These AP 6th Class Science Important Questions 3rd Lesson జంతువులు – ఆహారం will help students prepare well for the exams.

AP Board 6th Class Science 3rd Lesson Important Questions and Answers జంతువులు – ఆహారం

6th Class Science 3rd Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
శాకాహారులను నిర్వచించండి.
జవాబు:
మొక్కలను మరియు మొక్కల ఉత్పత్తులను మాత్రమే తినే జంతువులను శాకాహారులు అంటారు.

ప్రశ్న 2.
మాంసాహారులను నిర్వచించండి.
జవాబు:
జంతువులను మాత్రమే తినే జంతువులను మాంసాహారులు అంటారు.

ప్రశ్న 3.
సర్వ ఆహారులు నిర్వచించండి.
జవాబు:
మొక్కలు మరియు జంతువులు రెండింటినీ ఆహారంగా తీసుకొనే జంతువులను సర్వ ఆహారులు అంటారు.

ప్రశ్న 4.
ఫలాహార జంతువులు అంటే ఏమిటి?
జవాబు:
కొన్ని జంతువులు ఎక్కువగా పండ్లనే తింటాయి. కూరగాయలు, వేర్లు , రెమ్మలు, కాయలు మరియు విత్తనాల వంటి రసమయమైన పండ్లను తినే జంతువులను ఫలాహార జంతువులు అంటారు.

ప్రశ్న 5.
ఏవి ఫలాహార జంతువులు?
జవాబు:
క్షీరద శాకాహారులు సాధారణంగా ఫలాహార జంతువులు.

AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం

ప్రశ్న 6.
ఆహారాన్ని గుర్తించటానికి జంతువులు ఉపయోగించే ఇంద్రియాలు ఏమిటి?
జవాబు:
వాసన, దృష్టి, వినికిడి, రుచి మరియు స్పర్శ ద్వారా ఆహారాన్ని గుర్తించటానికి జంతువులు విస్తృతమైన ఇంద్రియ జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి.

ప్రశ్న 7.
జంతువుల శరీరంలోని ఏ భాగాలను ఆహారాన్ని సేకరించడానికి ఉపయోగిస్తాయి?
జవాబు:
చాలా జంతువులు తమ శరీరంలోని నోరు, చేతులు లేదా పాదాలు, దంతాలు, పంజాలు మరియు నాలుక వంటి వాటిని ఆహారాన్ని సేకరించడానికి ఉపయోగిస్తాయి.

ప్రశ్న 8.
ఆహారాన్ని కనుగొనడానికి నిశిత దృష్టిని ఉపయోగించే జంతువులకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
రాబందు మరియు గ్రద్ద వాటి ఆహారాన్ని కనుగొనడానికి వాటి నిశిత దృష్టిని ఉపయోగిస్తాయి.

ప్రశ్న 9.
ఆహారాన్ని కనుగొనడానికి స్పర్శ జ్ఞానము ఉపయోగించే జంతువులకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
కప్ప మరియు పాండ్ స్కేటర్లు వాటి ఆహారాన్ని కనుగొనడానికి స్పర్శ జ్ఞానము ఉపయోగిస్తాయి.

ప్రశ్న 10.
పాండ్ స్కేటర్లు అంటే ఏమిటి?
జవాబు:
పాండ్ స్కేటర్లు చెరువు యొక్క ఉపరితలంపై నివసించే కీటకాలు. ఇవి ఇతర కీటకాలను తింటాయి.

ప్రశ్న 11.
ఆహారాన్ని తీసుకోవడానికి నాలుకను సాధనంగా ఉపయోగించే కొన్ని జంతువుల పేర్లు చెప్పండి.
జవాబు:
కప్ప, బల్లి, కుక్క, ఊసరవెల్లి, ఎకిడ్నా మొదలైనవి.

ప్రశ్న 12.
జలగ ఆహారాన్ని తీసుకోవడానికి ఏ భాగం సహాయపడుతుంది?
జవాబు:
నోటిలోని సక్కర్స్ జలగ ఆహారాన్ని తీసుకోవడానికి సహాయపడుతుంది.

AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం

ప్రశ్న 13.
బలమైన కొక్కెం ముక్కు మరియు పొడవైన ముక్కు ఉన్న పక్షుల పేర్లు వ్రాయండి.
జవాబు:
బలమైన కొక్కెం ముక్కు – రాబందు.
పొడవైన ముక్కు – కొంగ.

ప్రశ్న 14.
హమ్మింగ్ పక్షి తన ఆహారాన్ని ఎలా తీసుకుంటుంది?
జవాబు:
హమ్మింగ్ పక్షి దాని పొడవైన, సన్నని ముక్కుతో పువ్వుల నుండి తేనెను పీలుస్తుంది.

ప్రశ్న 15.
బాతు దంతాలు మరియు చేపల దంతాలలో ఏ సారూప్యత ఉంది?
జవాబు:
బాతు దంతాలు మరియు చేపల దంతాలు నీటి నుండి ఆహారాన్ని వడకట్టటానికి ఫిల్టర్లుగా పనిచేస్తాయి.

ప్రశ్న 16.
ఆవు నోటిలోని ఏ భాగాలు దాని ఆహారాన్ని తినడంలో పాల్గొంటాయి?
జవాబు:
దవడలు, దంతాలు మరియు నాలుక ఆవు ఆహారాన్ని తినడంలో పాల్గొంటాయి.

ప్రశ్న 17.
సహజ పారిశుద్ధ్య కార్మికులకు ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
కాకులు, రాబందులు సహజ పారిశుద్ధ్య కార్మికులకు ఉదాహరణ.

