Practice the AP 8th Class Social Bits with Answers 3rd Lesson భూ చలనాలు – రుతువులు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 3rd Lesson భూ చలనాలు – రుతువులు

1. సుజాత పుట్టినరోజున సూర్యుడు భూమధ్యరేఖ మీద ఉన్నాడు. ఆమె పుట్టినరోజు
A) మార్చి 21
B) డిసెంబర్ 22
C) జూన్ 21
D) జూన్ 23
జవాబు:
A) మార్చి 21

2. భూమిపై రాత్రి, పగలు ఏర్పడటానికి కారణం
A) భూ పరిభ్రమణం
B) భూభ్రమణం
C) చంద్రుడు భూమి చుట్టూ తిరగడం
D) భూమి తన అక్షంపై 23 వాలి ఉండటం
జవాబు:
B) భూభ్రమణం

3. ప్రకాశవృత్తం అనునది
A) భూమిని ఉత్తర, దక్షిణ అర్థగోళాలుగా విభజిస్తుంది.
B) భూమిని పూర్వ, పశ్చిమార్ధగోళాలుగా విభజింపడింది
C) భూమిని, వెలుతురు, చీకటి అను రెండు అర్థ భాగాలుగా విభజిస్తుంది.
D) భూమిని వివిధ ఉష్ణోగ్రతా మండలాలుగా విభజిస్తుంది.
జవాబు:
C) భూమిని, వెలుతురు, చీకటి అను రెండు అర్థ భాగాలుగా విభజిస్తుంది.

4. సూర్యుడు తూర్పువైపునే ఉదయించడానికి కారణం
A) భూమి పడమర నుండి తూర్పు వైపుకు తన అక్షంపై భ్రమణం చెందడం
B) భూమి తూర్పు నుండి పడమరకు తన అక్షంపై భ్రమణం చెందడం
C) భూమి సూర్యుని చుట్టూ నిర్దిష్ట కక్ష్యలో సూర్యుని చుట్టు పరిభ్రమణం చెందడం
D) చంద్రుడు భూమి చుట్టూ నిర్దిష్ట కక్ష్యలో పరిభ్రమణం చెందడం
జవాబు:
A) భూమి పడమర నుండి తూర్పు వైపుకు తన అక్షంపై భ్రమణం చెందడం

5. ఈ క్రింది వానిని జతపరుచుము
ఎ) మార్చి 21 i) కర్కటరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి
బి) జూన్ 21 ii) మకర రేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి
సి) డిసెంబర్ 22 iii) భూమధ్యరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి
A) ఎ – 1, బి -ii, సి -iii
B) ఎ – iii, బి -1, సి -ii
C) ఎ – ii, బి – iii, సి -i
D) ఎ – iii, బి -ii, సి -1
జవాబు:
B) ఎ – iii, బి -1, సి -ii

AP 8th Class Social Bits Chapter 3 భూ చలనాలు – రుతువులు

6. సరైన వాక్యా న్ని గుర్తించండి.
ఎ) భూమి సూర్యుని చుట్టు ఒకసారి తిరిగి రావడానికి 365 రోజుల 6 గంటల సమయం పడుతుంది.
బి) భూమి తన చుట్టు తానూ ఒకసారి తిరగడానికి 24 గంటల సమయడం పడుతుంది.
A) ఎ మాత్రమే
B) బి మాత్రమే
C) ఎ మరియు బి
D) ఏదీకాదు
జవాబు:
C) ఎ మరియు బి

7. భూమధ్య రేఖకు మొత్తం దక్షిణాన ఉన్న ఖండం
A) ఆసియా
B) ఆస్ట్రేలియా
C) ఉత్తర అమెరికా
D) యూరప్
జవాబు:
B) ఆస్ట్రేలియా

8. భూమిపై రాత్రి, పగలు ఏర్పడటానికి కారణం
A) భూ పరిభ్రమణం
B) భూభ్రమణం
C) చంద్రుడు భూమి చుట్టూ తిరగడం
D) భూమి తన అక్షంపై 23 వాలి ఉండటం
జవాబు:
B) భూభ్రమణం

* పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి.
AP 8th Class Social Bits Chapter 3 భూ చలనాలు – రుతువులు 2

9. సూర్యాస్తమయం చివరగా అయ్యే పట్టణం
A) మధురై
B) నాగపూర్
C) కోహిమా
D) ఆగ్రా
జవాబు:
A) మధురై

