These AP 7th Class Science Important Questions 11th Lesson దారాలు – దుస్తులు will help students prepare well for the exams.

AP Board 7th Class Science 11th Lesson Important Questions and Answers దారాలు – దుస్తులు

7th Class Science 11th Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఉన్ని, పట్టు మనకు ఎలా లభిస్తాయి?
జవాబు:
ఉన్ని మరియు పట్టు మనకు జంతువుల నుండి లభిస్తాయి.

ప్రశ్న 2.
ఉన్ని ఏ జంతువుల నుండి లభిస్తుంది?
జవాబు:
గొర్రె, మేక, యాక్, ఒంటె, అల్పాకా, కుందేలు మొదలైన జంతువుల నుండి మనకు ఉన్ని లభిస్తుంది..

ప్రశ్న 3.
ఒంటె ఉన్నితో ఏమి తయారు చేస్తారు?
జవాబు:
ఒంటె ఉన్నితో కోట్లు, బ్లేజర్లు తయారు చేస్తారు.

ప్రశ్న 4.
కృత్రిమ దుస్తులకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఆక్రిలిక్, రేయాన్, నైలాన్, పాలిస్టర్ అనునవి కృత్రిమ దుస్తులకు ఉదాహరణ.

AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు

ప్రశ్న 5.
రసాయనాలు లేని కృత్రిమ దారం ఏమిటి?
జవాబు:
రేయాన్.

ప్రశ్న 6.
పారాచూట్ తాళ్ళను దేనితో తయారు చేస్తారు?
జవాబు:
పారాచూట్ తాళ్ళను పట్టుదారాలతో తయారు చేస్తారు.

ప్రశ్న 7.
ఊలు దారాలలో ఉండే ప్రోటీన్ ఏమిటి?
జవాబు:
ఊలు దారాలలో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది.

ప్రశ్న 8.
పట్టుదారాలలోని ప్రోటీన్ ఏమిటి?
జవాబు:
పట్టుదారాలలో ఫైబ్రాయిన్ ప్రోటీన్ ఉంటుంది.

ప్రశ్న 9.
పట్టు వస్త్రాలలోని ముడుతలు ఎలా పోగొడతారు?
జవాబు:
రోలింగ్ చేయటం ద్వారా పట్టువస్త్రాలలోని ముడుతలు పోగొట్టవచ్చు.

ప్రశ్న 10.
నూలు వస్త్రాల ముడుతలను ఎలా పోగొడతారు?
జవాబు:
గంజిపెట్టి, ఇస్త్రీ చేయటం వలన నూలు వస్త్రాల ముడుతలు పోగొడతారు.

ప్రశ్న 11.
వస్త్రాలను కీటకాల నుండి ఎలా కాపాడుకోవచ్చు?
జవాబు:
ఫినార్జిలిన్ గోళీలు, బోరిక్ యాసిడ్, గంధం నూనె, లావెండర్ నూనె ఘాటైన వాసనలు కల్గి వస్త్రాలను కీటకాల నుండి కాపాడతాయి.

ప్రశ్న 12.
WHO ను విపులీకరించుము.
జవాబు:
ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation).

ప్రశ్న 13.
ఇటీవల కాలంలో ప్రపంచ మహమ్మారిగా మారిన వైరస్ వ్యాధి ఏది?
జవాబు:
కోవిడ్ – 19.

AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు

ప్రశ్న 14.
కోవిడ్ – 19 నుండి రక్షణగా మనం వేటిని ధరించాలి?
జవాబు:
మాస్కులు.

ప్రశ్న 15.
కృత్రిమ పట్టు అని దేనిని పిలుస్తారు?
జవాబు:
రేయాను కృత్రిమ పట్టు అంటారు.

ప్రశ్న 16.
రేయానను దేని నుండి తయారు చేస్తారు?
జవాబు:
రేయానను కలప గుజ్జు నుండి తయారు చేస్తారు.

ప్రశ్న 17.
జంతుదారాలు దేనిలో కరుగుతాయి?
జవాబు:
జంతుదారాలు క్లోరిన్ ఆధారిత బ్లీచ్ ద్రావణాలలో కరుగుతాయి.

ప్రశ్న 18.
గొంగళి పురుగును చంపే ప్రక్రియను ఏమంటారు?
జవాబు:
కకూన్లను నీటి ఆవిరిలో ఉంచి గొంగళి పురుగును చంపుతారు. దీనిని స్టిప్లింగ్ అంటారు.

ప్రశ్న 19.
పట్టు పురుగు యొక్క శాస్త్రీయ నామం ఏమిటి?
జవాబు:
పట్టుపురుగు శాస్త్రీయ నామం ‘బొంబిక్స్ మోరీ’.

AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు

ప్రశ్న 20.
కంబళ్ళకు ప్రసిద్ధి చెందిన గ్రామము ఏది?
జవాబు:
కర్నూల్ పట్టణానికి 20 కి.మీ. దగ్గరలో ఉన్న ‘పర్ల’ అనే గ్రామం ఉన్ని కంబళ్ళకు ప్రసిద్ధి గాంచింది.

ప్రశ్న 21.
ప్లీస్ అనగానేమి?
జవాబు:
జంతువులలోని ద్వితీయ రోమాలు పొట్టిగా, మెత్తగా ఉంటాయి. వీటిని ఉన్ని లేక ప్లీస్ అంటారు.

ప్రశ్న 22.
తామర తూడుల నుండి పట్టువంటి దారాన్ని తీసే పద్ధతిని ఎవరు పరిచయం చేసారు?
జవాబు:
మణిపూర్ కి చెందిన తాంబ్రం బిజయశాంతి తామర తూడుల నుండి పట్టువంటి దారాన్ని తీసే పద్ధతి పరిచయం చేశారు.

ప్రశ్న 23.
పట్టుదారం ఎలా తయారౌతుంది?
జవాబు:
పట్టుపురుగు ప్యూపా దశలో జిగురు పదార్థాన్ని స్రవిస్తుంది. గాలి తగిలిన వెంటనే ఈ ప్రోటీన్ పదార్థం ఎండిపోయి పట్టుదారంగా తయారవుతుంది.

ప్రశ్న 24.
పట్టుపురుగులు ఏమి తింటాయి?
జవాబు:
పట్టుపురుగులు మల్బరీ ఆకులను మాత్రమే తింటాయి.

AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు

ప్రశ్న 25.
మొహయిర్ అనగానేమి?
జవాబు:
అంగోరా మేక నుండి లభించే ఉన్నిని మొహయిర్ అంటారు. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉన్ని.

7th Class Science 11th Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
శ్రేష్టమైన ఉన్ని ఇచ్చే గొర్రె జాతులు గురించి రాయండి.
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు 1
మెరీనో జాతి గొర్రెలు ఉన్ని కోసం పెంచే గొర్రెలలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. ప్రపంచంలో మెరీనోనే కాకుండా వందల కొద్దీ జాతులను ఉన్ని కోసం పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రములలో డెక్కనీ జాతి గొర్రెలు మాంసం మరియు ఉన్నికోసం పెంచే జాతులలో ముఖ్యమైనవి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్ని తయారీకి ప్రధాన వనరు గొర్రెలే.

ప్రశ్న 2.
ఉన్ని ఉత్పత్తులలో మేకల యొక్క ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు 2
ఉన్నిని ఇచ్చే మేకలలో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖమైనవి అంగోరా మేక నుండి లభించే ఉన్నిని మొహయిర్ అంటారు. కేష్మియర్ మేక నుండి అతి ఖరీదైన ఉన్ని లభిస్తుంది. కాశ్మీర్ లోని హిమాలయ పర్వత ప్రాంతాలలో ఈ మేకలు జీవించుచుండడం వలన వాటికి ఆ పేరు వచ్చింది.

