Practice the AP 8th Class Social Bits with Answers 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Social Bits 10th Lesson బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు
1. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన ,గవర్నరు జనరల్ :
A) కారన్ వాలిస్
B) మన్రో
C) హేస్టింగ్స్
D) డలౌసీ
జవాబు:
A) కారన్ వాలిస్
2. ఈ క్రింది చిత్రంలోని ఆనకట్ట దీనికి సంబంధించినది
A) ధవళేశ్వరం
B) ప్రకాశం బ్యారేజ్
C) గాంధీ సాగర్
D) పైవేవి కావు
జవాబు:
B) ప్రకాశం బ్యారేజ్
3. ఖుదా కాస్తే అనగా
A) జమీందారుల నివాసాలు
B) జమీందారుల సొంతభూమి
C) కౌలు రైతుల భూమి
D) జమీందారులు వసూలు చేసే శిస్తు
జవాబు:
B) జమీందారుల సొంతభూమి
4. కాటన్ దొరను ప్రజలు ఆరాధిస్తారు. ఎందుకంటే?
A) రైతులకి ఋణమాఫీ చేయటంవల్ల
B) రైత్వారి పద్ధతిని ప్రవేశపెట్టడం వల్ల
C) గోదావరి నదిపై ఆనకట్టను నిర్మించటం వల్ల
D) నదుల అనుసంధానం చేయటంవల్ల
జవాబు:
C) గోదావరి నదిపై ఆనకట్టను నిర్మించటం వల్ల
5. కారన్ వాలీస్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ప్రవేశ పెట్టిన శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందాన్ని నీవు ఎలా అర్థం చేసుకున్నావు?
A) ఇది రైతాంగానికి మేలు చేసింది
B) జమిందార్లు వేలంలో అంగీకరించిన శిస్తూనే వసూలు చేసారు.
C) ఇది రైతాంగాన్ని కౌలుదార్లుగా మార్చింది.
D) జమిందారులు భూమిని అభివృద్ధి పరిచారు.
జవాబు:
C) ఇది రైతాంగాన్ని కౌలుదార్లుగా మార్చింది.
6. 1793లో భారతదేశంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు
A) కారన్ వాలీస్
B) విలియం బెంటింక్
C) వారన్ హేస్టింగ్స్
D) డస్ట్రోసీ
జవాబు:
A) కారన్ వాలీస్
7. బ్రిటీష్ వారు నాలుగు జిల్లాలను నిజాం నుండి పొందారు. వీటిని సీడెడ్ జిల్లాలు అంటారు. వాటిలో మూడు కర్నూలు, కడప, అనంతపురం ఐతే నాల్గవది
A) బళ్ళారి
B) నెల్లూరు
C) మైసూర్
D) చిత్తురు
జవాబు:
A) బళ్ళారి
8. ఈ క్రింది వాటిని పరిశీలించండి.
ఎ) ధవళేశ్వరం ఆనకట్ట
బి) కర్నూలు – కడప కాలవు
సి) ప్రకాశం బ్యారేజి
పైన తెలిపిన సాగునీటి పథకాలలో బ్రిటిషు వారిపాలనాకాలంలో నిర్మించినవి ఏవి?
A) ఎ, బి, మాత్రమే.
B) ఎ. సి మాత్రమే
C) బి, సి మాత్రమే
D) ఎ, బి, సి
జవాబు:
D) ఎ, బి, సి
9. ఆంధ్రప్రదేశ్ డెల్టా ప్రాంతాల ప్రజలు సర్ ఆర్థర్ కాటను గొప్ప ప్రేమ, గౌరవాలతో గుర్తు పెట్టుకుంటారు.
A) అవును, ఆయన నిర్మించిన ఆనకట్టలు ఆ ప్రాంతానికి సంపద తెచ్చి పెట్టాయి.
B) లేదు. అతని ఉద్యోగ ధర్మం మాత్రమే. అతనికి ప్రత్యేక మర్యాద చూపవలసిన పనిలేదు.
C) అతను ఆంగ్లేయుడు, అతని ప్రశంసించకూడదు.
D) అతను అంత ప్రత్యేకమైన వ్యక్తి కాదు.
జవాబు:
A) అవును, ఆయన నిర్మించిన ఆనకట్టలు ఆ ప్రాంతానికి సంపద తెచ్చి పెట్టాయి.
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
10. శాశ్వతశిస్తు ఒప్పందంలో జమీందారుల వాటా
A) 10
B) 15
C) 20
D) 50
జవాబు:
A) 10
11. అవధ్ ఈ రాష్ట్రంలోనిది.
