These AP 8th Class Biology Important Questions 7th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలు will help students prepare well for the exams.
AP Board 8th Class Biology 7th Lesson Important Questions and Answers వివిధ ఆవరణ వ్యవస్థలు
ప్రశ్న 1.
ఆవరణ వ్యవస్థ అన్న పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు ? దాని అర్థం ఏమిటి ?
జవాబు:
- 1935 సంవత్సరంలో ఎ.జి. టాన్ ప్లే అనే బ్రిటిష్ వృక్ష, ఆవరణ శాస్త్రవేత్త ‘ఆవరణవ్యవస్థ’ ‘Eco system’ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు.
- ప్రకృతి యొక్క మూలప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా వర్ణించాడు.
- టాన్ ప్లే పర్యావరణ వ్యవస్థ (Ecological System) ను కుదించి ఆవరణ వ్యవస్థ ‘Eco System’ అని నామకరణం చేశాడు.
- అతని ప్రకారం ప్రకృతి ఒక వ్యవస్థలాగా పనిచేస్తుంది. అందులోని జీవులు వాటి జాతి సమూహాలు, అనేక నిర్జీవ, వాతావరణ కారకాలు ఒకదానినొకటి తీవ్రంగా ప్రభావితం చేసుకుంటాయి.
ప్రశ్న 2.
ఆవరణ వ్యవస్థలోని శక్తికి సూర్యుడు మూలమని ఎలా చెప్పగలవు ?
జవాబు:
- ఆవరణ వ్యవస్థలోని ఏ స్థాయి జీవులకైనా బతకడానికి ఆహారం ద్వారా వచ్చే శక్తి అవసరమవుతుంది.
- సజీవులన్నింటికీ సూర్యుని ద్వారా శక్తి లభిస్తుంది.
- ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మిలోని శక్తిని కిరణజన్య సంయోగక్రియ ద్వారా నిక్షిప్తం చేసుకుంటాయి.
- అయితే జంతువులు మొక్కల మాదిరిగా సూర్యశక్తిని నేరుగా ఉపయోగించుకోలేవు.
- చాలా రకాల జంతువులు మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి.
- అయితే మొక్కలు ఆహారం తయారుచేసుకోవటానికి సూర్యరశ్మిని ఉపయోగిస్తాయి కాబట్టి ఈ శక్తి మొక్కల నుండి జంతువులకు బదిలీ అవుతుంది.
- మొక్కలను తినని జంతువులు కూడా సూర్యరశ్మిలోని శక్తి పైనే ఆధారపడతాయి.
- అవి మొక్కలను తినే జంతువులను తింటాయి. కాబట్టి సూర్యశక్తి బదిలీ అయినట్లే.
ప్రశ్న 3.
ఆహారపు గొలుసు అనగానేమి ? దానిలోని స్థాయిలు ఏమిటి ?
జవాబు:
ఆవరణవ్యవస్థలోని జీవుల మధ్యగల ఆహార సంబంధాలను ఆహార గొలుసు అంటారు. ఆహారపు గొలుసులో మూడు స్థాయిలు ఉంటాయి.
ఉత్పత్తిదారులు : చాలా రకాల మొక్కలు, శైవలాలు మొదలైనవన్నీ సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారం తయారు చేసుకుంటాయి. వాటిని ఉత్పత్తిదారులు (Producers) అంటారు.
వినియోగదారులు : ఉత్పత్తిదారులను తిని శక్తిని గ్రహించే జీవులను వినియోగదారులు (Consumers) అంటారు.
విచ్ఛిన్నకారులు : చివరిస్థాయిలో విచ్ఛిన్నకారులు (decomposers) ఉంటాయి. ఇవి మొక్కలు, జంతువులు విసర్జించిన వ్యర్థ పదార్థాల నుండి కాని లేదా వాటి నిర్జీవ పదార్థాల నుండి కానీ ఆహారపదార్థాలను సేకరిస్తాయి.
ప్రశ్న 4.
ఆవాసంలో ఒక జాతి సంఖ్యను మరొక జాతి ఎలా నియంత్రిస్తుంది ? ఉదాహరణతో వివరించండి.
జవాబు:
- ఆవాసంలో జీవుల మధ్య ఆహార సంబంధాలు ఉంటాయి.
- ఈ సంబంధాలు జీవుల సంఖ్యను నియంత్రించటంలో తోడ్పడతాయి.
- ఉదాహరణకి పక్షుల ఆవాసంలో చాలా రకాల కీటకాలు ఉంటాయి. పక్షులు కీటకాలను తినటం వలన కీటకాల సంఖ్య పెరగకుండా చేస్తాయి.