ప్రశ్న 3.
ఉన్ని ఉత్పత్తులలో ఒంటె ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు 3
ఇతర ఉన్నిని ఇచ్చే జంతువులతో పోల్చినప్పుడు ఒంటెల నుండి లభించే ఉన్ని గరుకుగా ఉంటుంది. అయినప్పటికీ ఉన్నికి ఉండే ఇతర లక్షణాలన్నిటినీ కలిగి ఉంటుంది. కాబట్టి ఒంటెల నుండి లభించే ఉన్నితో కోట్లు, బ్లేజర్లు తయారు చేస్తారు. ఈ జంతువు ప్రతి సంవత్సరం తన వెంట్రుకలను రాల్చుతుంది. ఈ వెంట్రుకలను సేకరించి, కోట్లు, బ్లేజర్లను తయారు చేస్తారు. రాజస్తాన్, హర్యానా మరియు గుజరాత్ లో ఒంటెలను పాలు, మాంసం, ఉన్ని కోసం పెంచుతున్నారు.

AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు

ప్రశ్న 4.
ఉన్ని ఉత్పత్తిలో ‘యాక్’, కుందేలు రోమాలు కూడా వాడతారని రమ చెప్పింది ఇది నిజమేనా?
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు 4
యాక్ (జడల బర్రె) :
భారతదేశంలోని లఢఖ్ మరియు టిబెట్లో సాధారణంగా కనిపించే పొడవైన వెంట్రుకలు కలిగిన జంతువు ఇది. ఈ జంతువులను పాలు, ఉన్ని మరియు మాంసం కోసం పెంచుతారు.

కుందేలు :
అంగోరా అనే పేరు గల అందమైన కుందేలు వెంట్రుకలు లేదా ఉన్ని తెలుపు రంగులో, మెత్తగా ఉంటుంది. దీనిని రంగురంగుల కోట్స్ తయారీలో ఉపయోగిస్తారు.

ప్రశ్న 5.
అల్పాకా, లామాలు అంటే ఏమిటి? వాటి ఆర్థిక ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు 5
దక్షిణ అమెరికాలో ఉన్ని కోసం పెంచే పొడవైన వెంట్రుకలు కలిగిన జంతువులు అల్పాకా, లామాలు. ఇవి ఒంటెలను పోలి ఉంటాయి. ఈ జంతువుల నుండి లభించే ఉన్ని అత్యంత నాణ్యమైన ఉన్నిగా భావించబడే మొహయిర్ ఉన్ని అంత మెత్తగా ఉంటుంది.

ప్రశ్న 6.
గొర్రెల పెంపకం గురించి రాయండి.
జవాబు:
గొర్రెల పెంపకం :
జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ మరియు గుజరాత్ లో గొర్రెలు, మేకలను పెద్ద సంఖ్యలో పెంచుతారు.

గొర్రెల పెంపకమును భారతదేశంలో పశుపోషణలో ఒక భాగంగా పరిగణిస్తారు. ఈ జంతువులను బీడు ‘భూములలో మేపడంతో పాటుగా, గొర్రెల పెంపకందారులు వాటికి పప్పు ధాన్యము, తెలగ పిండి, మొక్కజొన్నను ఆహారంగా ఇస్తారు. ఒకసారి పెంచబడిన జంతువుకు వెంట్రుకలు దట్టంగా పెరిగిన తరువాత, ఆ వెంట్రుకలను కత్తిరిస్తారు. సాధారణంగా ఉన్నిని ఇచ్చే జంతువులు రెండు రకములైన వెంట్రుకలను కలిగి ఉంటాయి. అవి, వెలుపలి పొడవైన, బిరుసైన వెంట్రుకలు మరియు లోపలికి ఉండే పొట్టి, మెత్తని వెంట్రుకలు. వీటిని ప్లేస్ అంటారు. స్టీతో ఊలు దారం తయారు చేస్తారు.

ప్రశ్న 7.
ఉన్ని నుండి ఊలుదారం ఎలా తయారుచేస్తారు?
జవాబు:
ఉన్ని నుండి ఊలు దారం తయారీ : ఊలు దారాల్ తయారీలో 6 దశలు ఉన్నాయి. అవి ఉన్ని తీయటం, శుభ్ర పరచటం, వేరు చేయడం, రంగులు వేయడం, కార్డింగ్ మరియు దువ్వడం, వడకడం. పరిశ్రమలలో ఈ దశలన్నీ యంత్రాల సాయంతో జరుగుతాయి. కండెలుగా చుట్టిన ఊలు దారాన్ని ఉన్ని వస్త్రాలను అల్లడానికి లేదా నేయడానికి ఉపయోగిస్తారు.

ప్రశ్న 8.
షీరింగ్ గురించి రాయండి.
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు 6
పలుచని వెలుపలి చర్మపు పొరతో పాటుగా జంతువు ఉన్నిని కత్తిరించడాన్ని షీరింగ్ అంటారు. పదునైన కత్తెర లాంటి సాధనను ఉపయోగించి షీరింగ్ చేస్తారు. ప్రస్తుతం గన్ వంటి పరికరాలను షీరింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. సాధారణంగా షీరింగ్ వసంత కాలంలో చేస్తుంటారు. శీతాకాలంలో ఉన్నిని కలిగి ఉండటం జంతువుకు అధిక చలి నుండి రక్షణ కల్పిస్తుంది. కాని వేసవి కాలంలో ఇది అవసరం లేదు.

ప్రశ్న 9.
స్కోరింగ్ దశను వివరించండి.
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు 7
గొర్రె చర్మం గ్రీజు వంటి నూనె పదార్థాన్ని స్రవించడం వలన, సాధారణంగా ఉన్ని దుమ్ము, ధూళిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. గ్రీజును, దుమ్ము, ధూళిని తొలగించడం కోసం ఉన్నిని, వేడి నీటిని నింపిన టాంక్లో ఉంచి, ఆ నీటికి డిటర్జెంట్లను కలిపి, బాగా తిప్పుతారు. ప్రస్తుత రోజులలో యంత్రాల సహాయంతో ఉన్నిని శుభ్రపరుస్తున్నారు.

ప్రశ్న 10.
సార్టింగ్ అనగానేమి?
జవాబు:
నాణ్యత ఆధారంగా ఉన్ని లేదా ప్లీస్ ని వేరు వేరు విభాగములుగా చేయటాన్ని సార్టింగ్ అంటారు. ప్లీసు వాటి పొడవు, మృదుత్వం, దృఢత్వం ఆధారంగా వర్గీకరిస్తారు. మధ్య రకమైన పొడవు కలిగి, దృఢంగా, మెత్తగా ఉన్న ఉన్నిని నాణ్యమైనదిగా నిర్ధారిస్తారు.

ప్రశ్న 11.
కూంబింగ్ అనగానేమి? కార్డింగ్ తో దానికి గల సంబంధం ఏది?
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు 8
రెండు తలాల మధ్యగా ప్లీస్ ను చుట్టటం ద్వారా మెత్తని కుచ్చుతో కూడిన చుట్టలుగా చేయడమును, కార్డింగ్ అంటారు. కార్డింగ్ యంత్రాలు ఉన్నిని వేరు చేసి, తిరిగి కలుపుతూ, కుచ్చు వలె చేస్తాయి. కార్డింగ్ వలన ఫీలోని ముండ్లు, పుల్లలు తొలగిపోతాయి. అప్పుడు ఫీసు కూంబింగ్ యంత్రం యొక్క దువ్వెన పండ్ల వంటి లోహపు పండ్ల మధ్య నుండి లాగుతారు. వెంట్రుకలను ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉండేలా జుట్టు దువ్వుకోవడాన్ని గుర్తు తెచ్చుకోండి. సాంప్రదాయ పద్ధతిలో కార్టింగ్ చేయడం కూంబింగ్ అదే విధంగా జరుగుతుంది.