A) మధ్య ప్రదేశ్
B) ఉత్తరప్రదేశ్
C) తెలంగాణ
D) హర్యానా
జవాబు:
B) ఉత్తరప్రదేశ్
12. అమెరికా అంతర్యుద్ధం ఈ సంవత్సరంలో ముగిసింది.
A) 1861
B) 1863
C) 1864
D) 1865
జవాబు:
D) 1865
13. నిజాం సొంత జాగీరును ……. అంటారు.
A) సర్ఫ్-ఎ-అమీన్
B) సర్ఫ్-ఎ-జమీనా
C) సర్ఫ్-ఎ-ఖాస్
D) సర్ఫ్-ఎ-ఖుదా
జవాబు:
C) సర్ఫ్-ఎ-ఖాస్
14. గంజాం రైతులను బికారులుగా మార్చిన పంట
A) వరి
B) గోధుమ
C) ప్రతి
D) చెరకు
జవాబు:
C) ప్రతి
15. కెసి కాలువ అంటే
A) కర్నూలు, కడప కాలువ
B) చిత్తరంజన్ దాస్ కాలువ
C) కర్నూలు, చిత్తూరు కాలువ
D) ఖమ్మం , కడప కాలువ
జవాబు:
A) కర్నూలు, కడప కాలువ
16. భూమిశిస్తు విధానం ……ను ప్రోత్సహించాలి.
A) రాజుల
B) పరిశ్రమల
C) కార్మికుల
D) వ్యవసాయాన్ని
జవాబు:
D) వ్యవసాయాన్ని
17. 1800 నవంబరులో రాయలసీమ ప్రధాన కలెక్టరు
A) కారన్‌వాలీస్
B) వెల్లస్లీ
C) డూప్లే
D) మన్రో
జవాబు:
D) మన్రో
18. ఈ సంవత్సరంలో ధవలేశ్వరం వద్ద గోదావరిపై ఆనకట్ట నిర్మాణం చేసారు.
A) 1549
B) 1649
C) 1749
D) 1849
జవాబు:
D) 1849
19. రైత్వారీ అంటే
A) రైతులకు సాగుహక్కు
B) రైతులకు భూమిశిస్తు
C) రైతులకు ఆదాయం
D) రైతులకు అప్పు
జవాబు:
A) రైతులకు సాగుహక్కు
20. 1861 లో అంతర్యుద్ధం మొదలైన దేశం
A) ఇంగ్లండ్
B) పాకిస్తాన్
C) అమెరికా
D) చైనా
జవాబు:
C) అమెరికా
21. ఉత్తరప్రదేశ్ లోని అవధ్ లో ఉద్యమాలు జరిగిన సంవత్సరం
A) 1920-22
B) 1922-24
C) 1924-26
D) 1928-30
జవాబు:
A) 1920-22
22. సాగునీటి సౌకర్యాలు లేని ఈ ప్రాంతంలో కరవులు తరచు సంభవిస్తాయి.
A) ఉత్తర కోస్తా
B) రాయలసీమ
C) ఆంధ్రా ప్రాంతం
D) సీడెడ్ ప్రాంతం
జవాబు:
B) రాయలసీమ
23. కర్నూలు – కడప (కె.సి. కెనాల్) కాలువ నిర్మాణం
A) 1650
B) 1750
C) 1857
D) 1950
జవాబు:
C) 1857
24. మొఘల్ చక్రవర్తుల పాలనలో రైతాంగం నుంచి వీరు శిస్తు వసూలు చేసి మొషుల్ అధికారులకు అందచేసేవారు.
A) కౌలుదార్లు
B) జమీందార్లు
C) భూస్వాములు
D) గుత్తేదార్లు
జవాబు:
B) జమీందార్లు
25. జమీందారులకు ఉన్న సొంత భూములు ఈ విధంగా పిలువబడ్డాయి.
A) ఇనాంలు
B) ఖుదార్లు
C) ఖిదమత్ గార్స్
D) పైవేవీ కావు
జవాబు:
B) ఖుదార్లు
26. జమీందారులకు ఉన్న పార్వాలు
A) శిస్తు వసూలు చేయటం
B) భూమి కలిగి ఉండటం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ
27. భారతదేశంలో బ్రిటిష్ వాళ్లు తమ ఆదాయం పెంచుకోవడానికి ఈ శిస్తును పెంచారు.
