Practice the AP 8th Class Social Bits with Answers 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Social Bits 5th Lesson అడవులు – వినియోగం, సంరక్షణ
1. అడవుల హక్కుల చట్టం ఈ సంవత్సరంలో చేయబడింది.
 A) 2006
 B) 2004
 C) 2000
 D) 2003
 జవాబు:
 A) 2006
2. కింద ఇచ్చిన సమాచారం ఏ రకపు అడవులకు సంబంధించినది?
 1. వృక్షాలు మధ్యస్థమైన ఎత్తును కల్గి ఉంటాయి.
 2. సంవత్సరంలో ఒకసారి ఆకులు రాలుస్తాయి.
 3. ఒకే రకానికి చెందిన వృక్షాలుంటాయి.
 A) సతతహరిత అడవులు
 B) ఆకురాల్చు అడవులు
 C) సముద్రతీరపు చిత్తడి
 D) ముళ్ళ అడవులు
 జవాబు:
 B) ఆకురాల్చు అడవులు
3. హిమాలయాలలోని దేవదారు చెట్ల (పైన్) అడవులు :
 A) సంవత్సరమంతా పచ్చగా ఉంటాయి
 B) వేడి నెలల్లో ఆకులు రాలుస్తాయి
 C) ముళ్ళచెట్లను కలిగి ఉంటాయి
 D) అనేక రకాల పూలూ పళ్ళను ఇస్తాయి
 జవాబు:
 A) సంవత్సరమంతా పచ్చగా ఉంటాయి
4. ఈ క్రింది ఏ ప్రక్రియలో జరిగే తేమ నష్టాన్ని నివారించడానికి చెట్లు ఆకులు రాలుస్తాయి?
 A) భాష్పీ భవనం
 B) అవపాతం
 C) ద్రవీభవనం
 D) భాష్పోత్సేకం
 జవాబు:
 D) భాష్పోత్సేకం
5. “సతత హరిత అడవులు” ఎందుకు పచ్చగా ఉంటాయి?
 A) ఇక్కడి వృక్షాలు వేసవిలో ఆకులను రాలుస్తాయి.
 B) ఇక్కడి వృక్షాలు చెట్ల ఆకులను రాల్చుటకు ప్రత్యేక కాలం లేదు.
 C) ఇక్కడ వృక్షాలు ఎత్తుగా, పెద్ద మొదళ్ళతో పెరుగుతాయి.
 D) ఇక్కడ వృక్షాలు, గడ్డి జాతికి చెంది, ఎత్తుగా పెరుగుతాయి.
 జవాబు:
 B) ఇక్కడి వృక్షాలు చెట్ల ఆకులను రాల్చుటకు ప్రత్యేక కాలం లేదు.
6. ఈ క్రింది వాటిని జతపరుచుము
 ఎ) సతతహరిత అడవులు i) టేకు
 బి) ముళ్ళ అడవులు ii) తుమ్మ
 సి) ఆకురాల్చే అడవులు iii) దేవదారు.
 A) ఎ – iii, బి -ii, సి -i
 B) ఎ – iii, బి -i, సి -ii
 C) ఎ – ii, బి – iii, సి
 D) ఎ-i, బి – iii, సి -ii
 జవాబు:
 A) ఎ – iii, బి -ii, సి -i
7. సరైన వాక్యాన్ని గుర్తించండి.
 ఎ) గిరిజనులకు అడవులపై ఎటువంటి హక్కులు ఇవ్వకుండా వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచించ లేము.
 బి) గిరిజనుల క్రియాత్మ భాగస్వామ్యం లేకుండా అడవులను సంరక్షించలేము.
 A) ఎ మాత్రమే
 B) బి మాత్రమే
 C) ఎ మరియు బి
 D) ఎ కాదు & బి కాదు.
 జవాబు:
 C) ఎ మరియు బి

8. తక్కువ వర్షపాత ప్రాంతాలలో గల అడవులు
 A) సతత హరిత అడవులు
 B) ఆకురాల్చే అడవులు
 C) ముళ్ల అడవులు
 D) చిత్తడి అడవులు
 జవాబు:
 C) ముళ్ల అడవులు
* ఈ క్రింది సమాచారాన్ని వినియోగించుకుని దిగుడు ప్రశ్నకు సమాధానమును ఎన్నుకొనుము.
 