ప్రశ్న 18.
అడవి జంతువులకు వేటాడేందుకు ఏ భాగాలు సహాయపడతాయి?
జవాబు:
పులి మరియు సింహం వంటి అడవి జంతువులకు పరిగెత్తడానికి బలమైన కాళ్ళు, పట్టుకోవటానికి పదునైన పంజాలు మరియు మాంసాన్ని’ చీల్చడానికి పదునైన దంతాలు ఉంటాయి. ఇవి వాటి ఆహార సేకరణలో ఉపయోగపడతాయి.

ప్రశ్న 19.
కప్పలా ఆహారం పొందడానికి సమానమైన యంత్రాంగం ఏ జంతువులకు ఉంది?
జవాబు:
బల్లి మరియు ఊసరవెల్లి వాటి ఆహారాన్ని పొందడానికి కప్ప వలె నాలుకను ఉపయోగిస్తాయి. ఈ జంతువులు తమ నాలుకను దాని ఆహారాన్ని పట్టుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగిస్తాయి.

ప్రశ్న 20.
ఆహార గొలుసు అంటే ఏమిటి?
జవాబు:
ఒక నిర్దిష్ట ఆవాసంలోని వివిధ జీవుల మధ్య గల ఆహార సంబంధాన్ని ఆహార గొలుసు అంటారు.

AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం

ప్రశ్న 21.
ఆహార జాలకము నిర్వచించండి.
జవాబు:
ఆహార జాలకము అంటే ఒక నిర్దిష్ట ఆవాసంలో ఆహార గొలుసుల యొక్క సహజ సంధానం.

ప్రశ్న 22.
చీమలు కూడా మంచి రైతులు అని ఎలా చెప్పగలరు?
జవాబు:
చీమలు ఆకులను ముక్కలుగా చేసి, అవి తినే ఒక రకమైన ఫంగసను పెంచడానికి ఒక వేదికను సిద్ధం చేస్తాయి. కావున చీమలు కూడా మంచి రైతులు.

ప్రశ్న 23.
ఉత్పత్తిదారులు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఉత్పత్తిదారులు తమ సొంత ఆహారాన్ని తయారుచేసే జీవులు. ఉదా: అన్ని మొక్కలు.

ప్రశ్న 24.
ప్రాథమిక వినియోగదారులు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ఉత్పత్తిదారులను ఆహారముగా తీసుకొనే జీవులను ప్రాథమిక వినియోగదారులు అంటారు. ఉదా: జింక, ఆవు, మేక.

ప్రశ్న 25.
ద్వితీయ వినియోగదారులు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ప్రాథమిక వినియోగదారులను ఆహారముగా చేసుకొనే జీవులను ద్వితీయ వినియోగదారులు అంటారు.
ఉదా : కోడి, తోడేలు, నక్క చేప.

ప్రశ్న 26.
తృతీయ వినియోగదారులు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
ద్వితీయ వినియోగదారులను ఆహారంగా చేసుకొనే జీవులను తృతీయ వినియోగదారులు అంటారు.
ఉదా: పులి, సింహం.

AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం

ప్రశ్న 27.
విచ్చిన్న కారులు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు:
విచ్ఛిన్న కారులు సూక్ష్మజీవులు. అవి చనిపోయిన లేదా క్షీణిస్తున్న జీవులను విచ్చిన్నం చేస్తాయి.
ఉదా: బాక్టీరియా, శిలీంధ్రాలు.

6th Class Science 3rd Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కొన్ని జంతువులు జ్ఞానేంద్రియాలను ఇతర జీవుల కన్నా బలంగా ఉపయోగిస్తాయని మీరు ఎలా చెప్పగలరు?
జవాబు:
జంతువులు తమ ఆహారాన్ని పసిగట్టటానికి వివిధ మార్గాలను ఉపయోగిస్తాయి. అవి : వాసన, స్పర్శ, వినికిడి, దృష్టి మరియు రుచి. ఉదాహరణకు కుక్కలు వాసనను ఉపయోగిస్తాయి. రాబందు దృష్టిని ఉపయోగిస్తుంది. గబ్బిలాలు వినికిడిపై ఆధారపడి ఉంటాయి. కొన్ని సరీసృపాలు రుచిని గ్రహించటం ద్వారా ఆహారాన్ని సంపాదిస్తాయి.

ప్రశ్న 2.
పాండ్ స్కేటర్లు తమ ఆహారాన్ని ఎలా సంపాదిస్తాయి?
జవాబు:
పాండ్ స్కేటర్లు కీటకాలను తినడం వల్ల ఆహారం సంపాదిస్తాయి. ఇవి ఇతర కీటకాలు నీటిలో ఉత్పత్తి చేసే అలలను గుర్తిస్తాయి. ఈ అలల ఆధారంగా ఆహారం ఎంత దూరంలో ఉందో పసికడతాయి. పసిగట్టిన పాండ్ స్కేటర్ దూరాన్ని లెక్కించి దాని ఆహారాన్ని సంపాదిస్తుంది.

ప్రశ్న 3.
“ఒకే శరీర భాగాన్ని వేర్వేరు జంతువులు వేర్వేరు మార్గాల్లో ఉపయోగించవచ్చు”. మీరు దీన్ని ఎలా సమర్థించగలరు?
జవాబు:
ఒకే శరీర భాగాన్ని వేర్వేరు. జంతువులు వేర్వేరు మార్గాల్లో ఉపయోగించవచ్చు. ఉదా : కప్పతో పోలిస్తే కుక్క వేరే పద్ధతిలో నాలుకను ఉపయోగిస్తుంది. కప్ప ఆహారాన్ని పట్టుకుని మింగటానికి నాలుకను ఉపయోగిస్తే కుక్క తన నాలుకతో నాకుతూ తింటుంది.

