Practice the AP 6th Class Maths Bits with Answers 6th Lesson ప్రాథమిక అంకగణితం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 6th Class Maths Bits 6th Lesson ప్రాథమిక అంకగణితం
క్రింది ప్రశ్నలకు ఒక పదం లేదా ఒక వాక్యంలో సమాధానాలు రాయండి.
ప్రశ్న1.
250 గ్రాములు 2 కి.గ్రా.ల నిష్పత్తిని కనిష్ఠ పదాలలో రాయండి.
జవాబు :
250 : 2000 = 1 : 8
ప్రశ్న2.
పూర్వపదం ఉండేటట్లు ఒక నిష్పత్తిని రాయండి.
జవాబు :
3 : 5
ప్రశ్న3.
5 : 7నకు సమాన నిష్పత్తి అవుతూ పరపదం 14గా గల నిష్పత్తిని రాయండి.
జవాబు :
10 : 14
ప్రశ్న4.
a, b, c, d లు అనుపాతంలో ఉండటానికి అవసరమగు నియమాన్ని రాయండి.
జవాబు :
a × d = b × c
ప్రశ్న5.
5:7: : 10 : 14 అనడం సరైనదేనా ! కాదా ! ఎందుకు ?
జవాబు :
అంత్యాల లబ్దం = 5 × 14 = 70, మధ్యమాల లబ్దం = 7 × 10 = 70
అంత్యాల లబ్ధం = మధ్యమాల లబ్ధం కావున 5 : 7 : : 10 : 14 అనడం సరైనదే.
ప్రశ్న6.
ఏకవస్తు పద్ధతి అనగానేమి ?
జవాబు :
ఒక వస్తువు యొక్క విలువను కనుగొని తద్వారా కావలసిన వస్తువుల విలువని కనుగొనే పద్ధతిని “ఏకవస్తు పద్ధతి” అంటారు.
ప్రశ్న7.
30 కోడిగుడ్ల ధర ₹120 అయిన ఒక్కొక్క కోడిగుడ్డు ధర ఎంత ?
జవాబు :
ఒక కోడిగుడ్డు ధర = ₹\(\frac{120}{30}\) = ₹ 4
ప్రశ్న8.
\(\frac{31}{100}\) యొక్క శాతరూపమును రాయండి.
జవాబు :
\(\frac{31}{100}\) × 100% = 31%
ప్రశ్న9.
12% ను భిన్న రూపంలోకి మార్చండి.
జవాబు :
12 × \(\frac{1}{100}=\frac{12}{100}=\frac{3}{25}\)
ప్రశ్న10.
80లో 8 శాతము ఎంత ?
జవాబు :
80 × \(\frac{8}{100}=\frac{64}{10}\) = 6.4
ప్రశ్న11.
అనుపాతము అనగానేమి ?
జవాబు :
రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతము అంటారు.
ప్రశ్న12.
క్రింది వానిలో అసత్యవాక్యాన్ని గుర్తించి సత్య వాక్యంగా మార్చండి.
i) ఒకే ప్రమాణం గల రెండు రాశులను సరిపోల్చుటను శాతము అంటారు.
ii) శాతము అనగా నూటికి అని అర్థం.
iii)శాతమును సూచించు గుర్తు %.
జవాబు :
(i) వ వాక్యం అసత్యం .
సత్య వాక్యం : ఒకే ప్రమాణం గల రెండు రాశులను సరిపోల్చుటను నిష్పత్తి అంటారు.
ఈ క్రింది వానికి సరియైన సమాధానాన్ని గుర్తించి రాయండి.
ప్రశ్న1.
a: b అనే నిష్పత్తి సామాన్యరూపంలో (కనిష్ఠ రూపంలో), ఉంటే a, b లు
A) సరి సంఖ్యలు
B) సంయుక్త సంఖ్యలు
C) సాపేక్ష ప్రధానాంకాలు
D) బేసి సంఖ్యలు
జవాబు :
C) సాపేక్ష ప్రధానాంకాలు
ప్రశ్న2.
2 : 3 కు సమాన నిష్పత్తి
A) 4:6
B) 6:9
C) 8:12
D) పైవి అన్ని
జవాబు :
D) పైవి అన్ని
ప్రశ్న3.
