Practice the AP 6th Class Social Bits with Answers 2nd Lesson గ్లోబు – భూమికి నమూనా on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 6th Class Social Bits 2nd Lesson గ్లోబు – భూమికి నమూనా
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. ఉత్తర, దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి మధ్య గుండా గీయబడిన ఊహారేఖ.
A) అక్షాంశం
B) రేఖాంశం
C) భూమధ్యరేఖ
D) అక్షం
జవాబు:
D) అక్షం
2. భూమిని రెండు సమాన అర్ధభాగాలుగా చేయురేఖ.
A) భూమధ్యరేఖ
B) కర్కటరేఖ
C)మకరరేఖ
D) అక్షం
జవాబు:
A) భూమధ్యరేఖ
3. మొత్తం రేఖాంశాలు.
A) 360
B) 180
C) 90
D) 270
జవాబు:
A) 360
4. ఏ అర్ధగోళంలో నీరు ఎక్కువగా ఉంది.
A) ఉత్తరార్ధగోళం
B) దక్షిణార్ధగోళం
C) పశ్చిమార్ధగోళం
D) పూర్వార్ధగోళం
జవాబు:
B) దక్షిణార్ధగోళం
5. అక్షాంశాలలో పొడవైన అక్షాంశం
A) కర్కటరేఖ
B) మకర రేఖ
C) భూమధ్య రేఖ
D) ఆర్కిటిక్ వలయం
జవాబు:
C) భూమధ్య రేఖ
6. భూమధ్య రేఖ నుండి ఉత్తర ధృవం వరకు గల అర్ధగోళం
A) ఉత్తరార్ధగోళం
B) దక్షిణార్ధగోళం
C) పశ్చిమార్ధగోళం
D) పూర్వార్ధగోళం
జవాబు:
A) ఉత్తరార్ధగోళం
7. 0° రేఖాంశాన్ని ఇలా పిలుస్తారు.
A) భూమధ్య రేఖ
B) గ్రీనిచ్ రేఖ
C) అంతర్జాతీయ రేఖ
D) పైవన్నీ
జవాబు:
B) గ్రీనిచ్ రేఖ
8. అంతర్జాతీయ దినరేఖ అని దేనినంటారు?
A) 0° రేఖాంశం
B) 0° అక్షాంశం
C) 180° రేఖాంశం
D) 90° రేఖాంశం
జవాబు:
C) 180° రేఖాంశం
9. గ్లోబల్ అనే పదం ‘గ్లోబస్’ అనే ఈ భాష పదం నుండి వచ్చింది.
A) లాటిన్
B) గ్రీకు
C) రోమన్
D) ఫ్రెంచి
జవాబు:
A) లాటిన్
10. అక్షాంశం (లాటిట్యూడ్) అనే పదం ‘లాటిట్యూడో’ అను లాటిన్ పదం నుండి వచ్చినది. దీని అర్థం ఏమిటి?
A) పొడవు
B) వెడల్పు
C) ఎత్తు
D) లావు
జవాబు:
B) వెడల్పు
11. 0° రేఖాంశాన్ని ఇలా పిలుస్తారు.
A) ముఖ్య రేఖాంశం
B) ప్రామాణిక రేఖాంశం
C) గ్రీనిచ్ రేఖాంశం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
12. ‘లాంగిట్యూడో అనే లాటిన్ పదంనకు అర్థం
A) పొడవు
B) వెడల్పు
C)మందం
D) పరిధి
జవాబు:
A) పొడవు
13. భూమి యొక్క వాతావరణ విభజన వీని సహాయంతో అధ్యయనం చేయవచ్చు.
A) అక్షాంశాలు
B) రేఖాంశాలు
C) A & B
D) ఏదీకాదు
జవాబు:
A) అక్షాంశాలు
14. రాత్రి పగలు ఏర్పడటానికి కారణమైన భూ చలనం.
A) భూభ్రమణం
B) భూపరిభ్రమణం
C) రెండూ
D) ఏదీకాదు
జవాబు:
A) భూభ్రమణం
15. ఋతువులు ఏర్పడటానికి కారణమైన భూ చలనం
A) భూభ్రమణం
B) భూపరిభ్రమణం
C) రెండూ
D) ఏదీకాదు
జవాబు:
B) భూపరిభ్రమణం
16. భూ కక్ష్య పొడవు
A) 965 మి||కి.మీ.
B) 1610 మి||కి.మీ.
C) 695 మి||కి.మీ.
D) 569 మి॥కి.మీ.
జవాబు:
A) 965 మి||కి.మీ.
17. సూర్యుని కిరణాలు కర్కటరేఖపై నిట్టనిలువుగా పడే
A) జూన్ 21
B) డిసెంబర్ 22
C) మార్చి 21
D) సెప్టెంబర్ 23
జవాబు:
A) జూన్ 21
18. సూర్యుని కిరణాలు మకరరేఖపై నిట్టనిలువుగా పడే రోజు.
A) జూన్ 21
B) డిసెంబర్ 22
C) మార్చి 21
D) సెప్టెంబర్ 23
జవాబు:
B) డిసెంబర్ 22
19. లీపు సంవత్సరంలో ఎన్ని రోజులుంటాయి?
A) 365
B) 365
C) 366
D) 364
జవాబు:
C) 366
20. భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే ఈ గ్రహణం సంభవిస్తుంది.
A) చంద్రగ్రహణం
B) సూర్యగ్రహణం
C) రెండూ
D) ఏదీకాదు
జవాబు:
B) సూర్యగ్రహణం
21. భూమిమీద ఉన్న సమస్త జీవరాశి మనుగడకు మూలం.