ప్రశ్న 4.
“ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోవడానికి జంతువులు వివిధ శరీర భాగాలను ఉపయోగించవచ్చు.” దీనిని మీరు ఎలా అంగీకరిస్తారు?
జవాబు:
ఒకే రకమైన ఆహారాన్ని వేర్వేరు జంతువులు వాటి వివిధ శరీర భాగాలను ఉపయోగించి తీసుకుంటాయి. ఉదా : కీటకాలు, కోడి మరియు కప్పలకు ఆహారం. కానీ వీటి శరీర భాగాలు భిన్నంగా ఉంటాయి. కోళ్ళు కీటకాలను ఏరుకోవడానికి దాని ముక్కును ఉపయోగిస్తే , కప్పలు తమ నాలుకతో కీటకాలను పట్టుకుంటాయి.

AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం

ప్రశ్న 5.
జలగలు తమ ఆహారాన్ని ఎలా పొందుతాయి?
జవాబు:
మనం నీటి దగ్గర జలగలను చూస్తాము. జలగలు చర్మానికి అతుక్కుని, పశువుల రక్తాన్ని అలాగే మానవుల రక్తాన్ని పీలుస్తాయి. జలగల నోటిలో సక్కర్స్ అని పిలువబడే ప్రత్యేక నిర్మాణాలు ఉన్నాయి. సక్కర్ సహాయంతో, జలగ జంతువు నుండి రక్తాన్ని పీలుస్తుంది.

ప్రశ్న 6.
పక్షి ముక్కు ఆకారం దాని ఆహారానికి ఎలా సంబంధం కలిగి ఉంటుంది?
జవాబు:
పక్షుల ముక్కులు భిన్నంగా ఉంటాయి ఎందుకంటే పక్షులు రకరకాల ఆహారాన్ని తింటాయి. పక్షులు విత్తనాలు, పండ్లు, కీటకాలు, తేనె, చేపలు మరియు ఇతర చిన్న కీటకాలను తింటాయి. వేరు వేరు ఆహారం తినటానికి ఇవి వేరు వేరు ముక్కు ఆకారాలు కల్గి ఉంటాయి.

ప్రశ్న 7.
ఇతర పక్షుల కన్నా బాతు ముక్కు ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
బాతులు ఎక్కువగా జల పక్షులు. బాతులు దంతాలు కలిగి ఉంటాయి, కానీ అవి ఆవు లేదా సింహం దంతాలలా ఉండవు. ఆహారాన్ని నమలటానికి ఇవి ఉపయోగపడవు. అవి నీటి నుండి ఆహారాన్ని వడకట్టటానికి ఫిల్టర్లుగా పనిచేస్తాయి.

ప్రశ్న 8.
జంతువులు ఆహారాన్ని ఎలా తింటాయి?
జవాబు:
మొక్కలు మరియు జంతువులు మన పరిసరాలలో ఆహారానికి ప్రధాన వనరులు. ప్రతి జంతువుకు ఆహారాన్ని పొందటానికి ప్రత్యేక శైలి ఉంది. ఇవి ఆహారాన్ని గుర్తించి కొరికి తినటం, నమలటం, వేటాడటం ద్వారా ఆహారాన్ని సంపాదిస్తాయి. నోటిలోకి ఆహారాన్ని తీసుకోవడానికి శరీరంలోని వివిధ భాగాలను ఉపయోగిస్తాయి.

ప్రశ్న 9.
కప్ప దాని ఆహారాన్ని ఎలా సంపాదిస్తుంది?
జవాబు:
కప్ప దోమలు, సాలె పురుగులు, లార్వా మరియు చిన్న చేపలు తింటుంది. కప్ప తన నాలుకను తినే క్రిమి వైపుకు విసిరివేస్తుంది. అప్పుడు కీటకం కప్ప నాలుకపై చిక్కుకుంటుంది. కప్ప దానిని నోటిలోకి లాక్కొని మింగివేస్తుంది.

ప్రశ్న 10.
ఒక ఆవు తన ఆహారాన్ని ఎలా పొందుతుంది?
జవాబు:
ఆవు ఆహారం కోసం మొక్కల పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది శాకాహారి. ఆవులు ఆహారాన్ని త్వరగా నమిలి మింగి కడుపులో ఒక భాగంలో నిల్వ చేసుకొంటాయి. కొంత సమయం తరువాత, అవి ఆహార పదార్థాలను కడుపు నుండి నోటికి తిరిగి తీసుకొని మళ్ళీ నమలుతాయి. ఈ ప్రక్రియను నెమరు వేయుట అంటారు. ఈ ప్రక్రియలో దవడలు, నాలుక, దంతాలు తోడ్పడతాయి.

ప్రశ్న 11.
నెమరు వేయుట గురించి రాయండి.
జవాబు:
కొన్ని జంతువులు తిన్న ఆహారాన్ని కడుపులో నుండి. మరోసారి నోటిలోకి తెచ్చి నమలుతాయి. ఈ పక్రియను నెమరువేయుట అంటారు. ఈ ప్రక్రియ సాధారణంగా పశువులు, గొర్రెలు, మేక, జింక, ఒంటె, గేదె, జిరాఫీలు వంటి జంతువులలో కనిపిస్తుంది. దవడలు, నాలుక, దంతాలు ఈ ప్రక్రియలో పాల్గొంటాయి.

