Practice the AP 8th Class Physical Science Bits with Answers 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Physical Science Bits 10th Lesson సమతలాల వద్ద కాంతి పరావర్తనం
బహుళైచ్ఛిక ప్రశ్నలు
I. సరియైన సమాధానమును గుర్తించండి.
1. ప్రక్కపటంలో ∠i, ∠r విలువలను కనుగొనుము. దూరాన్ని ఏమంటారు?
A) ∠i = 60°, ∠r = 60°
B) ∠i = 60°, ∠r = 30°
C) ∠i = 30°, ∠r = 60°
D) ∠i = 30°, ∠r = 30°
జవాబు:
D) ∠i = 30°, ∠r = 30°
2. కింది వాటిలో పరావర్తన తలంలో ఉండనిది.
A) పరావర్తనానికి కారణమైన ఉపరితలం
B) పతన కిరణం
C) పతన బిందువు వద్ద గీసిన లంబం
D) పరావర్తన కిరణం
జవాబు:
A) పరావర్తనానికి కారణమైన ఉపరితలం
3. పరావర్తన మొదటి నియమము నుండి క్రింది వానిలో సరైనది
A) ∠i = ∠r
B) ∠i > ∠r
C) ∠i < ∠r
D) ఏదీకాదు
జవాబు:
A) ∠i = ∠r
4. కాంతి పరావర్తన నియమాలను తృప్తిపరచునవి
A) సమతల దర్పణాలే
B) కుంభాకార దర్పణాలే
C) పుటాకార దర్పణాలే
D) అన్ని పరావర్తన తలాలు
జవాబు:
D) అన్ని పరావర్తన తలాలు
5. దర్పణ ధృవానికి, దర్పణవక్రతా కేంద్రానికి మధ్య
A) నాభ్యంతరం
B) నాభి
C) వ్యాసం
D) వక్రతా వ్యాసార్ధం
జవాబు:
D) వక్రతా వ్యాసార్ధం
6. దర్పణ ధృవానికి, నాభికి మధ్య దూరాన్ని అంటారు.
A) నాభ్యంతరం
B) నాభి
C) వ్యాసం
D) వ్యాసార్ధం
జవాబు:
A) నాభ్యంతరం
7. నాభ్యంతరం మరియు వక్రతావ్యాసార్ధాల మధ్య సంబంధాన్ని ………. గా రాయవచ్చు.
A) f = R
B) R = 2f
C) f = 2R
D) F = R + 2
జవాబు:
B) R = 2f
8. పతన, పరావర్తన కోణాల మధ్య సంబంధాన్ని …. గా రాయవచ్చు.
A) i = r
B) i > r
C) i = r
D) i ≠ r
జవాబు:
A) i = r
9. కాంతి ఎల్లప్పుడు ప్రయాణకాలం తక్కువగా ఉండే మార్గాన్ని ఎన్నుకుంటుందని తెలియజేసిన శాస్త్రవేత్త
A) గెలీలియో
B) న్యూటన్
C) హైగెన్స్
D) ఫెర్మాట్
జవాబు:
D) ఫెర్మాట్
10. పతన కిరణం, పరావర్తన కిరణం మరియు లంబాలు కలిగి ఉన్న తలాన్ని ………. అంటారు.
A) పరావర్తన తలం
B) పతన తలం
C) లంబ తలం
D) దర్పణ తలం
జవాబు:
A) పరావర్తన తలం
11. ప్రతిబింబ కుడి, ఎడమలు తారుమారు కావడాన్ని ……….. అంటారు.
A) పరావర్తనం
B) పార్శ్వ విలోమం
C) వక్రీభవనం
D) కాంతి ప్రయాణించుట
జవాబు:
B) పార్శ్వ విలోమం
12. షేవింగ్ అద్దాలలో ………… దర్పణాలను వాడతారు.
A) కుంభాకార
B) పుటాకార
C) సమతల
D) పరావలయ
జవాబు:
B) పుటాకార
13. పతనకోణం = 30° అయిన పరావర్తన కోణం = ……
A) 45°
B) 30°
C) 90°
D) 20°
జవాబు:
B) 30°
14. స్పి ల్ కెమెరానందు ఏర్పడు ప్రతిబింబము …………. ఉండును.
A) నిజ ప్రతిబింబంగా
B) తలక్రిందులుగా
C) A మరియు B
D) ప్రతిబింబం ఏర్పడదు
జవాబు:
C) A మరియు B
15. క్రింది వాటిలో సరియైనది
A) పతనకోణం, వక్రీభవన కోణం లంబంతో కోణాన్ని ఏర్పరచవు.
B) వక్రీభవన కోణం ఒక తలంలో, లంబం ఒక తలంలో ఉంటాయి.
C) పతనకిరణం, వక్రీభవన కిరణం, లంబం పతన బిందువు వద్ద ఒకే తలంలో ఉంటాయి.
D) పతనకిరణం, వక్రీభవన కిరణం, లంబం ఒకే తలంలో ఉండవు.
జవాబు:
C) పతనకిరణం, వక్రీభవన కిరణం, లంబం పతన బిందువు వద్ద ఒకే తలంలో ఉంటాయి.
II. జతపరచుము.
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. సమతల దర్పణం | A) ఇంటిలోని పాత్రల లోపలి భాగాలు |
2. కుంభాకార | B) బార్బర్ షాప్ |
3. పుటాకార | C) వాహనాలలో |
4. వలయాకారపు | D) సోలార్ కుక్కర్ |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. సమతల దర్పణం | D) సోలార్ కుక్కర్ |
2. కుంభాకార | C) వాహనాలలో |
3. పుటాకార | A) ఇంటిలోని పాత్రల లోపలి భాగాలు |
4. వలయాకారపు | B) బార్బర్ షాప్ |
ii) ఒక కుంభాకార దర్పణపు నాభ్యంతరం 20 సెం.మీ. అయిన దాని ముందు కింది స్థానాలలో వస్తువును ఉంచితే ప్రతిబింబం ఏర్పడు స్థానం విలువను జతపరచుము.
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. అనంతము | A) 12 సెం.మీ. |
2. 30 సెం.మీ. | B) 10 సెం.మీ. |
3. 20 సెం.మీ. | C) 20 సెం.మీ. |
4. 10 సెం.మీ. | D) 6.5 సెం.మీ. |
జవాబు:
గ్రూపు – ఎ | గ్రూపు – బి |
1. అనంతము | C) 20 సెం.మీ. |
2. 30 సెం.మీ. | A) 12 సెం.మీ. |
3. 20 సెం.మీ. | B) 10 సెం.మీ. |
4. 10 సెం.మీ. | D) 6.5 సెం.మీ. |