ప్రశ్న 12.
అల్లడం గురించి రాయండి.
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు 9
ఉన్నిని మెలిపెడుతూ పొడవైన దారంగా చేయడాన్ని స్పిన్నింగ్ అంటారు. ఈ సూదుల వంటి పరికరాలను ఉన్ని వస్త్రం అల్లడానికి ఉపయోగిస్తారు. రెండు పొడవైన సూదుల సహాయంతో పొడవైన దారాలను ముడులు, ఉచ్చులు, వలయాలుగా తిప్పడం ద్వారా ఉన్ని వస్త్రాన్ని అల్లుతారు. ఇలా ఉన్ని దుస్తులను తయారు చేసే ప్రక్రియను అల్లడం అంటారు. యంత్రాల సహాయంతో కూడా ఉన్ని వస్త్రాలను తయారు చేస్తారు. ఈ యంత్రాలను చేమగ్గాలు మరియు మర ఊలు దారాల స్పిన్నింగ్ మగ్గాలు అంటారు. మర మగ్గాలు విద్యుత్ తో పని చేస్తాయి.

AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు

ప్రశ్న 13.
పర్ల గ్రామ ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
కర్నూల్ పట్టణానికి 20 కి.మీ.ల దగ్గరలో ఉన్న ‘పర్ల’ అనే గ్రామం నాణ్యమైన ఉన్ని కంబళ్ళకు ప్రసిద్ధిగాంచింది. గొర్రెల్ని పెంచడం, ఉన్నితో కంబళ్ళను తయారుచేయడం ఆ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి. అనేక శతాబ్దాల నుండిఆ ప్రజలు దీనిని ఒక కుటీర పరిశ్రమగా కొనసాగిస్తున్నారు.

ప్రశ్న 14.
పట్టు పురుగు జీవిత చక్రం పటం గీయండి.
జవాబు:
AP Board 7th Class Science Solutions Chapter 11 దారాలు – దుస్తులు 1

ప్రశ్న 15.
పట్టు పురుగు జీవిత చక్రంలోని దశలు ఏమిటి?
జవాబు:
పట్టు పురుగు జీవిత చక్రంలో నాలుగు దశలు కలవు. అవి

  1. గ్రుడ్డు,
  2. డింభకము,
  3. ప్యూపా లేదా పట్టుకాయ
  4. ప్రౌఢ దశ

ప్రశ్న 16.
పట్టు పురుగు గ్రుడ్ల గురించి రాయండి.
జవాబు:
పట్టు పురుగు జీవితచక్రంలో గ్రుడ్డు మొదటి దశ. ఆడమోత్ వందల కొద్దీ గ్రుడ్లను పెట్టి చనిపోతుంది. 10 రోజులలో, ఈ గ్రుడ్లు పొదగబడి లార్వాలు లేదా డింభకాలు గ్రుడ్ల నుండి వెలుపలికి వస్తాయి.

ప్రశ్న 17.
పట్టు పురుగు డింభకము గూర్చి రాయండి.
జవాబు:

  1. పట్టు పురుగు గుడ్ల నుండి డింభకము లేదా లార్వాలు బయటకు వస్తాయి.
  2. ఇవి రాత్రి పగలు తేడా లేకుండా మల్బరీ ఆకులను తింటూ పెరుగుతాయి.
  3. ఇవి 4 నిర్మోచనాలను జరుపుకొని పరిమాణంలో పెద్దవి అవుతాయి.
  4. తరువాత అవి కకూన్ దశకు చేరుకుంటాయి.

ప్రశ్న 18.
పట్టు పురుగు కకూన్ దశ గురించి రాయండి.
జవాబు:
ప్యూపా దశలోనికి ప్రవేశించడానికి సిద్ధం కాగానే, అనగా సాధారణంగా 30-35 రోజుల తరువాత, పట్టుపురుగు ఆహారం తినడం మానివేసి, ఆకులపై నిలబడిపోతుంది. ఇప్పుడు అది, తన చుట్టూ వలను అల్లుకోవడం ప్రారంభిస్తుంది. దీనికోసం పట్టుపురుగు తన తలను అటూఇటూ 8 ఆకారంలో తిప్పుతుంది. ఈ కదలికలలో పట్టుపురుగు ప్రోటీన్ కలిగిన జిగురు పదార్థాన్ని స్రవిస్తుంది. గాలి తగిలిన వెంటనే, ఈ ప్రోటీన్ పదార్థం ఎండిపోయి, పట్టు దారంగా తయారు అవుతుంది.

ప్రశ్న 19.
పట్టుకాయ గురించి రాయండి.
జవాబు:
పట్టు పురుగు జిగురు వంటి పదార్థాన్ని స్రవించిన కొద్ది సమయం తరువాత, పట్టు పురుగు పట్టు దారంతో తన శరీరమును పూర్తిగా కప్పి వేసుకుంటుంది. అప్పుడు ఏర్పడిన గుళిక వంటి నిర్మాణమును కకూన్ లేదా పట్టు కాయ అంటారు. కకూన్ లోపల పట్టు పురుగు తదుపరి మార్పులను పొందుతుంది.

ప్రశ్న 20.
ప్రాథమోత్ గురించి రాయండి.
జవాబు:
10-12 రోజుల తరువాత, కకూన్ లోపలి పట్టు పురుగు, మార్పులు చెంది, ప్రౌఢ మోత్ గా మారుతుంది. కకూనను పగులగొట్టుకుని వెలుపలికి వస్తుంది.

AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు

ప్రశ్న 21.
పట్టు పరిశ్రమ గురించి రాయండి.
జవాబు:
పట్టు దారం పొందటం కోసం పట్టు పురుగులను పెంచడాన్ని పట్టు సంవర్ధనం లేదా సేరీ కల్చర్ అంటారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే పట్టులో 15% పట్టును భారతదేశం ఉత్పత్తి చేస్తుంది. మన దేశంలో ఆంధ్రప్రదేశ్ పట్టు సంవర్ధనంలో రెండవ స్థానంలో ఉన్నది. పట్టు పురుగులు మల్బరీ ఆకులను తింటాయి. కాబట్టి సాధారణంగా పట్టు సంవర్ధనం చేసే రైతులు మల్బరీ తోటలను పెంచుతారు. అందుకే పట్టు సంవర్ధనం వ్యవసాయాధారిత పరిశ్రమగా పరిగణించబడుతున్నది.

ప్రశ్న 22.
అహింసా పట్టు గురించి రాయండి.
జవాబు:
అహింసా పట్టు అహింసామార్గంలో పట్టు సంవర్ధనం ద్వారా ఉత్పత్తి చేసే పట్టు. ఈ పద్ధతిలో పట్టుపురుగును కకూన్ నుండి వెలుపలికి రానిచ్చి తరువాత మిగిలిన పట్టుకాయల నుండి పట్టు దారం తీస్తారు. ఈ పద్ధతిని, ఆంధ్రప్రదేశ్ చేనేత పరిశ్రమ శాఖలో పని చేసిన చేనేత నిపుణులు శ్రీ కుసుమ రాజయ్య పరిచయం చేశారు. అయితే ఈ విధానంలో పట్టు ఉత్పత్తి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది.

ప్రశ్న 23.
రీలింగ్ ప్రక్రియ గురించి రాయండి.
(లేదా)
పట్టుకాయల నుండి పట్టును ఎలా తీస్తారు?
జవాబు:
కకూన్ల నుండి పట్టు దారం తీయడాన్ని రీలింగ్ అంటారు. కకూన్ల నుండి వచ్చే దారం పొడవుగా ఉండటం చేత, పట్టు దారం కోసం స్పిన్నింగ్ చేయవలసిన అవసరం లేదు. రీలింగ్ చేయడానికి ప్రత్యేక యంత్రాలను ఉపయోగిస్తారు. ఈ యంత్రాలు కకూన్ నుండి దారమును విడదీస్తాయి. ఒక కకూన్ నుండి 500-1500 మీటర్ల దారం వస్తుంది. ఈ దారమును బ్లీచ్ చేసి, రంగులు అద్దిన తరువాత, నేత పనివారు ఈ దారంతో పట్టు వస్త్రమును నేస్తారు.

