These AP 8th Class Physical Science Important Questions 6th Lesson ధ్వని will help students prepare well for the exams.
AP Board 8th Class Physical Science 6th Lesson Important Questions and Answers ధ్వని
8th Class Physics 6th Lesson ధ్వని 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే నినాదాన్ని రాయండి.
జవాబు:
“కఠోరమైన ధ్వనులు- కర్ణభేరికి హానికారకాలు”.
ప్రశ్న 2.
ధ్వని ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతుంది?
జవాబు:
కంపనం చేస్తున్న వస్తువు నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది.
ప్రశ్న 3.
మానవ శరీరంలో ధ్వని ఉత్పత్తికి ఉపయోగపడే ముఖ్యమైన భాగం ఏది?
జవాబు:
స్వరపేటిక
ప్రశ్న 4.
చెవిలో ఎన్ని భాగాలుంటాయి? అవి ఏవి?
జవాబు:
చెవిలో మూడు భాగాలుంటాయి అవి :
- బయటిచెవి భాగము
- మధ్యచెవి భాగము
- లోపలిచెవి భాగము
ప్రశ్న 5.
కంపన పరిమితి అనగానేమి?
జవాబు:
వస్తువు విరామ స్థానం నుండి పొందిన గరిష్ట స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అంటారు.
ప్రశ్న 6.
పౌనఃపున్యము అనగానేమి?
జవాబు:
ఒక వస్తువు 1 సెకనులో చేసే కంపనాల సంఖ్యను పౌనఃపున్యము అంటారు.
ప్రశ్న 7.
ఒక మనిషి ధ్వనులను ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడే అవయవాలను రాయండి.
జవాబు:
స్వరతంత్రులు, పెదవులు, పళ్లు, నాలుక, ముక్కు మరియు గొంతు.
ప్రశ్న 8.
సంగీతం అనగానేమి?
జవాబు:
ఒక క్రమపద్ధతిలో వినసొంపుగా ఉండే ధ్వనుల కలయికను సంగీతం అంటారు.
ప్రశ్న 9.
కఠోర ధ్వనులు అనగానేమి?
జవాబు:
వినడానికి ఇంపుగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అంటారు.
ప్రశ్న 10.
శ్రవ్య ధ్వనులు అనగానేమి?
జవాబు:
సాధారణ మానవుడు వినగలిగే ధ్వనులను శ్రవ్య ధ్వనులు అంటారు.
ప్రశ్న 11.
మానవులు వినగలిగే శ్రవ్య ధ్వనుల అవధులను వ్రాయండి.
జవాబు:
శ్రవ్య ధ్వనుల అవధి 20 హెర్ట్ నుండి 20,000 హెర్ట్ వరకు ఉంటుంది.
ప్రశ్న 12.
ధ్వని కాలుష్యం అనగానేమి?
జవాబు:
మన పరిసరాలలో అనవసరమైన ధ్వనుల వలన వాతావరణం కలుషితం అవుటను ధ్వని కాలుష్యం అంటారు.
ప్రశ్న 13.
మీ పరిసరాలలో మీరు గమనించిన ధ్వని కాలుష్యాలను వ్రాయండి.
జవాబు:
వాహనాల ధ్వని, పరిశ్రమలలోని ధ్వనులు, విమానాల నుండి వచ్చే ధ్వనులు, మిక్సర్ గ్రైండర్, వాషింగ్ మిషన్ల నుండి వచ్చే ధ్వనులు, బాంబులు పేలినప్పుడు మరియు దీపావళి టపాకాయలు కాల్చినప్పుడు వచ్చే ధ్వనులు.
ప్రశ్న 14.
కార్పెట్ తలంపై నడిచినపుడు ధ్వని మృదువుగా ఉంటుంది. ఎందుకు?
జవాబు:
కార్పెట్ తలంపై నడిచినపుడు ధ్వని యొక్క కంపనపరిమితిని కార్పెట్ తగ్గిస్తుంది. కాబట్టి ధ్వని మృదువుగా ఉంటుంది.
ప్రశ్న 15.
ధ్వని తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుందో తెల్పండి.
జవాబు:
ధ్వని తీవ్రత ధ్వని యొక్క కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న 16.
కీచుదనము (పిచ్) దేనిపై ఆధారపడి ఉంటుంది?
జవాబు:
కీచుదనము (పిచ్) ధ్వని యొక్క పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న 17.
కీచుదనము (పిచ్)కు రెండు ఉదాహరణలు తెల్పండి.
జవాబు:
1) ధ్వని యొక్క పౌనఃపున్యం పెరిగితే కీచుదనము (పిచ్) పెరుగును.
2) పక్షి చేసే ధ్వనిలో ఎక్కువ కీచుదనము మరియు సింహం గర్జనలో తక్కువ కీచుదనము ఉంటుంది.
ప్రశ్న 18.
అధిక శబ్దం మానవులకు హానికరం. ఎందుకు?
జవాబు:
అధిక శబ్దాలు మానవుల కర్ణభేరిని పాక్షికంగా గాని లేదా పూర్తిగా గాని పాడుచేస్తాయి. కాబట్టి అధిక శబ్దం హానికరం.
ప్రశ్న 19.
పురుషులలో స్వరతంత్రుల పొడవు ఎంత?
జవాబు:
పురుషులలో స్వరతంత్రుల పొడవు 20 మిల్లీ మీటర్లు ఉంటుంది.
ప్రశ్న 20.
మహిళలలో స్వరతంత్రుల పొడవు ఎంత?
జవాబు:
మహిళలలో స్వరతంత్రుల పొడవు 15 మిల్లీ మీటర్లు.
ప్రశ్న 21.
పెదాలు కదపకుండా మాట్లాడే వారిని ఏమంటారు?
జవాబు:
పెదాలు కదపకుండా మాట్లాడే వారిని “వెంట్రిలాక్విస్టులు” అంటారు.
ప్రశ్న 22.
ధ్వని తీవ్రతను కొలుచుటకు ప్రమాణాన్ని ఏమంటారు?
జవాబు:
డెసిబెల్ (“dB” గా సూచిస్తారు).
ప్రశ్న 23.
సాధారణంగా మానవుని యొక్క సంభాషణ ధ్వని తీవ్రత ఎంత?
జవాబు:
60dB (డెసిబెల్).
ప్రశ్న 24.
విశ్వవిఖ్యాత షెహనాయ్ వాయిద్య నిపుణుడు ఎవరు?
జవాబు:
బిస్మిల్లాఖాన్
ప్రశ్న 25.
మానవుని మధ్యచెవి భాగంలోని తేలికైన మూడు ఎముకల పేర్లు రాయండి.
జవాబు:
మ్యాలియస్, ఇంకస్ మరియు స్టీన్లు. ఇవి ఘనస్థితిలో ఉంటాయి.
ప్రశ్న 26.
మానవుని లోపలిచెవి భాగాన్ని ఏమంటారు?
జవాబు:
కోక్లియా. ఇది చిక్కని ద్రవంతో నింపబడి ఉంటుంది.
ప్రశ్న 27.
ధ్వని ప్రసరణపై గాలిలో తేమ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెల్పండి.
జవాబు:
గాలిలో తేమ పెరుగుతూ ఉంటే ధ్వని ప్రసరణ పెరుగును.
ప్రశ్న 28.
తబలపై గల పొర వదులుగా ఉన్నపుడు కంటే గట్టిగా బిగించినపుడు ధ్వని కీచుదనము (పిచ్) ఎక్కువగా ఉంటుంది. ఎందుకు?
జవాబు:
తబలపై గల పొర వదులుగా ఉన్నపుడు కంటె గట్టిగా బిగించినపుడు విడుదలయ్యే ధ్వని యొక్క పౌనఃపున్యము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధ్వని కీచుదనము (పిచ్) ఎక్కువగా ఉంటుంది.
ప్రశ్న 29.
మీ నోట్ బుక్ లో కాగితాల మధ్యకు నోటితో గాలి ఊదినపుడు ధ్వని ఉత్పత్తి అవుతుంది కదా! ఈ కృత్యంలో మీ పరిశీలనలను రాయండి.
జవాబు:
- కాగితాలు కంపనం చెందుతాయి.
- కాగితాలు ముందుకు, వెనుకకు కదులుతాయి.
- కాగితాలు కదలడం వలన ధ్వని ఉత్పత్తి అవుతుంది.
ప్రశ్న 30.
కార్పెట్ మీద నడుస్తున్నప్పుడు ఎక్కువ శబ్దం రాదు ఎందుకు?
జవాబు:
కార్పెట్ ధ్వనిని శోషణం చేసుకొనును. కనుక తక్కువ శబ్దం వస్తుంది.
(లేదా)
కార్పెట్ మృదువుగా ఉంటుంది కనుక తక్కువ కంపనాలను ఉత్పత్తి చేయును కనుక శబ్దం తక్కువగా వస్తుంది.
8th Class Physics 6th Lesson ధ్వని 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
ధ్వని కాలుష్యం జీవ వైవిధ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?
జవాబు:
- దీపావళి ఔట్లు పేల్చినప్పుడు, డైనమైట్లతో కొండరాళ్లను పేల్చినప్పుడు పక్షులు గోల చేస్తూ చెల్లాచెదురుగా తమ ఆవాసాలను వీడి ఎగిరిపోతాయి.
- కర్ణ కఠోరమైన ధ్వనులు వింటే పసిపిల్లలలో కర్ణభేరి చెడిపోయి వినికిడి శక్తి తగ్గవచ్చు.
ప్రశ్న 2.
ధ్వని తీవ్రతకు, కీచుదనము (పిచ్)కు గల భేదాలను వ్రాయండి.
జవాబు:
ధ్వని తీవ్రత | కీచుదనము (పిచ్) |
1) ధ్వని తీవ్రత కంపనాల కంపనపరిమితిపై ఆధారపడును. | 1) ధ్వని యొక్క కీచుదనము (పిచ్) దాని పౌనఃపున్యముపై ఆధారపడి ఉంటుంది. |
2) దీని యొక్క పౌనఃపున్యము మారదు. | 2) కీచుదనముతో పౌనఃపున్యము మారును. |
ప్రశ్న 3.
పురుషులు, మహిళలు మరియు పిల్లల స్వరాలలో తేడాలు ఎందుకు ఉంటాయి?
