Practice the AP 7th Class Social Bits with Answers 4th Lesson ఢిల్లీ సుల్తానులు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Social Bits 4th Lesson ఢిల్లీ సుల్తానులు
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. చరిత్ర అధ్యయనం కొరకు ఉపయోగపడు పురావస్తు ఆధారం కానిది.
A) శాసనాలు
B) నాణాలు
C) స్మారకాలు
D) ఇతిహాసాలు
జవాబు:
D) ఇతిహాసాలు
2. క్రింది వాక్యాలను పరిశీలించండి.
అ) ప్రాచీన యుగం – 8వ శతాబ్దం వరకు
ఆ) మధ్య యుగం – 8 నుండి ప్రస్తుతం
A) ‘అ’ సత్యము & ‘ఆ’ సత్యము
B) ‘అ’ అసత్యము & ‘ఆ’ అసత్యము
C) ‘అ’ సత్యము & ‘ఆ’ అసత్యము
D) ‘అ’ అసత్యము & ‘ఆ’ సత్యము
జవాబు:
C) ‘అ’ సత్యము & ‘ఆ’ అసత్యము
3. దిల్లికా లేదా దిల్లికాపురను నిర్మించి రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజపుత్రులు
A) చౌహానులు
B) తోమర్లు
C) రాథోడ్లు
D) చందేలులు
జవాబు:
B) తోమర్లు
4. మహ్మద్ ఘోరి క్రీ.శ. 1192 సం||లో రెండవ తరాయిన్ యుద్ధంలో ఇతనిని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు.
A) జయపాలుడు
B) పృథ్వీరాజ్ చౌహాన్
C) భోజరాజు
D) జయచంద్రుడు
జవాబు:
B) పృథ్వీరాజ్ చౌహాన్
5. మామ్లుక్ లేదా బానిస వంశాన్ని ఈ సం||లో భారతదేశంలో స్థాపించారు.
A) 1192
B) 1206
C) 1209
D) 1210
జవాబు:
B) 1206
6. కుతుబుద్దీన్ ఐబక్ దీనిని రాజధానిగా చేసుకుని ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాలించాడు.
A) ఢిల్లీ
B) దౌలతాబాద్
C) లాహోర్
D) అహ్మదాబాద్
జవాబు:
C) లాహోర్
7. కుతుబ్ మీనార్ నిర్మాణంను పూర్తిచేసినవారు.
A) కుతుబుద్దీన్ ఐబక్
B) సుల్తానా రజియా
C) ఇల్-టుట్-మిష్
D) బాల్బన్
జవాబు:
C) ఇల్-టుట్-మిష్
8. ఢిల్లీకి తొలి సర్వ స్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణింపబడినవాడు.
A) కుతుబుద్దీన్ ఐబక్
B) అల్లావుద్దీన్ ఖిల్జీ
C) మహ్మద్ బీన్ తుగ్లక్
D) ఇల్-టుట్-మిష్
జవాబు:
D) ఇల్-టుట్-మిష్
9. క్రింది వానిలో అల్లావుద్దీన్ సంస్కరణలో భాగం కానిది.
A) గూఢచారి వ్యవస్థ స్థాపన
B) ధరల క్రమబద్ధీకరణ
C) కరెన్సీ సంస్కరణలు
D) గుర్రాలపై ముద్ర వేయు పద్ధతి
జవాబు:
C) కరెన్సీ సంస్కరణలు
10. వీరి పాలనా కాలంలో తైమూరు దండయాత్రలు ఎదుర్కొవాల్సి వచ్చింది.
A) ఖిల్జీల కాలం
B) తుగ్లక్ ల కాలం
C) సయ్యల కాలం
D) లోడీల కాలం
జవాబు:
B) తుగ్లక్ ల కాలం
11. చంగిజ్ ఖాన్ మంగోలియన్లను ఏకం చేసి క్రీ.శ. ఈ సం||లో మంగోలుల రాజ్యాన్ని స్థాపించాడు.
A) 1206
B) 1208
C) 1209
D) 1210
జవాబు:
A) 1206
12. ‘పిచ్చి తుగ్లక్’గా పేరు పొందిన రాజు.
A) ఘియాజుద్దీన్ తుగ్లక్
B) మొహమ్మద్ బీన్ తుగ్లక్
C) ఫిరోజ్ షా తుగ్లక్
D) ఎవరూ కాదు
జవాబు:
B) మొహమ్మద్ బీన్ తుగ్లక్
13. సయ్యద్ వంశానికి చెందని రాజు,
A) కిజరిన్
B) ముబారక్ష
C) మహ్మద్ షా ఆలమ్ షా
D) బహలాల్
జవాబు:
D) బహలాల్
14. తుగ్లక్ వంశ పాలనా కాలంలో ఈ సం||లో తైమూరు ఢిల్లీని స్వాధీనపరచుకున్నాడు.
A) క్రీ.శ. 1389
B) క్రీ. శ. 1398
C) క్రీ.శ. 1289
D) క్రీ.శ. 1298
జవాబు:
B) క్రీ. శ. 1398
15. ‘బందగాన్’ పద్ధతిని ప్రవేశపెట్టిన ఢిల్లీ పాలకుడు.
