Practice the AP 7th Class Maths Bits with Answers 3rd Lesson సామాన్య సమీకరణాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 7th Class Maths Bits 3rd Lesson సామాన్య సమీకరణాలు

క్రింది వానికి సరైన సమాధానాలను ఎన్నుకొనుము.

ప్రశ్న1.
“ఒక సంఖ్యకు 4 కలిపిన 10 వస్తుంది” ను సూచించు సామాన్య సమీకరణం
(A) x + 10 = 4
(B) x + 4 = 10
(C) 4x = 10
(D) x – 4 = 10
జవాబు :
(B) x + 4 = 10

ప్రశ్న2.
క్రింది వానిలో సామాన్య సమీకరణము
(A) 2m + 4 = 7
(B) 2m + 5n = 9
(C) x2 + 4x + 5 = 0
(D) 2x + 3 = 4y – 5
జవాబు :
(A) 2m + 4 = 7

ప్రశ్న3.
2x + 5 = 9 యొక్క సాధన
(A) 9
(B) 3
(C) 2
(D) -2
జవాబు :
(C) 2

AP 7th Class Maths Bits 3rd Lesson సామాన్య సమీకరణాలు

ప్రశ్న4.
క్రిందివానిలో ఏది x = – 1 ను సాధనగా కలిగిన సామాన్య సమీకరణం ?
(A) 5x + 6 =7
(B) 3x + 2 = 4x + 3
(C) x + 4 =-3
(D) 25 – 2 = 3x + 1
జవాబు :
(B) 3x + 2 = 4x + 3

ప్రశ్న5.
క్రింది ఏ సామాన్య సమీకరణం యొక్క సాధన ఒక సహజ సంఖ్య ?
(A) 5x = 7
B ) x + 7 = 5
(C) 2x + 3 = 3
(D) x + 4 = 6
జవాబు :
(D) x + 4 = 6

ప్రశ్న6.
క్రింది పటంలో x విలువ
AP 7th Class Maths Bits 3rd Lesson సామాన్య సమీకరణాలు 1
(A) 50°
(B) 100°
(C) 30°
(D) 1800
జవాబు :
(B) 100°

ప్రశ్న7.
ప్రవచనం X : ఒక సమీకరణం యొక్క ఇరువైపులా ఒకే సంఖ్యను కూడినచో సమానత్వ గుర్తు మారదు. ప్రవచనం Y : x2 – 3x + 4 = 0 అనునది ఒక సామాన్య సమీకరణము.
(A) X – సత్యం, Y – అసత్యం
(B) X – అసత్యం, Y – సత్యం
(C) X మరియు Y లు రెండూ సత్యం
(D) X మరియు Y లు రెండూ అసత్యం
జవాబు :
(A) X – సత్యం, Y – అసత్యం

ప్రశ్న8.
“క్రింది త్రిభుజం యొక్క చుట్టుకొలత 40 యూనిట్లు”. ఇచ్చిన సమాచారాన్ని సూచించు సామాన్య సమీకరణం
AP 7th Class Maths Bits 3rd Lesson సామాన్య సమీకరణాలు 2
(A) 2x + 5 = 40
(B) 2x + 15 = 40
(C) 2x + 30 = 40
(D) 2x + 25 = 40
జవాబు :
(C) 2x + 30 = 40

ప్రశ్న9.
క్రింది పటంలో AB = 15 మీ., AM = 3x మీ., MB = 3 మీ. అయిన X విలువ కనుగొనుటకు క్రింది ఏ సమీకరణం సరైనది ?
AP 7th Class Maths Bits 3rd Lesson సామాన్య సమీకరణాలు 3
(A) 3x + 3 = 15
(B) 15 – 3x = 3
(C) 3x = 15 – 3
(D) పైవి అన్ని
జవాబు :
(D) పైవి అన్ని