జవాబు:
- పురుషులు, మహిళలు మరియు పిల్లల స్వరాలలో తేడాలకు కారణము స్వరతంత్రులు.
- పురుషుల స్వరతంత్రుల పొడవు 20 మిల్లీ మీటర్లు.
- మహిళల స్వరతంత్రుల పొడవు 15 మి.మీ.
- పిల్లల స్వరతంత్రుల పొడవు మహిళల కంటే చాలా తక్కువగా ఉంటుంది. కావున స్వరాలలో తేడాలు ఉంటాయి.
ప్రశ్న 4.
నివాస ప్రాంతాలలో ధ్వని కాలుష్యాన్ని ఏ విధంగా నియంత్రించాలో రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
- నివాస ప్రాంతాలకు దూరంగా పరిశ్రమలను నిర్మించాలి.
- వాహనాల హారన్లను అవసరమైనపుడు మాత్రమే ఉపయోగించాలి.
- రోడ్ల వెంబడి మరియు ఇండ్ల చుట్టూ చెట్లను పెంచాలి.
ప్రశ్న 5.
వేసవి, శీతాకాలాలలో గాలిలో ధ్వని ప్రసారంలో గల తేడాను తెల్పండి.
జవాబు:
- గాలిలో తేమ ఎక్కువగా ఉండుట వల్ల వేసవికాలంలో ధ్వని ప్రసరణ ఎక్కువగా ఉంటుంది.
- శీతాకాలంలో ధ్వని ప్రసరణ తక్కువగా ఉంటుంది.
ప్రశ్న 6.
ధ్వని తీవ్రత దేనిపై ఆధారపడి ఉండునో వివరించండి.
జవాబు:
- ధ్వని తీవ్రత ధ్వని యొక్క కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది.
- ధ్వని యొక్క కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని తీవ్రత ఎక్కువగా ఉండి బిగ్గరగా ఉండే ధ్వని ఏర్పడుతుంది.
- ధ్వని యొక్క కంపన పరిమితి తక్కువగా ఉంటే ధ్వని తీవ్రత తక్కువగా ఉండి మృదువుగా ఉండే ధ్వని ఏర్పడుతుంది.
ప్రశ్న 7.
ఒక సంగీత వాయిద్యం ధ్వనిని ఉత్పత్తి చేయడం వలన గమనించింది. కానీ ఆ వాయిద్యంలో ఏ భాగము కంపనాలు చెందడం ఆమె గుర్తించలేకపోయినది. ఈ పరిశీలన వల్ల ఆమె మెదడులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఆ ప్రశ్నలు ఏమిటో మీరు ఊహించి ఏవైనా రెండిటిని రాయండి.
జవాబు:
- కంపనాలు లేకుండా ధ్వని ఉత్పత్తి అవుతుందా?
- పరికరంలో ఏ భాగం కంపనాలు చేస్తుంది?
- అది ధ్వనిని ఏ విధంగా ఉత్పత్తి చేస్తుంది?
ప్రశ్న 8.
కింది పట్టికను పూరింపుము.
జవాబు:
కంపించే భాగం | వాయిద్య పరికరం |
సాగదీయబడిన పొర | తబల, డప్పు, ఢంకా |
సాగదీయబడిన తీగ | వీణ, గిటార్, వయోలిన్ |
8th Class Physics 6th Lesson ధ్వని 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
స్వరపేటిక నిర్మాణాన్ని మరియు ధ్వని ఉత్పత్తి అయ్యే విధానాన్ని వివరించండి.
జవాబు:
1) స్వరపేటిక నిర్మాణము :
స్వర పేటికలో స్వరతంత్రులు అనే కండర నిర్మాణాలు ఉంటాయి. ఇవి స్వరపేటికకు అడ్డంగా ఉంటాయి. వాటి మధ్యనున్న చీలిక ద్వారా గాలిని బయటకు పంపడం ద్వారా ధ్వనులను సృష్టించేందుకు ఉపయోగపడతాయి.
2) ధ్వని ఉత్పత్తయ్యే విధానము :
శ్వాస పీల్చినపుడు స్వరతంత్రులు తెరచుకొని గాలి ఊపిరితిత్తులలోనికి వెళుతుంది. మాట్లాడేటపుడు స్వరతంత్రులు మూసుకుపోతాయి. ఊపిరితిత్తుల నుండి వెలువడిన గాలి స్వరతంత్రుల మధ్య బంధించబడటం వల్ల కంపనాలకు గురవుతుంది. ఫలితంగా ధ్వని ఉత్పత్తి అవుతుంది.
ప్రశ్న 2.
చెవి నిర్మాణం – పనిచేయు విధానమును వివరించండి.
జవాబు:
మన చెవిలో మూడు భాగాలుంటాయి. అవి :
- బయటి చెవి భాగము,
- మధ్యచెవి భాగము,
- లోపలి చెవి భాగము.
1) బయటి చెవి భాగము :
చెవి వెలుపలి భాగం (పిన్నా) చెవి వెలుపలి భాగం చెవి రంధ్రం ద్వారా చివర కర్ణభేరికి కలుపబడి చెవి మధ్యభాగం ఉంటుంది. అతి పలుచని సున్నితమైన వృత్తాకార పొరను కర్ణభేరి అంటారు.
2) మధ్య చెవి భాగము :
మధ్య చెవిలో అతి తేలికైన మూడు చిన్న ఎముకలు మ్యాలియస్ (సుత్తి ఆకారం), ఇంకస్ (అనివిల్ ఆకారం) మరియు స్టీవ్స్ (ప్రప్ ఆకారం)లో ఉంటాయి. ఇవి కర్ణభేరి నుండి లోపలి చెవి భాగానికి కలుపబడి ఉంటాయి.
3) లోపలి చెవి భాగము :
దీనిలో కోక్లియా ఉంటుంది. కోక్లియా చిక్కనైన ద్రవాన్ని మరియు సన్నని వెంట్రుకల వంటి నరాలను కలిగి ఉంటుంది.
చెవి పనిచేయు విధానము :
- చెవి వెలుపలి భాగం (పిన్నా) ద్వారా ధ్వని కంపనాలు చెవి రంధ్రం గుండా కర్ణభేరికి పంపబడతాయి.
- ఈ కంపనాలు కర్ణభేరిని కంపింపజేస్తాయి.
- కంపిస్తున్న కర్ణభేరి కంపనాలను మధ్య చెవిలోకి పంపిస్తుంది.
- మధ్య చెవిలో పంపిన కంపనాలను మ్యాలియస్, ఇంకస్ మరియు స్టీప్ ఎముకలు కంపనాలను పెద్దవిగా చేస్తాయి.
- ఈ కంపనాలను స్టీవ్స్ ఓవల్ విండోకి చేర్చుతాయి. ఓవల్ విండో కర్ణభేరి తలంలో 1/20 వంతు మాత్రమే ఉంటుంది. కావున కంపనాలు 30 నుండి 60 రెట్లు పెంచబడతాయి.
- ఓవల్ విండో నుండి బయలుదేరిన కంపనాలు లోపలి చెవి భాగంలోని కోక్లియాకు పంపబడతాయి.
- కోక్లియా చిక్కనైన ద్రవాలతో నిండి ఉండి ఈ కంపనాలను ప్రసారం చేస్తుంది.
- ఇక్కడ గ్రహించిన కంపనాలు సన్నని వెంట్రుకల వంటి నరాలు గ్రహించి దానికనుగుణంగా కదలడం ద్వారా విద్యుత్ తరంగాలుగా మారి మెదడుకు చేరతాయి.
- మెదడులోని శ్రవణ నాళాలు ధ్వనిని గ్రహించి జ్ఞానాన్ని అందించడం వల్ల ధ్వనిని వినగలుగుతాం.
ప్రశ్న 3.
నివాస ప్రాంతాలలో ధ్వని కాలుష్యాన్ని ఏ విధంగా నియంత్రణ చేయాలి?
జవాబు:
- నివాస ప్రాంతాలకు దూరంగా పరిశ్రమలను నిర్మించాలి.
- వాహనాల హారన్లను అవసరమైనపుడు మాత్రమే ఉపయోగించాలి.
- వాహనాలకు సైలెన్సర్లు బిగించడం ద్వారా ధ్వని తీవ్రతను తగ్గించాలి.
- రోడ్ల వెంబడి మరియు ఇండ్ల చుట్టూ చెట్లను పెంచాలి.
- టివి, రేడియోల సౌండ్ చాలా తక్కువ ఉపయోగించాలి.
పై నియమాలు పాటించినపుడు నివాస ప్రాంతాలలో ధ్వని కాలుష్యం తగ్గించవచ్చును.
ప్రశ్న 4.
కీచుదనము (పిచ్) దేనిపై ఆధారపడి ఉంటుంది? ఉదాహరణలతో వివరించండి.
జవాబు:
- కీచుదనము (పిచ్) ధ్వని యొక్క పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుంది.
- ధ్వని యొక్క పౌనఃపున్యం పెరిగితే కీచుదనము (పిచ్) పెరుగును.
- ధ్వని యొక్క పౌనఃపున్యం తగ్గితే కీచుదనము తగ్గుతుంది.
- పక్షి ధ్వనిలో ఎక్కువ పౌనఃపున్యం మరియు సింహం గర్జనలో తక్కువ పౌనఃపున్యం ఉంటుంది.
- పక్షి చేసే ధ్వనిలో ఎక్కువ కీచుదనము మరియు సింహం గర్జనలో తక్కువ కీచుదనము ఉంటుంది.
ప్రశ్న 5.
ధ్వని కాలుష్యానికి దారితీసే ధ్వనులను పేర్కొనండి. ధ్వని కాలుష్య ప్రభావాలను వివరింపుము. ధ్వని కాలుష్యాన్ని నియంత్రించే నాలుగు చర్యలను సూచించండి.
జవాబు:
ధ్వని కాలుష్యానికి కారణాలు :
- పరిశ్రమల నుండి వెలువడు ధ్వని.
- వాహనాలకు సైలెన్సర్లు లేకపోవడం.
- టపాకాయల పేలుడు నుండి వచ్చు ధ్వని.
- గనుల పేలుడు నుండి వచ్చు ధ్వని.
- ఫౌండరీల నుండి వచ్చు ధ్వనులు.
ధ్వని కాలుష్య ప్రభావాలు :
- వినికిడి శక్తిని కోల్పో వుట.
