Practice the AP 7th Class Social Bits with Answers 9th Lesson భారత రాజ్యాంగం – పరిచయం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Social Bits 9th Lesson భారత రాజ్యాంగం – పరిచయం
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. భారత ప్రభుత్వ చట్టం – 1935 లోని అంశం కానిది.
A) అఖిల భారత సమాఖ్య ఏర్పడింది.
B) కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజన
C) రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది.
D) రాష్ట్రాలలో ద్వంద్వ (పాలన) ప్రభుత్వ ఏర్పాటు
జవాబు:
D) రాష్ట్రాలలో ద్వంద్వ (పాలన) ప్రభుత్వ ఏర్పాటు
2. మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికను ఈ సంవత్సరంలో సమర్పించింది.
A) 1927
B) 1928
C) 1929
D) 1931
జవాబు:
C) 1929
3. 1931వ సంవత్సరంలో ఇక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
A) బొంబాయి
B) కరాచీ
C) ఢిల్లీ
D) లాహోర్
జవాబు:
B) కరాచీ
4. భారత జాతీయ కాంగ్రెస్ ను ఈ సంవత్సరంలో స్థాపించారు
A) 1885
B) 1858
C) 1588
D) 1880
జవాబు:
A) 1885
5. దీని ప్రకారం రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి.
A) క్రిప్స్ రాయబారం
B) 1935 భారత ప్రభుత్వ చట్టం
C) నెహ్రూ నివేదిక
D) కేబినెట్ మిషన్ ప్లాన్
జవాబు:
D) కేబినెట్ మిషన్ ప్లాన్
6. క్రింది వ్యాఖ్యలను పరిశీలించి సరియైన సమాధాన మునివ్వండి.
అ) బ్రిటిషు పాలనలో ఉన్న రాష్ట్రాల నుండి 292 మంది సభ్యులను రాజ్యాంగ సభకు ఎన్నుకున్నారు.
ఆ) స్వదేశీ సంస్థానాలు అన్ని కలిపి 93 మంది సభ్యులను రాజ్యాంగ సభకు ఎంపిక చేసారు.
A) ‘అ’ సత్యము & ‘ఆ’ సత్యము
B) ‘అ’ అసత్యము & ‘ఆ’ అసత్యము
C) ‘అ’ సత్యము & ‘ఆ’ అసత్యము
D) ‘అ’ అసత్యము & ‘ఆ’ సత్యము
జవాబు:
A) ‘అ’ సత్యము & ‘ఆ’ సత్యము
7. భారత రాజ్యాంగ సభలో మహిళా సభ్యులు ఎంత మంది కలరు?
A) 8 మంది
B) 9 మంది
C) 26 మంది
D) 93 మంది
జవాబు:
B) 9 మంది
8. భారతదేశానికి రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి
A) డా. బాబు రాజేంద్రప్రసాద్
B) బి. ఆర్. అంబేద్కర్
C)సర్వేపల్లి రాధాకృష్ణన్
D) జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు:
A) డా. బాబు రాజేంద్రప్రసాద్
9. ముసాయిదా కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైనవారు
A) బాబు రాజేంద్రప్రసాద్
B) సర్వేపల్లి రాధాకృష్ణన్
C) జవహర్‌లాల్ నెహ్రూ
D) బి. ఆర్. అంబేద్కర్
జవాబు:
D) బి. ఆర్. అంబేద్కర్
10. క్రింది వానిలో సరియైన దానిని గుర్తించండి.
A) భారత ముసాయిదా రాజ్యాంగంలో 315 ప్రకరణలు మరియు 8 షెడ్యూల్స్ కలవు.
B) భారత ముసాయిదా రాజ్యాంగంలో 395 ప్రకరణలు మరియు 8 షెడ్యూల్స్ కలవు.
C) భారత ముసాయిదా రాజ్యాంగంలో 465 ప్రకరణలు మరియు 12 షెడ్యూల్స్ కలవు.
D) భారత ముసాయిదా రాజ్యాంగంలో 315 ప్రకరణలు మరియు 12 షెడ్యూల్స్ కలవు.
జవాబు:
A) భారత ముసాయిదా రాజ్యాంగంలో 315 ప్రకరణలు మరియు 8 షెడ్యూల్స్ కలవు.
11. క్రింది వాక్యాలను పరిశీలించి సరియైన సమాధానమునిమ్ము.
అ) భారత రాజ్యాంగం రాజ్యాంగ సభ చేత 1949, నవంబరు 26న ఆమోదించబడింది.
ఆ) భారత రాజ్యాంగం 1950, జనవరి 26న అమల్లోకి వచ్చింది.
