These AP 7th Class Science Important Questions 10th Lesson మన చుట్టూ జరిగే మార్పులు will help students prepare well for the exams.
AP Board 7th Class Science 10th Lesson Important Questions and Answers మన చుట్టూ జరిగే మార్పులు
7th Class Science 10th Lesson 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
నెమ్మదైన మార్పులు అనగానేమి?
జవాబు:
ఎక్కువ సమయం పట్టే మార్పులను నెమ్మదైన మార్పులు అంటారు.
ప్రశ్న 2.
ద్విగత మార్పులు అనగానేమి?
జవాబు:
కొత్తగా ఏర్పడిన పదార్థం తిరిగి మొదటి పదార్థంగా మారడాన్ని ద్విగత మార్పులు అంటారు.
ప్రశ్న 3.
అయస్కాంతీకరణ ఏ రకమైన మార్పు?
జవాబు:
అయస్కాంతీకరణ భౌతిక, ద్విగత మార్పు.
ప్రశ్న 4.
అద్విగత మార్పులకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
గోడకు సున్నం కొట్టించటం, పేపర్ కాల్చటం, మొదలైనవి.
ప్రశ్న 5.
ఆవర్తన మార్పులు అనగానేమి?
జవాబు:
నిర్ణీత సమయంలో పునరావృతమయ్యే మార్పును ఆవర్తన మార్పు అంటారు.
ప్రశ్న 6.
స్పటికీకరణం అనగానేమి?
జవాబు:
వేడి చేసి ద్రవపదార్థాల నుండి ఘన పదార్థాలను వేరు చేసే ప్రక్రియను స్పటికీకరణం అంటారు.
ప్రశ్న 7.
తుప్పు అనగానేమి?
జవాబు:
ఇనుప వస్తువుల మీద గోధుమ రంగులో ఏర్పడే పొరను తుప్పు అంటారు. రసాయనికంగా దీన్ని ఐరన్ ఆక్సైడ్ అంటారు.
ప్రశ్న 8.
ఇనుము తుప్పు పట్టడానికి ఏమి కావాలి?
జవాబు:
ఇనుము తుప్పు పట్టడానికి ఆక్సిజన్ మరియు తేమ కావాలి.
ప్రశ్న 9.
తుప్పు పట్టడం వలన కలిగే నష్టం ఏమిటి?
జవాబు:
ఇనుముతో తయారైన వంతెనలు, ఓడలు, కార్లు, ట్రక్కులు మొదలైనవి తుప్పుతో పాడైపోయి ఆర్థిక నష్టం జరుగుతుంది.
ప్రశ్న 10.
గాల్వనీకరణం అనగానేమి?
జవాబు:
ఇనుముపై జింక్ పూతను పూయడాన్ని గాల్వనీకరణం అంటారు.
ప్రశ్న 11.
కోసిన కూరగాయలు ఎందుకు రంగు మారతాయి?
జవాబు:
కోసిన కూరగాయలు ఆక్సీకరణం చెందటం వలన రంగు మారతాయి.
ప్రశ్న 12.
నిమ్మజాతి పండ్లు ఏ విటమిన్స్ కల్గి ఉంటాయి?
జవాబు:
నిమ్మజాతి పండ్లు విటమిన్ – సి కల్గి ఉంటాయి.
ప్రశ్న 13.
విటమిన్ ‘C’ యొక్క రసాయన నామం ఏమిటి?
జవాబు:
ఆస్కార్బిక్ ఆమ్లం
ప్రశ్న 14.
పర్యావరణంపై దుష్ఫలితం చూపే మార్పులు ఏమిటి?
జవాబు:
గ్లోబల్ వార్మింగ్, ఆమ్ల వర్షాలు, ఆయిల్ ఫిక్స్ పర్యావరణం పై దుష్ఫలితాలు చూపును.
ప్రశ్న 15.
ఆక్సీకరణం అనగానేమి?