9. ముళ్ల జాతి అడవులలో పెరిగే చెట్లకు ఉదాహరణలను గుర్తించుము.
 A) వేప, దిరిసన
 B) బందరు, జిట్టే
 C) బలుసు, రేగు
 D) ఉరడ, కదిలి
 జవాబు:
 C) బలుసు, రేగు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
10. ఈ అడవులలో ఎవరూ ప్రవేశించరాదు
 A) రక్షిత
 B) రిజర్వు
 C) కోనిఫెరస్
 D) సతత హరిత
 జవాబు:
 B) రిజర్వు
11. చెట్లతో ఉన్న విశాలమైన భూభాగాన్ని ……. అంటారు.
 A) అడవులు
 B) తోట
 C) పెరటితోట
 D) టండ్రా వృక్షజాలం
 జవాబు:
 A) అడవులు
12. మడ అడవులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి.
 A) కొండలున్న
 B) పీఠభూముల
 C) ఎడారుల
 D) సముద్ర తీర
 జవాబు:
 D) సముద్ర తీర
13. ముళ్ళ అడవులు ………… ప్రాంతంలో ఎక్కువ పెరుగుతాయి.
 A) చిత్తడి
 B) ఉప ఆర
 C) పొడిగా ఉండే
 D) తేమగా ఉండే
 జవాబు:
 C) పొడిగా ఉండే
14. కేరళ, అండమాన్స్ లో ఈ అడవులు ఉన్నవి.
 A) ఆకురాల్చు
 B) ముళ్ళ
 C) సతత హరిత
 D) రుతుపవన
 జవాబు:
 C) సతత హరిత
15. మంచుకురిసే ప్రాంతాలలో ఈ జాతికి చెందిన దేవదారు చెట్లు పెరుగుతాయి.
 A) ముళ్ళ
 B) సతత హరిత
 C) గడ్డి భూములు
 D) కోనిఫెరస్
 జవాబు:
 D) కోనిఫెరస్
16. అడవుల హక్కుల చట్టం ఈ సంవత్సరంలో చేయబడింది
 A) 2002
 B) 2003
 C) 2004
 D) 2006
 జవాబు:
 D) 2006
17. అడవి చుట్టూ నివసించే ……… అడవిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు.
 A) క్రూర జంతువులు
 B) మనుషులు
 C) పశువులు
 D) పైవేవీ కావు
 జవాబు:
 B) మనుషులు

18. తుమ్మచెట్లు ఈ అడవులలో పెరుగుతాయి.
 A) మడ
 B) ఉష్ణమండల
 C) ముళ్ళ
 D) సమశీతోష్ణమండలం
 జవాబు:
 C) ముళ్ళ
19. CFM అనగా
 A) కమ్యూనిటీ ఫారిస్ట్ మేనేజ్ మెంట్
 B) కల్చరల్ ఫోరమ్ మేనేజ్ మెంట్
 C) క్లస్టర్ ఫిమేల్ మేనేజ్ మెంట్
 D) కమ్యూనిటీ పోక్ మేనేజ్ మెంట్
 జవాబు:
 A) కమ్యూనిటీ ఫారిస్ట్ మేనేజ్ మెంట్
20. కొంతమందికి ఇవి పవిత్ర స్థలాలు
 A) లోయలు
 B) నదులు
 C) సముద్రాలు
 D) అడవులు
 జవాబు:
 D) అడవులు
21. కదంబం, వెదురు, నేరేడు వంటి చెట్లు ఈ అడవులలో ఉంటాయి.
 A) ముళ్ళ
 B) మడ
 C) సతత హరిత
 D) ఉష్ణమండల
 జవాబు:
 C) సతత హరిత
22. అడవిలో చేసే వ్యవసాయం
 A) విస్తృత వ్యవసాయం
 B) విస్తాపన వ్యవసాయం
 C) సాంద్ర వ్యవసాయం
 D) మిశ్రమ వ్యవసాయం
 జవాబు:
 B) విస్తాపన వ్యవసాయం
23. అడవులను ఉపయోగించుకునేవి
 A) మానవులు
 B) జంతువులు, మొక్కలు
 C) పక్షులు, చేపలు, పురుగులు
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
24. అడవికి ఉన్న తేలికైన నిర్వచనం
 A) చెట్లతో ఉన్న విశాలమైన భూభాగం
 B) పక్షులతో ఉన్న కీకారణ్యం
 C) జంతువులతో ఉన్న కారడవి
 D) ఏదీకాదు
 జవాబు:
 A) చెట్లతో ఉన్న విశాలమైన భూభాగం
25. అడవికి ఉండవలసిన ప్రధాన లక్షణం
 A) విశాలమైన భూభాగం
 B) చెట్లు, దానికింద పెరిగే పొదలు
 C) గణనీయమైన జీవ వైవిధ్యత
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ

26. అడవులను ప్రభావితం చేసే అంశాలు
 A) మట్టి
 B) సూర్యరశ్మి
 C) వర్షపాతం
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
27. ఈ శతాబ్దపు ఆరంభం నాటికి వ్యవసాయానికి అనువుకాని ప్రాంతాలలో మాత్రమే అడవులు మిగిలాయి.
 A) 18
 B) 19
 C) 20
 D) 21
 జవాబు:
 C) 20
28. అడవులను వర్గీకరించుటకు ప్రధాన ఆధారం
 A) చెట్ల సాంద్రత
 B) మట్టి
 C) ఆకులు
 D) పైవన్నీ
 జవాబు:
 A) చెట్ల సాంద్రత
29. బాగా చలిగా ఉండి, మంచు కూడా కురిసే ప్రాంతాలలో పెరిగే వృక్షాలు
 A) దేవదారు
 B) బ్రహ్మజెముడు
 C) నాగజెముడు
 D) టేకు
 జవాబు:
 A) దేవదారు
30. సతతహరిత అడవులు ఈ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతాయి.
 A) భూమధ్యరేఖా ప్రాంతాలు
 B) కేరళ
 C) అండమాన్
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ

31. సతత హరిత అడవులలో పెరిగే చెట్లు
 A) కదంబం
 B) వెదురు
 C) నేరేడు
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
32. హిమాలయాల్లో పెరిగే సతత హరిత అడవులలోని ప్రధాన వృక్షజాతి
 A) తుమ్మ
 B) దేవదారు
 C) జిట్టెగి
 D) టేకు
 జవాబు:
 B) దేవదారు
33. కొన్ని నెలలపాటే వర్షాలు పడి, సంవత్సరంలో అధిక భాగం పొడిగా, వెచ్చగా ఉండే ప్రాంతాలలో పెరిగే అడవులు
 A) సతత హరిత
 B) ఆకురాల్చే
 C) ముళ్ల
 D) సముద్ర తీరపు చిత్తడి
 జవాబు:
 B) ఆకురాల్చే
34. ఆకురాల్చే అడవులలో పెరిగే ప్రధాన వృక్షజాతి
 A) వేగి
 B) ఏగిస
 C) మద్ది
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
35. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంలో పెరిగే చెట్లకు ఉదాహరణ
 i) మద్ది, టేకు
 ii) వెలగ, ఏగిస
 iii) యె, తునికి
 iv) బిల్లు, వేప, దిరిశన
 A) i, ii
 B) ii, iii
 C) iii, iv
 D) i, ii, iii, iv
 జవాబు:
 D) i, ii, iii, iv
36. చాలా తక్కువ వర్షపాతం ఉండే పొడి ప్రాంతాలలో పెరిగే వృక్షాలు.
 A) తుమ్మ, బులుసురేగ
 B) సీతాఫలం, మోదుగ
 C) వేప
 D) పైవన్నియూ
 జవాబు:
 D) పైవన్నియూ
37. సముద్రతీరపు చిత్తడి అడవులకు మరో పేరు
 A) మడ అడవులు
 B) ముళ్ల అడవులు
 C) సతత హరిత అడవులు
 D) పైవన్నియు
 జవాబు:
 A) మడ అడవులు

