These AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు will help students prepare well for the exams.

AP Board 8th Class Physical Science 5th Lesson Important Questions and Answers లోహాలు మరియు అలోహాలు

8th Class Physics 5th Lesson లోహాలు మరియు అలోహాలు 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
పనిముట్లు తయారుచేయడానికి లోహాలను ఎందుకు ఉపయోగిస్తారు?
జవాబు:
లోహాలు దృఢమైనవి కావడంతో వేడిచేసి మనకు కావలసిన ఆకారం, పరిమాణంలోనికి మార్చుకోవచ్చును. కావున లోహాలతో పనిముట్లు తయారుచేయడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 2.
విద్యుత్ పరికరాలు, వంటపాత్రల యొక్క పిడులు లోహాలతో తయారుచేయరు. ఎందుకు?
జవాబు:
విద్యుత్ పరికరాలు, వంట పాత్రల యొక్క పిడులు లోహాలతో తయారుచేయరు. ఎందుకంటే లోహాలు విద్యుత్ మరియు ఉష్ణ వాహకాలు.

ప్రశ్న 3.
ఇనుప వస్తువులను గాలిలో ఉంచితే తుప్పు పట్టును. ఇనుప వస్తువులకు పెయింట్ వేస్తే ఎందుకు తుప్పు పట్టవు? తెల్పండి.
జవాబు:
ఇనుప వస్తువులను గాలిలో ఉంచితే గాలిలోని తేమ, ఆక్సిజన్ తో చర్య జరిపి ఇనుము తుప్పు పట్టును. ఇనుప వస్తువులకు పెయింట్ వేస్తే తుప్పు పట్టదు. ఎందుకంటే ఇనుప వస్తువుల ఉపరితలం గాలిలోని తేమ, ఆక్సిజన్లతో చర్య జరపకుండా పెయింట్ పూత ఉంటుంది.

ప్రశ్న 4.
బంగారం, ప్లాటినమ్ ఆభరణాలు తమ మెరుపును కోల్పోకుండా ఉండడానికి కారణం ఏమిటి?
జవాబు:
బంగారం, ప్లాటినమ్ ఆభరణాలు గాలితో చర్య జరపవు. కావున ఇవి తమ మెరుపును కోల్పోవు.

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

ప్రశ్న 5.
సోడియం (Na) లోహాన్ని కిరోసిన్లో నిల్వ చేస్తారు. ఎందుకు?
జవాబు:
సోడియం లోహం అత్యధిక చర్యాశీలత గల లోహం. కాబట్టి ఇది గాలిలోని ఆక్సిజన్ తో చర్య జరుపుతుంది. కావున సోడియం లోహాన్ని కిరోసిన్లో నిల్వ చేస్తారు.

ప్రశ్న 6.
లోహద్యుతి అనగానేమి?
జవాబు:
లోహాల ఉపరితలంపై కాంతి పరావర్తనం చెందినపుడు మెరిసే గుణం గల వాటిని లోహద్యుతి అంటారు.

ప్రశ్న 7.
ధ్వని గుణం అనగానేమి?
జవాబు:
వస్తువులను నేలపై పడవేసినపుడు లేదా కడ్డీతో కొట్టినపుడు ధ్వనిని ఉత్పత్తి చేసే ధర్మాన్ని ధ్వనిగుణం అంటారు.

ప్రశ్న 8.
ధ్వని గుణం లేని లోహం ఏది?
జవాబు:
పాదరసం (Hg)

ప్రశ్న 9.
స్తరణీయత అనగానేమి?
జవాబు:
లోహాన్ని రేకులుగా సాగదీసే ధర్మాన్ని స్తరణీయత అంటారు.

ప్రశ్న 10.
తాంతవత అనగానేమి?
జవాబు:
లోహాన్ని సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని తాంతవత అంటారు.

ప్రశ్న 11.
ఉష్ణవాహకత అనగానేమి?
జవాబు:
ఒక వస్తువును ఒక చివర వేడిచేస్తే మరొక చివరకు ఉష్ణం తన గుండా ప్రసారమయ్యే ధర్మాన్ని ఉష్ణవాహకత అంటారు.

ప్రశ్న 12.
లోహాల భౌతిక ధర్మాలను రాయండి.
జవాబు:
లోహాలు ద్యుతి, ధ్వని గుణం, తాంతవత, స్తరణీయత, ఉష్ణవాహకత మరియు విద్యుత్ వాహకత వంటి భౌతిక ధర్మాలను కలిగి ఉంటాయి.

ప్రశ్న 13.
లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి ఏ స్వభావం గల పదార్థాలను ఏర్పరచును?
జవాబు:
లోహాలు ఆక్సిజన్ తో చర్య జరిపి లోహ ఆక్సెలను ఏర్పరుస్తాయి. లోహ ఆక్సెలకు క్షార స్వభావం ఉంటుంది.

ప్రశ్న 14.
అలోహాలు ఆక్సిజన్ తో చర్య జరిపి ఏ స్వభావం గల పదార్థాలను ఏర్పరచును?
జవాబు:
అలోహాలు ఆక్సిజన్ తో చర్య జరిపి అలోహ ఆక్సెలను ఏర్పరుస్తాయి. అలోహ ఆక్సెడ్ లు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి.

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

ప్రశ్న 15.
సల్ఫర్ ఏ ఏ పదార్థాలలో ఉంటుంది?
జవాబు:
ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్డు, వెంట్రుకలు మరియు చేతిగోళ్లలో సల్ఫర్ ఉంటుంది.

ప్రశ్న 16.
కొన్ని లోహాల చర్యాశీలత క్రమం రాయండి.
జవాబు:
చర్యాశీలత క్రమము : K > Na » Ba > Ca > Mg > Al > Zn > Fe > Sn > Pb

ప్రశ్న 17.
ఘనస్థితిలో ఉండే అలోహాలు ఏవి?
జవాబు:
కార్బన్ (C), అయోడిన్ (1).

ప్రశ్న 18.
ద్రవస్థితిలో ఉండే లోహాలు ఏమిటి?
జవాబు:
పాదరసం (Hg).

ప్రశ్న 19.
మృదువుగా ఉండే లోహాలు తెల్పండి.
జవాబు:
సోడియం (Na) మరియు పొటాషియం (K).

ప్రశ్న 20.
అత్యధిక తాంతవత గల లోహం ఏది?
జవాబు:
బంగారం.

ప్రశ్న 21.
లోహపు పనిముట్లు తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏమి చేయవలెను?
జవాబు:
పనిముట్లకు పెయింట్లు వేయాలి మరియు ఎలక్ట్రో ప్లేటింగ్ చేయాలి. పనిముట్లకు తుప్పుపట్టకుండా గ్రీజులు, నూనెలు పూయాలి. అలాగే పనిముట్లను మిశ్రమ లోహాలతో తయారుచేయాలి.

ప్రశ్న 22.
సల్ఫర్ యొక్క ఉపయోగాలను రాయండి.
జవాబు:
బాణాసంచా, మందుగుండు సామగ్రి, గన్ పౌడర్, అగ్గిపెట్టెలు మరియు యాంటిసెప్టిక్ ఆయింట్ మెంట్లు మొదలగు వాటి తయారీలో ఉపయోగిస్తారు.

ప్రశ్న 23.
కార్బన్ ఉపయోగాలను రాయండి.
జవాబు:
విరంజనకారిగా మరియు నీటిని శుద్ధి చేయుటకు కార్బన్ ను ఉపయోగిస్తారు.

ప్రశ్న 24.
అయోడిన్ ఉపయోగాలను తెల్పండి.
జవాబు:
ఆల్కహాల్ లో కలిసిన టింక్చర్ అయోడిన్ ను వైద్య అవసరాలకు ఉపయోగిస్తారు.

