These AP 8th Class Social Important Questions 11Bth Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947 will help students prepare well for the exams.
AP Board 8th Class Social 11Bth Lesson Important Questions and Answers జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947
ప్రశ్న 1.
భగత్ సింగ్ జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలు సేకరించి ఒక వ్యాసం రాయుము.
జవాబు:
భగత్ సింగ్ : జననం: 28-9-1907, మరణం : 23-3-1931
భగత్ సింగ్ భారతదేశంలో జాతీయవాది, తిరుగుబాటుదారుడు, విప్లవవాది. ఈయనను షహీద్ అని పిలిచేవారు. ఈయన ఐరోపా విప్లవాలను చదివి ప్రభావితుడైనాడు.
లాలాలజపతిరాయను చంపినందుకు ప్రతీకారంగా బ్రిటిషు పోలీసు అధికారి ‘శాండర్’ ను కాల్చి చంపాడు. తన స్నేహితుడైన భటుకేశ్వర్‌తో కలిసి కేంద్ర విధానసభలో రెండు బాంబులను, కరపత్రాలను జారవిడిచాడు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే నినాదాన్ని అరచి చెప్పాడు.
తరువాత కోర్టులో తమ వారిని విడిపించడానికి తనే స్వచ్చందంగా అరెస్టు అయ్యాడు. ఈ సమయంలో జైలుకెళ్ళి అక్కడ 116 రోజులు నిరాహార దీక్ష చేశాడు. ఈ సమయంలో షహీదకు భగత్ సింగ్ దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు లభించాయి. కాని కోర్టు వారికి మరణశిక్ష విధించింది. దానిని కూడా 23 సం||రాల వయస్సులో నవ్వుతూ భరించాడు.
ప్రశ్న 2.
ఈ క్రింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబు లిమ్ము.
రెండవ ప్రపంచ యుద్ధం (1939 – 1945) హిట్లర్ నేతృత్వంలో నాజీ పార్టీ ప్రపంచమంతటినీ తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ రష్యా, ఇతర దేశాలపై యుద్ధం ప్రకటించింది. ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యాలతో అమెరికా చేతులు కలిపింది. (వీటిని మిత్ర కూటమి అంటారు). జర్మనీకి జపాన్, ఇటలీ దేశాలు మద్దతు ఇచ్చాయి. మానవ చరిత్రలోనే అతి దారుణమైన ఈ యుద్ధం 1939లో మొదలయ్యి 1945లో రష్యా సైన్యాలు బెర్లిన్ ని చేజిక్కించుకోవటంతో, జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబు వేయడంతో ముగిసింది. ప్రజాస్వామ్యం, స్వేచ్చల పక్షాన ఉన్న ప్రజలందరూ హిట్లరిని వ్యతిరేకించి మిత్ర కూటమికి మద్దతు పలికారు. అయితే భారతదేశంలో అదే సమయంలో బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా పోరాటం సాగుతుండటంతో భారతీయులలో ఇది సందిగ్ధతలను నెలకొల్పింది. |
1. హిట్లర్ పార్టీ పేరు?
జవాబు:
నాజీ పార్టీ.
2. మిత్ర కూటమిలోని దేశాలు ఏవి?
జవాబు:
ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా మొదలైన దేశాలు.
3. ఇటలీ మద్దతు ఎవరికుంది?
జవాబు:
ఇటలీ మద్దతు జర్మనీకి ఉంది.
4. జపాన్లో అణుబాంబులు పదిన నగరాలేవి?
జవాబు:
హిరోషిమా, నాగసాకీలు.
5. హిట్లర్ ప్రజాస్వామ్యవాదా లేక నిరంకుశుడా?
జవాబు:
హిట్లర్ నిరంకుశుడు.
ప్రశ్న 3.
భారతదేశంలో 1906 నాటి నుండి బయలుదేరిన హిందూ-ముస్లిం భేదభావాలు విభజన జరిగాక సమసిపోయాయా? నీ సమాధానానికి కారణాలు రాయండి.