A) ‘అ’ సత్యము & ‘ఆ’ సత్యము
B) ‘అ’ అసత్యము & ‘ఆ’ అసత్యము
C) ‘అ’ సత్యము & ‘ఆ’ అసత్యము
D) ‘అ’ అసత్యము & ‘ఆ’ సత్యము
జవాబు:
A) ‘అ’ సత్యము & ‘ఆ’ సత్యము
12. “భారత రాజ్యాంగ పితామహుడు”.
A) బాబు రాజేంద్రప్రసాద్
B) మోతీలాల్ నెహ్రూ
C) బి. ఆర్. అంబేద్కర్
D) జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు:
C) బి. ఆర్. అంబేద్కర్
13. 1947లో స్వతంత్ర భారతదేశానికి ఈ శాఖకు మొట్టమొదటి మంత్రిగా డా|| బి. ఆర్. అంబేద్కర్ నియమింపబడ్డాడు.
A) ఆర్థిక శాఖ
B) హోం శాఖ
C) విద్యా శాఖ
D) న్యాయ శాఖ
జవాబు:
D) న్యాయ శాఖ
14. మన దేశంలో ఈ రోజును “రాజ్యాంగ దినోత్సవం” గా జరుపుకుంటాము.
A) జనవరి 26
B) నవంబరు 26
C) ఆగస్టు 15
D) డిశంబరు 26
జవాబు:
B) నవంబరు 26
15. రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో “లక్ష్యాల తీర్మానం” ప్రతిపాదించినవారు
A) డా|| బి. ఆర్. అంబేద్కర్
B) బాబు రాజేంద్రప్రసాద్
C) జవహర్‌లాల్ నెహ్రూ
D) మహాత్మా గాంధి
జవాబు:
C) జవహర్‌లాల్ నెహ్రూ
16. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చిన పదం/లు.
A) గణతంత్రం
B) లౌకిక
C) సామ్యవాదం
D) C & D
జవాబు:
D) C & D
17. దేశాధిపతి ఎన్నికల ద్వారా ఎన్నుకోబడే దేశం.
A) ప్రజాస్వామ్యం
B) లౌకిక
C) గణతంత్ర
D) సామ్యవాద
జవాబు:
C) గణతంత్ర
18. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి?
A) 14 నుండి 32 వరకు
B) 12 నుండి 30 వరకు
C) 16 నుండి 32 వరకు
D) 14 నుండి 30 వరకు
జవాబు:
A) 14 నుండి 32 వరకు
19. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది.
A) 42 వ
B) 44 వ
C) 46 వ
D) 40 వ
జవాబు:
B) 44 వ
20. “వెట్టి చాకిరి నిఘం” ఈ హక్కు వలన జరిగింది.
A) సమానత్వపు హక్కు
B) స్వేచ్ఛా హక్కు
C) పీడనాన్ని నిరోధించే హక్కు
D) రాజ్యాంగ పరిహారపు హక్కు
జవాబు:
C) పీడనాన్ని నిరోధించే హక్కు
21. ఈ హక్కు ద్వారా సుప్రీం కోర్టు మరియు హైకోర్టుల అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది.
A) స్వేచ్ఛా హక్కు
B) సమానత్వపు హక్కు
C) పీడనాన్ని నిరోధించే హక్కు
D) రాజ్యాంగ పరిహారపు హక్కు
జవాబు:
D) రాజ్యాంగ పరిహారపు హక్కు
22. మత వ్యవహారాలలో తటస్థంగా ఉండే దేశం.
A) ప్రజాస్వామ్య
B) లౌకిక
C) గణతంత్ర
D) సామ్యవాద
జవాబు:
B) లౌకిక
23. సమాచార హక్కు చట్టాన్ని (RTI) భారత పార్లమెంటు ఈ సంవత్సరంలో ఆమోదించింది.
A) 2002
B) 2005
C) 2009
D) 2010
జవాబు:
B) 2005
24. రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చిన రాజ్యాంగ సవరణ
A) 42వ
B) 44 వ
C) 86 వ
D) 88వ
జవాబు:
C) 86 వ
25. భారత రాజ్యాంగంలోని “ప్రాథమిక విధులు” ఈ దేశం నుండి స్వీకరించబడ్డాయి.
A) అమెరికా
B) రష్యా
C) బ్రిటన్
D) ఫ్రాన్స్
జవాబు:
B) రష్యా
26. క్రింది వాక్యాలను పరిశీలించి సరియైన సమాధానము గుర్తించండి.
అ) ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో భాగం-4 ఎ లో పొందుపరిచారు.
ఆ) ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో భాగం-3 లో పొందుపరిచారు.