ప్రశ్న10.
“ఒక సంఖ్య యొక్క 4వ వంతు కన్నా 5 తక్కువైన సంఖ్య 6” ను సూచించు సమీకరణం
(A) \(\frac{x}{4}\) – 5 = 6
(B) \(\frac{x}{4}\) – 6 = 5
(C) 4x – 5 = 6
(D) 4x – 6 = 5
జవాబు :
(A) \(\frac{x}{4}\) – 5 = 6

ప్రశ్న11.
ax = b సమీకరణంలో a, b లు రుణ సంఖ్యలైన x విలువ ఎల్లప్పుడూ .
(A) ధన సంఖ్య
(B) రుణ సంఖ్య
(C) 0
(D) 1
జవాబు :
(A) ధన సంఖ్య

ప్రశ్న12.
క్రింది ఏ సామాన్య సమీకరణం యొక్క సాధన ఒక పూర్ణాంకం కాదు ?
(A) 3x – 4 = 2
(B) 2x + 3 = 6
(C) \(\frac{y}{3}\) =-2
(D) 2k + 3 = 3
జవాబు :
(B) 2x + 3 = 6

→ క్రింది లంబకోణ త్రిభుజంలో ∠A = 90°, ∠B = x°, ∠C = (x + 10)° ఈ సమాచారం ఆధారంగా క్రింది. 13 నుండి 15 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 7th Class Maths Bits 3rd Lesson సామాన్య సమీకరణాలు 4

ప్రశ్న13.
x విలువను కనుగొనుటకు క్రిందివానిలో ఏది సరైన సమీకరణం ?
(A) 2x + 10 = 180
(B) 2x + 100 = 180
(C) 2x + 80 = 180
(D) x + 90 = x + 10
జవాబు :
(B) 2x + 100 = 180

AP 7th Class Maths Bits 3rd Lesson సామాన్య సమీకరణాలు

ప్రశ్న14.
పై పటం నుండి x విలువ
(A) 50
(B) 90
(C) 80
(D) 40
జవాబు :
(D) 40

ప్రశ్న15.
పై పటం నుండి, క్రిందివానిలో ఏది సరైనది ?
1) 2x + 10 = 90°
ii) 2x + 100 = 180°
(A) i) మాత్రమే
(B) ii) మాత్రమే
(C) i) మరియు ii)
(D) రెండూ కాదు
జవాబు :
(C) i) మరియు ii)

ప్రశ్న16.
2x – 3 = 1 యొక్క తుల్య సమీకరణము
(A) 4x = 2
(B) x + 1 = 3
(C) 3x – 5 = 1
(D) పైవి అన్నీ
జవాబు :
(D) పైవి అన్నీ

ప్రశ్న17.
3k + 4 = 25 యొక్క సాధన
(A) k = 5
(B) k = 7
(C) k = -5
(D) k = -7
జవాబు :
(B) k = 7

ప్రశ్న18.
5x – 3 = 7 ను వాక్యరూపంలో తెలుపగా
(A) X యొక్క 5 రెట్లు కన్నా 3 ఎక్కువైన సంఖ్య 7.
(B) X యొక్క 3 రెట్లు కన్నా 5 తక్కువైన సంఖ్య 7.
(C) x యొక్క 5 రెట్లు కన్నా 3 తక్కువైన సంఖ్య 7.
(D) X యొక్క 5 వ వంతు కన్నా 3 తక్కువైన సంఖ్య 7.
జవాబు :
(C) x యొక్క 5 రెట్లు కన్నా 3 తక్కువైన సంఖ్య 7.

ప్రశ్న19.
క్రింది చతురస్రం ABCD యొక్క చుట్టుకొలత 40 సెం.మీ. క్రింది వానిలో ఏది సత్యం ?
AP 7th Class Maths Bits 3rd Lesson సామాన్య సమీకరణాలు 5
(A) 4y = 40 సెం.మీ.
(B) y = 10 సెం.మీ.
(C) A మరియు B
(D) y = 40 సెం.మీ.
జవాబు :
(C) A మరియు B

క్రింది ఖాళీలను పూరింపుము.

