These AP 8th Class Social Important Questions 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు will help students prepare well for the exams.

AP Board 8th Class Social 16th Lesson Important Questions and Answers జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 1.
మొదటి భూదాన భూమిని అందుకున్న మైసయ్యగా మిమ్మల్ని ఊహించుకోండి. ప్రార్థనా సమావేశంలో మీకు భూమి లభించినప్పుడు మీ భావాలను వివరించండి.
జవాబు:
“అయ్యా ! వినోబాజీ ! మీ పుణ్యమా అని నా జీవిత కల నెరవేరి భూమికి యజమానిని అయ్యాను. మీరు, రామచంద్రారెడ్డి కుటుంబీకులు అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చల్లంగా ఉండాలి. నా కుటుంబం అంతా రెండు పూటలా అన్నం తింటాం.

మాకు ఈ రోజు నిజమైన పండగొచ్చిన రోజు.

గాంధీ గారికి జై
భారత మాతాకి జై
“ఉందిలే మంచికాలం ముందు ముందునా
అందరూ సుఖపడాలి నంద నందనా ” ||ఉందిలే !||

ప్రశ్న 2.
అంతర్గత ఘర్షణలు తగ్గించే ఉద్దేశంతో వివిధ గ్రామీణ వర్గాల ప్రయోజనాల మధ్య సమతౌల్యం సాధించడానికి ఈ చట్టాలు ప్రయత్నించాయని మరికొంతమంది అభిప్రాయం. మీరు వాళ్ళతో ఏకీభవిస్తారా?
జవాబు:
అవును. ఏకీభవిస్తాను.

ఈ చట్టాల వల్ల జమీందారులు భూస్వాములు గానూ, కొంతమంది కౌలుదారులు స్వంతదారులుగాను కొంతమంది పేదలు బంజరు భూముల యజమానులుగాను మారారు. దీనివల్ల ఘర్షణలు కొంతవరకు తగ్గాయని చెప్పవచ్చు.

AP 8th Class Social Important Questions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 3.
క్రింది ఇవ్వబడిన ఫ్లోచార్ట్ లోని సమాచారం ఆధారంగా జమీందారీ వ్యవస్థ గురించి మీరు గ్రహించిన విషయాలను తెలపండి.
AP 8th Class Social Important Questions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు 1
జవాబు:
ఈ ఫై ఫ్లోచార్టు ప్రకారం నేను గ్రహించిన విషయాలు ఏమిటంటే

  1. గ్రామీణ ప్రాంతాలు కడు పేదరికంలో ఉన్నాయి కారణం ఏమిటంటే సాగుచేసే భూమి అంతా భూస్వాముల ఆధిపత్యంలోనే ఉన్నది.
  2. వ్యవసాయం చేసేవారికి సొంతభూమి లేదు.
  3. భూమిశిస్తు వసూలు, సాగు భూమిపై నియంత్రణ, అటవీ భూములపై నియంత్రణ ఇవి అన్ని భూస్వాముల చేతులలోనే ఉండేది.
  4. భూస్వాముల ఆధిపత్యమే సమాజంలో ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.

ప్రశ్న 4.
1972-75 భూ పరిమితి చట్టంలోని ముఖ్యాంశాలను రాయండి?
జవాబు:

  1. అయిదుగురు సభ్యులు ఉన్న కుటుంబాన్ని ఒక యూనిట్ గా చట్టం ప్రకటించింది.
  2. అయిదుగురు సభ్యులున్న కుటుంబానికి గరిష్టంగా 10-27 ఎకరాలు నీటి వసతి ఉన్న భూమి, 35 -54 ఎకరాల మెట్ట భూమి ఉండవచ్చు.
  3. దానికి అదనంగా ఉన్న భూమిని మిగులు భూమిగా ప్రకటించి ప్రభుత్వం తీసుకుంటుంది.
  4. ఆంధ్రప్రదేశ్ లో 8 లక్షల ఎకరాలను మిగులు భూమిగా ప్రకటించారు.
  5. వీటిల్లో 6,41,000 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, అందులో 5,82,000 ఎకరాలను 5,40,000 మంది భూమిలేని, పేద సన్నకారు రైతులకు పంచి పెట్టింది.

AP 8th Class Social Important Questions Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

ప్రశ్న 5.
‘దున్నేవానికి భూమి’ అన్న నినాదం ఎల్లప్పుడూ ఒక మంచి ప్రేరణ వివరించండి.
జవాబు:
‘దున్నేవానికి భూమి’ అన్న నినాదం ఎల్లప్పుడూ ఒక మంచి ప్రేరణాత్మక అంశమే ఎందుకనగా స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో భారతదేశ ప్రజానీకం కడు పేదరికంలో ఉంది.

‘దుక్కేవానికే భూమి’ అనే నినాదం వలన స్వాతంత్ర్యం తరువాత ప్రభుత్వం మొట్టమొదటిగా ఈ అంశం మీద దృష్టిపెట్టి భూసంస్కరణలు అమలు చేసి భూములు లేని కౌలుదారులకు భూములను ఇవ్వడం జరిగింది.

ఇప్పటికీ కూడా చాలా ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో భూ సంస్కరణలు అమలు చేస్తూనే ఉన్నారు. ఈ సంస్కరణల వలన పేద ప్రజల జీవితాలను మెరుగుపడ్డాయి అని చెప్పవచ్చు.