జవాబు:
భారతదేశం విభజనకు గురి అయినా, ఈ భేదభావాలు సమసిపోలేదు అని నా అభిప్రాయం.
కాశ్మీరు ఆక్రమణ, కార్గిల్ యుద్ధం, పార్లమెంట్ పై దాడి, ముంబయిపై దాడులు, హైదరాబాదులోని లుంబినీ పార్కు గోకుల్ ఛాట్, దిల్‌షుఖ్ నగర్ పై దాడులు ఈ విషయాన్ని ఋజువు చేస్తున్నాయి.
ప్రశ్న 4.
రెండవ ప్రపంచ యుద్ధం భారతీయులలో ఎందుకు సందిగ్ధత నెలకొల్పింది?
జవాబు:
రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రకూటమి, మిత్రరాజ్యాలు అని ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయి యుద్ధం చేశాయి. ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛనీ బలపరిచే ప్రజలందరూ హిట్లర్ ను వ్యతిరేకించి మిత్రకూటమికి మద్దతు పలికారు. అయితే భారతదేశంలో అదే సమయంలో బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా పోరాటం సాగుతుండటంతో భారతీయులు సందిగ్ధంలో పడ్డారు.
ప్రశ్న 5.
మతతత్వం, లౌకికవాదంలోని సున్నితమైన అంశాలను వివరించండి.
జవాబు:
అందరి ప్రయోజనాల గురించి కాక ఒక ప్రత్యేక మతస్తుల ప్రయోజనాలను మతతత్వం ప్రోత్సహిస్తుంది. ఆ మతస్తుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని నడపాలని అది నమ్ముతుంది. ఇందుకు విరుద్ధంగా చిన్న సమూహాలకంటే జాతి పెద్దదని, ఏ మతమూ లేనివాళ్ళతో సహా అందరి ప్రయోజనాలను జాతీయతావాదం కోరుకుంటుంది. ఈ దృక్పథాన్ని “లౌకిక” దృక్పథం అంటారు. మతసంబంధ వ్యవహారాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోగూడదు. అలాగే ప్రభుత్వంలో మతాలు జోక్యం చేసుకోగూడదని ఇది భావిస్తుంది. ఏ ఒక్క మతానికో ప్రాధాన్యతను ఇవ్వకుండా అన్ని మతాలను సమానంగా చూడాలి. ఈ విధంగా లౌకిక దృక్పథం, మతతత్వం విరుద్ధ అభిప్రాయాలు కలిగి ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మతతత్వం ఒక ప్రత్యేక మత ప్రయోజనాల కోసం పాటుపడుతుంది. ఆ మతం అవసరాల , ప్రకారం ప్రభుత్వం కూడా నడుచుకోవాలని కోరుతుంది.
ప్రశ్న 6.
సుభాష్ చంద్రబోస్, భారత జాతీయ సైన్యం గురించి రాయండి.
జవాబు:
సుభాష్ చంద్రబోస్ స్వరాజ్య ఉద్యమకారుడు, విప్లవవాద జాతీయవాది. అతడు రాస్ బిహారీ బోస్ సహకారంతో బర్మా, అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని’ (ఐఎన్ఏ) ఏర్పాటు చేశాడు. ఐఎన్ఏలో 60,000కు పైగా సైనికులు ఉండేవారు. ఈ పోరాటంలో జపాన్ అతడికి సహాయం చేసింది. 1943 అక్టోబరు 21న సింగపూర్‌లో స్వతంత్ర భారత (ఆజాద్ హింద్) తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1944 మార్చి 18న ఢిల్లీకి పదండి’ నినాదంతో ఐఎన్ఏ బర్మా సరిహద్దులు దాటి భారతదేశంలో ప్రవేశించింది.