- దీని వలన పక్షుల ఆవాసం మరియు మొత్తం ఆవరణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండి స్థిరంగా ఉంటుంది.
- కానీ కీటకాలు తినే పక్షుల సంఖ్య ఎక్కువ అయితే కీటకాల సంఖ్య తొందరగా తగ్గిపోతుంది తద్వారా పక్షులకు సరిపడే ఆహారం దొరకదు.
- ఇటువంటి సందర్భాలలో పక్షులు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతాయి లేదా చనిపోతాయి.
- వాటి స్థానంలో కొన్ని కొత్త ఆహారపు అలవాట్లు కలిగిన పక్షులు పుట్టడం వలన తిరిగి ఆవరణవ్యవస్థ సమతాస్థితిలోకి వస్తుంది.
ప్రశ్న 5.
మానవ ప్రమేయం ఆధారంగా ఆవరణవ్యవస్థల వర్గీకరణను ఫ్లోచార్టులో చూపండి.
జవాబు:
ప్రశ్న 6.
మాంగ్రూవ్ అడవుల గురించి రాయండి.
జవాబు:
- భూమిపైన విస్తరించిన ఆవరణ వ్యవస్థలో మాంగ్రూవ్స్ లేదా మడ అడవులు ప్రముఖమైనవి.
- ఇవి వెనుకకు తన్నిన సముద్రపు నీటితో నిండిన (Back water) లోతు తక్కువ ప్రాంతాలలోనూ, నదులు, సముద్ర జలాలు కలిసే చోట మడ అడవులు విస్తారంగా పెరుగుతాయి.
- వీటిని మంచి ఉత్పాదక ఆవరణవ్యవస్థగా పేర్కొనవచ్చు.
- ఈ రకమైన అడవులు తనకు కావల్సిన పోషకాలను భూమిపై పొరలలో ఉన్న మంచినీటి నుంచి, సముద్ర అలల ఉప్పునీటి నుండి గ్రహిస్తాయి.
- మాంగ్రూవ్స్ వాణిజ్యపరమైన ప్రాధాన్యత గల సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారంగా, నర్సరీలుగా, ప్రజనన స్థలంగా ఉపయోగపడతాయి.
- అంతే కాకుండా కనుమరుగయ్యే జాతులకు రక్షిత ప్రాంతాలుగా కూడా ఉపయోగపడతాయి.
ప్రశ్న 7.
కోరింగ మాంగ్రూవ్స్ అనగానేమి ? వాటికి ఆ పేరు ఎలా వచ్చింది ?
జవాబు:
కోరింగ మాంగ్రూవ్స్ (మడ అడవులు) కాకినాడ దక్షిణ సముద్రతీరంలో విశాఖపట్టణ దక్షిణ ప్రాంతం నుండి దాదాపుగా 150 కి.మీ. దూరం విస్తరించి ఉన్నాయి. కోరంగై నది పేరుమీద ఈ మాంగ్రూవకు కోరింగ అని పేరుపెట్టారు. కోరింగ మాంగ్రూవ్స్ గౌతమీ, గోదావరి ఉపనదులైన కోరింగ, గాడేరు నదుల నుండి మంచినీటిని తీసుకుంటాయి. అదేవిధంగా కాకినాడ సముద్రతీరం నుంచి ఉప్పునీటిని తీసుకుంటాయి. అనేక నదీ పాయలు, కాలువలు ఈ ఆవరణవ్యవస్థ గుండా ప్రవహిస్తాయి.
ప్రశ్న 8.
కోరింగ ఆవరణవ్యవస్థలో ఉండే సజీవ, నిర్జీవ అంశాలను తెలపండి.
జవాబు:
కోరింగ ఆవరణవ్యవస్థలో ఉండే సజీవ, నిర్జీవ అంశాలు :
జీవ అంశాలలో ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు ఉంటాయి.
- ఉత్పత్తిదారులు : మడచెట్లు, స్పైరోగైరా, యూగ్లీనా, ఆసిల్లటోరియా, నీలిఆకుపచ్చ శైవలాలు, యూలోథిక్స్ మొదలైన ఉత్పత్తిదారులుంటాయి.
- వినియోగదారులు : పీతలు, హైడ్రా, ప్రోటోజోవాలు, నత్తలు, తాబేళ్ళు, డాఫ్నియా, గొట్టం పురుగులు మొదలైనవి ఉంటాయి.
- విచ్ఛిన్నకారులు : డెట్రిటస్ వంటి విచ్ఛిన్నకర బ్యాక్టీరియాలుంటాయి.
