Practice the AP 8th Class Social Bits with Answers 6th Lesson ఖనిజాలు, గనుల తవ్వకం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Social Bits 6th Lesson ఖనిజాలు, గనుల తవ్వకం
1. ప్రపంచపు అత్యధిక బెరైటీస్ ఖనిజ నిల్వలు ప్రస్తుత, ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో ఉన్నాయి?
 A) పి.ఎస్.ఆర్ నెల్లూరు
 B) ప్రకాశం
 C) చిత్తూరు
 D) వై.యస్.ఆర్. కడప
 జవాబు:
 D) వై.యస్.ఆర్. కడప
2. బైరటీస్ పై పొర యొక్క రంగు ……….
 A) ఎరుపు
 B) పసుపు
 C) గ్రే
 D) ఆకుపచ్చ
 జవాబు:
 C) గ్రే
3. నిరామిక్ వస్తువుల తయారీకి ముడిసరుకుగా ఉపయోగపడేది?
 A) బైరైటీస్
 B) ఆస్బెస్టాస్
 C) క్రోమియం
 D) ఫెల్డ్ స్పార్
 జవాబు:
 D) ఫెల్డ్ స్పార్
4. క్రింది చిత్రంలో ఏ ఖనిజాన్ని వెలికి తీయుటను తెలుపుతుంది?
 
 A) పెట్రోలియం
 B) బొగ్గు
 C) బంగారం
 D) ఉప్పు
 జవాబు:
 A) పెట్రోలియం
5. ఓపెన్ కాస్ట్ గనుల త్రవ్వకం వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని తగ్గించుటకు ఒక మార్గం ………..
 A) సాయంత్ర సమయాలలో మాత్రమే త్రవ్వకాలు జరపడం
 B) గనుల త్రవ్వకం వల్ల నివాసం కోల్పోయిన జంతువులకు ఆహారం అందించడం.
 C) గనుల త్రవ్వకం పూర్తయిన ప్రాంతంలో అడవులను పెంచడం.
 D) కేవలం విషరహిత ఖనిజాలను మాత్రమే త్రవ్వడం.
 జవాబు:
 C) గనుల త్రవ్వకం పూర్తయిన ప్రాంతంలో అడవులను పెంచడం.
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
6. కొత్తగూడెం ఈ నదీలోయలో ఉంది.
 A) గంగ
 B) కృష్ణా
 C) నర్మద
 D) గోదావరి
 జవాబు:
 D) గోదావరి

7. ముడిచమురు ఒక …………
 A) ఘనపదార్థం
 B) వాయువు
 C) లోహం
 D) ఖనిజనూనె
 జవాబు:
 D) ఖనిజనూనె
8. పునరుద్ధరించడానికి వీలులేని ఖనిజానికి ఒక ఉదాహరణ
 A) సౌరశక్తి
 B) సముద్రపు నీరు
 C) బొగ్గు
 D) గాలి
 జవాబు:
 C) బొగ్గు
9. …………. సంవత్సరంలో ప్రభుత్వం అన్ని గనులను
 స్వాధీనం చేసుకుంది.
 A) 1920
 B) 1950
 C) 1970
 D) 1980
 జవాబు:
 C) 1970
10. కోలార్ బొగ్గు గనులు ……… లో ఉన్నాయి.
 A) ఇండియా
 B) భూటాన్
 C) శ్రీలంక
 D) ఇండోనేషియా
 జవాబు:
 A) ఇండియా
11. దేశంలోని ఖనిజసంపద అంతా దీని యొక్క ఆస్తి.
 A) ప్రభుత్వం
 B) కంపెనీ
 C) ప్రజల సమూహం
 D) ఉద్యోగ సమూహం
 జవాబు:
 A) ప్రభుత్వం
12. ఖమ్మం, కరీంనగర్, అదిలాబాదు మరియు వరంగల్ జిల్లాల్లో ఈ ఖనిజ నిల్వలున్నాయి.
 A) బంగారం
 B) ముడినూనె
 C) బొగ్గు
 D) బెరైటీస్
 జవాబు:
 C) బొగ్గు
13. బెరైటీస్ గనులలో ఉపరితలంలో ఉండే పొరలలో ఖనిజం ఈ రంగులో ఉంటుంది.
 A) ఎరుపు
 B) పసుపు
 C) బూడిదరంగు
 D) బ్రౌన్ రంగు
 జవాబు:
 C) బూడిదరంగు
14. “లాగుము” అని తెలియచేయడానికి ఇన్ని హాలేజిగంటలు కొట్టాలి.
 A) 2
 B) 3
 C) 4
 D) 10
 జవాబు:
 C) 4
15. కొన్ని …… బొగ్గుగనులలో బొగ్గు దీని ద్వారా రవాణా అవుతుంది.
 A) కన్వేయర్ బెల్ట్
 B) రైళ్ళు
 C) బస్సులు
 D) లారీలు
 జవాబు:
 A) కన్వేయర్ బెల్ట్

