These AP 7th Class Science Important Questions 8th Lesson కాంతితో అద్భుతాలు will help students prepare well for the exams.
AP Board 7th Class Science 8th Lesson Important Questions and Answers కాంతితో అద్భుతాలు
7th Class Science 8th Lesson 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 కాంతి జనకాలు అనగానేమి?
 జవాబు:
 కాంతి వివిధ రకాల వస్తువుల నుండి వస్తుంది. వాటిని కాంతి జనకాలు అంటారు.
ప్రశ్న 2.
 సహజ కాంతి జనకాలు అనగానేమి?
 జవాబు:
 సూర్యుడు, నక్షత్రాలు లాంటి కాంతి జనకాలు వాటంతట అవే కాంతిని విడుదల చేస్తాయి. అటువంటి వాటిని సహజ కాంతి జనకాలు అంటారు.
ప్రశ్న 3.
 కృత్రిమ కాంతి జనకాలు అనగానేమి?
 జవాబు:
 మానవ ప్రమేయంతో కాంతిని ఉత్పత్తిచేయు వాటిని కృత్రిమ కాంతి జనకాలు అంటారు.
ప్రశ్న 4.
 కాంతి కిరణం అనగానేమి?
 జవాబు:
 కాంతి ప్రయాణించే మార్గాన్ని కాంతికిరణం అంటారు. దీనిని బాణపు గుర్తుతో కూడిన సరళరేఖగా 
 సూచిస్తారు.
![]()
ప్రశ్న 5.
 కాంతిపరావర్తనం అనగానేమి?
 జవాబు:
 కాంతి జనకాల నుండి వస్తువులపై పడిన కాంతి తిరిగి అదే యానకంలోనికి వెనుకకు మరలే దృగ్విషయాన్ని కాంతి పరావర్తనం అంటారు.
ప్రశ్న 6.
 వస్తుదూరం అనగానేమి?
 జవాబు:
 వస్తువుకు, దర్పణానికి మధ్య గల దూరాన్ని వస్తుదూరం అంటారు.
ప్రశ్న 7.
 ప్రతిబింబ దూరం అనగానేమి?
 జవాబు:
 ప్రతిబింబం నుండి దర్పణానికి మధ్య గల దూరాన్ని ప్రతిబింబ దూరం అంటారు.
ప్రశ్న 8.
 పార్శ్వవిలోమం అనగానేమి?
 జవాబు:
 దర్పణ ప్రతిబింబం కుడి ఎడమలు తారుమారుగా ఉంటాయి. ఈ దర్పణాన్ని పార్శ్వ విలోమం అంటారు.
ప్రశ్న 9.
 నిజ ప్రతిబింబాలు అనగానేమి?
 జవాబు:
 తెరమీద పట్టగలిగే ప్రతిబింబాలను నిజ ప్రతిబింబాలు అంటారు.
ప్రశ్న 10.
 మిధ్యా ప్రతిబింబాలు అనగానేమి?
 జవాబు:
 తెరమీద పట్టలేని ప్రతిబింబాలను మిథ్యా ప్రతిబింబాలు అంటారు.
![]()
ప్రశ్న 11.
 పెరిస్కోప్ అనగానేమి?
 జవాబు:
 సముద్రం అడుగున సబ్ మెరైన్లలో నుండి నీటి ఉపరితలంపై ఉన్నటువంటి వస్తువులను లేదా వ్యక్తులను చూడటానికి ఉపయోగించే పరికరమే ‘పెరిస్కోప్’.
ప్రశ్న 12.
 పెరిస్కోప్‌లో ఉపయోగించే దర్పణాల సంఖ్య ఎంత?
 జవాబు:
 పెరిస్కోప్‌లో ఉపయోగించే దర్పణాల సంఖ్య – 2.
ప్రశ్న 13.
 పెరిస్కోప్ ఏ సూత్రంపై ఆధారపడి పని చేస్తుంది?
 జవాబు:
 సమతల దర్పణాలపై కాంతి పరావర్తనం ఆధారంగా పెరిస్కోప్ పనిచేస్తుంది.
ప్రశ్న 14.
 స్పూన్ లేదా స్టీలు గరిటె వెనుకభాగం ఏ దర్పణం వలె పని చేస్తుంది?
 జవాబు:
 స్పూన్ లేదా స్టీలు గరిటె వెనుకభాగం కుంభాకార దర్పణం వలె పని చేస్తుంది.
ప్రశ్న 15.
 కుంభాకార దర్పణం అనగానేమి?
 జవాబు:
 బయటకు వంచబడిన పరావర్తన తలాలను కుంభాకార దర్పణాలు అంటారు.
ప్రశ్న 16.
 పుటాకార దర్పణం అనగానేమి?
 జవాబు:
 పరావర్తన తలం లోపలికి వంచబడిన తలాలను పుటాకార దర్పణాలు అంటారు.
![]()
ప్రశ్న 17.
 క్రమపరావర్తనం ఎపుడు జరుగుతుంది?
 జవాబు:
 నునుపైన తలాలపైన క్రమపరావర్తనం జరుగును.
ప్రశ్న 18.
 గరుకైన తలాలు ఏ పరావర్తనంకు ఉదాహరణ?
 జవాబు:
 గరుకైన తలాలు అక్రమ పరావర్తనకు ఉదాహరణ.
ప్రశ్న 19.
 ఏ పరావర్తనంలో స్పష్టమైన ప్రతిబింబాలు ఏర్పడతాయి?
 జవాబు:
 క్రమ పరావర్తనంలో స్పష్టమైన ప్రతిబింబాలు ఏర్పడతాయి.
ప్రశ్న 20.
 పతన కోణం విలువ దేనికి సమానం?
 జవాబు:
 పతన కోణం విలువ ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానం.
ప్రశ్న 21.
 మిణుగురు పురుగు కాంతి జనకమా?
 జవాబు:
 అవును. ఇది స్వయంగా కాంతిని ఉత్పత్తి చేస్తుంది. కావున, సహజ కాంతిజనకం.
ప్రశ్న 22.
 సమతల దర్పణంలో ప్రతిబింబ దూరం ఎలా ఉంటుంది?
 జవాబు:
 సమతల దర్పణంలో వస్తువు దూరానికి సమానంగా ప్రతిబింబి దూరం ఉంటుంది.
ప్రశ్న 23.
 సమతల దర్పణం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా?
 జవాబు:
 లేదు. సమతల దర్పణం నిటారైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పర్చును.
ప్రశ్న 24.
 వాలు, దర్పణాల మధ్య ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత?
 జవాబు:
 వాలు, దర్పణాల మధ్య ఏర్పడే ప్రతిబింబాలు (n) = ( 360°/θ )- 1.
ప్రశ్న 25.
 కుంభాకార కటకం అనగానేమి?
 జవాబు:
 మధ్య భాగం మందంగా ఉండే కాంతి పారదర్శక పదార్థాన్ని కుంభాకార కటకం అంటారు.
![]()
ప్రశ్న 26.
 పుటాకార కటకం అనగానేమి?
 జవాబు:
 మధ్యలో పలుచగా ఉండి, అంచుల వెంబడి మందంగా ఉన్న కాంతి పారదర్శక పదార్థాన్ని పుటాకార కటకం అంటారు.
ప్రశ్న 27.
 న్యూటన్ డిస్క్ అనగానేమి?
 జవాబు:
 ఏడు రంగుల కాంతి చక్రాన్ని న్యూటన్ డిస్క్ అంటారు.
ప్రశ్న 28.
 న్యూటన్ డిస్క్ ను ఎందుకు వాడతాము?
 జవాబు:
 తెలుపు రంగు ఏడు రంగుల మిశ్రమం అని నిరూపించటానికి.
ప్రశ్న 29.
 ఒక దర్పణం కుంభాకార దర్పణమో, పుటాకార దర్పణమో ఎలా గుర్తిస్తారు?
 జవాబు:
 దర్పణంలోని బాహ్యతలం పరావర్తన తలం అయితే, అది కుంభాకార దర్పణమని, దర్పణంలోని అంతర తలం పరావర్తన తలం అయితే అది పుటాకార దర్పణమని గుర్తించవచ్చు.
ప్రశ్న 30.
 రెండు దర్పణాల మధ్యకోణం 60° అయితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత?
 జవాబు:
 