- నిర్జీవ అంశాలు : ఉప్పునీరు, మంచినీరు, గాలి, సూర్యరశ్మి, మృత్తిక మొదలైనవి.
ప్రశ్న 9.
ఎడారి ఆవరణవ్యవస్థలో ఉత్పత్తిదారుల అనుకూలనాలు ఏమిటి ?
జవాబు:
- పొదలు, గడ్డిజాతులు, కొన్ని వృక్షాలు ఎడారిలో ఉత్పత్తిదారులుగా ఉంటాయి.
- ఇక్కడి పొదలు భూమి లోపలికి వ్యాపించిన శాఖాయుతమైన వేరు వ్యవస్థ కలిగి ఉంటాయి.
- కాండాలు, పత్రాలు రూపాంతరం చెంది ముళ్ళుగా లేదా మందంగా మారి ఉంటాయి.
- ఎడారుల్లో కనబడే కాక్టస్ (బ్రహ్మజెముడు) లాంటి మొక్కల కాండాలు రసభరితంగా మారి నీటిని నిలువ చేసుకొని ఉంటాయి.
- నీటికొరత ఉన్నప్పుడు ఆ నీటిని వినియోగించుకుంటాయి.
- కొన్ని నిమ్నశ్రేణి రకాలైన లైకెన్లు, ఎడారి మాన్లు, నీటి ఆకుపచ్చ శైవలాలు కూడా ఎడారులలో కనబడతాయి.
ప్రశ్న 10.
ఆవరణ వ్యవస్థలోని శక్తి ప్రవాహం గురించి రాయండి.
జవాబు:
ఆవరణ వ్యవస్థలోని శక్తి ప్రవాహం :
- సజీవ ప్రపంచ మనుగడ అనేది ఆవరణవ్యవస్థలో శక్తి ప్రవాహం , పదార్థాల ప్రసరణ పై ఆధారపడి ఉంటుంది.
- వివిధ రకాల జీవక్రియలు నిర్వహించడానికి శక్తి అవసరం.
- ఈ శక్తి సూర్యుని నుండి లభిస్తుంది. అంతరిక్షంలో సౌరశక్తి సూర్యకిరణాల రూపంలో ప్రసరిస్తుంది.
- సౌరశక్తిలో దాదాపు 57% వాతావరణంలో శోషించబడుతుంది మరియు అంతరిక్షంలో వెదజల్లబడుతుంది.
- 35% సౌరశక్తి భూమిని వేడిచేయడానికి, నీటిని ఆవిరిచేయడానికి ఉపయోగపడుతుంది.
- దాదాపు 8% సౌరశక్తి మొక్కలకు చేరుతుంది. దీని 80-85% సౌరశక్తిని మొక్కలు శోషిస్తాయి.
- శోషించిన దానిలో 50% మాత్రమే కిరణజన్య సంయోగక్రియలో వినియోగించబడుతుంది.
ప్రశ్న 11.
ఆకు గొంగళి పురుగు ఊసరవెల్లి పాము గ్రద్ద పైన ఇచ్చిన పటం ఆధారంగా, ఆహారపు గొలుసులోని జీవులను ఉత్పత్తిదారులు, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ మరియు ఉన్నత స్థాయి వినియోగదారులుగా వర్గీకరించండి.
జవాబు:
పైన చూపబడిన ఆహారపు గొలుసులో
- ఆకు – ఉత్పత్తిదారుడు
- గొంగళిపురుగు – ప్రథమ వినియోగదారుడు
- ఊసరవెల్లి – ద్వితీయ వినియోగదారుడు
- పాము – తృతీయ వినియోగారుడు
- గ్రద్ద – ఉన్నత స్థాయి మాంసాహారి
ప్రశ్న 12.
ఆవరణ వ్యవస్థలోని రకాలను సూచించే ఫ్లోచార్టను గీయండి. ఆవరణవ్యవస్థ పేరు పెట్టినది ఎవరు ?
జవాబు:
“ఆవరణ వ్యవస్థ” అను పదాన్ని ప్రవేశపెట్టినది A.G. టాన్ ప్లే.”
ప్రశ్న 13.
కింది పేరాను చదవండి. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
చాలారకాల మొక్కలు, శైవలాలు మొదలైనవన్నీ సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారం తయారుచేసుకుంటాయి. , వాటిని ‘ఉత్పత్తి దారులు’ అంటారు. వీటిని తిని శక్తిని గ్రహించే జీవులను వినియోగదారులు అంటారు. చివరిస్థాయిలో విచ్ఛిన్నకారులు ఉంటారు. ఇవి మొక్కలు, జంతువులు విసర్జించిన వ్యర్థ పదార్థాలనుండి కాని లేదా వాటి నిర్జీవ పదార్థాలనుండి కానీ ఆహారాన్ని సేకరిస్తాయి. వీటిని పునరుత్పత్తిదారులు అంటాం.
