Practice the AP 7th Class Social Bits with Answers 5th Lesson కాకతీయ రాజ్యం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Social Bits 5th Lesson కాకతీయ రాజ్యం
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. ఘటికలు అనే విద్యాసంస్థలను స్థాపించినవారు.
A) కాకతీయులు
B) పాండ్యులు
C) యాదవులు
D) కల్యాణి చాళుక్యులు
జవాబు:
D) కల్యాణి చాళుక్యులు
2. కల్యాణి చాళుక్యుల రాజధాని నగరము.
A) దేవగిరి
B) ఓరుగల్లు
C) రేకపల్లి
D) బసవ కళ్యాణి
జవాబు:
D) బసవ కళ్యాణి
3. హోయసాలుల రాజధాని నగరము.
A) దేవగిరి
B) ఓరుగల్లు
C) రేకపల్లి
D) మదురై
జవాబు:
A) దేవగిరి
4. శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను నడిపిన కులశేఖరుడు ఈ రాజ్య (వంశానికి) చెందినవాడు.
A) కాకతీయ
B) పాండ్య
C) యాదవ
D) హోయసాల
జవాబు:
B) పాండ్య
5. కాకతీయుల మొదటి రాజధాని నగరం.
A) ఓరుగల్లు
B) హనుమకొండ
C) రేకపల్లి
D) మోటుపల్లి
జవాబు:
B) హనుమకొండ
6. కాకతీయులు మొదట్లో వీరికి సామంతులుగా పనిచేశారు.
A) రాష్ట్ర కూటులకు
B) పశ్చిమ చాళుక్యులకు
C) A & B
D) కళ్యాణి చాళుక్యులకు
జవాబు:
C) A & B
7. రుద్రదేవుని విజయాలు ఈ శాసనంలో వివరించబడ్డాయి.
A) హనుమకొండ శాసనం
B) మోటుపల్లి శాసనం
C) విలస శాసనం
D) పైవన్నీ
జవాబు:
A) హనుమకొండ శాసనం
8. వెయ్యి స్తంభాల గుడిని నిర్మించిన కాకతీయ రాజు
A) రుద్రదేవుడు
B) మహాదేవుడు
C) గణపతి దేవుడు
D) ప్రతాప రుద్రుడు
జవాబు:
A) రుద్రదేవుడు
9. ఓరుగల్లు నగర నిర్మాణముగావించినది.
A) రుద్రదేవుడు
B) మహాదేవుడు
C) గణపతి దేవుడు
D) రుద్రమదేవి
జవాబు:
A) రుద్రదేవుడు
10. ‘మహామండలేశ్వర’ అను బిరుదు కల్గిన కాకతీయ రాజు.
A) రుద్రదేవుడు
B) మహాదేవుడు
C) గణపతి దేవుడు
D) ప్రతాపరుద్రుడు
జవాబు:
C) గణపతి దేవుడు
11. గణపతిదేవుడు జారీ చేసిన ప్రముఖ శాసనం.
A) హనుమకొండ శాసనం
B) విలస శాసనం
C) మోటుపల్లి శాసనం
D) ఏదీ కాదు
జవాబు:
C) మోటుపల్లి శాసనం
12. రుద్రమదేవి పాలన ఈ సంవత్సరంలో ప్రారంభమైనది.
A) క్రీ.శ. 1262
B) క్రీ.శ. 1226
C) క్రీ.శ. 1612
D) క్రీ.శ. 1261
జవాబు:
A) క్రీ.శ. 1262
13. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన మార్కోపోలో దేశ యాత్రికుడు.
A) పోర్చుగీసు
B) ఇటాలియన్
C) ఫ్రెంచి
D) బ్రిటిషు
జవాబు:
B) ఇటాలియన్
14. కాకతీయుల రాజ్య విభాగాల సైనికాధికారులు
A) అమర నాయకులు
B) నాయంకరులు
C) తలారి
D) ఆయగార్లు
జవాబు:
B) నాయంకరులు
15. ‘స్థల’ అనగా ఎన్ని గ్రామాల సమూహం?
A) 10-60
B) 20-60
C) 40-60
D) 10-20
జవాబు:
A) 10-60
16. గ్రామ రక్షక భటుడు.
A) నాయంకర
B) కరణం
C) ఆయగార్లు
D) తలారి
జవాబు:
D) తలారి
17. కాకతీయుల పాలనలో గ్రామపాలనను పర్యవేక్షించే గ్రామాధికారులు.
