Practice the AP 6th Class Maths Bits with Answers 11th Lesson చుట్టుకొలత – వైశాల్యం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 6th Class Maths Bits 11th Lesson చుట్టుకొలత – వైశాల్యం
క్రింది ప్రశ్నలకు ఒక పదం లేదా ఒక వాక్యంలో సమాధానాలు రాయండి.
ప్రశ్న1.
 వృత్త పరిధి కనుగొను సూత్రాన్ని రాయండి.
 జవాబు :
 వృత్త పరిధి C = 2πr లేదా C = πd
ప్రశ్న2.
 వృత్త పరిధి C = 2πr లో ‘r’ దేనిని సూచిస్తుంది ?
 జవాబు :
 r = వ్యాసార్ధము
ప్రశ్న3.
 4 సెం.మీ. భుజంగా గల చతురస్రం యొక్క చుట్టు కొలత, వైశాల్యాల సంఖ్య విలువల నిష్పత్తి ఎంత ?
 జవాబు :
 16 : 16 = 1:1
ప్రశ్న4.
 క్రింది పటాల చుట్టుకొలతల నిష్పత్తి ఎంత ?
 
 జవాబు :
 15 : 20 = 3 : 4
→ కింది పటం ABCD దీర్ఘచతురస్రం. E, F లు AB, CD ల మధ్య బిందువులు. క్రింది ప్రశ్నల (5 – 7) కు జవాబులు రాయండి.
 
ప్రశ్న5.
 ABCD చుట్టుకొలత ఎంత ?
 జవాబు :
 2 × 8 + 2 × 4 = 16 + 8 = 24 సెం.మీ.
ప్రశ్న6.
 ABCD వైశాల్యం ఎంత ?
 జవాబు :
 8 × 4 = 32 చ.సెం.మీ.
ప్రశ్న7.
 ABCD, FBCE వైశాల్యాల నిష్పత్తిని కనిష్ఠ రూపంలో కనుగొనుము.
 జవాబు :
 8 × 4 : 4 × 4 = 32 : 16 = 2 : 1

ప్రశ్న8.
 దీర్ఘ చతురస్ర వైశాల్యంనకు సూత్రం రాయండి.
 జవాబు :
 పొడవు × వెడల్పు = l × b
ప్రశ్న9.
 చతురస్ర వైశాల్యమునకు సూత్రం రాయండి.
 జవాబు :
 భుజం × భుజం = s × s
ఈ క్రింది వానికి సరియైన సమాధానాన్ని గుర్తించి రాయండి.
ప్రశ్న1.
 చతురస్ర భుజం ‘S’ అయితే ఆ చతురస్ర చుట్టుకొలత
 A) 3s
 B) 4s
 C) s × s
 D) 28
 జవాబు :
 B) 4s
ప్రశ్న2.
 దీర్ఘచతురస్ర చుట్టుకొలత
 A) 2 × పొడవు + 2 × వెడల్పు
 B) పొడవు + వెడల్పు
 C) పొడవు × వెడల్పు
 D) 3 × పొడవు + 3 × వెడల్పు
 జవాబు :
 A) 2 × పొడవు + 2 × వెడల్పు
ప్రశ్న3.
 6 సెం.మీ. భుజంగా గల సమబాహు త్రిభుజ చుట్టుకొలత
 A) 6 సెం.మీ.
 B) 12 సెం.మీ.
 C) 18 సెం.మీ.
 D) 24 సెం.మీ.
 జవాబు :
 C) 18 సెం.మీ.
ప్రశ్న4.
 పొడవు 8 సెం.మీ., వెడల్పు 3 సెం.మీ. అయిన ఆ దీర్ఘచతురస్ర చుట్టుకొలత
 A) 11 సెం.మీ.
 B) 24 సెం.మీ.
 C) 5 సెం.మీ.
 D) 22 సెం.మీ.
 జవాబు :
 D) 22 సెం.మీ.
ప్రశ్న5.
 X: ఒకే వైశాల్యము కలిగిన అనేక దీర్ఘ చతురస్రాలు ఉంటాయి.
 Y: ఒకే వైశాల్యము కలిగిన అనేక చతురస్రాలు ఉంటాయి. పై వాక్యాలకు సంబంధించి క్రింది ఏది సత్యం ?
 A) X – సత్యం, Y – అసత్యం
 B) X – అసత్యం, Y – సత్యం
 C) X, Y లు రెండూ సత్యం
 D) X, Y లు రెండూ అసత్యం
 జవాబు :
 A) X – సత్యం, Y – అసత్యం
ప్రశ్న6.
 P : వృత్త వ్యాసార్ధం ‘r’ అయితే ఆ వృత్త పరిధి
 C = 2πr
 Q : దీర్ఘ చతురస్ర చుట్టుకొలత P = 2 పొడవులు + 2 వెడల్పులు
 పై వానిలో ఏవి సత్యం ?
 A) P – సత్యం, Q – అసత్యం
 B) P – అసత్యం, Q – సత్యం
 C) P, Qలు రెండూ సత్యం
 D) P, Qలు రెండూ అసత్యం
 జవాబు :
 C) P, Qలు రెండూ సత్యం
ప్రశ్న7.
 π విలువ సుమారుగా
 A) \(\frac{7}{22}\)
 B) \(\frac{22}{7}\)
 C) \(\frac{22}{9}\)
 D) \(\frac{9}{22}\)
 జవాబు :
 B) \(\frac{22}{7}\)

