Practice the AP 8th Class Social Bits with Answers 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Social Bits 12th Lesson భారత ఎన్నికల వ్యవస్థ
1. మనదేశంలో ఓటుహక్కు పొందాలంటే ఒక పౌరునికి ఉండాల్సిన కనీస వయస్సు
 A) 18 సం||లు అంత కంటే ఎక్కువ
 B) 21 సం||లు అంత కంటే ఎక్కువ
 C) 20 సం||లు అంత కంటే ఎక్కువ
 D) 25 సం||లు అంత కంటే ఎక్కువ
 జవాబు:
 A) 18 సం||లు అంత కంటే ఎక్కువ
2. ఎన్నికల్లో అనుచిత ప్రవర్తనగా దీనిని చెప్పవచ్చు.
 A) ఎన్నికల ప్రచారం చేయటం
 B) స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయడం
 C) వ్యక్తిగత దూషణలు ,చేయటం
 D) అనుమతించిన ఖర్చు పెట్టడం
 జవాబు:
 D) అనుమతించిన ఖర్చు పెట్టడం
3. పోలింగ్ అధికారుల నియామకం, పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు తర్వాత జరిగే ప్రక్రియ
 A) తుది జాబితా ప్రకటన
 B) ఫలితాల ప్రకటన
 C) ప్రభుత్వ ఏర్పాటు
 D) నామినేషన్ల ఉపసంహరణ
 జవాబు:
 B) ఫలితాల ప్రకటన

4. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖామంత్రి
 A) శ్రీ యనమల రామకృష్ణుడు
 B) శ్రీ గంటా శ్రీనివాసరావు (2019 ఎన్నికల ముందు)
 C) శ్రీ నారా లోకేష్
 D) శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు
 జవాబు:
 B) శ్రీ గంటా శ్రీనివాసరావు (2019 ఎన్నికల ముందు)

5. కిందివాటిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఓటు వేయటానికి ఎవరు అర్హులు?
 A) లావణ్య
 B) టోని
 C) కీర్తి
 D) రఘు
 జవాబు:
 D) రఘు
6. కిందివారిలో ఎవరు లోకసభ ఎన్నికలలో పోటీ చేయవచ్చు?
 A)టోని
 B) శ్యామ్
 C) కీర్తి
 D) లావణ్య
 జవాబు:
 B) శ్యామ్
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
7. ఈ క్రింది వానిలో స్వతంత్ర వ్యవస్థ కానిది
 A) ఎలక్షన్ కమీషన్
 B) నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్
 C) SC, ST కమీషన్
 D) షా కమీషన్
 జవాబు:
 D) షా కమీషన్
8. ఓటరు దినోత్సవము జరుపుకునే తేదీ
 A) జనవరి 26
 B) జనవరి – 25
 C) జనవరి – 2
 D) జనవరి -1
 జవాబు:
 B) జనవరి – 25
9. ఎన్నికల సంఘం యొక్క అధికారి
 A) రాష్ట్రపతి
 B) ప్రధానమంత్రి
 C) ప్రధాన ఎన్నికల అధికారి
 D) గవర్నరు
 జవాబు:
 C) ప్రధాన ఎన్నికల అధికారి
10. భారతదేశంలో ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమీషనరు
 A) T.N. శేషన్
 B) ఓం ప్రకాష్ రావత్
 C) V.S. రమాదేవి
 D) R.K. త్రివేది
 జవాబు:
 B) ఓం ప్రకాష్ రావత్
11. క్రింది వానిలో సరియైన వాక్యం
 i) ఎన్నికల సంఘంలో అధికారుల పదవీకాలం 6 సం||రాలు
 ii) ఎన్నికల సంఘంలో అధికారుల పదవీ కాలం 65 సం||రాలు
 iii) పై రెండిటిలో ఏదిముందు పూర్తయితే అది
 A) i, ii & iii
 B) i మాత్రమే
 C) ii మాత్రమే
 D) ఏదీకాదు
 జవాబు:
 A) i, ii & iii