16. హాలేజి గంటలు 10 కొడితే దీనికి సంకేతం.
 A) ప్రమాదానికి
 B) భోజనానికి
 C) విశ్రాంతికి
 D) మీటింగ్ కి
 జవాబు:
 A) ప్రమాదానికి
17. బొగ్గు గనిలో గోడలకు ఇది పూస్తారు.
 A) సున్నం
 B) మైనం
 C) డోలమైట్
 D) జిప్సమ్
 జవాబు:
 C) డోలమైట్
18. బొగ్గును తవ్వే ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు.
 A) అదరము
 B) నైజం
 C) ముఖం
 D) నుదురు
 జవాబు:
 C) ముఖం
19. బాంబే హై దీనికి దగ్గరగా ఉంది.
 A) మద్రాస్
 B) ఢిల్లీ
 C) కోల్ కత
 D) ముంబయి
 జవాబు:
 D) ముంబయి
20. కొత్త ఉమ్మడి అటవీ యాజమాన్యం అమలులోకి వచ్చినది.
 A) 1966
 B) 1978
 C) 1988
 D) 1998
 జవాబు:
 C) 1988
21. పార్లమెంట్ అటవీ హక్కుల చట్టాన్ని చేసిన సంవత్సరం
 A) 2003
 B) 2004
 C) 2005
 D) 2006
 జవాబు:
 A) 2003
22. గనిలో బొగుని దీనితో రవాణా చేస్తారు.
 A) కన్వెయర్ బెల్ట్
 B) క్రోమియర్ ట్రెడ్
 C) చీరంట్ బెల్ట్
 D) మైనర్ బెల్ట్
 జవాబు:
 A) కన్వెయర్ బెల్ట్
23. ఖనిజ అభివృది కార్పొరేషన్‌కు ఈ గనులు తలమానికం.
 A) బెరైటీస్
 B) జిప్సమ్
 C) రాగి
 D) వెండి
 జవాబు:
 C) రాగి
24. బొగ్గు పొరని ఇలా పిలుస్తారు.
 A) కోల్ స్ట్రాంగ్
 B) కోల్ప్లస్
 C) కోల్ మ్
 D) కోల్ షాఫ్ట్
 జవాబు:
 C) కోల్ మ్
25. గచ్చుకి వేసే రాళ్ళు ఈ జిల్లాలో ఎక్కువగా దొరుకుతాయి.
 A) రంగారెడ్డి
 B) కడప
 C) వరంగల్
 D) ఖమ్మం
 జవాబు:
 B) కడప

26. భూమి లోపలి నుండి పొందే ప్రతిదీ
 A) మొక్క
 B) జంతువు
 C) ఖనిజం
 D) ఇంధనం
 జవాబు:
 C) ఖనిజం
27. వనరులను ఏ ఏ రకాలుగా విభజించుతారు అనగా
 A) పునరుద్ధరింపబడేవి
 B) అంతరించిపోయేవి
 C) పై రెండు రకాలు
 D) ఏదీకాదు
 జవాబు:
 C) పై రెండు రకాలు
28. గ్రానైట్ రాయి ఏ విధమైన ఖనిజం?
 A) పునరుద్ధరింపబడేవి
 B) అంతరించిపోయేవి
 C) పై రెండూ
 D) ఏదీకాదు
 జవాబు:
 B) అంతరించిపోయేవి
29. భారతదేశంలోని ఏకైక బంగారు గని
 A) కోలార్
 B) పోలార్
 C) రామయ్యపేట
 D) సింగరేణి
 జవాబు:
 A) కోలార్
30. అంతరించిపోయే ఖనిజానికి ఒక ఉదాహరణ
 A) బొగ్గు
 B) ముడిచమురు
 C) పై రెండూ
 D) ఏదీకాదు
 జవాబు:
 C) పై రెండూ
31. కోహినూర్ వజ్రం ఈ జిల్లాలో దొరికింది.
 A) కృష్ణ
 B) గుంటూరు
 C) అనంతపురం
 D) ఏదీకాదు
 జవాబు:
 C) అనంతపురం
32. విద్యుత్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించే ఖనిజం
 A) సున్నపురాయి
 B) గ్రానైట్
 C) మాంగనీస్
 D) మైకా (అభ్రకం)
 జవాబు:
 D) మైకా (అభ్రకం)