ప్రశ్న1.
5x – 10 = 3 లో చరరాశి _________
జవాబు :
x

ప్రశ్న2.
y – 5 = 3 అయిన y = _________
జవాబు :
8

ప్రశ్న3.
“k కు 7 కలిపిన 10 వస్తుంది” యొక్క సామాన్య సమీకరణ రూపం _________
జవాబు :
k + 7 = 10

ప్రశ్న4.
2y = 15 యొక్క వాక్య రూపం _________
జవాబు :
y యొక్క 2 రెట్లు 15

ప్రశ్న5.
6n – 5 = 13 లో RHS = _________
జవాబు :
13

ప్రశ్న6.
3x – 7 = 5 యొక్క సాధన x = _________
జవాబు :
4

AP 7th Class Maths Bits 3rd Lesson సామాన్య సమీకరణాలు

ప్రశ్న7.
ఒక సంఖ్య యొక్క 5 రెట్లు . కన్నా 4 ఎక్కువైన సంఖ్య 24ను సామాన్య సమీకరణంలో వ్యక్తపరచగా _________
జవాబు :
5x + 4 = 24

ప్రశ్న8.
2x – 1 = 5 అయిన 5x + 2 విలువ _________
జవాబు :
17

ప్రశ్న9.
ఒక సంఖ్య యొక్క 3 రెట్లునకు 2 కలిపిన 14 వస్తుంది. అయిన ఆ సంఖ్య _________
జవాబు :
3x + 2 = 14

ప్రశ్న10.
6(x – 3) = 12 అయిన x = _________
జవాబు :
5

ప్రశ్న11.
ఒక సంఖ్య యొక్క 6 రెట్లు – 30 అయిన ఆ సంఖ్య _________
జవాబు :
-5

ప్రశ్న12.
5 – 3m = 1 అయిన m.= _________
జవాబు :
\(\frac{4}{3}\)

ప్రశ్న13.
‘రెండు సంఖ్యల మొత్తం 45. అందులో ఒక సంఖ్య, రెండవ సంఖ్య కన్నా 5 ఎక్కువ”. పై సమాచారాన్ని సూచించు సామాన్య సమీకరణం _________
జవాబు :
2x + 5 = 45

ప్రశ్న14.
పై 13వ సమస్యలో చిన్న సంఖ్య _________
జవాబు :
20

→ క్రింది పటంలో ∠AOB = 90° అయిన క్రింది 15, 16 ప్రశ్నలకు సమాధానాలను రాయండి.
AP 7th Class Maths Bits 3rd Lesson సామాన్య సమీకరణాలు 6

ప్రశ్న15.
ఇచ్చిన సమాచారాన్ని సూచించు సామాన్య సమీకరణం _________
జవాబు :
4x + 10 = 90°

ప్రశ్న16.
పై పటం నుండి, x = _________
జవాబు :
20

జతపరుచుము:

ప్రశ్న1.

i) \(\frac{1}{2}\) అయిన m = (A) 2
ii) 40 – 23 = 9 అయిన n = (B) 4
iii) 9(x + 1) = 27 అయిన x = (C) 6
iv) y + 7 = 2y + 3 అయిన y = (D) 8

జవాబు :

i) \(\frac{1}{2}\) అయిన m = (C) 6
ii) 40 – 23 = 9 అయిన n = (D) 8
iii) 9(x + 1) = 27 అయిన x = (A) 2
iv) y + 7 = 2y + 3 అయిన y = (B) 4

ప్రశ్న2.

i) -1 సాధనగా గల సమీకరణం (A) 2x + 3 = -1
ii) 1 సాధనగా గల సమీకరణం (B) x + 4 = 3
iii) -2 సాధనగా గల సమీకరణం (C) x – 2 = 0
iv) 2 సాధనగా గల సమీకరణం (D) 3(x + 1) = 6

