Practice the AP 6th Class Maths Bits with Answers 1st Lesson మన చుట్టూ ఉండే సంఖ్యలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 6th Class Maths Bits 1st Lesson మన చుట్టూ ఉండే సంఖ్యలు
క్రింది ప్రశ్నలకు ఒక పదం లేదా ఒక వాక్యంలో సమాధానాలు రాయండి.
ప్రశ్న1.
ఇరవై నాలుగు కోట్ల అరవై మూడు లక్షల’ నాలుగు వేల ఏడు వందల ముప్పై నాలుగు. అంతర్జాతీయ సంఖ్యామానంలో అక్షరాలలో రాయండి.
జవాబు :
24,63,04,734
ప్రశ్న2.
తొమ్మిది మిలియన్ల మూడు వందల నాలుగు వేలును హిందూ సంఖ్యామానంలో సంఖ్యారూపంలో తెల్పండి.
జవాబు :
93,04,000
ప్రశ్న3.
34639743ను అంతర్జాతీయ సంఖ్యామానంలో అక్షరాలలో రాయండి.
జవాబు :
ముఫ్ఫె నాలుగు మిలియన్ల ఆరు వందల ముఫ్పై తొమ్మిది వేల ఏడు వందల నలభై మూడు.
ప్రశ్న4.
73764, 84603, 62713, 75619 లను ఆరోహణ క్రమంలో అమర్చండి.
జవాబు :
62713, 73764, 75619, 84603
ప్రశ్న5.
17,36,42,607 యొక్క విస్తరణ రూపంను రాయండి.
జవాబు :
70,00,00,000 + 7,00,00,000 + 30,00,000 + 6,00,000 + 40,000 + 2,000 + 600 + 7
ప్రశ్న6.
85706549లో 7 యొక్క స్థానవిలువ ఎంత ?
జవాబు :
7 × 1,00,000 = 7,00,000
ప్రశ్న7.
1,10, 100, 1000, 10,000, A., 10,00,000 క్రమంలో ని స్థానంలోని సంఖ్య ఏది ?
జవాబు :
1,00,000
ప్రశ్న8.
3,47,694 కన్నా పెద్దదైనా ఏదేని ఒక సంఖ్యను రాయండి.
జవాబు :
4,47,694
ప్రశ్న9.
6, 64, 37,303; 7,60,43, 707 ల మధ్య గల ఒక సంఖ్యను తెల్పండి.
జవాబు :
7,00,00,000
ప్రశ్న10.
4,56,726 ను దగ్గరి పదులకు సవరించి రాయండి.
జవాబు :
4,56,730
ప్రశ్న11.
5,62,824 ను దగ్గరి వందలకు సవరించి రాయండి.
జవాబు :
5,62,800
ప్రశ్న12.
ఐదు అంకెల సంఖ్యలు ఎన్ని కలవు ?
జవాబు :
99,999 – 10000 + 1 = 90,000
ఈ క్రింది వానికి సరియైన సమాధానాన్ని గుర్తించి రాయండి.
ప్రశ్న1.
ఇరవై మూడు వేల ఇరవై మూడు యొక్క సంఖ్యారూపం
A) 23023
B) 23230
C) 230023
D) 232300
జవాబు :
A) 23023
ప్రశ్న2.
1 కోటి =
A) 10 పది లక్షలు
B) 100 లక్షలు
C) 1000 పదివేలు
D) పైవన్నీ
జవాబు :
D) పైవన్నీ
ప్రశ్న3.
10 కోట్లు =
A) 1 మిలియన్
B) 10 మిలియన్లు
C) 100 మిలియన్లు
D) పైవన్నీ
జవాబు :
C) 100 మిలియన్లు
ప్రశ్న4.
1 కిలోమీటరు __________
A) 1000 మీటర్లు
B) 100 మీటర్లు
C) 100 సెం.మీ.
D) 1000 సెం.మీ.
జవాబు :
A) 1000 మీటర్లు
ప్రశ్న5.
37,463ను దగ్గర వందలకు సవరించిన వచ్చు సంఖ్య
A) 37460
B) 37400
C) 37000
D) 37500
జవాబు :
D) 37500
ప్రశ్న6.
రామానుజన్ సంఖ్య
A) 1887
B) 1729
C) 1792
D) 1878
జవాబు :
B) 1729
ప్రశ్న7.