A) పుల్లరిపన్ను
B) ఆస్తిపన్ను
C) భూమిశిస్తు
D) గణాచారిపన్ను
జవాబు:
C) భూమిశిస్తు
28. భారతదేశం నుండి ఇంగ్లండు ఎగుమతి చేసిన వ్యవసాయ ఉత్పత్తులు
A) ప్రత్తి, నీలిమందు
B) చెరకు, గోధుమ
C) A, B లు
D) ఏవీకావు
జవాబు:
C) A, B లు
29. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టినది
A) వారన్ హేస్టింగ్స్
B) కారన్ వాలీస్
C) బెంటింక్
D) వెల్లస్లీ
జవాబు:
B) కారన్ వాలీస్
30. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడిన సంవత్సరం
A) 1790
B) 1791
C) 1792
D) 1793
జవాబు:
D) 1793
31. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి వల్ల జమీందారులు భూమి శిస్తు కాకుండా దీనిని వసూలు చేశారు.
A) వేలం వేయగా వచ్చినది
B) కౌలు
C) పండిన పంట
D) ఏదీకాదు
జవాబు:
B) కౌలు
32. మార్కెట్టులో ఆహారధాన్యాల ధరలు పెరుగుతుండటంతో సాగు మెల్లగా విస్తరింపబడిన సంవత్సరం
A) 1800
B) 1810
C) 1820
D) 1840
జవాబు:
C) 1820
33. సీడెడ్ జిల్లాలు అనగా
A) బళ్లారి, అనంతపురం
B) కడప
C) కర్నూలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
34. సీడెడ్ జిల్లాలకు మరో పేరు
A) రాళ్ళసీమ
B) కర్ణాటకం
C) రాయలసీమ
D) ఏదీకాదు
జవాబు:
C) రాయలసీమ
35. రాయలసీమ జిల్లాలకు కలెక్టర్ గా థామస్ మన్రో వచ్చిన సంవత్సరం
A) 1700
B) 1800
C) 1900
D) 1850
జవాబు:
B) 1800
36. ఉత్తర భారతదేశంలో మాదిరి దక్షిణాదిన జమీందారులు లేరని గుర్తించినది
A) బెంటింక్
B) థామస్ మన్రో
C) వెల్లస్లీ
D) రాబర్ట్ క్లైవ్
జవాబు:
B) థామస్ మన్రో
37. రైతుల ప్రాముఖ్యతను గుర్తించిన థామస్ మన్రో రైత్వారీ
స్థిరీకరణను ఈ భారతదేశ ప్రాంతాలలో ప్రవేశపెట్టాడు.
A) దక్షిణ భారతదేశం
B) పశ్చిమ భారతదేశం
C) పై రెండూ
D) ఉత్తర భారతదేశం
జవాబు:
C) పై రెండూ
38. రైత్వారీ అనగా
A) రైతు
B) రైతులకు సాగుహక్కు
C) భూమిశిస్తు
D) పైవన్నీ
జవాబు:
B) రైతులకు సాగుహక్కు
39. పంటలసాగు మొదలు కాకముందు విత్తనాలు, పరికరాలు, ఎడ్లు కొనడానికి, పాత బావులు మరమ్మతు చేయడానికి , కొత్త బావులు తవ్వడానికి రైతులకు మన్రో అప్పులు ఇప్పించడం ప్రారంభించిన సంవత్సరం
A) 1801 – 02
B) 1802 – 03
C) 1803 – 04
D) 1804 – 05
జవాబు:
A) 1801 – 02
40. సర్ ఆర్ధర్ కాటన్ అవిశ్రాంత కృషి వల్ల ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తయిన సంవత్సరం
A) 1840
B) 1845
C) 1849
D) 1850
జవాబు:
C) 1849
41. గోదావరి జిల్లాలో తీవ్రమైన కరవు వచ్చిన సంవత్సరం
A) 1800
B) 1830
C) 1833
D) 1836
జవాబు:
C) 1833
42. విజయవాడ వద్ద కృష్ణానదిపై ఆనకట్ట కట్టిన సంవత్సరం
A) 1850
B) 1852
C) 1853
D) 1854
జవాబు:
D) 1854
43. రైతులు ప్రభుత్వానికి చెల్లించే భూమి శిస్తు కంటే కౌలుదారులు ఎన్ని రెట్లు ఎక్కువ కౌలు చెల్లించేవారు?
