Practice the AP 7th Class Maths Bits with Answers 5th Lesson త్రిభుజాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Maths Bits 5th Lesson త్రిభుజాలు
క్రింది వానిలో సరైన సమాధానాలను ఎన్నుకొనుము.
ప్రశ్న1.
క్రింది పటం ∆XYZ లో XZ భుజం యొక్క ఎదుటి శీర్షం
(A) X
(B) Y
(C) Z
(D) నిర్ణయించలేము
జవాబు :
(B) Y
ప్రశ్న2.
క్రిందివానిలో సమద్విబాహు త్రిభుజ భుజాల కొలతలు
(A) 4 సెం.మీ., 6. సెం.మీ. 5 సెం.మీ.
(B) 5 సెం.మీ., 6 సెం.మీ., 8 సెం.మీ.
(C) 4 సెం.మీ., 5 సెం.మీ., 4 సెం.మీ.
(D) పైవి అన్నీ
జవాబు :
(C) 4 సెం.మీ., 5 సెం.మీ., 4 సెం.మీ.
ప్రశ్న3.
క్రింది వానిలో ఏవి లంబకోణ త్రిభుజం యొక్క కోణాలు ?
(A) 45°, 45°, 90°
(B) 60°, 30°, 90°
(C) 25°, 65°, 90°
(D) పైవి అన్నీ
జవాబు :
(D) పైవి అన్నీ
ప్రశ్న4.
ఒక త్రిభుజంలో సాధ్యమవు అధిక కోణాల సంఖ్య
(A) 4
(B) 2
(C) 1
(D) 3
జవాబు :
(C) 1
ప్రశ్న5.
సమద్విబాహు లంబకోణ త్రిభుజం యొక్క కోణాలు
(A) 45°, 45°, 90°
(B) 309, 309, 90°
(C) 30°, 60, 90°
(D) పైవి ఏవీకావు
జవాబు :
(A) 45°, 45°, 90°
ప్రశ్న6.
క్రింది వానిలో అల్పకోణ త్రిభుజం
జవాబు :
(A)
ప్రశ్న7.
క్రింది పటం ∆PQR లో ∠Q =
(A) 90°
(B) 65°
(C) 55°
(D) 75°
జవాబు :
(B) 65°
ప్రశ్న8.
ఒక త్రిభుజంలో రెండు కోణాలు 43°, 57° అయిన మూడవ కోణము
(A) 100°
(B) 180°
(C) 80°
(D) 90°
జవాబు :
(C) 80°
ప్రశ్న9.
క్రిందివానిలో ఏవి ఒక త్రిభుజం యొక్క కోణాలు కావు?
(A) 509, 409, 80°
(B) 60°, 609, 60°
(C) 100°, 30°, 90°
(D) A మరియు C
జవాబు :
(D) A మరియు C
ప్రశ్న10.
ప్రవచనం X : త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180°.
ప్రవచనం Y : త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడు బాహ్యకోణం, దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం.
(A) X మాత్రమే సత్యం
(B) Y మాత్రమే సత్యం
(C) X, Y లు రెండూ సత్యం
(D) X, Y లు రెండూ అసత్యం
జవాబు :
(C) X, Y లు రెండూ సత్యం
ప్రశ్న11.
క్రింది పటంలో x విలువ
(A) 60°
(B) 100°
(C) 40°
(D) 110°
జవాబు :
(B) 100°
ప్రశ్న12.
క్రిందివానిలో ఏది సత్యం ?
(A) లంబకోణ త్రిభుజంలోని రెండు అల్పకోణాలు పూరక కోణాలు.
(B) లంబకోణ త్రిభుజంలో లంబకోణ శీర్షమునకు ఎదురుగా గల భుజం కర్ణము.
(C) లంబకోణ త్రిభుజంలో కర్ణము అతిపెద్ద భుజము.
(D) పైవి అన్నీ
జవాబు :
(D) పైవి అన్నీ
ప్రశ్న13.
ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1 : 2 : 3 అయిన ఆ త్రిభుజం
(A) అల్పకోణ త్రిభుజం
(B) లంబకోణ త్రిభుజం
(C) అధికకోణ త్రిభుజం
(D) లంబకోణ సమద్విబాహు త్రిభుజం
జవాబు :
(B) లంబకోణ త్రిభుజం
ప్రశ్న14.
ఒక త్రిభుజం ∆ABC లో ∠A > ∠B > ∠C అయిన
(A) \(\overline{\mathrm{AB}}>\overline{\mathrm{BC}}>\overline{\mathrm{AC}}\)
(B) \(\overline{\mathrm{AB}}<\overline{\mathrm{BC}}<\overline{\mathrm{AC}}\)
(C) \(\overline{\mathrm{BC}}>\overline{\mathrm{AC}}>\overline{\mathrm{AB}}\)
(D) \(\overline{\mathrm{BC}}<\overline{\mathrm{AC}}<\overline{\mathrm{AB}}\)
జవాబు :
(C) \(\overline{\mathrm{BC}}>\overline{\mathrm{AC}}>\overline{\mathrm{AB}}\)
ప్రశ్న15.
