Practice the AP 7th Class Maths Bits with Answers 6th Lesson దత్తాంశ నిర్వహణ on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 7th Class Maths Bits 6th Lesson దత్తాంశ నిర్వహణ

క్రింది వానికి సరైన సమాధానాలను ఎన్నుకొనుము.

ప్రశ్న1.
అంకగణిత సగటు లేక (సరాసరి) = ___________
AP 7th Class Maths Bits 6th Lesson దత్తాంశ నిర్వహణ 1
జవాబు :
(B)

ప్రశ్న2.
క్రింది వానిలో కేంద్రీయ స్థాన మాపనము
(A) అంకగణిత సగటు
(B) మధ్యగతము
(C) బాహుళకము
(D) పైవన్నీ
జవాబు :
(D) పైవన్నీ

ప్రశ్న3.
మొదటి 5 పూర్ణాంకాల అంకగణిత సగటు
(A) 5
(B) 4
(C) 3
(D) 2
జవాబు :
(D) 2

ప్రశ్న4.
8 యొక్క అన్ని కారణాంకాల అంకగణిత సగటు
(A) 3.75
(B) 15
(C) 3.25
(D) 4
జవాబు :
(A) 3.75

AP 7th Class Maths Bits 6th Lesson దత్తాంశ నిర్వహణ

ప్రశ్న5.
2 యొక్క మొదటి ఆరు గుణిజాల అంకగణిత సగటు
(A) 12
(B) 8
(C) 7
(D) 6
జవాబు :
(C) 7

ప్రశ్న6.
x-1, x, x + 1 యొక్క సరాసరి
(A) 3x
(B) 2x
(C) x
(D) x + 2
జవాబు :
(C) x

ప్రశ్న7.
4, 6, 5, x, 3, 1 రాశుల సగటు 4 అయిన x విలువ
(A) 4
(B) 5
(C) 6
(D) 2
జవాబు :
(B) 5

ప్రశ్న8.
క్రింది వానిలో ఏది కేంద్రీయ స్థాన మాపనము కాదు?
(A) సగటు
(B) బాహుళకం
(C) వ్యాప్తి
(D) మధ్యగతము
జవాబు :
(C) వ్యాప్తి

ప్రశ్న9.
మొదటి 10 సహజ సంఖ్యల వ్యాప్తి
(A) 1
(B) 9
(C) 10
(D) 5.5
జవాబు :
(B) 9

ప్రశ్న10.
5, 8, 3, 7, 11, 13, 4, 5 రాశుల వ్యాప్తి
(A) 13
(B) 3
(C) 10
(D) 5
జవాబు :
(C) 10

ప్రశ్న11.
క్రింది వానిలో ప్రాథమిక దత్తాంశము
(A) ఉపాధ్యాయుని వ్యక్తిగత మార్కుల రిజిష్టరులోని – మార్కులు.
(B) గ్రామ జనాభా వివరాలను జనాభా లెక్కల రిజిష్టరు నుండి సేకరించుట.
(C) రాష్ట్ర బడ్జెట్ వివరాలను న్యూస్ పేపర్ నుండి సేకరించిన దత్తాంశము.
(D) పైవన్నీ
జవాబు :
(A) ఉపాధ్యాయుని వ్యక్తిగత మార్కుల రిజిష్టరులోని – మార్కులు.

ప్రశ్న12.
కిందివానిలో ఏక బాహుళక దత్తాంశము
(A) A, B, C, A, B, A, D
(B) 2, 4, 6, 8, 10, 12
(C) 3, 4, 6, 3, 4, 5, 6
(D) పైవి అన్నీ
జవాబు :
(A) A, B, C, A, B, A, D

