These AP 8th Class Social Important Questions 17th Lesson పేదరికం – అవగాహన will help students prepare well for the exams.

AP Board 8th Class Social 17th Lesson Important Questions and Answers పేదరికం – అవగాహన

ప్రశ్న 1.

“పేదరికం ఎందుకు ఉంది? దాన్ని ఎలా నిర్మూలించవచ్చు” అనే శీర్షిక కింద పేరాను చదివి ఈ ప్రశ్నకు సమాధానం రాయండి.
పేదరికానికి ప్రధాన కారణం క్రమం తప్పకుండా పని దొరకకపోవటం అని మీరు ఈ పాటికి గ్రహించి ఉంటారు. ఉపాధి అవకాశాలు లేకపోతే మౌలిక అవసరాలు తీర్చుకునే ప్రజల కొనుగోలు శక్తి (ఆదాయం ) తగ్గుతుంది. కనీస . కొనుగోలు శక్తి లేనప్పుడు వాళ్లు తీవ్ర ఆకలికి గురవుతారు.

పేదరికానికి గల ఇతర కారణాలు ఏవి?
జవాబు:
పేదరికానికి గల ఇతర కారణాలు :

  1. కుటుంబంలో వ్యక్తులు ఎక్కువగా ఉండటం.
  2. ఒక్కరే పనిచేసి, ఎక్కువమంది కూర్చొని తినాల్సి రావటం.
  3. సామర్థ్యానికి తగిన అవకాశాలు రాకపోవటం.
  4. వేతన కూలీ రేట్లు చాలా తక్కువగా ఉండటం మొ||నవి.

ప్రశ్న 2.
క్రింది గ్రాఫుని చూసి, ప్రశ్నలకు జవాబు లిమ్ము.
AP Board 8th Class Social Solutions Chapter 17 పేదరికం – అవగాహన 2
1) ఎవరు ఎక్కువ కాలరీలు తీసుకుంటున్నారు?
జవాబు:
ధనికులు.

2) ధనికులకు రెండవ పాతిక శాతానికి మధ్యన గల కాలరీల తేడా ఎంత?
జవాబు:
621 కాలరీలు.

3) ఎవరు అతి తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు?
జవాబు:
అట్టడుగువారు.

4) ఈ చిత్రాన్ని బట్టి నీకు ఏమి అర్థం అయింది?
జవాబు:
ఆర్థికస్థాయి, ఆహార స్థాయిని నిర్దేశిస్తుంది.

ప్రశ్న 3.
వ్యవసాయ అభివృద్ధికి, వ్యవసాయంపై ఆధారపడిన వారికి మద్దతుగా ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు ఈ కింద ఉన్నాయి. ప్రతిదాని గురించి కొన్ని వాక్యాలు రాయండి. అది ఎందుకు ముఖ్యమో తెలియచేయండి. మీ నేపథ్యం నుంచి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
1. రైతులు వ్యాపారస్తులు/దళారులపై ఆధారపడకుండా ప్రభుత్వం సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించాలి. ఇవి నాణ్యతగా ఉండేటట్టు, సరసమైన ధరలకు దొరికేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
జవాబు:
రైతులు వ్యవసాయంపై సంపాదించినదే తక్కువగా ఉంటుంది. సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందకపోతే వారు యిబ్బందుల పాలవుతారు. దళారీల దగ్గర ఎక్కువ ధరలకు కొనలేరు. ఇందులో ఏవి లేకపోయినా వారు పెట్టుబడి మొత్తాన్ని నష్టపోతారు.
ఉదా :
ఇటీవలే కొన్ని జిల్లాల్లో ప్రత్తి విత్తనాలు నాసిరకం యివ్వడం మూలంగా ప్రత్తి రైతులు కోలుకోలేనంతగా దెబ్బ తిన్నారు.

