Practice the AP 10th Class Biology Bits with Answers 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 10th Class Biology Bits 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

1. కణం యొక్క ‘ఎనర్జీ కరెన్సీ’ అని దీనికి పేరు.
A) ADP
B) మైటోకాండ్రియా
C) ATP
D) క్లోరోప్లాస్టు
జవాబు:
C) ATP

2. అవాయు శ్వాసక్రియకు సంబంధించి నిర్వహించే ప్రయోగంలో ఆక్సిజన్ ఉనికిని తెలుసుకోవడానికి
A) డయాబీన్ గ్రీన్
B) పొటాషియం హైడ్రాక్సైడ్
C) బెటాడిన్
D) సల్ఫర్ తో ఉన్న కడ్డీ
జవాబు:
A) డయాబీన్ గ్రీన్

3. మనము విడిచే గాలిలోని అంశాలు ……..
A) కార్బన్ డై ఆక్సైడ్ మరియు ఆక్సిజన్
B) ఆక్సిజన్ మరియు నీటి ఆవిరి ఉపయోగించే ద్రావణం
C) కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీటి ఆవిరి
D) నీటి ఆవిరి మాత్రమే
జవాబు:
C) కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీటి ఆవిరి

4. భూమిపై ఆకుపచ్చని మొక్కలు లేకపోతే ఏమౌతుంది?
A) ప్రాణికోటికి O2 అందదు
B) ప్రాణికోటికి CO2 అందదు
C) ప్రాణికోటికి N2 అందదు
D) పైవన్నీ
జవాబు:
A) ప్రాణికోటికి O2 అందదు

5. మనము CO2 ని గుర్తించే పరీక్షలో సున్నపు నీటిని తరచుగా ఈ క్రింది మార్పును గమనించటానికి ఉపయోగిస్తాం.
A) రంగులోని మార్పు
B) వాసనలోని మార్పు
C) స్థితిలోని మార్పు
D) ఆకారంలోని మార్పు
జవాబు:
A) రంగులోని మార్పు

AP 10th Class Biology Bits 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

6. కాంతి చర్యలో కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం, నీటి అణువు విచ్ఛిన్నమవడం, CO2 అణువు గ్లూకోజ్ గా సంశ్లేషించబడటం – ఈ చర్యలు ఎక్కడ జరుగుతాయి? A) మైటోకాండ్రియా
B) రైబోజోములు
C) హరితరేణువు
D) లైసోజోములు
జవాబు:
C) హరితరేణువు

7. వంశీ నిర్వహించిన ప్రయోగంలో ఉష్ణమాపకంలో ఉష్ణోగ్రత పెరిగింది. ఈ ప్రయోగ ఉద్దేశ్యం ….
A) విత్తనాలు మొలకెత్తడం వల్ల CO2 విడుదలగును
B) శ్వాసక్రియలో ఉష్ణము విడుదలగును
C) శ్వాసక్రియలో ఆల్కహాల్ విడుదలగును
D) శ్వాసక్రియలో CO2 విడుదలగును
జవాబు:
B) శ్వాసక్రియలో ఉష్ణము విడుదలగును

8. నిశ్వాసించే వాయువులలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం ఎంత?
A) 44
B) 4.4
C) 0.4
D) 0.04
జవాబు:
B) 4.4

9. హీమోగ్లోబిను ఈ క్రింది వానిలో దేనిని బంధించే శక్తి ఉంది?
A) O2
B) SO2
C) NO2
D) PO4
జవాబు:
A) O2

10. ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం
A) శ్వా సనాళిక
B) వాయుగోణులు
C) క్రిస్టే
D) నెఫ్రాన్
జవాబు:
A) శ్వా సనాళిక

11. శ్వాసక్రియలోని వివిధ దశల సరయిన క్రమాన్ని గుర్తించండి.
A) ఉఛ్వాస నిశ్వాసాలు → రక్తం → ఊపిరితిత్తులు → కణశ్వాసక్రియ
B) ఉఛ్వాస నిశ్వాసాలు → ఊపిరితిత్తులు → రక్తం – కణశ్వాసక్రియ
C) ఉఛ్వాస నిశ్వాసాలు – ఊపిరితిత్తులు → కణశ్వాసక్రియ → రక్తం
D) ఊపిరితిత్తులు → కణజాలాలు → రక్తం → కణశ్వాసక్రియ
జవాబు:
B) ఉఛ్వాస నిశ్వాసాలు → ఊపిరితిత్తులు → రక్తం – కణశ్వాసక్రియ

AP 10th Class Biology Bits 2nd Lesson శ్వాసక్రియ – శక్తి ఉత్పాదక వ్యవస్థ

12. స్వరతంత్రులను ఇక్కడ గమనించవచ్చు.
A) స్వర పేటిక
B) గ్రసని
C) నాశికా కుహరం
D) వాయు నాళం
జవాబు:
A) స్వర పేటిక