ప్రశ్న13.
క్రింది వానిలో ఏది అసత్యం?
(A) వ్యాప్తి = గరిష్ఠ విలువ – కనిష్ఠ విలువ.
(B) దత్తాంశంలోని రాశులను ఆరోహణ లేదా అవరోహణా క్రమంలో అమర్చిన ఆ అమరికలో మధ్యమ విలువ మధ్యగతము.
(C) ప్రత్యక్ష పరిశీలనలు, భౌతిక పరీక్షలు మొదలైన పద్ధతులలో ప్రత్యక్షంగా సేకరించిన దత్తాంశమును గౌణ దత్తాంశము (ద్వితీయ దత్తాంశము) అంటారు.
(D) పైవి అన్నీ
జవాబు :
(C) ప్రత్యక్ష పరిశీలనలు, భౌతిక పరీక్షలు మొదలైన పద్ధతులలో ప్రత్యక్షంగా సేకరించిన దత్తాంశమును గౌణ దత్తాంశము (ద్వితీయ దత్తాంశము) అంటారు.

AP 7th Class Maths Bits 6th Lesson దత్తాంశ నిర్వహణ

ప్రశ్న14.
4, 2, 1, 2, 4, 0, 5, 4 యొక్క బాహుళకము
(A) 0
(B) 1
(C) 2
(D) 4
జవాబు :
(D) 4

ప్రశ్న15.
పాదరక్షలు (చెప్పులు) షాపు లేదా రెడీమేడ్ బట్టల షాపు యజమానులు తమ షాపుల యందు ఎక్కువ మొత్తంలో ఏ సైజు నిల్వ ఉంచాలి అని తెలుసుకొనుటకు ఉపయోగ పడే కేంద్రీయ స్థాన విలువ
(A) సరాసరి
(B) మధ్యగతము
(C) బాహుళకము
(D) వ్యాప్తి
జవాబు :
(C) బాహుళకము

ప్రశ్న16.
3, 6, 5, 4, 3, 7, 5, x ఏక బాహుళక దత్తాంశము అయిన x విలువ
(A) 3
(B) 5
(C) 3 లేదా 5
(D) 4
జవాబు :
(C) 3 లేదా 5

ప్రశ్న17.
3, 6, 4, 5, 5, 3, 7, 1, 2 యొక్క బాహుళకము
(A) 1
(B) 3
(C) 5
(D) B మరియు C
జవాబు :
(D) B మరియు C

ప్రశ్న18.
దత్తాంశములోని రాశుల సంఖ్య n సరి సంఖ్య అయిన ఆ దత్తాంశ మధ్యగతము
(A) \(\frac{\mathrm{n}}{2}\) వ రాశి
(B) \(\left(\frac{\mathrm{n}}{2}\right)\) వ మరియు \(\left(\frac{\mathrm{n}}{2}+1\right)\) వ రాశుల సరాసరి
(C) n వ రాశి
(D) \(\left(\frac{\mathrm{n}}{2}+1\right)\) వ రాశి
జవాబు :
(B) \(\left(\frac{\mathrm{n}}{2}\right)\) వ మరియు \(\left(\frac{\mathrm{n}}{2}+1\right)\) వ రాశుల సరాసరి

ప్రశ్న19.
మొదటి 5 ప్రధాన సంఖ్యల మధ్యగతమును 4 విద్యార్థులు క్రింది విధంగా కనుగొన్నారు.
చరణ్ : 2, 3, 5, 7, 11 ల
మధ్యగతం = \(\frac{2+3+5+7+11}{5}=\frac{28}{5}\)
= 5.6
రేష్మా : 2, 3, 5, 7, 11 ల
మధ్యగతం = 11 – 2 = 9
కిరణ్ : 2, 3, 5, 7, 11 ల
మధ్యగతం = 2, 3, 5, 7, 11 లో
= \(\left(\frac{5+1}{2}\right)=\frac{6}{2}\) = 3వ రాశి = 5
వెరోనిక : 2, 3, 5, 7, 11 రాశులలో ఏ రాశి మిగతా వానికన్నా ఎక్కువసార్లు పునరావృతం కాలేదు. కావున మధ్యగతం లేదు.
పై ఎవరి సమాధానం సరైనది ?
(A) చరణ్
(B) రేష్మా
(C) కిరణ్
(D) వెరోనిక
జవాబు :
(C) కిరణ్