జవాబు:
పదార్థాలు ఆక్సిజన్ తో చర్య పొందే ప్రక్రియను ఆక్సీకరణం అంటారు.
7th Class Science 10th Lesson 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
మార్పులు ఎన్ని రకాలు అవి ఏవి?
జవాబు:
సాధారణంగా మార్పులు రెండు రకాలు. అవి :
1. సహజ మార్పులు : ఇవి సహజ సిద్ధంగా జరుగుతాయి.
ఉదా : సూర్యోదయం.
2. మానవ ప్రమేయ మార్పులు :
ఇవి మానవ ప్రమేయంతో జరిగే మార్పులు.
ఉదా : అన్నం వండుట, భవంతులు నిర్మించుట, లడ్డూ తయారీ.
ప్రశ్న 2.
భౌతిక మార్పు లక్షణాలు ఏమిటి?
జవాబు:
భౌతిక మార్పు లక్షణాలు :
- భౌతిక మార్పులో కొత్త పదార్థం ఏర్పడదు. పదార్థ రసాయన ధర్మాలు మారవు.
- భౌతిక మార్పు తాత్కాలిక మార్పు మరియు ద్విగత మార్పు.
- పదార్థ సంఘటనలో మార్పు వుండదు.
- భౌతిక మార్పులో పదార్ధ భౌతిక ధర్మాలైన రంగు, ఆకారం మరియు పరిమాణంలో మార్పు జరుగును.
ప్రశ్న 3.
భౌతిక మార్పులకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
వెలుగుతున్న కొవ్వొత్తి కరగడం, వేడిచేస్తే మంచినీరుగా మారటం, వేడిచేస్తే నీరు ఆవిరి అవటం, గాలి ఊదిన బెలూన్ పెద్దగా అవ్వటం, సాగదీయబడిన రబ్బరుబాండు, జింక్ ఆక్సైడ్ మరియు లెడ్ ఆక్సైడ్లు వేడిచేస్తే రంగు మారటం మొదలైనవి భౌతిక మార్పులకు మరికొన్ని ఉదాహరణలు.
ప్రశ్న 4.
రసాయనిక మార్పు అనగానేమి?
జవాబు:
రసాయన సంఘటనలో మార్పు జరిగి క్రొత్త పదార్థాలు ఏర్పడే చర్యలను రసాయనిక మార్పు అంటారు.
ఉదా : కాగితం మండించటం.
ప్రశ్న 5.
ఢిల్లీలో ఇనుప స్తంభం ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
ఢిల్లీలో ఇనుప స్తంభం :
ఆశ్చర్యంగా తుప్పు పట్టని ఒక ఇనుప స్తంభం ఉంది. ఢిల్లీలోని కుతుబ్ కాంప్లెక్స్ నందు 1600 సంవత్సరాల క్రితం నాటి ఒక ఇనుప స్తంభం కలదు. చాలా కాలంపాటు దానిని బయట వాతావరణంలో ఉంచినప్పటికీ అది తుప్పు పట్టకుండా అలాగే ఉంది. ఎందుకంటే అది 98% దుక్క ఇనుము అనే ప్రత్యేక ఇనుముచే తయారు చేయబడింది. దానిలో 1% ఫాస్పరస్ ఉంటుంది. అది సల్ఫర్ మరియు మెగ్నీషియంలను కలిగి ఉండదు. ఈ స్తంభంపై మిసావిటే అనే పదార్థంతో కూడిన పలుచని పొర ఉంటుంది. అందువల్ల ఇనుప స్తంభం తుప్పు పట్టడం నిదానంగా జరుగుతుంది. మరియు ఇది తుప్పు పట్టుటకు వేల సంవత్సరాలు పడుతుంది.
ప్రశ్న 6.
ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ ప్రధాన సమస్యగా మారుతుంది. ఎందుకు?
జవాబు:
ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలు కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి. చాలా రకాల ప్లాస్టిక్ కు జీవ విచ్ఛిన్నం చెందనివి. అందుకే భూమి మరియు నీటి కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బతింటోంది. ప్లాస్టిక్ కు విచ్చిన్నం కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది.