A) నాయంకరులు
B) ఆయగార్లు
C) తలారిలు
D) కరణాలు
జవాబు:
B) ఆయగార్లు
18. ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసే రైతులు.
A) అర్ధశిరి
B) ఆయగార్లు
C) రెడ్లు
D) నాయంకరులు
జవాబు:
A) అర్ధశిరి
19. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి.
A) ఇల్లరి – గృహ పన్ను
B) పుల్లరి – అటవీ పన్ను
C) అడ్డపట్టు – గొర్రెల మందపై పన్ను
D) దరిశనం – వృత్తి పన్ను
జవాబు:
D) దరిశనం – వృత్తి పన్ను
20. కాకతీయుల కాలం నాటి ప్రముఖ నౌకాశ్రయం.
A) రేకపల్లి
B) మోటుపల్లి
C) ఓరుగల్లు
D) ద్వార సముద్రం
జవాబు:
B) మోటుపల్లి
21. కాకతీయుల కాలంలో యుద్ధ సమయంలో ప్రదర్శించే నాట్యం
A) కూచిపూడి
B) భరతనాట్యం
C) పేరిణి
D) ధింసా
జవాబు:
C) పేరిణి
22. ‘రుద్రేశ్వర ఆలయం’ అని ఈ ఆలయాన్ని పిలుస్తారు.
A) వెయ్యి స్తంభాల గుడి
B) రామప్ప దేవాలయము
C) విఠలాలయము
D) రామాలయము
జవాబు:
A) వెయ్యి స్తంభాల గుడి
23. ఆలయ నిర్మాణాలలో ‘త్రికూట పద్ధతి’ శైలిని వాడినవారు.
A) కాకతీయులు
B) యాదవులు
C) చాళుక్యులు
D) ముసునూరి నాయకులు
జవాబు:
A) కాకతీయులు
24. ఉల్లు ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తానులు ఈ సంవత్సరంలో కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు.
A) క్రీ.శ. 1323
B) క్రీ.శ. 1332
C) క్రీ.శ. 1223
D) క్రీ.శ. 1232
జవాబు:
A) క్రీ.శ. 1323
25. ముసునూరి నాయకుల రాజధాని నగరం.
A) దేవగిరి
B) ద్వార సముద్రం
C) రేకపల్లి
D) మోటుపల్లి
జవాబు:
C) రేకపల్లి
26. క్రీ.శ. 1336లో తుగ్లక్ పాలనను వరంగల్ నుండి తరిమికొట్టడానికి తిరుగుబాటును నడిపించినది. ( )
A) ప్రోలయ నాయక
B) కాపయ నాయక
C) 2వ ప్రతాపరుద్రుడు
D) పై వారందరూ
జవాబు:
B) కాపయ నాయక
27. సంస్కృతములో ‘నీతిసారము’ అను గ్రంథమును రచించిన కాకతీయ రాజు.
A) రెండవ ప్రోలరాజు
B) రుద్రదేవుడు
C) గణపతి దేవుడు
D) ప్రతాపరుద్రుడు
జవాబు:
B) రుద్రదేవుడు
II. ఖాళీలను పూరింపుము
1. మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ……………………. ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి.
2. కల్యాణి చాళుక్యుల వంశ స్థాపకుడు ………….
3. ‘విక్రమాంక దేవచరిత్ర’ గ్రంథంను రచించినది ………….
4. కల్యాణి చాళుక్యుల ఆస్థానానికి చెందిన ప్రసిద్ధ కన్నడ కవి ……………….
5. యాదవులు మొదట …………………… కు సామంతులుగా పనిచేసారు.
6. యాదవ రాజవంశం స్థాపకుడు ……………….
7. యాదవ రాజులలో సుప్రసిద్ధమైనవాడు ……………
8. హోయసాల రాజవంశం యొక్క చివరి పాలకుడు ………………..
9. ద్వైతాన్ని బోధించినది ……………..
10. విశిష్టాద్వైతాన్ని బోధించినది …………..
11. పాండ్యులు …………………….ను రాజధానిగా చేసుకుని పాలించారు.
12. పాండ్య కులశేఖరుని కాలంలో …………….. అను యాత్రికుడు రాజ్యాన్ని సందర్శించెను.
13. …………….. అనే దేవతను ఆరాధించిన కారణంగా కాకతీయులకు ఆ పేరు వచ్చెను.
