Practice the AP 7th Class Social Bits with Answers 10th Lesson రాష్ట్ర ప్రభుత్వం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Social Bits 10th Lesson రాష్ట్ర ప్రభుత్వం
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. శాసనశాఖలో అంతర్భాగం కానిది.
A) గవర్నర్
B) శాసన సభ
C) శాసన మండలి
D) జిల్లా కలెక్టర్
జవాబు:
D) జిల్లా కలెక్టర్
2. గవర్నర్ ను నియమించునది.
A) ముఖ్యమంత్రి
B) ప్రధానమంత్రి
C) రాష్ట్రపతి
D) పైవారందరూ
జవాబు:
C) రాష్ట్రపతి
3. ఈ ఆర్టికల్ ప్రకారం రెండు లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్ గా నియమించవచ్చు.
A) 163 (1)
B) 158 (3a)
C) 171
D) 171 (1)
జవాబు:
B) 158 (3a)
4. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని శాసనసభ నియోజక వర్గాలు కలవు?
A) 175
B) 157
C) 158
D) 58
జవాబు:
A) 175
5. సాధారణ ఎన్నికల తరువాత మెజారిటీ పార్టీ నాయకుణ్ణి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించునది.
A) రాష్ట్రపతి
B) మాజీ ముఖ్యమంత్రి
C) ప్రధానమంత్రి
D) గవర్నర్
జవాబు:
D) గవర్నర్
6. శాసన మండలికి గవర్నర్ మొత్తం సభ్యులలో ఎన్నవ వంతు సభ్యులను నామినేట్ చేస్తాడు?
A) 1/3 వ వంతు
B) 1/12 వ వంతు
C) 1/4 వ వంతు
D) 1/2 వ వంతు
జవాబు:
C) 1/4 వ వంతు
7. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితాలలోని అంశాలపై చట్టాలను చేయగలదు.
A) రాష్ట్ర జాబితా
B) ఉమ్మడి జాబితా
C) A & B
D) కేంద్ర జాబితా
జవాబు:
C) A & B
8. బిల్లు చట్టంగా శాసనంగా మారాలంటే వీరి ఆమోదం పొందాలి.
A) శాసన సభ
B) శాసన మండలి
C) గవర్నరు
D) పై అందరు
జవాబు:
D) పై అందరు
9. లోక్ అదాలత్ కు చట్టబద్ధమైన హోదా ఇవ్వబడిన లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ చేయబడిన సంవత్సరం.
A) 1985
B) 1986
C) 1997
D) 1987
జవాబు:
D) 1987
10. క్రింది వానిలో భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి.
A) శాసన నిర్మాణ శాఖ
B) కార్యనిర్వాహక శాఖ
C) న్యాయ శాఖ
D) రక్షణ శాఖ
జవాబు:
D) రక్షణ శాఖ
11. ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే ముందు గవర్నర్ (ముందస్తు) అనుమతి తీసుకోవాలి.
A) ప్రభుత్వ బిల్లు
B) ప్రైవేట్ బిల్లు
C) ఆర్థిక బిల్లు
D) మహిళా బిల్లు
జవాబు:
C) ఆర్థిక బిల్లు
12. ముఖ్యమంత్రి యొక్క పదవీ కాలం.
A) 5 సం||లు
B) 6 సం||లు
C) 10 సం||లు
D) చెప్పలేము
జవాబు:
A) 5 సం||లు
II. ఖాళీలను పూరింపుము
1. భారతదేశంలో మనకు ……………. స్థాయిలలో ప్రభుత్వం ఉంది.
2. రాష్ట్ర ప్రభుత్వం ……………. అంగాల ద్వారా పరిపాలన నిర్వహిస్తుంది.
3. చట్టాలు తయారుచేయడం …………. శాఖ యొక్క ప్రధాన విధి.
4. రాష్ట్రపతి పదవీకాలం …………….. సంవత్సరాలు.
5. హైకోర్టు కింద పనిచేసే అన్ని కోర్టులలో న్యాయమూర్తులను ………. నియమిస్తారు.
6. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు …………..కి నివేదిస్తారు.
7. దిగువ సభ అని ………………. ని అంటారు.
8. భారతదేశంలో ఎన్నికలు నిర్వహించునది. ……………
9. శాసన సభా నియోజక వర్గాలు రాష్ట్ర ………… ఆధారంగా విభజించారు.
10. MLA ని విస్తరించండి ………………….
11. MLC ని విస్తరించండి …………………
12. ముఖ్యమంత్రిచే ……………. ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
13. శాసన మండలి సభ్యుల పదవీ కాలము ……………… సంవత్సరాలు.