ప్రశ్న 31.
 క్రింది పటంలో పరావర్తన కిరణాన్ని గీయండి.
 
 జవాబు:
 
7th Class Science 8th Lesson 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 సూర్యుడు సహజ కాంతిజనకమేనా? దీనిలో ఏముంటాయి?
 జవాబు:
- సూర్యుడు అతి పెద్ద సహజ కాంతిజనకం.
 - దాని వ్యాసం సుమారు 1.39 మిలియన్ కిలోమీటర్లు.
 - సూర్యకాంతి భూమిని చేరుటకు 8.33 నిమిషాల సమయం పడుతుంది.
 - సూర్యుని ద్రవ్యరాశిలో నాలుగింట మూడు వంతులు (సుమారు 75%) హైడ్రోజన్, మిగతా భాగంలో ఎక్కువగా హీలియం (సుమారు 25%) మరియు తక్కువ పరిమాణంలో ఆక్సిజన్, కార్బన్, నియాన్ మరియు ఇనుము లాంటి మూలకాలను కలిగి ఉంటుంది.
 
ప్రశ్న 2.
 కాంతి కిరణపుంజం అనగానేమి? అందలి రకాలు తెలుపండి.
 జవాబు:
 వాస్తవంగా కాంతి అనేది ఒక కాంతి కిరణం మాత్రమే కాదు, అనేక కాంతి కిరణాల సముదాయం . ఈ కాంతి కిరణాల సముదాయాన్ని కాంతి కిరణపుంజం అంటారు. మూడు రకాల కాంతి కిరణ పుంజాలు ఉంటాయి.
 