ప్రశ్న 24.
పట్టులోని ఇతర రకాల గురించి రాయండి.
జవాబు:
పట్టును అందించే మోత్ యొక్క శాస్త్రీయ నామం ‘బొంబిక్స్ మోరీ’. ఈ మోతా ద్వారా లభించే పట్టును మల్బరీ పట్టు అంటారు. మల్బరీ పట్టు మాత్రమే కాక, ఈరీ, మూగా, టసర్ అనే వివిధ రకములైన పట్టు వేరు వేరు మోతల నుండి లభిస్తుంది. ఇవన్నీ వన్యంగా పెరిగే మోతలు. ఈ మోతల నుండి లభించే పట్టు తక్కువ మెరుపు కలిగి, బిరుసుగా ఉంటుంది. ఈ పట్టు దారం మోత్ కకూన్ల నుండి వెలుపలికి వచ్చిన తరువాత తెరువబడిన కకూన్ నుండి తీస్తారు కాబట్టి పొడవుగా ఉండదు. కావున ఈ దారమును వడుకవలసి ఉంటుంది.

ప్రశ్న 25.
టసర్ పట్టు ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
ఆంథీరియా మైలెట్టా అనే పేరు గల వన్యంగా పెరిగే పట్టు పురుగు నుండి టసర్ పట్టు మనకు లభిస్తుంది. ఈ మోత్ సాధారణంగా తూర్పు గోదావరి జిల్లాలోని దట్టమైన అరణ్యాలలోని అర్జున, సాల్ చెట్ల మీద పెరుగుతుంది. గిరిజనులు ఈ మోత్ కకూన్లను సేకరించి, మార్కెట్లో అమ్ముతారు. ITDA వారు గిరిజనులకు కకూన్లను అమ్మడానికి తగిన మార్కెట్ ను కల్పించడంతో పాటుగా, కకూన్ల నుండి దారం తీయడానికి అవసరమైన నైపుణ్యాల కల్పన ద్వారా వారి సంపాదన పెంచేందుకు కృషి చేస్తున్నారు.

ప్రశ్న 26.
భారతదేశంలోని పట్టు పరిశ్రమల గురించి రాయండి.
జవాబు:
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ధర్మవరం, కర్ణాటకలోని రామనగర, గుజరాత్ లోని సూరత్, మధ్య ప్రదేశ్ లోని చందేరీ, తమిళనాడులోని కాంచీపురం, తెలంగాణలోని పోచంపల్లి, ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలు అధిక నాణ్యత గల పట్టు ఉత్పత్తి, నేత పరిశ్రమల కారణంగా భారతదేశంలో పట్టు నగరాలుగా పేరుగాంచాయి. ఆంధ్రప్రదేశ్ అంతటా పట్టు పరిశ్రమ నెలకొని ఉంది.

AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు

ప్రశ్న 27.
పట్టు దారాన్ని శస్త్రచికిత్స కుట్లకు ఎందుకు ఉపయోగిస్తారు?
జవాబు:
శస్త్ర చికిత్సలో వేసే కుట్లు, శస్త్ర చికిత్స తరువాత మరియు గాయాలు అయినప్పుడు కణజాలములను కలిపి ఉంచడానికి ఉపయోగిస్తారు. కణజాలములను గట్టిగా కలిపి ఉంచగల మరియు తేలికగా తీసివేయగల ఆకృతి కారణంగా పట్టు దారమును కుట్లు వేయడానికి విరివిగా ఉపయోగిస్తారు.

ప్రశ్న 28.
కృత్రిమ వస్త్రాల గురించి రాయండి.
జవాబు:
వస్త్రములు రసాయనాలతో తయారవుతాయి. కృత్రిమ దారాలు కలప గుజ్జు లేదా పెట్రోలియం నుండి తీసిన రసాయనాలతో తయారవుతాయి. కొన్ని రకముల కృత్రిమ దారాలకు ఉదాహరణ – ఆక్రిలిక్, రేయాన్, నైలాన్, పాలిస్టర్.

ప్రశ్న 29.
కృత్రిమ దారాలు, సహజ దారాలకు మధ్యగల భేదాలు తెలపండి.
జవాబు:

కృత్రిమ దారాలు సహజ దారాలు
1. కృత్రిమ దారాలు రసాయనాలతో తయారు చేస్తారు. 1. సహజ దారాలను మొక్కలు’ లేదా జంతువుల నుండి తయారు చేస్తారు.
2. ఇవి తేలికగా, గరుకుగా ఉంటాయి. 2. ఇవి బరువుగా, మృదువుగా ఉంటాయి.
3. ఎక్కువ కాలం మన్నుతాయి. 3. తక్కువ కాలం మన్నుతాయి.
4. వీటి ధర తక్కువ. 4. వీటి ధర ఎక్కువ.
5. పర్యావరణానికి హానికరం. ఉదా : రేయాన్, నైలాన్. 5. పర్యావరణ హితం. ఉదా : ఉన్ని, పట్టు.

ప్రశ్న 30.
రోలింగ్ ప్రక్రియను వివరించండి.
జవాబు:

  1. పట్టు వస్త్రాలలోని ముడుతలను పోగొట్టె ప్రక్రియను రోలింగ్ అంటారు.
  2. ఈ ప్రక్రియలో పట్టు వస్త్రాన్ని గుండ్రని తలం గల బొంగు కర్రకు గట్టిగా చుట్టి 6 నుండి 8 గంటల పాటు ఆరనిస్తారు.
  3. తరువాత వస్త్రాలను ఆవిరి ఇస్త్రీ చేస్తారు.

ప్రశ్న 31.
కృత్రిమ వస్త్రాలలోని సానుకూల అంశాలు మరియు వ్యతిరేక అంశాలు ఏమిటి?
జవాబు:
కృత్రిమ దారాలతో చేసిన వస్త్రాలను వాటి యొక్క సాగే గుణము, ధర్మోప్లాస్టిక్ (వేడి చేసినప్పుడు మృదువుగా మారటం) లక్షణాల కారణంగా ఈత దుస్తులు, స్పోర్ట్స్ దుస్తులు, లోదుస్తుల తయారీలో విరివిగా వినియోగిస్తారు. ఈ దుస్తులను తయారు చేయడానికి నాడే రసాయనాలు సాధారణంగా విషపూరితమైనవి కనుక చర్మానికి ఎలర్జీలను కలిగించే అవకాశం ఎక్కువ.

ప్రశ్న 32.
మాలు ధరించవలసిన ఆవశ్యకత ఏమిటి?
జవాబు:
బహిరంగ ప్రదేశాలలోనికి వెళ్ళినప్పుడు ముఖమునకు తొడుగులు లేదా మాకు ధరించడం ఇటీవలి కాలంలో విధిగా మారింది. మన జీవనంలో ఒక భాగమైంది కూడా. ముఖానికి ధరించే మాస్కులు, గాలిని వడపోసి, బాక్టీరియా, వైరస్, దుమ్ము ధూళి కణాలను శ్వాస మార్గంలోనికి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. కోవిడ్-19 ప్రభావము తగ్గిన తరువాత కూడా మన ఆరోగ్యం కోసం మాను ధరించడాన్ని కొనసాగించడం మంచిది. ఇది జనసమర్థమైన ప్రదేశాలలో గుంపుల వలన ఏర్పడిన గాలి కాలుష్యం యొక్క ప్రమాదం తగ్గించి రోగాల బారినుండి మనల్ని రక్షిస్తుంది.

ప్రశ్న 33.
డైపర్లు, శానిటరీ నాప్కిన్ల వలన కలిగే నష్టాలు ఏమిటి? దాని ప్రత్యామ్నాయం ఏమిటి?
జవాబు:
డైపర్లు, శానిటరీ నాప్కిన్లు పూర్తిగా కృత్రిమమైన పదార్థాలతో తయారు చేయబడతాయి. ఈ పదార్థాలు దీర్ఘ కాలిక వాడకంలో చర్మానికి హాని కలుగచేస్తాయి మరియు పర్యావరణమునకు హానికరము. ఈ సమస్యను అధిగమించడం కోసం మనం నీటిని పీల్చుకునే నూలు, అరటి మరియు వెదురు నుండి లభించే నార వంటి వాటిని, అలాగే కాన్వాస్ నూలు వంటి ద్రవ నిరోధక పదార్థాలతో తయారైన డైపర్లు, శానిటరి నాప్కిన్ల వాడకమును ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. ఇవన్నీ తేలికగా భూమిలో కలిసిపోయే మరియు చర్మానికి హాని కలిగించని పదార్థాలు.