ప్రశ్న8.
 వృత్త వ్యాసార్ధాన్ని రెట్టింపు చేసిన దాని పరిధి
 A) రెట్టింపు అవుతుంది
 B) సగం అవుతుంది
 C) మూడు రెట్లు అవుతుంది
 D) చెప్పలేము
 జవాబు :
 A) రెట్టింపు అవుతుంది
ప్రశ్న9.
 10 సెం.మీ. భుజంగా గల చతురస్ర వైశాల్యం
 A) 40 చ|| సెం.మీ.
 B) 40 సెం.మీ.
 C) 100 చ. సెం.మీ.
 D) 100 సెం.మీ.
 జవాబు :
 C) 100 చ. సెం.మీ.
ప్రశ్న10.
 ఒక వృత్త వ్యాసము 14 సెం.మీ. అయిన ఆ వృత్త పరిధి
 A) 88 సెం.మీ.
 B) 66 సెం.మీ.
 C) 55 సెం.మీ.
 D) 44 సెం.మీ.
 జవాబు :
 D) 44 సెం.మీ.
ప్రశ్న11.
 20 సెం.మీ. చుట్టుకొలతగా గల చతురస్ర వైశాల్యం
 A) 20 చ.సెం.మీ.
 B) 400 చ|| సెం.మీ.
 C) 25 చ.సెం.మీ.
 D) 100 చ.సెం.మీ.
 జవాబు :
 C) 25 చ.సెం.మీ.
ప్రశ్న12.
 సురేష్ 88 సెం.మీ. పొడవు గల తీగను తన కుమారుడు ఆడుకొనుటకు వృత్తాకార చట్రం తయారు చేశాడు. ఈ వృత్తాకార చట్ర వ్యాసార్ధం
 A) 7 సెం.మీ.
 B) 14 సెం.మీ.
 C) 3.5 సెం.మీ.
 D) 21 సెం.మీ.
 జవాబు :
 B) 14 సెం.మీ.
ప్రశ్న13.
 క్రింది వానిలో ఏది అసత్యం ?
 A) ఒక బహుభుజి యొక్క అన్ని భుజాల పొడవుల మొత్తం దాని చుట్టుకొలత.
 B) ఒక బహుభుజి ఆవరించు ప్రాంతం దాని వైశాల్యము.
 C) ఒక వృత్త వ్యాసం d అయిన ఆ వృత్త పరిధి 2πd.
 D) పైవి అన్నీ
 జవాబు :
 C) ఒక వృత్త వ్యాసం d అయిన ఆ వృత్త పరిధి 2πd.
ప్రశ్న14.
 చుట్టుకొలత 24 సెం.మీ. గా గల దీర్ఘ చతురస్ర పొడవు, వెడల్పులు క్రింది ఏవి కావచ్చును ?
 A) 8 సెం.మీ., 4 సెం.మీ.
 B) 10 సెం.మీ., 2 సెం.మీ.
 C) 7 సెం.మీ., 5 సెం.మీ.
 D) పైవి అన్నీ
 జవాబు :
 D) పైవి అన్నీ
ప్రశ్న15.
 24 చ. సెం.మీ. వైశాల్యంగా గల దీర్ఘచతురస్ర పొడవు, వెడల్పులు పూర్ణాంకాలు అయ్యేటట్లు క్రింది ఏ కొలతలు సాధ్యమవుతాయి ?
 A) 6 సెం.మీ., 4 సెం.మీ.
 B) 8 సెం.మీ., 3 సెం.మీ.
 C) A మరియు B
 D) \(\frac{24}{5}\) సెం.మీ., 5 సెం.మీ.
 జవాబు :
 C) A మరియు B
ప్రశ్న16.
| i) సమబాహు త్రిభుజ | a) 27 × వ్యాసార్ధం చుట్టుకొలత | 
| ii) చతురస్ర చుట్టుకొలత | b) 2 × పొడవు + 2 × వెడల్పు | 
| iii) దీర్ఘచతురస్ర చుట్టుకొలత | c)3 × భుజము | 
| iv) వృత్త పరిధి | d) 4 × భుజము | 
A) i → c, ii → d, iii → b, iv → a.
 B) i → c, ii → b, iii → d, iv → a
 C) i → d, ii -→ c, iii → a, iv → b
 D) i → d, ii → a, iii → b, iv → c
 జవాబు :
 A) i → c, ii → d, iii → b, iv → a.
క్రింది ఖాళీలను పూరించండి.
ప్రశ్న1.
 ఒక సమబాహు త్రిభుజ భుజం x సెం.మీ. అయిన దాని చుట్టుకొలత _____________ సెం.మీ.
 జవాబు :
 3x
ప్రశ్న2.
 3.5 సెం.మీ. భుజంగా గల చతురస్ర చుట్టుకొలత _____________ సెం.మీ.
 జవాబు :
 14

ప్రశ్న3.
 క్రింది పటం యొక్క చుట్టుకొలత 25 సెం.మీ. అయిన x విలువ _____________ సెం.మీ.
 