ప్రశ్న 12.
కుక్క తన ఆహారాన్ని ఎలా సంపాదిస్తుంది?
జవాబు:
కుక్క సర్వాహార జంతువు. ఇది ఆహారాన్ని వాసనతో గ్రహిస్తుంది. నోరు, దంతాలు, నాలుక, కాళ్ళు, గోర్లు ఆహారాన్ని తీసుకోవడంలో పాల్గొంటాయి. కుక్క తన నాలుకతో నీటిని గతుకుతూ త్రాగుతుంది.

AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం

ప్రశ్న 13.
ఆహార గొలుసు మరియు ఆహార జాలకం మధ్య వ్యత్యాసాన్ని గుర్తించండి.
జవాబు:

ఆహార గొలుసు ఆహార జాలకం
1. ఇది పర్యావరణ వ్యవస్థలో ఆహార ప్రవాహం యొక్క ఒకే మార్గం. 1. ఇది పర్యావరణ వ్యవస్థలో ఆహార ప్రవాహం యొక్క బహుళ మార్గాలు.
2. ఇది ఒక నిర్దిష్ట ఆవాసంలోని వివిధ జీవుల మధ్య ఆహార సంబంధం. 2. ఇది ఒక నిర్దిష్ట ఆవాసంలో ఆహార గొలుసుల యొక్క మధ్య గల సంబంధము.
3. దీనిని సరళ రేఖలో సూచించవచ్చు. 3. దీనిని విస్తరించిన శాఖలతో సూచించవచ్చు.
4. ఇది ఆహార జాలక మూల ప్రమాణం. 4. ఇది ఆహార గొలుసుల సంక్లిష్టము.

ప్రశ్న 14.
ఆహార గొలుసులో విచ్ఛిన్నకారుల ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
బాక్టీరియా మరియు శిలీంధ్రాలు ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారులు. ఇవి చనిపోయిన మొక్కలు మరియు జంతువులను విచ్ఛిన్నం చేస్తాయి. ఇవి మృత దేహాల పోషకాలను నేలలోకి తిరిగి చేర్చుతాయి. ఇవి ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు నేల మధ్య పదార్థాల చక్రీయానికి సహాయపడతాయి.

ప్రశ్న 15.
బాతు మరియు కొంగలో కనిపించే సారూప్యతలు మరియు తేడాలు ఏమిటి?
జవాబు:
బాతు మరియు కొంగ రెండూ జల పక్షులు. బాతు మరియు కొంగ నీటి నుండి ఆహారం పట్టుకోవడానికి వాటి ముక్కులను ఉపయోగిస్తాయి. చేపలను నీటిలో పట్టుకోవడానికి కొంగకు పొడవైన ముక్కు ఉంటుంది. బాతు ముక్కు వెడల్పుగా మరియు చదునుగా ఉండి దంతాలు కలిగి ఉంటుంది. నీటి నుండి ఆహారాన్ని పొందడానికి దంతాలు వడపోత సాధనంగా పనిచేస్తాయి.

ప్రశ్న 16.
కాకి యొక్క ముక్కుచిలుక ముక్కుకన్నా ఎలా భిన్నంగా ఉంటుంది?
జవాబు:
చిలుక మరియు కాకి రెండూ మొక్కలు మరియు జంతువులను తినే సర్వాహార జంతువులు. చిలుకలో పండ్లు తినడానికి మరియు గింజలను పగులగొట్టడానికి ముక్కు కొక్కెంలా ఉంది. ఇది కొమ్మలు ఎక్కడానికి మరియు ఆహారం పట్టుకోవటానికి కూడా ఉపయోగించబడుతుంది. కాకిలో పండ్లు, విత్తనాలు, కీటకాలు, చేపలు మరియు ఇతర చిన్న జంతువులను తినడానికి పెద్ద బలమైన ముక్కు ఉంటుంది.

ప్రశ్న 17.
సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటే ఏమిటి? ప్రకృతిలో దాని ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు:
పారిశుద్ధ్య కార్మికులు అంటే చనిపోయిన మరియు క్షీణిస్తున్న పదార్థాల నుండి ఆహారం పొందే జీవులు. ఇవి అన్ని వ్యర్థ పదార్థాలను తినడం ద్వారా పర్యావరణం శుభ్రంగా ఉండటానికి సహాయపడతాయి. వీటి వలన మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. కావున వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. ఉదా:కాకులు, రాబందులు మరియు కొన్ని కీటకాలు.

AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం

ప్రశ్న 18.
ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల మధ్య తేడా ఏమిటి?
జవాబు:

ఉత్పత్తిదారులు వినియోగదారులు
1. ఉత్పత్తిదారులు తమ ఆహారాన్ని తాము తయారు చేసుకుంటాయి. 1. వినియోగదారులు తమ ఆహారం కోసం మొక్కలు మరియు జంతువులపై ఆధారపడతాయి.
2. ఉత్పత్తిదారులు ఆహారాన్ని తయారు చేయడానికి సూర్యకాంతి నుండి శక్తిని పొందుతాయి. 2. వినియోగదారులు ఉత్పత్తిదారుల నుండి లేదా ఇతర వినియోగదారుల నుండి ఆహారము పొందుతాయి.
3. మొక్కలు ఉత్పత్తిదారులు. 3. జంతువులు వినియోగదారులు.
4. వీటిని స్వయం పోషకాలు అంటారు. 4. వీటిని పరపోషకాలు అంటారు.