A) ‘అ’ సత్యము & ‘ఆ’ సత్యము
B) ‘అ’ అసత్యము & ‘ఆ’ అసత్యము
C) ‘అ’ సత్యము & ‘ఆ’ అసత్యము
D) ‘అ’ అసత్యము & ‘ఆ’ సత్యము
జవాబు:
B) ‘అ’ అసత్యము & ‘ఆ’ అసత్యము
27. కేబినేట్ మిషన్ ఏర్పాటయిన సంవత్సరం.
A) 1942
B) 1945
C) 1946
D) 1947
జవాబు:
C) 1946
28. భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించి, ఆమోదించినది.
A) భారత జాతీయ కాంగ్రెస్
B) బ్రిటన్ పార్లమెంటు
C) భారత రాజ్యాంగ సభ
D) భారత జనతా పార్టీ
జవాబు:
C) భారత రాజ్యాంగ సభ
29. భారత రాజ్యాంగ పరిషత్తులో షెడ్యూల్డ్ కులాల సభ్యుల సంఖ్య
A) 9 మంది
B) 93 మంది
C) 26 మంది
D) 36 మంది
జవాబు:
C) 26 మంది
II. ఖాళీలను పూరింపుము
1. మనం మనల్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా పరిపాలన చేసుకోవడానికి …………… కలిగి ఉండాలి.
2. స్వాతంత్ర్యానికి ముందు …………….. పార్లమెంటు చేసిన చట్టాల ప్రకారం భారతదేశాన్ని పాలించారు.
3. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించిన చట్టం ……………
4. నెహ్రూ నివేదికను ……………. గా పరిగణించబడుతుంది.
5. కరాచీ తీర్మానం ………… సంవత్సరంలో జరిగింది.
6. భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించటానికి …………… సంవత్సరంలో ఒక కమిటి వేసింది.
7. ఈ కమిటీ అధ్యక్షుడు …………..
8. బ్రిటిషు వారి నుండి మన భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం పని చేసిన సంస్థ ………..
9. రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం ప్రతినిధులచే ఏర్పడిన సభ ……………
10. చారిత్రకంగా …………….. సంవత్సరంలో INC ఒక రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసింది.
11. రాజ్యాంగ సభకు ………… సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి.
12. స్వదేశీ సంస్థానాలు అన్నీ కలిపి …………… మంది సభ్యులను రాజ్యాంగ సభకు ఎంపిక చేశారు.
13. 1947లో భారత రాజ్యాంగ సభ, పాకిస్థాన్ రాజ్యాంగ సభ విడిపోయిన తరువాత భారత రాజ్యాంగ సభలో …………… మంది సభ్యులు ఉన్నారు.
14. రాజ్యాంగ సభ అధ్యక్షుడు ……………
15. రాజ్యాంగ సభ చివరి సమావేశం ………..
16. స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతి ……………
17. ముసాయిదా కమిటీని ……………… రోజున ఏర్పాటు చేసారు.
18. ముసాయిదా రాజ్యాంగాన్ని ……….. సంవత్సరంలో రాజ్యాంగ సభకు సమర్పించారు.
19. ముసాయిదా రాజ్యాంగంలో ………….. ప్రకరణలు, మరియు ………….. షెడ్యూల్స్ కలవు.
20. ముసాయిదా రాజ్యాంగాన్ని …………… నెలల పాటు ప్రజల ముందు ఉంచారు.
21. సవరణల తర్వాత రాజ్యాంగంలో …………. ప్రకరణలు మరియు ………….. షెడ్యూల్స్ కలవు.
22. డా|| బి.ఆర్. అంబేద్కర్ ………. రోజున జన్మించారు.
23. అధికారికంగా రాజ్యాంగ దినోత్సవాన్ని ………….. సంవత్సరం నుండి జరుపుకుంటున్నాము.
24. రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి పట్టిన కాలం ………………
25. రిపబ్లిక్ దినోత్సవాన్ని ………………. రోజున జరుపుకుంటాం.
26. రాజ్యాంగ దినోత్సవాన్ని ………………….. రోజున జరుపుకుంటాం.
27. రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతాన్ని …………… అంటారు.
28. రాజ్యాంగ ప్రవేశికకు ……………..మూల ఆధారం.
29. ‘సామ్యవాదం’, ‘లౌకిక’ పదాలు …………… సంవత్సరంలో రాజ్యాంగంలో చేర్చబడ్డాయి.
30. భారత రాజ్యాంగంలోని …………… భాగంలో ప్రాథమిక హక్కులు పొందుపరచబడ్డాయి.
31. భారత రాజ్యాంగంలోని …………. భాగంలో ప్రాథమిక విధులు పొందుపరచబడ్డాయి.
32. ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును ………………… సంవత్సరంలో తొలగించారు.
