Practice the AP 6th Class Maths Bits with Answers 10th Lesson ప్రాయోజిక జ్యామితి on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 6th Class Maths Bits 10th Lesson ప్రాయోజిక జ్యామితి

ఈ క్రింది వానికి సరియైన సమాధానాన్ని గుర్తించి రాయండి.

ప్రశ్న1.
ఇచ్చిన రేఖకు సమాంతర రేఖలు గీయడానికి క్రింది వానిలో ఏవి అత్యంత అనువైనవి ?
A) వృత్తలేఖిని
B) మూలమట్టాలు
C) విభాగిని
D) కోణమానిని
జవాబు :
B) మూలమట్టాలు

ప్రశ్న2.
5.6 సెం.మీ. రేఖాఖండాన్ని నిర్మించుటకు నీవు ఎన్నుకొనే పరికరం
A) స్కేలు
B) కోణమానిని
C) విభాగిని
D) పైవిఅన్ని
జవాబు :
A) స్కేలు

ప్రశ్న3.
\(\overline{\mathrm{AB}}\) రేఖాఖండానికి లంబ సమద్విఖండన రేఖ గీయు సోపానాలను పరిశీలించి, వాని సరైన క్రమాన్ని ఎన్నుకొనుము.
సోపానం (a) : \(\overline{\mathrm{AB}}\) రేఖాఖండాన్ని గీయాలి.
సోపానం (b) : B కేంద్రంగా అదే వ్యాసార్థంతో మరలా మునుపటి చాపరేఖలను ఖండించేటట్లు చాపరేఖలు గీయాలి. ఖండన బిందువులకు M, N అని పేరు పెట్టాలి.
సోపానం (C) : M,N బిందువులను కలపాలి. ఇదే \(\overline{\mathrm{AB}}\) కి లంబ సమద్విఖండన రేఖ అవుతుంది.
సోపానం (d) : A ను కేంద్రంగా \(\overline{\mathrm{AB}}\) పొడవులో సంగం కన్నా ఎక్కువ వ్యాసార్ధంతో \(\overline{\mathrm{AB}}\) కి పైన, కింద చాపరేఖలు గీయాలి.
A) a, b, c, d
B) d, b, c, a
C) a, d, b, c
D) c, b, d, a
జవాబు :
C) a, d, b, c

AP 6th Class Maths Bits 10th Lesson ప్రాయోజిక జ్యామితి

ప్రశ్న4.
క్రింది పటంలో ∠XOY కోణ సమద్విఖండనరేఖ \(\overline{\mathrm{OZ}}\) అయితే క్రింది వానిలో ఏది సత్యం ?
AP 6th Class Maths Bits 10th Lesson ప్రాయోజిక జ్యామితి 1
A) ∠XOZ + ∠ZOY = ∠XOY
B) ∠XOZ = ∠ZOY
C) ∠XOY = 2∠XOZ = 2∠ZOY
D) పైవి అన్ని
జవాబు :
D) పైవి అన్ని

→ క్రింది పటంలో \(\overline{\mathrm{XY}}\) లంబసమద్విఖండన రేఖ \(\overline{\mathrm{MN}}\) అయితే క్రింది 5, 6 ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 6th Class Maths Bits 10th Lesson ప్రాయోజిక జ్యామితి 2

ప్రశ్న5.
క్రింది వానిలో ఏది అసత్యం ?
A) \(\overline{\mathrm{MN}} \perp \overline{\mathrm{XY}}\)
B) ∠XPM = ∠MPY
C) \(\overline{\mathrm{XP}}\) పొడవు > \(\overline{\mathrm{PY}}\) పొడవు
D) పైవి అన్ని
జవాబు :
C) \(\overline{\mathrm{XP}}\) పొడవు > \(\overline{\mathrm{PY}}\) పొడవు

ప్రశ్న6.
\(\overline{\mathrm{XY}}\) 10 సెం.మీ. అయిన \(\overline{\mathrm{XP}}\) పొడవు
A) 6 సెం.మీ.
B) 5 సెం.మీ.
C) 7.5 సెం.మీ.
D) 10 కన్నా తక్కువ అయిన ఏదైనా కావచ్చు
జవాబు :
B) 5 సెం.మీ.