ప్రశ్న 25.
ధ్వనిని ఉత్పత్తి చేసే కొన్ని పదార్థాల పేర్లు రాయండి.
జవాబు:
జింక్ (Zn), కాపర్ (Cu), అల్యూమినియం (AI), మెగ్నీషియం (Mg).

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

ప్రశ్న 26.
ధ్వనిని ఉత్పత్తి చేయని కొన్ని పదార్థాల పేర్లు రాయండి.
జవాబు:
సల్ఫర్ (S), కార్బన్ (C), అయోడిన్ (I).

ప్రశ్న 27.
మీకు కొన్ని పదార్థాలు ఇచ్చినప్పుడు లోహం అని ఎలా నిర్ణయిస్తావు?
జవాబు:
ఇచ్చిన పదార్థాలలో ఏ పదార్థం అయితే ద్యుతిగుణం, ధ్వనిగుణం, స్తరణీయత, తాంతవత, ఉష్ణవాహకత మరియు విద్యుత్ వాహకత ధర్మాలను కలిగి ఉంటుందో ఆ పదార్థాన్ని లోహము అని అంటారు.

ప్రశ్న 28.
మీకు కొన్ని పదార్థాలు ఇచ్చినప్పుడు అలోహం అని ఎలా నిర్ణయిస్తావు?
జవాబు:
ఇచ్చిన పదార్థాలలో ఏ పదార్థం అయితే ద్యుతిగుణం, ధ్వనిగుణం, స్తరణీయత, తాంతవత, ఉష్ణవాహకత మరియు విద్యుత్ వాహకత ధర్మాలను కలిగి ఉండదో ఆ పదార్థాన్ని అలోహం అంటారు.

ప్రశ్న 29.
ఏ లోహాలను ఆభరణాల తయారీకి వాడుతారు?
జవాబు:
బంగారం, వెండి మరియు ప్లాటినమ్ లోహాలను ఆభరణాల తయారీకి వాడతారు.

ప్రశ్న 30.
దైనందిన జీవితంలో ఉత్తేజిత కార్బన్ యొక్క ఏవేని రెండు ఉపయోగాలను తెలపండి.
జవాబు:

  1. మందుల తయారీలో
  2. గాలి శుద్దీకరణలో
  3. విరంజనకారి
  4. బంగారం శుద్ధీకరణలో
  5. నీటి శుద్దీకరణలో

8th Class Physics 5th Lesson లోహాలు మరియు అలోహాలు 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కొన్ని లోహాల యొక్క నిత్యజీవిత ఉపయోగాలను రాయండి. .
(లేదా)
వేర్వేరు సందర్భములలో లోహాల యొక్క ఉపయోగాలను నాల్గింటిని రాయండి.
జవాబు:
లోహాల యొక్క నిత్యజీవిత ఉపయోగాలు :

  1. మిఠాయిలపై అలంకరించడానికి వెండిరేకును ఉపయోగిస్తారు.
  2. తినుబండారములను ప్యాకింగ్ చేయడానికీ, చాక్లెట్ రేపర్లకు పలుచని అల్యూమినియం రేకును ఉపయోగిస్తారు.
  3. అల్యూమినియం మరియు రాగి మిశ్రమ పదార్థాన్ని నాణాలు, పతకాలు, విగ్రహాల తయారీలో వాడతారు.
  4. జింక్ మరియు ఇనుప మిశ్రమ పదార్థాన్ని ఇనుపరేకు తయారీలో వాడతారు.
  5. వ్యవసాయ పనిముట్లు తయారు చేయుటకు ఉపయోగిస్తారు.
  6. లోహాలను విద్యుత్ పరికరాలు, ఆటోమొబైల్స్, శాటిలైట్స్, విమానాలు, వంట పాత్రలు, యంత్ర భాగాలు, అలంకరణ సామాగ్రి తయారుచేయడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 2.
మీ ప్రయోగశాలలో వాడే ఆమ్లాలు మరియు క్షారాల పేర్లు రాసి, వాటిలోని లోహాలు మరియు అలోహాలు ఈ కింది పట్టికలో రాయండి. ఈ. సమాచార సేకరణకు మీ ఉపాధ్యాయుని సహాయం తీసుకోండి.
జవాబు:
AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 1

8th Class Physics 5th Lesson లోహాలు మరియు అలోహాలు 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
మెగ్నీషియం ఆక్సిజన్ తో చర్య జరిపి క్షార స్వభావం గల మెగ్నీషియం ఆక్సెడ్ ను ఏర్పరచునని తెలుపుటకు ఒక కృత్యమును సూచించండి.
జవాబు:

  1. స్పిరిట్ ల్యాంపును వెలిగించాలి.
  2. పట్టుకారు సహాయంతో ఒక చిన్న మెగ్నీషియం రిబ్బను ముక్కను పట్టుకోవాలి.
  3. స్పిరిట్ ల్యాంప్ జ్వాలపై మెగ్నీషియం తీగను వేడి చేయాలి.
  4. మెగ్నీషియం ఆక్సిజన్తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ ను ఏర్పరుస్తుంది.
    మెగ్నీషియం + ఆక్సిజన్ → మెగ్నీషియం ఆక్సెడ్
    2 mg + O2 → 2 mgO
  5. ఏర్పడిన మెగ్నీషియం ఆక్సెడ్ తెల్లని బూడిద రూపంలో ఉంటుంది.
  6. ఈ తెల్లని బూడిదను పెట్రెడిష్ లో తీసుకొని, కొద్దిగా నీరు కలపాలి.
  7. ఎర్ర లిట్మస్ పేపరును ఆ ద్రావణంలో ముంచాలి. ఎర్ర లిట్మస్ నీలి రంగులోకి మారుతుంది.
  8. ద్రావణం క్షార స్వభావం కనుక మెగ్నీషియం ఆక్సెడ్ క్షారం అని తెలుస్తుంది.

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

ప్రశ్న 2.
కింది వాటిని వాటి ధర్మాల ఆధారంగా వర్గీకరించి, ఉపయోగాలను పట్టికలో రాయుము.
AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 2
జవాబు:
AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 3

ప్రశ్న 3.
లోహాల ఉష్ణవాహకతను పరిశీలించుటకు అవసరమయ్యే పరికరాల అమరికను చూపే పటమును గీయుము. . రాగి, అల్యూమినియం, ఇనుము వంటి లోహాలను వంట పాత్రల తయారీకి ఎందుకు ఉపయోగిస్తారు?
జవాబు:
AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 4

రాగి, అల్యూమినియం, ఇనుము వంటి లోహాలు ఉష్ణ వాహకతను ప్రదర్శిస్తాయి. కనుక వంట పాత్రల తయారీకి వీటిని ఉపయోగిస్తారు.

