These AP 7th Class Science Important Questions 4th Lesson శ్వాసక్రియ – ప్రసరణ will help students prepare well for the exams.
AP Board 7th Class Science 4th Lesson Important Questions and Answers శ్వాసక్రియ – ప్రసరణ
7th Class Science 4th Lesson 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 ఉచ్వా సము అనగానేమి?
 జవాబు:
 గాలిని లోపలికి పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసము అంటారు.
ప్రశ్న 2.
 నిశ్వాసము అనగానేమి?
 జవాబు:
 పీల్చిన గాలిని బయటకు వదలటాన్ని నిశ్వాసం అంటారు.
ప్రశ్న 3.
 శ్వాసించే రేటు అనగానేమి?
 జవాబు:
 ఒక నిముషంలో తీసుకొనే శ్వాసను, శ్వాసించే రేటు అంటారు. సాధారణంగా దీని విలువ నిముషానికి 14 నుండి 20 సార్లు ఉంటుంది.
ప్రశ్న 4.
 మన శరీరంలో నీటిపైన తేలే అవయవం ఏమిటి?
 జవాబు:
 ఊపిరితిత్తులు మన శరీరంలోని నీటి పైన తేలే అవయవం.
![]()
ప్రశ్న 5.
 స్టెతస్కోప్ యొక్క ఉపయోగం ఏమిటి?
 జవాబు:
 హృదయ స్పందనలు తెలుసుకోవటానికి వైద్యులు స్టెతస్కోప్ వాడతారు.
ప్రశ్న 6.
 రక్తంలోని హి మోగ్లోబిన్ పాత్ర ఏమిటి?
 జవాబు:
 రక్తంలోని హిమోగ్లోబిన్ O2 మరియు CO2 రవాణాలో పాల్గొంటుంది.
ప్రశ్న 7.
 రక్త ఫలకికల పని ఏమిటి?
 జవాబు:
 రక్తస్రావం జరగకుండా త్వరగా రక్తం గడ్డకట్టడానికి రక్త ఫలకికలు తోడ్పడతాయి.
ప్రశ్న 8.
 రోగ నిరోధక శక్తి అనగానేమి?
 జవాబు:
 శరీరంలోనికి ప్రవేశించే రోగకార క్రిములతో పోరాడే శక్తి కల్గి ఉండటం. ఇది తెల్ల రక్తకణాల వలన కలుగుతుంది.
ప్రశ్న 9.
 సంక్రమణ అనగానేమి?
 జవాబు:
 రోగకారక క్రిములు శరీరంలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణ అంటారు.
ప్రశ్న 10.
 వ్యాధి కారకములు ఎన్ని రకములు?
 జవాబు:
 వ్యాధి కారకములు ప్రధానంగా రెండు రకాలు. అవి :
- బాక్టీరియా
 - వైరస్లు
 
ప్రశ్న 11.
 వైరస్‌లను దేనితో పరిశీలిస్తారు?
 జవాబు:
 ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా వైరలను పరిశీలిస్తారు.
![]()
ప్రశ్న 12.
 వైరస్ వ్యాధులకు ఉదాహరణ ఇవ్వండి.
 జవాబు:
 జలుబు, పోలియో, HIV, కోవిడ్-19.
ప్రశ్న 13.
 బాక్టీరియా వ్యాధులకు ఉదాహరణ ఇవ్వండి.
 జవాబు:
 టైఫాయిడ్, కలరా, క్షయ మొదలైనవి బ్యా క్టీరియా వ్యాధులు.
7th Class Science 4th Lesson 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 మానవ శ్వాసవ్యవస్థలోని వాయు మార్గానికి దిమ్మె చిత్రం గీయండి.
 జవాబు:
 ![]()
ప్రశ్న 2.
 మానవ ఊపిరితిత్తులను వర్ణించండి.