ప్రశ్న7.
AP 6th Class Maths Bits 10th Lesson ప్రాయోజిక జ్యామితి 3
పై పటాలు క్రింది ఏ కోణ నిర్మాణానికి చెందినవి?
A) 90°
B) 45°
C) 30°
D) 60°
జవాబు :
D) 60°

ప్రశ్న8.
ఇచ్చిన వ్యాసార్ధంతో ఒక వృత్తాన్ని గీయడానికి క్రింది ఏ పరికరం అవసరము ?
A) స్కేలు
B) వృత్తలేఖిని
C) A మరియు B
D) కోణమానిని
జవాబు :
C) A మరియు B

ప్రశ్న9.
క్రింది పటంలో OA = OB = BQ అయ్యేటట్లు గీచిన చాపరేఖలు చూడవచ్చును.
AP 6th Class Maths Bits 10th Lesson ప్రాయోజిక జ్యామితి 4
పై పటం క్రింది ఏ కోణ నిర్మాణాన్ని వృత్తలేఖిని, స్కేలు సహాయంతో నిర్మించుటకు ఉదాహరణ
A) 120°
B) 150°
C) 135°
D) 90°
జవాబు :
A) 120°

AP 6th Class Maths Bits 10th Lesson ప్రాయోజిక జ్యామితి 5
→ పై పటంలో OA = AB = BC, ∠POB కోణ సమద్విఖండన రేఖ \(\overline{\mathrm{OE}}\) మరియు ∠BOC కోణసమద్విఖండన రేఖ \(\overline{\mathrm{OD}}\) మరియు ∠POC = 120° అవుతుంది. అయితే క్రింది 10-13 ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న10.
∠POE యొక్క కోణ సమద్విఖండనరేఖ
A) OD
B) OB
C) DE
D) ఏదీకాదు
జవాబు :
B) OB

ప్రశ్న11.
∠POE =
A) 15°
B) 60°
C) 90°
D) 30°
జవాబు :
D) 30°

ప్రశ్న12.
లంబకోణము (90°) సూచించు కోణము
A) ∠POD
B) ∠COE
C) A మరియు B
D) ∠POC
జవాబు :
C) A మరియు B

AP 6th Class Maths Bits 10th Lesson ప్రాయోజిక జ్యామితి

ప్రశ్న13.
∠EOD =
A) 60°
B) 90°
C) 120°
D) 45°
జవాబు :
A) 60°

ఖాళీలను పూరించుట క్రింది ఖాళీలను పూరించండి.

ప్రశ్న1.
రేఖాఖండాలు, రేఖలు గీయడానికి జ్యామితీయ ఉపకరణాల పెట్టెలోని అనువైన పరికరం __________
జవాబు :
స్కేలు

ప్రశ్న2.
6 సెం.మీ. పొడవు గల రేఖాఖండంను దాని లంబసమద్విఖండన రేఖ రెండు భాగాలుగా విభజించినచో ఒక్కొక్క భాగం పొడవు __________
జవాబు :
3 సెం.మీ.

ప్రశ్న3.
కింది పటం \(\overrightarrow{\mathrm{AB}}\) రేఖాఖండం యొక్క లంబసమద్విఖండన రేఖ \(\overrightarrow{\mathrm{XY}}\) అయితే ∠YMB = __________
AP 6th Class Maths Bits 10th Lesson ప్రాయోజిక జ్యామితి 6
జవాబు :
90°

AP 6th Class Maths Bits 10th Lesson ప్రాయోజిక జ్యామితి 7
→ పై పటంలో ∠AOB యొక్క కోణ సమద్విఖండన రేఖ \(\overrightarrow{\mathrm{OC}}\). ఈ సమాచారం ఆధారంగా 4-6 ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ప్రశ్న4.
AOC = 30° అయిన ∠AOB = __________
జవాబు :
60°

AP 6th Class Maths Bits 10th Lesson ప్రాయోజిక జ్యామితి

ప్రశ్న5.
∠AOC = 30° అయిన ∠BOC __________
జవాబు :
30°

ప్రశ్న6.
∠AOB = 2∠AOC అనడం సరైనదేనా ? __________ (అవును / కాదు)
జవాబు :
అవును