8th Class Physics 5th Lesson లోహాలు మరియు అలోహాలు 1 Mark Bits Questions and Answers

బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. భావన (A) : పాదరసం అనేది లోహం కాదు. అలోహం మాత్రమే.
కారణం (R) : లోహలు క్రింది లక్షణాలను చూపుతాయి.
1) ధ్యుతి 2) ధ్వని 3) తాంతవత 4) స్తరణీయత 5) వాహకత
A) A మరియు R లు సరైనవి. A ని R సమర్ధించును
B) A మరియు R లు సరైనవి కానీ A ని R సమర్థించదు
C) A సరైనది, R సరైనది కాదు
D) A సరియైనది కాదు. R సరియైనది
జవాబు:
D) A సరియైనది కాదు. R సరియైనది

2. వేణి : లోహాలన్నీ ధ్యుతి గుణాన్ని కలిగి ఉంటాయి.
సన : ధ్యుతి గుణం కలిగి ఉన్నవన్నీ లోహాలే
A) వేణి చెప్పింది ఒప్పు, సన చెప్పింది తప్పు
B) వేణి చెప్పింది తప్పు, సన చెప్పింది ఒప్పు
C) ఇద్దరు చెప్పిందీ ఒప్పే
D) ఇద్దరు చెప్పిందీ తప్పే
జవాబు:
A) వేణి చెప్పింది ఒప్పు, సన చెప్పింది తప్పు

3. భావన (A) : లోహ ఆక్సైడ్ల నుండి క్షారాలు తయారవుతాయి.
కారణం (B) : క్షారాలు ఎరుపు లిట్మసను, నీలం రంగులోకి మార్చుతుంది.
A) A మరియు R లు సరైనవి. A ను R వివరిస్తుంది
B) A మరియు R లు సరైనవి కానీ A ను R వివరించలేదు.
C) A సరైనది, R సరికాదు
D) A సరికాదు. R సరైనది
జవాబు:
B) A మరియు R లు సరైనవి కానీ A ను R వివరించలేదు.

4. సరియైనదానిని ఎంచుకొనుము.
A) అలోహ ఆక్సైడ్లు – ఆమ్లత్వం
B) లోహ ఆక్సైడ్లు – క్షారత్వం
C) A మరియు B
D) A కాదు, B కాదు
జవాబు:
C) A మరియు B

5. నీటితో చురుకుగా చర్యలో పాల్గొనే పదార్థం
A) సోడియం
B) అయోడిన్
C) సల్ఫర్
D) ఫాస్పరస్
జవాబు:
A) సోడియం

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

6. ప్రకృతిలో సహజంగా శురూపంలో లభించేవి
A) బంగారం
B) ప్లాటినం
C) A మరియు B
D) పైవేవికావు
జవాబు:
C) A మరియు B

7. ఈ కింది వానిలో లోహము.
A) గంధకం
B) కార్బన్
C) అయోడిన్
D) రాగి
జవాబు:
D) రాగి

8. ఈ కింది వానిలో ధ్వని గుణం లేనిది.
A) కాపర్
B) అల్యూమినియం
C) చెక్కముక్క
D) ఇనుము
జవాబు:
C) చెక్కముక్క

9. ధ్వని గుణం లేని లోహము.
A) ఇనుము
B) పాదరసం
C) కాపర్
D) అల్యూమినియం
జవాబు:
B) పాదరసం

10. పలుచని చదునైన రేకులుగా మార్చగలిగే ధర్మం
A) స్తరణీయత
B) తాంతవత
C) ధ్వనిగుణం
D) లోహద్యుతి
జవాబు:
A) స్తరణీయత

11. రాగి విగ్రహాలు మరియు వంట పాత్రలు గాలిలోని తేమ ఆక్సిజన్తో చర్య జరిపి ఈ రంగుగా మారును.
A) నల్లని
B) ఎరుపు
C) బంగారం రంగు
D) ఆకుపచ్చ
జవాబు:
D) ఆకుపచ్చ

12. మానవ శరీరంలోని ద్రవ్యరాశిలో అత్యధిక శాతం గల మూలకం
A) ఆక్సిజన్
B) కార్బన్
C) హైడ్రోజన్
D) నైట్రోజన్
జవాబు:
A) ఆక్సిజన్

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

13. లోహాలు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినపుడు వెలువడే వాయువు.
A) క్లోరిన్
B) హైడ్రోజన్
C) నీటి ఆవిరి
D) కార్బన్ డై ఆక్సైడ్
జవాబు:
B) హైడ్రోజన్

14. ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్లు, వెంట్రుకలు మరియు చేతిగోళ్లలో ఉండే మూలకం
A) సల్ఫర్
B) కార్బన్
C) అయోడిన్
D) నైట్రోజన్
జవాబు:
A) సల్ఫర్

15. విద్యుత్ పరికరాలు, వంటపాత్రల యొక్క పిడులు లోహాలతో తయారుకావు ఎందుకంటే లోహాలు …..
A) విద్యుత్ వాహకాలు
B) ఉష్ణ వాహకాలు
C) విద్యుత్ మరియు ఉష్ణ వాహకాలు
D) ఏదీకాదు
జవాబు:
C) విద్యుత్ మరియు ఉష్ణ వాహకాలు

16. మృదువుగా మరియు కత్తితో కత్తిరించగల లోహము.
A) పాదరసం
B) సోడియం
C) బంగారం
D) వెండి
జవాబు:
B) సోడియం

17. దృఢంగా ఉండే అలోహం.
A) ప్లాటినం
B) బంగారం
C) వెండి
D) డైమండ్
జవాబు:
D) డైమండ్

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

18. ఈ కింది వానిలో అత్యధిక లోహద్యుతి గల లోహం.
A) అల్యూమినియం
B) రాగి
C) వెండి
D) బంగారం
జవాబు:
D) బంగారం

19. ఈ కింది వానిలో విద్యుత్ వాహకం.
A) సల్ఫర్
B) అయోడిన్
C) గ్రాఫైట్
D) డైమండ్
జవాబు:
C) గ్రాఫైట్

20. ఈ కింది వానిలో స్తరణీయత ధర్మం గలది.
A) జింక్
B) ఫాస్ఫరస్
C) సల్ఫర్
D) ఆక్సిజన్
జవాబు:
A) జింక్

21. ఈ క్రింది వాటిలో లోహ ధర్మంను ప్రదర్శించునది.
A) క్రికెట్ బ్యాట్
B) కీ బోర్డ్
C) మంచినీటి కుండ
D) కుర్చీ
జవాబు:
D) కుర్చీ

22. ఈ క్రింది వాటిలో అలోహంకు ఉదాహరణ
A) వంటపాత్ర
B) నీటి బిందె
C) హారము
D) బొగ్గు
జవాబు:
D) బొగ్గు

23. ఈ క్రింది వాటిలో భిన్నమైనది
A) సల్ఫర్
B) కార్బన్
C) అయోడిన్
D) రాగి
జవాబు:
D) రాగి

24. ఈ క్రింది వాటిలో విభిన్నమైనది
A) బంగారం
B) అల్యూమినియం
C) రాగి
D) సోడియం
జవాబు:
D) సోడియం

25. ఈ క్రింది వాటిలో లోహాల భౌతిక ధర్మము కానిది
A) ధ్వనిగుణం
B) స్తరణీయత
C) తాంతవత
D) ఆక్సిజన్‌ చర్య
జవాబు:
D) ఆక్సిజన్‌ చర్య

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

26. ఈ క్రింది వాటిలో లోహాల రసాయన ధర్మము
A) తుప్పు పటడం
B) HCl తో చర్య
C) H2SO4 తో చర్య
D) అన్నియూ
జవాబు:
D) అన్నియూ

27. ప్రకాశవంతమైన ఉపరితలం కలిగి ఉండి కాంతిని పరావర్తనం చేయగలిగే పదార్థాలు ….. గల పదార్థాలు.
A) ద్యుతిగుణం
B) అద్యుతిగుణం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) ద్యుతిగుణం

28. సాధారణంగా ద్యుతిగుణంను ప్రదర్శించు పదార్థాలు
A) లోహాలు
B) అలోహాలు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) లోహాలు

29. నేలపై పడినపుడు ధ్వనిని ఉత్పత్తి చేయు పదార్థాలు
A) చప్పుడు పదార్థాలు
B) ధ్వని జనక పదార్థాలు
C) అధ్వని జనక పదార్థాలు
D) ఏదీకాదు
జవాబు:
B) ధ్వని జనక పదార్థాలు