క్రిందివానిలో ఏవి ఒక త్రిభుజం యొక్క భుజాల కొలతలు కావు ?
(A) 6, 7, 13
(B) 6, 7, 5
(C) 3, 4, 5
(D) 8, 9, 15
జవాబు :
(A) 6, 7, 13
ప్రశ్న16.
ఒక త్రిభుజం యొక్క రెండు భుజాలు 4 సెం.మీ., 8 సెం.మీ. అయిన క్రింది ఏది 3వ భుజం కావచ్చును?
(A) 3 సెం.మీ.
(B) 10 సెం.మీ.
(C) 13 సెం.మీ.
(D) 12 సెం.మీ.
జవాబు :
(B) 10 సెం.మీ.
ప్రశ్న17.
క్రింది పటం ∆XYZ లో అతి చిన్న భుజము
(A) XZ
(B) XY
(C) YZ
(D) నిర్ణయించలేము
జవాబు :
(A) XZ
ప్రశ్న18.
∆ABC లో AB = AC అయిన
(A) ∠A = ∠C
(B) ∠A = ∠B
(C) ∠B = C
(D) పైవి అన్ని
జవాబు :
(C) ∠B = C
ప్రశ్న19.
సమబాహు త్రిభుజంలోని ప్రతికోణం
(A) 60°
(B) 45°
(C) 90°
(D) 30°
జవాబు :
(A) 60°
ప్రశ్న20.
ప్రవచనం I : ఒక త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా గల కోణాలు సమానము.
ప్రవచనం II : ఒక త్రిభుజంలోని ఏ రెండు భుజాల పొడవుల మొత్తమైనా మూడవ భుజం పొడవు కన్నా తక్కువ.
ప్రవచనం III : త్రిభుజంలోని బాహ్యకోణం, దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం.
ప్రవచనం IV : సమద్విబాహు త్రిభుజంలోని ప్రతి కోణం విలువ 60. పై వానిలో ఏవి సత్యం ?
(A) I మరియు III
(B) II మరియు IV.
(C) III మాత్రమే
(D) I మాత్రమే
జవాబు :
(A) I మరియు III
ప్రశ్న21.
క్రింది పటంలో ∠B విలువ
(A) 50°
(B) 130
(C) 65°
(D) 60°
జవాబు :
(C) 65°
ప్రశ్న22.
క్రింది త్రిభుజంలో ఏది సత్యం ?
(A) PH > OH
(B) ∠H > ∠P
(C) OP> OH
(D) పైవి అన్ని
జవాబు :
(D) పైవి అన్ని
ప్రశ్న23.
క్రింది పటం ∆ABC లో A నుండి గీచిన ఉన్నతి
(A) \(\overrightarrow{\mathrm{AF}}\)
(B) AE
(C) \(\overrightarrow{\mathrm{HI}}\)
(D) BG
జవాబు :
(B) AE
క్రింది ఖాళీలను పూరింపుము.
ప్రశ్న1.
ABC లో ∠Bకి ఎదురుగా గల భుజం ________
జవాబు :
AC
ప్రశ్న2.
మూడు భుజాలు సమానంగా గల త్రిభుజాన్ని ________ త్రిభుజము అంటారు.
జవాబు :
సమబాహు
ప్రశ్న3.
లంబకోణ త్రిభుజం యొక్క కోణాలలో అతి పెద్ద కోణం విలువ ________
జవాబు :
90°
ప్రశ్న4.
లంబకోణ త్రిభుజంలో లంబకోణ శీర్షమునకు ఎదురుగా గల భుజాన్ని ________ అంటారు.
జవాబు :
కర్ణము
ప్రశ్న5.
త్రిభుజంలోని మూడు అంతరకోణాల మొత్తం ________
జవాబు :
180°
ప్రశ్న6.
ఒక లంబకోణ త్రిభుజంలోని ఒక అల్పకోణం 35° అయిన రెండవ అల్పకోణం ________
జవాబు :
55°
ప్రశ్న7.
ఒక త్రిభుజంలో రెండు అంతర కోణాల మొత్తం 120° అయిన మూడవ అంతర కోణము ________
జవాబు :
60°
ప్రశ్న8.
క్రింది పటంలో x = ________
జవాబు :
70°
ప్రశ్న9.
పై పటంలో, ∠ABC = ________
జవాబు :
110°
ప్రశ్న10.
క్రింది పటంలో x = ________
జవాబు :
70°
ప్రశ్న11.
పై పటంలో y = ________
జవాబు :
110°
ప్రశ్న12.
6 సెం.మీ., 9 సెం.మీ., 6 సెం.మీ. భుజాల పొడవు లుగా గల త్రిభుజము ________ త్రిభుజము.
జవాబు :
సమద్విబాహు
ప్రశ్న13.
ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క సమాన భుజాల పొడవు 5 సెం.మీ. అయిన మూడవ భుజం పొడవు ________ సెం.మీ. కన్నా తక్కువగా ఉంటుంది.
జవాబు :
10
ప్రశ్న14.
సమద్విబాహు లంబకోణ త్రిభుజంలోని అల్పకోణం విలువ ________
జవాబు :
45°
ప్రశ్న15.
క్రింది పటంలో x = ________
జవాబు :
60°
ప్రశ్న16.
క్రింది పటంలో y = ________
జవాబు :
75°
ప్రశ్న17.
ఒక త్రిభుజం యొక్క రెండు కోణాలు 56°, 40° అయిన మూడవ కోణం ________
జవాబు :
84°
ప్రశ్న18.
ఒక త్రిభుజం యొక్క మూడు కోణాల నిష్పత్తి 2:3:4 . అయిన అతి పెద్ద కోణము ________
జవాబు :
80°
ప్రశ్న19.
ఒక త్రిభుజంలో సాధ్యమవు అధిక కోణాల సంఖ్య ________
జవాబు :
1
ప్రశ్న20.
ఒక త్రిభుజంలో సాధ్యమవు గరిష్ఠ అల్పకోణాల సంఖ్య ________
జవాబు :
3
ప్రశ్న21.
ఒక త్రిభుజంలోని రెండు అల్పకోణాలు 35°, 25° అయిన ఆ త్రిభుజం ________ త్రిభుజం.
జవాబు :
అధికకోణ
జతపరుచుము:
ప్రశ్న1.
i) అల్పకోణ త్రిభుజము | ![]() |
ii) లంబకోణ త్రిభుజము | ![]() |
iii) అధికకోణ త్రిభుజము | ![]() |
iv) లంబకోణ సమద్విబాహు త్రిభుజం | ![]() |
జవాబు :
i) B
ii) A
iii) D
iv) C
ప్రశ్న2.
భుజాల పొడవులను, త్రిభుజ రకానికి జతపరుచుము.
i) 6 సెం.మీ., 8 సెం.మీ., 10 సెం.మీ. | (A) సమబాహు త్రిభుజం |
ii) 6 సెం.మీ., 6 సెం.మీ., 10 సెం.మీ. | (B) విషమబాహు త్రిభుజం |
iii) 6 సెం.మీ., 6 సెం.మీ., 6 సెం.మీ. | (C) సమద్విబాహు త్రిభుజము |
జవాబు :
i) 6 సెం.మీ., 8 సెం.మీ., 10 సెం.మీ. | (B) విషమబాహు త్రిభుజం |
ii) 6 సెం.మీ., 6 సెం.మీ., 10 సెం.మీ. | (C) సమద్విబాహు త్రిభుజము |
iii) 6 సెం.మీ., 6 సెం.మీ., 6 సెం.మీ. | (A) సమబాహు త్రిభుజం |
ప్రశ్న3.
త్రిభుజ కోణాల కొలతలు, త్రిభుజ రకానికి జతపరుచుము.
i) 60°, 60°, 60° | (A) లంబకోణ త్రిభుజము |
ii) 50°, 65°, 65° | (B) సమబాహు త్రిభుజము |
iii) 90°, 40°, 50° | (C) అధికకోణ త్రిభుజము |
iv) 110°, 30°, 40° | (D) సమద్విబాహు త్రిభుజము |
జవాబు :
i) 60°, 60°, 60° | (B) సమబాహు త్రిభుజము |
ii) 50°, 65°, 65° | (D) సమద్విబాహు త్రిభుజము |
iii) 90°, 40°, 50° | (A) లంబకోణ త్రిభుజము |
iv) 110°, 30°, 40° | (C) అధికకోణ త్రిభుజము |
క్రింది వానిలో సత్యం లేదా అసత్య వాక్యాలను గుర్తించండి.
ప్రశ్న1.
ఒక త్రిభుజంలో రెండు లంబకోణాలు ఉండవచ్చును.
జవాబు :
అసత్యం
ప్రశ్న2.
ఒక త్రిభుజం రెండు అల్పకోణాలు కలిగి ఉండవచ్చును.
జవాబు :
సత్యం
ప్రశ్న3.
త్రిభుజం ఒకే ఒక అధిక కోణమును కలిగి ఉండవచ్చును.
జవాబు :
సత్యం
ప్రశ్న4.
త్రిభుజంలోని రెండు కోణాల మొత్తం 90° అయిన అది లంబకోణ త్రిభుజం.
జవాబు :
సత్యం
ప్రశ్న5.
త్రిభుజంలో అతిపెద్ద భుజానికి ఎదురుగా గల కోణము, మిగిలిన రెండు భుజాల కన్నా చిన్నది.
జవాబు :
అసత్యం
ప్రశ్న6.
త్రిభుజంలో శీర్షం నుండి ఎదుటి భుజానికి గీచిన లంబరేఖాఖండాన్ని ఉన్నతి అంటారు.
జవాబు :
సత్యం