A) 2 నుంచి 5
B) 3 నుంచి 7
C) 4 నుంచి 8
D) 5 నుంచి 9
జవాబు:
B) 3 నుంచి 7
44. రైతులు ఊరు విడిచి పారిపోవడానికి ప్రధాన కారణం
A) భూమి శిస్తు గణనీయంగా పెంచుట
B) అత్యాచారాలు జరుపుట
C) కఠిన శిక్షలు విధించుట
D) దొంగతనాలు జరుగుట
జవాబు:
A) భూమి శిస్తు గణనీయంగా పెంచుట
45. బ్రిటిష్ వారు పెట్టిన భూమి శిస్తు విధానం వల్ల
A) రైతులు అప్పులు పాలగుట
B) రైతులు అధిక వృద్ధిని సాధించుట
C) రైతులు అధిక పంటలు పండించుట
D) ఏదీకాదు
జవాబు:
A) రైతులు అప్పులు పాలగుట
46. అమెరికాలో అంతర్యుద్ధం తలెత్తిన సంవత్సరం
A) 1860
B) 1861
C) 1862
D) 1863
జవాబు:
B) 1861
47. అమెరికాలో అంతర్యుద్ధం ముగిసిన సంవత్సరం
A) 1865
B) 1867
C) 1873
D) 1877
జవాబు:
A) 1865
48. అమెరికాలో అంతర్యుద్ధం ప్రభావం భారతదేశం మీద చూపిన విధము
A) ప్రత్తికి గిరాకి తగ్గుట
B) ప్రత్తికి గిరాకి పెరుగుట
C) వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుట
D) వ్యవసాయ ఉతతుల ఎగుమతులు యదావిదిగా ఉండుట
జవాబు:
A) ప్రత్తికి గిరాకి తగ్గుట
49. ప్రత్తికి డిమాండ్ తగ్గడం వల్ల
A) రైతులు బికారులుగా మారారు.
B) ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది.
C) కరవు తాండవించింది.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
50. వలస పాలనలో భూస్వాములు వారి సొంత భూముల రైతాంగంతో బలవంతంగా, డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవడం
A) గడీలు
B) దొరలు
C) భూస్వాములు
D) పెత్తందారులు
జవాబు:
A) గడీలు
51. వెట్టి వాళ్ళ దీన స్థితి ఈ సంవత్సరపు నివేదిక ఆధారంగా తెలుస్తుంది.
A) 1800
B) 1870
C) 1878
D) 1880
జవాబు:
C) 1878
52. జమీందారుల ఇంటికి రైతులు నిత్యం ఉచితంగా సరఫరా చేయవలసినవి
A) నెయ్యి, పాలు
B) కూరగాయలు, బెల్లం
C) గడ్డి, పిడకలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
53. రైతులు తమ భూములు బాగుచేసుకుంటే తమ హక్కుల కోసం పోరాడతారన్న భయంతో కూడా ఆ పనులు చేయకుండా వాళ్లకు అడ్డుపడేవారు
A) రైతులు
B) భూస్వాములు
C) జమీందార్లు
D) కూలీలు
జవాబు:
C) జమీందార్లు
54. జాగీర్దారులు, సంస్థానాలు, ఇనాందారులు వంటి వాళ్లు తాము వసూలు చేసిన భూమిశిస్తులో కొంత భాగాన్ని నిజాంకు చెల్లించేవారు. నిజాంకు చెల్లించే వాటాను ఈ విధంగా పిలుస్తారు.
A) హిందుకుష్
B) పేష్కష్
C) ఇనాం
D) అడంగల్
జవాబు:
B) పేష్కష్
55. హైదరాబాద్ రాష్ట్రంలో 6535 గ్రామాలతో 1500 జాగీర్లు, 497 గ్రామాలతో ఉన్న సంస్థానాల సంఖ్య
A) 10
B) 12
C) 13
D) 14
జవాబు:
D) 14
56. 19వ శతాబ్దపు తొలి సగంలో హైదరాబాద్ నిజాం వీరి ద్వారా సాధ్యమైనంత, ఎక్కువ భూమిశిస్తు వసూలు చేయటానికి ప్రయత్నించారు.
A) కుద్రముఖ్
B) దేశ్ ముఖ్
C) పట్వారీ
D) పటేల్
జవాబు:
B) దేశ్ ముఖ్
57. నిజాం పాలనలోని పెద్ద పెద్ద భూస్వాములను ఈ విధంగా వ్యవహరించేవారు.
A) వెట్టి
B) బలవంతపు చాకిరి
C) సేవలు పొందడం
D) ఏదీకాదు
జవాబు:
B) బలవంతపు చాకిరి
58. ఆంధ్ర ప్రాంతం కూడా తీవ్ర కరవులతో కుదేలయ్యిన శతాబ్దం
A) 19
B) 20
C) A, B లు
D) ఏవీకావు
జవాబు:
C) A, B లు
59. గంజాం ప్రాంతంలో తీవ్రమైన కరవు సంభవించినది
A) 1865 – 66
B) 1867 – 68
C) 1869 – 70
D) 1870 – 71
జవాబు:
A) 1865 – 66