ప్రశ్న20.
0.2, 0.5, 0.6, 0.4, 0.1 రాశుల మధ్యగతము
(A) 0.4
(B) 0.3
(C) 0.1
(D) 0.2
జవాబు :
(A) 0.4

ప్రశ్న21.
5, 7, 8, x, 14, 18 ఆరోహణా క్రమంలో గల దత్తాంశం యొక్క మధ్యగతం 10 అయిన x విలువ
(A) 10
(B) 12
(C) 13
(D) 9
జవాబు :
(B) 12

ప్రశ్న22.
ప్రవచనం P : మొదటి ఆరు పూర్ణాంకాల సగటు 2.5
ప్రవచనం Q : మొదటి ఆరు పూర్ణాంకాల మధ్యగతం 2.5
(A) P – సత్యం, Q – అసత్యం
(B) P – అసత్యం, Q – సత్యం
(C) P మరియు Qలు రెండూ సత్యం
(D) P మరియు Qలు రెండూ అసత్యం
జవాబు :
(C) P మరియు Qలు రెండూ సత్యం

ప్రశ్న23.
x + 1, x + 2, x + 3, x + 4, x + 5 రాశుల మధ్యగతము 13 అయిన x విలువ
(A) 8
(B) 13
(C) 9
(D) 10
జవాబు :
(D) 10

→ 2021 మార్చి నెల నుండి ఆగష్టు వరకు ఒక ఎలక్ట్రికల్ షాపు నందు అమ్మిన CFL మరియు LED బల్బుల వివరాలను క్రింది డబుల్ బార్ గ్రాఫ్ నందు ఇవ్వడం జరిగినది. ఈ డబుల్ బార్ ను పరిశీలించి, క్రింది 24-27 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎన్నుకొనుము.
AP 7th Class Maths Bits 6th Lesson దత్తాంశ నిర్వహణ 2

ప్రశ్న24.
జూన్ నెలలో అమ్మిన LED బల్బుల సంఖ్య
(A) 70
(B) 80
(C) 100
(D) 90
జవాబు :
(C) 100

AP 7th Class Maths Bits 6th Lesson దత్తాంశ నిర్వహణ

ప్రశ్న25.
ఏ నెలలో అమ్మిన CFL మరియు LED బల్బుల సంఖ్య సమానము ?
(A) మార్చి
(B) మే
(C) జూన్
(D) ఆగష్టు
జవాబు :
(D) ఆగష్టు

ప్రశ్న26.
జూన్ నెలలో CFL బల్బుల కన్నా ఎక్కువగా అమ్మిన LED బల్బుల సంఖ్య
(A) 10
(B) 50
(C) 30
(D) 10
జవాబు :
(A) 10

ప్రశ్న27.
ఏ నెలలో LED బల్బుల కన్నా CFL బల్బులు ఎక్కువ అమ్మడం జరిగినది ?
(A) మార్చి
(B) ఏప్రిల్
(C) జూన్
(D) ఆగష్టు
జవాబు :
(B) ఏప్రిల్

ప్రశ్న28.
ప్రవచనం I : కమ్మీ చిత్రాలలోని అన్ని కమ్మీల పొడవులు సమానము.
ప్రవచనం II : వృత్తరేఖా చిత్రంలోని సెక్టారు వృత్త కేంద్రం 0 వద్ద చేసే కోణము అది సూచించే అంశము విలువకు . అనులోమానుపాతంలో ఉంటుంది.
(A) I – సత్యం, II – అసత్యం
(B) I – అసత్యం, II – సత్యం
(C) I, II లు రెండూ సత్యం
(D) I, II లు రెండూ అసత్యం
జవాబు :
(B) I – అసత్యం, II – సత్యం

ప్రశ్న29.
వృత్తరేఖా చిత్రంలో సెక్టారు కోణం =
AP 7th Class Maths Bits 6th Lesson దత్తాంశ నిర్వహణ 3
జవాబు :
(C)

AP 7th Class Maths Bits 6th Lesson దత్తాంశ నిర్వహణ 4
చిత్రంలో ఒక వ్యక్తి యొక్క నెల ఆదాయంలో నెలలో ఖర్చు వివరాలను ఇవ్వడం జరిగినది. చిత్రాన్ని పరిశీలించి, 30-33 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాన్ని ఎన్నుకొనుము.

