AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 8 జ్యామితీయ భావనలు Ex 8.1 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 8th Lesson జ్యామితీయ భావనలు Exercise 8.1
ప్రశ్న 1.
పక్కపటంలో కొన్ని బిందువులు గుర్తించబడినవి. వాటిని పేర్లతో సూచించండి.

సాధన.

![]()
ప్రశ్న 2.
కిందనీయబడిన బిందువులను కలపండి. ఏర్పడు రేఖాఖండాలకు పేర్లు రాయండి.

సాధన.
అ)

ఏర్పడిన రేఖాఖండాలు \(\overline{\mathrm{AB}}, \overline{\mathrm{BC}}, \overline{\mathrm{CD}}, \overline{\mathrm{AD}}, \overline{\mathrm{AC}}, \overline{\mathrm{BD}}\)
ఆ)

ఏర్పడు రేఖండాలు \(\overline{\mathrm{AB}}, \overline{\mathrm{BC}}, \overline{\mathrm{CD}}, \overline{\mathrm{DE}}, \overline{\mathrm{EF}}, \overline{\mathrm{AF}}, \overline{\mathrm{AE}}, \overline{\mathrm{AC}}, \overline{\mathrm{BF}}\), ………. మొదలగునవి.
3. ప్రక్కపటం నుండి కింది వాటిని గుర్తించండి.

ప్రశ్న (అ)
ఏవేని ఆరు బిందువులు.
సాధన.
ఏవేని ఆరు బిందువులు : A, B, C, D, E, G (ఏవేని ఆరు బిందువులను రాయవచ్చును. )
![]()
ప్రశ్న (ఆ)
ఏవేని ఆరు రేఖాఖండాలు. (G తో మొదలయ్యేవి)
సాధన.
ఏవేని ఆరు రేఖాఖండాలు. (G తో మొదలయ్యేవి) : \(\overline{\mathrm{GH}}, \overline{\mathrm{GD}}, \overline{\mathrm{GC}}, \overline{\mathrm{GE}}\) మరియు \(\overline{\mathrm{GF}}\).
ప్రశ్న (ఇ)
ఆరు కిరణాలు. (I తో మొదలయ్యేవి)
సాధన.
ఆరు కిరణాలు. (I తో మొదలయ్యేవి) : \(\overrightarrow{\mathrm{IC}}, \overrightarrow{\mathrm{IB}}, \overrightarrow{\mathrm{IA}}, \overrightarrow{\mathrm{IJ}}, \overrightarrow{\mathrm{IH}}, \overrightarrow{\mathrm{ID}}\)
ప్రశ్న (ఈ)
ఏవేని మూడు సరళరేఖలు.
సాధన.
ఏవేని మూడు సరళరేఖలు : \(\overrightarrow{\mathrm{AC}}, \overrightarrow{\mathrm{AD}}, \overrightarrow{\mathrm{BE}}, \overrightarrow{\mathrm{BD}}, \overrightarrow{\mathrm{CE}}\)
ప్రశ్న 4.
కింది వానికి ‘సత్యం’ కాని, ‘అసత్యం’ కాని సూచించండి.
(అ) సరళరేఖకు రెండు చివరి బిందువులు ఉండును.
(ఆ) సరళరేఖలో ఒక భాగం కిరణం.
(ఇ) రేఖాఖండానికి రెండు అంత్య బిందువులు ఉంటాయి.
(ఈ) రెండు బిందువుల గుండా పోయే విధంగా ఎన్ని రేఖలైనా గీయవచ్చును ?
సాధన.
(అ) సరళరేఖకు రెండు చివరి బిందువులు ఉండును. (అసత్యం)
(ఆ) సరళరేఖలో ఒక భాగం కిరణం. (సత్యం)
(ఇ) రేఖాఖండానికి రెండు అంత్య బిందువులు ఉంటాయి. (సత్యం )
(ఈ) రెండు బిందువుల గుండా పోయే విధంగా ఎన్ని రేఖలైనా గీయవచ్చును ? (అసత్యం)
![]()
ప్రశ్న 5.
పటాలను గీసి పేర్లతో సూచించండి.
(అ) K బిందువు కలిగియున్న ఒక సరళరేఖ.
(ఆ) ఒక వృత్తాన్ని ఒక సరళరేఖని కింద సూచించిన విధంగా గీయండి.
(i) వృత్తాన్ని ఖండించకుండా ఉండేటట్లు
(ii) వృత్తాన్ని ఒక బిందువు వద్ద ఖండించునట్లు
(iii) వృత్తాన్ని రెండు బిందువుల వద్ద ఖండించునట్లు
(ఇ) వృత్తాన్ని మూడు బిందువుల వద్ద ఖండించగలిగే సరళరేఖను గీయగలవా?
సాధన.
(అ)

(ఆ) (i) వృత్తాన్ని ఖండించకుండా ఉండేటట్లు

(ii) వృత్తాన్ని ఒక బిందువు వద్ద ఖండించునట్లు

(iii) వృత్తాన్ని రెండు బిందువుల వద్ద ఖండించునట్లు

(ఇ) గీయలేము.
![]()
ప్రశ్న 6.
కేవలం మూడు రేఖాఖండాలను మాత్రమే ఉపయోగించి రాయగలిగే పెద్ద ఆంగ్ల అక్షరాలను రాయండి.
సాధన.