- సమాంతర కాంతి కిరణపుంజం
 - అభిసరణ కాంతి కిరణపుంజం
 - అపసరణ కాంతి కిరణపుంజం (S – కాంతి జనకం)
 
ప్రశ్న 3.
 సమాంతర కాంతికిరణ పుంజం అనగానేమి? దానిని ఎలా ఏర్పరుస్తావు?
 జవాబు:
 ఒక అట్టముక్కను మరియు కార్డుబోర్డును తీసుకోండి. కార్డుబోర్డుపై సన్నని చీలికలను చేయండి. కార్డుబోర్డును అట్టముక్కకు లంబంగా ఉంచండి. ఇప్పుడు దానిని ఉదయంపూట ఎండలో పటంలో చూపిన విధంగా ఉంచండి. కాంతికిరణాలు సూర్యుని నుండి కార్డుబోర్డుపై పడి సన్నని చీలికలగుండా ప్రయాణిస్తాయి. ఆ కాంతికిరణాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నట్లు మనం గమనించవచ్చు.
 
ఒకదానికొకటి సమాంతరంగా ప్రయాణిస్తున్న కాంతికిరణాల సముదాయాన్ని సమాంతర సమాంతర కాంతికిరణ పుంజం అంటారు.
ప్రశ్న 4.
 అభిసరణ కాంతికిరణ పుంజం అనగానేమి? దానిని ఎలా ఏర్పరుస్తావు?
 జవాబు:
 ఒక ఆకలిక్ దర్శణాన్ని కాంతికిరణాలు వచ్చే మార్గంలో పటంలో చూపిన విధంగా అమర్చండి. కాంతికిరణాలన్నీ దర్పణంపై పడి ఒక బిందువు వద్దకు చేరతాయి. ఇలా అన్ని దిశలనుండి వచ్చిన కాంతికిరణాలు ఒక బిందువును చేరే కాంతి కిరణాలసముదాయాన్ని అభిసరణ కాంతికిరణ పుంజం అంటారు.
 
ప్రశ్న 5.
 అపసరణ కాంతి కిరణ పుంజం అనగానేమి?
 జవాబు:
- ఒక ఆక్రలిక్ దర్పణాన్ని వంచి దాని ఉబ్బెత్తు వైపు కాంతికిరణాలు పడేటట్లు చేయండి.
 - కాంతి కిరణాలు దర్పణం నుండి పరావర్తనం చెంది వివిధ దిశలలో ప్రయాణిస్తాయి.
 - వివిధ దిశలలో ప్రయాణించే కాంతి కిరణాల సముదాయాన్ని అపసరణ కాంతి కిరణ పుంజం అంటారు.
 

ప్రశ్న 6.
 అభిసరణ కాంతి కిరణ పుంజం, అపసరణ కాంతి కిరణ పుంజం మధ్య గల భేదాలు తెలుపండి.
 జవాబు:
| అభిసరణ కాంతికిరణ పుంజం | అపసరణ కాంతికిరణ పుంజం | 
| 1) వివిధ దిశల నుండి ప్రయాణిస్తున్న కాంతి కిరణాలు ఒక బిందువు వద్ద చేరును. | 1) కాంతి జనకం నుండి వివిధ దిశలలో ప్రయాణించును. | 
| 2) నిజ ప్రతిబింబాన్ని ఏర్పర్చును. | 2) నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచలేదు. | 
| 3) కిరణాలు కేంద్రీకరించబడతాయి. | 3) కిరణాలు వికేంద్రీకరించబడతాయి. | 
| 4) కుంభాకార కటకం, పుటాకార దర్పణం వలన ఏర్పర్చవచ్చు. | 4) పుటాకార కటకం, కుంభాకార దర్పణం వలన ఏర్పర్చవచ్చు. | 
ప్రశ్న 7.
 పతన కిరణం, పరావర్తన కిరణం మధ్య గల భేదాలు ఏమిటి?
 జవాబు:
| పతన కిరణం | పరావర్తన కిరణం | 
| 1) కాంతి జనకం నుండి వెలువడును. | 1) వస్తువు నుండి పరావర్తనం చెందును. | 
| 2) అభిసరణ లేదా సమాంతర కాంతికిరణ పుంజం | 2) అపసరణ లేదా సమాంతర కాంతి కిరణ పుంజం | 
| 3) పరావర్తనం చెంది పరావర్తన కిరణాన్ని ఏర్పర్చును. | 3) పతన కిరణం నుండి ఏర్పడును. | 
| 4) పరావర్తన కిరణం లేకున్నా పతన కిరణం ఉండవచ్చు. | 4) పతన కిరణం లేకుండా పరావర్తన కిరణం ఉండదు. | 
![]()
ప్రశ్న 8.
 క్రమ పరావర్తనం, అక్రమ పరావర్తనం మధ్య గల భేదాలు ఏమిటి?
 జవాబు:
| క్రమ పరావర్తనం | అక్రమ పరావర్తనం | 
| 1) నునుపైన తలంపై జరుగును. | 1) గరుకైన తలంపై జరుగును. | 
| 2) స్పష్టమైన ప్రతిబింబం ఏర్పర్చును. | 2) ప్రతిబింబం అస్పష్టంగా ఉండును. | 
| 3) ఒక పరావర్తన కోణం ఉండును. | 3) పరావర్తన కోణాలు భిన్నంగా ఉండును. | 
| 4) ఉదా : సమతల దర్పణం | 4) ఉదా : గీతలు పడిన అద్దము. | 
ప్రశ్న 9.
 సమతల దర్పణాలు ఏర్పరచు ప్రతిబింబ లక్షణాలు తెలుపండి.
 జవాబు:
 సమతల దర్పణాలు ఏర్పరచు ప్రతిబింబ లక్షణాలు:
- వసుదూరము ప్రతిబింబ దూరానికి సమానం.
 - వస్తు పరిమాణం ప్రతిబింబ పరిమాణానికి సమానం.
 - ఎల్లప్పుడూ మిథ్యా మరియు నిటారైన ప్రతిబింబాన్నే ఏర్పరుస్తుంది.
 - పార్శ్వ విలోమమైన ప్రతిబింబం ఏర్పరుస్తుంది. (కుడి ఎడమలు తారుమారు).
 