ప్రశ్న 7.
శిలాజ ఇంధనాలు ఎటువంటి నష్టం కల్గిస్తున్నాయి?
జవాబు:
శిలాజ ఇంధనాల వాడకం పెరగడం వల్ల వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగి గ్లోబల్ వార్మింగకు దారి తీసింది. అలాగే పరిశ్రమలో, గృహాలలో మండించే ఇంధనాల వల్ల ఆమ్ల వాయువుల విడుదల పెరిగింది. వాతావరణం మరియు భూమిపై నివసించే జీవులకే కాకుండా నీటిలో వుండే జీవుల మనుగడకు కూడా ముప్పు ఏర్పడింది. మానవ తప్పిదాల వల్ల సముద్రాలలో పెట్రోలియం సంబంధిత ద్రవాలు వ్యాప్తి చెందినపుడు అలాగే పరిశ్రమల నుండి నూనె వ్యర్థాలు సముద్రాలలోకి వదిలినపుడు సముద్రంలోని జీవుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది.
ప్రశ్న 8.
మహారాష్ట్రలోని లూనార్ సరస్సు ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో వున్న లూనార్ సరస్సు 5200 సం||రాల క్రితం ఒక భారీ ఉల్కాపాతం ఏర్పడింది. ఇది ఒక సహజ ప్రక్రియ. ఈ మధ్య కాలంలో ఆ నీటిలో ఉన్న హాలోర్చయా అనే సూక్ష్మజీవుల వలన ఆ నీరు గులాబి రంగులోకి మారింది. అయితే ఈ రంగు మార్పు శాశ్వతం కాదు. ఎప్పుడైతే ఈ సూక్ష్మజీవులు అన్నీ క్రిందకు చేరుతాయో అప్పుడు మామూలు రంగు వస్తుంది. అందువల్ల ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
ప్రశ్న 9.
గాల్వనీకరణం అనగానేమి? దాని అవసరం ఏమిటి?
జవాబు:
- ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా వాటిపై జింక్ పూతను వేస్తారు. ఈ ప్రక్రియను గాల్వనీకరణం అంటారు.
- దీని వలన ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం మన్నుతాయి.
- గాల్వనీకరణ ప్రక్రియలో క్రోమియం లేదా జింక్ పూతను వాడతారు.
7th Class Science 10th Lesson 8 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
స్పటికీకరణం అనగానేమి? ఈ ప్రక్రియను వివరించండి.
జవాబు:
- వేడి చేసికొని ఆవిరిగా మార్చుకొని, ద్రావణం నుండి ఘనపదార్థాలను వేరుచేసే ప్రక్రియను స్పటికీకరణం అంటారు.
- స్పటికీకరణంలో కొత్త పదార్థం ఏర్పడదు. కావున ఇది భౌతిక మార్పు.
విధానం :
- ఒక పొడవైన పరీక్ష నాళిక తీసుకొని సగం వరకు నీరు నింపండి.
- దానికి కొద్దిగా చక్కెర కలుపుతూ సంతృప్త ద్రావణం తయారుచేయండి.
- తరువాత ద్రావణాన్ని 30 నిముషాల పాటు వేడి చేయండి.
- చక్కెర ద్రావణాన్ని వేడి చేసినపుడు చిన్న చిన్న చక్కెర స్పటికాలు ఏర్పడతాయి.
- ఈ ప్రక్రియనే స్పటికీకరణ అంటారు. .
- వేడి చేసి ద్రావణం నుండి ఘన పదార్థాలను వేరుచేయటమే స్పటికీకరణం.
ప్రశ్న 2.
భౌతిక మార్పు అనగానేమి? దాని లక్షణాలు ఏమిటి?
జవాబు:
- కొత్త పదార్థాలు ఏర్పడు మార్పులను భౌతిక మార్పులు అంటారు.