7th Class Science 11th Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
మనకు ఉన్నినిచ్చే మూడు జంతువుల గురించి రాయండి.
జవాబు:
గొర్రె :
మేరీనో జాతి గొర్రెలు ఉన్ని కోసం పెంచే గొర్రెలలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. ప్రపంచంలో మేరీనోనే కాకుండా వందల కొద్దీ జాతులను ఉన్ని కోసం పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రములలో డెక్కనీ జాతి గొర్రెలు మాంసం మరియు ఉన్నికోసం పెంచే జాతులలో ముఖ్యమైనవి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్ని తయారీకి ప్రధాన వనరు గొర్రెలే.

మేక :
ఉన్నిని ఇచ్చే మేకలలో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖమైనవి అంగోరా మేక నుండి లభించే మొహయిర్ ఉన్ని, కేష్మియర్ మేక నుండి అతి ఖరీదైన ఉన్ని లభిస్తుంది. కాశ్మీర్‌లోని హిమాలయ పర్వత ప్రాంతాలలో ఈ మేకలు జీవించుచుండడం వలన వాటికి ఆ పేరు వచ్చింది.

ఒంటె :
ఇతర ఉన్నిని ఇచ్చే జంతువులతో పోల్చినప్పుడు ఒంటెల నుండి లభించే ఉన్ని గరుకుగా ఉంటుంది. అయినప్పటికీ ఉన్నికి ఉండే ఇతర లక్షణాలన్నిటినీ కలిగి ఉంటుంది. కాబట్టి ఒంటెల నుండి లభించే ఉన్నితో కోట్లు, బ్లేజర్లు తయారు చేస్తారు. ఈ జంతువు ప్రతి సంవత్సరం తన వెంట్రుకలను రాల్చుతుంది. ఈ వెంట్రుకలను సేకరించి, కోట్లు, బ్లేజర్లను తయారు చేస్తారు.

రాజస్తాన్, హర్యానా మరియు గుజరాత్ లో ఒంటెలను పాలు, మాంసం, ఉన్ని కోసం పెంచుతున్నారు.

AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు

ప్రశ్న 2.
ఉన్ని తయారి దశలను క్లుప్తంగా వివరించండి.
జవాబు:
ఉన్ని తయారీలో ప్రధానంగా 6 దశలు ఉన్నాయి. అవి
1. ఉన్నిని కత్తిరించటం (పీరింగ్) :
ఉన్నినిచ్చే గొర్రె, మేక వంటి జంతువుల నుండి ఉన్నిని కత్తిరించడాన్ని షీరింగ్ అంటారు. సాధారణంగా దీనిని వసంతకాలంలో చేస్తారు.

2. ఉన్నిని శుభ్రం చేయటం (స్కోరింగ్) :
కత్తిరించిన ఉన్నిని వేడి నీటి ట్యాంక్ లో శుభ్రం చేయడాన్ని స్కోరింగ్ అంటారు.

3. ఉన్నిని వేరుచేయటం (సార్టింగ్) :
నాణ్యత ఆధారంగా ఉన్నిని వేరు వేరు విభాగాలుగా చేయటాన్ని సార్టింగ్ అంటారు.

4. రంగు వేయటం (డైయింగ్) :
ఉన్నిని బ్లీచింగ్ చేసి వివర్ణం చేసిన తరువాత, కావలసిన రంగులు కలుపుతారు.

5. కార్డింగ్ మరియు కూంబింగ్ :
ఉన్నిని మెత్తగా దువ్వి కుచ్చులతో కూడిన చుట్టలుగా సిద్ధం చేస్తారు.

6. వడకటం మరియు అల్లటం :
ఈ దశలో ఉన్నిని మెలితిప్పి దారాలుగా తీస్తారు. దీనినే స్పిన్నింగ్ లేదా వడకటం అంటారు. ఈ దారాలను బట్టలుగా అల్లి వస్త్రాలు తయారు చేస్తారు.
AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు 10

ప్రశ్న 3.
పట్టు పురుగు జీవిత చక్రాన్ని పటం సహాయంతో వివరించండి.
జవాబు:
పట్టు పురుగు జీవిత చక్రంలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి. అవి.
AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు 11
1. గ్రుడ్లు :
ఆడ మోత్ వందల సంఖ్యలో గ్రుడ్లను పెట్టి చనిపోతుంది. పది రోజుల తరువాత ఇవి పొదగబడి – లార్వాలు లేదా డింభకాలుగా మారతాయి.

2. లార్వాలు :
వీటిని గొంగళి పురుగులు లేదా పట్టుపురుగులు అంటారు. ఇవి రాత్రి పగలు అని తేడా లేకుండా మల్బరీ ఆకులను తింటూ పెరుగుతాయి.

3. ప్యూపాదళ :
30-35 రోజుల తర్వాత లార్వాలు ఆహారం తినటం మాని తన చుట్టూ వలను అల్లుకోవటం కోశస్థదశ, ప్రారంభిస్తుంది. దీనినే పట్టుకాయ లేదా కకూన్ అంటారు.

4. ప్రొడమోత్ :
కకూన్ లోపల పట్టుపురుగు మార్పులు చెంది, ప్రొడదశ ప్రౌఢ జీవిగా మారి కకూనను పగలగొట్టుకొని వెలుపలికి వస్తుంది.

ప్రశ్న 4.
సిప్లింగ్ అనగానేమి? దాని ప్రాధాన్యత ఏమిటి?
జవాబు:
గ్రుడ్ల నుండి గొంగళి పురుగులు వెలుపలికి వచ్చిన తరువాత, వాటిని చంద్రికలు అనబడే ప్రత్యేకమైన వెదురు నిర్మాణాలలో ఉంచుతారు. ఈ చంద్రికలలో మల్బరీ ఆకులను పట్టు పురుగులకు ఆహారంగా వేస్తారు. ఈ పట్టు పురుగులు కకూన్ ఏర్పరుచుకుంటాయి. ఈ కకూన్లను ఉపయోగించి పట్టుదారాలను పొందుతారు. కకూన్ ఏర్పడిన 2-3 రోజుల తరువాత, రైతులు చంద్రికల నుండి కకూన్లను తొలగించి, 10 నుండి 15 నిముషాల పాటు ఆవిరిలో ఉంచుతారు.
AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు 12

కకూన్లను ఆవిరిలో ఉంచి, కకూన్ లోపలి గొంగళి పురుగును చంపే ప్రక్రియను స్టిప్లింగ్ అంటారు. కకూన్లను స్టింగ్ చేయకపోతే, కకూన్ లోపలి మోత్ కకూనన్ను పగులగొట్టుకుని వెలుపలికి వస్తుంది. పగిలిపోయిన కకూన్ల నుండి పొడవైన పట్టు దారమును తీయలేము. ఇది పట్టు వస్త్రాల నాణ్యత తగ్గడానికి కారణమవుతుంది. స్టింగ్ చేసిన కకూన్లను ఎక్కువ కాలం పాటు నిలువ చేసి, అవసరమైనప్పుడు మార్కెట్లో అమ్మవచ్చు.

ప్రశ్న 5.
నీకు తెలిసిన నాలుగు కృత్రిమ దారాల గూర్చి తెలపండి.
జవాబు:
ఆక్రిలిక్ :
శీతాకాలంలో మనం స్వెట్టర్లను ధరిస్తాము మరియు షాల్స్, మరియు రగ్గులను ఉపయోగిస్తాము. వీటిలో అనేకము సహజమైన ఉన్నితో తయారైనవి కావు. ఆక్రిలిక్ అనే కృత్రిమ దారంతో తయారవుతాయి. ఆక్రిలిక్ అన్నీ అంశాలలోను ఉన్నిని పోలివుండి, తక్కువ ధరకు లభ్యమవుతుంది.

రేయాన్ :
పట్టు వలే ఉండే ఆకృతి కారణంగా రేయాన్ కృత్రిమ పట్టు అని కూడా పిలుస్తారు. కలప గుజ్జు నుండి దీన్ని తయారు చేస్తారు.