- నిద్రలేమి ఏర్పడును.
ఆరోగ్య సమస్యలు. - రక్తపోటు పెరుగును.
- గుండె సంబంధ వ్యాధులు రావచ్చు.
ధ్వని కాలుష్యానికి నివారణ చర్యలు :
- ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు చెట్లను విరివిగా పెంచడం.
- వాహనాలకు, ఇతర మిషన్లకు సైలెన్సర్లు బిగించడం.
- పరిశ్రమలను, విమానాశ్రయాలను నివాస ప్రాంతాలకు దూరంగా నిర్మించడం.
- టి.వి, టేప్ రికార్డులు, రేడియోలను ఉపయోగించేటప్పుడు ధ్వని స్థాయి తగ్గించడం.
8th Class Physics 6th Lesson ధ్వని 1 Mark Bits Questions and Answers
బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. జలతరంగణి పనిచేయు విధానం
A) గాలి స్థంభం ఎత్తులలో తేడా వలన
B) తీగ పొడవులలో తేడా వలన
C) చర్మపు పొర యొక్క వైశాల్యంలో తేడా వలన (చర్మపుపొర)
D) పైవన్నియు
జవాబు:
A) గాలి స్థంభం ఎత్తులలో తేడా వలన
2. శబ్దం క్రింది విధంగా ఉత్పత్తి అవుతుంది.
A) ఒక వస్తువు చలనంలో ఉన్నప్పుడు
B) ఒక వస్తువు పడటం వలన
C) ఒక వస్తువు ఎగరడం వలన
D) ఒక వస్తువు కంపనాలు చేయడం వలన
జవాబు:
D) ఒక వస్తువు కంపనాలు చేయడం వలన
3. స్వరతంత్రులు ఇందులో ఉంటాయి.
A) స్వరపేటిక
B) నోరు
C) అస్యకుహరం
D) నాసికా కుహరం
జవాబు:
A) స్వరపేటిక
4. స్వరపేటిక : 1 : : స్వరతంత్రులు : ?
A) 1
B) 2
C) 3
D) 7
జవాబు:
B) 2
5. P : శబ్దం ఘన పదార్థాలలో ప్రయాణించగలదు.
Q : శబ్దం ద్రవ, వాయు పదార్థాలలో ప్రయాణించగలదు.
A) P మరియు Q లు రెండూ సరియైనవి
B) P మాత్రమే సరియైనది
C) Q మాత్రమే సరియైనది
D) P మరియు Q లు రెండూ సరియైనవి కావు
జవాబు:
A) P మరియు Q లు రెండూ సరియైనవి
6. భావన (P) : ఒక వస్తువుపై అధిక శక్తిని ఉపయోగించి కంపింపజేసినపుడు శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
కారణం (Q) : శబ్ద తీవ్రత వస్తువు యొక్క కంపన పరిమితిపై ఆధారపడును.
A) P, Q లు సరైనవి
B) P మాత్రమే సరైనది
C) Q మాత్రమే సరైనది
D) P, Qలు సరికావు
జవాబు:
A) P, Q లు సరైనవి
7. శబ్దతీవ్రత : a : : పిచ్ (కీచుదనం) : b
A) a = పౌనఃపున్యం, b = కంపన పరిమితి
B) a = పౌనఃపున్యం, b = తరంగదైర్యం
C) a = కంపనపరిమితి, b = పౌనఃపున్యం
D) a = కంపనపరిమితి, b = తరంగదైర్యం
జవాబు:
C) a = కంపనపరిమితి, b = పౌనఃపున్యం
8. సరియైన జతలు
a) పౌనఃపున్యం i) మీటరు
b) కంపన పరిమితి ii) డెసిబెల్
c) శబ్దతీవ్రత iii) హెర్జ్
A) a-iii, b-ii, c-i
B) a-i, b-ii, c-iii
C) a-i, b-iii, c-ii
D) a-iii, b-i, c-ii
జవాబు:
D) a-iii, b-i, c-ii
9. శబ్ద ఉత్పత్తి : ………….. : : శబ్దగ్రహణం : కర్ణభేరి
A) అస్యకుహరం
B) స్వరతంత్రులు
C) స్వరనాడి
D) కోక్లియా
జవాబు:
B) స్వరతంత్రులు
10. క్రింది వానిని జతపర్చుము.
a) మ్యాలియస్ 1) సుత్తి ఆకారం
b) ఇంకస్ 2) అనివిర్ ఆకారం
c) స్టీప్స్ 3) స్టిరప్ ఆకారం
A) a-1, b-3, c-2
B) a-2, b-3, c-1
C) a-3, b-2, c-1
D) a-1, b-2, c-3
జవాబు:
A) a-1, b-3, c-2
11. P : తలపై వేళ్లతో కొట్టినపుడు పుర్రె నుండి శబ్దాలు నేరుగా మెదడుకి చేరును.
Q : మనం కర్ణభేరి లేకుంటే శబ్దాలు వినలేం.
A) P, Q లు సరైనవి, P ని Q సమర్థించును
B) P, Q లు సరైనవి కావు
C) P, Q లు సరైనవి, కానీ, P ని Q సమర్థించదు
D) P తప్పు, Q సరైనది
జవాబు:
A) P, Q లు సరైనవి, P ని Q సమర్థించును
12. క్రింది వానిని జతపర్చుము.
a) నిశ్శబ్దానికి సమీప ధ్వ ని i) 60 dB
b) సాధారణ సంభాషణ ii) 110 dB
c) కారు హారన్ iii) 0 dB
A) a-i, b-ii, c-iii
B) a-iii, b-ii, c-i
C) a-iii, b-i, c-ii
D) పైవేవీ కావు
జవాబు:
C) a-iii, b-i, c-ii
13. క్రింది వానిలో ధ్వని లక్షణం కానిది
A) ధ్వని తీవ్రత
B) ధ్వని మృదుత్వం
C) ధ్వని కంపనపరిమితి
D) ఏదీకాదు
జవాబు:
D) ఏదీకాదు
14. ఈ క్రింది వాటిలో ధ్వని ప్రసరణ జరగని యానకము
A) ఘన పదార్థాలు
B) ద్రవాలు
C) వాయువులు
D) శూన్యం
జవాబు:
D) శూన్యం
15. ఈ క్రింద ఉన్న వారిలో ఎవరికి అత్యల్ప పౌనఃపున్యం గల వాయిస్ ఉంటుంది?
A) బాలికలకు
B) బాలురకు
C) మహిళలకు
D) పురుషులకు
జవాబు:
D) పురుషులకు
16. కంపిసున్న వసువు ఉతుతి చేయునది.
A) ధ్వని
B) శక్తి
C) పీడనము
D) సాంద్రత
జవాబు:
A) ధ్వని
17. ఒక వస్తువు విరామస్థానం నుండి పొందే గరిష్ఠ స్థానభ్రంశము
A) పౌనఃపున్యము
B) కంపనము
C) కంపనపరిమితి
D) కఠోర ధ్వని
జవాబు:
C) కంపనపరిమితి
18. అధిక ధ్వ ని ప్రసరణ గల పదార్థాలు
A) ఘన పదార్థాలు
B) ద్రవ పదార్థాలు
C) వాయు పదార్థాలు
D) శూన్యం
జవాబు:
A) ఘన పదార్థాలు
19. వాయు వాయిద్యాలకు ఉదాహరణ
A) తబల
B) జలతరంగిణి
C) వీణ
D) విజిల్
జవాబు:
D) విజిల్
20. కంపనాల కంపన పరిమితి ద్వారా తెలుసుకోగలిగినది.
A) ధ్వని తీవ్రత
B) కీచుదనము
C) క్వా లిటీ
D) పైవన్నీ
జవాబు:
A) ధ్వని తీవ్రత
21. ఈ క్రింది వానిలో విభిన్న సంగీత వాయిద్యము
A) గిటార్
B) సితార్
C) వీణ
D) పిల్లనగ్రోవి
జవాబు:
D) పిల్లనగ్రోవి
22. స్పూన్ తో కొట్టినపుడు ధ్వనిని ఉత్పత్తి చేసే వాయిద్యం
A) జలతరంగిణి
B) విజిల్
C) పిల్లనగ్రోవి
D) వీణ
జవాబు:
A) జలతరంగిణి
23. మానవ శరీరంలో ధ్వనిని ఉత్పత్తి చేసేది
A) నాసికాకుహరం
B) స్వరపేటిక
C) ఊపిరితిత్తులు
D) ఏదీకాదు
జవాబు:
B) స్వరపేటిక
24. ధ్వని ప్రసరణ ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది.
A) వేసవి
B) చలి
C) వర్షా
D) పై అన్ని కాలాలలో
జవాబు:
A) వేసవి
25. శ్రవ్యధ్వని పౌనఃపున్య అవధి
A) 20 హెర్ట్ – 2000 హెర్ట్
B) 20 హెర్జ్ – 20,000 హెర్ట్
C) 20 కి హెర్ట్ – 20,000 కి హెర్ట్
D) 2 కి హెర్ట్ – 2,000 కి హెర్ట్
జవాబు:
B) 20 హెర్జ్ – 20,000 హెర్ట్
26. ధ్వని తీవ్రతకు ప్రమాణాలు.