- ఇవి ఈ క్రింది లక్షణాలు కల్గి ఉంటాయి.
భౌతిక మార్పు లక్షణాలు :
- భౌతిక మార్పులో కొత్త పదార్థం ఏర్పడదు. పదార్థ రసాయన ధర్మాలు మారవు.
ఉదా : ఐస్ ముక్కలను వేడి చేసినపుడు నీరుగా మారును. మంచు ముక్కలు కరగడం భౌతిక స్థితిలో మార్పు. - భౌతిక మార్పు తాత్కాలిక మార్పు మరియు ద్విగత మార్పు.
ఉదా : నీటిని వేడిచేసినపుడు ఆవిరిగా మారును. ఆవిరిని చల్లార్చడం ద్వారా తిరిగి నీరుగా మార్చవచ్చు. - పదార్థ సంఘటనలో మార్పు వుండదు.
ఉదా : బంగారం ముక్కను కరిగించినపుడు దాని స్థితిలో మార్పు వస్తుందే కానీ పదార్థ సంఘటనలో మార్పు రాదు. - భౌతిక మార్పులో పదార్ధ భౌతిక ధర్మాలైన రంగు, ఆకారం మరియు పరిమాణంలో మార్పు జరుగును.
ఉదా : కూరగాయలు లేదా పండ్లను కత్తిరించినపుడు వాటి ఆకారం మారును, పరిమాణం వేరుగా వుండును.
అలాగే రంగు మారును.
ప్రశ్న 3.
రసాయనిక మార్పు అనగానేమి? దాని లక్షణాలు ఏమిటి?
జవాబు:
పదార్థ సంఘటనలో మార్పు జరిగి ఒక క్రొత్త పదార్థం ఏర్పడుతుందో వాటిని రసాయనిక మార్పులు అంటారు.
రసాయన మార్పుల లక్షణాలు :
- రసాయన మార్పులు జరిగేటప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడతాయి.
- ఇది శాశ్వత మార్పు మరియు అద్విగత స్వభావం కలది.
- పదార్థ రసాయన సంఘటన మారుతుంది.
- ఉష్ణం, కాంతి విడుదల కావచ్చు లేదా గ్రహింపవచ్చు.
- రంగులో మార్పు జరగవచ్చు మరియు ధ్వని ఉత్పత్తి కావచ్చు.
ప్రశ్న 4.
రసాయనిక మార్పును ఒక ఉదాహరణతో వివరింపుము.
జవాబు:
రసాయనిక సంఘటన మారి క్రొత్త పదార్థాలు ఏర్పడే మార్పులను రసాయన మార్పులు అంటారు.
ప్రయోగం :
- మెగ్నీషియం రిబ్బన్ తీసుకొని కొవ్వొత్తితో వేడి చేయండి.
- అది మెరిసే కాంతితో మండి బూడిదను ఏర్పరుస్తుంది.
- ఏర్పడిన బూడిదను మెగ్నీషియం ఆక్సైడ్ అంటారు.
మెగ్నీషియం + ఆక్సిజన్ → మెగ్నీషియం ఆక్సైడ్. - అలా ఏర్పడిన మెగ్నీషియం ఆక్సైడు తిరిగి మెగ్నీషియంగా మార్చలేము.
- కావున ఈ మార్పును రసాయన మార్పు అంటారు.
ప్రశ్న 5.
తుప్పు పట్టటము ఒక రసాయన చర్యేనా? దానిని ఎలా నివారిస్తావు?
జవాబు:
- ఇనుప వస్తువుల మీద గోధుమ రంగులో ఒక పొర ఏర్పడుతుంది. దీనినే తుప్పు అంటారు.
- ఇనుము తుప్పు పట్టటానికి ఆక్సిజన్ మరియు నీరు అవసరం.
- తేమ సమక్షంలో ఇనుము, ఆక్సిజన్తో చర్యపొంది ఆక్సైడ్ గా మారును.