30. ఈ క్రింది వాటిలో ధ్వని గుణకంను ప్రదర్శించునది
A) ఇనుము
B) సుద్దముక్క
C) చెక్క
D) మట్టి
జవాబు:
A) ఇనుము

31. ఈ కింది వాటిలో ఘనస్థితిలో ఉండు లోహము
A) సోడియం
B) పొటాషియం
C) పాదరసం
D) కార్బన్
జవాబు:
D) కార్బన్

32. ఈ కింది వాటిలో ద్రవస్థితిలో గల లోహము
A) సోడియం
B) పొటాషియం
C) పాదరసం
D) కార్బన్
జవాబు:
C) పాదరసం

33. ఈ కింది వాటిలో మృదువుగా ఉండు లోహము
A) పాదరసం
B) కార్బన్
C) అయోడిన్
D) సోడియం
జవాబు:
D) సోడియం

34. లోహాన్ని రేకులుగా సాగదీయగలుగుటకు కారణమైన లోహధర్మం
Ā) తాంతవత
B) మరణీయత
C) ధ్వనిగుణం
D) వాహకత
జవాబు:
B) మరణీయత

35. ఈ క్రింది వాటిలో అధిక స్తరణీయతను ప్రదర్శించనిది
A) వెండి
B) బంగారం
C) కార్బన్
D) అల్యూమినియం
జవాబు:
C) కార్బన్

36. లోహాన్ని సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మం
A) మరణీయత
B) తాంతవత
C) ధ్వనిగుణం
D) వాహకత
జవాబు:
B) తాంతవత

37. ఈ కింది వాటిలో అత్యధిక తాంతవత గల లోహము
A) సోడియం
B) పాదరసం
C) బంగారం
D) కార్బన్
జవాబు:
C) బంగారం

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

38. ఈ క్రింది వాటిలో నీటి శుద్ధతకు ఉపయోగించునది
A) అయోడిన్
B) కార్బన్
C) సల్ఫర్
D) పొటాషియం
జవాబు:
B) కార్బన్

39. ఈ కింది వాటిలో తీగలుగా మార్చలేని పదార్థము
A) ఇనుము
B) జింకు
C) గంధకం
D) రాగి
జవాబు:
C) గంధకం

40. తమ గుండా విద్యుత్ ను ప్రవహింపజేయు పదార్థాలు
A) విద్యుత్ వాహకాలు
B) అవిద్యుత్ వాహకాలు
C) ఉష్ణవాహకాలు
D) అధమ ఉష్ణవాహకాలు
జవాబు:
A) విద్యుత్ వాహకాలు

41. ఈ క్రింది వాటిలో అవిద్యుత్ వాహకము
A) అల్యూమినియం
B) రాగి
C) ఇనుము
D) బొగ్గు
జవాబు:
D) బొగ్గు

42. సల్ఫర్ డై ఆక్సైడ్ ఒక
A) క్షార ఆక్సెడ్
B) ఆమ్ల ఆక్సైడ్
C) తటస్థ ఆక్సైడ్
D) అమాఫోలిరిక్ ఆక్సైడ్
జవాబు:
B) ఆమ్ల ఆక్సైడ్

43. లోహాలు ఆక్సిజన్ తో చర్య జరిపి ఏర్పరచు ఆక్సెన్లు
A) ఆమ్ల ఆక్సెలు
B) క్షార ఆక్సెలు
C) తటస్థ ఆక్సెన్లు
D) స్ఫటిక ఆక్సెట్లు
జవాబు:
B) క్షార ఆక్సెలు

44. అలోహాలు ఆక్సిజన్ తో చర్య జరిపి ఏర్పరచు ఆక్సెట్లు
A) ఆమ్ల ఆక్సెలు
B) క్షార ఆక్సెలు
C) తటస్థ ఆక్సెన్లు
D) స్ఫటిక ఆక్సైడ్లు
జవాబు:
A) ఆమ్ల ఆక్సెలు

45. సల్ఫర్ డై ఆక్సెడ్, నీలి లిట్మస ను ఎరుపు రంగులోకి మార్చుటకు కారణము SO<sub>2</sub> ఒక.
A) ఆమ్ల ఆక్సైడ్
B) క్షార ఆక్సైడ్
C) తటస్థ ఆక్సైడ్
D) స్ఫటిక ఆక్సైడ్
జవాబు:
A) ఆమ్ల ఆక్సైడ్

46. క్రింది వాటిలో గాలితో చర్య జరుపనిది
A) వెండి
B) రాగి విగ్రహాలు
C) ఇత్తడి వస్తువులు
D) బంగారము
జవాబు:
D) బంగారము

47. మెగ్నీషియం తీగను ఆరుబయట ఉంచిన దాని మెరుపును కోల్పోవుటకు గల కారణము
A) గాలితో చర్య జరుపుట వలన
B) ఎండలో ఉండుట వలన
C) తేమలో ఉండుట వలన
D) ఏదీకాదు
జవాబు:
A) గాలితో చర్య జరుపుట వలన

48. ఈ క్రింది వాటిలో మానవ శరీర మూలకాలపరముగా విభిన్నమైనది
A) నీరు
B) ఆక్సిజన్
C) హైడ్రోజన్
D) కార్బన్
జవాబు:
A) నీరు

49. మానవ శరీరంలో మూలకాలపరంగా ఆక్సిజన్ శాతం
A) 18%
B) 10%
C) 3%
D) 65%
జవాబు:
D) 65%

50. మానవ శరీరంలో మూలకాలపరంగా కాల్షియం శాతం
A) 3%
B) 1.5%
C) 10%
D) 65%
జవాబు:
B) 1.5%

51. బంగారం, ప్లాటినాలను ఆభరణాలకు వినియోగించుటకు కారణం
A) గాలిలోని అంశీభూతాలతో చర్య జరుపుట
B) గాలిలోని అంశీభూతాలతో చర్య జరుపకపోవుట
C) ఆక్సిజన్తో చర్య జరుపుట
D) ఆక్సిజన్ తో చర్య జరుపకపోవుట
జవాబు:
B) గాలిలోని అంశీభూతాలతో చర్య జరుపకపోవుట

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

52. మానవ శరీరంలో ద్రవ్యరాశి పరముగా అత్యల్ప శాతంగా గల మూలకము
A) కాల్సియం
B) హైడ్రోజన్
C) ఫాస్ఫరస్
D) నైట్రోజన్.
జవాబు:
C) ఫాస్ఫరస్

53. లోహాలు నీటితో జరుపు చర్య ఒక
A) వేగవంతమైన చర్య
B) మందకొడి చర్య
C) అతివేగవంతమైనట్టి చర్య
D) ఏదీకాదు
జవాబు:
B) మందకొడి చర్య

54. ఈ క్రింది వాటిలో నీటితో చర్య జరుపనివి
A) లోహాలు
B) అలోహాలు
C) A మరియు B
D) చెప్పలేము
జవాబు:
B) అలోహాలు

55. కొన్ని లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి విడుదల చేయునది.
A) ఆక్సిజన్
B) హైడ్రోజన్
C) నీరు
D) కార్బన్ డై ఆక్సైడ్
జవాబు:
B) హైడ్రోజన్

56. బాణా సంచా, మందుగుండు సామగ్రి, గన్ పౌడర్, అగ్గిపెట్టెలు, యాంటిసెప్టిక్ ఆయింట్ మెంట్లందు వాడు అలోహము
A) సల్ఫర్
B) కార్బన్
C) అయోడిన్
D) ఏదీకాదు
జవాబు:
A) సల్ఫర్

57. విరంజనకారిగా మరియు నీటిని శుద్ధిచేయుటకు వాడు అలోహము
A) సల్ఫర్
B) కార్బన్
C) అయోడిన్
D) ఏదీకాదు
జవాబు:
B) కార్బన్

58. .టింక్చర్ నందు వాడు అలోహము
A) సల్పర్
B) కార్బన్
C) అయోడిన్
D) ఏదీకాదు
జవాబు:
C) అయోడిన్

59. నాణాలు, పతకాలు, విగ్రహాల తయారీలో వాడు లోహం
A) రాగి
B) అల్యూమినియం
C) A మరియు B ల మిశ్రమం
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B ల మిశ్రమం

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

60. ఇనుపరేకుల తయారీలో వాడు లోహం
A) జింక్
B) ఇనుము
C) A మరియు Bల మిశ్రమం
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు Bల మిశ్రమం

61. క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది?