14. శాసన మండలి సభ్యుల పదవీ కాలము ముగిసిన తరువాత …………… వంతు సభ్యులు రాజీనామా చేస్తారు.
15. శాసన మండలి ఎగువ సభ ………….. గా ఎన్ను కోబడిన వారితో పనిచేస్తుంది.
16. శాసన మండలికి ………….. వంతు మంది సభ్యులు శాసనసభ్యులచే ఎన్నుకోబడతారు.
17. శాసన మండలికి …………. వంతు మంది సభ్యులు స్థానిక ప్రభుత్వ సభ్యులచే ఎన్నుకోబడతారు.
18. శాసన మండలికి …………. వంతు మంది సభ్యులు పట్టభద్రులచే ఎన్నుకోబడతారు.
19. శాసన మండలికి ……………. వంతు మంది సభ్యులు ఉపాధ్యాయులచే ఎన్నుకోబడతారు.
20. శాసన మండలికి ………….. వంతు మంది సభ్యులు గవర్నర్ చే నామినేట్ చేయబడతారు.
21. ఆర్థికపర అంశాలలో ……………. సభకు ఎక్కువ అధికారాలు కలవు.
22. రాష్ట్రానికి రాజ్యాంగపరమైన అధిపతి ……………
23. రాష్ట పరిపాలన అంతా ………………. పేరు మీద జరుగుతుంది.
24. రాష్ట్ర ప్రభుత్వా ధిపతి ……………….
25. శాసనసభలో మాత్రమే …………………. బిల్లును ప్రవేశపెడతారు.
26. జిల్లా పరిపాలనకు అధిపతి ………………
27. మండల స్థాయిలో …………….. ముఖ్య పరి పాలనా కార్యనిర్వహణాధికారి.
28. ప్రత్యామ్నాయ వివిధ పరిష్కార యంత్రాంగంలో ………… ఒకటి.
జవాబు:
- రెండు
- మూడు
- శాసన
- 5
- గవర్నర్
- రాష్ట్రపతి
- శాసన సభ
- జనాభా
- మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ
- మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్
- గవర్నర్
- 6
- 1/3
- పరోక్షం
- 1/3
- 1/3
- 1/12
- 1/12
- 1/6
- శాసన సభ
- గవర్నర్
- గవర్నర్
- ముఖ్యమంత్రి
- ఆర్థిక
- జిల్లా కలెక్టర్
- తహసీల్దార్
- లోక్ అదాలత్
III. కింది వానిని జతపరుచుము
1.
Group-A | Group-B |
i) గవర్నర్ | a) 62 సంవత్సరాలు |
ii) శాసనసభ సభ్యుడు | b) 6 శంవత్సరాలు |
iii) శాసన మండలి సభ్యుడు | c) 5 సంవత్సరాలు |
iv) హైకోర్టు న్యాయమూర్తి | d) రాష్ట్రపతి |
జవాబు:
Group-A | Group-B |
i) గవర్నర్ | d) రాష్ట్రపతి |
ii) శాసనసభ సభ్యుడు | c) 5 సంవత్సరాలు |
iii) శాసన మండలి సభ్యుడు | b) 6 సంవత్సరాలు |
iv) హైకోర్టు న్యాయమూర్తి | a) 62 సంవత్సరాలు |
2.
Group-A | Group-B |
i) రాష్ట్రాధిపతి | a) గవర్నర్ |
ii) ప్రభుత్వా ధిపతి | b) ముఖ్యమంత్రి |
iii) జిల్లా పాలనాధిపతి | c) కలెక్టర్ |
iv) మండలాధికారి | d) తహసీల్దార్ |
జవాబు:
Group-A | Group-B |
i) రాష్ట్రాధిపతి | a) గవర్నర్ |
ii) ప్రభుత్వా ధిపతి | b) ముఖ్యమంత్రి |
iii) జిల్లా పాలనాధిపతి | c) కలెక్టర్ |
iv) మండలాధికారి | d) తహసీల్దార్ |
3.
Group-A | Group-B |
i) లోక్ అదాలత్ | a) 171 (1) |
ii) గవర్నర్ కు సలహాదారుడు | b) 158 (3a) |
iii) శాసన మండలి సభ్యుల సంఖ్య | c) 1987 |
iv) రెండు లేక ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ నియామకం | d) 163 (1) |
జవాబు:
Group-A | Group-B |
i) లోక్ అదాలత్ | c) 1987 |
ii) గవర్నర్ కు సలహాదారుడు | d) 163 (1) |
iii) శాసన మండలి సభ్యుల సంఖ్య | a) 171 (1) |
iv) రెండు లేక ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ నియామకం | b) 158 (3a) |