ఇనుము + ఆక్సిజన్ → ఐరన్ ఆక్సైడ్ (తుప్పు) - ఇక్కడ కొత్త పదార్థం ఏర్పడింది. ఐరన్ ఆక్సైడిను తిరిగి ఐరన్‌గా మార్చలేము. కావున ఇది ఒక రసాయనిక చర్య.
నివారణలు :
- ఇనుమును నీటికి దూరంగా ఉంచటం.
- ఇనుముకు రంగులు వేయటం.
- లెడ్ ఆక్సైడు పూతగా రాయటం.
- స్వచ్చమైన దుక్క ఇనుము వాడటం.
ప్రశ్న 6.
భౌతిక, రసాయనిక మార్పుల వలన ఏర్పడుతున్న పర్యావరణ సమస్యలు ఏమిటి?
జవాబు:
- మన చుట్టూ అనేక భౌతిక, రసాయనిక మార్పులు జరుగుతున్నాయి.
- వాటిలో కొన్ని మానవ ప్రమేయంతో జరుగుతున్నాయి.
- ఇటువంటి చర్యలు పర్యావరణానికి హానికరంగా ఉంటున్నాయి.
- పరిశ్రమల వలన పొగ ఏర్పడి గాలి కాలుష్యం జరుగుతుంది.
- ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిని కలుషితం చేస్తున్నాయి.
- గాలి కాలుష్యం వలన ఆమ్ల వర్షాలు ఏర్పడుతున్నాయి.
- పరిశ్రమల వలన గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది.
- నూనె, ఆయిల్ రవాణా వలన సముద్రంలో ఆయిల్ ఫ్లిక్స్ ఏర్పడుతున్నాయి.
ఇటువంటి చర్యలను ఆపి పర్యావరణం పరిరక్షణ చేసుకున్నప్పుడే మనం మరింత కాలం భూమిపై మనుగడ సాగించగలము.
AP Board 7th Class Science 10th Lesson 1 Mark Bits Questions and Answers మన చుట్టూ జరిగే మార్పులు
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
సరియైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్లో రాయండి.
1. ఆక్సిజన్లో జరిపే చర్య
A) ఆక్సీకరణం
B) క్షయకరణం
C) హైడ్రోజనీకరణం
D) కర్బనీకరణం
జవాబు:
A) ఆక్సీకరణం
2. గ్లోబల్ వార్మింగ్ కు కారణం
A) H2O
B) CO2
C) SO4
D) N2
జవాబు:
B) CO2
3. ప్లాస్టిక్ విచ్ఛిన్నమవటం
A) వేగవంత చర్య
B) భౌతిక చర్య
C) నెమ్మదైన చర్య
D) ద్విగత చర్య
జవాబు:
C) నెమ్మదైన చర్య
4. గాల్వనీకరణంలో పూతగా వాడే లోహాలు
A) జింక్
B) క్రోమియం
C) రెండూ
D) ఇనుము
జవాబు:
C) రెండూ
5. కూరగాయల ఆక్సీకరణ నివారణకు నీటిలో కలిపే రసాయనం
A) వెనిగర్
B) సున్నం నీరు
C) మెగ్నీషియం
D) కాల్షియం
జవాబు:
A) వెనిగర్
6. తుప్పు అనగా
A) ఐరన్ ఆక్సైడ్
B) ఐరన్ కార్బైడ్
C) ఐరన్ సల్ఫేట్
D) ఐరన్
జవాబు:
A) ఐరన్ ఆక్సైడ్
7. తుప్పు పట్టటానికి సహకరించే కారకాలు
A) నీరు
B) ఆక్సిజన్
C) రెండూ
D) జింక్
జవాబు:
C) రెండూ
8. మెగ్నీషియంను మండించునపుడు ఏర్పడు పదార్ధం
A) మెగ్నీషియం ఆక్సైడ్
B) మెగ్నీషియం సల్ఫేట్
C) మెగ్నీషియం నైట్రేట్
D) మెగ్నీషియం హైడ్రేడ్
జవాబు:
A) మెగ్నీషియం ఆక్సైడ్
9. మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క రసాయనిక స్వభావం
A) ఆమ్లం
B) క్షారం
C) తటస్థం
D) లవణము
జవాబు:
B) క్షారం
10. వేడి చేసినపుడు రంగు మారే పదార్థాలు
A) జింక్ ఆక్సైడ్
B) లెడ్ ఆక్సైడ్
C) రెండూ
D) కొవ్వొత్తి
జవాబు:
C) రెండూ
11. స్పటికీకరణము ఒక
A) భౌతిక
B) రసాయనిక
C) ఆవర్తన మార్పు
D) ద్విగత చర్య
జవాబు:
A) భౌతిక
12. సముద్రం నుండి ఉప్పు తయారీ
A) గాల్వనైజేషన్
B) స్పటికీకరణ
C) వేడి చేయటం
D) ఆవిరి చేయటం
జవాబు:
B) స్పటికీకరణ
13. ఋతువులు ఏర్పడటం ఎటువంటి మార్పు?
