Practice the AP 8th Class Social Bits with Answers 8th Lesson జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 8th Lesson జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

1. భారతదేశంలో సాంకేతిక విజ్ఞాన ప్రభావం ఈ అంశం మీద ఉంది.
A) ఉత్పత్తి ప్రక్రియలో మార్పులు
B) మానవశ్రమ, పశుశక్తి వినియోగంలో తగ్గుదల
C) ఉద్యోగ అవకాశాలలో మార్పులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

2. టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో ప్రపంచంలో భారతదేశ స్థానం
A) మొదటి
B) రెండవ
C) మూడవ
D) నాల్గవ
జవాబు:
C) మూడవ

3. భారతదేశంలో సాంకేతిక విజ్ఞాన ప్రభావం ఈ అంశం మీద ఉంది.
A) ఉత్పత్తి ప్రక్రియలో మార్పులు
B) మానవశ్రమ, పశుశక్తి వినియోగంలో తగ్గుదల
C) ఉద్యోగ అవకాశాలలో మార్పులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

4. వరికోత యంత్రం ఉపయోగం
A) పంటకోయటం
B) నూర్పిడి
C) కాలం ఆదా
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

పటం పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 8th Class Social Bits Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం 2

5. కింది వాటిలో అత్యధిక జనసాంద్రత గల జిల్లా ఏది?
A) చిత్తూరు
B) విశాఖపట్టణం
C) విజయనగరం
D) కృష్ణా
జవాబు:
D) కృష్ణా

6. కింది ఏ జిల్లాలో జనసాంద్రత 351 నుంచి 450 మంది ఒక చదరపు కిమీ. కి మధ్య గలదు?
A) పశ్చిమ గోదావరి
B) శ్రీకాకుళం
C) గుంటూరు
D) నెల్లూరు
జవాబు:
D) నెల్లూరు

7. “వ్యవసాయ రంగంలో యంత్రాలను విస్తృతంగా వాడటం వల్ల కూలీలకు పని లేకుండా పోతుంది”
A) అవును, ఇది వాస్తవం
B) కాదు, ఇది అవాస్తవం
C) అవును. కానీ యంత్రాల వినియోగం వల్ల కొత్త ఉద్యోగాలు ఏర్పడ్డాయి.
D) కాదు. ఇది కేవలం భ్రమ మాత్రమే.
జవాబు:
A) అవును, ఇది వాస్తవం

8. ప్రస్తుతం మొబైల్ కాల్ రేట్లు తగ్గడానికి సరియైన కారణం
A) మొబైల్ సేవల కంపెనీల మధ్య పోటీ ఎక్కువ కావడం
B) ప్రభుత్వం కంపెనీల పైన అదుపు పెట్టడం
C) మొబైల్ వినియోగదారులు ఎక్కువ కావడం
D) ప్రతి ఒక్కరికి మొబైల్ సేవలు అందుబాటులోకి రావడం
జవాబు:
A) మొబైల్ సేవల కంపెనీల మధ్య పోటీ ఎక్కువ కావడం

AP 8th Class Social Bits Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

9. క్రింది వాటిలో ఎక్కడ సాంకేతికత ఉపయోగించని కార్యకలాపం
A) పాట పాడేటప్పుడు
B) ఇడ్లీ వండేటప్పుడు
C) రంగస్థలంపై నాటకం జరిగేటప్పుడు
D) పూలదండ తయారు చేసేటప్పుడు
జవాబు:
C) రంగస్థలంపై నాటకం జరిగేటప్పుడు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

10. 1988లో వివిధ రాష్ట్రాలలో ఎన్ని లక్షల చేనేత మగ్గాలు పనిచేస్తుండేవి ?
A) 22
B) 32
C) 33
D) 34
జవాబు:
C) 33

11. వరి కోత యంత్రంతో ఒక గంటలో ……….. వరిని కోయవచ్చు.
A) ఎకరం
B) రెండు ఎకరాలు
C) మూడు ఎకరాలు
D) నాలుగు ఎకరాలు
జవాబు:
A) ఎకరం

