Practice the AP 6th Class Maths Bits with Answers 2nd Lesson పూర్ణాంకాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 6th Class Maths Bits 2nd Lesson పూర్ణాంకాలు

క్రింది ప్రశ్నలకు ఒక పదం లేదా ఒక వాక్యంలో సమాధానాలు రాయండి.

ప్రశ్న1.
30, 59ల మధ్యగల పూర్ణాంకాలు ఎన్ని ?
జవాబు :
59 – 30 – 1 = 28

ప్రశ్న2.
5 + 4 ను సంఖ్యారేఖపై చూపండి.
జవాబు :
AP 6th Class Maths Bits 2nd Lesson పూర్ణాంకాలు 2

ప్రశ్న3.
15 రావాలంటే 21 నుండి ఏ సంఖ్య తీసివేయాలి ?
జవాబు :
6 (21 – 6 = 15)

ప్రశ్న4.
“పూర్ణాంకాల సంకలనం సంవృత ధర్మాన్ని పాటిస్తుంది” అనడానికి ఒక ఉదాహరణనివ్వండి.
జవాబు :
3 మరియు 5 లు పూర్ణాంకాలు, 3 + 5 = 8 కూడా పూర్ణాంకమే.

ప్రశ్న5.
“పూర్ణాంకాల గుణకారం సహచరధర్మాన్ని పాటిస్తుంది”. పై.వాక్యం సత్యం అనడానికి ఒక ఉదాహరణనివ్వండి.
జవాబు :
3 మరియు 5 లు పూర్ణాంకాలు, వీని లబ్దం 3 × 5 = 15 కూడా పూర్ణాంకమే.

AP 6th Class Maths Bits 2nd Lesson పూర్ణాంకాలు

ప్రశ్న6.
మొదటి ఐదు పూర్ణాంకాల మొత్తం ఎంత ?
జవాబు :
0 + 1 + 2 + 3 + 4 = 10

ప్రశ్న7.
పూర్ణాంకాలలో ఏ సంఖ్యకు పూర్వసంఖ్య లేదు ?
జవాబు :
0

ప్రశ్న8.
10 యొక్క పూర్వ, ఉత్తర సంఖ్యల భేదము ఎంత ?
జవాబు :
11 – 9 = 2

ప్రశ్న9.
8, 15 మధ్యగల పూర్ణాంకాలు రాయండి.
జవాబు :
9, 10, 11, 12, 13, 14

ప్రశ్న10.
15 యొక్క పూర్వ, ఉత్తర సంఖ్యల మొత్తం ఎంత ?
జవాబు :
14 + 16 = 30

క్రింది వానికి సరియైన సమాధానాన్ని గుర్తించి రాయండి.

ప్రశ్న1.
సహజ సంఖ్యాసమితిని సూచించు అక్షరం
A) N
B) W
C) Z
D) Q
జవాబు :
A) N

ప్రశ్న2.
5 × 6 = 6 × 5 అనునది
A) సంకలన స్థిత్యంతర ధర్మం
B) గుణకార స్థిత్యంతర ధర్మం
C) సంకలన సంవృత ధర్మం.
D) గుణకార తత్సమ ధర్మం
జవాబు :
B) గుణకార స్థిత్యంతర ధర్మం

ప్రశ్న3.
క్రింది వానిలో ఏ సంఖ్యను దీర్ఘ చతురస్రాలుగా చూపవచ్చును ?
A) 3
B) 6
C) 5
D) 7
జవాబు :
B) 6

AP 6th Class Maths Bits 2nd Lesson పూర్ణాంకాలు

ప్రశ్న4.
క్రింది వానిలో ఏ సంఖ్యను చతురస్రంగా చూపవచ్చును?
A) 4
B) 9
C) 16
D) పైవన్నీ
జవాబు :
D) పైవన్నీ

ప్రశ్న5.
క్రింది వానిలో త్రిభుజ సంఖ్య
A) 4
B) 8
C) 9
D) 10
జవాబు :
D) 10

ప్రశ్న6.
3 + (4 + 7) = 3 + (4 + 7) అనునది
A) సంకలన స్థిత్యంతర ధర్మం
B) సంకలన సహచర ధర్మం
C) విభాగ న్యాయము
D) సంకలన తత్సమ ధర్మం
జవాబు :
B) సంకలన సహచర ధర్మం

ప్రశ్న7.
సంకలన తత్సమాంశము
A) 0
B) 10
C) 1
D) -1
జవాబు :
A) 0

ప్రశ్న8.
185 + (6 + 15) = 185 + (15+ 6) = (185 + 15) + 6 = 200 + 6 = 206
పై సమస్యాసాధనలో ఉపయోగించిన నియమాలు. I. సంకలన స్థిత్యంతర ధర్మం II. సంకలన సహచర ధర్మం
A) I మాత్రమే
B) II మాత్రమే
C) I మరియు II
D) ఏదీకాదు
జవాబు :
C) I మరియు II

ప్రశ్న9.
క్రింది ఏ ధర్మాన్ని పూర్ణాంకాల సమితి పాటించదు ?
A) సంకలన స్థిత్యంతర ధర్మం
B) సంకలన సంవృత ధర్మం
C) వ్యవకలన సంవృత ధర్మం
D) సంకలన సహచర ధర్మం
జవాబు :
C) వ్యవకలన సంవృత ధర్మం