A) రసాయనిక
B) భౌతిక
C) ఆవర్తన
D) వేగవంతమైన
జవాబు:
C) ఆవర్తన
14. స్ప్రింగ్ లో సాగుదల ఏ విధమైన మార్పు?
A) భౌతిక
B) రసాయనిక
C) ఆవర్తన
D) వేగవంత మార్పు
జవాబు:
A) భౌతిక
15. అగిపుల్ల మండించటం
A) వేగవంత మార్పు
B) నెమ్మది మార్పు
C) ఆవర్తన మార్పు
D) భౌతిక మార్పు
జవాబు:
A) వేగవంత మార్పు
16. ఈ పటంలో చూపబడిన మార్పు
A) సహజ మార్పు
B) మానవ ప్రమేయ మార్పు
C) ఆవర్తన మార్పు
D) భౌతిక మార్పు
జవాబు:
A) సహజ మార్పు
17.
పై కృత్యం ద్వారా చూపబడే చర్య
A)రసాయనిక చర్య
B) ద్విగత మార్పు
C) అద్విగత మార్పు
D) సహజమైన మార్పు
జవాబు:
B) ద్విగత మార్పు
18. సున్నపు తేటను తెల్లగా మార్చే వాయువు
A) ఆక్సిజన్
B) నైట్రోజన్
C) కార్బన్ డై ఆక్సెడ్
D) హైడ్రోజన్
జవాబు:
C) కార్బన్ డై ఆక్సెడ్
19. మెగ్నీషియం రిబ్బను ఆక్సిజన్ సమక్షంలో మండించినపుడు ఏర్పడే బూడిద
A) మెగ్నీషియం ఆక్సైడ్
B) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
C) మెగ్నీషియం డై ఆక్సైడ్
D) మెగ్నీషియం కార్బొనేట్
జవాబు:
A) మెగ్నీషియం ఆక్సైడ్
20. మీ అమ్మ వంకాయలు తరిగేటప్పుడు అవి నల్లగా మారుతున్నాయి. ఈ విధంగా రంగు మారకుండా ఉండాలంటే మనం వాటిని
A) ఉప్పు నీళ్ళలో వేయాలి.
B) నిమ్మరసం కలిపిన నీళ్ళలో వేయాలి.
C) వెనిగర్ కలిపిన నీళ్ళలో వేయాలి.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
21. కార్బన్ డై ఆక్సైడ్ + సున్నపు నీరు → ……….. + నీరు
A) కాల్షియం కార్బోనేటు
B) కాల్షియం క్లోరైడు
C) కార్బన్ క్లోరైడ్
D) కార్బన్ మోనాక్సెడ్
జవాబు:
A) కాల్షియం కార్బోనేటు
22. పండ్లు, కూరగాయలు కోసినప్పుడు వాటి ఉపరితలాలపై గోధుమరంగు పూత ఏర్పడటానికి కారణం
A)స్పటీకరణము
B) గాల్వనీకరణము
C) ఆక్సీకరణము
D) ఆప్లీకరణము
జవాబు:
C) ఆక్సీకరణము
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. మానవ ప్రమేయం లేకుండా జరిగే మార్పులు ………..