12. భారతదేశంలో మిల్లులు ద్వారా ఉత్పత్తిని వీళ్ళు ప్రవేశపెట్టారు.
A) ఫ్రెంచివారు
B) డచ్చివారు
C) బ్రిటిష్ వారు
D) భారతీయులు
జవాబు:
C) బ్రిటిష్ వారు

13. ………….. ఉపయోగించడం వల్ల పశువుల వినియోగం తగ్గుతుంది.
A) కార్లు
B) బండ్లు
C) ట్రాక్టర్లు
D) బస్సులు
జవాబు:
C) ట్రాక్టర్లు

14. 1940లో ………. మరమగ్గాలు మాత్రమే ఉండేవి.
A) 20,000
B) 30,000
C) 35, 000
D) 40,000
జవాబు:
D) 40,000

AP 8th Class Social Bits Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

15. ఈ యంత్రం వినియోగం వల్ల కర్మాగారంలో పని విధానం పూర్తిగా మారిపోయింది.
A) అచ్చు యంత్రం
B) ఆవిరి యంత్రం
C) వినికిడి యంత్రం
D) బొగ్గు యంత్రం
జవాబు:
B) ఆవిరి యంత్రం

16. అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినవాడు
A) హెన్రీఫోర్టు
B) యూ.వి. ఫోర్డ్
C) డబ్ల్యూ , జి. ఫోర్డు
D) హెన్రీ లైన్
జవాబు:
A) హెన్రీఫోర్టు

17. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఇన్ని మరమగ్గాలు ఉన్నాయి.
A) 20,000
B) 30,000
C) 40,000
D) 50,000
జవాబు:
D) 50,000

18. వరికోత యంత్రాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు?
A) 3 రకాలు
B) 5 రకాలు
C) 7 రకాలు
D) 9 రకాలు
జవాబు:
A) 3 రకాలు

19. భారతదేశంలో వ్యవసాయం తరువాత ఈ పరిశ్రమ ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది.
A) పంచదార పరిశ్రమ
B) వస్త్ర పరిశ్రమ
C) జనపనార పరిశ్రమ
D) ఇనుము పరిశ్రమ
జవాబు:
B) వస్త్ర పరిశ్రమ

20. మరమగ్గం కేంద్రం ఎక్కడ ఎక్కువ?
A) తెలంగాణ
B) ఆంధ్రప్రదేశ్
C) తమిళనాడు
D) ఒడిసా
జవాబు:
C) తమిళనాడు

21. మరమగ కేంద్రాలపై పరిశోధన ఈ సంవత్సరంలో చేసారు.
A) 2005
B) 2006
C) 2007
D) 2008
జవాబు:
D) 2008

22. భారతదేశంలో టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ లో ఎన్నవ స్థానం?
A) 3వ
B) 4వ
C) 5వ
D) 6వ
జవాబు:
A) 3వ

23. టీ.వి పెట్టినా, మొబైల్ ఫోన్ లో మాట్లాడినా, కంప్యూటర్ పై పనిచేస్తున్నా దీనిని ఉపయోగించుకుంటున్నారు.
A) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం
B) అత్యంతాధునిక సాంకేతిక పరిజ్ఞానం
C) సనాతన సంప్రదాయ పరిజ్ఞానం
D) పైవన్నీ
జవాబు:
B) అత్యంతాధునిక సాంకేతిక పరిజ్ఞానం

24. అత్యంతాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఒక ఉదాహరణ
A) అంతరిక్ష పరిశోధన
B) పరిశ్రమలు
C) రవాణా
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 8th Class Social Bits Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

25. ఒక కొత్త యంత్రాన్ని లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుక్కోవడం
A) తెలుసుకోవడం
B) ఆవిష్కరణ
C) కనుక్కోవడం
D) పైవన్నీ
జవాబు:
B) ఆవిష్కరణ

26. రబ్బరుకు బదులు వాడేది
A) ఫైబర్
B) ప్లాస్టిక్
C) జర్మన్ సిల్వర్
D) వెండి
జవాబు:
B) ప్లాస్టిక్

27. అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయటానికి హెన్రీ ఫోర్డు ప్రవేశపెట్టినది
A) అసెంబ్లీ
B) అసెంబ్లీ ఎక్స్ ప్రెస్
C) అసెంబ్లీ లైన్
D) థర్డ్ అసెంబ్లీ
జవాబు:
C) అసెంబ్లీ లైన్

28. 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లో మర మగ్గాలను వ్యతిరేకించినవారు
A) కార్మికులు
B) కర్షకులు
C) చేతివృత్తి కళాకారులు
D) పైవారందరు
జవాబు:
C) చేతివృత్తి కళాకారులు

29. స్వాతంత్ర్యం నాటికి వ్యవసాయ పద్ధతి
A) విస్తృత వ్యవసాయం
B) విస్తాపన వ్యవసాయం
C) సాంద్ర వ్యవసాయం
D) సంప్రదాయ వ్యవసాయం
జవాబు:
D) సంప్రదాయ వ్యవసాయం

30. స్వాతంత్ర్యం తరవాత వ్యవసాయంలో వచ్చిన మార్పు .
A) సాగునీటి సౌకర్యాలు మెరుగుపరచుట
B) బోరుబావుల వాడకాన్ని ప్రోత్సహించుట
C) విద్యుత్ (లేదా) డీజిలుతో నడిచే మోటారు పంపులు వాడుట
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

31. వ్యవసాయ ఉత్పత్తులు పెరగడానికి కారణం
A) వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుట
B) వ్యవసాయక యంత్రాలను ఉపయోగించుట
C) నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచుట
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

32. కంబైన్డ్ హార్వెస్టర్ అనగా
A) వరిని కోస్తుంది
B) ధాన్యం నూర్పిడి చేస్తుంది.
C) పోత పోసి గింజ – పొట్టును వేరు చేస్తుంది
D) పైవన్నీ చేస్తుంది.
జవాబు:
D) పైవన్నీ చేస్తుంది.

33. వరికోత యంత్రం ఈ రాష్ట్రాల తీర ప్రాంతాలలో వాతావరణ అనిశ్చితిని ఎదుర్కోటానికి సహాయపడుతుంది.
A) ఆంధ్రప్రదేశ్
B) ఒడిశా
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

34. 2003 అంచనాల ప్రకారం వరికోత యంత్రానికి గంటకు చెల్లించే మూల్యం
A) 1000 – 1200
B) 1100 – 1400
C) 1300 – 1500
D) 1400 – 1600
జవాబు:
B) 1100 – 1400

35. వరికోత యంత్రంతో ఒక ఎకరం వరిని కొయ్యటానికి పట్టే సమయంలో
A) గంట
B) అరగంట
C) ముప్పావుగంట
D) పావుగంట
జవాబు:
A) గంట

AP 8th Class Social Bits Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

36. వరికోత యంత్రాన్ని ఉపయోగిస్తే రోజుకి 18 గంటలు పనిచేసి 55 రోజుల్లో పని పూర్తిచేయడం వల్ల 250 మంది కూలీలు ఉపాధి కోల్పోయే పని దినాలు
A) 50 రోజులు
B) 60 రోజులు
C) 70 రోజులు
D) 80 రోజులు
జవాబు:
D) 80 రోజులు

37. భారతదేశంలో వ్యవసాయం తరవాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది
A) వస్త్ర పరిశ్రమ
B) జనపనార పరిశ్రమ
C) తేయాకు పరిశ్రమ
D) చక్కెర పరిశ్రమ
జవాబు:
A) వస్త్ర పరిశ్రమ

38. వస్త్ర పరిశ్రమలోని వివిధ విభాగాలలో పనిచేసేవారి సంఖ్య కోట్లలో
A) 5
B) 10
C) 15
D) 20
జవాబు:
B) 10

39. భారతదేశంలో మిల్లుల ద్వారా ఉత్పత్తిని ప్రవేశపెట్టినవారు
A) బ్రిటిష్ వారు
B) ఫ్రెంచివారు
C) డచ్ వారు
D) పోర్చుగీసువారు
జవాబు:
A) బ్రిటిష్ వారు