ప్రశ్న 10.
 నిజ ప్రతిబింబము, మిథ్యా ప్రతిబింబం మధ్య తేడాలు ఏమిటి?
 జవాబు:
| నిజ ప్రతిబింబము | మిథ్యా ప్రతిబింబము | 
| 1) తెరమీద పట్టగలిగిన ప్రతిబింబాలను నిజ ప్రతిబింబాలు అంటారు. | 1) వీటిని తెర మీద పట్టలేము. | 
| 2) కాంతికిరణాల కేంద్రీకరణ అనగా అభిసరణ కాంతిపుంజం వలన ఏర్పడుతుంది. | 2) సమాంతర కాంతిపుంజం వలన ఏర్పడుతుంది. | 
| 3) కంటితో చూడలేము. | 3) కంటితో చూడగలం. | 
| 4) ఉదా : కుంభాకార కటకం పుటాకార దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబాలు. | 4) సమతల దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబాలు. | 
ప్రశ్న 11.
 సమతల దర్పణాల వలన అనేక ప్రతిబింబాలు ఏర్పడాలంటే ఏమి చేయాలి?
 జవాబు:
 సమతల దర్పణాల వలన అనేక ప్రతిబింబాలు ఏర్పడాలంటే వాటి మధ్య కొంత కోణం ఉండేట్లు చూడాలి.
 
ప్రశ్న 12.
 కుంభాకార దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు తెలుపండి.
 జవాబు:
 కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ
- మిథ్యా ప్రతిబింబాన్ని
 - నిటారైన ప్రతిబింబాన్ని
 - చిన్నదైన ప్రతిబింబాన్ని
 - వస్తువు స్థానంతో సంబంధం లేకుండా ఏర్పర్చును.
 
ప్రశ్న 13.
 పుటాకార దర్పణాలను ఆయుధాలుగా వాడిన చారిత్రక నేపథ్యం గూర్చి రాయండి.
 జవాబు:
 
 పూర్వము పుటాకార దర్పణాలను ఆయుధాలుగా కూడా వాడేవారు. గ్రీకు శాస్త్రవేత్త అయిన ఆర్కిమెడిస్ రెండు వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి దర్పణాలను ఆయుధాలుగా వాడారు. రోమన్లు గ్రీసు దేశంలోని సైరాక్యూస్ అనే పట్టణం మీద దాడి చేసినప్పుడు ఆర్కిమెడి స్పుటాకార దర్పణాలను ప్రక్కపటంలో చూపిన విధంగా అమర్చారు. ఆ దర్పణాలు ఏ దిశలో అయినా కదల్చటానికి వీలుగా ఉంటాయి. సూర్యకాంతిని రోమన్ సైన్యం పై పరావర్తనం చెందించడానికి వీలుగా ఆ దర్పణాలు అమర్చబడ్డాయి. సూర్యశక్తి ఎక్కువ భాగం కేంద్రీకరించడం వల్ల ఓడలో మంటలు ఏర్పడ్డాయి. రోమన్ సైన్యం ఏం జరుగుతుందో అర్థం కాక వెనుదిరగవలసి వచ్చింది.
ప్రశ్న 14.
 రియర్ వ్యూ మిర్రర్ గా దేనిని ఉపయోగిస్తారు?
 జవాబు:
- కుంభాకార దర్పణంగా రియర్ వ్యూ మిర్రర్స్ వాడతారు.
 - వీటిలో ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించిన వస్తువులను పరిశీలించవచ్చు.
 - డ్రైవర్ తలను వెనుకకు తిప్పి చూడకుండా వాహనాలను గమనించటానికి వీటిని వాడతారు.
 - ఇటువంటి మిర్రలు రోడ్ల మలుపు వద్ద కూడా అమర్చి ఎదురుగా వచ్చే వాహనాలను డ్రైవర్స్ గమనిస్తారు.
 