2. చిన్నతరహా సాగునీటి పథకాలు.
జవాబు:
భారతదేశంలో వ్యవసాయం వర్షాధారం, ఇవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు. వాటి మీద ఆధారపడితే రైతు పరిస్థితి దీనస్థితి.
ఉదా :
గతంలో ఒకసారి వర్మాలు లేవని రైతులు నారు పోయలేదు. జులై నెలలో విపరీతంగా వర్షాలు పడి వాగులు, వంకలు నిండిపోయాయి. అపుడు వారు ఎక్కువ ధరకు నారు కొని తెచ్చి నాట్లు వేశారు. చేను ఏపుగా ఎదిగి మంచిగా పండింది. నవంబర్‌లో తుఫాను వచ్చి పంట మొత్తాన్ని నాశనం చేసేసింది. ఆ కాబట్టి చిన్న తరహా సాగు నీటి పథకాలు ఉండాలి.

3. న్యాయమైన వడ్డీకి సకాలంలో బ్యాంకు ద్వారా రుణాలు.
జవాబు:
న్యాయమైన వడ్డీకి సకాలంలో బ్యాంకులు ఋణాలివ్వకపోతే రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళతారు. హెచ్చువడ్డీలు వారికి చెల్లించాల్సి వస్తుంది. రైతులు అప్పుల పాలయిపోతారు.

4. ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర దొరికేలా మార్కెటింగు సౌకర్యాలు.
జవాబు:
ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర దొరకాలి. లేదంటే వారికి ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ అవుతుంది. అందుకే ప్రభుత్వంవారు కొన్ని పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తున్నారు.

5. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, రవాణా సౌకర్యాలు మెరుగుపరచటం.
జవాబు:
రోడ్డు, రవాణా సౌకర్యాలు లేకుంటే పండిన పంటను గ్రామం నుండి మార్కెట్టుకు చేర్చడం కష్టమవుతుంది. కొన్ని పంటలు త్వరగా పాడయిపోయేవి ఉంటాయి. అవి ఎందుకూ పనికి రాకుండా అయిపోతాయి.
ఉదా :
గతంలో ఒకసారి లారీల స్వంతదారులు సమ్మె చేశారు. ఆ సమయంలో చెరకు పంట. కోసి ఫ్యాక్టరీకి పంపడం కొంతమంది రైతులకు వీలవలేదు. ఆలస్యమయ్యేసరికి చెరుకు ఎండిపోయి దాని విలువను కోల్పోయింది. రైతులు పూర్తిగా నష్టపోయారు.

6. పంటలు నష్టపోయినప్పుడు రైతులకు సహాయం అందించటం.
జవాబు:
పంటలు నష్టపోయినపుడు బ్యాంకువారు, తరువాత పంటకి అప్పులివ్వటం, కొంత వడ్డీని మాఫీ చేయడం లాంటివి చేయాలి. లేదంటే రైతులు ఉన్న అప్పును తీర్చలేరు, మళ్ళీ పంటని పండించలేరు. ఈనాడు ఆత్మహత్యలు చేసుకునే రైతులంతా ఈ బాపతువారే.

AP 8th Class Social Important Questions Chapter 17 పేదరికం – అవగాహన

ప్రశ్న 4.
క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానము లిమ్ము.
ఈ ఉపాధి హామీ చట్టం ప్రకారం నైపుణ్యం అవసరంలేని శారీరక శ్రమ చేయటానికి సిద్ధంగా ఉండి, పని అడిగిన పెద్దవాళ్ల (18 సం||లు నిండిన)కు ప్రభుత్వం పని కల్పించాలి. ఈ విధంగా ప్రతి గ్రామీణ కుటుంబం ఒక సంవత్సర కాలంలో కనీసం వంద రోజులపాటు ఉపాధి పొందవచ్చు. ఈ పనికి కనీస కూలీకి తక్కువ కాకుండా కూలీ చెల్లించాలి.

