఏమిటి?
జవాబు:
ప్రజా విచారణ.

2. పత్రాలను పైకి చదివి ఎందుకు వినిపించేవారు?
జవాబు:
పేదలలో చాలామంది ప్రభుత్వ పత్రాలను చదవలేరు. అందుకే వాటిని పైకి చదివి వినిపించేవారు.

3. ‘మస్టర్’ అంటే ఏమిటి?
జవాబు:
కూలీవాళ్ళు లేదా చేతిపనులు చేసేవాళ్ళు ఆ రోజు పనికి హాజరయ్యారో లేదో ఒక పుస్తకంలో నమోదు చేస్తారు. దానినే మస్టర్ అంటారు.

4. సమావేశాల ద్వారా ప్రజలు ఏం చేసేవారు?
జవాబు:
సమావేశాల ద్వారా ప్రజలు కార్యాచరణకు పూనుకునేవాళ్ళు.

5. కేసులు ఎప్పుడు నమోదు చేసేవాళ్ళు?
జవాబు:
అవినీతిని గుర్తించినప్పుడు కేసులు నమోదు చేసేవాళ్ళు.

ప్రశ్న 4.
‘సమాచారాన్ని వెల్లడి చేయడం పై ప్రజల వాదనలు ఏవి?
జవాబు:
వారి వాదనలు :

  1. మానవ అభివృద్ధి, ప్రజాస్వామిక హక్కులకు సమాచారం కీలకమైనది. అధికారిక పత్రాల రూపంలో తగినంత సమాచారం ఉన్నప్పుడే ప్రజలు పాలనలో భాగస్వాములై, న్యాయమైన అభివృద్ధి జరిగేలా చూడగలుగుతారు.
  2. సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండటంవల్ల ప్రభుత్వాలు తమ పనితీరులో మరింత జవాబుదారీగా ఉంటాయి. దీనివల్ల వాటి పనితీరును పర్యవేక్షించటం, అవినీతి జరగకుండా చూడటం సాధ్యమవుతుంది.
  3. పేదల మనుగడకు సమాచారం కీలకమైనది.
  4. సమాచారాన్ని వెల్లడి చేయాల్సి ఉన్నప్పుడు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవటాన్ని అరికట్టవచ్చు.

ప్రశ్న 5.
విద్యా హక్కు చట్టంలోని ఏవేని 6 ముఖ్యాంశాలను రాయండి.
జవాబు:
విద్యాహక్కు చట్టం, 2009 :
6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికి ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్యనందించడానికి ఉద్దేశించబడినది. ఇది ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది.

చట్టంలోని ముఖ్యాంశాలు :

  1. పిల్లలందరికి అందుబాటులో పాఠశాలలను ఏర్పాటు చేయాలి.
  2. పాఠశాలలకు మౌలిక వసతులను కల్పించాలి.
  3. పిల్లలందరిని వయస్సుకు తగిన తరగతిలో చేర్పించాలి.
  4. వయస్సుకు తగ్గ రీతిలో చేర్చిన తరవాత వారితో సమానంగా ఉండటానికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి.
  5. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సాధారణ పిల్లలతోపాటు విద్య కొనసాగించడానికి తగు వసతులు ఏర్పాటు చేయాలి.
  6. బడిలో చేర్చుకోవడానికి ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదు. ఎటువంటి రుసుము, ఛార్జీలు వసూలు చేయరాదు.

ప్రశ్న 6.
సమాచారం వెల్లడి కోసం ఉద్యమం ఎలా మొదలైంది?
జవాబు:
రాజస్థాన్లో కొంతమంది మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన (MKSS) పేరుతో సంఘటితమై ప్రభుత్వ కార్యక్రమాల గురించి, అవి అమలు అయ్యే తీరు, స్థానికసంస్థలు డబ్బులు ఎలా ఖర్చు చేశామో తనిఖీ లేదా MNREGA వంటి సమాచారం అడగసాగారు. ప్రభుత్వం నుంచి ప్రజలు సమాచారం పొందటానికి ఎటువంటి చట్టబద్ధ హక్కులేదు. మొదట్లో కొంతమంది అధికారుల సహాయంతో సంబంధిత పత్రాలను సేకరించి బహిరంగ సమావేశాల్లో ప్రజలు వీటిని తనిఖీ చేయటం మొదలు పెట్టారు. కొంతకాలం తరవాత ఈ వివరాలు ఇవ్వటానికి అధికారులు నిరాకరించారు. ఫలితంగా ఈ విషయమై మూడు సంవత్సరాల పాటు ప్రదర్శనలు, ఊరేగింపులతో ఉద్యమించారు. ఈ విధంగా ఉద్యమం మొదలైంది.

ప్రశ్న 7.
విద్యా హక్కు చట్టం గురించి తెలపంది.
జవాబు:
విద్యాహక్కు చట్టం, 2009 : 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికి ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్యనందించడానికి ఉద్దేశించబడినది. ఇది ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది.

AP 8th Class Social Important Questions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 8.
86వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు:
86వ రాజ్యాంగ సవరణ 2002లో జరిగింది.

ప్రశ్న 9.
మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన్ (MKSS) ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
జవాబు:
మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన్ రాజస్థాన్‌లో ప్రారంభమైంది.

ప్రశ్న 10.
ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంలో ఏర్పడింది?
జవాబు:
ఐక్యరాజ్యసమితి 1945లో ఏర్పడింది.

ప్రశ్న 11.
జీవించే హక్కు అంటే?
జవాబు:
మానవ గౌరవానికి భంగం కలగకుండా జీవించే హక్కు.

AP 8th Class Social Important Questions Chapter 18 హక్కులు – అభివృద్ధి

ప్రశ్న 12.
జాతీయస్థాయిలో పార్లమెంట్ సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో చేసింది?
జవాబు:
2005లో

ప్రశ్న 13.
స్వాతంత్ర్య ఉద్యమంలో గోపాలకృష్ణ గోఖలే ఏ వర్గానికి చెందినవాడు?
జవాబు:
మితవాదులు.

ప్రశ్న 14.
భారతదేశంలో, సమాచార హక్కు చట్టం – 2005, అవినీతి నిర్మూలనకు మరియు పేదల కోసం అమలు చేసే కార్యక్రమాల ప్రయోజనాలను వారికి సక్రమంగా చేరవేసేందుకు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది.
సమాచార హక్కు చట్టం పై లక్ష్యాలు సాధించడంలో విజయవంతమయిందా? మీ అభిప్రాయాన్ని సొంతమాటల్లో రాయండి.
జవాబు:
సమాచార హక్కు చట్టం కొన్ని అంశాలలో విజయాలను సాధించింది.

నా అభిప్రాయం ప్రకారం సమాచార హక్కు చటు, కొన్ని విషయాలలో ఇంకా విజయాన్ని సాధించలేదు అని చెప్పవచ్చు అవి ఏమనగా

పేదరికం :
పేదలు ఎక్కువగా క , భారతదేశంలో వారి హక్కుల గురించి పోరాడటానికి తగిన సమయం లేదు. వారు తమ రోజు వారి కార్యక్రమాలలో పోరాడుతూ తలమునకలై ఉన్నారు.

అవినీతి :
నేటికీ భారతదేశంలో అవినీతి ఎక్కువగా ఉండటం, ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా ఉపయోగించడం లేదనే స్పష్టమౌతుంది.

భయం :
ప్రభుత్వాన్ని, అధికారులను సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించడానికి భయపడుతూ ఉండటం కూడా కారణం.