 జవాబు:
 ఊపిరితిత్తులు మృదువైన, సాగే గుణముగల సంచుల వంటి నిర్మాణాలు. ఇవి ఎరుపు గులాబీ రంగులో ఉంటాయి. వీటిలో అనేక చిన్న వాయు కుహరాలు ఉంటాయి. ఊపిరితిత్తులు ఛాతీ భాగంలో ప్రక్కటెముకలచే నిర్మించబడిన ఉరఃపంజరంలో సురక్షితంగా ఉంటాయి. కుడి ఊపిరితిత్తి ఎడమ ఊపిరితిత్తి కంటే కొద్దిగా పెద్దదిగా ఉంటుంది. ఊపిరితిత్తులలో కండరాలు ఉండవు, కావున అవి తమంతట తాముగా సంకోచ వ్యాకోచాల ద్వారా గాలిని లోపలకు బయటకు పంపలేవు.
![]()
ప్రశ్న 3.
 ధూమపానం వలన కలుగు నష్టాలు ఏమిటి?
 జవాబు:
 పొగాకు పొగలోని నికోటిన్ అనే విషపదార్థం శరీర అన్ని భాగాలకు చేర్చబడుతుంది. ధూమపానం ఒక దురలవాటు, దీనివలన వారికే కాకుండా వారి చుట్టు పక్కల ఉన్నవారికి కూడా ప్రమాదకరం. ధూమపానము వలన ఊపిరితిత్తుల కాన్సర్, క్షయ మరియు ఇతర శ్వాససంబంధ వ్యాధులు కలుగుతాయి.
ప్రశ్న 4.
 ట్రాకియల్ శ్వాసక్రియ గురించి రాయండి.
 జవాబు:
 
 వాయునాళాల ద్వారా జరిగే శ్వాసక్రియను ట్రాకియల్ లేదా వాయునాళ శ్వాసక్రియ అని అంటారు. ఇవి కీటకాలలో ఉంటాయి. ఈ వ్యవస్థలో ట్రాకియా శరీరానికి ఇరువైపులా చిన్న స్పైరకిల్ అనే రంధ్రాలు ఉంటాయి. ఇవి వలయాకారంగా శరీరంలో అల్లుకుపోయిన వాయునాళాలలోకి తెరుచుకొని శరీరంలోని అన్ని భాగాలకు గాలిని చేర్చి వాయుమార్పిడి ప్రక్రియ పూర్తిచేస్తాయి.
 ఉదా : బొద్దింక, మిడత, తేనెటీగ మొదలగునవి.
ప్రశ్న 5.
 క్యుటేనియస్ శ్వాసక్రియ గురించి రాయండి.
 జవాబు:
 
 చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియను క్యుటేనియస్ లేదా చర్మ శ్వాసక్రియ అని అంటారు. కొన్ని జంతువులలో చర్మము తేమగా మరియు జిగటగా శ్లేష్మంతో కూడి ఉండి శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది.
 ఉదా : వానపాము, కప్ప మొదలైనవి. కప్పలో శ్వాసించడానికి ఊపిరితిత్తులుంటాయి. వీటిని కప్పలు నేలపై శ్వాసించడానికి ఉపయోగిస్తాయి. నీటిలో ఉన్నప్పుడు కప్పలు తమ మృదువైన, జిగురు చర్మంతో శ్వాసిస్తాయి.
ప్రశ్న 6.
 బ్రాంకియల్ శ్వాసక్రియ గురించి రాయండి.
 జవాబు:
 
 మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియను బ్రాంకియల్ లేదా జల శ్వాసక్రియ అని అంటారు. ఇవి చేపలలోని శ్వాసవయవాలు. మొప్పలు తలకు ఇరువైపులా మొప్పలు ఉన్న దొప్పల లోపల ఉంటాయి. మొప్పలలో రక్తం అధికంగా ఉండడం వలన ఆక్సిజన్ మరియు కార్బన్ డై ఆక్సైడ్ మార్పిడికి ఉపయోగపడుతుంది. చేపలు తమ నోటి ద్వారా నీటిని తీసుకొని దానిని మొప్పల మీదుగా పంపి నప్పుడు నీటిలో కరిగి ఉండే ఆక్సిజనను శోషిస్తాయి.