ప్రశ్న 19.
చిలుక మరియు గ్రద్ద యొక్క ముక్కుల చక్కని రేఖాచిత్రాన్ని గీయండి.
జవాబు:
AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం 1

ప్రశ్న 20.
బాతు మరియు పిచ్చుక ముక్కుల చక్కని రేఖాచిత్రాన్ని గీయండి.
జవాబు:
AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం 2

ప్రశ్న 21.
ఆహార గొలుసులో ఆహారము ప్రవాహాన్ని చూపించే స్కీమాటిక్ రేఖాచిత్రాన్ని గీయండి.
జవాబు:
AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం 3

6th Class Science 3rd Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఏవైనా నాలుగు పక్షులు మరియు వాటి ఆహారపు అలవాట్లు మరియు వాటి ముక్కురకాలను పట్టిక రూపంలో రాయండి.
జవాబు:

పక్షి పేరు ఆహార అలవాట్లు ముక్కు రకం
1. వడ్రంగి పిట్ట చీమలు మరియు చెదలు పొడవైన మరియు బలమైన ముక్కు
2. కొంగ చేపలు పొడవైన సన్నని ముక్కు
3. రాబందు జంతువుల మాంసం పదునైన కొక్కెపు ముక్కు
4. చిలుక పండ్లు మరియు కాయలు వంపు తిరిగిన గట్టి ముక్కు

ప్రశ్న 2.
జంతువులు మరియు వాటి సమూహముల పేర్లు గురించి లైబ్రరీ లేదా ఇంటర్నెట్ నుండి సమాచారాన్ని సేకరించండి.
జవాబు:

జంతువులు వాటి సమూహముల పేర్లు
1. తేనెటీగ Beehive
2. మిడత Locust
3. ఒంటె Caravan
4. ఏనుగు A parade
5. చిరుత A leap
6. పులి Ambush
7. కంగారూ Mob
8. సింహం A pride
9. గుడ్లగూబ A parliament
10. పక్షులు Folk

ప్రశ్న 3.
చీమల అద్భుత ప్రపంచంపై ఒక నివేదిక రాయండి.
జవాబు:
చీమలు సామాజిక కీటకాలు, అంటే ఇవి ఒక సమూహంలో పనులను పంచుకోవడం ద్వారా జీవిస్తాయి. చీమల సమూహములు, సాధారణంగా ఒకే రాణి చీమ చేత పాలించబడతాయి. చీమల సమూహములో చీమలు కార్మికులు, సైనికులు, ఆడ, మగ చీమలుగా వర్గీకరించబడతాయి. కార్మికులు అనేక ఇతర విధులతో పాటు సమూహములోని ఇతరులకు ఆహారం సేకరించి నిల్వ చేస్తాయి. చీమలు తేనె హనీ డ్యూ అనే అఫిడను పెంచుతాయి. కావున చీమలు మంచి రైతులు కూడా. ఇవి ఆకులను ముక్కలుగా చేసి, ఒక రకమైన ఫంగసను పెంచడానికి ఒక వేదికను నిర్మిస్తాయి.

AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం

ప్రశ్న 4.
ఆహార గొలుసు స్థాయిలు ఏమిటి? వివరించండి.
జవాబు:
ఆహార గొలుసులో నాలుగు స్థాయిలు ఉన్నాయి. అవి
ఉత్పత్తిదారులు :
ఆహార గొలుసు యొక్క మొదటి స్థాయి. ఇవి స్వంతంగా తమ ఆహారాన్ని తయారు . చేసుకుంటాయి. మరియు ఇతర జీవులన్నింటికీ ఆహారాన్ని అందిస్తాయి.

ప్రాథమిక వినియోగదారులు :
ఇవి ఆహార గొలుసు యొక్క రెండవ స్థాయి. ఇవి ఆహారం కోసం ఉత్పత్తిదారులపై ఆధారపడతాయి. వీటిలో కీటకాలు, కుందేలు, ఆవు మొదలైన శాకాహారులు ఉంటాయి.

ద్వితీయ వినియోగదారులు :
ఇవి ఆహార గొలుసు యొక్క మూడవ స్థాయి. ఇవి తమ ఆహారం కోసం ప్రాథమిక వినియోగదారులపై ఆధారపడతాయి. వీటిలో పక్షులు, కప్ప, నక్క మొదలైన మాంసాహారులు ఉన్నాయి.

తృతీయ వినియోగదారులు :
ఇవి ఆహార గొలుసు యొక్క నాల్గవ లేదా ఉన్నత స్థాయి. ఇవి తమ ఆహారం కోసం ద్వితీయ వినియోగదారులపై ఆధారపడతాయి. వీటిలో ఇతర మాంసాహారులను తినే మాంసాహారులు ఉన్నాయి.
ఉదా : సింహం, గ్రద్ద , పులి మొదలైనవి.