10. ఎక్కువ పగటి గల పట్టణం
A) కోహిమ
B) మధురై
C) హైదరాబాద్
D) విశాఖపట్టణం
జవాబు:
B) మధురై

11. ఈ క్రింద ఇవ్వబడిన పట్టణాలను భూమధ్యరేఖ నుండి ఉత్తరానికి గుర్తించండి.
నాగపూర్, మధురై, ఆగ్రా, హైదరాబాద్
A) మధురై, ఆగ్రా, హైదరాబాద్, నాగపూర్
B) మధురై, నాగపూర్, ఆగ్రా, హైదరాబాద్
C) మధురై, హైదరాబాద్, నాగపూర్, ఆగ్రా
D) ఆగ్రా, హైదరాబాద్, నాగపూర్, మధురై
జవాబు:
C) మధురై, హైదరాబాద్, నాగపూర్, ఆగ్రా

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

12. భూమి అక్షం ఏ మేర వంగి ఉంటుంది?
A) 13.5°
B) 20.5°
C) 22.5°
D) 23.5°
జవాబు:
D) 23.5°

13. ఇవి విషవత్తులు …………….
A) మార్చి 21 – డిశంబర్ 23
B) మార్చి 21 – సెప్టెంబరు 23
C) మార్చి 23 – సెప్టెంబరు 21
D) మార్చి 21 – నవంబర్ 23
జవాబు:
B) మార్చి 21 – సెప్టెంబరు 23

14. ఈ దేశమునకు అర్ధరాత్రి సూర్యుడన్న పేరుంది.
A) ఇండియా
B) జపాన్
C) నార్వే
D) న్యూయార్క్
జవాబు:
C) నార్వే

15. ఒహియో …………. లో ఉన్నది.
A) ఆస్ట్రేలియా
B) అమెరికా
C) కెనడా
D) ఐరోపా
జవాబు:
B) అమెరికా

16. భూమి ……. నుండి ….. కు భ్రమిస్తుంది.
A) పడమర, తూర్పు
B) తూర్పు, పడమర
C) ఉత్తరం, దక్షిణం
D) దక్షిణం, ఉత్తరం
జవాబు:
A) పడమర, తూర్పు

AP 8th Class Social Bits Chapter 3 భూ చలనాలు – రుతువులు

17. మకరరేఖపై సూర్యుడు ఏ రోజున ప్రకాశిస్తాడు?
A) డిసెంబరు 22
B) ఫిబ్రవరి 22
C) మార్చి 21
D) సెప్టెంబరు 23
జవాబు:
A) డిసెంబరు 22

18. 0° అక్షాంశాన్ని ఇలా పిలుస్తారు.
A) కర్కటరేఖ
B) భూమధ్యరేఖ
C) ఆర్కిటిక్ వలయం
D) గ్రీనిచ్ రేఖాంశం
జవాబు:
B) భూమధ్యరేఖ

19. సూర్యుడు ఎల్లవేళలా భూమిలో ఎంత భాగాన్ని ప్రకాశవంతం చేస్తుంటాడు?
A) ముప్పావు
B) పావు
C) సగం
D) ఒకటిన్నర
జవాబు:
C) సగం

20. భూమి బొంగరం వలే …………..
A) పరిభ్రమిస్తుంది
B) నిలుచుంటుంది
C) కనిపిస్తుంది
D) తిరుగుతుంది
జవాబు:
D) తిరుగుతుంది

21. ……………. వైపుకి వెళుతున్న కొద్దీ కోణం పతనం చెందుతూ ఉంటుంది.
A) 2 ధృవాల
B) కర్కటరేఖ వైపుకి మాత్రమే
C) భూమధ్యరేఖ
D) ఆర్కిటిక్ వలయం
జవాబు:
A) 2 ధృవాల

22. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం
A) ఇంగ్లండు
B) నార్వే
C) నేపాల్
D) జపాన్
జవాబు:
B) నార్వే

23. సూర్యుడు ప్రకాశవంతం చేసే గోళాకార అంచును ……….. వృత్తం అంటారు.
A) ప్రకాశవృత్తం
B) చీకటి వృత్తం
C) అర్ధవృత్తం
D) సగవృత్తం
జవాబు:
A) ప్రకాశవృత్తం