A) హెర్ట్
B) సైకిల్ /సెకన్
C) డెసిబెల్
D) జెల్
జవాబు:
C) డెసిబెల్
27. ఈ క్రింది వానిలో అధిక కీచుదనం (పిచ్)గల ధ్వనిని ఉత్పత్తి చేసేది
A) సింహం
B) పురుషుడు
C) మహిళ
D) కీటకం
జవాబు:
D) కీటకం
28. ధ్వనిని అధ్యయనం చేయు శాస్త్రము
A) నిరూపక జ్యా మితి
B) అకౌస్టిక్స్
C) డైనమిక్స్
D) స్టాటిస్టిక్స్
జవాబు:
B) అకౌస్టిక్స్
29. ఈ క్రింది వాటిలో ధ్వనిని ఉత్పత్తి చేయు వస్తువు
A) కదలికలో ఉన్న లఘులోలకం
B) ఆగివున్న బస్సు
C) కంపిస్తున్న బడి గంట
D) ఏదీకాదు
జవాబు:
C) కంపిస్తున్న బడి గంట
30. కంపనం చెందుతున్న వస్తువు నుండి వెలువడునవి
A) అయస్కాంత బలరేఖలు
B) ధ్వని తరంగాలు
C) యాంత్రిక బలము
D) గురుత్వాకర్షణ శక్తి
జవాబు:
B) ధ్వని తరంగాలు
31. మానవ శరీరంలో ధ్వని .ఉత్పత్తి కారకము
A) చేతులు
B) కాళ్ళు
C) స్వరపేటిక
D) నాలుక
జవాబు:
C) స్వరపేటిక
32. ధ్వని తరంగాల ప్రయాణంకు అవసరమైనది
A) శూన్యం
B) యానకం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) యానకం
33. శూన్యంనందు ధ్వని ప్రసారం జరుగదు అని తెల్పినవారు
A) రాబర్ట్ బాయిల్
B) న్యూటన్
C) ఐన్ స్టీన్
D) అందరూ
జవాబు:
A) రాబర్ట్ బాయిల్
34. శబ్దం ఉత్పత్తికి కారణమైన ఒక వస్తువు స్థితి
A) వేడిచేయటం
B) ప్రకంపించుట
C) అయస్కాంతీకరించుట
D) విద్యుదావేశపరచుట
జవాబు:
B) ప్రకంపించుట
35. ప్రకంపనంలో ఉన్న వస్తువు ఒక సెకనులో చేసే ప్రకంపనాలను ఏమంటారు?
A) తరంగదైర్ఘ్యం
B) పౌనఃపున్యం
C) తీవ్రత
D) స్థితి
జవాబు:
B) పౌనఃపున్యం
36. క్రింది పదార్థాలలో ధ్వని ప్రసరణకు అనువుగా లేనిది
A) ఊక
B) ఇనుము
C) రాగి
D) ఇత్తడి
జవాబు:
A) ఊక
37. విశ్వాంతరాళంలో ధ్వని విలువ
A) అధికము
B) అల్పము
C) శూన్యము
D) చెప్పలేము
జవాబు:
C) శూన్యము
38. ఈ కింది వాటిలో ధ్వని కల్గి ఉండునది
A) శక్తి
B) దిశ
C) బరువు
D) ద్రవ్యరాశి
జవాబు:
A) శక్తి
39. పురుషులలో స్వరతంత్రుల పొడవు
A) 20 మి.మీ.
B) 5 మి.మీ.
C) 10 మి.మీ.
D) 14 మి.మీ.
జవాబు:
A) 20 మి.మీ.
40. స్త్రీలలో స్వరతంత్రుల పొడవు
A) 20 మి.మీ.
B) 5 మి.మీ.
C) 10 మి.మీ.
D) 14 మి.మీ.
జవాబు:
B) 5 మి.మీ.
41. ఈ కింది వాటిలో ధ్వని కంపించే పౌనఃపున్య వ్యాప్తి
A) ధ్వని అవధి
B) ధ్వని తీవ్రత
C) ధ్వని వేగం
D) ధ్వని ప్రసారం
జవాబు:
B) ధ్వని తీవ్రత
42. ఈ క్రింది పదార్థాలలో ధ్వని వేగం దేనిలో ఎక్కువగా ఉండును?
A) లోహపు కడ్డీ
B) గాలి
C) నీరు
D) ఆయిల్
జవాబు:
A) లోహపు కడ్డీ
43. ధ్వని కింది వాటిలో ఎందులో వేగంగా ప్రయాణిస్తుంది?
A) ఘన పదార్థాలు
B) ద్రవ పదార్థాలు
C) వాయువులు
D) శూన్యం
జవాబు:
A) ఘన పదార్థాలు
44. ధ్వని ప్రసరణను చేయు యానకంకు ఉండు లక్షణాలు
A) స్థితిస్థాపకత
B) జడత్వం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B
45. ధ్వని ఈ రూపంలో ప్రసారమగును
A) కంపనాలు
B) జతలు
C) వృత్తాలు
D) ఏదీకాదు
జవాబు:
A) కంపనాలు
46. ధ్వని తీవ్రత ప్రమాణాలను వీరికి గుర్తుగా ఏర్పాటుచేశారు.
A) నిక్సన్
B) న్యూటన్
C) బాయిల్
D) గ్రాహంబెల్
జవాబు:
D) గ్రాహంబెల్
47. ధ్వని తీవ్రతను కొలుచుటకు వాడు పరికరాలు
A) సౌండ్ మీటర్
B) నాయిస్ మీటర్
C) రెండునూ
D) ఏదీకాదు
జవాబు:
C) రెండునూ
48. “నిశ్శబ్దం” యొక్క ధ్వని తీవ్రత విలువ
A) 0 dB
B) 15 dB
C) 60 dB
D) 90 dB
జవాబు:
A) 0 dB
49. కారు హారన్ యొక్క ధ్వని తీవ్రత విలువ
A) 0 dB
B) 60 dB
C) 140 dB
D) 110 dB
జవాబు:
D) 110 dB
50. వస్తువు ఒక సెకను కాలంలో చేయు కంపనాల సంఖ్య
A) పిచ్
B) తీవ్రత
C) పౌనఃపున్యం
D) వేగం
జవాబు:
C) పౌనఃపున్యం
51. “పౌనఃపున్యం” కు గల ప్రమాణాలు
A) హెర్ట్
B) సైకిల్స్ / సెకన్
C) రెండునూ
D) ఏదీకాదు
జవాబు:
C) రెండునూ
52. ధ్వని కీచుదనం ఆధారపడి ఉండు అంశము
A) తీవ్రత
B) పౌనఃపున్యం
C) వేగం
D) పిచ్
జవాబు:
B) పౌనఃపున్యం
53. సంగీతంలోని స్వరాల యొక్క రకాల సంఖ్య
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
B) 2
54. వినడానికి ఇంపుగా వున్న స్వరాలు
A) అనుస్వరం
B) అపస్వరం
C) ధ్వని
D) ఏదీకాదు
జవాబు:
A) అనుస్వరం
55. వినడానికి ఇంపుగా లేని స్వరాలు
A) అనుస్వరం
B) అపస్వరం
C) ధ్వ ని
D) ఏదీకాదు
జవాబు:
B) అపస్వరం
56. ఒక క్రమపద్ధతిలో వినసొంపుగా ఉండు ధ్వనుల కలయిక
A) కఠోర ధ్వని
B) సంగీత ధ్వని
C) పిచ్
D) అన్నియూ
జవాబు:
B) సంగీత ధ్వని
57. ధ్వని తీవ్రత ఎన్ని dB లు దాటిన, అది ధ్వని కాలుష్య మగును?
A) 65
B) 60
C) 80
D) 35
జవాబు:
B) 60
58. నిద్ర లేమి, ఉద్రేకపడడం, రక్తపోటు మొ||వి దీని వలన కలుగును
A) సంగీత ధ్వనులు
B) కఠోర ధ్వనులు
C) శబ్ద కాలుష్యం
D) B మరియు C
జవాబు:
D) B మరియు C
59. ధ్వని కాలుష్యం వలన ఎక్కువ ప్రభావితమగు వారు
A) చిన్నపిల్లలు
B) గర్భిణీ స్త్రీలు
C) వృద్ధులు
D) అన్నియూ
జవాబు:
D) అన్నియూ
60. అకౌస్టిక్స్ దీనికి సంబంధించింది.
A) రసాయనాలు
B) కాంతి
C) ధ్వని
D) ఎలక్ట్రాన్లు
జవాబు:
C) ధ్వని
61. “డెసిబెల్” దీని యొక్క కొలమానము?
A) ధ్వని పరిమాణము
B) ధ్వని తరంగాలు
C) ధ్వని వేగం
D) ఏదీకాదు
జవాబు:
A) ధ్వని పరిమాణము
62. క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది?
గ్రూపు – A | గ్రూపు – B |
1. తీగ వాయిద్యం | a) తబల |
2. వాయు వాయిద్యం | b) వినడానికి ఇంపుగా ఉండేవి |
3. డ్రమ్ము వాయిద్యం | c) గిటార్ |
4. సంగీత ధ్వనులు | d) వినడానికి ఇంపుగా లేనివి |
5. కఠోర ధ్వనులు | e) క్లారినెట్ |
A) 1-c, 2-a, 3-b, 4-d, 5-e
B) 1-c, 2-a, 3-e, 4-d, 5-b
C) 1-c, 2-a, 3-b, 4-e, 5-d
D) 1-c, 2-e, 3-a, 4-b, 5-d
జవాబు:
D) 1-c, 2-e, 3-a, 4-b, 5-d
63. క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది?
గ్రూపు – A | గ్రూపు – B |
1. ధ్వనితీవ్రత | a) హెర్ట్ |
2. కీచుదనము (పిచ్) | b) పౌనఃపున్యంపై ఆధారపడును |
3. అధిక పిచ్ | c) తేనెటీగ |
4. అల్ప పిచ్ | d) కంపన పరిమితి పై ఆధారపడును |
5. పౌనఃపున్యము | e) సింహం |
A) 1-d, 2-b, 3-c, 4-a, 5-e
B) 1-d, 2-b, 3-c, 4-e, 5-a
C) 1-c, 2-a, 3-b, 4-e, 5-d
D) 1-d, 2-c, 3-b, 4-e, 5-a
జవాబు:
B) 1-d, 2-b, 3-c, 4-e, 5-a
64. క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది?
గ్రూపు – A | గ్రూపు – B |
1. శ్రవ్య అవధి | a) 20 హెర్ట్జ్ కంటె తక్కువ |
2. పరశ్రవ్య అవధి | b) 20,000 హెర్ట్జ్ కంటె ఎక్కువ |
3. అతి ధ్వనుల అవధి | c) 20 హెర్ట్జ్ – 20,000 హెర్ట్జ్ లు |
4. కుక్కల శ్రవ్య అవధి | d) 70,000 హెర్ట్జ్ ల వరకు |
5. పిల్లి శ్రవ్య అవధి | e) 40,000 హెర్ట్జ్ వరకు |
A) 1-c, 2-a, 3-b, 4-d, 5-e
B) 1-c, 2-a, 3-e, 4-d, 5-b
C) 1-c, 2-a, 3-b, 4-e, 5-d
D) 1-c, 2-e, 3-b, 4-d, 5-a
జవాబు:
C) 1-c, 2-a, 3-b, 4-e, 5-d
65. శ్రవ్య ధ్వనుల పౌనఃపున్య అవధి
A) 2 కంపనాలు/సెకను-20 కంపనాలు/సెకను
B) 20 కంపనాలు/సెకను-20000 కంపనాలు/సెకను
C) 20 కంపనాలు/సెకను-200 కంపనాలు/సెకను
D) 10 కంపనాలు/సెకను-20 కంపనాలు/సెకను
జవాబు:
B) 20 కంపనాలు/సెకను-20000 కంపనాలు/సెకను
66. జతపరచండి.
