Practice the AP 6th Class Maths Bits with Answers 7th Lesson బీజ గణిత పరిచయం on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 6th Class Maths Bits 7th Lesson బీజ గణిత పరిచయం

క్రింది ప్రశ్నలకు ఒక పదం లేదా ఒక వాక్యంలో సమాధానాలు రాయండి.

ప్రశ్న1.
AP 6th Class Maths Bits 7th Lesson బీజ గణిత పరిచయం 1
____________ అమరికలో Sn లో ఉండే అగ్గిపుల్లల సంఖ్యకు సూత్రాన్ని రాయండి.
జవాబు :
4 × n

ప్రశ్న2.
“చతురస్ర చుట్టుకొలత దాని భుజం మరియు ‘4ల లబ్దానికి సమానం”. ఈ సందర్భాన్ని భుజం s గా పరిగణించి చతురస్ర చుట్టుకొలత సూత్రాన్ని రాయండి.
జవాబు :
4 × s.

ప్రశ్న3.
సమీకరణానికి ఒక ఉదాహరణనివ్వండి.
జవాబు :
2x + 3 = 9

AP 6th Class Maths Bits 7th Lesson బీజ గణిత పరిచయం

ప్రశ్న4.
LHS 2x + 5 అయ్యేటట్లు ఒక సమీకరణాన్ని రాయండి.
జవాబు :
2x + 5 = 10

ప్రశ్న5.
పూర్ణిమ వద్ద అంకిత్ కన్నా 5 పుస్తకాలు ఎక్కువ కలవు. అంకిత్ దగ్గర పుస్తకాల సంఖ్య x అయితే పూర్ణిమ వద్ద గల పుస్తకాల సంఖ్యను సూచించు.సమాసాన్ని రాయండి.
జవాబు :
x + 5

ప్రశ్న6.
“నాలుగు రెట్లు x కన్నా నాలుగు తక్కువ” ఈ సమాచారాన్ని సమానంగా రాయండి.
జవాబు :
4x – 4

ప్రశ్న7.
2x + 5 సమాసాన్ని పదరూపంలో రాయండి.
జవాబు :
2 చే x ను గుణించి లబ్దానికి 5 కలుపబడినది. (లేదా) రెట్టింపు x కన్నా 5 ఎక్కువ.

ప్రశ్న8.
14 = 3x + 5 సమీకరణంలో LHS మరియు RHS లను తెల్పండి.
జవాబు :
LHS = 14, RHS = 3x + 5

ప్రశ్న9.
y చరరాశిగా గల ఒక సమీకరణాన్ని రాయండి.
జవాబు :
y – 3 = 7

ఈ క్రింది వానికి సరియైన సమాధానాన్ని గుర్తించి రాయండి.

ప్రశ్న1.
Sn = 3n + 1 అయిన S10 =
A) 14
B) 30
C) 31
D) 10
జవాబు :
C) 31

ప్రశ్న2.
హరిణి వద్ద పద్మ కంటే 4 పెన్నులు ఎక్కువ కలవు. ఈ సందర్భాన్ని ల చరరాశి ఉపయోగించి రాయగా
A) y + 4
B) 4y
C) \(\frac{y}{4}\)
D) పైవి అన్ని
జవాబు :
A) y + 4

ప్రశ్న3.
“రెట్టింపు ‘x’ కన్నా 1 ఎక్కువ”. ఈ సమాచారాన్ని సూచించుటకు సరైన సమాసం
A) 2x – 1
B) 2x
C) 2x + 1
D) 2x + 2
జవాబు :
C) 2x + 1

ప్రశ్న4.
“53 x ను గుణించి లబ్దానికి y కలుపబడినది”. పై వాక్యానికి తగిన సమాసము
A) 5x – y
B) 5x + 5y
C) 5y – x
D) 5x + y
జవాబు :
D) 5x + y

ప్రశ్న5.
2x + 3 = 15 సామాన్య సమీకరణంలో LHS =
A) 15
B) 2x + 3
C) 2x
D) 2x+3 = 15
జవాబు :
B) 2x + 3

AP 6th Class Maths Bits 7th Lesson బీజ గణిత పరిచయం

ప్రశ్న6.
క్రింది వానిలో ఏది సమీకరణం కాదు ?
A) 2y + 3 = 7
B) 2y + 3 > 7
C) 2y + 3 < 7
D) B మరియు C
జవాబు :
D) B మరియు C

ప్రశ్న7.
ఒక శానిటైజర్ వెల ₹ 50 అయిన n శానిటైజర్ల వెల
A) ₹ 500
B) ₹(50 + n)
C) ₹ \(\frac{50}{n}\)
D) ₹ \(\frac{n}{50}\)
జవాబు :
A) ₹ 500

ప్రశ్న8.
x + 1 = 5 యొక్క సాధన
A) 5
B) 4
C) 3
D) 6
జవాబు :
B) 4

ప్రశ్న9.
క్రింది వానిలో ఏది LHS = 10, RHS = 3x + 1గా గల సమీకరణము ?
A) 3x + 1 = 10
B) 3x + 10 = 10
C) 10 = 3x + 10
D) 10 = 3x + 1
జవాబు :
D) 10 = 3x + 1