 జవాబు :
 6
ప్రశ్న4.
 ఒక వస్తువు ఆవరించిన ప్రాంతాన్ని ఆ వస్తువు యొక్క _____________ అంటారు
 జవాబు :
 వైశాల్యము
ప్రశ్న5.
 4 సెం.మీ. భుజంగా గల చతురస్ర వైశాల్యము _____________ చ. సెం.మీ.
 జవాబు :
 16
ప్రశ్న6.
 5మీ. పొడవు, 3మీ. వెడల్పుగాగల దీర్ఘ చతురస్ర వైశాల్యము _____________
 జవాబు :
 15 చ.మీ.
ప్రశ్న7.
 క్రింది పటాలలోని చతురస్రం, దీర్ఘచతురస్రంల వైశాల్యా ల నిష్పత్తి _____________
 
 జవాబు :
 16 : 12 లేదా 4 : 3
ప్రశ్న8.
 వృత్త పరిధి కనుగొనుటకు సూత్రం _____________
 జవాబు :
 C = 2πr లేదా C = πd
ప్రశ్న9.
 7 సెం.మీ. వ్యాసార్ధంగా గల వృత్తపరిధి _____________
 జవాబు :
 44 సెం.మీ.
ప్రశ్న10.
 క్రింది పటం అర్ధవృత్తాన్ని సూచిస్తుంది. అర్ధవృత్త చాపము 22 సెం.మీ. మరియు వృత్త వ్యాసార్థం 7 సెం.మీ. అయిన ఆ అర్ధవృత్త చుట్టుకొలత = _____________
 
 జవాబు :
 36 సెం.మీ.
ప్రశ్న11.
 1.5 సెం.మీ. భుజంగా గల చతురస్ర వైశాల్యం = _____________
 జవాబు :
 2.25 చ.సెం.మీ.
క్రింది వానిని జతపరుచుము.
ప్రశ్న1.
 
 జవాబు :
 i – D;
 ii – A;
 iii – E;
 iv – B
ప్రశ్న2.
| పటము | చుట్టుకొలత / పరిధి | 
| i) సమబాహు త్రిభుజం | a) 27 × వ్యాసార్ధం | 
| ii) చతురస్రము | b) 4 × భుజము | 
| iii) దీర్ఘచతురస్రము | c) పొడవు × వెడల్పు | 
| iv) వృత్తము | d) 2 × పొడవు + 2 × వెడల్పు | 
| e) 3 × భుజము | 
జవాబు :
| పటము | చుట్టుకొలత / పరిధి | 
| i) సమబాహు త్రిభుజం | e) 3 × భుజము | 
| ii) చతురస్రము | b) 4 × భుజము | 
| iii) దీర్ఘచతురస్రము | d) 2 × పొడవు + 2 × వెడల్పు | 
| iv) వృత్తము | a) 27 × వ్యాసార్ధం | 

ప్రశ్న3.
| i) చతురస్ర భుజం 3 సెం.మీ. అయిన చతురస్ర వైశాల్యం _____________ చ.సెం.మీ. | a) 22 | 
| ii) పొడవు 5.5 సెం.మీ., వెడల్పు 2.5 సెం.మీ. అయిన దీర్ఘ చతురస్ర చుట్టుకొలత _____________ సెం.మీ. | b) 9 | 
| iii) వ్యాసార్ధం 3.5 సెం.మీ.గా గల వృత్త పరిధి _____________ సెం.మీ. | c) 18 | 
| iv) 5 సెం.మీ., 6 సెం.మీ., 7 సెం.మీ. భుజాలుగా గల త్రిభుజ చుట్టుకొలత _____________ సెం.మీ. | d) 16 | 
| e) 19.25 | 
జవాబు :
| i) చతురస్ర భుజం 3 సెం.మీ. అయిన చతురస్ర వైశాల్యం _____________ చ.సెం.మీ. | b) 9 | 
| ii) పొడవు 5.5 సెం.మీ., వెడల్పు 2.5 సెం.మీ. అయిన దీర్ఘ చతురస్ర చుట్టుకొలత _____________ సెం.మీ. | d) 16 | 
| iii) వ్యాసార్ధం 3.5 సెం.మీ.గా గల వృత్త పరిధి _____________ సెం.మీ. | a) 22 | 
| iv) 5 సెం.మీ., 6 సెం.మీ., 7 సెం.మీ. భుజాలుగా గల త్రిభుజ చుట్టుకొలత _____________ సెం.మీ. | c) 18 | 