24. కర్కటరేఖ నుంచి మకరరేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని ఇలా పిలుస్తాము.
A) సమశీతోష్ణ మండలం
B) టండ్రా ప్రాంతం
C) ధృవమండలం
D) ఉష్ణమండలం
జవాబు:
D) ఉష్ణమండలం

25. ఈ రోజులలో ప్రపంచ వ్యాప్తంగా పగలు, రాత్రి సమానంగా ఉంటాయి.
A) మార్చి 21, సెప్టెంబర్ 23
B) మార్చి 10, సెప్టెంబర్ 5
C) మార్చి 8, సెప్టెంబర్ 4
D) మార్చి 5, సెప్టెంబర్ 3
జవాబు:
A) మార్చి 21, సెప్టెంబర్ 23

26. ఉత్తర, దక్షిణ ధృవాలను కలిపే ఒక ఊహజనిత రేఖను ……… అంటారు.
A) దీర్ఘం
B) అక్షం
C) కోణం
D) చతురస్రం
జవాబు:
B) అక్షం

27. సూర్యుడి చుట్టూ భూమి తిరగటాన్ని ఇలా అంటాం.
A) భ్రమణం
B) పరిభ్రమణం
C) కక్ష్య
D) అక్షం
జవాబు:
B) పరిభ్రమణం

AP 8th Class Social Bits Chapter 3 భూ చలనాలు – రుతువులు

28. ఈ నెలలో కర్కటరేఖపై సూర్యకిరణాలు నిట్ట విలువునా పడతాయి.
A) ఏప్రిల్
B) మే
C) జూన్
D) జులై
జవాబు:
C) జూన్

29. మానవులు వీటితో కలసి సహజీవనం చేస్తున్నారు.
A) చెట్లు
B) జంతువులు
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

30. ఈ దేశాలలో శీతాకాలంలో మంచు బాగా కురుస్తుంది.
A) భూమధ్యరేఖా ప్రాంతం
B) భూమధ్యరేఖకు ఉత్తర ప్రాంతం
C) భూమధ్యరేఖకు దక్షిణ ప్రాంతం
D) పైవన్నీ
జవాబు:
B) భూమధ్యరేఖకు ఉత్తర ప్రాంతం

31. భూమధ్యరేఖకు ఉత్తరాన ఉన్న ప్రాంతాలలో వేసవికాలం అయినపుదు భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న ప్రాంతాలలో
A) వేసవికాలమే ఉంటుంది
B) చలికాలం ఉంటుంది
C) వర్షాకాలం ఉంటుంది
D) ఏదీ ఉండదు
జవాబు:
B) చలికాలం ఉంటుంది

32. కాలాలను ప్రభావితం చేసే అంశం
A) భూమి గోళాకారంలో ఉండి ఉపరితలం ఒంపు తిరిగి ఉండుట
B) భూమి తన అక్షం మీద రోజుకు ఒకసారి తన చుట్టూ తాను తిరగటం
C) సూర్యుడి చుట్టూ భూమి తిరిగే తలంతో పోలిస్తే తన చుట్టూ తాను తిరిగే అక్షం ఒంపు కలిగి ఉండటం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

33. భూమి ఒకసారి తన అక్షం మీద తాను తిరిగి రావటానికి పట్టే సమయం
A) 20 గంటలు
B) 22 గంటలు
C) 23 గంటలు
D) 24 గంటలు
జవాబు:
D) 24 గంటలు

34. భూ భ్రమణం చెందే క్రమము
A) పడమర నుంచి తూర్పుకు
B) తూర్పు నుండి పడమరకు
C) ఉత్తరం నుంచి దక్షిణంకు
D) దక్షిణం నుండి ఉత్తరంకు
జవాబు:
A) పడమర నుంచి తూర్పుకు

35. భూమిలో సూర్యుడు ప్రకాశవంతం చేసే సగభాగం
A) ప్రకాశ వృత్తం
B) అప్రకాశ వృత్తం
C) అవృత్తం
D) దీర్ఘవృత్తం
జవాబు:
A) ప్రకాశ వృత్తం

AP 8th Class Social Bits Chapter 3 భూ చలనాలు – రుతువులు

36. భూ భ్రమణం వల్ల ప్రధాన ఫలితం
A) పగలు, రాత్రి ఏర్పడతాయి
B) ఉష్ణోగ్రతలలో తేడాలు ఏర్పడతాయి
C) సముద్ర ప్రవాహాలు ఏర్పడతాయి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