1944 మార్చిలోనే కోహిమాలో భారత జెండాను ఎగరవేశారు. అయితే యుద్ధ పరిస్థితులు మారి 1944-45 శీతాకాలంలో బ్రిటన్ ప్రతిఘటనకు దిగటంతో రెండవ ప్రపంచ యుద్ధంలో అంతిమంగా జపాన్ ఓడిపోవటంతో ఐఎన్ఏ ఉద్యమం కుప్పకూలిపోయింది. బ్యాంకాక్ నుంచి టోక్యో 1945 ఆగస్టు 23న విమాన ప్రయాణం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయాడని చెబుతారు.
ప్రశ్న 7.
బ్రిటిషువారు భారతదేశంను వదలిపోవటానికి విప్లవవాదులు, వారి యుగం సహకరించింది. వివరించండి.
జవాబు:
1940ల తరువాత కమ్యూనిస్టు పార్టీ, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, కిసాన్ సభ, దళిత సంఘాల వంటి విప్లవవాద సంఘాల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇవి పేదలు, సన్నకారురైతులు, కార్మికులు, గిరిజనులు, దళితులను సమీకరించి బ్రిటిషు పాలన పైనే కాకుండా వడ్డీ వ్యాపారస్తులు, కర్మాగార యజమానులు, ఉన్నతకుల భూస్వాములు వంటి స్థానిక దోపిడీదారులకు వ్యతిరేకంగా సంఘటిత పరచసాగారు. నూతన స్వతంత్ర భారతదేశంలో ఈ అణగారిన వర్గాల ప్రయోజనాలకు సరైన చోటు కల్పించాలని, తరతరాల వాళ్ల కష్టాలు అంతం కావాలని, సమాన హక్కులు, అవకాశాలు కల్పించాలని ఈ సంస్థలు కోరుకున్నాయి. అప్పటివరకు ధనిక వర్గాలు అధికంగా ఉన్న స్వాతంత్ర్యోద్యమం వీళ్ల చేరికతో కొత్త కోణాన్ని, శక్తినీ సంతరించుకుంది. బ్రిటిషు పాలకులు అంతిమంగా దేశం వదిలి వెళ్లటానికి ఇది. సహకరించింది.
ప్రశ్న 8.
సుభాష్ చంద్రబోస్ ఎవరు?
జవాబు:
ఆయన స్వరాజ్య ఉద్యమకారుడు, విప్లవవాద జాతీయవాది.
ప్రశ్న 9.
‘ఆజాద్ హింద్’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
స్వతంత్ర భారతం అని అర్ధం.
ప్రశ్న 10.
మిత్ర కూటమిలోని దేశాలు ఏవి?
జవాబు:
ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా మొదలైన దేశాలు.
ప్రశ్న 11.
జపాన్లో అణుబాంబులు పడిన నగరాలేవి?
జవాబు:
హిరోషిమా, నాగసాకీలు.
ప్రశ్న 12.
క్విట్ ఇండియా ఉద్యమం గురించి వ్రాయండి.
జవాబు:
భారతదేశ ప్రజలను, సంపదను రెండవ ప్రపంచ యుద్ధానికి ఉపయోగించుకోవాలని బ్రిటన్ అనుకుంది. యుద్ధంలో మద్దతుకు బదులుగా భారతదేశానికి స్వయంపాలనా అధికారాన్ని ఇవ్వాలని కాంగ్రెసు కోరుకుంది. ఈ కోరికను అంగీకరించటానికి బ్రిటన్ ఎంత మాత్రమూ సిద్ధంగా లేదు. 1942 ఆగష్టు 8న బొంబాయిలో కాంగ్రెసు కార్యవర్గం సమావేశమయ్యి భారతదేశంలో బ్రిటీషు పాలన వెంటనే అంతం కావాలని స్పష్టంగా పేర్కొంటూ తీర్మానం చేసింది. క్విట్ ఇండియా తీర్మానం చేసిన తరువాత దేశ ప్రజలను ఉద్దేశించి గాంధీజి ఎంతో విలువైన సందేశమిచ్చాడు. ‘ఈ క్షణం నుంచి ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు తమను తాము స్వతంత్రులుగా పరిగణించాలి. స్వతంత్రులైనట్లు వ్యవహరించాలి. సంపూర్ణ స్వాతంత్ర్యం తప్పించి మరి దేనికీ నేను సిద్ధంగా లేను. అందరం ఉద్యమించి భారతదేశాన్ని విముక్తం చేద్దాం లేదా ఆ ప్రయత్నంలో చనిపోదాం”.
