Practice the AP 6th Class Science Bits with Answers Chapter 10 విద్యుత్ వలయాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP 6th Class Science Bits Chapter 10 విద్యుత్ వలయాలు with Answers

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. విద్యుత్ బల్బులో ఫిలమెంట్
A) రాగి
B) వెండి
C) టంగ్ స్టన్
D) ప్లాస్టిక్
జవాబు:
C) టంగ్ స్టన్

2. విద్యుత్ బల్బుని కనుగొన్నది.
A) ఎడిసన్
B) న్యూటన్
C) థామస్
D) రూథర్ ఫర్డ్
జవాబు:
A) ఎడిసన్

3. విద్యుత్ ప్రసరణకు ఉపయోగపడే పదార్థాలు
A) వాహకాలు
B) బంధకాలు
C) ఘటం
D) జనకాలు
జవాబు:
A) వాహకాలు

4. విద్యుత్ బంధకమునకు ఉదాహరణ
A) ఇనుము
B) ఉక్కు
C) ప్లాస్టిక్
D) రాగి
జవాబు:
C) ప్లాస్టిక్

AP 6th Class Science Bits Chapter 10 విద్యుత్ వలయాలు with Answers

5. విద్యుద్ఘాతము తగలకుండా ఉపయోగపడునవి
A) వాహకాలు
B) బంధకాలు
C) జనకాలు
D) అన్నీ
జవాబు:
B) బంధకాలు

6. విద్యుత్ వలయంలోని పరికరాలు
A) విద్యుత్ ఘటం
B) విద్యుత్ వాహకం
C) బల్బ్
D) అన్ని
జవాబు:
D) అన్ని

7. విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని ఏమంటారు?
A) విద్యుత్ వలయం
B) విద్యుత్ నిరోధం
C) విద్యుత్ వాహకం
D) విద్యుత్ బంధకం
జవాబు:
A) విద్యుత్ వలయం

8. విద్యుత్ బల్బులు వెలుగునిచ్చే భాగం
A) ధన ధ్రువం
B) రుణ ధ్రువం
C) ఫిలమెంట్
D) గాజుకుప్పె
జవాబు:
C) ఫిలమెంట్

9. టార్చ్ లైట్లో సెలను తిప్పివేస్తే
A) వెలగదు
B) వెలుగుతుంది
C) వెలిగి ఆరిపోతుంది
D) బల్బు మాడిపోతుంది
జవాబు:
A) వెలగదు

AP 6th Class Science Bits Chapter 10 విద్యుత్ వలయాలు with Answers

10. విద్యుత్ ఘటాలలో విద్యుత్తు వేటి నుంచి ఉత్పత్తి అవుతుంది?
A) నీరు
B) రసాయనాలు
C) లోహాలు
D) తీగలు
జవాబు:
B) రసాయనాలు

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. ప్రవహించే విద్యుత్తును ………….. అంటాము.
2. విద్యుత్ ఉత్పత్తికి …………… వాడతాము.
3. ఘటము ……….. ధృవాలు కలిగి ఉంటుంది.
4. విద్యుత్ ధన ధ్రువం నుండి ………….. ప్రయాణిస్తుంది.
5. బల్బు రెండు ధృవాల మధ్య ………….. ఉంటుంది.
6. విద్యుత్ బల్బు ఫిలమెంట్ …………. లో ఉంటుంది.
7. ఘటము యొక్క ధన ధృవాన్ని బల్బ్ యొక్క …………….
8. విద్యుత్ వలయంలో ఘటాన్ని ……………. అంటారు.
9. వలయాన్ని మూయడానికి, తెరవడానికి ఉపయోగపడేది ………….
10. స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పుడు విద్యుత్ ……………………
11. మూసివున్న వలయంలో విద్యుత్ ……………
12. టార్చ్ లైట్ లో స్విచ్ ఆన్ చేయగానే బల్చు …………… ధృవానికి కలుపుతారు.
13. విద్యుత్తు ప్రవహించని పదార్థాలను ………….. అంటారు.
14. విద్యుత్ బల్బును ఆవిష్కరించిన శాస్త్రవేత్త ………………..
15. విద్యుత్ బల్బులో ఉపయోగించే పదార్థం ……………………..
జవాబు:

  1. కరెంట్
  2. ఘటము లేదా సెల్
  3. రెండు
  4. రుణ ధృవానికి
  5. ఫిలమెంట్
  6. గాజుబుగ్గ
  7. ఋణ ధృవం
  8. విద్యుత్ జనకం
  9. స్విచ్
  10. ప్రవహించదు
  11. ప్రవహిస్తుంది.
  12. వెలుగుతుంది
  13. విద్యుత్ బంధకాలు
  14. థామస్ ఆల్వా ఎడిసన్
  15. టంగ్స్టన్

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – A Group – B
ఎ) విద్యుత్ వాహకాలు 1) కాంతిని ఉత్పత్తి చేస్తుంది.
బి) విద్యుత్ బంధకాలు 2) విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది
సి) విద్యుత్ ఘటం 3) విద్యుత్తు అనుమతిస్తుంది, అనుమతించదు
డి) కాంతి జనకం 4) విద్యుత్తును అనుమతించదు
ఇ) స్విచ్ 5) విద్యుత్తును అనుమతిస్తుంది.

జవాబు:

Group – A Group – B
ఎ) విద్యుత్ వాహకాలు 5) విద్యుత్తును అనుమతిస్తుంది.
బి) విద్యుత్ బంధకాలు 4) విద్యుత్తును అనుమతించదు
సి) విద్యుత్ ఘటం 2) విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది
డి) కాంతి జనకం 1) కాంతిని ఉత్పత్తి చేస్తుంది.
ఇ) స్విచ్ 3) విద్యుత్తు అనుమతిస్తుంది, అనుమతించదు

2.

Group – A Group – B
ఎ) విద్యుత్ 1) ధన లేదా రుణ
బి) కాగితం 2) బల్బు
సి) రాగి 3) కరెంట్
డి) ఫిలమెంట్ 4) వాహకం
ఇ) ధృవము 5) అవాహకం

జవాబు:

Group – A Group – B
ఎ) విద్యుత్ 3) కరెంట్
బి) కాగితం 5) అవాహకం
సి) రాగి 4) వాహకం
డి) ఫిలమెంట్ 2) బల్బు
ఇ) ధృవము 1) ధన లేదా రుణ