గ్రూపు – A గ్రూపు – B
1. బంగారం a) ధర్మామీటరులలో ఉపయోగిస్తారు.
2. ఐరన్ (ఇనుము) b) విద్యుత్ తీగలుగా ఉపయోగిస్తారు.
3. అల్యూమినియం c) తినుబండారములను ప్యాకింగ్ చేయుటకు ఉపయోగిస్తారు.
4. కార్బన్ d) ఆభరణాలకు ఉపయోగిస్తారు.
5. కాపర్ e) యంత్రాలను తయారుచేయుటకు ఉపయోగిస్తారు.
6. పాదరసం f) ఇంధనంగా ఉపయోగిస్తారు.

A) 1-d, 2-e, 3-c, 4-b, 5-f, 6-a
B) 1-d, 2-e, 3-c, 4-f, 5-b, 6-a
C) 1-d, 2-e, 3-b, 4-c, 5-f, 6-a
D) 1-d, 2-e, 3-c, 4-b, 5-a, 6-f
జవాబు:
B) 1-d, 2-e, 3-c, 4-f, 5-b, 6-a

62. క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది?

గ్రూపు – A గ్రూపు – B
1. జింక్ a) అలోహం
2. అయోడిన్ b) పాదరసం
3. ద్రవం c) కార్బన్
4. గ్రాఫైట్ d) వెండి (సిల్వర్)
5. సిలికాన్ e) నీటిని శుద్ధి చేయుటకు
6. స్తరణీయత f) అర్ధలోహం
7. క్లోరిన్ g) ఉష్ణ బంధకము
8. అలోహం h) లోహం

A) 1-h, 2-a, 3-b, 4-c, 5-f, 6-e, 7-d, 8-g
B) 1-h, 2-b, 3-a, 4-c, 5-f, 6-e, 7-d, 8-g
C) 1-h, 2-a, 3-b, 4-c, 5-f, 6-e, 7-g, 8-d
D) 1-h, 2-a, 3-b, 4-c, 5-f, 6-d, 7-e, 8-g
జవాబు:
D) 1-h, 2-a, 3-b, 4-c, 5-f, 6-d, 7-e, 8-g

63. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపినపుడు విడుదలగు వాయువు
A) ఆక్సిజన్
B) హైడ్రోజన్
C) కార్బన్ డై ఆక్సైడ్
D) కార్బన్ మోనాక్సైడ్
జవాబు:
B) హైడ్రోజన్

64. క్రింది ఖాళీని సారూప్యతను బట్టి సరైన పదంతో పూర్తి చేయండి.
కార్బన్ డైఆక్సైడ్ : భూతాపం : : ………. : నాసియా
A) సల్ఫర్ డై ఆక్సైడ్
B) పెయింట్ల నుండి విడుదలయ్యే విషపదార్థం
C) ఆక్సిజన్
D) హైడ్రోజన్
జవాబు:
B) పెయింట్ల నుండి విడుదలయ్యే విషపదార్థం

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

65. జతపరచండి :

బి
1. సల్ఫర్ a) మిఠాయిలపై
2. వెండి b) నాణాలు తయారీకి
3. రాగి c) బాణాసంచా తయారీకి

సరియైన సమాధానమును గుర్తించండి.
A) 1-b, 2-c, 3-a
B) 1-a, 2-c, 3-b
C) 1-c, 2-a, 3-b
D) 1-c, 2-b, 3-a
జవాబు:
C) 1-c, 2-a, 3-b

66. జతపరచండి :

బి
i) స్తరణీయత ప్రదర్శించని లోహం ఎ) పాదరసం
ii) మరణీయత గల లోహం బి) ఫాస్ఫరస్
iii) అలోహం సి) ఇనుము

సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
A) i-సి, ii-బి, iii -ఎ
B) i-ఎ, ii-బి, iii-సి
C) i-సి, ii-ఎ, iii-బి
D) i-ఎ, ii-సి, iii-బి
జవాబు:
D) i-ఎ, ii-సి, iii-బి

67. అలోహం ఆక్సిజన్ తో చర్య జరిపి, X ను లోహం ఆక్సిజన్ తో చర్య జరిపి Y ను ఏర్పరుస్తాయి. X, Y ల స్వభావం
A) X ఆమ్లం, Y క్షారం
B) X క్షారం, Y ఆమ్లం
C) X ఆమ్లం, Y ఆమ్లం
D) X క్షారం, Y క్షారం
జవాబు:
A) X ఆమ్లం, Y క్షారం

68. మానవ శరీరంలో మూలకాలను వాటి శాతాలాధారంగా జతపరచండి.

మూలకము శాతము
1. హైడ్రోజన్ a) 65%
2. ఆక్సిజన్ b) 18%
3. కార్బన్ c) 10%
d) 0.04%

సరియైన సమాధానమును గుర్తించండి.
A) 1-d, 2-b, 3-a
B) 1-c, 2-a, 3-b
C) 1-a, 2-b, 3-c
D) 1-b, 2-c, 3-d
జవాబు:
B) 1-c, 2-a, 3-b

69. ఎక్కువ లోహాలు సజల ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును వెలువరుస్తాయి. క్రింది వాటిలో హైడ్రోజన్ వాయువును వెలువరచని లోహమేది?
A) మెగ్నీషియం
B) అల్యూమినియం
C) ఇనుము
D) రాగి
జవాబు:
D) రాగి

70. గది ఉష్ణోగ్రత వద్ద ఘన స్థితిలో ఉండే అలోహము అలంకరించడానికి
A) కార్బన్
B) క్లోరిన్
C) బ్రోమిన్
D) అయోడిన్
జవాబు:
A&D

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

71. సాధారణంగా లోహాలు త్రుప్పు పడతాయి. క్రింది ఏయే సందర్భాలలో ఇనుము త్రుప్పు పడుతుంది?
A) ఆక్సిజన్ సమక్షంలో
B) తేమతో కూడిన ఆక్సిజన్ సమక్షంలో
C) తేమలేని ఆక్సిజన్ సమక్షంలో
D) తేమ సమక్షంలో
జవాబు:
B) తేమతో కూడిన ఆక్సిజన్ సమక్షంలో

72. అలోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి ఈ క్రింది వానిలో దేనిని ఏర్పరుస్తాయి?
A) క్షారాలనిస్తాయి
B) అలోహ ఆక్సెలనిస్తాయి
C) లోహ ఆక్సె లనిస్తాయి
D) ఆమ్లాలనిస్తాయి
జవాబు:
B&D

73. పదార్థాల లోహధర్మాలను పరిశీలించుటకు ఖచ్చితమైన సూచికలు
A) ద్యుతి గుణం, తాంతవత కలిగి ఉండుట
B) ధ్వని, ద్యుతి, స్తరణీయత, తాంతవత కలిగి ఉండుట
C) రసాయన ధర్మాలు
D) ధ్వని గుణం, ద్యుతి గుణం కలిగి ఉండుట
జవాబు:
C) రసాయన ధర్మాలు