14. కాకతి అనగా ……………………. యొక్క మరొక రూపం.
15. శ్రీమదాంధ్ర మహాభారతం రచించినది ……………
16. ఏకశిలా నగరం యొక్క ప్రస్తుత నామం ……………..
17. దక్షిణాన ……………………. తెలుగు చోడ మూలానికి చెందిన నలుగురు రాజులను ఓడించాడు.
18. యాదవరాజుల చేతిలో మరణించిన కాకతీయ రాజు ………………….
19. 63 సంవత్సరాల సుదీర్ఘ పాలన చేసిన కాకతీయ రాజు ……………….
20. అన్నపక్షి అనే సంస్కృత పదం పౌరాణిక పక్షి …………………….. ను సూచిస్తుంది.
21. యాదవ రాజైన మహాదేవుని ……………………. కాకతీయ పాలకులు ఓడించారు.
22. రుద్రమదేవి పాలనకు వ్యతిరేకించిన నెల్లూరు పాలకుడు
23. రుద్రమదేవి నిడదవోలు పాలకుడు ……………………… ని వివాహం చేసుకుంది.
24. రుద్రమదేవి బిరుదులు ………………………, …………………..
25. ప్రతాప రుద్రుని పాలన నాటికి దాదాపు …………………. మంది నాయంకరులు కలరు.
26. కొన్ని ‘స్థలా’ల కలయికతో ఏర్పాటు చేయబడిన ప్రాంతాన్ని ………………….. అంటారు.
27. …………………. ప్రాథమిక పరిపాలనా విభాగము.
28. గ్రామంలో భూమి సంబంధ రికార్డులను పర్యవేక్షించే అధికారి …………….
29. నీటి వసతి గలిగిన భూమిని ………………….. అంటారు.
30. రాజ్యా నికి ప్రధాన ఆదాయ వనరు …………….
31. పన్నుల వసూలు కోసం ……………………. అనే అధికారులను నియమించారు.
32. కాకతీయుల కాలంలో ……………………. మతం బాగా ప్రసిద్ది చెందింది.
33. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ …………………… నృత్యంలో ప్రఖ్యాతిగాంచారు.
34. వేయి స్తంభాల గుడి ……………………. లో ఉంది.
35. రామప్ప ఆలయంను ……………………. నిర్మించాడు.
36. ఢిల్లీ సుల్తానులు ……………………. ని కాకతీయ రాజు కాలంలో దండయాత్రలు చేసారు.
37. ముసునూరి ప్రోలయ నాయకుడు ……………………. రాజధానిగా అధికారంలోకి వచ్చాడు.
38. కాకతీయ ఆలయ నిర్మాణాలలో ఎక్కువగా ……………………. తో చేయబడిన శిల్పాలు అద్భుతం.
జవాబు:
- 5
- రెండవ తైలపుడు
- బిల్హణుడు
- రన్నడు
- కళ్యాణి చాళుక్యులు
- బిల్లమ
- సింఘన
- నాల్గవ బల్లాలుడు
- మధ్వాచార్యులు
- రామానుజాచార్యులు
- మదురై
- మార్కోపోలో
- కాకతి
- దుర్గాదేవి
- తిక్కన
- వరంగల్
- రుద్రదేవుడు
- మహాదేవుడు
- గణపతిదేవుడు
- హంస
- రుద్రమదేవి
- అంబదేవుడు
- చాళుక్య వీరభద్రుడు
- రుద్రమాంబ, రుద్రదేవ మహారాజు
- 72
- నాడు
- గ్రామము
- కరణం
- వెలిచేను
- భూమి శిస్తు
- సుంకాధికారి
- శైవ
- పేరిణి
- హనుమ కొండ
- రేచర్ల రుద్రుడు
- 2వ ప్రతాపరుద్రుడు
- రేకపల్లి
- నల్ల పాలరాతి
III. కింది వానిని జతపరుచుము
1.
Group-A | Group-B |
1) కల్యాణి చాళుక్యులు | A) గుండ్యన |
2) యాదవ రాజ్యం | B) కులశేఖరుడు |
3) హోయసాల రాజ్యం | C) బిత్తిగ విష్ణువర్ధన |
4) పాండ్య రాజ్యం | D) బిల్లమ |
5) కాకతీయ రాజ్యం | E) రెండవ తైలపుడు |
జవాబు:
Group-A | Group-B |
1) కల్యాణి చాళుక్యులు | E) రెండవ తైలపుడు |
2) యాదవ రాజ్యం | D) బిల్లమ |
3) హోయసాల రాజ్యం | C) బిత్తిగ విష్ణువర్ధన |
4) పాండ్య రాజ్యం | B) కులశేఖరుడు |
5) కాకతీయ రాజ్యం | A) గుండ్యన |
2.
