Practice the AP 7th Class Social Bits with Answers 6th Lesson విజయనగర సామ్రాజ్యం on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 7th Class Social Bits 6th Lesson విజయనగర సామ్రాజ్యం

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగిన సంవత్సరం.
A) క్రీ. శ. 1236
B) క్రీ. శ. 1336
C) క్రీ.శ. 1363
D) క్రీ. శ. 1263
జవాబు:
B) క్రీ. శ. 1336

2. విజయనగర సామ్రాజ్యము (విజయనగరము) ఈ నదికి దక్షిణ భాగాన నిర్మించబడింది.
A) కృష్ణానది
B) గోదావరి
C) తుంగభద్ర
D) కావేరి
జవాబు:
C) తుంగభద్ర

3. విజయనగర సామ్రాజ్యానికి రాజధాని నగరం
A) వరంగల్
B) ఢిల్లీ
C) హంపీ
D) బీజాపూర్
జవాబు:
C) హంపీ

AP 7th Class Social Bits Chapter 6 విజయనగర సామ్రాజ్యం

4. విజయనగర సామ్రాజ్యం ఈ స్వామి ఆశీర్వాదముతో స్థాపించబడింది.
A) మధ్వాచార్యులు
B) రామానుజాచార్యులు
C) సమర్థరామదాసు
D) విద్యారణ్యస్వామి
జవాబు:
D) విద్యారణ్యస్వామి

5. మొదటి హరిహర, బుక్కరాయలు మొదటగా వీరి ఆస్థానంలో పని చేసారు.
A) కాకతీయులు
B) ఢిల్లీ సుల్తానులు
C) కళ్యాణి చాళుక్యులు
D) రెడ్డి రాజులు
జవాబు:
A) కాకతీయులు

6. సంగమ వంశంలో గొప్ప పాలకుడు
A) శ్రీకృష్ణదేవరాయలు
B) రెండవ దేవరాయలు
C) నరసింహరాయలు
D) ఆలియరామరాయలు
జవాబు:
B) రెండవ దేవరాయలు

7. తుళువ రాజవంశంలోని పాలకుడు కానిది
A) శ్రీకృష్ణదేవరాయలు
B) అచ్యుత దేవరాయలు
C) సదాశివరాయలు
D) నరసింహరాయలు
జవాబు:
D) నరసింహరాయలు

8. శ్రీకృష్ణదేవరాయలు ఈ రాజ్య వంశానికి చెందిన వాడు.
A) సంగమ వంశము
B) సాళువ వంశము
C) తుళువ వంశము
D) అరవీటి వంశము
జవాబు:
C) తుళువ వంశము

9. శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం.
A) క్రీ.శ. 1529 – 1549
B) క్రీ.శ. 1509 – 1529
C) క్రీ. శ. 1500 – 1520
D) క్రీ.శ. 1529 – 1542
జవాబు:
B) క్రీ.శ. 1509 – 1529

10. ఈ యుద్ధంలో ముస్లిం సైన్యాలను శ్రీకృష్ణదేవరాయలు ఓడించారు.
A) దివానీ
B) తైరాయిన్
C) తళ్ళికోట
D) ఏదీకాదు
జవాబు:
A) దివానీ

11. శ్రీకృష్ణదేవరాయలు రాయచూరను ఈ సం||లో స్వాధీనం చేసుకున్నాడు.
A) 1518
B) 1519
C) 1520
D) 1521
జవాబు:
C) 1520

AP 7th Class Social Bits Chapter 6 విజయనగర సామ్రాజ్యం

12. శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంథం కానిది.
A) ఆముక్తమాల్యద
B) జాంబవతీ కళ్యాణం
C) ఉషా పరిణయం
D) వసుచరిత్ర
జవాబు:
D) వసుచరిత్ర

13. విజయనగర సామ్రాజ్యం యొక్క చివరి రాజవంశం
A) సంగమ వంశము
B) అరవీటి వంశము
C) సాళువ వంశము
D) తుళువ వంశము
జవాబు:
B) అరవీటి వంశము

14. విజయనగర సామ్రాజ్య పాలనలో మండల పాలకుని ఇలా పిలిచేవారు.
A)మండలేశ్వరుడు
B) మండలాధ్యక్షుడు
C) ఆయగార్లు
D) నాయంకరులు
జవాబు:
A)మండలేశ్వరుడు

15. సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను ఇలా పిలిచేవారు
A) ఆయగార్లు
B) పాలిగార్లు
C) నాయంకరులు
D) మండలేశ్వరుడు
జవాబు:
B) పాలిగార్లు

16. విజయనగర సామ్రాజ్యంలో ‘బంగారు’ నాణెంగా చెలామణి అయిన నాణెం.
A) వరాహ
B) రూపాయి
C) దామ్
D) అమరం
జవాబు:
A) వరాహ

17. ‘కన్ననూర్’ అను ప్రధానమైన నౌకాశ్రయం ఈ తీరంలో కలదు.
A) సర్కార్ తీరం
B) కోరమండల్ తీరం
C) మలబార్ తీరం
D) కొంకణ్ తీరం
జవాబు:
C) మలబార్ తీరం

18. విజయనగర రాజులతో మంచి వ్యాపార సంబంధాలు కల్గి ఉన్న విదేశీయులు.
A) బ్రిటిషువారు
B) డచ్ వారు
C) ఫ్రెంచివారు
D) పోర్చుగీసువారు
జవాబు:
D) పోర్చుగీసువారు

19. డొమింగో ఫేస్ అను పోర్చుగీసు యాత్రికుడు ఈ విజయ నగర పాలకుని కాలంలో సందర్శించాడు.
A) హరిహర – I
B) దేవరాయ – II
C) అచ్యుత దేవరాయ
D) శ్రీకృష్ణదేవరాయ
జవాబు:
D) శ్రీకృష్ణదేవరాయ

20. ఆలయ ప్రాంగణాలలో చెక్కిన స్తంభాలలో కనిపించే జంతువు.
A) ఏనుగు
B) గుర్రం
C) ఒంటె
D) ఆవు
జవాబు:
B) గుర్రం

AP 7th Class Social Bits Chapter 6 విజయనగర సామ్రాజ్యం

21. శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని రాణుల యొక్క లోహ చిత్రాలు (శిల్పాలు) ఈ ఆలయంలో కన్పిస్తాయి.
A) శ్రీశైలం
B) శ్రీకాళహస్తి
C) తిరుమల
D) హంపి
జవాబు:
C) తిరుమల

22. కర్ణాటక సంగీత త్రయంలోని వారు కానిది.
A) దీక్షితార్
B) శ్యామశాస్త్రి
C) త్యాగరాజ స్వామి
D) సిద్ధేంద్ర యోగి
జవాబు:
D) సిద్ధేంద్ర యోగి

23. తళ్ళికోట యుద్ధం జరిగిన సంవత్సరము.
A) క్రీ.శ. 1556
B) క్రీ.శ. 1565
C) క్రీ.శ. 1615
D) క్రీ.శ. 1516
జవాబు:
B) క్రీ.శ. 1565

24. విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు.
A) అళియ రామరాయలు
B) మూడవ శ్రీరంగ రాయలు
C) వెంకట రాయలు
D) తిరుమల రాయలు
జవాబు:
B) మూడవ శ్రీరంగ రాయలు

25. రెడ్డి రాజుల మొదటి రాజధాని.
A) కొండవీడు
B) రాజమండ్రి
C) అద్దంకి
D) కొండవీడు
జవాబు:
C) అద్దంకి

26. బహమనీ సామ్రాజ్యము ఈ సంవత్సరంలో స్థాపించబడింది.
A) క్రీ. శ. 1347
B) క్రీ.శ. 1374
C) క్రీ.శ. 1447
D) క్రీ.శ. 1474
జవాబు:
A) క్రీ. శ. 1347

AP 7th Class Social Bits Chapter 6 విజయనగర సామ్రాజ్యం

27. బహమని సామ్రాజ్యం ఎన్ని రాజ్యాలుగా విడిపోయింది?
A) 4
B) 5
C) 6
D) 3
జవాబు:
B) 5