1. ఆహారజాలకంలోని ఉత్పత్తిదారులు ఏవి ? వాటిని ఎందుకు ఉత్పత్తిదారులు అంటారు ?
2. వినియోగదారులు అంటే ఏమి ? కొన్ని ఉదాహరణలు ఇవ్వండి.
3. పునరుత్పత్తిదారులు ఏవి ? ఎందుకు వాటిని అలా పిలుస్తారో ఉదాహరణతో వివరించండి.
4. ఆహారపు గొలుసులో ఎన్ని స్థాయిలు ఉంటాయి ? అవి ఏవి ?
జవాబు:
1. శైవలాలు, మొక్కలు ఆహార జాలకంలో ఉత్పత్తిదారులుగా ఉంటాయి. ఎందుకంటే అవి సూర్యరశ్మిని వినియోగించుకొని స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి.
2. ఉత్పత్తిదారులను ఆహారంగా స్వీకరించి శక్తిని గ్రహించే జీవులను వినియోగదారులు అంటారు. ఉదా : జింక, మిడత, కుందేలు
3. విచ్ఛిన్నకారులుగా పూతికాహార బాక్టీరియా శిలీంధ్రాలు ఉంటాయి. ఇవి మొక్కల జంతువుల నిర్జీవ పదార్థాల నుండి ఆహారాన్ని సేకరిస్తాయి. వాటిని మూలకాలుగా విడగొట్టి తిరిగి ఆవరణ వ్యవస్థలో ప్రవేశపెడతాయి. అందువల్ల వీటిని పునరుత్పత్తి. దారులు అంటారు.
4. ఆహారపు గొలుసులో 4 స్థాయిలు ఉంటాయి.
ఉత్పత్తిదారులు ప్రాథమిక వినియోగదారులు ద్వితీయ వినియోగదారులు తృతీయ వినియోగదారులు
ప్రశ్న 14.
క్రింది అంశంను చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము.
భూభాగంలో దాదాపు 17% మేర ఎడారులు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇసుకతో కూడిన నేల ఉండి సగటు వర్షపాతం 23 మి.మీల కన్నా తక్కువగా ఉంటుంది. ఇక్కడ పెరిగే మొక్కలు నీటిని నష్టపోకుండా అనుకూలనాలు కలిగి ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రత వలన ఇక్కడ జీవజాతులు ప్రత్యేక లక్షణాలను కలిగి ఇక్కడి వాతావరణానికి అనుకూలనాలు పొంది ఉంటాయి.
1. ఎడారి జీవులు ఎలాంటి అనుకూలనాలను పొంది ఉండాలి ?
2. ఉత్పత్తిదారులైన ఎడారి మొక్కలు చూపే అనుకూలనాలేవి ?
3. ఒంటెను ఎడారి ఓడ అని ఎందుకు అంటారు ?
4. ఎడారుల్లో జంతువైవిధ్యం తక్కువగా ఉంటుంది. ఎందుకు ?
జవాబు:
1. అక్కడి అధిక ఉష్ణోగ్రతలకు నీరు నష్టపోకుండా అనుకూలనాలను కలిగి ఉంటుంది.
2. ఎడారి మొక్కలు పత్రరంధ్రాలను కలిగి ఉండవు. అందువల్ల భాష్పోత్సేకం ద్వారా నీటిని నష్టపోవు.
3. ఒంటె ఎడారి వాతావరణాన్ని ఎన్నో అనుకూలనాలను కల్గి ఎడారిలో ప్రయాణానికి ఎంతో అనువైన జంతువు. అందువల్ల ఒంటెను ఎడారి ఓడ అని అంటారు.
4. ఎడారిలో ఉండే అత్యధిక ఉష్ణోగ్రతలను నీటి ఎద్దడిని తట్టుకొని జీవించడం చాలా కష్టం. అందువలన అక్కడ జంతు వైవిధ్యం తక్కువ.
ప్రశ్న 15.
మీ పరిసరాలలో మీరు గమనించి ఉత్పత్తిదారులు, వినియోగదారుల జాబితాలను తయారు చేయండి.
జవాబు:
నా పరిసరాలలో నేను గమనించిన ఆహార జాలకం
1 మార్కు ప్రశ్నలు
ప్రశ్న 1.