ఎ | బి |
1. తబల | a) తీగ వాయిద్యం |
2. పిల్లన గ్రోవి | b) డప్పు వాయిద్యం |
3. వీణ | c) వాయు వాయిద్యం |
సరియైన సమాధానమును గుర్తించండి.
A) 1-c, 2-b, 3-a
B) 1-c, 2-a, 3-b
C) 1-b, 2-a, 3-c
D) 1-b, 2-c, 3-a
జవాబు:
D) 1-b, 2-c, 3-a
67. ధ్వని ఉత్పత్తి చేయుటకు సంబంధించిన అవయవాలకు భిన్నమైనది.
A) స్వరతంత్రులు
B) పెదవులు
C) నాలుక
D) చెవి
జవాబు:
D) చెవి
68. ఈ క్రింది వాక్యాలను గమనించండి.
i) ధ్వని ఘన పదార్థాల ద్వారా ప్రసరిస్తుందని తెలుస్తుంది
ii) బల్లపై చెవిని ఆనించండి.
iii) ఒక ప్రత్యేకమైన ధ్వనిని వింటారు.
iv) బల్లపై రెండో వైపు చేతితో తట్టండి పై వాక్యాలు సరైన క్రమం
A) i, iii, ii, iv
B) iv, ii, iii, i
C) ii, iv, iii, i
D) iii, i, ii, iv
జవాబు:
C) ii, iv, iii, i
69. 1. ధ్వని తీవ్రతకు ప్రమాణం డెసిబెల్
2. ఒక నిమిషంలో వస్తువు చేసే కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు.
A) 1-సత్యం, 2-సత్యం
B) 1-అసత్యం, 2-సత్యం
C) 1-సత్యం, 2-అసత్యం
D) 1-అసత్యం, 2-అసత్యం
జవాబు:
C) 1-సత్యం, 2-అసత్యం
70. పౌనఃపున్యంతో సంబంధం గల రాశి
A) ధ్వని తీవ్రత
B) కీచుదనం
C) కంపన పరిమితి
D) మృదుత్వం
జవాబు:
C) కంపన పరిమితి
71. కింది వాటిలో ధ్వని కాలుష్య ప్రభావం కానిది
A) వినికిడి శక్తి కోల్పోవడం
B) నిద్రలేమి
C) ఉద్రేకపడటం
D) కంటి చూపు కోల్పోవడం
జవాబు:
D) కంటి చూపు కోల్పోవడం
72. వివిధ యానకాలలో ధ్వని ప్రసారము అయ్యే వేగాన్ని అనుసరించి ఆరోహణ క్రమంలో అమర్చుము.
A) ఘన > ద్రవ < వాయు
B) వాయు < ద్రవ < ఘన
C) ద్రవ < వాయు < ఘన
D) ఘన < వాయు < ద్రవ
జవాబు:
B) వాయు < ద్రవ < ఘన
73. శూన్యంలో ధ్వని వేగము
A) 0 మీటర్/సెకన్
B) 100 మీటర్/సెకన్
C) 250 మీటర్/సెకన్
D) 330 మీటర్/సెకన్
జవాబు:
A) 0 మీటర్/సెకన్
74. ఒక బ్లేడు 10 సెకన్లలో 3000 కంపనాలు చేసింది. అయితే బ్లేడు పౌనఃపున్యం …….. కంపనాలు/సెకను
A) 30
B) 300
C) 3000
D) 30000
జవాబు:
B) 300
75. భావం (A) : ఇనుమును తీగలుగా మార్చి కంచె వేయుటకు ఉపయోగిస్తాం.
కారణం (R) : ఇనుముకు తాంతవత ధర్మం ఉంది.
A) A మరియు Rలు రెండూ సరైనవి మరియు A కు సరైన కారణం కాదు
B) A సరైనది R సరైనది కాదు
C) A మరియు Rలు రెండూ సరైనవి కాదు
D) A మరియు Rలు రెండూ సరైనవి మరియు A కు R సరైన కారణం
జవాబు:
D) A మరియు Rలు రెండూ సరైనవి మరియు A కు R సరైన కారణం
76. మహిళ, పురుషుడు, సింహం, శిశువులు వేరువేరు పిలను కలిగి ఉంటారు. అయిన వారి పిచ్ సరియైన క్రమము
A) సింహం > పురుషుడు > మహిళ > శిశువు
B) సింహం < పురుషుడు < మహిళ < శిశువు
C) మహిళ > శిశువు > సింహం > పురుషుడు
D) మహిళ > పురుషుడు > సింహం > శిశువు
జవాబు:
B) సింహం < పురుషుడు < మహిళ < శిశువు
77. క్రింది వానిలో ధ్వనికి సంబంధించి సరికానిది
A) ధ్వని శక్తిని కలిగి ఉంది
B) ధ్వని ప్రసరణకు యానకం అవసరం
C) కంపనాలు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి
D) ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తుంది
జవాబు:
D) ధ్వని కంపనాలను ఉత్పత్తి చేస్తుంది
78. P : పరశ్రావ్యాలు ధ్వని కాలుష్యాన్ని కలుగజేయవు.
Q: అతిధ్వనులు ధ్వని కాలుష్యాన్ని కలుగజేస్తాయి.
A) P సరియైనది కాదు, Q సరియైనది
B) P, Q లు సరియైనవి
C) P, Q లు సరియైనవి కావు
D) P సరియైనది, Q సరియైనది కాదు
జవాబు:
B) P, Q లు సరియైనవి
79. P: ధ్వని తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడుతుంది.
Q: ధ్వని కీచుదనం పౌనఃపున్యంపై ఆధారపడుతుంది.
A) P, Q లు సరియైనవి కావు
B) P సరియైనది కాదు, Q సరియైనది
C) P సరియైనది, Q సరియైనది కాదు
D) P, Q లు సరియైనవి
జవాబు:
D) P, Q లు సరియైనవి
80.
గ్రూపు – A | గ్రూపు – B |
పరికరం | ధ్వని ఉత్పత్తి చేసే విధానం |
a) తబల | i) గాలి పొర కంపనాలు |
b) హార్మోనియం | ii) పై పొర, లోపల గాలి కంపనాలు |
c) గిటారు | iii) తీగలో కంపనాలు |
గ్రూపు – A లోని పరికరానికి, గ్రూపు – B లోని ధ్వని ఉత్పత్తి చేసే విధానానికి సంబంధాన్ని గుర్తించండి.
A) a-ii, b-iii, c-i
B) a-iii, b-i, c-ii
C) a-ii, b-i, c-iii
D) a-i, b-ii, c-iii
జవాబు:
C) a-ii, b-i, c-iii
81. ఒక బడిగంటను సుత్తితో కొట్టుము. దానిని చేతితో తాకుము. నీవు గ్రహించునది.
A) వేడి
B) చల్లదనం
C) కంపనం
D) షాక్
జవాబు:
C) కంపనం
82. కంపనాలు చేయకుండా ధ్వనిని ఉత్పత్తి చేసే పదార్థం లేదా వస్తువు
A) శృతిదండం
B) బెల్
C) గాలి
D) అలాంటి పదార్థం / వస్తువు ఉండదు
జవాబు:
D) అలాంటి పదార్థం / వస్తువు ఉండదు
83. ఒకవేళ విశ్వంలో ఏ వస్తువూ కంపించకపోతే ఇలా ఉండవచ్చును.
A) నిశ్శబ్దం
B) పతనం
C) రంగు విహీనం
D) భయంకర శబ్దం
జవాబు:
A) నిశ్శబ్దం
84. మనకు వినిపించే మొబైల్ నుండి వచ్చే శబ్ద తీవ్రత
A) చాలా ఎక్కువ
B) చాలా తక్కువ
C) సాధారణంగా
D) సున్నా
జవాబు:
D) సున్నా
85. చెవులు మూసుకొని, తలపై నెమ్మదిగా కొడితే ఏమి జరుగుతుందో ఊహించుము.
A) శబ్దం వినపడదు
B) శబ్దం వినిపిస్తుంది
C) చెప్పలేం.
D) శబ్దం ఉత్పత్తి అవదు
జవాబు:
B) శబ్దం వినిపిస్తుంది
86. పక్షి కంటే సింహం తక్కువ పిచ్ గల శబ్దం చేస్తుంది. కారణం ఊహించండి.
A) పక్షి ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది
B) సింహం ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది.
C) పక్షి పరిమాణంలో చిన్నది.
D) సింహం పరిమాణంలో పెద్దది.
జవాబు:
A) పక్షి ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది
87. భావం (A) : గబ్బిలాలు ఉత్పత్తి చేసే ధ్వనులను మానవుడు వినలేడు.
కారణం (B) : మానవుడు 20000 కంపనాలు/సెకను కన్నా ఎక్కువ పౌనఃపున్యం ఉన్న ధ్వనులను వినలేడు.
A) A మరియు R లు రెండూ సరైనవి మరియు A కు R సరైన కారణం కాదు
B) A సరైనది R సరైనది కాదు
C) A మరియు R లు రెండూ సరైనవి కాదు
D) A మరియు Rలు రెండూ సరైనవి మరియు A కు R సరైన కారణం
జవాబు:
D) A మరియు Rలు రెండూ సరైనవి మరియు A కు R సరైన కారణం
88. కీచురాళ్ళ ధ్వని విని చెవులు మూసుకున్న దీపక్ అలా ఎందుకు చేసి ఉంటాడో ఊహించండి.
A) అది ఎక్కువ తరంగదైర్ఘ్యము గల ధ్వని కాబట్టి ఉండవచ్చును.
B) అది ఎక్కువ కీచుదనం గల ధ్వని కాబట్టి
C) అది ఎక్కువ కంపన పరిమితి గల ధ్వని కాబట్టి
D) అది ఎక్కువ తీవ్రత గల ధ్వని కాబట్టి
జవాబు:
B) అది ఎక్కువ కీచుదనం గల ధ్వని కాబట్టి
89.