ఈ కారణం చేతనే చేపలు నీటిలో శ్వాసించగలవు కానీ ఊపిరితిత్తులు కలిగి ఉండే మానవులు గానీ ఇతర జంతువులు గానీ నీటిలో శ్వాసించలేవు.
ప్రశ్న 7.
 పల్మనరీ శ్వాసక్రియ గురించి రాయండి.
 జవాబు:
 ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసప్రక్రియను పల్మనరీ శ్వాసక్రియ అని కూడా అంటారు. భూమిపై ఉండే అన్ని జీవులలో మరియు నీటిలో ఉండే కొన్ని జీవులలో ఊపిరితిత్తులు శ్వాసించడానికి ఉపయోగిస్తాయి. ఇవి గాలిలోని ఆక్సీజన్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి.
 ఉదా : ఆవు, కుక్క తిమింగలం, మానవులు మొదలగునవి.
ప్రశ్న 8.
 మొక్కలను మనం ఎందుకు పరిరక్షించాలి?
 జవాబు:
 శ్వాసక్రియలో మొక్కలు ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తాయి. అవే మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకొని అక్సిజన్ ను విడుదల చేస్తాయి. కాబట్టి మనం మొక్కలను నాటడం మరియు పరిరక్షించడం ద్వారా ఎక్కువ ఆక్సిజన్ పొందవచ్చు.
ప్రశ్న 9.
 మానవ హృదయాన్ని వర్ణించండి.
 జవాబు:
 
 గుండె :
 గుండె రక్తసరఫరా వ్యవస్థలో రక్తాన్ని పంపు చేసే ప్రధాన అవయవం. ఇది మన గుప్పెడంత పరిమాణములో ఉంటుంది. గుండె ఛాతీకుహరము మధ్యలో కాస్త ఎడమవైపునకు వంగి ఉండుటచేత ఎడమ ఊపిరితితి కుడి ఊపిరితితి కంటే కాస్త చిన్నగా ఉంటుంది. దీనిలో నాలుగు గదులుంటాయి, పై రెండు గదులను కర్ణికలు అంటారు. క్రింది రెండు గదులను జఠరికలు అంటారు. గుండెగదుల గోడలు కండరాలతో నిర్మితమయ్యి క్రమబద్ధంగా, లయబద్ధంగా సంకోచవ్యాకోచాలతో రక్తాన్ని పంపుచేస్తాయి. ఈ లయబద్ధ సంకోచము మరియు వ్యాకోచములను హృదయస్పందన అంటారు.
ప్రశ్న 10.
 మానవ రక్తప్రసరణ వ్యవస్థలోని రక్తనాళాలు గురించి రాయండి.
 జవాబు:
 శరీరభాగాలన్నింటికీ గుండె రక్తనాళాల ద్వారా రక్తాన్ని పంపు చేస్తుంది. మానవ శరీరంలో మూడురకాల రక్తనాళాలు ఉన్నాయి.
- ధమనులు – ఇవి అధిక ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని గుండె నుండి శరీరభాగాలకు సరఫరా చేస్తాయి.
 - సిరలు – ఇవి అధిక కార్బన్ డై ఆక్సెడ్ కలిగిన రక్తాన్ని శరీరభాగాల నుండి గుండెకు సరఫరా చేస్తాయి.
 - రక్త కేశ నాళికలు – ఇవి అతి సన్నని రక్తనాళాలు, ధమనులను సిరలను అనుసంధానం చేసి శరీర భాగాలన్నింటికీ రక్తాన్ని సరఫరా చేస్తాయి.
 
![]()
ప్రశ్న 11.
 మానవ రక్త కణాలను వర్ణించండి.