ప్రశ్న10.
వాక్యం I : సంఖ్యారేఖపై ఏదేని పూర్ణాంకమునకు ఎడమవైపు గల పూర్ణాంకం ఆ పూర్ణాంకము కంటే చిన్న సంఖ్య.
వాక్యం II : ‘0’ కి తప్ప మిగిలిన పూర్ణాంకాలన్నింటికీ పూర్వసంఖ్యలు ఉంటాయి.
A) I సత్యం, II అసత్యం
B) I సత్యం, II సత్యం
C) I అసత్యం, II సత్యం
D) I అసత్యం, II అసత్యం
జవాబు :
B) I సత్యం, II సత్యం

ప్రశ్న11.
క్రింది వానిలో ఏది అసత్యం ?
A) పూర్ణాంకాలు గుణకారంలో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి.
B) సున్నాతో భాగహారం నిర్వచించబడదు.
C) పూర్ణాంకాలు సంకలనంలో సహచర ధర్మాన్ని పాటిస్తాయి.
D) పూర్ణసంఖ్యలు అన్నీ సహజ సంఖ్యలు అవుతాయి.
జవాబు :
D) పూర్ణసంఖ్యలు అన్నీ సహజ సంఖ్యలు అవుతాయి.

ప్రశ్న12.
సహజ సంఖ్యాసమితికి ‘0’ చేర్చితే వచ్చు సంఖ్యల సమితి
A) పూర్ణాంకాల సమితి
B) పూర్ణసంఖ్యలు
C) అకరణీయ సంఖ్యలు
D) కరణీయ సంఖ్యలు
జవాబు :
A) పూర్ణాంకాల సమితి

ప్రశ్న13.
i) 1 × 8 + 1 = 9
ii) 12 × 8 + 2 = 98
iii) 12318 + 3 = 987 లో తరువాత సోపానము
A) 1234 × 8 + 3 = 9875
B) 1234 × 8 + 4 = 9876
C) 12345 × 8 + 5 = 98765
D) 12345 × 8 + 4 = 98764
జవాబు :
B) 1234 × 8 + 4 = 9876

ప్రశ్న14.
i) 5 + 0 = 5;
ii) 0 + 10 = 10;
iii) 100+ 0 = 100 అనునవి క్రింది ఏ నియమానికి సరైన ఉదాహరణలు ?
A) గుణకార తత్సమధర్మం
B) సంకలన తత్సమధర్మం
C) సంకలన సంవృత ధర్మం
D) సంకలన సహచర ధర్మం
జవాబు :
B) సంకలన తత్సమధర్మం

ప్రశ్న15.
గుణకార తత్సమ ధర్మానికి క్రింది వానిలో ఏది సరైన ఉదాహరణ ?
A) 1 × 9 = 9
B) 10 × 1 = 10
C) 1 × 15 = 15
D) పైవన్నీ
జవాబు :
D) పైవన్నీ

క్రింది ఖాళీలను పూరించండి.

ప్రశ్న1.
10 యొక్క ఉత్తర సంఖ్య ____________
జవాబు :
11

ప్రశ్న2.
19 యొక్క పూర్వసంఖ్య ____________
జవాబు :
18

AP 6th Class Maths Bits 2nd Lesson పూర్ణాంకాలు

ప్రశ్న3.
పూర్వసంఖ్య లేని సహజసంఖ్య ____________
జవాబు :
1

ప్రశ్న4.
49 × 68 + 32 × 49 = 49 × (68 + 32) =49 × 100 = 4900. ఈ సమస్యా సాధనలో ఉపయోగించిన ధర్మము ____________
జవాబు :
విభాగన్యాయము

ప్రశ్న5.
కనిష్ఠ పూర్ణాంకము ____________
జవాబు :
0

ప్రశ్న6.
368 × 492 = 181056 అయిన 492 × 368 : ____________
జవాబు :
181056

ప్రశ్న7.
3, 6, 10 వరుసలో తరువాత వచ్చు సంఖ్య ____________
జవాబు :
15 [3,6,10,15 లు త్రిభుజ సంఖ్యలు]
AP 6th Class Maths Bits 2nd Lesson పూర్ణాంకాలు 2

ప్రశ్న8.
సంకలన తత్సమాంశము మరియు గుణకార తత్సమాంశముల మొత్తం ____________
జవాబు :
1 (0 +1 = 1)

ప్రశ్న9.
పూర్ణాంకాల సమితిని సూచించు అక్షరం ____________
జవాబు :
W

ప్రశ్న10.
2020 యొక్క ఉత్తర సంఖ్య ____________
జవాబు :
2021

క్రింది వానిని జతపరుచుము.

ప్రశ్న1.

i) సహజసంఖ్య కాని పూర్ణాంకము a) 5
ii) 10 కి ఉత్తర సంఖ్య b) 1
iii) కనిష్ఠ సహజసంఖ్య c) 0
iv) 5 + 0 d) నిర్వచించబడదు
e) 11

జవాబు :

i) సహజసంఖ్య కాని పూర్ణాంకము c) 0
ii) 10 కి ఉత్తర సంఖ్య e) 11
iii) కనిష్ఠ సహజసంఖ్య b) 1
iv) 5 + 0 d) నిర్వచించబడదు

AP 6th Class Maths Bits 2nd Lesson పూర్ణాంకాలు

ప్రశ్న2.

i) 3 + 9 = 9 + 3 a) సంకలన స్థిత్యంతర ధర్మం
ii) (5 + 9) × 8 = 5 × 8 + 9 × 8 b) సంకలన తత్సమాంశము
iii) 7 + 0 = 7 c) విభాగన్యాయం
d) గుణకార తత్సమాంశం

జవాబు :

i) 3 + 9 = 9 + 3 a) సంకలన స్థిత్యంతర ధర్మం
ii) (5 + 9) × 8 = 5 × 8 + 9 × 8 c) విభాగన్యాయం
iii) 7 + 0 = 7 b) సంకలన తత్సమాంశము