నైలాన్ :
1931వ సంవత్సరంలో మొట్టమొదటగా తయారుచేయబడిన కృత్రిమ దారం నైలాన్. దీనిని బొగ్గు మరియు నీరుతో తయారు చేస్తారు. నైలాన్ దారం బలంగా సాగే గుణం కలిగి తేలికగా ఉంటుంది. సాక్స్, తాళ్ళు, టూత్ బ్రష్ కుచ్చులు, టెంట్లు నైలాన్తో తయారు చేస్తారు. పారాచూట్లు, పర్వతారోహణ చేసేవారికి ఉపయోగపడే తాళ్ళను కూడా నైలాన్తో తయారు చేస్తారు.

పాలిస్టర్ :
పాలిస్టర్తో తయారు చేసిన చొక్కాలు, ఇతర దుస్తులు ప్రజలు ధరించడాన్ని చూసి ఉంటాము. ఈ దారములతో చేసిన వస్త్రాలు సాధారణంగా నలిగిపోవు. చీరెలు, డ్రెస్ మెటీరియల్ తయారీలో ఉపయోగించే టెర్లిన్ ఒక రకమైన పాలిస్టర్.

AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు

ప్రశ్న 6.
ఉన్ని దుస్తుల వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
జవాబు:
ఉన్ని దుస్తులను సాధారణంగా నాలుగు – ఐదు సార్లు ధరించిన తర్వాత మాత్రమే శుభ్రపరచాలి. ఎక్కువసార్లు ఉతకడం వలన వస్త్రం పటుత్వం తొలగిపోతుంది. ఉన్ని దుస్తులను ఉతికిన తర్వాత కూడా వాటిని పిండకూడదు. ఉతికిన తరువాత ఈ దుస్తులను ఒక టవల్ లో చుట్టడం ద్వారా అధికమైన తేమను తొలగించడం మంచిది. అలాగే ఊలు, పట్టు దుస్తులను ఉతకడానికి తేలికపాటి డిటర్జెంట్లను ఉపయోగించాలి. ఉతికినప్పుడు నూలు, పట్టు వస్త్రాలు పొట్టిగా మారుతాయి లేదా ముడుచుకొని పోతాయి కాబట్టి గంజి పెట్టి ఇస్త్రీ చేయడం ద్వారా సూలు వస్త్రాలు, రోలింగ్ చేయడం ద్వారా పట్టు వస్త్రాలలోని ముడుతలను పోగొట్టవచ్చు.

ప్రశ్న 7.
నేటి జీవన విధానంలో మాల యొక్క ఆవశ్యకత ఏమిటి?
జవాబు:
బహిరంగ ప్రదేశాలలోనికి వెళ్ళినప్పుడు ముఖమునకు తొడుగులు లేదా మాస్టు ధరించడం ఇటీవలి కాలంలో విధిగా మారింది. మన జీవనంలో ఒక భాగమైంది కూడా. ముఖానికి ధరించే మాస్కులు, గాలిని వడపోసి, బాక్టీరియా, వైరస్, దుమ్ము ధూళి కణాలను శ్వాస మార్గంలోనికి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. కోవిడ్-19 ప్రభావము తగ్గిన తరువాత కూడా మన ఆరోగ్యం కోసం మాకు ధరించడాన్ని కొనసాగించడం మంచిది. ఇది జనసమర్థమైన ప్రదేశాలలో గుంపుల వలన ఏర్పడిన గాలి కాలుష్యం యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగాల బారినుండి మనల్ని రక్షిస్తుంది.

అనేక రకాలైన పదార్థాలతో తయారైన మాస్కులు మార్కెట్లో లభిస్తున్నప్పటికీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం మూడు పొరలతో తయారైన వస్త్రంతో చేసిన మాస్కులు కోవిడ్-19 బారి నుండి రక్షిస్తాయి. సహజ దారాలతో తయారుచేసిన మాస్కులను ఎక్కువసేపు ఉపయోగించడం వలన చర్మానికి వచ్చే అలర్జీలు, దురదలు రాకుండా చేస్తాయి.

ప్రశ్న 8.
మనం ధరించే దుస్తులకు, ఋతువులకు ఏమైనా సంబంధం ఉందా?
జవాబు:
రోజువారీ కార్యకలాపాలలో భాగంగా కృత్రిమ వస్త్రాలను మనం ధరించినప్పటికీ, ప్రత్యేక సందర్భాలలో పట్టువస్త్రాలను ధరిస్తాము. పట్టు వస్త్రాలలోని అందం, మెరుపు, నునుపుదనం వాటిని సౌందర్యానికి, ఆధ్యాత్మిక భావనకు ప్రతీకలుగా చేసాయి. ప్రశస్తతను కలుగచేశాయి. నూలు దుస్తులను వేసవి కాలంలో ధరించడం వలన చల్లదనాన్ని పొందుతాము.

అలాగే శీతాకాలంలో ధరించడం కోసం ప్రత్యేకంగా ఊలు దుస్తులను కొని ఉంచుకుంటాము. సహజ దారాలతో తయారైన వస్త్రాలను ధరించడం మన సంస్కృతి, సంప్రదాయము.

ప్రశ్న 9.
రాధ పట్టు చీరలు కొనాలని అనుకున్నది. పట్టు దారాలను మండించడం ద్వారా ఆమె ఈ విషయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నది. పట్టు దారములను మండించినప్పుడు ఆమె పట్టు యొక్క ఏయే లక్షణాలను పరిశీలించగలదు?
జవాబు:
పట్టుదారాన్ని మండించుట ద్వారా పట్టు నాణ్యతను అంచనా వేయవచ్చు.
సాధారణంగా మంచి పట్టు

  1. నెమ్మదిగా కాలుతుంది.
  2. కాలుతున్నప్పుడు మాంసం వాసనతో కూడిన పొగలు వస్తాయి.
  3. కాల్చినప్పుడు బూడిద నలుపు రంగులో ఉంటుంది.
  4. ఇది పూసవలె ఉండి ముట్టుకుంటే పొడిగా మారుతుంది.
    ఈ లక్షణాలు ఉంటే ఆ పట్టు దృఢమైన మరియు నాణ్యమైన పట్టుగా భావించవచ్చు.

AP Board 7th Class Science 11th Lesson 1 Mark Bits Questions and Answers దారాలు – దుస్తులు

I. బహుళైచ్చిక ప్రశ్నలు

సరియైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్లో రాయండి.

1. మెరీనో జాతి ఏ జంతువుకు సంబంధించినది?
A) గొర్రె
B) మేక
C) ఒంటె
D) యాక్
జవాబు:
A) గొర్రె

2. దక్షిణ రాష్ట్రాలలోని గొర్రె జాతి
A) మెరీనో
B) డెక్కనీ
C) అంగోరా
D) అల్పాకా
జవాబు:
B) డెక్కనీ

AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు

3. మొహయిర్ అనగా
A) గొర్రె ఉన్ని
B) మేక ఉన్ని
C) ఒంటె ఉన్ని
D) కుందేలు ఉన్ని
జవాబు:
B) మేక ఉన్ని

4. ఉన్ని ఉత్పత్తిలో గల దశల సంఖ్య
A) 4
B) 8
C) 12
D) 6
జవాబు:
D) 6

5. ఏ దశలో ఉన్నిని శుభ్రం చేయటం జరుగుతుంది?
A) షీరింగ్
B) స్కోరింగ్
C) సార్టింగ్
D) డైయింగ్
జవాబు:
B) స్కోరింగ్

6. పట్టు జీవిత చక్రంలోని దశలు
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
C) 4

7. వ్యంగా పెరిగే పట్టు మోతలు
A) ఈరీ
B) మూగా
C) టసర్
D) పైవన్ని
జవాబు:
D) పైవన్ని

8. జంతు దారాల నాణ్యతను తెలుసుకోవటానికి ఏ రసాయనం వాడతారు?
A) సోడియం హైపోక్లోరైట్
B) బ్లీచింగ్
C) నీరు
D) పెట్రోలియం
జవాబు:
A) సోడియం హైపోక్లోరైట్