జవాబు :

i) -1 సాధనగా గల సమీకరణం (B) x + 4 = 3
ii) 1 సాధనగా గల సమీకరణం (D) 3(x + 1) = 6
iii) -2 సాధనగా గల సమీకరణం (A) 2x + 3 = -1
iv) 2 సాధనగా గల సమీకరణం (B) x + 4 = 3

AP 7th Class Maths Bits 3rd Lesson సామాన్య సమీకరణాలు

ప్రశ్న3.
క్రిందివాని యొక్క తుల్య సమీకరణానికి జతపరచడంలో సరైన సమాధానాన్ని ఎన్నుకొనుము.

i) x + 1 = 2 (A) x + 1 = 4
ii) x – 3 = 1 (B) 2x + 1 = 9
iii) 2x + 1 = 5 (C) 3x + 1 = 4
iv) 2x = 6 (D) 4x + 1 = 9.

జవాబు :

i) x + 1 = 2 (C) 3x + 1 = 4
ii) x – 3 = 1 (B) 2x + 1 = 9
iii) 2x + 1 = 5 (D) 4x + 1 = 9.
iv) 2x = 6 (A) x + 1 = 4

ప్రశ్న4.
క్రింది సమీకరణాలను గణిత వాక్య రూపానికి జతపరుచుము.

i) x – 1 = 10 (A) ఒక సంఖ్య X యొక్క 3వ వంతు కన్నా 2 ఎక్కువైన సంఖ్య 10
ii) 2x = 10 (B) ఒక సంఖ్య X కన్నా 1 తక్కువైన సంఖ్య 10
iii) 3x + 1 = 10 (C) ఒక సంఖ్య X యొక్క రెట్టింపు 10
iv) \(\frac{x}{3}\) + 2 = 10 (D) ఒక సంఖ్య x యొక్క 3 రెట్లు కన్నా ఒకటి ఎక్కువైన సంఖ్య 10

జవాబు :

i) x – 1 = 10 (B) ఒక సంఖ్య X కన్నా 1 తక్కువైన సంఖ్య 10
ii) 2x = 10 (C) ఒక సంఖ్య X యొక్క రెట్టింపు 10
iii) 3x + 1 = 10 (D) ఒక సంఖ్య x యొక్క 3 రెట్లు కన్నా ఒకటి ఎక్కువైన సంఖ్య 10
iv) \(\frac{x}{3}\) + 2 = 10 (A) ఒక సంఖ్య X యొక్క 3వ వంతు కన్నా 2 ఎక్కువైన సంఖ్య 10

AP 7th Class Maths Bits 3rd Lesson సామాన్య సమీకరణాలు

ప్రశ్న5.
గణిత వాక్యాలను సూచించు సామాన్య సమీకరణానికి జతపరచండి.

i) X యొక్క 5 రెట్లు మరియు 3 ల మొత్తం 23 (A) \(\frac{x}{5}\) – 3 = 23
ii) x లో 3 వ వంతు కన్నా 23 ఎక్కువైన సంఖ్య 5 . (B) 3x + 5 = 23
iii) x యొక్క 3 రెట్లుకు 5 కలిపిన 23 వస్తుంది (C) 5x + 3 = 23
iv)x యొక్క 5 వ వంతు కన్నా 3 తక్కువైన సంఖ్య 23 (D) \(\frac{x}{3}\) + 23 = 5

జవాబు :

i) x యొక్క 5 రెట్లు మరియు 3 ల మొత్తం 23 (C) 5x + 3 = 23
ii) x లో 3 వ వంతు కన్నా 23 ఎక్కువైన సంఖ్య 5 . (D) \(\frac{x}{3}\) + 23 = 5
iii) x యొక్క 3 రెట్లుకు 5 కలిపిన 23 వస్తుంది (B) 3x + 5 = 23
iv) x యొక్క 5 వ వంతు కన్నా 3 తక్కువైన సంఖ్య 23 (A) \(\frac{x}{5}\) – 3 = 23