 జవాబు:
 మానవ రక్తం రక్తకణాలు మరియు ప్లాస్మాతో ఏర్పడుతుంది. ప్లాస్మా అనేది రక్తంలోని ద్రవభాగం. రక్తకణాలు మూడు రకాలు – ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు మరియు రక్త ఫలకికలు. తెల్ల రక్తకణాలు పలు రకాలు. ఇవి మన శరీర రోగనిరోధక శక్తి పెంపొందించి, మన శరీరంలోకి ప్రవేశించిన రోగకారక సూక్ష్మజీవులతో పోరాడి మనకు రక్షణ కల్పిస్తాయి. ఇవి మన శరీరంలో రక్షణ దళం వలె పనిచేస్తాయి. ఎర్ర రక్తకణాలలో హి మోగ్లోబిన్ అనే ఎర్రని వర్ణకం ఉండడం వలన రక్తం ఎర్ర రంగులో ఉంటుంది.
 
ప్రశ్న 12.
 రక్తంలోని వివిధ పదార్థాల ప్రాధాన్యత ఏమిటి?
 జవాబు:
 రక్తంలోని హిమోగ్లోబిన్ ఆక్సిజన్ మరియు కార్బన్ డై ఆక్సైడ్ వాహకంగా పనిచేస్తూ శ్వాసక్రియలో ప్రధానపాత్ర పోషిస్తుంది. రక్తఫలకికలు గాయాలైనప్పుడు రక్తస్రావం అధికంగా జరగకుండా, త్వరగా గడ్డకట్టడానికి ఉపయోగ పడతాయి. రక్తము జంతువులలో పదార్థాల రవాణాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్తము ఒక యానకము వలె జీర్ణమైన ఆహార పదార్థాలలో మరియు శ్వాసించిన ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు చేరుస్తుంది.
ప్రశ్న 13.
 ఆరోగ్యకరమైన జీవనశైలికి నీవు సూచించే సూచనలు ఏమిటి?
 జవాబు:
- వారంలో ఐదు రోజులపాటు కనీసం 30 నిముషాలు శారీరక వ్యాయామం చేయాలి.
 - రక్తం ప్రసరణను కండరాల బలాన్ని పెంచుకోవాలి.
 - ఎక్కువ శారీరక శ్రమ మంచి ఆరోగ్య కారకం.
 
ప్రశ్న 14.
 కోవిడ్ – 19ను ప్రపంచ మహమ్మారిగా పరిగణించారు ఎందుకు?
 జవాబు:
 కోవిడ్ – 19 అనే వ్యాధి ఇటీవలె ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపించినది. ఒక దేశంలో లేక ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి అత్యధిక జనాభాకు సంక్రమించే వ్యాధిని ప్రపంచ మహమ్మారి అంటారు. మనము ఇటువంటి వ్యాధులను లేక వ్యాధి సంక్రమణను రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం ద్వారా నివారించవచ్చు.
ప్రశ్న 15.
 బాక్టీరియా వ్యాధులు, వైరస్ వ్యాధులకు మధ్యగల భేదం ఏమిటి?
 జవాబు:
| బ్యాక్టీరియా వ్యాధులు | వైరస్ వ్యాధులు | 
| 1. యాంటీబయోటిక్స్ సహాయంతో నయం చేయవచ్చు. | 1. యాంటీబయోటితో నయం చేయలేము. | 
| 2. కొన్నింటికి మాత్రమే వ్యాక్సిన్ అవసరం. | 2. వ్యాక్సీన్ మాత్రమే ప్రత్యామ్నాయం. | 
| 3. ఉదా : టైఫాయిడ్, కలరా, క్షయ (TB) | 3. ఉదా : జలుబు, పోలియో, HIV, కోవిడ్-19 | 
ప్రశ్న 16.
 కరోనా వైరస్ గురించి రాయండి.
 జవాబు:
 కరోనా వైరస్ వ్యాధి ఒక సంక్రమిత వ్యాధి. ఇది నూతనముగా ఆవిష్కరించబడిన కరోనా వైరస్ వలన కలుగును. ఈ వ్యాధి సంక్రమించిన వారిలో అత్యధికులలో సామాన్యం నుండి ఒక మోస్తరు శ్వాససంబంధ అనారోగ్యం కలగడం, ఆ తరువాత ఎటువంటి ప్రత్యేక వైద్య సేవలు అవసరం లేకుండానే కోలుకున్నారు. వృద్ధులు మరియు గుండె సంబంధ వ్యాధులు, చక్కెర వ్యాధిగ్రస్తులు, ఊపిరితిత్తుల వ్యాధులు కలవారికి మాత్రం కరోనా బాగా ప్రభావం చూపడంవలన తీవ్ర అనారోగ్యానికి గురైనారు. కొన్నిసార్లు అది వారి మరణానికి కూడా దారి తీస్తుంది.