ఇచ్చిన పటంలో చూపిన ప్రయోగంలో పరిశీలించే విషయం
A) ఘర్షణ
B) కాంతి
C) ఉష్ణం
D) ధ్వని.
జవాబు:
D) ధ్వని.
90. ఇచ్చిన పటంలో చూపిన ప్రయోగ ఉద్దేశ్యం
A) ధ్వని ప్రసారానికి యానకం అవసరం’ అని నిరూపించుట
B) ‘ధ్వనికి శక్తి ఉంద’ని నిరూపించుట
C) ‘ద్వని శూన్యంలో ప్రయాణించదు’ అని నిరూపించుట
D) ‘ధ్వనికి రూపం లేదు’ అని నిరూపించుట
జవాబు:
B) ‘ధ్వనికి శక్తి ఉంద’ని నిరూపించుట
91. ‘ధ్వనికి శక్తి ఉంది’ అని నిరూపించడానికి నీకు క్రింది పరికరాలు అవసరమవుతాయి.
A) గాజు సీసా, రబ్బరు బెలూన్, సెల్ ఫోను, పంచదార స్ఫటికాలు
B) గాజు సీసా, నీరు, పంచదార, ఊళ
C) 6 గ్లాసులు, నీరు, స్పూన్
D) పై వానిలో ఏదేని ఒక శ్రేణి
జవాబు:
A) గాజు సీసా, రబ్బరు బెలూన్, సెల్ ఫోను, పంచదార స్ఫటికాలు
92. ప్రయోగశాలలో క్రింది విధంగా మృదుస్వరాన్ని ఇలా ఉత్పత్తి చేస్తావు.
A) ఒక వస్తువుని చేతితో ఊపుతూ
B) ఒక వస్తువుని నెమ్మదిగా తట్టుతూ
C) ఒక వస్తువుని గట్టిగా తట్టుతూ
D) ఒక వస్తువుని ఎత్తునుండి జారవిడిస్తూ
జవాబు:
B) ఒక వస్తువుని నెమ్మదిగా తట్టుతూ
93.
ఇచ్చిన ప్రయోగం చేస్తున్నప్పుడు నీవు వినే శబ్దాలు ఇలా ఉంటాయి?
A) తక్కువ పిచ్ మరియు ఎక్కువ పిచ్ గలవి
B) తక్కువ కంపనపరిమితి, ఎక్కువ కంపన పరిమితి గలవి
C) తక్కువ పిచ్ మరియు ఎక్కువ శబ్ద తీవ్రత గలవి
D) తక్కువ శబ్ద తీవ్రత మరియు ఎక్కువ పిచ్ గలవి
జవాబు:
A) తక్కువ పిచ్ మరియు ఎక్కువ పిచ్ గలవి
94. ధ్వని ద్రవం గుండా ప్రసరిస్తుందని చెప్పే ప్రయోగంలో వివిధ దశలను ఒక క్రమపద్ధతిలో అమర్చండి.
P : బకెట్ బయట గోడ ద్వారా శబ్దం వినండి
Q : నీటిలో రెండు రాళ్ళతో శబ్దం చేయాలి
R : వెడల్పాటి బకెట్లో నీరు తీసుకోవాలి
S : దీనిని బట్టి శబ్దం ద్రవం గుండా ప్రసరిస్తుందని చెప్పగలం
A) R → P → Q → S
B) P → Q → R → S
C) R → Q → P → S
D) S → R → Q → P
జవాబు:
C) R → Q → P → S
95. క్రింది ప్రయోగ సోపానాలను వరుసక్రమంలో అమర్చుము.
i) సీసా మూతకి రబ్బరు బెలూన్ ముక్క సాగదీసి అమర్చాలి.
ii) సెల్ ఫోన్ శబ్దం చేయడానికి రింగ్ ఇవ్వాలి.
iii)సీసా లోపల సెల్ ఫోన్ ఉంచాలి.
iv) పంచదార పైన వేయాలి.
A) iii → iv → i → ii
B) i → ii → iv → iii
C) iii → i → iv → ii
D) iv → iii → i → ii
జవాబు:
C) iii → i → iv → ii
96. P : 1) రెండు హాక్ బ్లేడులు తీసుకోవాలి
2) వాటిని టేబుల్ కి వేరు వేరు పొడవుల వద్ద అమర్చుము
3) సమాన బలంతో వాటిని కంపనాలు చేయించుము
Q : 1) ఒక హాక్ బ్లేడును తీసుకోవాలి
2) దానిని టేబుల్ కి అమర్చుము
3) ఒకసారి తక్కువ బలంతో, మరొకసారి ఎక్కువ బలంతో కంపనాలు చేయించుము
P మరియు Q ప్రయోగాలలో ఉద్దేశ్యం వీటిని పరిశీలించడం.
A) P – పిచ్, Q – శబ్ద తీవ్రత
B) P – శబ్ద తీవ్రత, Q – పిచ్
C) P- తరంగదైర్ఘ్యం, Q – పిచ్
D) P- పిచ్, Q – తరంగదైర్ఘ్యం
జవాబు:
A) P – పిచ్, Q – శబ్ద తీవ్రత
97. ప్రయోగశాలలో గల ఈ పరికరం పేరు
A) స్ప్రింగ్ త్రాసు
B) శృతి దండం
C) రబ్బరు సుత్తి
D) శ్రావణం
జవాబు:
B) శృతి దండం
98.
ఈ ప్రయోగం ఉద్దేశ్యం
A) వాయు పదార్థాలలో ధ్వని ప్రసారం
B) ద్రవ పదార్థాలలో ధ్వని ప్రసారం
C) ఘన పదార్థాలలో ధ్వని ప్రసారం
D) పైవేవీ కాదు
జవాబు:
C) ఘన పదార్థాలలో ధ్వని ప్రసారం
99.
గాలిలో బ్లేడు పొడవు | కంపనాలు | ధ్వని |
బ్లేడ్ 1 : 20 సెం.మీ. | ||
బ్లేడ్ 2 : 5 సెం.మీ. |
ఇచ్చిన పట్టిక క్రింది ప్రయోగానికి సంబంధించినది
A) ధ్వని తీవ్రత (ప్రయోగం)
B) ధ్వని కీచుదనం (ప్రయోగం)
C) ధ్వని ప్రసారానికి యానకం అవసరం (ప్రయోగం)
D) ధ్వని – శక్తి స్వరూపం (ప్రయోగం)
జవాబు:
B) ధ్వని కీచుదనం (ప్రయోగం)
100. “గంట జాడీ ప్రయోగం” ను ప్రవేశపెట్టినవారు
A) రాబర్ట్ బాయిల్
B) న్యూటన్
C) ఐన్ స్టీన్
D) రాబర్ట్ కుక్
జవాబు:
A) రాబర్ట్ బాయిల్
101. ప్రయోగశాలలో అతిధ్వనులను ఉత్పత్తి చేసినవారు
A) పీజో
B) నిక్సన్
C) బాయిల్
D) న్యూటన్
జవాబు:
A) పీజో
102. ధ్వని తీవ్రతకు, వస్తువు కంపన పరిమితికి సంబంధాన్ని తెలుసుకునే ప్రయోగంలో కావలసిన పరికరాలు
A) చెక్కబల్ల, ఇటుక, హాక్ సాల్లేడు
B) చెక్కబల్ల, బ్లేడు, ఇటుక
C) స్టాండు, లఘులోలకం, హాక్ సాల్లేడు
D) చెక్కబల్ల, కర్ర, ఇటుక
జవాబు:
A) చెక్కబల్ల, ఇటుక, హాక్ సాల్లేడు
103. బక్కెట్, నీరు, రెండు రాళ్ళు ఇచ్చి కృత్యం నిర్వహించమన్నప్పుడు ఆ వస్తువుల ద్వారా నిర్వహించే కృత్యం ద్వారా తెలుసుకునే విషయం
A) ధ్వని ఉత్పత్తి అగుటకు నీరు అవసరం
B) ధ్వని నీటి ద్వారా ప్రయాణిస్తుంది
C) ధ్వని గాలి ద్వారా ప్రయాణిస్తుంది
D) రాళ్ళు రెండు తాకించినప్పుడు ధ్వని పుడుతుంది
జవాబు:
B) ధ్వని నీటి ద్వారా ప్రయాణిస్తుంది
104.
వాద్య పరికరం | కంపనం చేసే భాగం |
A | చర్మపు పొర, గాలి స్థంభం |
పిల్లనగ్రోవి | గాలి స్థంభం |
వీణ | B |
A, B లు వరుసగా
A) తబలా, చర్మపు పొర
B) డప్పు, గాలిస్థంభం
C) మద్దెల, తీగ
D) మద్దెల, చర్మపు పొర
జవాబు:
C) మద్దెల, తీగ
105.
పై పట్టికలో గల సంగీత పరికరాలలో తీగ వాయిద్యాలు ఏవి?
A) Be
B) C, D
C) A, F
D) A, D, F
జవాబు:
C) A, F
106. ఒక ప్రయోగంలో క్రింది విధంగా గ్రాఫు వచ్చింది.
A, B, C లు క్రింది వారి శబ్దాలను సూచిస్తాయి.
A) A = సింహం, B = కోయిల, C = మనిషి
B) A = మనిషి, B = సింహం, C = కోయిల
C) A = కోయిల, B = మనిషి, C = సింహం
D) A = సింహం, B = మనిషి, C = కోయిల
జవాబు:
A) A = సింహం, B = కోయిల, C = మనిషి
107.
వ్యక్తి | స్వరతంత్రుల పొడవు |
పురుషులు | 20 mm |
స్త్రీలు | 15 mm |
పిల్లలు | 10 mm |
పై పట్టిక నుండి నీవు గ్రహించే విషయం
A) స్వరతంత్రుల పొడవు తగ్గే కొలది పిచ్ పెరుగును
B) స్వరతంత్రుల పొడవు తగ్గే కొలది పిచ్ తగ్గును
C) రెండూ కాదు
D) స్వరతంత్రుల పొడవుకి, పిచ్ కి సంబంధం లేదు
జవాబు:
A) స్వరతంత్రుల పొడవు తగ్గే కొలది పిచ్ పెరుగును
108.
