Practice the AP 8th Class Maths Bits with Answers 10th Lesson అనులోమ మరియు విలోమ అనుపాతములు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Maths Bits 10th Lesson అనులోమ మరియు విలోమ అనుపాతములు

సరైన సమాధానమును గుర్తించండి.

ప్రశ్న1.
x, y కు అనులోమానుపాతంలో ఉన్నచో ఈ క్రింది వానిలో సరియైనది?
1) x ∝ \(\frac{1}{y}\)
2) xy = k
3) \(\frac{x}{y}\) = k
4) x = y
జవాబు :
3) \(\frac{x}{y}\) = k

ప్రశ్న2.
x, y కు విలోమానుపాతంలో ఉన్న క్రిందివానిలో
సరియైనది?
1) xy = k
2) \(\frac{x}{y}\) = k
3) \(\frac{1}{x}=\frac{1}{y}\)
4) xy = x + y
జవాబు :
1) xy = k

ప్రశ్న3.
ఒకే పరిమాణం గల 65 టీ పాకెట్ల వెల ₹ 2600 అయిన అదే పరిమాణం గల అటువంటి 75 టీ పాకెట్ల వెల ?
1) ₹ 2000
2) ₹ 3000
3) ₹ 2500
4) ₹ 3500
జవాబు :
2) ₹ 3000

AP 8th Class Maths Bits 10th Lesson అనులోమ మరియు విలోమ అనుపాతములు

ప్రశ్న4.
ఒక కుళాయి 50 లీటర్ల సామర్థ్యం గల ఒక ట్యాంకును 5 గంటలలో నింపిన, 75 లీటర్ల సామర్థ్యం గల వేరొక ట్యాంకును నింపుటకు పట్టుకాలం?
1) 7 గం||లు
2) 5\(\frac{1}{2}\) గం||లు
3) 6\(\frac{1}{2}\) గం||లు
4) 7\(\frac{1}{2}\) గం||లు
జవాబు :
4) 7\(\frac{1}{2}\) గం||లు

ప్రశ్న5.
20 మీ. బట్ట ఖరీదు ₹ 1600 అయిన అదే 24.5 మీ. బట్ట ఖరీదు?
1) ₹ 1970
2) ₹ 1960
3) ₹ 1860
4) ₹ 1260
జవాబు :
2) ₹ 1960

ప్రశ్న6.
36 మంది కూలీలు ఒక గోడను 12 రోజులలో కట్టగల్గిన అదే గోడను 16మంది కూలీలు ఎన్ని రోజులలో కట్టగలరు ?
1) 27
2) 18
3) 35
4) 36
జవాబు :
1) 27

ప్రశ్న7.
ఒక ట్యాంకును నింపుటకు 6 కుళాయిలకు 1 గంట 20 ని||ల కాలం పట్టిన, అవే కుళాయిలు 5 మాత్రమే వదిలిన ఆ ట్యాంకు ఎంత కాలంలో నిండును?
1) 106 ని॥లు
2) 86 ని॥లు
3) 96 ని॥లు
4) 92 ని॥లు
జవాబు :
3) 96 ని॥లు

ప్రశ్న8.
35 మందికి 24 రోజులకు భోజనాలకు అయ్యే ఖర్చు ₹ 6300 అయిన 25 మంది విద్యార్థులకు 18 రోజులకు భోజనాలకు అయ్యే ఖర్చు?
1) ₹ 3375
2) ₹ 3475
3) ₹ 3385
4) ₹ 3365
జవాబు :
1) ₹ 3375