ప్రశ్న 5.
పక్షుల వేర్వేరు ముక్కుల రేఖాచిత్రాలను గీయండి.
జవాబు:
AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం 4

AP Board 6th Class Science 3rd Lesson 1 Mark Bits Questions and Answers జంతువులు – ఆహారం

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. క్రిందివానిలో ఉత్పత్తిదారును గుర్తించండి.
A) నక్క
B) జింక
C) ఆకుపచ్చని మొక్క
D) పులి
జవాబు:
C) ఆకుపచ్చని మొక్క

2. క్రిందివానిలో ద్వితీయ వినియోగదారుని గుర్తించండి.
A) గేదె
B) జింక
C) కుందేలు
D) తోడేలు
జవాబు:
D) తోడేలు

3. క్రిందివానిలో ప్రాథమిక వినియోగదారుని గుర్తించండి.
A) సింహం
B) ఆవు
C) చేప
D) కొంగ
జవాబు:
B) ఆవు

4. క్రిందివానిలో తృతీయ వినియోగదారుని గుర్తించండి.
A) గొర్రెలు
B) మేక
C) ఉడుత
D) సింహం
జవాబు:
D) సింహం

5. క్రిందివానిలో విచ్ఛిన్నకారిని గుర్తించండి.
A) ఎద్దు
B) కుందేలు
C) ఎలుక
D) బాక్టీరియా
జవాబు:
D) బాక్టీరియా

AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం

6. కింది వాటిలో ఏది నెమరువేయు జీవి?
A) ఎలుక
B) ఆవు
C) పిల్లి
D) కుక్క
జవాబు:
B) ఆవు

7. సహజ పారిశుద్ధ్య కార్మికులను కనుగొనండి.
A) జింక
B) పాము
C) కాకి
D) కుక్క
జవాబు:
C) కాకి

8. పదునైన పంజాలు దేనిలో ఉన్నాయి?
A) కాకి
B) కొంగ
C) కోడి
D) రాబందులు
జవాబు:
D) రాబందులు

9. రాత్రిపూట చరించే జంతువును ఎంచుకోండి.
A) గొర్రె
B) గబ్బిలము
C) మేక
D) ఆవు
జవాబు:
B) గబ్బిలము

10. కింది వాటిలో పెంపుడు జంతువు ఏది?
A) కుక్క
B) పులి
C) సింహం
D) నక్క
జవాబు:
A) కుక్క

11. కింది వాటిలో ఏది ఫలాహార జంతువు?
A) పిల్లి
B) తోడేలు
C) కుక్క
D) ఏనుగు
జవాబు:
D) ఏనుగు

12. ఆహారాన్ని గ్రహించడానికి దృష్టిని ఉపయోగించే జంతువుకు ఉదాహరణ ఇవ్వండి.
A) గబ్బిలం
B) కుక్క
C) గ్రద్ద
D) ఏనుగు
జవాబు:
C) గ్రద్ద

13. రుచి ద్వారా ఆహారాన్ని గ్రహించే జంతువులు ఏమిటి?
A) కీటకాలు
B) చేపలు
C) పక్షులు
D) సరీసృపాలు
జవాబు:
D) సరీసృపాలు

14. ఏ జీవి కీటకాల ద్వారా- నీటిలో ఉత్పత్తి అయ్యే అలలను గుర్తించగలదు?
A) కప్పలు
B) తిమింగలాలు
C) పాండ్ స్కేటర్లు
D) చేపలు
జవాబు:
C) పాండ్ స్కేటర్లు

15. తేనెను తినే పక్షి
A) హమ్మింగ్ పక్షి
B) రాబందు
C) చిలుక
D) గ్రద్ద
జవాబు:
A) హమ్మింగ్ పక్షి

16. ఆహారం కోసం మొక్కలపై మాత్రమే ఆధారపడే జంతువులను ఏమంటారు?
A) మాంసాహారులు
B) శాకాహారులు
C) ఉభయాహారులు
D) ఉత్పత్తిదారులు
జవాబు:
B) శాకాహారులు

AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం

17. ఏ జీవులు పశువుల రక్తాన్ని పీలుస్తాయి?
A) సాలె పురుగు
B) బల్లులు
C) జలగ
D) వానపాములు
జవాబు:
C) జలగ

18. ఏ పక్షికి పొడవైన మరియు బలమైన ముక్కు ఉంది?
A) వడ్రంగి పిట్ట
B) చిలుక
C) గ్రద్ద
D) కాకి
జవాబు:
A) వడ్రంగి పిట్ట

19. బాతులు ఆహారం కోసం దంతాలను ఎలా ఉపయోగిస్తాయి?
A) పీల్చటం
B) రుబ్బటం
C) వడపోయటం
D) చూర్ణం చేయటం
జవాబు:
C) వడపోయటం

20. ఏ పక్షి మాంసాన్ని చీల్చడానికి పదునైన గోర్లు మరియు బలమైన ముక్కును ఉపయోగిస్తుంది?
A) వడ్రంగి పిట్ట
B) చిలుక
C) రాబందు
D) బాతు
జవాబు:
C) రాబందు

21. కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి.
A) ఆవు
B) పులి
C) గేదె
D) ఒంటె
జవాబు:
B) పులి

22. ఇతర జంతువులను ఆహారం కోసం వేటాడే జంతువును గుర్తించండి.
A) ఆవు
B) గేదె
C) ఒంటె
D) తోడేలు
జవాబు:
D) తోడేలు

23. పర్యావరణ వ్యవస్థలో ఆహార గొలుసు ఎల్లప్పుడూ దేవితో మొదలవుతుంది ?
A) ఉత్పత్తిదారులు
B) ప్రాథమిక వినియోగదారులు
C) ద్వితీయ వినియోగదారులు
D) విచ్ఛిన్నకారులు
జవాబు:
A) ఉత్పత్తిదారులు

24. విచ్చిన్న కారుల యొక్క ఇతర పేర్లు
A) ఉత్పత్తిదారులు
B) రీసైక్లర్లు
C) వినియోగదారులు
D) శాకాహారులు
జవాబు:
B) రీసైక్లర్లు