A) చంద్రుడు
B) సూర్యుడు
C) నక్షత్రరాశులు
D) పైవన్నీ
జవాబు:
B) సూర్యుడు
22. క్రిస్టమస్ వేడుకలు ఆస్ట్రేలియాలో ఏ కాలంలో జరుపుకుంటారు?
A) వర్షాకాలం
B) శీతాకాలం
C) వేసవికాలం
D) ఏదీకాదు
జవాబు:
C) వేసవికాలం
23. క్రింది పటంలో ‘0’ డిగ్రీ రేఖాంశమునకు ఆవలివైపు ఉన్న రేఖాంశం ఏది?
A) 180 డిగ్రీల రేఖాంశం
B) ‘0’ డిగ్రీ రేఖాంశం
C) 150 డిగ్రీల తూర్పు రేఖాంశం
D) 150 డిగ్రీల పశ్చిమ రేఖాంశం
జవాబు:
A) 180 డిగ్రీల రేఖాంశం
II. ఖాళీలను పూరించుట
కింది ఖాళీలను పూరింపుము
1. భూమి గుండ్రంగా ఉందని ………….. శతాబంలో నావికులు ధృవీకరించారు.
2. పురాతన గోబును 1492లో …………… రూపొందించాడు.
3. ఆధునిక గ్లోబును 1570లో ………….. రూపొందించాడు.
4. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని ………….. అంటారు.
5. ఉత్తర ధృవం, ఆర్కిటిక్ వలయం, కర్కటరేఖలు ………… గోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు.
6. దక్షిణ ధృవం, అంటార్కిటిక్ వలయం, మకర రేఖలు ………….
7. అతిపెద్ద అక్షాంశం ………….
8. మధ్యాహ్నా రేఖలు అని ……… ను అంటారు.
9. 180° తూర్పు, పశ్చిమ రేఖాంశం ………….
10. భూమి తన అక్షంపై ………. నుండి ……… వైపుకు తిరుగుతుంది.
11. భూమి తన అక్షంపై ……….. కి.మీ||ల వేగంతో తిరుగుతుంది.
12. భూమి ఒకసారి తనచుట్టూ తిరిగి రావడానికి, పట్టుకాలం ……………..
13. భూమి యొక్క కక్ష్య ……… ఆకారంలో ఉంటుంది.
14. లీపు సంవత్సరంలో ………. నెలకు అదనపు రోజు కలుపబడుతుంది.
15. రాత్రి, పగలు సమానంగా ఉండే రోజులను ………. అంటారు.
16. చంద్రుడు, భూమి యొక్క నీడలోకి వెళ్ళినప్పుడు ………. గ్రహణం ఏర్పడుతుంది.
జవాబు:
- 15వ
- మార్టిన్ బెహైమ్
- టకి-ఆల్-దిన్
- దక్షిణార్ధ గోళం
- ఉత్తరార్ధ
- దక్షిణార్ధ
- భూమధ్యరేఖ/0 అక్షాంశం
- రేఖాంశాల
- అంతర్జాతీయ దినరేఖ
- పడమర, తూర్పు
- 1610
- 23 గంటల, 56 ని॥ల 4.09 సెకనలు
- దీర్ఘవృత్తాకారం
- ఫిబ్రవరి
- విషవత్తులు
- చంద్ర
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
Group-A | Group-B |
i) 0 డిగ్రీ అక్షాంశం | a) 360 |
ii) 0 డిగ్రీ రేఖాంశం | b) ధృవం |
iii) స్థిరబిందువు | c) భూమధ్యరేఖ |
iv) అక్షాంశాలు | d) 180 |
v) రేఖాంశాలు | e) గ్రీనిచ్ రేఖ |
జవాబు:
Group-A | Group-B |
i) 0 డిగ్రీ అక్షాంశం | c) భూమధ్యరేఖ |
ii) 0 డిగ్రీ రేఖాంశం | e) గ్రీనిచ్ రేఖ |
iii) స్థిరబిందువు | b) ధృవం |
iv) అక్షాంశాలు | d) 180 |
v) రేఖాంశాలు | a) 360 |
2.
Group – A | Group- B |
i) 23 ½ డిగ్రీల ఉత్తర అక్షాంశం | a) అంటార్కిటిక్ వలయం |
ii) 23 ½ డిగ్రీల దక్షిణ అక్షాంశం | b) ఆర్కిటిక్ వలయం |
iii) 66 ½ డిగ్రీల ఉత్తర అక్షాంశం | c) మకర రేఖ |
iv) 66 ½ డిగ్రీల దక్షిణ అక్షాంశం | d) కర్కట రేఖ |
v) 82 ½ డిగ్రీల తూర్పు రేఖాంశం | e) భారత కాలమాన ప్రామాణిక రేఖ |
జవాబు:
Group – A | Group- B |
i) 23 ½ డిగ్రీల ఉత్తర అక్షాంశం | d) కర్కట రేఖ |
ii) 23 ½ డిగ్రీల దక్షిణ అక్షాంశం | c) మకర రేఖ |
iii) 66 ½ డిగ్రీల ఉత్తర అక్షాంశం | b) ఆర్కిటిక్ వలయం |
iv) 66 ½ డిగ్రీల దక్షిణ అక్షాంశం | a) అంటార్కిటిక్ వలయం |
v) 82 ½ డిగ్రీల తూర్పు రేఖాంశం | e) భారత కాలమాన ప్రామాణిక రేఖ |