37. సూర్యుడి చుట్టూ భూమి తిరగడం
A) భూ భ్రమణం
B) భూ పరిభ్రమణం
C) విషువత్తులు
D) పైవన్నీ
జవాబు:
B) భూ పరిభ్రమణం

38. భూ పరిభ్రమణానికి పట్టే సమయం
A) 365 రోజులు
B) 365 రోజుల 5 గంటలు
C) 365 రోజుల 5.56 గంటలు
D) 366 రోజులు
జవాబు:
D) 366 రోజులు

39. సూర్యుడి చుట్టూ భూమి ఒకే తలంలో, ఒకే దారిలో తిరుగుతూ ఉంటే అది
A) అక్షం
B) కక్ష్య
C) తలం
D) ఉపరితలం
జవాబు:
B) కక్ష్య

40. భూ కక్ష్యతలం ఎన్ని డిగ్రీల కోణం కలిగి ఉంటుంది అనగా
A) 66°
B) 66.5°
C) 90°
D) 93
జవాబు:
B) 66.5°

41. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరం అంతా దాని అక్షం ఒకే వైపుకి వంగి ఉండటం వలన అది ధృవ నక్షత్రంవైపు చూపిస్తూ ఉండటం వల్ల దీనిని ఈ విధంగా పేర్కొంటారు.
A) అక్ష ధృవత్వం
B) పోలారిటీ ఆఫ్ ఆక్సిస్
C) పై రెండూ
D) ధృవత్వం
జవాబు:
C) పై రెండూ

42. ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాలకు ఒకే మోతాదులో సూర్యుడి నుంచి వేడిమి లభించే నెలలు
A) మార్చి, ఏప్రిల్
B) మార్చి, మే
C) మార్చి, సెప్టెంబర్
D) సెప్టెంబర్, డిసెంబర్
జవాబు:
C) మార్చి, సెప్టెంబర్

43. ఉత్తరార్ధగోళంలో సూర్యుని కిరణాలు కర్కటరేఖపై నిటారుగా పడేది
A) డిసెంబర్
B) మార్చి
C) మే
D) జూన్
జవాబు:
D) జూన్

AP 8th Class Social Bits Chapter 3 భూ చలనాలు – రుతువులు

44. దక్షిణార్ధగోళంలో సూర్యుని కిరణాలు మకరరేఖపై నిటారుగా పడేది.
A) మార్చి
B) మే
C) డిసెంబర్
D) జూన్
జవాబు:
C) డిసెంబర్

45. ఉష్ణమండలం అనగా
A) భూమధ్యరేఖ నుంచి ఉత్తర ధృవం వరకు గల ప్రాంతం
B) భూమధ్యరేఖ నుంచి దక్షిణ ధృవం వరకు గల ప్రాంతం
C) మకరరేఖ నుంచి కర్కటరేఖ వరకు ఉన్న ప్రాంతం
D) ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవం వరకు గల ప్రాంతం
జవాబు:
C) మకరరేఖ నుంచి కర్కటరేఖ వరకు ఉన్న ప్రాంతం

46. సూర్యుని కిరణాలు కర్కటరేఖపై నిట్టనిలువుగా పడే రోజు
A) డిసెంబర్ 22
B) జూన్ 21
C) మార్చి 21
D) సెప్టెంబర్ 23
జవాబు:
B) జూన్ 21

47. సూర్యుని కిరణాలు భూమధ్యరేఖపై నిట్టనిలువుగా పడే
A) మార్చి 21
B) సెప్టెంబర్ 23
C) A, B లు
D) డిసెంబర్ 22
జవాబు:
C) A, B లు

48. విషువత్తులు ఏర్పడే రోజు
A) మార్చి 21
B) సెప్టెంబర్ 23
C) A, B లు
D) జూన్ 21
జవాబు:
C) A, B లు

49. ధృవాల వద్ద పగటి సమయం
A) 24 గంటలు
B) 1 నెల
C) 6 నెలలు
D) 4 నెలలు
జవాబు:
C) 6 నెలలు

AP 8th Class Social Bits Chapter 3 భూ చలనాలు – రుతువులు

50. ఈ సముద్రం సంవత్సరమంతా గడ్డకట్టుకునే ఉంటుంది.
A) అట్లాంటిక్
B) పసిఫిక్
C) ఆర్కిటిక్
D) హిందూ
జవాబు:
C) ఆర్కిటిక్