38. మడ అడవులలో పెరిగే ప్రధాన వృక్ష జాతులు
 1) ఉప్పు పొన్న, బొడ్డు పొన్న
 ii) ఉరడ, మడ
 iii) తెల్ల మడ, గుండు మడ
 iv) కదిలి, బెల్ల
 A) i, ii, iii
 B) ii, iii, iv
 C) i, iii, iv
 D) i, ii, iii, iv లు
 జవాబు:
 D) i, ii, iii, iv లు
39. మన రాష్ట్రంలోని అడవుల విస్తీర్ణం
 A) 50,000 చ|| కి||మీ||
 B) 40,000 చ|| కి॥మీ॥
 C) 64,000 చ|| కి॥మీ॥
 D) 74,000 చ|| కి||మీ
 జవాబు:
 C) 64,000 చ|| కి॥మీ॥
40. మనరాష్ట్ర మొత్తం భూవిస్తీర్ణంలో అడవి అనగల చెట్లు ఉన్న భూవిస్తీర్ణ శాతం
 A) 10.05%
 B) 16.65%
 C) 16%
 D) 20.74%
 జవాబు:
 C) 16%
41. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణం
 A) 80 చ|| కి॥మీ॥
 B) 100 చ కి॥మీ॥
 C) 60 చ.కి॥మీ॥
 D) 50 చ కి॥మీ॥
 జవాబు:
 B) 100 చ కి॥మీ॥
42. అడవులలో నివసించే గిరిజనులు అందరు వీరి అనుమతితో అడవిని ఉపయోగించుకుంటారు.
 A) ప్రభుత్వాధికారులు
 B) గ్రామపెద్దల
 C) ప్రభుత్వం
 D) నక్సలైట్లు
 జవాబు:
 B) గ్రామపెద్దల
43. ఈ పాలనకు ముందు అడవులను గిరిజనులు తమవిగా భావించారు.
 A) రాజులు
 B) హైదరాబాద్ నిజాం
 C) బ్రిటిష్ పాలన
 D) ఏదీకాదు
 జవాబు:
 C) బ్రిటిష్ పాలన
44. అడవులు తొందరగా అంతరించిపోవడానికి కారణం
 A) రైలు మార్గాల నిర్మాణం
 B) ఓడల తయారీ
 C) కర్మాగారాలు, గనులు
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ

45. అడవులను ఈ విధంగా వర్గీకరించటం జరిగింది.
 A) రక్షిత
 B) రిజర్వు
 C) పై రెండూ
 D) ఏదీకాదు
 జవాబు:
 C) పై రెండూ
46. అటవీ సంరక్షణ పేరుతో ఈ సంవత్సరం నుంచి గిరిజనులను పెద్ద ఎత్తున అడవుల నుంచి తొలగించారు.
 A) 1910
 B) 1920
 C) 1930
 D) 1940
 జవాబు:
 B) 1920
47. గిరిజనుల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం అడవులను సంరక్షించలేమని గుర్తించిన సంవత్సరం
 A) 1980
 B) 1988
 C) 1990
 D) 1992
 జవాబు:
 B) 1988
48. ఉమ్మడి అటవీ యాజమాన్య చట్టం ఆచరణలోనికి తెచ్చిన సంవత్సరం
 A) 1980
 B) 1985
 C) 1988
 D) 1990
 జవాబు:
 C) 1988

49. అటవీ హక్కుల చట్టం – 2006 ప్రధాన ఉద్దేశం
 A) అడవులను సంరక్షిస్తూ అటవీ వాసులకు జీవనోపాధి కల్పించుట
 B) అడవుల సుస్థిరత, మనుగడలలో అంతర్భాగమైన అటవీ వాసులు తరతరాలుగా సాగుచేస్తున్న భూములపై, నివాస ప్రాంతాలపై హక్కులను కలిగి ఉండుట
 C) ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల నిర్వాసితులైన వారితో సహా అటవీ వాసుల భూమి హక్కులు అడవిలోకి వెళ్లే హక్కుల విషయంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న అభద్రతను పరిష్కరించుట
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