నాలుగు కోట్ల నాలుగు లక్షల నాలుగు వేల నాలుగు వందల నాలుగు యొక్క సంఖ్యారూపం
A) 44,04,404
B) 4,04,04,404
C) 4,40,04,404
D) 4,04,40,440
జవాబు :
B) 4,04,04,404
ప్రశ్న8.
3,767 లో 7 యొక్క స్థాన విలువల భేదం
A) 693
B) 707
C) 6993
D) 4900
జవాబు :
A) 693
ప్రశ్న9.
4,63,062 లో 6 యొక్క స్థానవిలువల లబ్దం
A) 3,60,000
B) 3,60,00,000
C) 36,00,000
D) 3,600
జవాబు :
C) 36,00,000
ప్రశ్న10.
క్రింది వానిలో ఏది అసత్యము ?
A) 10 లక్షలు = 1 మిలియన్
B) 1 కోటి = 10 మిలియన్లు
C) 10 కోట్లు = 1 బిలియన్
D) పైవన్నీ
జవాబు :
C) 10 కోట్లు = 1 బిలియన్
ప్రశ్న11.
వాక్యం I : గరిష్ఠ ఎనిమిది అంకెల సంఖ్యకు 1 కలిపిన తొమ్మిది అంకెల కనిష్ఠ సంఖ్య వస్తుంది.
వాక్యం II : ఒక సంఖ్యలో కుడి నుండి ఎడమకు ఒక స్థానం జరిగినచో అంకె స్థానవిలువ 10 రెట్లు పెరుగుతుంది.
A) I సత్యం; II అసత్యం
B) I సత్యం, II సత్యం
C) I అసత్యం, II సత్యం
D) I అసత్యం, II అసత్యం
జవాబు :
B) I సత్యం, II సత్యం
ప్రశ్న12.
తొమ్మిది బిలియన్ల తొమ్మిది వందల ఇరవైనాలుగు మిలియన్ల అరవై ఏడువేల రెండువందల ఇరవైమూడు యొక్క సంఖ్యారూపం.
A) 9,924,067,223
B) 9,900,24,67,223
C) 924,900,067,223
D) 99,924,067,223
జవాబు :
A) 9,924,067,223
క్రింది ఖాళీలను పూరించండి.
ప్రశ్న1.
3,7,2,0 అంకెలతో ఏర్పడు గరిష్ఠ సంఖ్య __________
జవాబు :
7320
ప్రశ్న2.
6 అంకెల కనిష్ఠ సంఖ్య __________
జవాబు :
1,00,000
ప్రశ్న3.
1 కోటి = __________ వేలు
జవాబు :
10,000
ప్రశ్న4.
6,73,852 లో 3 యొక్క స్థాన విలువ __________
జవాబు :
3000
ప్రశ్న5.
1 కోటి = __________ మిలియన్లు
జవాబు :
10
ప్రశ్న6.
1 బిలియన్ = __________ కోట్లు
జవాబు :
100
ప్రశ్న7.
1 క్వింటాలు =__________ కి.గ్రా.
జవాబు :
100
ప్రశ్న8.
1 టన్ను = __________ కి.గ్రా.
జవాబు :
1000
ప్రశ్న9.
1 మీ.3 = __________ లీటర్లు
జవాబు :
1000
ప్రశ్న10.
56,723 యొక్క విస్తరణరూపం __________ కి.గ్రా.
జవాబు :
50,000 + 6,000 + 700 + 20 + 3
క్రింది వానిని జతపరుచుము.
ప్రశ్న1.
i) ఇరవై వేల ఇరవై ఆరు | a) 26,226 |
ii) ఇరవై లక్షల ఇరవై ఆరు | b) 20,026 |
iii)ఇరవై ఆరు లక్షల ఇరవై ఆరు | c) 20,00,026 |
iv) ఇరవై ఆరు వేల రెండు వందల ఇరవై ఆరు. | d) 26,00,026 |
e) 26,00,000 |
జవాబు :
i) ఇరవై వేల ఇరవై ఆరు | b) 20,026 |
ii) ఇరవై లక్షల ఇరవై ఆరు | c) 20,00,026 |
iii)ఇరవై ఆరు లక్షల ఇరవై ఆరు | d) 26,00,026 |
iv) ఇరవై ఆరు వేల రెండు వందల ఇరవై ఆరు. | a) 26,226 |
ప్రశ్న2.