33. 86వ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం ……….
34. విద్యా హక్కు చట్టం ………………. న అమల్లోకి వచ్చింది.
35. విద్యా హక్కు చట్టంను పార్లమెంటు ……….. సంవత్సరంలో ఆమోదించింది.
36. ప్రాథమిక విధులను …………… సంవత్సరంలో రాజ్యాంగంలో చేర్చారు.
37. ప్రాథమిక విధులను …………… దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు.
38. మత వ్యవహారాల్లో తటస్థంగా ఉండే రాజ్యం …………………
జవాబు:
- రాజ్యాంగం
- బ్రిటన్
- 1935
- మొదటి రాజ్యాంగ పత్రం
- 1931
- 1928
- మోతీలాల్ నెహ్రూ
- భారత జాతీయ కాంగ్రెస్
- రాజ్యాంగ సభ
- 1934
- 1946
- 93
- 299
- డా|| బాబు రాజేంద్రప్రసాద్
- 1950, జనవరి 24
- డా॥ బాబు రాజేంద్రప్రసాద్
- 1947, ఆగస్టు 29
- 1948
- 315, 8
- 8
- 395, 8
- 14 ఏప్రిల్, 1891
- 2015
- 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
- జనవరి 26
- నవంబరు 26
- రాజ్యాంగ పీఠిక
- లక్ష్యాల తీర్మానం
- 1976
- 3వ
- 43
- 1978
- 2002
- ఏప్రిల్ 1, 2010
- 2009
- 1976
- రష్యా
- లౌకిక రాజ్యం
III. కింది వానిని జతపరుచుము
1.
Group-A | Group-B |
i) బిరుదులు రద్దు | a) రాజ్యాంగ పరిహారపు హక్కు |
ii) జీవించే హక్కు | b) మత స్వాతంత్ర్యపు హక్కు |
iii) బాల కార్మిక వ్యవస్థ రద్దు | c) పీడనాన్ని నిరోధించే హక్కు |
iv) లౌకిక వాదం | d) స్వేచ్ఛా హక్కు |
v) హక్కుల పరిరక్షణ | e) సమానత్వపు హక్కు |
జవాబు:
Group-A | Group-B |
i) బిరుదులు రద్దు | e) సమానత్వపు హక్కు |
ii) జీవించే హక్కు | d) స్వేచ్ఛా హక్కు |
iii) బాల కార్మిక వ్యవస్థ రద్దు | c) పీడనాన్ని నిరోధించే హక్కు |
iv) లౌకిక వాదం | b) మత స్వాతంత్ర్యపు హక్కు |
v) హక్కుల పరిరక్షణ | a) రాజ్యాంగ పరిహారపు హక్కు |
2.
Group-A | Group-B |
i) 1946 | a) రాజ్యాంగ సభ ఎన్నికలు |
ii) 1949 | b) రాజ్యాంగం ఆమోదం |
iii) 1950 | c) రాజ్యాంగం అమలు |
iv) 2005 | d) సమాచార హక్కు |
v) 2009 | e) విద్యా హక్కు |
vi) 1976 | f) 42 వ రాజ్యాంగ సవరణ |
vii) 1978 | g) 44 వ రాజ్యాంగ సవరణ |
జవాబు:
Group-A | Group-B |
i) 1946 | a) రాజ్యాంగ సభ ఎన్నికలు |
ii) 1949 | b) రాజ్యాంగం ఆమోదం |
iii) 1950 | c) రాజ్యాంగం అమలు |
iv) 2005 | d) సమాచార హక్కు |
v) 2009 | e) విద్యా హక్కు |
vi) 1976 | f) 42 వ రాజ్యాంగ సవరణ |
vii) 1978 | g) 44 వ రాజ్యాంగ సవరణ |
3.
Group-A | Group-B |
i) ప్రజల చేత ఎన్నుకోబడుట | a) సౌభ్రాతృత్వం |
ii) మత ప్రమేయం లేకుండుట | b) సామ్యవాదం |
iii) దేశాధినేత ఎన్నుకోబడుట | c) గణతంత్రం |
iv) ఆర్థిక సమానత్వం | d) లౌకిక వాదం |
v) సోదర భావం | e) ప్రజాస్వామ్యం |
జవాబు:
Group-A | Group-B |
i) ప్రజల చేత ఎన్నుకోబడుట | e) ప్రజాస్వామ్యం |
ii) మత ప్రమేయం లేకుండుట | d) లౌకిక వాదం |
iii) దేశాధినేత ఎన్నుకోబడుట | c) గణతంత్రం |
iv) ఆర్థిక సమానత్వం | b) సామ్యవాదం |
v) సోదర భావం | a) సౌభ్రాతృత్వం |