33. సున్నపురాయిని ఎక్కువగా ఈ పరిశ్రమలలో ఉపయోగిస్తారు.
 A) సిమెంట్
 B) కార్బైడ్
 C) ఇనుము ఉక్కు సోడాయాష్
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
34. కోత (కటింగ్) మరియు పాలిష్ పరిశ్రమలలో అలంకరణకు వాడేది
 A) సున్నపురాయి
 B) గ్రానైట్
 C) మాంగనీస్
 D) బెరైటిస్
 జవాబు:
 B) గ్రానైట్
35. బేరియం అనే మూలకాన్ని ఈ ఖనిజం నుండి తీస్తారు.
 A) మాంగనీస్
 B) బెరైటీస్
 C) ఫెల్ స్పార్
 D) గ్రానైట్
 జవాబు:
 B) బెరైటీస్
36. గాజు, సెరామిక్ వస్తువులు తయారు చేయడానికి దీనిని ముడిసరుకుగా ఉపయోగిస్తారు.
 A) గ్రానైట్
 B) మాంగనీస్
 C) బెరైటీస్
 D) ఫెల్డ్ స్పార్
 జవాబు:
 D) ఫెల్డ్ స్పార్
37. ఈ రిజర్వు అడవులలో మధ్యరకం ఇనుప నిక్షేపాలు అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి.
 A) కోరింగ
 B) బయ్యారం
 C) సింగరేణి
 D) పైవన్నీ
 జవాబు:
 B) బయ్యారం
38. ఫ్లోట్ ఐరన్ నిల్వలు ఉన్న ప్రదేశం
 A) ఖమ్మం
 B) అదిలాబాద్
 C) కరీంనగర్
 D) వరంగల్
 జవాబు:
 A) ఖమ్మం
39. సిమెంట్ పరిశ్రమలు, సున్నపురాయి నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతం
 A) నల్గొండ
 B) రంగారెడ్డి
 C) కరీంనగర్
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
40. పేలుడు కడ్డీలు ఉంచటానికి రంధ్రాల నుంచి జారిపోకుండా ఉండడానికి ఈ పదార్థాన్ని ఉంచుతారు.
 A) ఆక్సిన్
 B) థైరాక్సిన్
 C) రెసిన్
 D) గాలిబుడగలు
 జవాబు:
 C) రెసిన్

41. పాలరాయిని ఎక్కువగా ఈ దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది.
 A) చైనా
 B) ఆగ్నేయాసియా
 C) పై రెండూ
 D) ఏదీకాదు
 జవాబు:
 C) పై రెండూ
42. దక్షిణ భారతంలో ఎక్కువగా గచ్చుకు ఉపయోగించే తాండూర్ నీలి సున్నపురాయి బండలు ఈ జిల్లాలో లభిస్తున్నాయి.
 A) రంగారెడ్డి
 B) కరీంనగర్
 C) నల్గొండ
 D) వరంగల్
 జవాబు:
 A) రంగారెడ్డి
43. 11 మిలియన్ టన్నుల యురేనియం నిల్వలు నల్గొండ జిల్లాలోని ఈ గ్రామంలో ఉన్నాయి.
 A) లంబాపూర్
 B) నమ్మాపురం
 C) ఎల్లాపురం
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
44. దక్షిణ భారతదేశంలో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రం
 A) ఆంధ్రప్రదేశ్
 B) తెలంగాణ
 C) కర్ణాటక
 D) కేరళ
 జవాబు:
 B) తెలంగాణ
45. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనులను వెలికితీస్తున్న ప్రభుత్వరంగ కంపెనీ
 A) CCCL
 B) SCCL
 C) LCCL
 D) RCCL
 జవాబు:
 B) SCCL