9. సెల్యులోజ్ నుండి తయారయ్యే దారం
A) పట్టు
B) ఉన్ని
C) రేయాన్
D) పాలిస్టర్
జవాబు:
C) రేయాన్

10. పట్టువస్త్రాల ముడుతలు పోగొట్టటానికి వాడే పద్ధతి
A) రోలింగ్
B) స్కోరింగ్
C) షీరింగ్
D) కార్డింగ్
జవాబు:
A) రోలింగ్

AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు

11. కోవిడ్-19కు కారణం
A) బాక్టీరియా
B) వైరస్
C) అమీబా
D) శిలీంధ్రం
జవాబు:
B) వైరస్

12. నూలు వస్త్రాల ముడుతలు పోగొట్టటానికి చేయు ప్రక్రియ
A) రోలింగ్
B) ఇస్త్రీ చేయటం
C) గంజి పెట్టటం
D) ఆరవేయటం
జవాబు:
B) ఇస్త్రీ చేయటం

13. ఉన్నిని పోలి ఉండే కృత్రిమ దారం
A) ఆక్రిలిక్
B) రేయాన్
C) నైలాన్
D) పాలిస్టర్
జవాబు:
A) ఆక్రిలిక్

14. ‘పారాచూట్’ తాళ్ళను దేనితో తయారు చేస్తారు?
A) పట్టు
B) ఉన్ని
C) నైలాన్
D) రేయాన్
జవాబు:
A) పట్టు

15. ఏ దారాలు త్వరగా కాలవు?
A) కృత్రిమ దారాలు
B) జంతు దారాలు
C) మొక్కల దారాలు
D) పైవన్నీ
జవాబు:
B) జంతు దారాలు

16. ‘అంగోరా’ జాతి ఏ జంతువులకు సంబంధించినది?
A) గొర్రె
B) మేక
C) ఒంటె
D) కుందేలు
జవాబు:
B) మేక

AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు

17. ఈ క్రింది వానిలో సరిగా జతపరిచిన దానిని గుర్తించండి.
1) పట్టు పురుగుల ఆహారం ( ) P) ధర్మవరం
2) పట్టు పురుగుల పెంపకం ( ) Q) పట్టు పరిశ్రమ
3) ఆంధ్రప్రదేశ్ లో పట్టు ( ) R) మల్బరీ ఆకులు
A) 1- R, 2 – Q, 3-P
B) 1 – P, 2-Q, 3-R
C) 1- R, 2 – P, 3-Q
D) 1-0, 2- P, 3-R
జవాబు:
A) 1- R, 2 – Q, 3-P

18. ఉన్నిని సేకరించే దశలలోని వరుస క్రమం
A) షీరింగ్, స్కోరింగ్, సార్టింగ్
B) స్కోరింగ్, సార్టింగ్, షీరింగ్
C) షీరింగ్, సార్టింగ్, స్కోరింగ్
D) సార్టింగ్, షీరింగ్, స్కోరింగ్
జవాబు:
A) షీరింగ్, స్కోరింగ్, సార్టింగ్

19. ఉన్ని బట్టల తయారీలో మొదటి దశ ఏది?
A) కడగడం
B) వేరుచేయడం
C) కత్తిరించడం
D) విరంజనం చేయడం
జవాబు:
C) కత్తిరించడం

20. నీవు పట్టు బట్టల దుకాణానికి వెళ్లినపుడు పట్టు నాణ్యతను తెలుసుకోవడానికి నీవు అడిగే సహేతుకమైన ప్రశ్న ఏది?
A) పట్టు ధర ఎలా నిర్ణయిస్తారు?
B) పట్టు బట్టలు మన్నికగా ఉంటాయా?
C) పట్టు దేనితో చేస్తారు?
D) పట్టులో ఎన్ని రకాలున్నాయి?
జవాబు:
D) పట్టులో ఎన్ని రకాలున్నాయి?

21. వేసవి కాలంలో నీవు ఎటువంటి బట్టలు వేసుకుంటావు?
A) నూలు దుస్తులు, లేతరంగు దుస్తులు
B) ఉన్ని దుస్తులు, సిల్క్ దుస్తులు
C) నూలు దుస్తులు, ముదురురంగు దుస్తులు : పట్టణము
D) పట్టుదుస్తులు, ఉన్ని దుస్తులు
జవాబు:
A) నూలు దుస్తులు, లేతరంగు దుస్తులు

22. జంతు దారాలు : ప్రోటీనులు : : మొక్కల దారాలు : ……………
A) కొవ్వులు
B) ప్రోటీన్లు
C) పిండిపదార్థాలు
D) ఖనిజ లవణాలు
జవాబు:
C) పిండిపదార్థాలు

23. ఫ్లోచార్టులోని ఖాళీని ఇచ్చిన సమాధానాలతో భర్తీ చేయండి.
AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు 13
A) స్టిప్లింగ్
B) మాడ్స్
C) రీలింగ్
D) చిలకలు
జవాబు:
C) రీలింగ్

AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు

24. ఉన్ని తయారీ దశల సరైన వరుస క్రమం
A) షీరింగ్ – స్కోరింగ్ – సార్టింగ్ – బ్లీచింగ్ – డైయింగ్ – కార్డింగ్ – స్పిన్నింగ్ – నిట్టింగ్
B) స్కోరింగ్ – షీరింగ్ – బ్లీచింగ్ – సార్టింగ్ – కార్డింగ్ – డైయింగ్ – స్పిన్నింగ్ – నిట్టింగ్
C) షీరింగ్ – స్కోరింగ్ – బ్లీచింగ్ – సార్టింగ్ – కార్డింగ్ – డైయింగ్ – స్పిన్నింగ్ – నిట్టింగ్
D) స్కోరింగ్ – సార్టింగ్ – షీరింగ్ – డైయింగ్ – బ్లీచింగ్ – కార్డింగ్ – స్పిన్నింగ్ – నిట్టింగ్
జవాబు:
C) షీరింగ్ – స్కోరింగ్ – బ్లీచింగ్ – సార్టింగ్ – కార్డింగ్ – డైయింగ్ – స్పిన్నింగ్ – నిట్టింగ్

II. ఖాలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. ఉన్ని కోసం ప్రపంచ ఖ్యాతి చెందిన గొర్రె …………………….
2. దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతి చెందిన గొర్రెజాతి …………………
3. ప్రసిద్ది చెందిన ఉన్నిని ఇచ్చే మేక …………..
4. అంగోరా మేక ఉన్నిని ………. అంటారు.
5. ఒంటె ఉన్నితో ………………. తయారు చేస్తారు.
6. జంతు చర్మంలోని రోమాలు ………….. నుండి పెరుగుతాయి.
7. ఉన్నిని మెలిపెడుతూ పొడవైన దారంగా చేయడాన్ని ………….. అంటారు.
8. కంబళ్ళ తయారీకి ప్రసిద్ది చెందిన గ్రామం…………..
9. కకూనను …………… అంటారు.
10. పట్టుపురుగులోని గొంగళి పురుగును చంపడాన్ని ………… అంటారు.
11. ప్రపంచంలో భారత పట్టు ఉత్పత్తి శాతం ……………
12. పట్టుకాయ నుండి దారాలు తీయడాన్ని ……………… అంటారు.
13. ఒక కకూన్ నుండి వచ్చే దారం పొడవు ……. మీటర్లు.
14. జంతు దారాలు ………… నిర్మితాలు.
15. జంతు దారాలు ………………. ద్రావణాలలో కరుగుతాయి.
16. ఊలు దారాలు ……………….. అనే ప్రోటీన్ కల్గి ఉంటాయి.
17. పట్టు దారాలు ……………… అను ప్రాచీన కల్గి ఉంటాయి.
18. శస్త్రచికిత్సలో గాయాలు కుట్టటానికి …………. వాడతారు.
19. రసాయనాలు లేని కృత్రిమ దారం ………….
20. రేయానను ………… అని పిలుస్తారు.
21. రేయానను …………… నుండి తయారు చేస్తారు.
22. ………… చేయటం ద్వారా పట్టు వస్త్రాల ముడతలు పోగొట్టవచ్చు.
23. దుస్తులను కీటకాల నుండి రక్షించటానికి ………… గోళీలు వాడతారు.
24. ………………….. ఇటీవల కాలంలో ప్రపంచ మహమ్మారిగా విస్తరించినది.
25. కోవిడ్ నుండి రక్షణకు మనం తప్పని సరిగా …………….. ధరించాలి.
……………….. దుస్తులు మన సాంప్రదాయమే కాకుండా పర్యావరణ హితం కూడా,
27. పట్టుపురుగు శాస్త్రీయ నామం ……………..
28. ………… ప్రక్రియలో దారాలు వివర్ణం అవుతాయి.
29. ఉన్నిని మృదుత్వం, దృఢత్వం ఆధారంగా వర్గీకరించడాన్ని …………. అంటారు.
జవాబు:

  1. మెరీనో
  2. డెక్కనీ
  3. అంగోరా
  4. మొహయిర్
  5. కోట్లు, బ్లేజర్లు
  6. రోమ పుటికల
  7. స్పిన్నింగ్
  8. పర్ల
  9. పట్టుకాయ
  10. స్టింగ్
  11. 15%
  12. రీలింగ్
  13. 500-1500
  14. ప్రోటీన్
  15. సోడియం హైపోక్లోరైట్
  16. కెరాటిన్
  17. ఫైబ్రాయిన్
  18. పట్టుదారం
  19. రేయాన్
  20. కృత్రిమ పట్టు
  21. కలప గుజ్జు
  22. రోలింగ్
  23. ఫినార్జిలిన్
  24. విడ్-19
  25. మాను
  26. సహజ
  27. బొంబిక్స్ మోరీ
  28. బ్లీచింగ్
  29. సార్టింగ్

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – A Group – B
A) మెరీనో 1) రాజస్థాన్
B) అంగోరా 2) గొర్రె
C) యాక్ 3) మేక
D) లామా 4) లడక్
E) ఒంటె 5) దక్షిణ అమెరికా
6) సిక్కిం

జవాబు:

Group – A Group – B
A) మెరీనో 2) గొర్రె
B) అంగోరా 3) మేక
C) యాక్ 4) లడక్
D) లామా 5) దక్షిణ అమెరికా
E) ఒంటె 1) రాజస్థాన్

2.

Group – A Group – B
A) కృత్రిమ దారాలు 1) మల్బరీ
B) కృత్రిమ పట్టు 2) టసర్
C) కృత్రిమ ఉన్ని 3) ఆక్రిలిక్
D) వన్య పట్టు 4) రేయాన్
E) శ్రేష్టమైన పట్టు 5) పాలిస్టర్
6) షీరింగ్

జవాబు:

Group – A Group – B
A) కృత్రిమ దారాలు 5) పాలిస్టర్
B) కృత్రిమ పట్టు 4) రేయాన్
C) కృత్రిమ ఉన్ని 3) ఆక్రిలిక్
D) వన్య పట్టు 2) టసర్
E) శ్రేష్టమైన పట్టు 1) మల్బరీ

మీకు తెలుసా?

→ దక్షిణ అమెరికాలో ఉన్ని కోసం పెంచే పొడవైన వెంట్రుకలు కలిగిన జంతువులు అల్పాకా, లామాలు. ఇవి ఒంటెలను పోలి ఉంటాయి. ఈ జంతువుల నుండి లభించే ఉన్ని అత్యంత నాణ్యమైన ఉన్నిగా భావించబడే మొహెయిర్, ఉన్ని అంత మెత్తగా ఉంటుంది.

→ మన వెంట్రుకల వలనే, ఉన్ని వెంట్రుకలు జంతువు చర్మంలోని రోమ పుటికల నుండి పెరుగుతాయి. ఉన్ని – కొమ్ములు, గోర్లు, ఈకల వలెనే నిర్జీవ పదార్థంతో తయారవుతాయి.

→ కర్నూల్ పట్టణానికి 20 కి.మీ.ల దగ్గరలో ఉన్న ‘పర్ల’ అనే గ్రామం నాణ్యమైన ఉన్ని కంబళ్ళకు ప్రసిద్ధిగాంచింది. గొర్రెలు పెంచడం, ఉన్నితో కంబళ్ళను తయారుచేయడం ఆ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి. అనేక శతాబ్దాల నుండి ఆ ప్రజలు దీనిని ఒక కుటీర పరిశ్రమగా కొనసాగిస్తున్నారు.

→ తామర పట్టును తామర తూడుల నుండి లభ్యమయ్యే నారతో తయారుచేస్తారు. దీనిని సహజమైన సూక్ష్మదారంగా పరిగణిస్తారు. తామర మొక్క నుండి తీసే సూక్ష్మజీవ రహిత వస్త్రం నునుపుగా, తేలికగా ఉండి, ముడతలు పడదు. అలాగే అరటి మొక్కల నుండి తయారుచేసే అరటి నారను ప్రపంచంలోనే అతి గట్టిదారంగా పరిగణిస్తారు.

→ అహింసా పట్టు : అహింసామార్గంలో పట్టు సంవర్ధనం ద్వారా ఉత్పత్తి చేసే పట్టు. ఈ పద్ధతిలో పట్టుపురుగును కకూన్ నుండి వెలుపలికి రానిచ్చి తరువాత మిగిలిన పట్టుకాయల నుండి పట్టు దారం తీస్తారు. ఈ పద్ధతిని, ఆంధ్రప్రదేశ్ చేనేత పరిశ్రమ శాఖలో పని చేసిన చేనేత నిపుణులు శ్రీ కుసుమ రాజయ్య పరిచయం చేశారు. అయితే ఈ విధానంలో పట్టు ఉత్పత్తి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది.

→ ఆంథీరియా మైలెట్టా అనే పేరు గల వన్యంగా పెరిగే పట్టు పురుగు నుండి టసర్ పట్టు మనకు లభిస్తుంది. ఈ మోత్ సాధారణంగా తూర్పు గోదావరి జిల్లాలోని దట్టమైన అరణ్యాలలోని అర్జున, సాల్ చెట్ల మీద పెరుగుతుంది. గిరిజనులు ఈ మోత్ కకూన్లను సేకరించి, మార్కెట్లో అమ్ముతారు. ITDA వారు గిరిజనులకు కకూన్లను అమ్మడానికి తగిన మార్కెట్ ను కల్పించడంతో పాటుగా, కకూన్ల నుండి దారం తీయడానికి అవసరమైన నైపుణ్యాల కల్పన ద్వారా వారి సంపాదన పెంచేందుకు కృషి చేస్తున్నారు.

→ శస్త్ర చికిత్సలో వేసే కుట్లు, శస్త్ర చికిత్స తరువాత మరియు గాయాలు అయినప్పుడు కణజాలములను కలిపి ఉంచడానికి ఉపయోగిస్తారు. కణజాలములను గట్టిగా కలిపి ఉంచగల మరియు తేలికగా తీసివేయగల ఆకృతి కారణంగా పట్టు దారమును కుట్లు వేయడానికి విరివిగా ఉపయోగిస్తారు.

AP 7th Class Science Important Questions Chapter 11 దారాలు – దుస్తులు

→ డైపర్లు, శానిటరీ నాప్కిన్లు పూర్తిగా కృత్రిమమైన పదార్థాలతో తయారు చేయబడతాయి. ఈ పదార్థాలు దీర్ఘ కాలిక వాడకంలో చర్మానికి హాని కలుగచేస్తాయి మరియు పర్యావరణమునకు హానికరము. ఈ సమస్యను అధిగమించడం కోసం మనం నీటిని పీల్చుకునే నూలు, అరటి మరియు వెదురు నుండి లభించే నార వంటి వాటిని, అలాగే కాన్వాస్ నూలు వంటి ద్రవ నిరోధక పదార్థాలతో తయారైన డైపర్లు, శానిటరి నాప్కిన్ల వాడకమును ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. ఇవన్నీ తేలికగా భూమిలో కలిసిపోయే మరియు చర్మానికి హాని కలిగించని పదార్థాలు.