  • నీటి నిల్వ, సంరక్షణ
  • కరవుకు తట్టుకునే పనులు (అడవుల వృద్ధి, చెట్ల పెంపకం)
  • షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన భూములకు సాగునీటి సౌకర్యాలు కల్పించటం
  • చెరువుల పూడికతీతతో సహా సంప్రదాయ నీటి మడుగుల పునరుద్ధరణ

1. మీ ఉపాధ్యాయుల సహాయంతో పైన ఇచ్చిన పనులు ఏమి సూచిస్తాయో తెలుసుకోండి.
జవాబు:
పైన యిచ్చిన పనులు వ్యవసాయావసరాలను తీరుస్తాయి. గ్రామాలు వాటి వనరులను అవే సమకూర్చుకునేలా చేస్తాయి. ఈ పనులు గ్రామాభివృద్ధిని సూచిస్తాయి.

2. మీ ఊరు/పట్టణానికి దగ్గరలో ఉపాధి హామీ చట్టం కింద జరుగుతున్న పని స్థలాన్ని సందర్శించండి. అక్కడ వాళ్లతో మాట్లాడి దాని గురించి రాయండి.
జవాబు:
మా ఊరు కోరుట్లలో ఉపాధి హామీ చట్టం క్రింద కాలువగట్లు బాగు చేస్తున్నారు. అలాగే రహదారులకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. చెరువులో పూడిక తీస్తున్నారు. దీనిమూలంగా ఇక్కడి పనివారికి వేసవికాలంలో అంటే పనులు లేని కాలంలో కూడా కూలీ పనులు లభిస్తున్నాయి అని సంబరపడుతున్నారు.

3. షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన భూములకు సాగునీటి సౌకర్యం కల్పించటానికి ఉపాధి హామీ చట్టం ఎందుకు ప్రాధాన్యతను ఇస్తోంది?
జవాబు:
షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధికి ప్రభుత్వం కొంత సొమ్మును రిజర్వు చేసి ఉంచుతుంది. చాలా సం||రాల నుండి ఈ సొమ్ము వాడక నిల్వ ఉండిపోయింది. కాబట్టి వీటిని వెంటనే వారికి సాగునీరు, తాగునీరు అందించటానికి ఉపయోగిస్తున్నారు. దీనివలన వారు స్వయం సమృద్ధిని సాధించుకోగలుగుతారు.

4. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధుల రక్షణలో ఉపాధి హామీ చట్టాన్ని ఒక పెద్ద ముందడుగుగా ఎందుకు పేర్కొంటున్నారు?
జవాబు:
ఈ చట్టం లేని రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు వారి జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస పోయేవారు. వారి కుటుంబాలు అల్లల్లాడేవి. ఈ చట్టం మూలంగా వారికి సం||రానికి 150 రోజులు పని దొరకటమే కాక గ్రామంలో అభివృద్ధి పనులు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఇది ఒక పెద్ద ముందడుగుగా పేర్కొనబడింది.

ప్రశ్న 5.
క్రింది పేరాను చదివి ప్రశ్నలకు సమాధానము లిమ్ము.

అత్యంత పేద కుటుంబాలకు అంత్యోదయ కార్డులు జారీ చేశారు. వాళ్లకంటే పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ పేదవాళ్లుగా పరిగణించబడే వాళ్లకు (BPL) (తెల్ల) కార్డులు ఇచ్చారు. మిగిలిన వాళ్లకి ఎపిఎల్ (గులాబీ) కార్డులు ఇచ్చారు.

ఒక్కొక్కరికి చౌకధరల దుకాణం నుంచి లభించే సరుకుల మొత్తం, వాటి ధరలు వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు అంత్యోదయ కార్డు ఉన్న వాళ్లకి నెలకి కుటుంబానికి 35 కిలోల ఆహారధాన్యాలు (బియ్యం, గోధుమ) ఇస్తారు. BPL కారు ఉన్నవాళ్లకి తెలంగాణలో ప్రతి వ్యక్తికీ నెలకి 6 కిలోల చొప్పున కుటుంబం మొత్తానికి ఆహారధాన్యాలు ఇస్తారు. అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉండి, వయసుమళ్లిన అతి పేదవారికి 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు.