ప్రశ్న 15.
 కటకం అనగానేమి? అందలి రకాలు ఏమిటి?
 జవాబు:
 ఇరువైపులా వక్రతలాలను కలిగిన కాంతి పారదర్శక పదార్థాన్ని ‘కటకం’ అంటారు. కటకాలు రెండు రకాలు. అవి:
- కుంభాకార కటకం
 - పుటాకార కటకం
 

ప్రశ్న 16.
 ఎలక్ట్రానిక్ వస్తువులు వాడునపుడు, నీవు పాటించే కంటి భద్రత చర్యలు ఏమి?
 జవాబు:
 ఎలక్ట్రానిక్ వస్తువులు వాడునపుడు పాటించే కంటి భద్రత చర్యలు :
- గదిలో సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలి.
 - కంప్యూటర్ ను వాడేటప్పుడు పవర్ సేవ్ మోడ్ లో ఉంచాలి.
 - సెల్‌ఫోన్ వాడేటప్పుడు బ్లూలైట్ ఫిల్టర్ లో ఉంచుకోవాలి.
 - టి.వి. చూసేటప్పుడు – 20-20-20 సూత్రం పాటించాలి. అంటే – 20 అడుగుల దూరంలో 20 నిమిషాలకొకసారి 20 సెకన్ల పాటు, విరామం తీసుకోవటం.
 
ప్రశ్న 17.
 న్యూటన్ రంగుల డి లోని ఏడు రంగులలో ఏదైనా ఒక రంగును తొలగించి, గుండ్రంగా తిప్పిన తర్వాత అది తెలుపు రంగులో కనిపిస్తుందా?
 జవాబు:
- న్యూటన్ రంగుల డిస్క్ లోని ఏడు రంగులలో ఏదైనా ఒక రంగును తొలగించి గుండ్రంగా తిప్పినప్పుడు అది తెలుపురంగులో కనిపించదు.
 - తెలుపురంగు ఏడు వర్ణాల మిశ్రమం.
 - ఏ వర్ణం లోపించినా అది తెల్లగా కనిపించదు.
 
![]()
ప్రశ్న 18.
 ఈ ప్రయోగం మీ ప్రయోగశాలలో నిర్వహించారు కదా ! కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
 
 1) ఈ ప్రయోగంలో వాడిన దర్పణం ఏది?
 జవాబు:
 పుటాకార దర్పణం.
2) కొవ్వొత్తి ప్రతిబింబం తెరపై ఎలా కనబడింది?
 జవాబు:
 తలక్రిందులుగా
3) ప్రతిబింబాన్ని తెరమీద పట్టగలిగారుకదా ! దీన్ని ఏ ప్రతిబింబం అంటారు?
 జవాబు:
 నిజ ప్రతిబింబం అంటారు.
4) ఈ ప్రయోగ నిర్వహణకు అవసరమైన పరికరాలు ఏవి?
 జవాబు:
 U-స్టాండ్, దర్పణాలు, కొవ్వొత్తి, అగ్గిపెట్టె, తెర, స్కేలు.
7th Class Science 8th Lesson 8 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 వాలు, దర్పణాల మధ్య ఏర్పడే ప్రతిబింబాలకు సమీకరణాలు రాబట్టండి.
 జవాబు:
- ఒక డ్రాయింగ్ బోర్డు తీసుకొని దానిపై తెల్ల కాగితాన్ని పరచండి.
 - తెల్లకాగితంపై అర్ధవృత్తాన్ని గీసి కోణమానినితో కోణాలు గుర్తించండి.
 - రెండు సమతల దర్పణాలు తీసుకొని సెల్లో పెన్ టేతో ఒకవైపు అంటించండి.
 - ఇప్పుడు అది పుస్తకంలా తెరవటానికి మూయటానికి అనుకూలంగా ఉంటుంది.
 - రెండు దర్పణాల మధ్య 120° కోణం ఉంచి వాటి మధ్య వెలుగుతున్న క్రొవ్వొత్తి ఉంచండి.
 - దర్పణాలలో ఏర్పడిన ప్రతిబింబాల సంఖ్య లెక్కించండి.
 - దర్పణాల మధ్య కోణాన్ని తగ్గిస్తూ ఏర్పడిన ప్రతిబింబాలను లెక్కించండి.
 - వివరాలను క్రింది పట్టికలో నమోదు చేయండి.
దర్పణాల మధ్య కోణం ప్రతిబింబాల సంఖ్య 1. 120° 3 2. 90° 4 3. 60° 6 4. 45° 8 5. 30° 12  - పైన ఏర్పడిన ప్రతిబింబాల సంఖ్యకు దర్పణాల కోణానికి మధ్య సంబంధాన్ని పరిశీలించినపుడు

 - 360° లకు దర్పణాల కోణంలో భాగించినపుడు పూర్ణసంఖ్య రాకుంటే, ప్రతిబింబాల సంఖ్య ఆ తరువాత పూర్ణ సంఖ్య అవుతుంది.
 
ప్రశ్న 2.
 కుంభాకార, పుటాకార దర్పణాల మధ్యగల తేడా ఏమిటి? వాటి బొమ్మలు గీయండి.
 జవాబు:
| కుంభాకార దర్పణం | పుటాకార దర్పణం | 
| 1. కుంభాకార తలం పవర్తన తలంగా పనిచేస్తుంది. | 1. పుటాకార తలం పరావర్తన తలంగా పనిచేస్తుంది. | 
| 2. ప్రతిబింబం చిన్నదిగా ఉంటుంది. (చిన్నది) | 2. ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది. (పెద్దది) | 
| 3. మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. | 3. నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. | 
| 4. నిటారు ప్రతిబింబము. | 4. తలక్రిందుల ప్రతిబింబము. | 
| 5. వాహనాలలో రియర్ వ్యూ మిర్రర్ గా వాడతారు. | 5. వాహనాల హెడ్ లైట్లలో వాడతారు. మరియు E.N.T డాక్టర్స్ వాడతారు. | 