ఆహారపు గొలుసు అంటే ఏమిటి?
జవాబు:
ఉత్పత్తిదారుడు, ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు ఉన్న గొలుసు లాంటి జంతువుల శక్తి మార్పిడి వ్యవస్థను ‘ఆహారపు గొలుసు’ అంటారు.
ప్రశ్న 2.
‘ఆహార జాలకం’ అంటే ఏమిటి?
జవాబు:
అనేక ‘ఆహారపు గొలుసులు’ ఒక దానిలో ఒకటి కలిసిపోయి ఒక సమూహంగా, ఆవరణ వ్యవస్థలో కొనసాగే క్రియాత్మక, వ్యవస్థను ‘ఆహార జాలకం’ అంటారు.
ప్రశ్న 3.
ఆహార జాలకంలోని మొక్కలు చనిపోతే ఏమవుతుంది ?
జవాబు:
1. ఆహార జాలకంలోని మొక్కలు చనిపోతే శక్తిని ఉత్పత్తిచేసే.అవకాశం పోతుంది.
2. దీనితో సూర్యరశ్మి నుంచి శక్తి బదలాయింపు ఆగిపోతుంది.
3. కొంత కాలం తర్వాత నెమ్మదిగా క్రింది స్థాయి నుంచి ఉన్నతస్థాయి జీవులన్నీ అంతరించిపోతాయి.
ప్రశ్న 4.
ఆహారం ఒక్కటే కాకుండా జంతువులు బ్రతకటానికి కావల్సిన ఇతర అంశాలు ఏమిటి ?
జవాబు:
జంతువులకు ఆహారంతో పాటు
1. నీరు
2. గాలి
3. ఆవాసం బతకటానికి కావాల్సి ఉంటుంది.
లక్ష్యాత్మక నియోజనము
ప్రశ్న 1.
గడ్డిని ……….. గా పిలవవచ్చు.
ఎ) వినియోగదారు
బి) ఉత్పత్తిదారు
బి) విచ్ఛిన్నకారి
డి) బాక్టీరియా
జవాబు:
బి) ఉత్పత్తిదారు
ప్రశ్న 2.
కొన్ని ఆహారపు గొలుసుల కలయిక వల్ల ……….. ఏర్పడును.
ఎ) ఆహార జాలకం
బి) ఆవాసం
సి) జీవావరణం
డి) ప్రకృతి
జవాబు:
ఎ) ఆహార జాలకం
ప్రశ్న 3.
నెమలికి ఇష్టమైన ఆహారం ………..
ఎ) బల్లులు
బి) పురుగులు
సి) పాములు
డి) కీటకాలు
జవాబు:
సి) పాములు
ప్రశ్న 4.
కోరింగ మడ అడవులు ………. పట్టణానికి సమీపంలో ఉన్నాయి.
ఎ) రాజమండ్రి
బి) కాకినాడ
సి) విజయవాడ
డి) హైదరాబాద్
జవాబు:
బి) కాకినాడ
ప్రశ్న 5.
భూభాగంలో ………. % మేరకు ఎడారి ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి.
ఎ) 14
బి) 15
సి) 16
డి) 17
జవాబు:
డి) 17
ప్రశ్న 6.
ఇది గోదావరికి ఉపనది. ఆ
ఎ) పాములేరు
బి) గాడేరు
సి) బుడమేరు
డి) పాలవాగు
జవాబు:
డి) పాలవాగు
ప్రశ్న 7.
నిశాచరాలకు ఉదాహరణ ……….
ఎ) గేదె
బి) ఆవు
సి) గుడ్లగూబ
డి) మానవుడు
జవాబు:
ఎ) గేదె
ప్రశ్న 8.
ఒంటె శరీరంలోని ……….. భాగంలో నీరు దాచు కుంటుంది.
ఎ) నోరు
బి) చర్మం
సి) జీర్ణాశయం
డి) కాలేయం
జవాబు:
సి) జీర్ణాశయం
ప్రశ్న 9.
సూర్యకాంతి ………. చే శోషింపబడుతుంది.
ఎ) జంతువులు
బి) మొక్కలు
సి) సరీసృపాలు
డి) క్షీరదాలు
జవాబు:
బి) మొక్కలు
ప్రశ్న 10.
సింహం ………. శ్రేణి మాంసాహారి.
ఎ) ప్రాథమిక
బి) ద్వితీయ
సి) తృతీయ
డి) చతుర్ధ
జవాబు:
సి) తృతీయ
ప్రశ్న 11.
ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని 1935 సం||లో మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త
ఎ) చార్లెస్ ఎల్టన్
బి) యూజీస్ పి.ఓడమ్
సి) A.C. టాన్స్లే
డి) చార్లెస్ డార్విన్
జవాబు:
సి) A.C. టాన్స్లే
ప్రశ్న 12.
ఆవరణ వ్యవస్థలోని అతిపెద్ద భాగం
ఎ) ఆవాసం
బి) పర్యావరణం
సి) జీవావరణం
డి) నివాసం
జవాబు:
ఎ) ఆవాసం
ప్రశ్న 13.
ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలం
ఎ) ఆహారం
బి) ఆకుపచ్చని మొక్కలు
సి) సూర్యుడు
డి) భూమి
జవాబు:
సి) సూర్యుడు
ప్రశ్న 14.
ఆవరణ వ్యవస్థలో నిర్జీవ అంశం కానిది
ఎ) గాలి
బి) నీరు
సి) మృత్తిక
డి) సూక్ష్మజీవులు
జవాబు:
డి) సూక్ష్మజీవులు
ప్రశ్న 15.
ఆవరణ వ్యవస్థలో సూర్యరశ్మిని నేరుగా గ్రహించగలిగేవి
ఎ) ఉత్పత్తిదారులు
బి) ప్రాథమిక వినియోగదారులు
సి) ద్వితీయ వినియోగదారులు
డి) విచ్ఛిన్నకారులు
జవాబు:
ఎ) ఉత్పత్తిదారులు
ప్రశ్న 16.
ఆవరణ వ్యవస్థలో పునరుత్పత్తిదారులు అని వేనిని అంటారు?
ఎ) ఉత్పత్తిదారులు
బి) ప్రాథమిక వినియోగదారులు
సి) ద్వితీయ వినియోగదారులు
డి) విచ్చిన్నకారులు
జవాబు:
డి) విచ్చిన్నకారులు
ప్రశ్న 17.
ఆవరణ వ్యవస్థలో చివరి స్థాయి జీవులు
ఎ) విచ్ఛిన్నకారులు
బి) ప్రాథమిక వినియోగదారులు
సి) ద్వితీయ వినియోగదారులు
డి) తృతీయ వినియోగదారులు
జవాబు:
ఎ) విచ్ఛిన్నకారులు
ప్రశ్న 18.
ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించడానికి ఉపయోగపడేది
ఎ) పోషకస్థాయి
బి) ఎకలాజికల్ నిచ్
సి) ఆహారపు గొలుసు
డి) ఆహారపు జాలకం
జవాబు:
సి) ఆహారపు గొలుసు
ప్రశ్న 19.
ఆవరణ వ్యవస్థను తొందరగా నాశనం చేసేవి
ఎ) బలమైన గాలులు
బి) భూకంపాలు
సి) సునామి
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ
ప్రశ్న 20.
భూమిపై ఉండే అతి పెద్ద ఆవరణ వ్యవస్థ
ఎ) జీవావరణం
బి) పర్యావరణం
సి) భౌమావరణం
డి) జలావరణం
జవాబు:
ఎ) జీవావరణం
ప్రశ్న 21.
మడ అడవులు యిక్కడ పెరుగుతాయి.
ఎ) నది ఒడ్డున
బి) సముద్రం ఒడ్డున
సి) నది, సముద్రం కలిసే చోట
డి) సముద్రం సముద్రం కలిసే చోట
జవాబు:
సి) నది, సముద్రం కలిసే చోట
ప్రశ్న 22.
ఆహారపు జాలకాన్ని ఏర్పరిచేవి
ఎ) ఉత్పత్తిదారులు
బి) వినియోగదారులు
సి) విచ్ఛిన్నకారులు
డి) ఆహారపు గొలుసులు
జవాబు:
డి) ఆహారపు గొలుసులు
ప్రశ్న 23.
ఈ క్రింది వానిలో కృత్రిమ ఆవరణ వ్యవస్థ
ఎ) గడ్డిభూమి
బి) అడవి
సి) ఎడారి
డి) కార్తీకవనాలు
జవాబు:
డి) కార్తీకవనాలు
ప్రశ్న 24.
కోరింగ వద్ద ఉన్న ఆవరణ వ్యవస్థ
ఎ) గడ్డిభూమి ఆవరణ వ్యవస్థ
బి) మాంగ్రూప్ ఆవరణ వ్యవస్థ
సి) అడవి ఆవరణ వ్యవస్థ
డి) ఎడారి ఆవరణ వ్యవస్థ
జవాబు:
బి) మాంగ్రూప్ ఆవరణ వ్యవస్థ
ప్రశ్న 25.