150 : 250 యొక్క కనిష్ఠ రూపము
A) 3:5
B) 15 : 25
C) 5:3
D) 25 : 15
జవాబు :
A) 3:5
ప్రశ్న4.
30 నిమిషాలు 1 గంట నిష్పత్తి కనిష్ఠ రూపం
A) 30:1
B) 3:6
C) 1:2
D) 2:3
జవాబు :
C) 1:2
ప్రశ్న5.
3 లీటర్లు 500 మి.లీ.కు గల నిష్పత్తి
A) 3: 500
B) 3000: 500
C) 6:1
D) B మరియు C
జవాబు :
D) B మరియు C
ప్రశ్న6.
క్రింది ఏవి అనుపాతంలో కలవు ?
A) 5,6,7,8
B) 3,5,6,10
C) 5,7,6,8
D) 1,2,3,4
జవాబు :
B) 3,5,6,10
ప్రశ్న7.
15:7 = x : 14 అయిన x విలువ
A) 15
B) 30
C) 2
D) 20
జవాబు :
B) 30
ప్రశ్న8.
శాతానికి గుర్తు
A) ::
B) :
C) %
D) =
జవాబు :
C) %
ప్రశ్న9.
“a, b, c, d లు అనుపాతంలో కలవు”. దీనిని గుర్తును ఉపయోగించి రాయడంలో ఏది సరైనది ?
A) a: b = c:d
B) a : b :: c:d
C) A మరియు B
D) a + b : c +d
జవాబు :
C) A మరియు B
ప్రశ్న10.
ప్రవచనం-I : a, b, c, d లు అనుపాతంలో ఉంటే a × d = b × c
ప్రవచనం-II : విష్పత్తి యొక్క పూర్వ, పరపదాలను ఒకే శూన్యేతర సంఖ్యచే గుణించగా ఏర్పడిన నిష్పత్తులను సమాన నిష్పత్తులు అంటారు.
A) I, II లు రెండూ సత్యం
B) I సత్యం, II అసత్యం
C) I అసత్యం, II సత్యం
D) I, II లు రెండూ అసత్యం
జవాబు :
A) I, II లు రెండూ సత్యం
ప్రశ్న11.
క్రింది వానిలో ఏది సత్యం ?
A) a : b లో a ని పరపదం అని, b ని పూర్వపదం అని అంటారు.
B) శాతం అనగా 1000 కి అని అర్థం.
C) రెండు నిష్పత్తుల యొక్క అంత్యముల లబ్ధం, మధ్యముల లబ్దానికి సమానమైన అవి రెండూ అనుపాతంలో ఉంటాయి.
D) పైవి అన్ని
జవాబు :
C) రెండు నిష్పత్తుల యొక్క అంత్యముల లబ్ధం, మధ్యముల లబ్దానికి సమానమైన అవి రెండూ అనుపాతంలో ఉంటాయి.
ప్రశ్న12.
3: 20 నిశాత రూపంలోకి మార్చమనగా 6వ తరగతి విద్యార్థులు క్రింది విధంగా సాధించారు.
ముష్కీన్ : \(\frac{1}{2}\) × 100 = \(\frac{2000}{3} \%\)
యశోద : \(\frac{3}{2}\) × 100 = \(\frac{300}{20}\) = 15%
హరి : \(\frac{3}{20} \times \frac{1}{100}=\frac{3}{2000} \%\)
చంద్ర: \(\frac{20}{3} \times \frac{1}{100}=\frac{20}{300}=\frac{1}{15} \%\)
పై వానిలో ఎవరి సమాధానం సరైనది ?
A) ముష్కిన్
B) యశోద
C) హరి
D) చంద్ర
జవాబు :
B) యశోద
ప్రశ్న13.
2 : 5 ను శాత రూపంలోకి మార్చమనగా 6వ తరగతిలోని ఇద్దరు స్నేహితులు కింది విధంగా సాధించారు.
శ్రీరంజని : 2:5= \(\frac{2}{5}=\frac{2}{5}\) × 100% = 200%= 40%
కవిత : 2 : 5 = \(\frac{2}{5}\) = 0.4 = 0.4 × 100% = 40%
పై సాధనలో ఎవరి సాధన సరైనది ?