Group-A | Group-B |
1) రెండవ ప్రోలరాజు | A) క్రీ.శ. 1116-1157 |
2) రుద్రదేవుడు | B) క్రీ.శ. 1158-1195 |
3) గణపతి దేవుడు | C) క్రీ.శ. 1199-1262 |
4) రుద్రమదేవి | D) క్రీ.శ. 1262-1289 |
5) ప్రతాపరుద్రుడు | E) క్రీ.శ. 1289-1323 |
జవాబు:
Group-A | Group-B |
1) రెండవ ప్రోలరాజు | A) క్రీ.శ. 1116-1157 |
2) రుద్రదేవుడు | B) క్రీ.శ. 1158-1195 |
3) గణపతి దేవుడు | C) క్రీ.శ. 1199-1262 |
4) రుద్రమదేవి | D) క్రీ.శ. 1262-1289 |
5) ప్రతాపరుద్రుడు | E) క్రీ.శ. 1289-1323 |
3.
Group-A | Group-B |
1) స్వతంత్ర పాలకుడు | A) రుద్రదేవుడు |
2) రుద్రేశ్వరాలయ నిర్మాత | B) రెండవ ప్రోలరాజు |
3) స్వర్ణయుగం | C) ప్రతాపరుద్రుడు |
4) చివరి పాలకుడు | D) గణపతి దేవుడు |
5) మార్కోపోలో సందర్శనం | E) రుద్రమదేవి |
జవాబు:
Group-A | Group-B |
1) స్వతంత్ర పాలకుడు | B) రెండవ ప్రోలరాజు |
2) రుద్రేశ్వరాలయ నిర్మాత | A) రుద్రదేవుడు |
3) స్వర్ణయుగం | D) గణపతి దేవుడు |
4) చివరి పాలకుడు | C) ప్రతాపరుద్రుడు |
5) మార్కోపోలో సందర్శనం | E) రుద్రమదేవి |
4.
Group-A | Group-B |
1) నీతిసారము | A) మల్లికార్జున పండితారాధ్యుడు |
2) క్రీడాభిరామం | B) బిల్హణుడు |
3) విక్రమాంక దేవ చరిత్ర | C) వల్లభరాయుడు |
4) శివతత్వ సారము | D) రుద్రదేవుడు |
జవాబు:
Group-A | Group-B |
1) నీతిసారము | D) రుద్రదేవుడు |
2) క్రీడాభిరామం | C) వల్లభరాయుడు |
3) విక్రమాంక దేవ చరిత్ర | B) బిల్హణుడు |
4) శివతత్వ సారము | A) మల్లికార్జున పండితారాధ్యుడు |
5.
Group-A | Group-B |
1) ద్వైతము | A) మధ్వాచార్యులు |
2) విశిష్టాద్వైతము | B) రామానుజాచార్యులు |
3) పేరిణి నాట్యం | C) నటరాజ రామకృష్ణ |
4) కాకతి | D) దుర్గాదేవి |
జవాబు:
Group-A | Group-B |
1) ద్వైతము | A) మధ్వాచార్యులు |
2) విశిష్టాద్వైతము | B) రామానుజాచార్యులు |
3) పేరిణి నాట్యం | C) నటరాజ రామకృష్ణ |
4) కాకతి | D) దుర్గాదేవి |
6.
Group-A | Group-B |
1) సుంకాధికారి | A) సైనిక నాయకుడు |
2) అర్ధశిరి | B) రక్షక భటుడు |
3) ఆయగారు | C) గ్రామాధికారి |
4) తలారి | D) కౌలు రైతు |
5) నాయంకర | E) పన్ను వసూలు |
జవాబు:
Group-A | Group-B |
1) సుంకాధికారి | E) పన్ను వసూలు |
2) అర్ధశిరి | D) కౌలు రైతు |
3) ఆయగారు | C) గ్రామాధికారి |
4) తలారి | B) రక్షక భటుడు |
5) నాయంకర | A) సైనిక నాయకుడు |