II. ఖాళీలను వూరింపుము

1. ప్రపంచంలో రెండవ అతిపెద్ద రాజధాని నగరం ………………..
2. 14, 15 శతాబ్దాలలో ………………. ప్రపంచంలో అత్యంత ధనిక రాజ్యం.
3. హంపి ప్రస్తుతము ………………. రాష్ట్రంలో కలదు.
4. కాకతీయ రాజ్యంను ముస్లింలు ఆక్రమించడంతో హరిహర రాయలు, బుక్కరాయ సోదరులు ………….. రాజ్యానికి వెళ్ళారు.
5. మొదటి భారతీయ సర్వేయర్ జనరల్ …………..
6. హంపి వద్ద ఉన్న శిథిలాలు ……………….. సం||లో మెకంజీ కాలంలో వెలుగులోకి వచ్చాయి.
7. మొదటి బుక్కరాయ కుమారుడైన …………….. మదురై సుల్తాన్లను నాశనం చేసాడు.
8. ప్రౌఢ దేవరాయలు అని …………….. ని అంటారు.
9. కళింగ సైన్యాన్ని ఓడించిన విజయనగర పాలకుడు ………
10. రెండవ దేవరాయలు బహమనీ సుల్తాన్ అయిన …………….. చేతిలో ఓడించబడ్డాడు.
11. క్రీ.శ. 1520లో రాయచూర్ ని స్వాధీనం చేసుకున్నది …………………….
12. శ్రీకృష్ణదేవరాయల గొప్ప తెలివైన మంత్రి …………..
13. శ్రీకృష్ణదేవరాయలకు …………….. అనే బిరుదు కలదు.
14. “దేశ భాషలందు తెలుగు లెస్స” అన్నది …………
15. ‘ఆంధ్ర కవితా పితామహుడు’ అని ………………. ని అంటారు.
16. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం ………………. అనే కొత్త నగరాన్ని నిర్మించాడు.
17. భూమి శిస్తు ……………… వంతుగా నిర్ణయించారు.
18. పాలిగార్లకు మంజూరు చేయబడిన భూమిని ……………….. అంటారు.
19. ‘విషవాయువులను గుర్తించడానికి ……………….. ను ఉపయోగించేవారు.
20. ‘పాండురంగ మహత్యం’ గ్రంథంను ………………. రచించెను.
21. ‘మను చరిత్ర’ గ్రంథంను ………………. రచించెను.
22. ‘సకల నీతిసార సంగ్రహం’ గ్రంథంను. ……………….. రచించెను.
23. కాంచీపురములోని ……………….. దేవాలయము విజయనగర రాజుల నిర్మాణశైలి గొప్పతనానికి ఉదాహరణగా చెప్పవచ్చు.
24. విద్యారణ్య స్వామి ………………. అను గ్రంథంను రాశారు.
25. సిద్ధేంద్రయోగి ప్రవేశపెట్టిన నృత్యరూపము ………..
26. ముస్లిం సంయుక్త దళాలు తళ్ళికోట యుద్ధంలో ………………. ను ఓడించెను.
27. తళ్ళికోట యుద్ధంను ………………. యుద్ధం అని కూడా అంటారు.
28. రెడ్డి రాజ్యా న్ని దక్షిణ భారతదేశంలో ……………….. స్థాపించాడు.
29. రెడ్డి రాజుల రాజధాని అద్దంకి నుండి ………………. కు మార్చారు.
30. ఆంధ్ర మహాభారతమును రచించినది. ……………….
31. ఎర్రా ప్రగడకు ………………. అని బిరుదు కలదు.
32. క్రీ.శ. 1347లో ……………… బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు.
33. అహ్మదాలిషా రాజధానిని గుల్బర్గా నుండి …………….. కు మార్చాడు.
34. మూడవ ముహ్మద్షా విజయానికి కారణం ఆయన మంత్రి ……………
35. మహ్మద్ గవాన్ ఒక …………… వ్యాపారి.
36. మూడవ మహ్మద్ షా క్రీ. శ. ……………… సం||లో మరణించాడు.
జవాబు:

  1. హంపి
  2. విజయనగరం
  3. కర్ణాటక
  4. కంపిలి
  5. కొలిన్ మెకంజీ
  6. 1805
  7. కుమారకంపన
  8. రెండవ దేవరాయలు
  9. రెండవ దేవరాయలు
  10. అహ్మద్
  11. శ్రీకృష్ణదేవరాయలు
  12. తిమ్మరుసు
  13. ఆంధ్రభోజుడు
  14. శ్రీకృష్ణదేవరాయలు
  15. అల్లసాని పెద్దన
  16. నాగలాపురం
  17. 1/6వ
  18. అమరం
  19. పక్షులు
  20. తెనాలి రామకృష్ణుడు
  21. రామరాజ భూషణుడు
  22. అయ్యలరాజు రామ భద్రుడు
  23. వరద రాజ
  24. సంగీత సర్వస్వం
  25. కూచిపూడి
  26. ఆళియ రామరాయలు
  27. రాక్షసి తంగడి
  28. ప్రోలయ వేమారెడ్డి
  29. కొండవీడు
  30. ఎర్రాప్రగడ
  31. ప్రబంధ పరమేశ్వరుడు
  32. అల్లావుద్దీన్ బహమన్ షా
  33. బీదర్
  34. మహ్మద్ గవాన్
  35. పర్షియన్
  36. 1482