25. తేనె కోసం చీమలు దేనిని పెంచుతాయి?
A) దోమలు
B) పురుగులు
C) అఫిడ్స్
D) సాలెపురుగులు
జవాబు:
C) అఫిడ్స్

26. ఇచ్చిన ఆహార గొలుసులో X ని పూరించండి.
మొక్కలు→ కుందేలు→ X→ సింహం
A) ఎలుక
B) పాము
C) మేక
D) అడవి పిల్లి
జవాబు:
D) అడవి పిల్లి

AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం

27. కింది ఆహార గొలుసును పూర్తి చేయండి.
ధాన్యాలు→ ఎలుక→ పిల్లి ……→ సింహం
A) జింక
B) నక్క
C) కుందేలు
D) ఆవు
జవాబు:
B) నక్క

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. ఆహారం కోసం మొక్కలు మరియు జంతువులపై ఆధారపడే జంతువులను …………. అంటారు.
2. ఆహారం కోసం మొక్కలపై మాత్రమే ఆధారపడే జంతువులను ………….అంటారు.
3. ఆహారం కోసం జంతువులపై మాత్రమే ఆధారపడే జంతువులను …………. అంటారు.
4. పండ్లు, కూరగాయల వేర్లు వంటి రసమైన పండ్లను ఎక్కువగా తినే జంతువులను …….. అంటారు.
5. కుక్కలు ఆహారం పొందడానికి …………. లక్షణాన్ని ఉపయోగిస్తాయి.
6. కప్ప దాని ………….. తో ఆహారాన్ని బంధించి మింగేస్తుంది.
7. కోడి …………కొరకు నేలను పాదాలతో గోకడంచేస్తుంది.
8. …………. కు నీటిలో చేపలను పట్టుకోవడానికి పొడవైన ముక్కు ఉంది.
9. చిలుక పండ్లను తింటుంది మరియు గింజలను ……………వంటి ముక్కుతో తింటుంది.
10. ఒంటె, ఆవు, గేదె మొదలైన వాటిని …………. అంటారు.
11. ……………… తమ సొంత ఆహారాన్ని తయారు చేసుకుంటాయి.
12. మొక్కలను లేదా జంతువులను తినే జీవిని ఆహార గొలుసులో …………. అంటాము.
13. ………ఆధారంగా వివిధ రకాల వినియోగదారులు ఉన్నారు.
14. ఉత్పత్తిదారులు ఆహారం ఇచ్చే జీవులను ………… అంటారు.
15. ప్రాథమిక వినియోగదారులు ఆహారం ఇచ్చే జీవులను …………… అంటారు.
16. …………………. ఆహారం ఇచ్చే జీవులను తృతీయ వినియోగదారులు అంటారు.
17. …………..లో నివసించే జీవుల మధ్య గొలుసు సంబంధం వంటిది ఉంది.
18. ………….. ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల మధ్య సంబంధాన్ని చూపిస్తుంది.
19. జలగ దాని ఆహారాన్ని ……….. ద్వారా గ్రహిస్తుంది.
20. …………. లో దంతాలు నీటి నుండి ఆహారాన్ని పొందడానికి వడపోత సాధనముగా పనిచేస్తాయి.
21. …………. పదునైన దంతాలు కల్గి మాంసాన్ని చీల్చే జంతువులు.
22. కొక్కెము వంటి ముక్కు గల ఫలాహార పక్షి ……………
23. ఒక కప్ప దాని జిగట కలిగిన …………. క్రిమి వైపు విసురుతుంది.
24. ………….. పక్షికి పొడవైన మరియు బలమైన ముక్కు ఉంటుంది.
25. …………. జంతువు తన , నాలుకతో ఆహారాన్ని లాక్కుంటుంది.
26. కొంగ ……. ద్వారా నీటిలో చేపలను పట్టుకొనును.
27. రాబందులు జంతువుల మాంసాన్ని చీల్చటానికి ………….. ముక్కులను కలిగి ఉంటాయి.
28. బాక్టీరియా మరియు శిలీంధ్రాలు లు …………..
29. ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు నేల మధ్య పదార్థాల చక్రీయానికి …………. సహాయపడతాయి.
30. ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన అనేక ఆహార గొలుసులతో చేయబడింది ………..
31. చీమల సమూహములో ……… చీమలు ఇతరులకు ఆహారం సేకరించి నిల్వ చేస్తాయి.
32. సహజ పారిశుద్ధ్య కార్మికులకు ఉదాహరణ ………..
జవాబు:

  1. సర్వ ఆహారులు
  2. శాకాహారులు
  3. మాంసాహారులు
  4. ఫలాహార జంతువులు
  5. వాసన చూడటం అనే
  6. నాలుక
  7. పురుగులు
  8. కొంగ
  9. కొక్కెము
  10. నెమరు వేయు జంతువులు
  11. ఉత్పత్తిదారులు
  12. వినియోగదారులు
  13. ఆహారపు అలవాట్లు
  14. ప్రాథమిక వినియోగదారులు
  15. ద్వితీయ వినియోగదారులు
  16. ద్వితీయ వినియోగదారులు
  17. పర్యావరణ వ్యవస్థ
  18. ఆహారపు గొలుసు
  19. సక్కర్స్
  20. బాతు
  21. పులి / సింహం
  22. చిలుక
  23. నాలుక
  24. వడ్రంగి పిట్ట
  25. కుక్క
  26. పొడవైన ముక్కు
  27. బలమైన కొక్కెము వంటి
  28. విచ్ఛిన్నకారులు
  29. విచ్ఛిన్నకారులు
  30. ఆహార జాలకము
  31. వర్కర్
  32. కాకి

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – A Group – B
ఎ) రుచి 1. రాబందు
బి) వినికిడి 2. కుక్క
సి) వాసన 3. పాండ్ స్కేటర్
డి) దృష్టి 4. గబ్బిలము
ఇ) స్పర్శ 5. కొన్ని సరీసృపాలు

జవాబు:

Group – A Group – B
ఎ) రుచి 5. కొన్ని సరీసృపాలు
బి) వినికిడి 4. గబ్బిలము
సి) వాసన 2. కుక్క
డి) దృష్టి 1. రాబందు
ఇ) స్పర్శ 3. పాండ్ స్కేటర్

2.