A) అల్లావుద్దీన్ ఖిల్జీ
B) మహ్మద్ బీన్ తుగ్లక్
C) ఇల్ టుట్ మిష్
D) ఇబ్రహీం లోడి
జవాబు:
C) ఇల్ టుట్ మిష్
16. పరిపాలనలో సహకరించడం కోసం టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్ టు ట్ మిష్ చే ప్రారంభించబడిన వ్యవస్థ.
A) బందగాన్
B) చిహల్గని
C) షరియత్
D) ఇకా వ్యవస్థ
జవాబు:
B) చిహల్గని
17. ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇలా విభజించారు. .
A) ముకీలు
B) ఇకాలు
C) మండలాలు
D) నాడులు
జవాబు:
B) ఇకాలు
18. ఢిల్లీ సుల్తానుల కాలంలో భూమిశిస్తు ఇంతగా ఉండేది.
A) 1/4వ వంతు
B) 1/3వ వంతు
C) 1/6వ వంతు
D) 1/2వ వంతు
జవాబు:
B) 1/3వ వంతు
19. ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రధాన ఎగుమతులలో లేనిది.
A) పత్తి
B) ముత్యాలు
C) నీలిమందు
D) గుర్రాలు
జవాబు:
D) గుర్రాలు
20. భక్తియార్ ఖాకీకి అంకితం ఇవ్వబడిన కట్టడం. .
A) అలై దర్వాజ
B) కువ్వత్-ఉల్-ఇస్లాం
C) కుతుబ్ మీనార్
D) అలైమీనార్
జవాబు:
C) కుతుబ్ మీనార్
21. కువ్వత్-ఉల్-ఇస్లామ్ మసీదుకు దక్షిణ ద్వారం వలే నిర్మించబడిన కట్టడం.
A) కుతుబ్ మీనార్
B) అలైమినార్
C) అలైదర్వాజ
D) తుగ్లకాబాద్
జవాబు:
C) అలైదర్వాజ
22. ‘భారతదేశపు చిలుక’ అని బిరుదు కలవారు.
A) అల్ బెరూని
B) అమీర్ ఖుస్రూ
C) జియా-ఉద్దీన్-బరూని
D) బదేని
జవాబు:
B) అమీర్ ఖుస్రూ
23. మొదటి పానిపట్టు యుద్ధం ఈ సంవత్సరంలో జరిగింది.
A) 1398
B) 1526
C) 1426
D) 1326
జవాబు:
B) 1526
24. ప్రక్క చిత్రంలోని నిర్మాణం ఏమిటి?
A) కుతుబ్ మీనార్
B) కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు
C) అలై దర్వాజ
D) అలై మీనార్
జవాబు:
C) అలై దర్వాజ
II. ఖాళీలను పూరింపుము
1. గతాన్ని అధ్యయనం చేయడమే …………………….
2. చారిత్రక ఆధారాలు ………………. మరియు …………….. ఆధారాలు.
3. తోమర్, చౌహాను వంశస్తుల కాలంలో ………………. ముఖ్య వాణిజ్య కేంద్రం.
4. పృథ్వీరాజ్ చౌహాన్ ను రెండవ తరాయిన్ యుద్ధంలో ……………… ఓడించాడు.
5. బానిస వంశ స్థాపకుడు …………
6. బానిస వంశాన్ని ………………. సం||లో స్థాపించెను.
7. రాజధాని లాహోర్ నుండి ఢిల్లీకి ……………. కాలంలో మార్చబడినది.
8. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ ………….
9. బానిస వంశపాలన ………………. కాలంలో ముగిసింది.
10. ఖిల్జీ వంశ స్థాపకుడు ………………..
11. అల్లా ఉట్టన్ ఖిల్జీ దక్షిణ భారతదేశాన్ని జయించడానికి …. ………….. ను పంపించెను.
12. ధరలను క్రమబద్ధీకరించిన ఢిల్లీ చక్రవర్తి ……….
13. మంగోలియన్లను ఏకం చేసినది ……………..
14. ఖిల్జీలలో చివరి పాలకుడు ……………….
15. తుగ్లక్ వంశ స్థాపకుడు …………………
16. తుగ్లక్ ల పాలనాకాలంలో ………………. దండయాత్రలు ఎదుర్కొన్నారు.
17. రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు మార్చినది …………..
18. రాగి నాణేలను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ……………..
19. సయ్యద్ వంశ స్థాపకుడు ……………
20. సయ్యద్ వంశ చివరి పాలకుడు ……………….
21. లోడి వంశ స్థాపకుడు ………….
22. లోడి వంశ చివరి పాలకుడు ……………..
23. రాజ్యంలో ……………….. సర్వాధికారి.
24. పరిపాలనా ……………… నిబంధనల ప్రకారం జరుగుతుంది.
25. తుర్గాన్-ఇ-చిహల్గనిని ……………….. అని కూడా అంటారు.
26. ఇకా సైనికాధికారిని ………………. అంటారు.