i) రెండు మిలియన్లు మూడు వందల నాలుగు వేల ఏడు వందల ఏడు | a) 20,304,707 |
ii) ఇరవై మిలియన్లు మూడు వందల నాలుగు వేల ఏడు వందల ఏడు | b) 2,000,304,707 |
iii) రెండు బిలియన్లు మూడు వందల నాలుగు వేల ఏడు వందల ఏడు | c) 2,304,707 |
iv) ఇరవై’ బిలియన్లు మూడు వందల నాలుగు వేల ఏడు ఎందల ఏడు | d) 20,000,304,707 |
జవాబు :
i) రెండు మిలియన్లు మూడు వందల నాలుగు వేల ఏడు వందల ఏడు | c) 2,304,707 |
ii) ఇరవై మిలియన్లు మూడు వందల నాలుగు వేల ఏడు వందల ఏడు | a) 20,304,707 |
iii) రెండు బిలియన్లు మూడు వందల నాలుగు వేల ఏడు వందల ఏడు | b) 2,000,304,707 |
iv) ఇరవై’ బిలియన్లు మూడు వందల నాలుగు వేల ఏడు ఎందల ఏడు | d) 20,000,304,707 |
ప్రశ్న3.
i) 1 క్వింటాలు | a) 1000 గ్రా. |
ii) 1 టన్ను | b) 1000 కి.గ్రా. |
iii)1 మెగాటన్ను | c) 100 కి.గ్రా. |
iv)1 కిలోగ్రాం | d) 1000000000 కి.గ్రా. |
జవాబు :
i) 1 క్వింటాలు | c) 100 కి.గ్రా. |
ii) 1 టన్ను | b) 1000 కి.గ్రా. |
iii)1 మెగాటన్ను | d) 1000000000 కి.గ్రా. |
iv)1 కిలోగ్రాం | a) 1000 గ్రా. |
ప్రశ్న4.
1) 1 లీటరు | a) 1,000,000 లీటర్లు |
ii) 1 క్యూబిక్ మీటరు | b) 2831.6 కోట్ల లీటర్లు |
iii)1 మెగా లీటరు | c) 10,000 లీటర్లు |
iv)1 టి.యం.సి. (TMC) | d) 1000 మిల్లీ లీటర్లు |
e) 1000 లీటర్లు |
జవాబు :
1) 1 లీటరు | d) 1000 మిల్లీ లీటర్లు |
ii) 1 క్యూబిక్ మీటరు | e) 1000 లీటర్లు |
iii)1 మెగా లీటరు | a) 1,000,000 లీటర్లు |
iv)1 టి.యం.సి. (TMC) | b) 2831.6 కోట్ల లీటర్లు |
ప్రశ్న5.
i) మూడంకెల అతి పెద్ద సంఖ్య +1 | a) 10,000 |
ii) నాలుగంకెల అతిచిన్న సంఖ్య 1 | b) 1,00,000 |
iii) నాలుగంకెల అతి పెద్ద సంఖ్య | c) 999 |
iv) ఐదు అంకెల అతిచిన్న సంఖ్య | d) 9999 |
e) 1,000 |
జవాబు :
i) మూడంకెల అతి పెద్ద సంఖ్య +1 | e) 1,000 |
ii) నాలుగంకెల అతిచిన్న సంఖ్య 1 | c) 999 |
iii) నాలుగంకెల అతి పెద్ద సంఖ్య | d) 9999 |
iv) ఐదు అంకెల అతిచిన్న సంఖ్య | a) 10,000 |
ప్రశ్న6.
4,8,0,2 లు నాలుగు అంకెలైన
i) పై అంకెలతో ఏర్పడు అతి పెద్ద నాలుగంకెల సంఖ్య | a) 4802 |
ii) పై అంకెలతో ఏర్పడు అతిచిన్న సంఖ్య | b) 8420 |
iii) 4 పదుల స్థానంలో గల సంఖ్య | c) 8240 |
iv) ‘0’ పదుల స్థానంలో గల సంఖ్య | d) 2048 |
e) 8042 |
జవాబు :
i) పై అంకెలతో ఏర్పడు అతి పెద్ద నాలుగంకెల సంఖ్య | b) 8420 |
ii) పై అంకెలతో ఏర్పడు అతిచిన్న సంఖ్య | d) 2048 |
iii) 4 పదుల స్థానంలో గల సంఖ్య | c) 8240 |
iv) ‘0’ పదుల స్థానంలో గల సంఖ్య | a) 4802 |