Practice the AP 8th Class Social Bits with Answers 18th Lesson హక్కులు – అభివృద్ధి on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 18th Lesson హక్కులు – అభివృద్ధి

1. ‘బాయ్ కాట్’ అనగా నిరసనగా ఒక దేశానికి లేదా కంపెనీకి చెందిన వస్తువులను కొనటాన్ని, వాడకాన్ని నిలిపివేయడం. కింది ఏ చర్య బాయ్ కాట్ (బహిషరించడానికి) ఉదాహరణ?
A) బాల కార్మికులచే పని చేయిస్తున్న పరిశ్రమలో తయారైన దుస్తులను నిరాకరించడం
B) విద్యార్థి కులాన్ని ఆధారంగా పాఠశాలలో చేర్చుకొనుటకు నిరాకరించడం
C) వరద బాధితుల సహాయ నిధికి విరాళాలు ఇవ్వడానికి నిరాకరించడం.
D) అన్ని మతాల ఆచారాలను, సాంప్రదాయాలను నిరాకరించడం.
జవాబు:
A) బాల కార్మికులచే పని చేయిస్తున్న పరిశ్రమలో తయారైన దుస్తులను నిరాకరించడం

2. జీవించే హక్కును తెలిపే ఆర్టికల్ ………
A) 21
B) 23
C) 22
D) 24
జవాబు:
A) 21

3. సమాచార చట్టాన్ని భారతదేశంలో తొలిసారి అమలు చేసిన రాష్ట్రం
A) ఆంధ్రప్రదేశ్
B) తమిళనాడు
C) రాజస్థాన్
D) కేరళ
జవాబు:
B) తమిళనాడు

4. ఉచిత నిర్భంద విద్య హక్కు చట్టం ఈ సంవత్సరాల మధ్య గల బాలలకు సంబంధించినది
A) 5-11
B) 5-10
C) 6-15
D) 6-14
జవాబు:
D) 6-14

AP 8th Class Social Bits Chapter 18 హక్కులు – అభివృద్ధి

కింది. వాటికి సరియైన జవాబులు గురించండి.

5. MKSS ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది.
A) రాజస్థాన్
B) గుజరాత్
C) ఉత్తరప్రదేశ్
D) గోవా
జవాబు:
A) రాజస్థాన్

6. సమాచార హక్కు చట్టం ఈ సంవత్సరంలో జాతీయస్థాయిలో చేయబడింది.
A) 2002
B) 2005
C) 2009
D) 1995
జవాబు:
B) 2005

7. వీరికి ప్రభుత్వం వనరులు కేటాయించటం వారి ప్రాథమిక హక్కు
A) ప్రజలకు
B) ధనిక ప్రజలకు
C) పేద ప్రజలకు
D) విదేశీయులకు
జవాబు:
C) పేద ప్రజలకు

8. పేదలకు ఉద్దేశించిన పథకాలు వారికి చేరకపోవడానికి ప్రధాన కారణం
A) అవినీతి
B) వారి సంఖ్య
C) పథకాలు సరియైనవి కాకపోవడం
D) పైవేవీ కావు
జవాబు:
A) అవినీతి

9. గత 300 సం||లలో …….. మాదిరిగా ‘మానవ హకులు’ అన్న భావన ప్రపంచమంతా చోటుచేసుకుంది.
A) నియంతృత్వం
B) రాచరికం
C) సామ్యవాదం
D) ప్రజాస్వామ్యం
జవాబు:
D) ప్రజాస్వామ్యం

10. 86వ రాజ్యాంగ సవరణ ఈ సంవత్సరంలో జరిగింది.
A) 2000
B) 2005
C) 2002
D) 2012
జవాబు:
C) 2002

11. సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేసే వీలు వీరికి ఉండదు.
A) ప్రభుత్వ శాఖలకు
B) రాజకీయ నాయకులకు
C) ఏజెంట్లకు
D) ప్రతిపక్షం వారికి
జవాబు:
A) ప్రభుత్వ శాఖలకు