74. మిఠాయిలపై అలంకరించడానికి పలుచని వెండిరేకును వాడతారు. క్రింది ఏ లోహ ధర్మం ఆధారంగా వాడతారు?
A) స్థరణీయత
B) ధ్వని గుణం
C) ద్యుతి గుణం
D) తాంతవత
జవాబు:
A) స్థరణీయత

75. పాఠశాలలో గంటను చెక్కతో తయారుచేస్తే ఏమగును?
A) అది అధిక తీవ్రతతో మ్రోగును
B) అది మోగదు
C) అది మ్రోగునపుడు కంపనాలు చేయదు
D) అది చాలా తక్కువ తీవ్రతతో మ్రోగును
జవాబు:
D) అది చాలా తక్కువ తీవ్రతతో మ్రోగును

76. ‘A’ ధ్వని గుణం లేని ఒక లోహం కలదు. అది ఏమిటో ఊహించండి.
A) కార్బన్
B) పాదరసం
C) ఇత్తడి
D) బంగారం
జవాబు:
B) పాదరసం

77. ప్లాస్టిక్ కి స్థరణీయత లేదని నీవు ఎలా చెప్పగలవు?
A) ప్లాస్టికు పల్చని రేకులు లాగా లభించదు
B) ప్లాస్టికు తీగలు లాగా లభించదు
C) ప్లాస్టిక్ లను సుత్తితో కొట్టి రేకులుగా మార్చలేము
D) పైవన్నియు
జవాబు:
C) ప్లాస్టిక్ లను సుత్తితో కొట్టి రేకులుగా మార్చలేము

78. ‘X’ అనే పదార్థం కలదు. దీనిని కాల్చి బూడిద చేసి, నీరు కలిపితే క్షార లక్షణాన్ని కలిగి యుంటుంది. అయిన ‘X’ క్రింది వానిలో ఏదై ఉంటుందో ఊహించుము.
A) మెగ్నీషియం
B) కార్బన్
C) ఆక్సిజన్
D) బంగారం
జవాబు:
A) మెగ్నీషియం

79. ఒక పరీక్ష నాళికలో ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాన్ని తీసుకొని, దానికి కొంత కాపర్ కలిపితే ఏమౌవుతుందో ఊహించి జవాబును ఎంచుకోండి.
A) కాపర్ ఇనుముని స్థానభ్రంశం చెందిస్తుంది
B) కాపర్ ఇనుముని స్థానభ్రంశం చెందించదు
C) కాపర్ ద్రావణంలో కరిగిపోతుంది
D) పైవేవీ జరగవు
జవాబు:
A) కాపర్ ఇనుముని స్థానభ్రంశం చెందిస్తుంది

80. లీల జింక్ సల్ఫేట్ ద్రావడానికి, ఇనుపరంజను వేసినపుడు జింకను ఇనుము స్థానభ్రంశం చెందించలేకపోయింది కారణాన్ని ఊహించండి.
A) జింక్ కన్నా ఇనుము యొక్క చర్యాశీలత ఎక్కువ
B) ఇనుము కన్నా జింక్ చర్యాశీలత ఎక్కువ
C) జింక్ మరియు ఇనుము లోహాలు
D) జింక్ మరియు ఇనుము అలోహాలు
జవాబు:
B) ఇనుము కన్నా జింక్ చర్యాశీలత ఎక్కువ

81. క్రింది పరికరంతో ధ్వని గుణాన్ని పరీక్షించవచ్చును.
A) ఆమ్లం
B) లిట్మస్ కాగితం
C) బ్యాటరీ
D) సుత్తి
జవాబు:
D) సుత్తి

82. ఏ పరికరం అవసరం లేకుండా లోహ ధ్వని గుణాన్ని క్రింది విధంగా పరీక్షించవచ్చును.
A) లోహాన్ని వేడి చేసి
B) లోహాన్ని కాంక్రీట్ తలంపై పడివేసి
C) లోహాన్ని వంచి
D) లోహాన్ని నీటిలో వేసి
జవాబు:
B) లోహాన్ని కాంక్రీట్ తలంపై పడివేసి

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

83. ఒక లోహపు తీగ నీ దగ్గర ఉంది. దాని యొక్క స్తరణీయతను పరీక్షించడానికి నీకు కావలసిన పరికరం
A) సుత్తి
B) కత్తి
C) స్కూృడ్రైవర్
D) రంపం
జవాబు:
A) సుత్తి

84. పట్టిక

పదార్థం రేకులుగా మార్చగలం తీగలుగా మార్చగలం
A
B
C

పైన చూపిన పరిశీలనా పట్టిక దేనిని చూపుతుంది?
A) స్తరణీయత
B) తాంతవత
C) ధ్యుతిగుణం
D) A మరియు B
జవాబు:
D) A మరియు B

85.
AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 6
పై పటంలో చూపిన ప్రయోగం క్రింది చూపిన ఏ ధర్మాన్ని పరీక్షించుటకు ఇవ్వబడింది.
A) ధ్వని గుణం
B) ధ్యుతి గుణం
C) విద్యుత్ వాహకత్వం
D) పైవన్నియు
జవాబు:
C) విద్యుత్ వాహకత్వం

86. ఒక పదార్థం యొక్క విద్యుత్ వాహకతను పరీక్షించుటకు క్రింది పరికరాలు అవసరమవుతాయి.
A) బ్యాటరీ, బల్బ్, అనుసంధాన తీగలు
B) సుత్తి, కట్టర్
C) విద్యుత్ టెస్టర్
D) మైనం, స్పిరిట్ ల్యాంప్, పిన్నులు
జవాబు:
A) బ్యాటరీ, బల్బ్, అనుసంధాన తీగలు

87.
AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 5
పై పటం ఏ ప్రయోగాన్ని సూచిస్తుంది?
A) విద్యుత్ వాహకత
B) ఉష్ణవాహకత
C) ధ్వని వాహకత
D) మైనం కరుగు ఉష్ణోగ్రత
జవాబు:
B) ఉష్ణవాహకత

88. సల్ఫర్ ను గాలిలో మండించినపుడు, నీవు తీసుకోవలసిన జాగ్రత్తలేవి?
A) వెలువడిన వాయువులను పీల్చరాదు
B) గాలివీచే దిశకు ఎదురుగా నిల్చోరాదు
C) A మరియు B
D) పైవేవీ కాదు
జవాబు:
C) A మరియు B

89. సల్ఫర్‌ను ప్రయోగశాలలో మండించినపుడు
A) మిరుమిట్లు గొల్పే కాంతి వస్తుంది.
B) పొగలను వదులుతుంది
C) అది మండదు
D) A మరియు B
జవాబు:
B) పొగలను వదులుతుంది

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

90. క్రింది వానిలో ఆమ్లత్వాన్ని పరీక్షించుటకు ఉపయోగించునది
A) లిట్మస్ పేపర్
B) జ్వా లా పరీక్ష
C) బ్యాటరీ, బల్బ్
D) వీటిలో ఏదో ఒకటి
జవాబు:
A) లిట్మస్ పేపర్

91. నీవు పరీక్షనాళికలో సల్ఫర్ డయాక్సైడ్ ద్రావణాన్ని తీసుకొని నీలి లిట్మస్ పేపరుతో పరీక్షించావు. అప్పుడు లిట్మస్ పేపరు ఎరుపు రంగులోకి మారింది. నీవు చెప్పగలిగే విషయం
A) ద్రావణం ఆమ్లత్వాన్ని కలిగి ఉంది.
B) ద్రావణం క్షారత్వాన్ని కలిగి ఉంది
C) ద్రావణం తటస్థం
D) పైవేవీ కాదు
జవాబు:
A) ద్రావణం ఆమ్లత్వాన్ని కలిగి ఉంది.