ప్రశ్న10.
క్రింది వానిలో ఏవి సమీకరణాలు ?
A) 5 + m = 6
B) x + 4 = 9
C) \(\frac{m}{2}\) = 4
D) పైవి అన్ని
జవాబు :
D) పైవి అన్ని

ప్రశ్న11.
3m + 2 = 17 సమీకరణంలోని చరరాశి
A) 3
B) m
C) 2
D) 17
జవాబు :
B) m

ప్రశ్న12.
సమాసంను దాని పదరూపంనకు జతపరచటంలో క్రింది ఏది సత్యం ?

i) x + 5 a) రెట్టింపు x కన్నా 5 ఎక్కువ
ii) \(\frac{x}{2}\) – 5 b) x కు రెట్టింపు
iii) 2x + 5 c) x కంటే 5 ఎక్కువ
iv) 2x d) x లో 2వ భాగంనకు 5 తీసివేయబడినది

A) i → c, ii → b, iii → d, iv → a
B) i → a, ii → d, iii → b, iv → c
C) i → c, ii → d, iii → a, iv → b
D) i → a, ii → b, iii → d, iv → c
జవాబు :
C) i → c, ii → d, iii → a, iv → b

ప్రశ్న13.

i) 3చే x ను గుణించి లబ్దానికి 6 కలుపబడినది. a) \(\frac{x}{6}\) + 3
ii) x లో 3వ భాగంకు 6 కలుపబడినది. b) 3x + 6
iii) x లో 6వ భాగంనకు 3 కలుపబడినది. c) \(\frac{x}{3}\) + 6
iv) x ను 6చే గుణించి లబ్దానికి 3 కలుపబడినది. d) 6x + 3

A) i → b, ii → c, iii → a, iv → d
B) i → d, ii → a, iii → c, iv → b
C) i → b, ii → d, iii → c, iv → a
D) i → b, ii → c, iii → d, iv → a
జవాబు :
A) i → b, ii → c, iii → a, iv → d

క్రింది ఖాళీలను పూరించండి.

ప్రశ్న1.
AP 6th Class Maths Bits 7th Lesson బీజ గణిత పరిచయం 2
అమరికలో తరువాత అమరికకు కావలసిన అగ్గిపుల్లల సంఖ్య ____________
జవాబు :
10

ప్రశ్న2.
ఒక నోటు పుస్తకం ధర ₹ 10 అయిన ‘n’ నోటు పుస్తకాల ధర ____________
జవాబు :
₹ 10 × n

ప్రశ్న3.
x కన్నా 5 ఎక్కువకు సమాస రూపం ____________
జవాబు :
x + 5

ప్రశ్న4.
2x-1 సమాసంలోని చరరాశి ____________
జవాబు :
x

ప్రశ్న5.
3, 6, 9, 12, ____________ అమరికకు ‘n’ వ పదం
జవాబు :
3 × n

ప్రశ్న6.
3m = 6 ను తృప్తిపరిచే m విలువ ____________
జవాబు :
2

ప్రశ్న7.
3x + 4 = 25 సామాన్య సమీకరణంలో RHS = ____________
జవాబు :
25

AP 6th Class Maths Bits 7th Lesson బీజ గణిత పరిచయం

ప్రశ్న8.
x = 5 అయినపుడు 2x + 4 విలువ ____________
జవాబు :
14

ప్రశ్న9.
5y = 5 యొక్క సాధన y = ____________
జవాబు :
1

క్రింది వానిని జతపరుచుము.

ప్రశ్న1.

i) దీర్ఘచతురస్ర వైశాల్యం దాని పొడవు (l) వెడల్పు (b) ల లబ్దానికి సమానం. a) 2l + 2b
ii) చతురస్ర చుట్టుకొలత, దాని భుజం(s)కు నాలుగు రెట్లు. b) l × b
iii) సమబాహు త్రిభుజ చుట్టుకొలత, దాని భుజం (s) కు మూడు రెట్లు c) s × s
iv) దీర్ఘచతురస్ర చుట్టుకొలత, దాని రెట్టింపు పొడవు మరియు రెట్టింపు వెడల్పుల మొత్తానికి సమానం. (పొడవు l, వెడల్పు b) d) 3 × s
e) 4 × s

జవాబు :

i) దీర్ఘచతురస్ర వైశాల్యం దాని పొడవు (l) వెడల్పు (b) ల లబ్దానికి సమానం. b) l × b
ii) చతురస్ర చుట్టుకొలత, దాని భుజం(s)కు నాలుగు రెట్లు. e) 4 × s
iii) సమబాహు త్రిభుజ చుట్టుకొలత, దాని భుజం (s) కు మూడు రెట్లు d) 3 × s
iv) దీర్ఘచతురస్ర చుట్టుకొలత, దాని రెట్టింపు పొడవు మరియు రెట్టింపు వెడల్పుల మొత్తానికి సమానం. (పొడవు l, వెడల్పు b) a) 2l + 2b

ప్రశ్న2.

i) x – 3 = 5 సాధన a) 4
ii) 3 – 4 సాధన b) 6
iii) 4x = 40 సాధన c) 8
iv) 2x + 4 = 16 సాధన d) 10
e) 12

జవాబు :

i) x – 3 = 5 సాధన c) 8
ii) 3 – 4 సాధన e) 12
iii) 4x = 40 సాధన d) 10
iv) 2x + 4 = 16 సాధన b) 6