ఈ క్రింది వానిలో సహజ ఆవరణ వ్యవస్థ
ఎ) మామిడి తోట
బి) వరి చేను
సి) కార్తీకవనం
డి) ఎడారి
జవాబు:
డి) ఎడారి
ప్రశ్న 26.
ఇండో పసిఫిక్ సముద్రంలో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఎన్ని జీవజాతులున్నాయి ?
ఎ) 10
బి) 100
సి) 1000
డి) 10,000
జవాబు:
సి) 1000
ప్రశ్న 27.
అత్యధిక జీవులు యిక్కడ ఉన్నాయి.
ఎ) నేల
బి) నది
సి) సముద్రం
డి) అడవి
జవాబు:
సి) సముద్రం
ప్రశ్న 28.
ఈ క్రింది వానిలో ఆవరణ వ్యవస్థ కానిది
ఎ) ఒక దుంగ
బి) ఒక గ్రామం
సి) ఒక అంతరిక్ష నౌక
డి) పైవేవీ కావు
జవాబు:
డి) పైవేవీ కావు
ప్రశ్న 29.
ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం అని దీనిని అనవచ్చు.
ఎ) ఆవరణ వ్యవస్థ
బి) జీవావరణం
సి) పర్యావరణం
డి) ఆవాసం
జవాబు:
ఎ) ఆవరణ వ్యవస్థ
ప్రశ్న 30.
భూభాగంలో ఎంత శాతం ఎడారులు విస్తరించి ఉన్నాయి ?
ఎ) 7%
బి) 17%
సి) 27%
డి) 37%
జవాబు:
బి) 17%
ప్రశ్న 31.
ఎడారులలో వర్షపాతం ఇంతకన్నా తక్కువ.
ఎ) 10 మిల్లీ మీటర్లు
బి) 17 మిల్లీ మీటర్లు
సి) 20 మిల్లీ మీటర్లు
డి) 23 మిల్లీ మీటర్లు
జవాబు:
డి) 23 మిల్లీ మీటర్లు
ప్రశ్న 32.
నిశాచరులు యిక్కడ ఎక్కువగా ఉంటాయి
ఎ) గడ్డిభూమి ఆవరణ వ్యవస్థ
బి) మంచినీటి ఆవరణ వ్యవస్థ
సి) ఎడారి ఆవరణ వ్యవస్థ
డి) పైవేవీ కావు
జవాబు:
సి) ఎడారి ఆవరణ వ్యవస్థ
ప్రశ్న 33.
అటవీ పరిసరాలను ప్రభావితం చేసేవి
ఎ) శీతోష్ణస్థితి
బి) పోషకాల క్రియాశీలత
సి) నీటివనరులు
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ
ప్రశ్న 34.
మొత్తం సౌరశక్తిలో వాతావరణంలోకి శోషించబడే సౌరశక్తి, భూమిని వేదిచేయడానికి కావలసిన శక్తి, మొక్కలు గ్రహించే సౌరశక్తి వరుసగా
ఎ) 67%, 35%, 8%
బి) 8%, 35%, 57%
సి) 57%, 8%, 355
డి) 35%, 8%, 57%
జవాబు:
ఎ) 67%, 35%, 8%
ప్రశ్న 35.
సౌరశక్తి ఉత్పత్తిదారులలో ఈ రూపంలో నిల్వ ఉంటుంది.
ఎ) గతిశక్తి
బి) స్థితిశక్తి.
సి) ఉష్ణశక్తి
డి) అయానికశక్తి
జవాబు:
బి) స్థితిశక్తి.
ప్రశ్న 36.
ఆహారపు గొలుసులోని సరియైన వరుసక్రమాన్ని గుర్తించండి.
ఎ) ఉత్పత్తిదారులు → ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు → విచ్ఛిన్నకారులు
బి) ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు → ఉత్పత్తిదారులు → విచ్ఛిన్నకారులు
సి) విచ్ఛిన్నకారులు → ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు → ఉత్పత్తిదారులు
డి) ఉత్పత్తిదారులు → విచ్ఛిన్నకారులు → ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు
జవాబు:
ఎ) ఉత్పత్తిదారులు → ప్రాథమిక వినియోగదారులు → ద్వితీయ వినియోగదారులు → విచ్ఛిన్నకారులు
ప్రశ్న 37.
ఆహారపు గొలుసులో స్థాయిల సంఖ్య
ఎ) 1
బి) 2
సి) 3
డి) 4
జవాబు:
సి) 3
ప్రశ్న 38.