ప్రశ్న30.
ఆదాయంలో అత్యధిక భాగము దేనికి ఖర్చు చేస్తున్నాడు ?
(A) విద్య
(B) పొదుపు
(C) ఇంటి అద్దె
(D) వైద్యం
జవాబు :
(B) పొదుపు

ప్రశ్న31.
ఇంటి అద్దె కొరకు ₹ 10,000 ఖర్చు చేసినచో వైద్యం కొరకు చేసిన ఖర్చు
(A) ₹ 5,000
(B) ₹ 10,000
(C) ₹ 15,000
(D) ₹ 60,000
జవాబు :
(A) ₹ 5,000

ప్రశ్న32.
విద్య కొరకు చేసిన ఖర్చు ₹ 20,000 అయిన అతని ఆదాయం ఎంత ?
(A) ₹ 40,000
(B) ₹ 60,000
(C) ₹ 80,000
(D) ₹1,20,000
జవాబు :
(C) ₹ 80,000

ప్రశ్న33.
వైద్యం ఖర్చును సూచించు సెక్టారు కోణము
(A) 120°
(B) 90°
(C) 60°
(D) 30°
జవాబు :
(D) 30°

క్రింది ఖాళీలను పూరింపుము.

ప్రశ్న1.
గతంలో వేరొకరు సేకరించిన దత్తాంశాన్ని ప్రస్తుత అవసరాలకు ఉపయోగించుకొను దత్తాంశమును ___________ దత్తాంశం అంటారు.
జవాబు :
గౌణ లేదా ద్వితీయ

AP 7th Class Maths Bits 6th Lesson దత్తాంశ నిర్వహణ

ప్రశ్న2.
మొదటి 5 ప్రధాన సంఖ్యల అంకగణిత సగటు ___________
జవాబు :
5.6

ప్రశ్న3.
మొదటి 4 సంయుక్త సంఖ్యల వ్యాప్తి ___________
జవాబు :
5

ప్రశ్న4.
ఇవ్వబడిన దత్తాంశములో ఎక్కువసార్లు పునరావృతం అయ్యే రాశిని ___________ అంటారు.
జవాబు :
బాహుళకం

ప్రశ్న5.
2, 2, 2, 3, 3, 3, 4, 4, 4, 5, 5, 5 యొక్క బాహుళకము ___________
జవాబు :
లేదు

ప్రశ్న6.
బాహుళకముగా రెండు రాశులు గల దత్తాంశాన్ని ___________ దత్తాంశము అంటారు.
జవాబు :
ద్విబాహుళక

ప్రశ్న7.
దత్తాంశమును రెండు సమాన భాగాలుగా విభజించు కేంద్రీయ స్థాన మాపనము ___________
జవాబు :
మధ్యగతము

ప్రశ్న8.
దత్తాంశములోని రాశుల విలువల మధ్య వ్యత్యాసము తక్కువగా ఉన్నప్పుడు ఉపయోగకరమైన కేంద్రీయ స్థాన విలువ ___________
జవాబు :
అంకగణిత సగటు

ప్రశ్న9.
దత్తాంశములో ఒకే విధమైన అనేక విలువలు ఉన్నప్పుడు మరియు వేగంగా గణించుటకు ఉపయుక్తమైన కేంద్రీయ స్థాన మాపనము ___________
జవాబు :
బాహుళకము

ప్రశ్న10.
వృత్త రేఖా చిత్రంలోని అన్ని సెక్టారు కోణాల మొత్తం ___________
జవాబు :
360°