Group – A Group – B
ఎ) వడ్రంగి పిట్ట 1. బలమైన కొక్కెము వంటి ముక్కు.
బి) కొంగ 2. కొక్కెము ముక్కు
సి) రాబందు 3. పొడవైన ముక్కు
డి) చిలుక 4. పొడవైన సన్నని ముక్కు
ఇ) హమ్మింగ్ పక్షి 5. పొడవైన మరియు బలమైన ముక్కు

జవాబు:

Group – A Group – B
ఎ) వడ్రంగి పిట్ట 5. పొడవైన మరియు బలమైన ముక్కు
బి) కొంగ 3. పొడవైన ముక్కు
సి) రాబందు 1. బలమైన కొక్కెము వంటి ముక్కు.
డి) చిలుక 2. కొక్కెము ముక్కు
ఇ) హమ్మింగ్ పక్షి 4. పొడవైన సన్నని ముక్కు

3.

Group – A Group – B
ఎ) చీమలు మరియు చెదలు 1. హమ్మింగ్ పక్షి
బి) పండ్లు మరియు కాయలు 2. రాబందు
సి) జంతువుల మాంసం 3. కొంగ
డి) చేప 4. వడ్రంగి పిట్ట
ఇ) తేనె 5. చిలుక

జవాబు:

Group – A Group – B
ఎ) చీమలు మరియు చెదలు 4. వడ్రంగి పిట్ట
బి) పండ్లు మరియు కాయలు 5. చిలుక
సి) జంతువుల మాంసం 2. రాబందు
డి) చేప 3. కొంగ
ఇ) తేనె 1. హమ్మింగ్ పక్షి

4.

Group – A Group – B
ఎ) కప్ప 1. సహజ పారిశుద్ధ్య కార్మికులు
బి) ఆవు 2. సక్కర్స్
సి) కాకి 3. అంటుకునే నాలుక
డి) జలగ 4. వేట జంతువు
ఇ) సింహం 5. నెమరు

జవాబు:

Group – A Group – B
ఎ) కప్ప 3. అంటుకునే నాలుక
బి) ఆవు 5. నెమరు
సి) కాకి 1. సహజ పారిశుద్ధ్య కార్మికులు
డి) జలగ 2. సక్కర్స్
ఇ) సింహం 4. వేట జంతువు

5.

Group – A Group – B
ఎ) ఉత్పత్తిదారులు 1. కప్ప
బి) ప్రాథమిక వినియోగదారులు 2. మొక్కలు
సి) ద్వితీయ వినియోగదారులు 3. కాకి
డి) తృతీయ వినియోగదారులు 4. బాక్టీరియా
ఇ) విచ్ఛిన్నకారులు 5. మిడత

జవాబు:

Group – A Group – B
ఎ) ఉత్పత్తిదారులు 2. మొక్కలు
బి) ప్రాథమిక వినియోగదారులు 5. మిడత
సి) ద్వితీయ వినియోగదారులు 1. కప్ప
డి) తృతీయ వినియోగదారులు 3. కాకి
ఇ) విచ్ఛిన్నకారులు 4. బాక్టీరియా

మీకు తెలుసా?

ఫలాహార జంతువులు
AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం 5
→ ఈ జంతువులు ఎక్కువగా పండ్లు, రసభరితమైన పండ్ల వంటి కూరగాయలు, వేరు దుంపలు, కాండాలు, గింజలు, విత్తనాల వంటి వాటిని తింటాయి. ఇవి ఫలాలను ప్రధాన ఆహారంగా తీసుకునే శాకాహారులు లేదా ఉభయాపరులు. 20% శాకాహార క్షీరదాలు ఫలాలను భుజిస్తాయి. కావున క్షీరదాలలో ఫలాహారం సాధారణంగా కనిపిస్తుంది.

సహజ పారిశుద్ధ్య కార్మికులు
AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం 6
→ మన పరిసరాలలో నివసించే కాకులు, గ్రలు, సాధారణంగా వృథాగా పారేసిన, కుళ్లిన ఆహార పదార్థాలను , చనిపోయిన జంతువులు మొదలైన వాటిని తింటాయి. మన పరిసరాలు శుభ్రంగా ఉంచటంలో ఇవి సహాయపడతాయి.

నెమరువేయు జంతువులు
AP 6th Class Science Important Questions Chapter 3 జంతువులు – ఆహారం 7
→ ఆవు, గేదె, ఒంటె మొదలైన జంతువులు ఆహారాన్ని గబగబా నమిలి మింగుతాయి. దాన్ని జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేస్తాయి. కొంతసేపు అయిన తరువాత, మింగిన ఆహారాన్ని జీర్ణాశయం నుండి నోట్లోకి తెచ్చుకొని మళ్లీ బాగా నములుతాయి. దీనినే ‘నెమరవేయడం’ అంటారు. ఇటువంటి జంతువులను నెమరువేయు జంతువులు అంటారు.