ప్రశ్న 17.
 కోవిడ్-19 ఎలా వ్యాపిస్తుంది? దీని నివారణ చర్యలు ఏమిటి?
 జవాబు:
 ఈ వ్యాధి సంక్రామ్యతను నివారించడానికి మరియు తగ్గించడానికి మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఆ చర్య లేమిటంటే చేతులను సబ్బుతో లేక శానిటైజర్ తో తరచుగా శుభ్రపరుచుకోవడం, ముక్కు, నోరు, కళ్ళు తాకకపోవడం, ముఖానికి మాస్కు ధరించడం. కోవిడ్-19 వైరస్ ప్రధానంగా రోగి తుమ్మినపుడు లేక దగ్గినపుడు వారి యొక్క లాలాజల తుంపరలు మరియు చీమిడి తుంపరల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
ప్రశ్న 18.
 కోవిడ్ ప్రోటోకాల్ తెలపండి.
 జవాబు:
 కోవిడ్ ప్రొటోకాల్ – S.M.S
 S – శానిటైజర్
 M – మాస్క్
 S – సోషల్ డిస్టెన్స్
![]()
ప్రశ్న 19.
 శ్వాస వ్యవస్థకు సంబంధించిన సహజ ప్రక్రియలు తెలపండి.
 జవాబు:
 శ్వాస వ్యవస్థకు సంబంధించిన సహజ ప్రక్రియలు :
- తుమ్మడం
 - ఆవలింతలు
 - దగ్గడం
 - పొలమారడం
 
ప్రశ్న 20.
 రక్తం కారే గాయాలకు నీవు అందించే ప్రథమచికిత్స ఏమిటి?
 జవాబు:
 
 మనకు గాయాలైనప్పుడు లేక తెగినప్పుడు రక్తస్రావం జరుగుతుంది. ముందుగా గాయాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. దూది. లేక గుడ్డతో గాయమైన భాగాన్ని తుడవాలి. తదుపరి దూది లేక బ్యాండేజి క్లాత్ (గాజు గుడ్డ) తో గాయానికి కట్టుకట్టి రక్త స్రావాన్ని ఆపాలి. రక్త స్రావం ఆగని పక్షంలో దగ్గరలోని వైద్యుని వద్దకు లేక వైద్యశాలకు ఆ వ్యక్తిని తీసుకెళ్ళాలి.
7th Class Science 4th Lesson 8 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
 తుమ్మడం అనే ప్రక్రియను వివరించండి.
 జవాబు:
 హఠాత్తుగా అనియంత్రితంగా ఊపిరితిత్తుల నుంచి ముక్కు ద్వారా గాలిని బలవంతంగా బయటకు పంపించడాన్ని తుమ్మడం అంటారు. ఇది నాసికా మార్గములో కలిగే చికాకు వలన జరుగుతుంది. మనం గాలి ద్వారా దుమ్ము, పొగ, పుప్పొడి లేక ఘాటు వాసన పీల్చినపుడు తుమ్ములు వస్తాయి. తుమ్ము ఒక వరం. కారణం దీని ద్వారా మన శరీరానికి అనవసరమైన మరియు ప్రమాదకరమైన పదార్థాలను ఊపిరితిత్తుల నుండి బయటకు పంపి మనల్ని కాపాడుతుంది. మనం ఎప్పుడు తుమ్మినా జేబు రుమాలు ముక్కుకు అడ్డంగా పెట్టుకోవాలి.
ప్రశ్న 2.
 ఆవలింత గురించి రాయండి.