46. ఓపెన్ కాస్ట్ మైనింగ్ అనగా
 A) గుట్టలను పేల్చి, తొలిచి గ్రానైట్ రాళ్లు వంటి వాటిని తీయుట
 B) లోతుగా బాంబులు ప్రవేశపెట్టి వాటిని పేల్చడం
 C) లోతుగా తవ్వి ఖనిజాలను వెలికితీయుట
 D) పైవన్నీ
 జవాబు:
 A) గుట్టలను పేల్చి, తొలిచి గ్రానైట్ రాళ్లు వంటి వాటిని తీయుట
47. చమురు, సహజవాయువులను వెలికి తీయడానికి సముద్రపు అడుగు భాగాలలో చేసే పద్ధతి
 A) డ్రిల్లింగ్
 B) క్రషింగ్
 C) పేల్చటం
 D) పైవన్నీ
 జవాబు:
 A) డ్రిల్లింగ్
48. గనుల ద్వారా భారతదేశంలో, తెలంగాణలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య వరుసగా
 A) 5 లక్షలు, 50 వేలు
 B) 10 లక్షలు, 1 లక్ష
 C) 15 లక్షలు, 2 లక్షలు
 D) 20 లక్షలు, 2 లక్షలు
 జవాబు:
 B) 10 లక్షలు, 1 లక్ష
49. ఖనిజాలు ఎవరి సంపద అనగా
 A) వ్యక్తిగత సంపద
 B) కొంతమంది వ్యక్తుల సంపద
 C) ప్రజలందరి సంపద
 D) ప్రభుత్వ సంపద కాదు
 జవాబు:
 C) ప్రజలందరి సంపద
50. గనులన్నింటినీ ప్రభుత్వం జాతీయం చేసిన సంవత్సరం
 A) 1960
 B) 1965
 C) 1970
 D) 1975
 జవాబు:
 C) 1970
51. కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం
 A) 1990
 B) 1991
 C) 1992
 D) 1993
 జవాబు:
 D) 1993
52. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ను బ్రిటిష్ ప్రైవేట్ కంపెనీ నెలకొల్పిన సంవత్సరం
 A) 1880
 B) 1886
 C) 1890
 D) 1892
 జవాబు:
 B) 1886
53. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ను హైదరాబాద్ నిజాం కొన్న సంవత్సరం
 A) 1900
 B) 1920
 C) 1930
 D) 1940
 జవాబు:
 B) 1920
54. బొగ్గును వెలికి తీయడానికి సుమారు ఎన్ని అడుగుల లోతు వరకు వెళ్ళాలి?
 A) 100 – 150
 B) 150 – 250
 C) 200 – 300
 D) 350 – 450
 జవాబు:
 C) 200 – 300
55. ఈ గాలి ఒత్తిడి పరికరంతో పేలుడు కడ్డీలను బొగ్గును పేల్చటానికి ఉపయోగిస్తారు.
 A) ఆక్సిజన్
 B) న్యూమాటిక్
 C) సింథటిక్
 D) పైవన్నీ
 జవాబు:
 B) న్యూమాటిక్
56. సింగరేణి కాలరీస్ నుంచి వచ్చే బొగ్గును ప్రధానంగా దీనికి ఉపయోగిస్తారు.
 A) థర్మల్ విద్యుత్ కు
 B) మంచినీటి సరఫరాకు
 C) ఇనుము – ఉక్కు పరిశ్రమకు
 D) ఇతర అవసరాలకు
 జవాబు:
 A) థర్మల్ విద్యుత్ కు
57. ఓపెన్ కాస్ట్ తవ్వకం చేపట్టిన ప్రాంతాలలో బొగ్గు నిల్వలు అయిపోయేది
 A) 10 – 15 సంవత్సరాలు
 B) 15 – 20 సంవత్సరాలు
 C) 20 – 25 సంవత్సరాలు
 D) 25 – 30 సంవత్సరాలు
 జవాబు:
 A) 10 – 15 సంవత్సరాలు

58. భూగర్భ గనులతో పోల్చినపుడు, ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకం
 A) అత్యంత ఖరీదైనది
 B) అత్యంత ఖరీదు తక్కువైనది
 C) రెండింటికి తేడా ఉండదు
 D) ఏదీకాదు
 జవాబు:
 A) అత్యంత ఖరీదైనది