92. క్రింది విధంగా పరీక్షించిన నీవు గుర్తించగల వాయువు
* పరీక్ష నాళికలలో జింక్ పౌడర్ తీసుకొని దానికి కొంత సజల హైడ్రోక్లోరికామ్లం కలపాలి.
* మండుతున్న అగ్గిపుల్లను పరీక్షనాళిక మూతివద్ద ఉంచాలి.
* అది టప్ మనే శబ్దంతో ఆరిపోవును.
A) ఆక్సిజన్
B) హైడ్రోజన్
C) CO2
D) క్లోరిన్
జవాబు:
B) హైడ్రోజన్

93. పరీక్షనాళికలో కాపర్ సల్ఫేట్ ద్రావణానికి కొంత జింక్ డస్ట్ కలిపిన – నీవు పరిశీలించే అంశం
A) ద్రావణం నీలిరంగును కోల్పోవును.
B) ఎరుపురంగు గల ద్రవ్యం అడుగున చేరును.
C) A మరియు B
D) తెల్లని పొగలు వెలువడును.
జవాబు:
C) A మరియు B

94. ఒక పరీక్ష నాళికలో కొన్ని ఇనుప మేకులు తీసుకోవాలి. వానికి కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని కలపాలి. అప్పుడు పరీక్ష నాళికలో జరిగే మార్పులు
A) మేకులపై ఎర్రని పూత ఏర్పడును.
B) ద్రావణం లేత ఆకుపచ్చని రంగులోకి మారును.
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B

95. క్రింది ప్రయోగ పద్ధతిని క్రమంలో అమర్చుము.
a) సల్ఫరను మండించుము.
b) ఎర్రలిట్మతో పరీక్షించుము.
c) గాజు జాడీలో సల్ఫరను తీసుకొనుము.
d) నీటిని కలుపుము.
A) c → d → a → b
B) a → a → d → b
C) a → c → b → d
D) b → a → d → c
జవాబు:
B) a → a → d → b

96. లోహాలతో క్షారాన్ని తయారు చేయు క్రమము
a) కాల్చి, వాచ్ గ్లాలో ఏర్పడిన బూడిదను ఉంచుము
b) నీలి లిట్మస్ పేపర్ తో పరీక్షించుము
c) మెగ్నీషియం తీగను పట్టకారుతో పట్టుకొనుము
d) నీటిని కొద్దిగా కలుపుము
A) a → c → d → b
B) c → a → b → d
C) c → d → a → b
D) c → a → d → b
జవాబు:
D) c → a → d → b

97. ‘ఉష్ణ లోహాల వాహకత్వం’ను పరిశీలించడానికి చేసే కృత్యంలో ముఖ్యంగా ఉండవలసిన పరికరాలు
A) గుండు పిన్నులు
B) రిటార్ట్ స్టాండు
C) స్పిరిట్ దీపం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

98. మెగ్నీషియం తీగను గాలిలోని ఆక్సిజన్తో మండించినప్పుడు ఏర్పడే బూడిదను నీటిలో కరిగించి ఎరుపు లిట్మతో పరీక్షించే ప్రయోగం ద్వారా నీవు నిర్ధారించిన ఫలితం
A) మెగ్నీషియం ఆక్సెడ్ క్షారస్వభావం కలిగి ఉంది.
B) మెగ్నీషియం ఆక్సెడ్ తటస్థ స్వభావం కలిగి ఉంది.
C) మెగ్నీషియం ఒక అలోహం
D) మెగ్నీషియం ఆక్సెడ్ ఆమ్ల స్వభావం కలిగి ఉంది.
జవాబు:
A) మెగ్నీషియం ఆక్సెడ్ క్షారస్వభావం కలిగి ఉంది.

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

99. జయ ఒక ఇనుపకడ్డీని తీసుకొని దానికి ఒకవైపున మైనంతో గుండు సూదులను అంటించి రెండవ వైపున సారాదీపంతో వేడిచేసింది. ఆ ప్రయోగం ద్వారా ఆమె తెలుసుకొనే విషయం
a) వేడిచేయడం వల్ల మైనం కరిగింది
b) ఇనుము మంచి ఉష్ణవాహకం
c) ఇనుము అమ ఉష్ణవాహకం
A) a, b మాత్రమే
B) a, c మాత్రమే
C) a, b & c
D) a మాత్రమే
జవాబు:
A) a, b మాత్రమే

100.
AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 6
పై వానిలో లోహం కానివి
A) A, B మరియు C
B) D
C) C, D
D) ఏదీకాదు
జవాబు:
C) C, D

101.
AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 7
పై పట్టిక నుండి నీవు చెప్పగలిగే వాక్యం
A) అన్ని పదార్థాలు ధ్యుతి గుణాన్ని కలిగి ఉంటాయి
B) అన్ని ధ్యుతిగుణం కలిగి ఉన్న పదార్థాలు లోహాలు కాదు
C) కొన్ని లోహాలు కానివి కూడా ధ్యుతి గుణం కలిగిఉంటాయి
D) B మరియు C
జవాబు:
D) B మరియు C

102. క్రింది పట్టికను పరిశీలించి లోహం కాని పదార్థాన్ని గుర్తించుము (పాదరసంను పరిగణలోకి తీసుకోవద్దు).
AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 8
(పదార్థాలను సుత్తితో కొట్టినపుడు అవి మారిన తీరును సూచించు పట్టిక)
A) A
B) B
C) C
D) A మరియు C
జవాబు:
D) A మరియు C

103.
AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 9
ఈ పటం దేనిని సూచించును?
A) తాంతవత
B) స్తరణీయత
C) ధ్యుతి గుణం
D) ధ్వని గుణం
జవాబు:
A) తాంతవత

104. క్రింది పదార్థాలను బ్యాటరీ, బల్బ్ తో అనుసంధానం చేసినపుడు నమోదుకాబడిన అంశాలను చూపుతుంది.
AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 10
వీటిలో అలోహాలు
A) A, B
B) C, D
C) నిర్ధారించలేము
D) అన్నియూ
జవాబు:
C) నిర్ధారించలేము

105. కాపర్ సల్ఫేట్ + జింక్ → జింక్ సల్ఫేట్ + రాగి
కాపర్ సల్ఫేట్ + ఇనుము → ఐరన్ సల్ఫేట్ + రాగి
ఫేస్ సల్ఫేట్ + రాగి → చర్యలేదు
పైన ఇవ్వబడిన సమాచారం ఆధారంగా పర్యాశీలత ఎక్కువగాగల లోహాలు
A) రాగి
B) జింక్ బంగారం
C) ఇనుము
D) ఏదీకాదు
జవాబు:
A) రాగి

106. క్రింది వానిలో ఏది ఆమ్లం తయారీకి ఉపయోగపడును?
A) సల్ఫర్
B) కార్బన్
C) మెగ్నీషియం
D) A మరియు B
జవాబు:
D) A మరియు B

107. హిమోగ్లోబిన్లో ఉండే లోహం
A) మెగ్నీషియం
B) ఇనుము
C) కాపర్
D) జింక్
జవాబు:
B) ఇనుము

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

108. లోహాలు సాధారణంగా ఘన స్థితిలో ఉంటాయి. కానిగది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండే లోహం
A) పాదరసం
B) వెండి
C) అల్యూమినియం
D) సోడియం
జవాబు:
A) పాదరసం

109.
AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 11
ఇచ్చిన పటంలో తప్పుగా సూచించిన భాగం
A) a
B) b
C) c
D) ఏదీలేదు
జవాబు:
A) a