 జవాబు:
 మన ప్రమేయం లేకుండానే నోటిని పెద్దగా తెరిచి ఒక దీర్ఘమైన పెద్ద శ్వాసను తీసుకోవడాన్నే ఆవలింత అంటాము. ఇది ఒక వ్యక్తిలో అనాశక్తి, వత్తిడి, నిద్ర వచ్చినప్పుడు లేక బాగా అలసిపోయినప్పుడు జరిగే ప్రక్రియ. శ్వాసక్రియ – రేటు నిదానించి మెదడుకు సరిపడినంత ఆక్సిజన్ లభించనప్పుడు మనం ఆవలిస్తాము. ఇలాంటి పరిస్థితులలో మన శరీరము అసంకల్పితంగా నోటిని తెరిచి ఒక పెద్ద, దీర్ఘమైన శ్వాసను తీసుకుంటుంది.
ప్రశ్న 3.
 దగ్గడం మరియు పొలమారడం ప్రక్రియలను తెలపండి.
 జవాబు:
 దగ్గడం :
 ఊపిరితిత్తులు సంకోచించి దానిలోని పదార్థాలను బలవంతంగా బయటకు పంపే ప్రక్రియను దగ్గు అంటాము. ఇది ఘాటు వాసనలు లేదా దుమ్ము ఊపిరితిత్తుల లోపలి పొరను చికాకు పరిచినప్పుడు జరుగుతుంది. దగ్గడం ద్వారా ఊపిరితిత్తులలో జలుబు లేక ఇలా శ్వాస సంబంధ రుగ్మతల వలన చేరిన ఘన మరియు పాక్షిక ఘన వ్యర్థ పదార్థాలు కూడా బయటకు పంపబడతాయి.
పొలమారడం (ఆప్నియా) :
 తాత్కాలిక శ్వాస సిలుపుదలను ఆప్నియా అంటారు. మనం ఏదైనా తినేటప్పుడు ఆహారం గ్రసని భాగంలో ఉన్నప్పుడు అసంకల్పితంగా జరిగే ప్రక్రియ. ఆహారం వాయునాళంలోకి ప్రవేశించకుండా ఈ చర్య కాపాడుతుంది. ఆహార పదార్థాలు వాయు నాళంలోకి వెళితే ప్రాణానికే ప్రమాదం. కావున స్వరపేటిక ముందుకు కదిలి ఆపుతుంది. కాబట్టి మనం ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు.
![]()
ప్రశ్న 4.
 ఉక్కిరి బిక్కిరి అవటం అంటే ఏమిటి? పెద్దవారిలోనూ, చిన్నవారిలోనూ నీవు చేయు ప్రథమచికిత్స ఏమిటి?
 జవాబు:
 వాయు నాళములో ఏమైనా అడ్డుపడినప్పుడు గాలి ఆడకపోతే దానినే ఉక్కిరిబిక్కిరి అంటారు. వెంటనే చర్య తీసుకోకపోతే ఇది ప్రమాదకరమైన పరిస్థితి కావున వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. పెద్దలలోనైతే ఆ వ్యక్తిని వెనుక నుండి పొట్ట చుట్టూ ప్రక్కటెముకల క్రిందగా పట్టుకొని గట్టిగా నొక్కి విడవాలి. ఇలా ఆ వ్యక్తి దగ్గే వరకు లేదా వాంతి అయ్యే వరకు చేయాలి. పిల్లలలోనైతే ఆటల్లో గింజలు, నాణాలు లేక సీసామూతలు మింగినప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. పిల్లలను మన ఒళ్లో బోర్లా పడుకోబెట్టి తల క్రిందికి ఉండేట్టు చేసి వీపు భాగంలో భుజం ఎముకల మధ్య గట్టిగా తట్టడం ద్వారా ఆ వస్తువులు బయటకు వచ్చి స్వాంతన పొందుతారు. వారిని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి.