1. అంత్యోదయ కార్డులు ఎవరికి జారీ చేశారు?
జవాబు:
అత్యంత పేద కుటుంబాలకు.

2. BPL వారికి ఏ రంగు కార్డులిచ్చారు?
జవాబు:
తెల్లకార్డులు.

3. BPL అంటే ఏమిటి?
జవాబు:
దారిద్ర్యరేఖకు దిగువున అని అర్థం.

4. APL అంటే ఏమిటి?
జవాబు:
దారిద్ర్యరేఖకి ఎగువున అని అర్థం.

5. APL వారికి ఏ రంగు కార్డులు యిచ్చారు?
జవాబు:
గులాబీ రంగు కార్డులు.

AP 8th Class Social Important Questions Chapter 17 పేదరికం – అవగాహన

ప్రశ్న 6.
షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన భూములకు సాగునీటి సౌకర్యం కల్పించటానికి ఉపాధి హామీ చట్టం ఎందుకు ప్రాధాన్యతనిస్తోంది?
జవాబు:
షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధికి ప్రభుత్వం అధికంగా నిధులు సమకూరుస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ నిధులు మిగిలిపోతాయి. ఈ నిధులతో త్రాగునీరు, సాగునీరు అందించడానికి ఉపయోగిస్తున్నారు.

ప్రశ్న 7.
పేదరిక నిర్మూలనకు సంబంధించి రెండు నినాదాలు తయారుచేయండి.
జవాబు:

  1. పేదరికము అనేది శాపం కాదు, ఇది ఒక పరిస్థితి మాత్రమే.
  2. విద్యను సాధించు, పేదరికాన్ని తొలగించు.

ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 33% నుండి 5 సం||లోపు పిల్లలు వయస్సుకు తగ్గ బరువు లేరు. 31% మంది స్త్రీలలో, 25% మంది పురుషులలో పోషకాహార లోపం వుంది”.
పైన చెప్పిన పోషకాహార లోపాన్ని అధిగమించుటకు ప్రభుత్వం తీసుకోవలసిన ఏవైనా రెండు చర్యలను సూచించండి.
జవాబు:
పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు :

  1. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కాయకూరలు లాంటి అనేక రకాల వస్తువులను అందించటం.
  2. మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించే ఆహారం సంపూర్ణ పోషక విలువలు కలిగి ఉండేటట్లు చూసుకోవాలి.
  3. బాల్య వివాహాలు జరగకుండా చట్టాలను పకడ్బందిగా అమలు చేయడం.

ప్రశ్న 9.
BPL ద్వారా అసమానతలు ఎలా తొలగించబడుతాయో, రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:

  1. BPL కార్డు కలిగినవారు రేషన్ షాపు నుంచి చౌక ధరకు ఆహార ధాన్యాలను పొందవచ్చు.
  2. BPL కుటుంబాల వారు ప్రభుత్వ పథకాల ద్వారా ఆరోగ్య భీమాను పొందవచ్చు.
  3. BPL కుటుంబాలను గుర్తించడం ద్వారా వారికి ఉచితంగా విద్యుత్ ను సరఫరా చేయవచ్చు.

ప్రశ్న 10.
రేఖాపటాన్ని పరిశీలించి దిగువ ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎ) రోజువారీ పనులు చేయడానికి కావలసిన శక్తి మనం తినే ఆహారం నుండి వస్తుంది. ఆ శక్తిని ఏ ప్రమాణాలలో కొలుస్తారు?
బి) గ్రామీణ భారతంలో అట్టడుగు పాతికశాతం మంది ఎన్ని క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటున్నారు?
జవాబు:
ఎ) రోజూ మనం తీసుకునే ఆహారాన్ని కేలరీలలో కొలుస్తారు.
బి) గ్రామీణ భారతంలో అట్టడుగు పాతిక శాతం మంది 1624 కాలరీల ఆహారాన్ని మాత్రమే రోజుకు తీసుకుంటున్నారు.