AP Board 7th Class Science 8th Lesson 1 Mark Bits Questions and Answers కాంతితో అద్భుతాలు
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
సరియైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్ లో రాయండి.
1. కాంతిని ఉత్పత్తిచేయు వస్తువులు
 A) కాంతి జనకాలు
 B) కాంతి పరావర్తనాలు
 C) కాంతి విశ్లేషకాలు
 D) యానకం
 జవాబు:
 A) కాంతి జనకాలు
2. క్రింది వానిలో భిన్నమైనది
 A) అగ్గిపెట్టె
 B) కొవ్వొత్తి
 C) సూర్యుడు
 D) టార్చిలైట్
 జవాబు:
 C) సూర్యుడు
![]()
3. కాంతిని ఉత్పత్తిచేయు జీవి
 A) మిణుగురు
 B) తిమింగలం
 C) షార్క్
 D) కప్ప
 జవాబు:
 A) మిణుగురు
4. కాంతి కిరణానికి గుర్తు
 
 జవాబు:
 A
5. క్రమ పరావర్తనం వలన ఏర్పడే ప్రతిబింబం
 A) స్పష్టమైనది
 B) అస్పష్టం
 C) ఏర్పడదు
 D) చెప్పలేదు
 జవాబు:
 A) స్పష్టమైనది
6. పతనకోణం విలువ 60° అయితే, పరావర్తన కోణం విలువ?
 A) 40°
 B) 60°
 C) 90°
 D) 120°
 జవాబు:
 B) 60°
7. ఏ ప్రతిబింబాలలో పార్శ్వ విలోమం ఉంటుంది?
 A) సమాంతర కిరణాలు
 B) సమాంతర దర్పణం
 C) సమతల దర్పణం
 D) పైవన్నీ
 జవాబు:
 C) సమతల దర్పణం
8. సమతల దర్పణ ప్రతిబింబము
 A) నిటారు
 B) మిథ్యా
 C) పార్శ్వ విలోమం
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
9. కుంభాకార దర్పణ ప్రతిబింబాలు
 A) నిటారు
 B) మిథ్యా
 C) చిన్నది
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
10. పుటాకార దర్పణ ప్రతిబింబాలు
 A) నిటారు
 B) తలక్రిందులు
 C) మిథ్యా
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
11. పెరిస్కోప్ పనిచేయు నియమం
 A) కాంతి పరావర్తనం
 B) కాంతి వక్రీభవనం
 C) కాంతి విశ్లేషణం
 D) కాంతి వ్యతికరణం
 జవాబు:
 A) కాంతి పరావర్తనం
![]()
12. ENT డాక్టర్స్ వాడే దర్పణం
 A) కుంభాకార
 B) పుటాకార
 C) సమతల
 D) కటకం
 జవాబు:
 B) పుటాకార
13. ATM మెషిన్లపై వాడే దర్పణం
 A) కుంభాకార
 B) పుటాకార
 C) సమతల
 D) సమతల కుంభాకార
 జవాబు:
 A) కుంభాకార
14. సూర్యకిరణాలతో ఒక కాగితం కాల్చటానికి వాడే కటకం
 A) కుంభాకార
 B) పుటాకార
 C) సమతల
 D) ద్విపుటాకార
 జవాబు:
 A) కుంభాకార
15. కుంభాకార కటక మధ్య భాగం
 A) పలుచగా
 B) మందముగా
 C) చదునుగా
 D) గరుకుగా
 జవాబు:
 B) మందముగా
16. సాధారణ భూతద్దం ఒక
 A) పుటాకార దర్పణం
 B) పుటాకార కటకం
 C) కుంభాకార దర్పణం
 D) కుంభాకార కటకం
 జవాబు:
 C) కుంభాకార దర్పణం
17. 
 పటంలో చూపబడినది
 A) కుంభాకార కటకం
 B) పుటాకార కటకం
 C) సమతల దర్పణం
 D) సమతల కటకం
 జవాబు:
 A) కుంభాకార కటకం
18.
 