ప్రశ్న11.
మొదటి 100 సహజ సంఖ్యల వ్యాప్తి ___________
జవాబు :
99

ప్రశ్న12.
దత్తాంశములోని రాశుల సంఖ్య n బేసి సంఖ్య అయిన ___________ వ రాశి మధ్యగతం అవుతుంది.
జవాబు :
\(\left(\frac{\mathrm{n}+1}{2}\right)\)

జతపరుచుము :

ప్రశ్న1.

i) సగటు = (A) దత్తాంశములోని గరిష్ఠ, కనిష్ఠ విలువల భేదము
ii) బాహుళకం = (B) ఆరోహణ లేదా అవరోహణ క్రమంలోగల దత్తాంశ మధ్య విలువ
iii) మధ్యగతం = AP 7th Class Maths Bits 6th Lesson దత్తాంశ నిర్వహణ 5
iv) వ్యాప్తి = (D) దత్తాంశములో ఎక్కువసార్లు పునరావృతం అగు రాశి

జవాబు :

i) సగటు = AP 7th Class Maths Bits 6th Lesson దత్తాంశ నిర్వహణ 5
ii) బాహుళకం = (D) దత్తాంశములో ఎక్కువసార్లు పునరావృతం అగు రాశి
iii) మధ్యగతం = (B) ఆరోహణ లేదా అవరోహణ క్రమంలోగల దత్తాంశ మధ్య విలువ
iv) వ్యాప్తి = (A) దత్తాంశములోని గరిష్ఠ, కనిష్ఠ విలువల భేదము

ప్రశ్న2.

i) వృత్తరేఖా చిత్రంలోని భాగాల ఆకారం (A) వృత్తము
ii) కమ్మీ చిత్రంలోని కమ్మీల ఆకారం (B) సెక్టారు
iii) పై (T) చిత్రం యొక్క ఆకారము (C) x – అక్షము
iv) కమ్మీ చిత్రంలోని ఆడ్డు (క్షితిజ) రేఖ (D) దీర్ఘచతురస్రము

జవాబు :

i) వృత్తరేఖా చిత్రంలోని భాగాల ఆకారం (B) సెక్టారు
ii) కమ్మీ చిత్రంలోని కమ్మీల ఆకారం (D) దీర్ఘచతురస్రము
iii) పై (T) చిత్రం యొక్క ఆకారము (A) వృత్తము
iv) కమ్మీ చిత్రంలోని ఆడ్డు (క్షితిజ) రేఖ (C) x – అక్షము

AP 7th Class Maths Bits 6th Lesson దత్తాంశ నిర్వహణ

ప్రశ్న3.
మొదటి 5 ప్రధానాంకాల క్రింది వానిని జతపరుచుము.

i) సగటు (A) 5
ii) మధ్యగతం (B) 9
iii) బాహుళకం (C) 5.6
iv) వ్యాప్తి (D) ఉండదు

జవాబు :

i) సగటు (C) 5.6
ii) మధ్యగతం (A) 5
iii) బాహుళకం (D) ఉండదు
iv) వ్యాప్తి (B) 9

ప్రశ్న4.

i) మొదటి 5 సరిసంఖ్యల సగటు (A) 0
ii) మొదటి 5 బేసిసంఖ్యల మధ్యగతము (B) 5
iii) – 4, – 3, – 2, – 1, 2, 4, 6, 6, 8, 8, 8 ల బాహుళకం (C) 6
iv)  0, 1, 2, 3, 4ల సగటు (D) 8

జవాబు :

i) మొదటి 5 సరిసంఖ్యల సగటు (C) 6
ii) మొదటి 5 బేసిసంఖ్యల మధ్యగతము (B) 5
iii) – 4, – 3, – 2, – 1, 2, 4, 6, 6, 8, 8, 8 ల బాహుళకం (D) 8
iv)  0, 1, 2, 3, 4ల సగటు (A) 0