AP 8th Class Social Bits Chapter 18 హక్కులు – అభివృద్ధి

12. ప్రాథమిక హక్కులు ప్రజలు పొందకపోతే వారు ఇక్కడకు వెళ్ళి వాటిని పొందవచ్చు.
A) అసెంబ్లీ
B) పార్లమెంట్
C) రాజభవన్
D) కోర్టు
జవాబు:
D) కోర్టు

13. దేశంలోని పిల్లలందరికి ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం చేయమని బ్రిటిషు వలస ప్రభుత్వాన్ని అడిగారు.
A) తిలక్
B) గాంధీ
C) నెహ్రూ
D) గోఖలే
జవాబు:
D) గోఖలే

14. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సంవత్సరం ……..
A) 1954
B) 1964
C) 1945
D) 1956
జవాబు:
C) 1945

15. ప్రభుత్వ వ్యవస్థ చాలా పెద్దది
A) దృఢమైనది
B) రాజకీయమైనది
C) సంక్లిష్టమైనది
D) నమ్మకమైనది
జవాబు:
C) సంక్లిష్టమైనది

16. రెండు రకాల హక్కులు ముఖ్యమని అన్ని దేశాలు ఈ
A) 1991
B) 1993
C) 1995
D) 1997
జవాబు:
B) 1993

17. విద్యను ప్రాథమిక హక్కుగా పార్లమెంట్ గుర్తించిన సంవత్సరం
A) 1995
B) 2000
C) 2001
D) 2002
జవాబు:
D) 2002

18. జనస్సున్ వాయి అంటే
A) ప్రాథమిక విచారణ
B) ప్రాథమిక సభ్యత్వం
C) ప్రజా విచారణ
D) ప్రజా చైతన్యం
జవాబు:
C) ప్రజా విచారణ

AP 8th Class Social Bits Chapter 18 హక్కులు – అభివృద్ధి

19. పిల్లలు ఈ భాషలో చదువు నేర్చుకోవాలి.
A) తెలుగు
B) ఇంగ్లీషు
C) జాతీయభాష
D) మాతృభాష
జవాబు:
D) మాతృభాష

20. గత 300 సం||లలో ప్రజాస్వామ్యం మాదిరిగా ఈ భావన ప్రపంచమంతటా చోటుచేసుకుంది.
A) ఆర్థిక హక్కులు
B) మానవ హక్కులు
C) బాలల హక్కులు
D) మహిళా హక్కులు
జవాబు:
B) మానవ హక్కులు

21. విద్యాహక్కు చట్టం ద్వారా ఈ సంవత్సరాల వారికి ఉచిత, నిర్బంధ విద్యను అందించాలి.
A) 6-14 సం||లు
B) 3-14 సం||లు
C) 6-10 సం||లు
D) 11-14 సం||లు
జవాబు:
A) 6-14 సం||లు

22. అందరికీ …………. హక్కును ఇచ్చే చట్టం రూపుదిద్దుకునే క్రమంలో ఉంది.
A) గిరిజన హక్కుల చట్టం
B) ఉపాధి హామీ చట్టం
C) ఆహార
D) సమాచార
జవాబు:
C) ఆహార

23. అవినీతిని ఎదుర్కోవడానికి ఇది చాలా అవసరం.
A) సమాచారం
B) విద్య
C) ఉద్యోగం
D) ధైర్యం
జవాబు:
A) సమాచారం

24. మానవ హక్కులలో ప్రధానమైనవి
A) గౌరవప్రద జీవనం గడిపే హక్కు
B) స్వేచ్ఛ, స్వాతంత్ర్యపు హక్కు
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

25. పేదరికం అనగా సంవత్సరంలో అంగీకరించాయి.
A) ఆకలిగొనటం, జీవనోపాధికి భూమి వంటి వనరులు, చదువు లేకపోవటం
B) లాభసాటి ఉపాధి లేకపోవడం, ఆరోగ్య సేవలు, విద్య, ఆహారం లేకపోవటం
C) తమ సమస్యలు వినిపించే అవకాశం లేకపోవటం, ప్రభుత్వ కార్యక్రమాలను, విధానాలను ప్రభావితం చేయలేకపోవటం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