 ఈ పటం దేనికి సంబంధించినది?
 A) గొట్టం
 B) పెరిస్కోప్
 C) కటకం
 D) దర్పణం
 జవాబు:
 B) పెరిస్కోప్
19. 
 పటం దేనిని సూచిస్తుంది?
 A) పరావర్తనం
 B) అభిసరణం
 C) అపసరణం
 D) సమాంతరం
 జవాబు:
 A) పరావర్తనం
20. 
 పటం దేనిని సూచిస్తుంది?
 A) అభిసరణ కాంతిపుంజం
 B) అపసరణ కాంతిపుంజం
 C) సమాంతర కాంతిపుంజం
 D) ఏదీకాదు
 జవాబు:
 B) అపసరణ కాంతిపుంజం
![]()
21. నిలకడగా ఉన్న నీరు దేనిలా ప్రవర్తిస్తుంది?
 A) సమతల దర్పణం
 B) పుటాకార దర్పణం
 C) కుంభాకార దర్పణం
 D) కుంభాకార కటకం
 జవాబు:
 A) సమతల దర్పణం
22. ఈ క్రింది వానిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.
 A) పతన కిరణం పరావర్తన కిరణం తలానికి ఇరువైపులా ఉంటాయి.
 B) పతన కిరణం పరావర్తన కిరణం లంబానికి ఇరువైపులా ఉంటాయి.
 C) పతన కోణం పరావర్తన కోణానికి సమానం.
 D) పతన కిరణం పరావర్తన కిరణం ఒకే తలంలో ఉంటాయి.
 జవాబు:
 A) పతన కిరణం పరావర్తన కిరణం తలానికి ఇరువైపులా ఉంటాయి.
23. కవిత రెండు దర్పణాల మధ్య 60° కోణం ఉంచి 5 ప్రతిబింబాలను చూపింది. భావన ఆ దర్పణాల మధ్య కోణాన్ని మార్చి 11 ప్రతిబింబాలు ఏర్పరచింది. ఎంత కోణంలో దర్పణాలను అమర్చి ఉంటుంది?
 A) 30°
 B) 45°
 C) 60°
 D) 90°
 జవాబు:
 A) 30°
24. సమతల దర్పణం నుండి వస్తువుకు గల దూరం
 A) దర్పణం లోపల ప్రతిబింబానికి గల దూరానికి రెట్టింపు.
 B) దరుణం లోపల ప్రతిబింబానికి గల దూరానికి సమానం.
 C) దర్పణం లోపల ప్రతిబింబానికి గల దూరంలో సగం.
 D) దర్పణం లోపల ప్రతిబింబంపై ఆధారపడదు.
 జవాబు:
 B) దరుణం లోపల ప్రతిబింబానికి గల దూరానికి సమానం.
25. ఈ క్రింది వానిలో కుంభాకార కటకాన్ని సూచించే పటం
 
 జవాబు:
 C
26. ఈ క్రింది వానిలో పుటాకార దర్పణాన్ని సూచించే పటం
 
 జవాబు:
 B
27. పెరిసోటోని రెండు దర్శణాలను ఒకదానికొకటి
 A) 45° కోణంలో ఉంచాలి
 B) లంబకోణంలో ఉంచాలి
 C) 90° కోణంలో ఉంచాలి
 D) 180° కోణంలో ఉంచాలి
 జవాబు:
 C) 90° కోణంలో ఉంచాలి
![]()
28. ఈ రంగు కాంతి రెటీనాను రక్షించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది.
 A) నీలి రంగు
 B) పసుపు రంగు
 C) ఎరుపు రంగు
 D) ముదురు ఎరుపు రంగు
 జవాబు:
 B) పసుపు రంగు
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. తెలుపు రంగు …………….. రంగుల మిశ్రమం.
 2. వాహనాల రియర్ వ్యూ మిర్రలు …….. దర్పణాలు.
 3. ENT డాక్టర్స్ వాడే దర్పణం …………. దర్పణం.
 4. పుటాకార, కుంభాకార దర్పణాలను ………… దర్పణాలు అంటారు.
 5. పెరిస్కోప్ కాంతి ………. ఆధారంగా పని చేస్తుంది.
 6. క్రమ పరావర్తనంలో ………………. ప్రతిబింబము ఏర్పడుతుంది.
 7. పతనకోణం విలువ ………….. కోణానికి సమానం.
 8. గరుకు తలాలపై ……………. పరావర్తనం జరుగును.
 9. కాంతిని ఉత్పత్తిచేయు వాటిని …………….. అంటారు.
 10. టెలివిజన్‌కు వీక్షకుణికి మధ్య …………… అడుగుల దూరం ఉండాలి.
 11. భూతద్దం ఒక ……………….. కటకం.
 12. అంచుల వెంబడి మందంగా ఉన్న కటకం ……………. కటకం.
 13. స్టీల్ గరిటె …………. దర్పణాల వలె పని చేస్తుంది.
 14. స్టీల్ గరిటె లోపలి తలం ……………… దర్పణం వలె, వెలుపలి వైపు …………… దర్పణంవలె పని చేస్తుంది.
 15. పెరిస్కోప్ లో వాడే దర్పణాల సంఖ్య …………….
 16. పెరిస్కోలో దర్పణాల వాలు కోణం ………………
 17. పెరిస్కో ప్లో కాంతి ……………. సార్లు పరావర్తనం చెందుతుంది.
 18. స్వీట్ దుకాణాలలో వాడే దర్పణాలు ……………… దర్పణాలు.
 19. వాలు, దర్పణాల మధ్య ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య (n) = …………..
 20. ……………… ప్రతిబింబమును కంటితో చూడలేము. కాని తెరమీద పట్టవచ్చు.
 21. …………….. మిధ్యా ప్రతిబింబమును కంటితో చూడగలం. కాని తెరమీద పట్టలేము.
 22. కుడి ఎడమలు తారుమారు కావడాన్ని ……………………. అంటారు.
 23. సమతల దర్పణంలో వస్తుదూరం ………….. సమానం.
 24. వస్తువులపై పడిన కాంతి తిరిగి అదే యానకంలోనికి రావడాన్ని ………………. అంటారు.
 25. కుంభాకార తలాలు ………….. కాంతికిరణ పుంజాన్ని ఏర్పరుస్తాయి.
 26. పుటాకార తలాలు ………………. కాంతికిరణ పుంజాన్ని ఏర్పరుస్తాయి.
 27. సహజ కాంతి జనకమునకు ఉదాహరణ ……………..
 28. సూర్యునిలో అదనంగా ఉండే వాయువు ………………..
 29. కృత్రిమ కాంతి జనకాలు ……………..
 30. రాత్రి సెల్ ఫోన్ చూచేటపుడు వాటిని ……………….. లో ఉంచాలి.
 31. రెండు దర్పణాల మధ్య కోణం 30° ఉన్నప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ……………..
 32. పెరిస్కోప్ పొడవు పెంచితే దర్పణాల సంఖ్య ………………..
 33. వాహనాల హెడ్ లైట్లలో వాడే దర్పణం ………………….. దర్పణం
 34. ఆఫ్తాల్మొస్కోప్ పరికరాన్ని …………………. వైద్యులు వాడతారు.
 35. న్యూటన్ రంగుల డి లోని రంగుల సంఖ్య ………………….
 జవాబు:
- ఏడు
 - కుంభాకార
 - పుటాకార
 - గోళాకార
 - పరావర్తనం
 - స్పష్టమైన
 - పరావర్తన
 - క్రమరహిత
 - కాంతిజనకాలు
 - 20
 - కుంభాకార
 - పుటాకార
 - వక్రతల
 - పుటాకార, కుంభాకార
 - 2
 - 45°
 - రెండు
 - సమతల
 - 360°/θ -1
 - నిజ
 - మిథ్యా
 - పార్శ్వవిలోమం
 - ప్రతిబింబ దూరానికి
 - పరావర్తనం
 - అపసరణ
 - అభిసరణ
 - సూర్యుడు
 - హైడ్రోజన్
 - టార్చిలైట్
 - Blue light filter
 - 12
 - మారదు
 - పుటాకార
 - కంటి
 - 7
 