A) శ్రీరంజని
B) కవిత
C) ఇద్దరి సాధన సరైనదే
D) ఇద్దరి సాధన సరైనది కాదు
జవాబు :
C) ఇద్దరి సాధన సరైనదే
→ ఆసియా ఖండంలోనే అతి పెద్ద టమోట మార్కెట్ అయినటువంటి మదనపల్లె మార్కెట్ నందు 20-8-2020 తేదీన నమోదైన వివిధ రకాల టమోటాల ధరలు ఇవ్వబడినవి. పట్టికను పరిశీలించి, 14-18 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న14.
సాహు రకం టమోట యొక్క ఒక కిలో ధర ఎంత ?
A) ₹ 15
B) ₹ 20
C) ₹ 30
D) ₹ 10
జవాబు :
B) ₹ 20
ప్రశ్న15.
F, మరియు F, రకాల ధరల నిష్పత్తి
A) 5:3
B) 6:5
C) 2:1
D) 1:2
జవాబు :
A) 5:3
ప్రశ్న16.
నాయక్ 15 కి.గ్రా. F, రకం టమోటాలను కొంటే ఎంత సొమ్ము చెల్లించాలి ?
A) ₹ 300
B) ₹ 170
C) ₹ 225
D) ₹ 180
జవాబు :
C) ₹ 225
ప్రశ్న17.
1 కిలో టమోట ధర అతి తక్కువగా గల టమోటా రకం
A) సాహు
B) F,
C) పూసారూబి
D) F,
జవాబు :
B) F,
ప్రశ్న18.
1 కిలో F, రకం కన్నా 1 కిలో సాహు రకం టమోట వెల ఎంత ఎక్కువ ? .
A) ₹ 5
B) ₹ 4
C) ₹ 3
D) ₹ 2
జవాబు :
D) ₹ 2
ప్రశ్న19.
క్రింది వానిని జతపరచడంలో ఏది సత్యం ?
1) 6 : 5 లో పరపదం | a) 4 |
ii) 3, 4, 6, x లు అనుపాతంలో ఉంటే x విలువ | b) 5 |
ii) 200 లో 2% | c) 6 |
iv) 4 పెన్నుల వెల ₹24 అయిన ఒక పెన్ను వేల | d) 8 |
A) i → b, ii → d, iii → a, iv → c
B) i → c, ii → a, iii → b, iv → d
C)i → c, ii → d, iii → b, iv → a
D) i → b, ii → c, iii → d, iv → a
జవాబు :
A) i → b, ii → d, iii → a, iv → c
ప్రశ్న20.
క్రింది వానిని జతపరచడంలో సరైన సమాధానాన్ని ఎన్నుకొనుము.
i) \(\frac{1}{4}\) | a) 30% |
ii) 3:10 | b) 25% |
iii) 0.2 | c) 20% |
A) i → b, ii → c, iii → a
B) i → b, ii → a, iii → c
C) i → c, ii → a, iii → b
D) i → c, ii → b, iii → a.
జవాబు :
B) i → b, ii → a, iii → c
క్రింది ఖాళీలను పూరించండి.
ప్రశ్న1.
a : b లో పూర్వపదము ________
జవాబు :
a
ప్రశ్న2.
ప్రక్కపటంలో రంగు వేసిన మరియు వేయని భాగాల నిష్పత్తి ________
జవాబు :
1:3
ప్రశ్న3.
అయితే ▢ లోని సంఖ్య = ________
జవాబు :
24
ప్రశ్న4.
16 : 20 యొక్క కనిష్ఠ రూపం ________
జవాబు :
4:5
ప్రశ్న5.
నిష్పత్తుల సమానత్వంను ________ అంటారు.
జవాబు :
అనుపాతము
ప్రశ్న6.
1:2 :: 07: 6 అయిన D లో ఉండాల్సిన సంఖ్య ________
జవాబు :
3
ప్రశ్న7.
0.07ను శాతరూపంలో రాయగా ________
జవాబు :
7%
ప్రశ్న8.
27% యొక్క దశాంశరూపం ________
జవాబు :
0.27
ప్రశ్న9.
\(\frac{3}{5}\) ను శాతరూపంలో రాయగా ________
జవాబు :
60%
ప్రశ్న10.
5 పెన్నుల ఖరీదు ₹ 30 అయిన ఒక పెన్ను ఖరీదు ________
జవాబు :
₹ 6