27. ఢిల్లీ సల్తనత్ ల కాలంలో ప్రజల యొక్క ప్రధాన వృత్తి ………………
28. జిటాల్ అనగా ………………. నాణేలు.
29. స్వదేశీ నిర్మాణాలలో ………………. పద్ధతి వాడేవారు.
30. కుతుబ్ మీనార్ ………………. మసీదు ఆవరణలో నిర్మించారు.
31. తారిక్-అల్-హింద్ (భారతదేశ చరిత్ర) గ్రంథ రచయిత ………..
32. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యా న్ని స్థాపించినది …………….
33. బాబర్, ఇబ్రహీం లోడిని ………………. యుద్ధంలో ఓడించెను.
జవాబు:
- చరిత్ర
- పురావస్తు, లిఖిత
- ఢిల్లీ
- మహ్మద్ ఘోరి
- కుతుబుద్దీన్ ఐబక్
- క్రీ.శ. 1206
- ఇల్ టుట్ మిష్
- సుల్తానా రజియా
- కైకుబాద్
- జలాలుద్దీన్ ఖిల్జీ
- మాలిక్ కాఫర్
- అల్లావుద్దీన్ ఖిల్జీ
- చంఘీజ్ ఖాన్
- ఖుస్రూ
- ఘియాజుద్దీన్ తుగ్లక్
- తైమూర్
- మహ్మద్ బీన్ తుగ్లక్
- మహ్మద్ బీన్ తుగ్లక్
- కిజరిన్
- ఆలమ్ షా
- బహలాల్ లోడి
- ఇబ్రహీం లోడి
- సుల్తాన్
- షరియత్
- చాలీసా
- ఇకాదార్
- వ్యవసాయం
- రాగి
- ట్రూబీట్
- కువ్వత్-ఉల్-ఇస్లాం
- అల్ బెరూని
- బాబర్
- మొదటి పానిపట్టు
III. కింది వానిని జతవరుచుము
1.
Group-A | Group- B |
1) రజియా సుల్తానా | A) క్రీ.శ. 1236-1240 |
2) అల్లావుద్దీన్ | B) క్రీ.శ. 1296-1316 |
3) మహ్మద్ బీన్ తుగ్లక్ | C) క్రీ.శ. 1324-1351 |
4) ఇబ్రహీం లోడి | D) క్రీ.శ. 1517-1526 |
జవాబు:
Group-A | Group- B |
1) రజియా సుల్తానా | A) క్రీ.శ. 1236-1240 |
2) అల్లావుద్దీన్ | B) క్రీ.శ. 1296-1316 |
3) మహ్మద్ బీన్ తుగ్లక్ | C) క్రీ.శ. 1324-1351 |
4) ఇబ్రహీం లోడి | D) క్రీ.శ. 1517-1526 |
2.
Group-A | Group-B |
1) మార్కెట్ సంస్కరణలు | A) కుతుబుద్దీన్ ఐబక్ |
2) రాగి నాణేల ముద్రణ | B) ఇల్ టుట్ మిష్ |
3) కుతుబ్ మీనార్ ప్రారంభం | C) అల్లావుద్దీన్ ఖిల్జీ |
4) చిహల్ గని ఏర్పాటు | D) మహ్మద్ బీన్ తుగ్లక్ |
జవాబు:
Group-A | Group-B |
1) మార్కెట్ సంస్కరణలు | C) అల్లావుద్దీన్ ఖిల్జీ |
2) రాగి నాణేల ముద్రణ | D) మహ్మద్ బీన్ తుగ్లక్ |
3) కుతుబ్ మీనార్ ప్రారంభం | A) కుతుబుద్దీన్ ఐబక్ |
4) చిహల్ గని ఏర్పాటు | B) ఇల్ టుట్ మిష్ |
3.
Group – A | Group-B |
1) గుజరాత్ పై దాడి | A) క్రీ.శ. 1311 |
2) రణతంబోర్ పై దాడి | B) క్రీ.శ. 1303 |
3) చిత్తోడ్ పై దాడి | C) క్రీ.శ. 1301 |
4) మధురైపై దాడి | D) క్రీ.శ. 1299 |
జవాబు:
Group – A | Group-B |
1) గుజరాత్ పై దాడి | D) క్రీ.శ. 1299 |
2) రణతంబోర్ పై దాడి | C) క్రీ.శ. 1301 |
3) చిత్తోడ్ పై దాడి | B) క్రీ.శ. 1303 |
4) మధురైపై దాడి | A) క్రీ.శ. 1311 |
4.
Group-A | Group – B |
1) బందగాన్ | A) సర్దారుల కూటమి |
2) చిహల్గని | B) బానిసల కొనుగోలు |
3) ఇకా | C) రాష్ట్రము |
4) షరియత్ | D) ఇస్లాం నిబంధనలు |
జవాబు:
Group-A | Group – B |
1) బందగాన్ | A) సర్దారుల కూటమి |
2) చిహల్గని | B) బానిసల కొనుగోలు |
3) ఇకా | C) రాష్ట్రము |
4) షరియత్ | D) ఇస్లాం నిబంధనలు |