ప్రశ్న9.
24 మంది పనివారు ఒక పనిని 6 గంటల వంతున 14 రోజులలో పూర్తిచేయగలరు. అయిన రోజుకు 7 గంటల వంతున పనిచేస్తూ ఆ పనిని 8 రోజులలో పూర్తి చేయవలెనన్న కావలసిన పనివారి సంఖ్య?
1) 16
2) 36
3) 27
4) 46
ఈ క్రింది సమాచారము చదివి 10 నుండి 12 ప్రశ్నల వరకు సమాధానము గుర్తించుము. ఒక మోటారు పడవ నదిలో నీటి ప్రవాహం వెంట ప్రయాణిస్తూ ఒడ్డున గల రెండు పట్టణాలు A, B ల మధ్య దూరమును 5 గంటలలో ప్రయాణిస్తుంది. అదే మోటారు పడవ నీటి ప్రవాహమునకు ఎదురుగా ప్రయాణిస్తూ అదే దూరమును 6 గంటలలో ప్రయాణిస్తుంది. నీటి ప్రవాహవేగము 2 కి.మీ./గం. మరియు నిశ్చల నీటిలో మోటారు పడవ వేగం 22 కి.మీ./గం.
జవాబు :
2) 36

ప్రశ్న10.
ప్రవాహ దిశలో మోటారు పడవ వేగము ఎంత ఉండును ?
1) 24 కి.మీ./గం.
2) 20 కి.మీ./గం.
3) 22 కి.మీ./గం.
4) 18 కి. మీ./గం.
జవాబు :
1) 24 కి.మీ./గం.

ప్రశ్న11.
ప్రవాహ వ్యతిరేక దిశలో మోటారు పడవ వేగము ఎంత ఉండును ?
1) 17 కి. మీ./గం.
2) 19 కి.మీ./గం.
3) 20 కి.మీ./గం.
4) 22 కి.మీ./గం.
జవాబు :
3) 20 కి.మీ./గం.

AP 8th Class Maths Bits 10th Lesson అనులోమ మరియు విలోమ అనుపాతములు

ప్రశ్న12.
మోటారు పడవ పట్టణము B నుండి, పట్టణము Aకి చేరుకోవడానికి పట్టు సమయం
1) 5 గంటలు
2) 6 గంటలు
3) 4 గంటలు
4) 3 గంటలు
జవాబు :
2) 6 గంటలు

ప్రశ్న13.
p, q లు విలోమానుపాతములో వున్నచో ‘x’ విలువ

P 10 x
q 100 50

1) 10
2) 15
3) 20
4) 25
జవాబు :
3) 20

ప్రశ్న14.
ఒకే మందం కలిగిన 12 కాగితాల బరువు 40 గ్రాములు అయితే, అలాంటి ఎన్ని కాగితాల బరువు 1కిలోగ్రాముకు సమానమవుతుంది ?
1) 480
2) 360
3) 300
4) 400
జవాబు :
3) 300

ప్రశ్న15.
ముగ్గురు వ్యక్తులు ఒక గోడను 4 రోజులలో నిర్మించగలిగితే, అదే పనిని నలుగురు వ్యక్తులు ఎన్ని రోజులలో చేయగలరు ?
1) 3
2) 4
3) 5
4) 6
జవాబు :
1) 3

ఈ క్రింది వానిని పూరింపుము.

ప్రశ్న1.
పెయింటర్ల సంఖ్య, గోడ పొడవుకు __________ ఉంటుంది.
జవాబు :
అనులోమానుపాతం

ప్రశ్న2.
పనివారి సంఖ్య ∝ __________
జవాబు :
AP 8th Class Maths Bits 10th Lesson అనులోమ మరియు విలోమ అనుపాతములు 1

ప్రశ్న3.
దూరం = __________
జవాబు :
కాలం × వేగం

ప్రశ్న4.
x ∝ \(\frac{1}{y}\) ⇒ xy = k లో K ఒక __________
జవాబు :
స్థిరాంకం

AP 8th Class Maths Bits 10th Lesson అనులోమ మరియు విలోమ అనుపాతములు

ప్రశ్న5.
x1, y1, x2, y2 లు ఏవైనా 4 రాశులైన x1y1 = x2y2 అయిన __________ లో ఉన్నాయి.
జవాబు :
విలోమానుపాతం

ప్రశ్న6.
ఒక కారు గం||కు 60 కి.మీ. వేగంతో ప్రయాణిస్తే గమ్యమును 4 గంటలలో చేరును. అయిన ఆ కారు . గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణించుటకు పట్టు కాలం __________
జవాబు :
3 గంటలు