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
 
 జవాబు:
 4, 3, 5, 2, 1
2.
| Group – A | Group – B | 
| A) కుంభాకార కటకం | 1) అనేక ప్రతిబింబాలు | 
| B) కుంభాకార దర్పణం | 2) రెండు వైపులా ఉబ్బెత్తు | 
| C) సమతల దర్పణం | 3) నిటారు, చిన్నది | 
| D) పుటాకార కటకం | 4) నిటారు, మిథ్యా, పార్శ్వవిలోమం | 
| E) పుటాకార దర్పణం | |
| F) వాలు దర్పణాలు | 
జవాబు:
| Group – A | Group – B | 
| A) కుంభాకార కటకం | 2) రెండు వైపులా ఉబ్బెత్తు | 
| B) కుంభాకార దర్పణం | 3) నిటారు, చిన్నది | 
| C) సమతల దర్పణం | 4) నిటారు, మిథ్యా, పార్శ్వవిలోమం | 
| D) పుటాకార కటకం | 5) మందమైన అంచులు | 
| E) పుటాకార దర్పణం | 6) ENT డాక్టర్స్ | 
| F) వాలు దర్పణాలు | 1) అనేక ప్రతిబింబాలు | 
మీకు తెలుసా?
→ నిజ ప్రతిబింబమును మనం సాధారణ కంటితో చూడలేము. కానీ ప్రతిబింబమును తెరమీద పట్టవచ్చు. మిధ్యా ప్రతిబింబమును మనం దర్పణం నందు సాధారణ కంటితో చూడగలం. కానీ దానిని తెరమీద పట్టలేము.

 → పూర్వము పుటాకార దర్పణాలను ఆయుధాలుగా కూడా వాడేవారు. గ్రీకు శాస్త్రవేత్త అయిన ఆర్కిమెడిస్ రెండు వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి దర్పణాలను ఆయుధాలుగా వాడారు. రోమన్లు గ్రీసు దేశంలోని సైరాక్యూస్ అనే పట్టణం మీద దాడి చేసినప్పుడు ఆర్కిమెడి స్పుటాకార దర్పణాలను ప్రక్కపటంలో చూపిన విధంగా అమర్చారు. ఆ దర్పణాలు ఏ దిశలో అయినా కదల్చటానికి వీలుగా ఉంటాయి. సూర్య కాంతిని రోమన్ సైన్యం పై పరావర్తనం చెందించడానికి వీలుగా ఆ దర్పణాలు అమర్చబడ్డాయి. సూర్యశక్తి ఎక్కువ భాగం కేంద్రీకరించడం వల్ల ఓడలో మంటలు ఏర్పడ్డాయి. రోమన్ సైన్యం ఏం జరుగుతుందో అర్థం కాక వెనుదిరుగవలసి వచ్చింది.

 → ATM మిషన్లపై కుంభాకార దర్పణాలను భద్రత ప్రమాణాల దృష్ట్యా మన వెనుక భాగం విశాలంగా కనిపించే విధంగా అమర్చుతారు. దీని ద్వారా ఇతరులు వెనుక వైపు మీ పాస్ వర్డ్ ను చూడకుండా నివారిస్తుంది.