12. ఒక పార్టీ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కావలసినవి
 A) 4 అసెంబ్లీ సీట్లు / 3% పోలయిన ఓట్లు
 B) 5 అసెంబ్లీ సీట్లు / 4% పోలయిన ఓట్లు
 C) 3 అసెంబ్లీ సీట్లు / 3% పోలయిన ఓట్లు
 D) 11 అసెంబ్లీ సీట్లు /4% పోలయిన ఓట్లు
 జవాబు:
 C) 3 అసెంబ్లీ సీట్లు / 3% పోలయిన ఓట్లు
13. ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందుటకు కావలసినవి
 A) 10 M.P. సీట్లు / 4 రాష్ట్రాలు
 B) 10 M.P. సీట్లు/ 5 రాష్ట్రాలు
 C) 11 M.P. సీట్లు / 4 రాష్ట్రాలు
 D) 11 M.P. సీట్లు / 5 రాష్ట్రాలు
 జవాబు:
 C) 11 M.P. సీట్లు / 4 రాష్ట్రాలు
14. పోలింగు బూతు అధికారి
 A) రిటర్నింగ్ ఆఫీసర్
 B) ప్రిసైడింగ్ ఆఫీసర్
 C) అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్
 D) కలెక్టర్
 జవాబు:
 B) ప్రిసైడింగ్ ఆఫీసర్
15. జిల్లా ముఖ్య ఎన్నికల కమీషనరు
 A) జిల్లా జడ్జి
 B) జిల్లా కలెక్టరు
 C) జిల్లా విద్యాశాఖాధికారి
 D) పై అందరూ
 జవాబు:
 B) జిల్లా కలెక్టరు
16. NOTA ప్రవేశపెట్టబడిన సంవత్సరం
 A) 2014
 B) 2015
 C) 2016
 D) 2013
 జవాబు:
 D) 2013
17. ఉప ఎన్నికలకు సంబంధించి సరియైన వాక్యము
 A) ప్రతి 5 సం||రాలకొకసారి జరుగుతాయి
 B) ఖాళీ అయిన నియోజక వర్గానికి జరిగే ఎన్నికలు
 C) ప్రభుత్వం పడిపోతే, నిర్ణీత గడువుకు ముందే జరిగే ఎన్నికలు
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
18. పూర్తికాలం గడవక ముందే శాసనసభకు, లోకసభకు, ఎన్నికలు నిర్వహిస్తే వాటిని ఈ ఎన్నికలు అంటారు.
 A) సాధారణ ఎన్నికలు
 B) అసాధారణ ఎన్నికలు
 C) ఉప ఎన్నికలు
 D) మధ్యంతర ఎన్నికలు
 జవాబు:
 D) మధ్యంతర ఎన్నికలు
19. ఇప్పటి వరకు జరిగిన లోకసభ ఎన్నికలు
 A) 14
 B) 15
 C) 16
 D) 17
 జవాబు:
 C) 16
20. ఒక నియోజక వర్గంలో ఎన్నికలను పర్యవేక్షించునది
 A) ప్రిసైడింగ్ అధికారి
 B) జిల్లా ఎన్నికల అధికారి
 C) రిటర్నింగ్ ఆఫీసర్
 D) రాష్ట్ర ఎన్నికల అధికారి
 జవాబు:
 C) రిటర్నింగ్ ఆఫీసర్
21. సార్వత్రిక వయోజన ఓటుహక్కు గురించి వివరించు రాజ్యాంగ అధికరణ
 A) 322
 B) 323
 C) 324
 D) 326
 జవాబు:
 D) 326
22. ఎన్నికల సంఘంకు సంబంధించి సరియైన వాక్యం
 i) స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిర్ణీత కాలవ్యవధుల్లో దేశం ఎన్నికలను నిర్వహిస్తుంది.
 ii) ఎన్నికల సంఘం ప్రధానమంత్రి ఆజ్ఞలను పాటిస్తుంది.
 A) i మాత్రమే సత్యం
 B) ii మాత్రమే సత్యం
 C) i & ii సత్యం
 D) i & ii అసత్యం
 జవాబు:
 A) i మాత్రమే సత్యం
23. ఓటుహక్కు కలిగిన ఓటర్ల సముదాయాన్ని ఇలా పిలుస్తారు.
 A) ఎన్నికల సంఘం
 B) ఎలక్టోరేట్
 C) నియోజక వర్గం
 D) ఏదీకాదు
 జవాబు:
 B) ఎలక్టోరేట్
24. క్రింది వానిలో సరియైన వాక్యం
 i) 1988 సం||రానికి ముందు ఓటుహక్కు పొందటానికి కనీస వయస్సు 21 సం||రాలు.
 ii) 61వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఓటుహక్కు పొందటానికి కనీస వయస్సు 18 సం||రాలు.
 A) 1 మాత్రమే సత్యం
 B) ii మాత్రమే సత్యం
 C) i & ii సత్యం
 D) i & ii అసత్యం
 జవాబు:
 C) i & ii సత్యం
25. క్రింది వానిలో సరియైన వాక్యం
 i) జనవరి 26ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారు.
 ii) భారత ఎన్నికల సంఘం ఏర్పడి 60 సం||రాలు అయిన సందర్భంగా ప్రకటించారు.
 A) i మాత్రమే సత్యం
 B) ii మాత్రమే సత్యం
 C) i & ii సత్యం
 D) i & ii అసత్యం
 జవాబు:
 B) ii మాత్రమే సత్యం
26. పరోక్ష విధానంలో జరిగే ఎన్నికలకు ఉదాహరణ
 A) రాష్ట్రపతి ఎన్నికలు
 B) ఉపరాష్ట్రపతి ఎన్నికలు
 C) శాసనమండలి సభ్యుల ఎన్నికలు
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ

27. క్రింది వానిలో సరియైన వాక్యం
 i) లోకసభలు 543 మంది సభ్యులుంటారు. వీరిని ప్రత్యక్ష ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకుంటారు.
 ii) రాజ్యసభలో 250 మంది సభ్యులుంటారు ,వీరిలో 238 మందిని ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకుంటారు.
 A) i మాత్రమే సత్యం
 B) ii మాత్రమే సత్యం
 C) i & ii సత్యం
 D) i & ii అసత్యం
 జవాబు:
 C) i & ii సత్యం
28. ఈ సం||రం నుండి ఏక సభ్య సంస్థగా ఉండే ఎన్నికల సంఘం బహుళ సభ్య సంస్థగా మారింది.
 A) 1988
 B) 1989
 C) 1990
 D) 2010
 జవాబు:
 B) 1989
29. ఎన్నికల సంఘం నిర్మాణం, విధుల గురించి వివరించు రాజ్యాంగ అధికరణం
 A) 15వ భాగంలోని 326వ నిబంధన
 B) 16వ భాగంలోని 324వ నిబంధన
 C) 15వ భాగంలోని 324వ నిబంధన
 D) 16వ భాగంలోని 326వ నిబంధన
 జవాబు:
 C) 15వ భాగంలోని 324వ నిబంధన
30. విభజనాంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు జరిగిన తేది
 A) 31-1-2016
 B) 31-1-2014
 C) 2-6-2014
 D) 2-6-2016
 జవాబు:
 A) 31-1-2016
31. T.N. శేషన్ భారతదేశపు ఎన్నవ ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేశారు?
 A) 9వ
 B) 10వ
 C) 8వ
 D) 12వ
 జవాబు:
 B) 10వ
32. రాజకీయ పార్టీలు తమ విధి విధానాలను, ప్రాధాన్యత లను ఒక విధాన పత్రం ద్వారా ఎన్నికల ముందే ప్రజలకు దీని ద్వారా తెలియజేస్తాయి.
 A) ప్రచారం ద్వారా
 B) మ్యానిఫెస్టో ద్వారా
 C) ప్రభుత్వం ద్వారా
 D) పైవన్నీ
 జవాబు:
 B) మ్యానిఫెస్టో ద్వారా
33. EVM లను భారతదేశంలో మొట్టమొదటగా ప్రయోగాత్మకంగా వాడిన సం||రం.
 A) 1989-90
 B) 1990-91
 C) 1991-92
 D) 1992-93
 జవాబు:
 A) 1989-90
34. ఎన్నికల్లో ఓటింగ్ చేసిన తరువాత ఓటరు వేలిపై చెరిగిపోని సిరాతో గుర్తు పెట్టి పద్ధతి ఇందుకు ప్రవేశపెట్టారు.
 A) ద్వంద్వ ఓటింగ్ నిరోధించేందుకు
 B) ఓటరును గుర్తించేందుకు
 C) అక్రమాలు నిరోధించేందుకు
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ

35. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని అంశం
 A) వ్యక్తిగత దూషణలకు పాల్పడడం
 B) వృద్ధుల ఓటు, వారు చెప్పినవారు వేయటం
 C) పోలింగు రోజున కూడా ప్రచారం చేసుకోవడం
 D) ఓటర్లను ప్రలోభపెట్టడం చేయరాదు
 జవాబు:
 D) ఓటర్లను ప్రలోభపెట్టడం చేయరాదు