III. కింది వానిని జతపరుచుము
1.

Group-A Group-B
1) రెండవ దేవరాయలు A) తుళువ వంశం
2) ఇమ్మిడి నరసింహరాయలు B) అరవీటి వంశం
3) శ్రీకృష్ణదేవరాయలు C) సంగమ వంశం
4) అళియ రామరాయలు D) సాళువ వంశం

జవాబు:

Group-A Group-B
1) రెండవ దేవరాయలు C) సంగమ వంశం
2) ఇమ్మిడి నరసింహరాయలు D) సాళువ వంశం
3) శ్రీకృష్ణదేవరాయలు A) తుళువ వంశం
4) అళియ రామరాయలు B) అరవీటి వంశం

2.

Group-A Group-B
1) అల్లసాని పెద్దన A) మను చరిత్ర
2) నంది తిమ్మన B) పారిజాతాపహరణం
3) మాదయ గారి మల్లన C) రాజశేఖర చరితం
4) ధూర్జటి D) శ్రీకాళహస్తీశ్వర మహత్యం

జవాబు:

Group-A Group-B
1) అల్లసాని పెద్దన A) మను చరిత్ర
2) నంది తిమ్మన B) పారిజాతాపహరణం
3) మాదయ గారి మల్లన C) రాజశేఖర చరితం
4) ధూర్జటి D) శ్రీకాళహస్తీశ్వర మహత్యం

3.

Group-A Group-B
1) శ్రీకృష్ణదేవరాయలు A) గంగాదేవి
2) పింగళి సూరన B) సంగీత సర్వస్వం
3) విద్యారణ్య స్వామి C) రాఘవ పాండవీయం
4) గంగాదేవి D) ఉషా పరిణయం

జవాబు:

Group-A Group-B
1) శ్రీకృష్ణదేవరాయలు D) ఉషా పరిణయం
2) పింగళి సూరన C) రాఘవ పాండవీయం
3) విద్యారణ్య స్వామి B) సంగీత సర్వస్వం
4) గంగాదేవి A) గంగాదేవి

4.

Group-A Group-B
1) ఇబన్ బటూటా A) మొరాకో యాత్రికుడు
2) నికోలో కాంటి B) ఇటాలియన్ యాత్రికుడు
3) అబ్దుల్ రజాక్ C) పర్షియన్ యాత్రికుడు
4) డువారీ బార్బోసా D) పోర్చుగీసు యాత్రికుడు

జవాబు:

Group-A Group-B
1) ఇబన్ బటూటా A) మొరాకో యాత్రికుడు
2) నికోలో కాంటి B) ఇటాలియన్ యాత్రికుడు
3) అబ్దుల్ రజాక్ C) పర్షియన్ యాత్రికుడు
4) డువారీ బార్బోసా D) పోర్చుగీసు యాత్రికుడు

5.

Group-A Group-B
1) హరిహర -I A) డొమింగో పేస్
2) దేవరాయ – II B) ఫెర్నాండో నూనిజ్
3) శ్రీకృష్ణ దేవరాయ C) ఇబన్ బటూటా
4) అచ్యుత దేవరాయ D) అబ్దుల్ రజాక్

జవాబు:

Group-A Group-B
1) హరిహర -I C) ఇబన్ బటూటా
2) దేవరాయ – II D) అబ్దుల్ రజాక్
3) శ్రీకృష్ణ దేవరాయ A) డొమింగో పేస్
4) అచ్యుత దేవరాయ B) ఫెర్నాండో నూనిజ్

6.

Group-A Group-B
1) విజయనగర స్థాపన A) క్రీ. శ. 1565
2) బహమని రాజ్య స్థాపన B) క్రీ. శ. 1347
3) రెడ్డి రాజ్య స్థాపన C) క్రీ. శ. 1336
4) తళ్ళికోట యుద్ధం D) క్రీ. శ. 1325

జవాబు:

Group-A Group-B
1) విజయనగర స్థాపన D) క్రీ. శ. 1325
2) బహమని రాజ్య స్థాపన B) క్రీ. శ. 1347
3) రెడ్డి రాజ్య స్థాపన C) క్రీ. శ. 1336
4) తళ్ళికోట యుద్ధం A) క్రీ. శ. 1565