ఆవరణ వ్యవస్థలో మాంసాహారులు
ఎ) ఉత్పత్తిదారులు
బి) విచ్ఛిన్నకారులు
సి) ప్రాథమిక వినియోగదారులు
డి) ద్వితీయ వినియోగదారులు
జవాబు:
డి) ద్వితీయ వినియోగదారులు
ప్రశ్న 39.
ఉత్పత్తిదారులలో నిక్షిప్తమైన శక్తి
ఎ) మొత్తం ప్రాథమిక ఉత్పత్తి
బి) మిగిలిన ప్రాథమిక ఉత్పత్తి,
సి) వినియోగించబడని శక్తి
డి) వినియోగదారులచే శోషించబడని శక్తి
జవాబు:
ఎ) మొత్తం ప్రాథమిక ఉత్పత్తి
ప్రశ్న 40.
కాక్టస్ ఇక్కడ కనిపిస్తుంది.
ఎ) గడ్డిభూమి
బి) అడవి
సి) ఎడారి
డి) నది
జవాబు:
సి) ఎడారి
ప్రశ్న 41.
ఒంటె శరీరంలో నీటిని ఎక్కడ నిల్వ ఉంచుకుంటుంది ?
ఎ) మూపురం
బి) చర్మం క్రింద
సి) జీర్ణాశయం
డి) కాలేయం
జవాబు:
సి) జీర్ణాశయం
ప్రశ్న 42.
ఒక ఆవరణ వ్యవస్థలో కింది వాటిలోని ఏ జత జీవులు ఉత్పత్తిదారులుగా వుంటాయి ?
(A) ఎంప్, స్పైరోగైరా
(B) మస్సెల్, డాఫియా
(C) అసిల్లటోరియా, యులోత్రిక్స్
(D) యూగ్లీనా, బ్యాక్టీరియా
జవాబు:
(C) అసిల్లటోరియా, యులోత్రిక్స్
ప్రశ్న 43.
1. ఉత్పత్తిదారులకు ఉదాహరణ గడ్డిజాతులు
2. వినియోగదారులకు ఉదాహరణ గ్రద్దలు
(A) 1, 2 సరైనవి కావు
(B) 1 సరైనది, 2 కాదు
(C) 1, 2 సరైనవి
(D) 1 సరైనదికాదు 2 సరైనది
జవాబు:
(C) 1, 2 సరైనవి
ప్రశ్న 44.
ఎడారి ఓడ అని పిలవబడే జీవి
(A) ఏనుగు
(B) ఒంటె
(C) నిప్పు కోడి
(D) కంచర గాడిద
జవాబు:
(B) ఒంటె
ప్రశ్న 45
ఎడారి జంతువులు కలిగి ఉండేవి
(A) బాహ్య అనుకూలనాలు
(B) శరీరధర్మ అనుకూలనాలు
(C)ఏ అనుకూలనాలు ఉండవు
(D) బాహ్య మరియు శరీరధర్మ అనుకూలనాలు
జవాబు:
(D) బాహ్య మరియు శరీరధర్మ అనుకూలనాలు
ప్రశ్న 46.
ఒకేసారి అధిక సంఖ్యలో కుందేళ్ళను గడ్డిభూముల్లో ప్రవేశపెడితే జరిగేది
(A) అధిక సంఖ్యలో కుందేళ్ళు కనిపిస్తాయి
(B) కుందేళ్ళ మధ్య ఆహారం కోసం తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది
(C) ఆవరణ వ్యవస్థలో ఎలాంటి మార్పు ఉండదు
(D) గడ్డి పెరగడంపై ఏ ప్రభావం ఉండదు
జవాబు:
(B) కుందేళ్ళ మధ్య ఆహారం కోసం తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది
ప్రశ్న 47.
భౌమావరణ వ్యవస్థలోని మొక్కల్లో పత్రరంధ్రాలు లేకపోతే ఇరిగేది
(A) భాష్పోత్సేకం జరగదు
(B) వాయువినిమయం జరగదు ,
(C) మొక్కలపై ఏ ప్రభావం ఉండదు
(D) A మరియు B
జవాబు:
(D) A మరియు B
ప్రశ్న 48.
భూ ఆవరణ వ్యవస్థలో P, Q మరియు ఎడారి ఆవరణ వ్యవస్థలు ఉంటాయి. ఇందులో P,Qలు
(A) అడవి, గడ్డిభూమి
(B) గడ్డి భూమి, కొలను
(C) మంచినీరు, ఉప్పునీరు
(D) అడవి, ఉప్పునీరు
జవాబు:
(A) అడవి, గడ్డిభూమి