40. నాణ్యమైన బట్టలను ఉత్పత్తి చేసేది
A) చేనేత, మగ్గాలు
B) మిల్లులు
C) కళాకారులు
D) హస్తనైపుణ్యం ఉన్నవారు
జవాబు:
B) మిల్లులు

41. ఈ సంవత్సరం నుంచి భారతదేశంలో వస్త్ర ఉత్పత్తిలో మరమగ్గాల వాటా ఎక్కువగా ఉంది
A) 1970
B) 1975
C) 1777
D) 1980
జవాబు:
D) 1980

42. మర మగ్గాలలో ఉపాధిని పొందుతున్న వారి సంఖ్య లక్షలలో
A) 50
B) 60
C) 70
D) 80
జవాబు:
B) 60

43. 1988లో భారతదేశంలో పనిచేస్తున్న చేనేత మగ్గాలు లక్షలలో
A) 30
B) 32
C) 33
D) 35
జవాబు:
C) 33

AP 8th Class Social Bits Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

44. 2009 – 10 సంవత్సరంలో భారతదేశంలో పనిచేస్తున్న చేనేత మగ్గాల సంఖ్య లక్షలలో
A) 24
B) 26
C) 28
D) 30
జవాబు:
A) 24

45. యాంత్రిక విజ్ఞానాన్ని వినియోగించటం వల్ల ప్రతి కార్మికునికి చేనేతలో కంటే మరమగ్గాల మీద ఎన్ని రెట్లు బట్టలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి?
A) 5
B) 6
C) 7
D) 9
జవాబు:
B) 6

46. మరమగ్గ కేంద్రాల కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య
A) ఆహారభద్రత, పోషకాహార లోపం
B) రక్తహీనత, క్షయ
C) ఆస్తమా, మహిళలలో గర్భసంచి సంబంధిత వ్యాధులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

47. సేవా రంగాన్ని ప్రభావితం చేసేది.
A) సాంకేతిక విజ్ఞాన మార్పులు
B) ఆర్థిక ప్రగతి
C) పరిశ్రమలు
D) ఏవీకావు
జవాబు:
A) సాంకేతిక విజ్ఞాన మార్పులు

48. భారతదేశంలో లాండ్ లైన్ ఫోన్లు మాత్రమే ఎప్పటి వరకు ఉన్నాయి?
A) 1989
B) 1990
C) 1991
D) 1992
జవాబు:
B) 1990

49. భారతదేశంలో 2001లో మొబైల్ ఫోన్లు 50 లక్షలు ఉంటే 2012 మే నాటికి వాటి సంఖ్య
A) 9.9 కోట్లు
B) 92.9 కోట్లు
C) 95.9 కోట్లు
D) 98.4 కోట్లు
జవాబు:
B) 92.9 కోట్లు

50. భారతదేశంలో లాండ్ లైన్ ఫోన్ల కంటే మొబైల్ ఫోన్ల
A) 20 రెట్లు ఎక్కువ
B) 30 రెట్లు ఎక్కువ
C) 40 రెట్లు ఎక్కువ
D) 50 రెట్లు ఎక్కువ
జవాబు:
A) 20 రెట్లు ఎక్కువ

51. మొదటిసారి మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన సంవత్సరం
A) 1990
B) 1995
C) 1996
D) 1997
జవాబు:
B) 1995

52. ఈ సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు ఫోన్ చేసినవాళ్ళు, అందుకున్నవాళ్ళు ఇద్దరూ డబ్బులు చెల్లించవలసి ఉండేది.
A) 1995 – 2002
B) 1996 – 2003
C) 2002 – 2007
D) 2007 – 2009
జవాబు:
A) 1995 – 2002

53. 1994లో ఒక వ్యక్తి లాండ్ లైన్ ఫోన్లో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో వ్యక్తితో 3 నిమిషాలపాటు మాట్లాడటానికి అయ్యే ఖర్చు
A) 20 రూ||
B) 25 రూ||
C) 28 రూ||
D) 30 రూ||
జవాబు:
C) 28 రూ||

AP 8th Class Social Bits Chapter 8 జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం

54. భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్న మొబైల్ ఫోనులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్న దేశాల సంఖ్య
A) 50
B) 60
C) 70
D) 80
జవాబు:
D) 80