2. బెలూం గుహలు …………………. మార్పునకు ఉదాహరణ.
3. బెలూం గుహలు …………….. జిల్లాలో ఉన్నాయి.
4. తక్కువ కాలంలో జరిగే మార్పులను ……………….. మార్పులు అంటారు.
5. ఆలస్యంగా జరిగే మార్పులను ……….. అంటారు.
6. వెనుకకు మళ్ళించగలిగిన మార్పులను ………… అంటారు.
7. ద్విగత చర్యలన్నీ ……………… మార్పులను సూచిస్తాయి.
8. …………………… మార్పులో కొత్త పదార్థాలు ఏర్పడతాయి.
9. రసాయనిక మార్పులు ………….. చర్యలు. – కల్గిస్తున్నాయి.
10. పునరావృతమయ్యే చర్యలను …………… మార్పులు అంటారు.
11. మహారాష్ట్రలోని …….. భౌతిక మార్పుకు ఉదాహరణ.
12. స్పటికీకరణం ఒక …………………….
13. ఇనుము తుప్పు పట్టటం ఒక …………….. మార్పు.
14. మెగ్నీషియం తీగ మండించటం ఒక …………. మార్పు.
15. గాల్వనీకరణంలో ఉపయోగించే లోహాలు ……….మరియు …………………
16. కోసిన కూరగాయలు రంగు మారకుండా ……….. వాడవచ్చు.
17. నిమ్మజాతి పండ్లలోని విటమిన్ ………………
18. పదార్థాలు ఆక్సిజన్తో జరిపే చర్యను ……….. అంటారు.
19. గ్లోబల్ వార్మింగ్ కు కారణం ………..
20. …………… వలన ఆమ్ల వర్షాలు ఏర్పడుతున్నాయి.
21. ఆయిల్ స్లిక్‌లు ……………………. తీవ్ర నష్టం కల్గిస్తున్నాయి.
22. విటమిన్ సి రసాయనిక నామం ………………….
23. ఢిల్లీలోని ఇనుప స్తంభం పైన ఉన్న పొర …………………..
జవాబు:
- సహజ మార్పులు
- సహజ
- కర్నూలు
- వేగవంతమైన
- నెమ్మదైన మార్పులు
- భౌతిక మార్పులు
- భౌతిక
- రసాయనిక
- అద్విగత
- ఆవర్తన
- లూనార్ సరస్సు
- భౌతిక మార్పు
- రసాయనిక
- రసాయనిక
- జింక్, క్రోమియం
- వెనిగర్
- విటమిన్ – సి
- ఆక్సీకరణం
- CO2
- వాయు కాలుష్యం
- సముద్ర జలచరాలకు
- ఆస్కార్బిక్ ఆమ్లం
- మిసావిటే
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
Group – A | Group – B |
A) భౌతిక మార్పు | 1) ఋతువులు |
B) రసాయనిక మార్పు | 2) ప్లాస్టిక్ విచ్ఛిన్నం |
C) ఆవర్తన మార్పు | 3) గోడ సున్నం తెల్లగా మారటం |
D) నెమ్మదైన మార్పు | 4) తిరిగి వెనుకకు |
E) ద్విగత చర్య | 5) పేపర్ చింపటం |
జవాబు:
Group – A | Group – B |
A) భౌతిక మార్పు | 5) పేపర్ చింపటం |
B) రసాయనిక మార్పు | 3) గోడ సున్నం తెల్లగా మారటం |
C) ఆవర్తన మార్పు | 1) ఋతువులు |
D) నెమ్మదైన మార్పు | 2) ప్లాస్టిక్ విచ్ఛిన్నం |
E) ద్విగత చర్య | 4) తిరిగి వెనుకకు |
2.