110. క్రింది పటంలో తప్పుగా సూచించినది
AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 5
A) a
B) b
C) c
D) d
జవాబు:
C) c

111. పైన ఇచ్చిన పటం దేనిని సూచిస్తుంది?
A) లోహాల విద్యుత్ వాహకత
B) లోహాల ఉష్ణవాహకత
C) లోహాల తాంతవత
D) లోహాల మరణీయత
జవాబు:
B) లోహాల ఉష్ణవాహకత

112.
AP Board 8th Class Physical Science Solutions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 6
దీనిలో తప్పుగా సూచించిన భాగం
A) బల్బ్
B) లోహం
C) బ్యాటరీ
D) ఏదీలేదు
జవాబు:
D) ఏదీలేదు

113. పై పటంలో చూపిన ప్రయోగం పేరు ఏమిటి?
A) లోహాల విద్యుత్ వాహకత
B) లోహాల ఉష్ణవాహకతం
C) లోహాల మరణీయత
D) లోహాల తాంతవత
జవాబు:
A) లోహాల విద్యుత్ వాహకత

114.
AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు 12
A) నీలి లిట్మస్
B) ఎర్ర లిట్మస్
C) రెండూ కాదు
D) A లేదా B
జవాబు:
A) నీలి లిట్మస్

115. మెగ్నీషియం తీగ గాలిలో మండినపుడు ఏర్పడేవి
A) మెగ్నీషియం ఆక్సైడ్, ఉష్ణం, కాంతి
B) మెగ్నీషియం ఆక్సైడ్, ఉష్ణం
C) మెగ్నీషియం ఆక్సెడ్ మరియు కాంతి
D) మెగ్నీషియం ఆక్సెడ్, నీరు
జవాబు:
A) మెగ్నీషియం ఆక్సైడ్, ఉష్ణం, కాంతి

116. క్రింది వానిని ఎక్కువ లోహాలు ఇస్తున్నందుకు అభినందించాలి.
A) గాలి
B) నీరు
C) సముద్రం
D) భూమి
జవాబు:
D) భూమి

117. బంగారాన్ని, ప్లాటినంను ఆభరణాల తయారీలో ఉపయోగిస్తున్నారు. అందరూ ఇష్టపడే ఈ లోహాలు క్రింది గుణాన్ని కలిగి ఉంటాయి.
A) గాలితో చర్య జరపవు
B) మెరుపును త్వరగా కోల్పోతాయి
C) తాంతవత, స్తరణీయతను కలిగి ఉండవు
D) పైవన్నియు
జవాబు:
A) గాలితో చర్య జరపవు

118. లోహాలు, అలోహాలను అభినందించాలి కారణం క్రింది విధంగా ఉపయోగపడుతున్నాయి.
A) ఆమ్ల క్షార తయారీలో
B) విద్యుత్, గృహ పరికరాలు తయారీలో
C) వ్యవసాయ రంగ పరికరాల తయారీలో
D) పైవన్నీయూ
జవాబు:
D) పైవన్నీయూ

119. ‘ధ్వనిగుణం’ అనే లోహ లక్షణాన్ని క్రింది పరికరాలలో వినియోగిస్తున్నారు
A) ఆభరణాలు
B) బస్సుహారన్
C) సైకిల్ బెల్
D) పైవన్నియు
జవాబు:
C) సైకిల్ బెల్

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

120. ఒక పదార్థాంతో తీగలు తయారు చేయాలని పద్మ అనుకుంది. ఆమెకు ఉపయోగపడగల పదార్థం క్రింది ధర్మాలు కలిగి ఉండాలి
A) ధ్వని గుణం ఎక్కువగా
B) తాంతవత ఎక్కువగా
C) వాహకత ఎక్కువగా
D) ధ్యుతి గుణం ఎక్కువగా
జవాబు:
B) తాంతవత ఎక్కువగా

121. అనిత విద్యుత్ టెస్టర్ పై ప్లాస్టిక్ పొర ఉండడాన్ని గమనించింది. దాని వలన ఉపయోగమేమిటి?
A) ప్లాస్టిక్ అధమ విద్యుత్ వాహకం
B) ప్లాస్టిక్ ఉత్తమ విద్యుత్ వాహకం
C) ప్లాస్టిక్ అధమ ఉష్ణవాహకం
D) ప్లాస్టిక్ ఉత్తమ ఉష్ణవాహకం
జవాబు:
C) ప్లాస్టిక్ అధమ ఉష్ణవాహకం

122. క్రింది ధర్మానికి, ఆభరణాల తయారీకి సంబంధంలేదు
A) ధ్వని గుణం
B) ధ్యుతి గుణం
C) తాంతవత
D) స్తరణీయత
జవాబు:
A) ధ్వని గుణం

123. మన ఇండ్లలో ఉపయోగించే కుక్కర్ పాత్రల హ్యండిల్సన్ను ప్లాస్టిక్ తయారుచేస్తారు కారణం
a) లోహాలు ఉష్ణవాహకాలు కాబట్టి
b) ప్లాస్టిక్ కు అధమ ఉష్ణవాహకాలు కాబట్టి
A) a
B) b
C) a మరియు b
D) a, b లు రెండూ కాదు
జవాబు:
C) a మరియు b

124. క్రింది వారిలో ఎవరు చెప్పింది సత్యము?
శ్రీను : లోహాలు వాటికి ఉన్న ఉష్ణవాహకత్వ గుణం వల్ల వంట పాత్రలు తయారు చేస్తారు.
మోహన్ : ప్లాస్టిక్ లకు ఉన్న ఉష్ణవాహకత్వ గుణం వల్ల వంట పాత్రలుగా ఉపయోగించరు.
A) శ్రీను
B) మోహన్
C) ఇద్దరూ
D) ఇద్దరూ కాదు
జవాబు:
C) ఇద్దరూ

125. ఉల్లిపాయలలో అధికంగా ఉండే ‘అలోహం
A) కార్బన్
B) సల్ఫర్
C) ఇనుము
D) జింక్
జవాబు:
B) సల్ఫర్

126. వాటర్ ప్యూరిఫయర్స్ (నీటి శుద్ధి యంత్రాలు) లలో ఉత్తేజిత కర్బనం ఉపయోగిస్తారు. ఈ అలోహం ఇలా పనిచేస్తుంది.
A) జిడ్డుని తొలగించును
B) సూక్ష్మ జీవులను చంపుతుంది
C) రంగును మార్చుతుంది
D) తీపిని ఇస్తుంది.
జవాబు:
C) రంగును మార్చుతుంది

127. అజిత్ స్వీట్ షాపులో స్వీట్లపై పల్చని లోహపు పొరను కప్పి ఉంచారు. ఆ పొరలో లోహం
A) వెండి
B) బంగారం
C) ఇనుము
D) సీసం
జవాబు:
A) వెండి

128. జతపర్చుము.

1) అల్యూమినియం + రాగి a) ఆభరణాలు
2) బంగారం + రాగి b) నాణెములు
3) ఇనుము + కర్బనం c) ఉక్కు

A) 1-a, 2-b, 3-c
B) 1- b, 2-a, 3-c
C) 1-c, 2-b, 3-a
D) 1- 2, 2-c, 3-b
జవాబు:
B) 1- b, 2-a, 3-c

AP 8th Class Physical Science Important Questions 5th Lesson లోహాలు మరియు అలోహాలు

129. ఆభరణాల తయారీకి నీవు ఉపయోగించు లోహాలు
i) పాదరసం
ii) బంగారం
ii)వెండి
iv) ప్లాటినం
A) ii మరియు iv
B) ii మరియు iii
C) ii, iii మరియు iv
D) i, ii, iii, iv
జవాబు:
D) i, ii, iii, iv