26. పనికి ఆహార పథకానికి సంబంధించిన సమాచారాన్ని రాజ్యస్థాన్లో అడిగిన సంస్థ
A) కిసాన్ శక్తి
B) మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన
C) అఖిల భారత కిసాన్ మజ్జూర్ యూనియన్
D) పైవన్నీ
జవాబు:
B) మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన

27. అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయటాన్ని తప్పనిసరి చేస్తూ రాజస్థాన్లో చట్టం చేయబడిన సంవత్సరం
A) 1990
B) 1992
C) 1993
D) 1995
జవాబు:
D) 1995

28. మజ్జూర్ కిసాన్ శక్తి సంఘటన ఏ పేరుతో సమావేశాలు నిర్వహించేది?
A) జన్ సునావాయి
B) జన్వాయి
C) వాయిజన్
D) వాయిస్ ఆఫ్ ది పీపుల్
జవాబు:
A) జన్ సునావాయి

29. చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలు అడిగే సమాచారానికి స్పందించే ఒక అధికారి ఉండాలి. అతనినే ఈ విధంగా పిలుస్తారు.
A) సమాచార అధికారి
B) సంతులిత అధికారి
C) ఆరోగ్య అధికారి
D) సంబంధిత శాఖాధికారి
జవాబు:
A) సమాచార అధికారి

AP 8th Class Social Bits Chapter 18 హక్కులు – అభివృద్ధి

30. ప్రజలు ఎవ్వరూ అడగకపోయినా ప్రతి ప్రభుత్వ కార్యాలయం తనంతట తాను కొంత సమాచారాన్ని ఈ హక్కు చట్టం కింద వెల్లడి చేయాలి.
A) స్వేచ్ఛా హక్కు
B) సమాచార హక్కు
C) సమానత్వపు హక్కు
D) స్వాతంత్ర్యపు హక్కు
జవాబు:
B) సమాచార హక్కు

31. ప్రజా ఉద్యమాలు వీటిని సాధించటానికి జరిగాయి.
A) ఉపాధి హక్కు
B) ఆహార హక్కు
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

32. విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన రాజ్యాంగ సవరణ
A) 80
B) 69
C) 74
D) 86
జవాబు:
D) 86

33. ఉచిత, నిర్బంధ విద్యను బాలల హక్కు చట్టంగా అంతిమంగా చేసిన సంవత్సరం
A) 2009
B) 2010
C) 2011
D) 2012
జవాబు:
A) 2009

34. విద్య పిల్లలకు ఈ విధంగా దోహదపడాలని ఉచిత, నిర్బంధ బాలల హక్కు చట్టం చెబుతుంది.
A) గుదిబండలాగా
B) సర్వతోముఖాభివృద్ధికి
C) నిరంకుశత్వంగా
D) హింసమ ప్రేరేపించే విధంగా
జవాబు:
B) సర్వతోముఖాభివృద్ధికి

35. చదువు పిల్లలను కేంద్రంగా చేసుకుని ఈ పద్దతుల ద్వారా సాగాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది.
A) కృత్యాల ద్వారా
B) అన్వేషణ, పరిశోధన
C) ఆవిష్కరణ
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు

AP 8th Class Social Bits Chapter 18 హక్కులు – అభివృద్ధి

36. అధికారులపై పిల్లలు లేదా పెద్దవాళ్లు ఫిర్యాదు చేసే సందర్భం
A) పాఠశాలలు అందుబాటులో లేకపోయినప్పుడు
B) పాఠశాలల్లో బోధనకు తగినంతమంది టీచర్లు లేకపోయినప్పుడు
C) పిల్లలను కొట్టినా, భయభ్రాంతులను చేసినప్పుడు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