Group – A | Group – B |
A) తుప్పు | 1) స్పటికీకరణం |
B) నిమ్మరసం | 2) ఐరన్ ఆక్సైడ్ |
C) కిరణజన్య సంయోగ క్రియ | 3) విటమిన్ – సి |
D) మెగ్నీషియం | 4) రసాయన మార్పు |
E) ఉప్పు తయారీ | 5) మెగ్నీషియం ఆక్సైడ్ |
జవాబు:
Group – A | Group – B |
A) తుప్పు | 2) ఐరన్ ఆక్సైడ్ |
B) నిమ్మరసం | 3) విటమిన్ – సి |
C) కిరణజన్య సంయోగ క్రియ | 4) రసాయన మార్పు |
D) మెగ్నీషియం | 5) మెగ్నీషియం ఆక్సైడ్ |
E) ఉప్పు తయారీ | 1) స్పటికీకరణం |
మీకు తెలుసా?
→ బెలూం గుహలు కర్నూలు జిల్లాలో కొలిమిగుండ్ల మండలం దగ్గర ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ రాష్ట్ర గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలు. ఇవి సహజంగా ఏర్పడ్డాయి. గుహలకు సంస్కృత పదమైన ‘బిలం’ నుండి ఈ పేరు వచ్చింది. ఈ గుహలలో 1.5 కి.మీ. దూరంలో ఉన్న అత్యంత లోతైన పాతాళగంగ వరకు టూరిస్టులకు చూడడానికి అనుమతి ఉంది. 1988వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధి సంస్థ (APTDC) సంరక్షిత ప్రదేశంగా నిర్ణయించింది. ఫిబ్రవరిలో 2002లో దీనిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచింది. విశాఖపట్నం జిల్లాలోని బొర్రా గుహలు, కూడా ప్రఖ్యాతి చెందిన సహజ గుహలు.
→ మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో వున్న లూనార్ సరస్సు 5200 సం||రాల క్రితం ఒక భారీ ఉల్కాపాతం ఏర్పడింది. ఇది ఒక సహజ ప్రక్రియ. ఈ మధ్య కాలంలో ఆ నీటిలో ఉన్న హాలోర్చయా అనే సూక్ష్మజీవుల వలన ఆ నీరు గులాబి రంగులోకి మారింది. అయితే ఈ రంగు మార్పు శాశ్వతం కాదు. ఎప్పుడైతే ఈ సూక్ష్మజీవులు అన్నీ క్రిందకు చేరుతాయో అప్పుడు మామూలు రంగు వస్తుంది. అందువల్ల ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
→ ఢిల్లీలో ఇనుప స్తంభం :
ఆశ్చర్యంగా తుప్పు పట్టని ఒక ఇనుప స్తంభం ఉంది! ఢిల్లీలోని కుతుబ్ కాంప్లెక్స్ నందు 1600 సంవత్సరాల క్రితం నాటి ఒక ఇనుప స్తంభం కలదు. ఇంత కాలంపాటు బయట వాతావరణంలో ఉంచినప్పటికీ అది తుప్పు పట్టకుండా అలాగే ఉంది. ఎందుకో మీకు తెలుసా ? ఆ ఇనుప స్తంభం సాధారణ స్థాయి కన్నా ఎక్కువ మొత్తంలో ఫాస్పరసను కలిగి ఉన్న అచ్చు పోసిన ఇనుముతో తయారైనది. తుప్పును నివారించుటకు ప్రధాన కారణం దాని ఉపరితలంపై ఐరన్ హైడ్రోజన్ పాస్ఫేట్ ఏర్పడడమే. దీనివలన అది తుప్పు పట్టుటకు ఎక్కువ సమయం పడుతుంది. కావున ఇప్పటికీ ఢిల్లీలోని ఆ ఇనుపస్థంభం తుప్పు పట్టలేదు.