ఈ బొమ్మలు నుండి నీవేమి చెప్పగలవు?
A) శబ్దం ఘన పదార్థాల గుండా ప్రసరించగలదు
B) శబ్దం వాయు పదార్థాల గుండా ప్రసరించగలదు
C) శబ్దం ద్రవ పదార్థాల గుండా ప్రసరించగలదు
D) శబ్దం ద్రవ పదార్థాల గుండా ప్రసరించదు
జవాబు:
A) శబ్దం ఘన పదార్థాల గుండా ప్రసరించగలదు
109. పై పటములలో దేనికి ఎక్కువ పౌనఃపున్యం కలదు?
A) A
B) B
C) C
D) D
జవాబు:
A) A
110. పై పటములలో దేనికి ఎక్కువ కంపనపరిమితి కలదు?
A) A
B) B
C) C
D) D
జవాబు:
C) C
111. పై పటములలో ‘A’ కలిగి యున్నది
A) తక్కువ పౌనఃపున్యం – ఎక్కువ తరంగదైర్ఘ్యం
B) ఎక్కువ పౌనఃపున్యం – తక్కువ తరంగదైర్ఘ్యం
C) ఎక్కువ పౌనఃపున్యం – ఎక్కువ తరంగదైర్ఘ్యం
D) తక్కువ పౌనఃపున్యం – తక్కువ తరంగదైర్ఘ్యం
జవాబు:
B) ఎక్కువ పౌనఃపున్యం – తక్కువ తరంగదైర్ఘ్యం
112. పై పటము A, C లలో దేనికి ఎక్కువ శబ్ద తీవ్రత కలదు?
A) A
B) C
C) రెండింటికీ సమానంగా
D) చెప్పలేం
జవాబు:
B) C
బ్లేడ్ | కంపనాల సంఖ్య | కంపన పరిమితి |
P | 1500 | 0.005 మీ. |
Q | 1000 | 0.05 మీ. |
R | 100 | 0.0i మీ. |
113. పై వానిలో ఏ బ్లేడ్ ఎక్కువ శబ్దతీవ్రతతో కంపించింది?
A) P
B) Q
C) R
D) ఏదీకాదు
జవాబు:
B) Q
114. పై వానిలో దేనికి ‘పిచ్’ ఎక్కువ?
A) P
B) Q
C) R
D) ఏదీకాదు
జవాబు:
A) P
115.
పై వాటిలో కంపనాల సంఖ్య
A) a > b
B) a < b
C) a = b
D) a ≤ b
జవాబు:
C) a = b
నిశ్శబ్దానికి సమీపధ్వని | 0 db |
గుసగుస | 15 db |
సాధారణ సంభాషణ | 60 db |
లాన్ యంత్రం | 90 db |
కారు హారన్ | 110 db |
జెట్ ఇంజన్ శబ్దం | 120 db |
టపాకాయ పేలుడు శబ్దం | 140 db |
పై పట్టిక కొన్ని సాధారణ ధ్వనులు విడుదల చేసే శబ్ద తీవ్రతలను డెసిబులో తెలియజేస్తుంది. దీని ఆధారంగా క్రింది వాటికి సమాధానాలివ్వండి.
116. లాన్ యంత్రం విడుదల చేసే ధ్వని ఎన్ని డెసిబుల్స్ తీవ్రత కలిగి ఉంది?
A) 60 db
B) 90 db
C) 110 db
D) 15th
జవాబు:
B) 90 db
117. జెట్ ఇంజన్ నుండి వెలువడే శబ్ద తీవ్రత కారు హారన్ శబ్ద తీవ్రత కన్నా ఎక్కువ. ఎన్ని రెట్లు ఎక్కువ?
A) 100 db
B) 1000 db
C) 20 db
D) 10 db
జవాబు:
D) 10 db
118. క్రింది వానిలో ధ్వని తీవ్రతకు సంబంధించిన పటం
D) ఏదీకాదు
జవాబు:
A
119.
పై పటంలో కంపన పరిమితిని సూచించే భాగం
A) OA దూరం
B) AB దూరం
C) CB దూరం
D) OB దూరం
జవాబు:
B) AB దూరం
120. క్రింది పటాలలో దేనిలో ‘కంపన పరిమితి’ ని సరిగా చూపడమైనది?
జవాబు:
A
121. రవి ధ్వనిని ఉత్పత్తి చేసే ఒక పరికరం పటం గీసాడు. క్రింది వానిలో అది ఏది?
D) అన్నియూ
జవాబు:
D) అన్నియూ
122.
ఇచ్చిన పటంలో ‘X’ భాగం
A) కర్ణభేరి
B) క్లియా
C) శ్రవణ కుల్య
D) పిన్నా
జవాబు:
B) క్లియా
123. ఈ భాగం
A) చెవిలో ఉండే కర్ణభేరి
B) చెవిలో ఉండే కోక్లియా
C) స్వరపేటికలో ఉండే స్వరతంత్రులు
D) పైవేవీకాదు
జవాబు:
C) స్వరపేటికలో ఉండే స్వరతంత్రులు
124. ఇచ్చిన చిత్రం ద్వారా మనము తెలుసుకునే విషయం
A) ధ్వని శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది
B) ధ్వని శక్తిని కలిగి ఉంది
C) ధ్వని కంపనాలు ఉత్పత్తి చేస్తుంది
D) ధ్వని ప్రసరణకు యానకం అవసరం
జవాబు:
B) ధ్వని శక్తిని కలిగి ఉంది
125. క్రింది పేరుగాంచిన సంగీత వాద్యకారులను జత చేయుము.
a) బిస్మిలాఖాన్ | i) తబలా |
b) చిట్టిబాబు | ii) సన్నాయి |
c) జాకీర్ హుస్సేన్ | iii) వీణ |
A) a – (ii), b – (ii), C – (i)
B) a – (iii), b – (ii), C – (i)
C) a – (i) – b(ii), c – (iii)
D) a – (ii), b – (i), C – (iii)
జవాబు:
A) a – (ii), b – (ii), C – (i)
126. మనుషులు మరియు జంతువులు జీవనంలో వారి లేదా వాటి యొక్క భావాలను ఇలా వెల్లడి చేస్తారు/యి.
A) కాంతితో
B) ధ్వనితో
C) సైగలతో
D) పైవన్నింటితో
జవాబు:
B) ధ్వనితో
127. మనం సంగీతాన్ని విని ఆనందింపజేయడంలో దీనిని అభినందించాలి.
A) స్వరతంత్రి
B) గుండె
C) కర్ణభేరి
D) కన్ను
జవాబు:
C) కర్ణభేరి
128. మనిషికి ఆరోగ్యాన్ని చేకూర్చడంలో వీటి పాత్ర కూడా ఉందని నిరూపించబడింది.
A) చప్పుడు
B) సంగీతం
C) మాటలు
D) అన్నియూ
జవాబు:
B) సంగీతం
129. వినడానికి ఇంపుగా లేని ధ్వనులు
A) కఠోరధ్వనులు
B) సంగీత ధ్వనులు
C) ధ్వని కాలుష్యం
D) పైవన్నీ
జవాబు:
A) కఠోరధ్వనులు
130. మానవులు వినగలిగే ధ్వని యొక్క పౌనఃపున్య అవధి గల ధ్వనులు
A) పరశ్రావ్య ధ్వనులు
B) శ్రవ్య ధ్వనులు
C) అతిధ్వనులు
D) పైవేవీకావు
జవాబు:
B) శ్రవ్య ధ్వనులు
131. మానవ శ్రవ్య అవధి
A) 20 HZ – 20 KHZ
B) 20 KHZ – 20 HZ
C) 20 HZ – 250 HZ
D) 250 HZ – 20 HZ
జవాబు:
A) 20 HZ – 20 KHZ
132. మానవ శ్రవ్య అవధి కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులు
A) శ్రవ్య ధ్వనులు
B) పరశ్రావ్యాలు
C) అతిధ్వనులు
D) ఏదీకాదు
జవాబు:
B) పరశ్రావ్యాలు
133. మానవ శ్రవ్య అవధి కంటే ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనులు
A) శ్రవ్య ధ్వనులు
B) పరశ్రావ్యాలు
C) అతిధ్వనులు
D) ఏదీకాదు
జవాబు:
C) అతిధ్వనులు
134. ప్రపంచంలో అత్యధిక శబ్ద కాలుష్యం గల పట్టణం
A) నాన్ జింగ్
B) ఫ్రాన్స్
C) స్విట్జర్లాండ్
D) రుమేనియా
జవాబు:
A) నాన్ జింగ్
135. మన దేశంలో అత్యధిక శబ్ద కాలుష్యం గల పట్టణం
A) ముంబయి
B) గాంధీనగర్
C) కోల్ కత
D) చెన్నె
జవాబు:
A) ముంబయి
136. మన దేశంలో తక్కువ ధ్వని కాలుష్యం గల రాష్ట్రం
A) హిమాచల్ ప్రదేశ్
B) గుజరాత్
C) కోల్ కత
D) ఆంధ్రప్రదేశ్
జవాబు:
A) హిమాచల్ ప్రదేశ్
137. సునీల్ బాంబుని కాల్చినప్పుడు, క్రింది వాని వలన దాని శబ్దం మన చెవికి చేరుతుంది.
A) మిరుమిట్లు గొలిపే వెలుతురు ఇవ్వడం వలన
B) అధికంగా వేడిని ఉత్పత్తి చేయడంవలన
C) గాలిని కంపింప జేయడం వలన
D) పొగలు రావడం వలన
జవాబు:
C) గాలిని కంపింప జేయడం వలన
138. కొన్ని బాంబులు చెవులకు హాని చేస్తాయి. కారణం
A) ఎక్కువ పిచ్ వలన
B) ఎక్కువ కంపన పరిమితి వలన
C) ఎక్కువ పౌనఃపున్యం వలన
D) ఎక్కువ తరంగదైర్ఘ్యం వలన
జవాబు:
B) ఎక్కువ కంపన పరిమితి వలన
139. అధిక తీవ్రతగల శబ్దాల వలన ఇది కలుగును.
A) అనాసక్తత
B) అయిష్టం
C) చికాకు
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ
140. రాజు క్రింది శబ్దాన్ని వినలేడు
A) 10 Hz
B) 200 Hz
C) 200, 000 Hz
D) పైవన్నియూ
జవాబు:
B) 200 Hz
141. క్రింది వానిలో ఏ శబ్ద తీవ్రత ప్రమాదకరం కాదు?