1942 ఆగస్టు 9 ఉదయానికే గాంధీజీ, పటేల్, నెహ్రూ, మౌలానా అజాద్, ఆచార్య కృపలనీ, రాజేంద్ర ప్రసాద్ వంటి అనేకమంది కాంగ్రెసు నాయకులను ప్రభుత్వం జైలుపాలు చేసింది. దేశవ్యాప్తంగా హర్తాళ్ లు, సమ్మెలు, ప్రదర్శనల రూపంలో ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు ఉద్యమం హింసాత్మక మలుపు తీసుకుంది. శ్రామికవర్గం కర్మాగారాలను బహిష్కరించింది. పోలీసుస్టేషన్లు, పోస్టాఫీసులు, రైల్వే స్టేషన్లు వంటి ప్రభుత్వ ఆస్తులపై విద్యార్థులు దాడులకు దిగారు. టెలిగ్రాఫ్, టెలిఫోన్ తీగలను కోసేశారు. రైల్వే పట్టాలను తొలగించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలు, సైనిక వాహనాలు, రైల్వే బోగీలను తగలబెట్టారు. ఈ సమయంలో మద్రాసు, బొంబాయి తీవ్రంగా ప్రభావితమయ్యా యి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో బ్రిటిషు అధికారం కనపడకుండా పోయింది. 1942-44 మధ్యకాలంలో మిడ్నాపూర్ ప్రజలు సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పారు.
ప్రశ్న 13.
గాంధీ, జిన్నా వంటి నాయకులు రౌలట్ చట్టాన్ని “రాక్షసచట్టం”గా విమర్శించారు. ఎందువలన?
జవాబు:
గాంధీ, జిన్నా వంటి నాయకులు రౌలట్ చట్టాన్ని రాక్షస చట్టంగా విమర్శించారు. ఎందుకంటే 1919లో బ్రిటిషు ప్రభుత్వం చేసిన రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహానికి పిలుపు ఇచ్చాడు. భావ ప్రకటన స్వేచ్ఛవంటి మౌలిక హక్కులను కాలరాసే విధంగా పోలీసులకు అధికారాలను ఈ చట్టం కల్పించింది. ఎవరినైనా ఉగ్రవాది అని పోలీసులు అనుమానిస్తే వాళ్ళను అరెస్టు చేసి ఎటువంటి విచారణ లేకుండా జైల్లో పెట్టవచ్చు. ఒకవేళ విచారణ జరిగినా అది చాలా రహస్యంగా సాగి తనకు వ్యతిరేకంగా రుజువులు ఏమున్నాయో ఆరోపణలకు గురైన వ్యక్తికి కూడా తెలియదు. ప్రజల మౌలిక స్వేచ్ఛను హరించే హక్కు ప్రభుత్వానికి లేదని మహాత్మాగాంధీ, మహమ్మద్ అలీ జిన్నా, ఇతర నాయకులు భావించారు. ఇది చాలా నిరంకుశత్వ, రాక్షస’ చట్టమని వాళ్ళు విమర్శించారు.
ప్రశ్న 14.
సహాయనిరాకరణ ఉద్యమాన్ని మహాత్మాగాంధీ అర్ధాంతరంగా ఆపివేశాడు. దీనికి గల కారణాన్ని తెలపండి.
జవాబు:
1922వ సం||లో సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుచున్న కాలంలో చౌరీచౌరాలో రైతుల గుంపు పోలీస్ స్టేషనుకు నిప్పు పెట్టినందుకు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మహాత్మాగాంధీ అర్థాంతరంగా ఆపివేశారు. దానికి కారణం మహాత్మా హింసాత్మక ఉద్యమాలకు వ్యతిరేకి.