A) 60 dB
B) 120 dB
C) 100 dB
D) B మరియు C
జవాబు:
D) B మరియు C
142. శబ్దకాలుష్యాన్ని తగ్గించే విధానం
A) మొక్కలు నాటాలి
B) వాహనాలకి సైలన్సర్లు బిగించుకోవాలి
C) లౌడ్ స్పీకర్లు తగ్గించాలి
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు
143. క్రింది వానిని జతచేయుము.
1) 60 dB a) బాధ కలుగుతుంది
2) > 80 dB b) చెవుడు
3) > 80 dB ఎక్కువకాలం c) సాధారణ సంభాషణ
A) 1-c, 2-a, 3-b
B) 1-b, 2-a, 3-c
C) 1-a, 2-c, 3-b
D) 1-a, 2-b, 3-c
జవాబు:
A) 1-c, 2-a, 3-b
144. క్రింది వాని యొక్క శబ్దం ‘పిచ్’ ఎక్కువ.
A) సింహం
B) మహిళ
C) శిశువు
D) కీటకం
జవాబు:
D) కీటకం
145. ……… డెసిబెల్స్ దాటిన ధ్వనులు చెవికి ప్రమాదాన్ని కలిగిస్తాయి.
A) 80
B) 60
C) 50
D) 55
జవాబు:
A) 80
146. అధిక తీవ్రత గల ధ్వని కాలుష్యాన్ని కలుగజేస్తుందని తెలిసిన నీవు కాలుష్య నివారణకు క్రింది వానిలో ఏఏ చర్యలు తీసుకుంటావు?
a) లౌడ్ స్పీకర్ వినియోగాన్ని తగ్గించమని కోరతాను
b)మోటారు వాహనాలకు సైలెన్సర్ బిగించమని చెప్తాను
C) బాణాసంచా కాల్చమని ప్రోత్సహిస్తాను
d) చెట్లు పెంచమని చెప్తాను
A) a, c మరియు d
B) a, b మరియు d
C) b, c మరియు d
D) a, b మరియు C
జవాబు:
B) a, b మరియు d
మీకు తెలుసా?
1. విశ్వవిఖ్యాత షెహనాయ్ వాయిద్య కారుడు బిస్మిల్లాఖాన్ ఆ వాయిద్యంపై రకరకాల ధ్వనులను పలికించడంలో నిపుణుడు. ఆయన 80 సంవత్సరాల క్రితం బీహారులోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. తన బాల్యాన్ని ఆయన గంగానదీ తీరంలోని వారణాసిలో గడిపాడు. ఆయన పినతండ్రి కాశీ విశ్వనాథ దేవాలయంలో ఆస్థాన షెహనాయ్ విద్వాంసునిగా పనిచేసేవారు.
2. చిట్టిబాబు (అక్టోబర్ 13, 1936 – ఫిబ్రవరి 9, 1996) భారతదేశంలో కర్నాటిక్ సంగీత వాయిద్యకారుడుగా పేరెన్నికగన్న వారు. దక్షిణ భారతదేశంలో వీణా వాయిద్యంలో ఆయనది అందెవేసిన చేయి. తన జీవిత కాలంలో ఆయన అనంతమైన పేరు ప్రఖ్యాతులు సాధించాడు. కర్ణాటిక్ సంగీతంలో వీణ అంటే చిట్టిబాబు అన్నంతగా ఆయన పేరు సంపాదించారు. అందరూ ఆయన్ను వీణ చిట్టిబాబుగా పిలిచేవారు.
స్వరతంత్రుల పొడవు పురుషులలో 20 మిల్లీ మీటర్లు ఉంటుంది. మహిళలలో వీటి పొడవు 5 మి.మీ. తక్కువగా ఉంటుంది. చిన్న పిల్లల్లో ఇది ఇంకా తక్కువగా ఉంటుంది. మహిళలు, పురుషులు మరియు పిల్లలు చేసే ధ్వనుల నాణ్యత స్వరతంత్రుల పొడవుపై ఆధారపడి ఉంటుందని చెప్పగలమా?
పెదాలు కదలకుండా మనం మాట్లాడగలమా?
వెంట్రిలాక్విస్టులు (Ventriloquists) తమ పెదవులు కదపకుండా చేసే శబ్దాలతో మాట్లాడుతూ ఉంటారు. వారి పెదవులు ఒకదానికొకటి తాకకుండా కొద్దిగా దూరంగా ఉంటాయి. వీరు త్వరత్వరగా మాట్లాడటం వల్ల కదిలే పెదవులను మనం గమనించేందుకు వీలుకాదు. వారు తమ పెదవుల కదలిక పైన, శబ్దాలు చేయడంలోనూ, శ్వాసపైన నియంత్రణ – గోమఠం శ్రీనివాస్ కలిగి ఉంటారు. వీరు పెదవులను ఎక్కువ కదిలించకుండా ఉచ్ఛారణలో తేడా లేకుండా కండరాల సహాయంతో గొంతుకతో మాట్లాడటంలో నిపుణులుగా ఉంటారు. ఇలా చేసేటప్పుడు వారు తమ కండరాలను వత్తిడికి గురికాకుండా చేస్తారు. వారు పెదవులను కంపించటం ద్వారా గాలిని బయటకు పంపి శ్వాసించడం ద్వారా ఒత్తిడికి గురయిన. కండరాలకు ఉపశమనం కలిగిస్తారు. ఇది ఒక రకమైన శబ్ద నిపుణతా సామర్థ్యం. ఆ కళలో ఆరితేరినవారు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన చించపట్టణ గోమఠం శ్రీనివాస్. వీరు ప్రపంచ వ్యాప్తంగా 6000 ప్రదర్శనలిచ్చారు. 1990లో వీరు 32 గంటలపాటు నిర్విరామంగా ఈ ప్రదర్శన ఇచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
ధ్వని అనుకరణ
ధ్వని అనుకరణ చేసేవారు తమ శభోత్పత్తి మీద తగిన నియంత్రణ కలిగి ఉంటారు. వారు తమ గొంతును మాత్రమే ఉపయోగించి శబ్దాలను పలికించి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓరుగల్లు వాసియైన డా|| నేరెళ్ల వేణుమాధవ్ ఈ కళలో ఆరితేరినవారు. భారత ప్రభుత్వం వారి ప్రతిభను గుర్తించి 2001 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
ఈ పద్ధతులను మీరు కూడా ప్రయత్నించి, దాన్ని ఒక అలవాటుగా చేసుకోండి.
ధ్వని తీవ్రతను కొలుచుటకు ప్రమాణం ‘డెసిబెల్’. డెసిబెల్ ను ‘dB’ గా సూచిస్తాం. ఈ విధమైన ధ్వని తీవ్రతను కొలిచే ‘డెసిబుల్’ అనే పదం, ధ్వనుల గురించి పరిశోధించిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ (1847 – 194B)కు గుర్తుగా ఏర్పాటు చేయడం జరిగింది.
మనకు వినిపించే అతితక్కువ తీవ్రత గల ధ్వని (దాదాపు నిశ్శబ్దం) ‘0’ డెసిబెల్. దీనికి 10 రెట్లు ఎక్కువగా ఉన్న ధ్వని తీవ్రత 10dB. అలాగే శూన్యస్థాయికి 100 రెట్లు ఎక్కువగా వినిపించే ధ్వని తీవ్రత 20dB అదే విధంగా 1000 రెట్లు ఎక్కువగా వినిపించే ధ్వని తీవ్రత 30dB కొన్ని సాధారణ ధ్వనులు ఎన్ని డెసిబెల్స్ ఉంటాయో కింద ఇవ్వబడింది.
నిశ్శబ్దానికి సమీప ధ్వని 0 dB
గుసగుస 15 dB
సాధారణ సంభాషణ 60 dB
లాన్ యంత్ర శబ్దం 90 dB
కారు హారన్ 110 dB
జెట్ ఇంజన్ శబ్దం 120 dB
తుపాకి పేలుడు లేదా
టపాకాయ పేలుడు శబ్దం – 140 dB
కింది ధ్వనుల యొక్క పిచ్ ఆరోహణ క్రమంలో ఉంది. సింహం < పురుషుడు < మహిళ < పిల్లవాడు < శిశువు < కీటకం
- దీనికి కారణం ఏమిటో ఊహించగలరా? ధ్వనుల యొక్క పిల్లేలో తేడాలు ఉండటమే కారణం.
- ఈల ఊదడం, డ్రమ్స్ వాయించడం వల్ల ఏర్పడే ధ్వనుల పిచ్ లో ఏమైనా తేడా ఉంటుందా? ఈల ఊదడం కంటే, డ్రమ్స్ వాయించడం వల్ల ఏర్పడే ధ్వనుల పిచ్ ఎక్కువగా ఉంటుంది.
శ్రీమతి యం.యస్. సుబ్బులక్ష్మి గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆమె కేవలం కర్ణాటక సంగీతానికే కాక ఒక మానవతా వాదిగా (Philanthropist) దేశానికి, ప్రజలకు ఎనలేని ధార్మిక సేవలందించారు. ఆమె తన గాత్రాన్ని భక్తి పాటలకు అంకితం చేసింది.
ఘంటసాల వెంకటేశ్వరరావు ఒక గొప్ప నేపథ్య గాయకుడు. మధురమైన గాత్రానికి ఆయన ప్రసిద్ధుడు. అతను తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో 10,000కు పైగా పాటలను పాడారు. 100కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన పాడిన ప్రైవేటు పాటలు కూడా జనాదరణ పొందాయి. ఆయన పాడిన భక్తి గీతాలు నేటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి.
గోల్కొండ కోట – హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రం
ఇది భారతదేశంలో ప్రసిద్ది చెందిన కోట. ఇందులో ఎన్నో సాంకేతిక నిర్మాణ కళా అద్భుతాలు ఉన్నాయి. ఈ కోటలో ఒక బురుజు కింద నిలబడి నిర్దిష్ట స్థాయిలో మీరు చప్పట్లు కొట్టినప్పుడు, అది ప్రతిధ్వనించి 1 కిలోమీటరు దూరంలో ఉన్న కోట శిఖరభాగం వరకు వినబడుతుంది.