AP Board 7th Class Science 4th Lesson 1 Mark Bits Questions and Answers శ్వాసక్రియ – ప్రసరణ
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. శ్వాస వ్యవస్థకు సంబంధించి సహజ ప్రక్రియ కానిది
 A) తుమ్మటం
 B) దగ్గటం
 C) ఏడ్వటం
 D) ఆవలించటం
 జవాబు:
 C) ఏడ్వటం
2. క్రిందివానిలో విభిన్నమైనది
 A) టైఫాయిడ్
 B) కలరా
 C) క్షయ
 D) కోవిడ్
 జవాబు:
 D) కోవిడ్
3. శరీర రక్షణ దళం
 A) ఎర్ర రక్తకణాలు
 B) తెల్ల రక్తకణాలు
 C) రక్త ఫలకికలు
 D) రక్త కణాలు
 జవాబు:
 B) తెల్ల రక్తకణాలు
![]()
4. హృదయ స్పందనల పరిశీలనకు వాడే పరికరం
 A) స్టెతస్కోప్
 B) ఆక్సీమీటరు
 C) పల్వనోమీటరు
 D) బి.పి. మీటర్
 జవాబు:
 A) స్టెతస్కోప్
5. S.M.S ప్రోటోకాల్ ఏ వ్యాధికి సంబంధించినది?
 A) కోవిడ్
 B) పోలియో
 C) క్యాన్సర్
 D) మలేరియా
 జవాబు:
 A) కోవిడ్
6. మెదడుకు సరిపడినంత ఆక్సిజన్ లభించనపుడు
 A) పొగాకు
 B) వేపాకు
 C) దగ్గుతాం
 D) పొలమారటం
 జవాబు:
 B) వేపాకు
7. గ్రసనికి సంబంధించిన శ్వాసవ్యవస్థ సహజ ప్రక్రియ
 A) తుమ్మటం
 B) ఆవలించటం
 C) దగ్గటం
 D) పొలమారటం
 జవాబు:
 D) పొలమారటం
8. గుండె పై గదులు
 A) జఠరికలు
 B) కర్ణికలు
 C) ధమనులు
 D) సిరలు
 జవాబు:
 B) కర్ణికలు
9. హృదయ సంకోచ వ్యాకోచములను కలిపి ఏమంటారు?
 A) హృదయస్పందన
 B) నాడీ స్పందన
 C) గుండెపోటు
 D) అలసట
 జవాబు:
 A) హృదయస్పందన
10. రక్తప్రసరణ వ్యవస్థలో భాగము కానిది.
 A) ఊపిరితిత్తులు
 B) గుండె
 C) రక్తము
 D) రక్తనాళాలు
 జవాబు:
 A) ఊపిరితిత్తులు
11. మొక్కకు ముక్కు వంటిది
 A) కాండము
 B) పత్రము
 C) పత్రరంధ్రము
 D) బెరడు
 జవాబు:
 C) పత్రరంధ్రము
12. శ్వాసక్రియలో వెలువడు వాయువు
 A) O2
 B) H2
 C) CO2
 D) N2
 జవాబు:
 C) CO2
13. నికోటిన్ పదార్థం ఏ ఆకులో ఉంటుంది?
 A) తుమ్ముతాము
 B) ఆవలిస్తాము
 C) కరివేపాకు
 D) రావి
 జవాబు:
 A) తుమ్ముతాము
14. ఉచ్ఛ్వాస, నిశ్వాస గాలిలో స్థిరమైన పరిమాణం గల వాయువు
 A) O2
 B) CO2
 C) నీటి ఆవిరి
 D) నత్రజని
 జవాబు:
 D) నత్రజని
![]()
15. మన శరీరంలో వాయు రవాణాకు తోడ్పడునది
 A) ఊపిరితిత్తులు
 B) గుండె
 C) రక్తము
 D) నాలుక
 జవాబు:
 C) రక్తము
II. ఖాళీలను పూరించుట
కింది ఖాళీలను పూరింపుము.
1. ఉచ్ఛ్వాస, నిశ్వాస ప్రక్రియనే …………………………. అంటారు.
 2. శ్వాసించే రేటు నిముషానికి …………….. సార్లు.
 3. మానవునిలో శ్వాస అవయవాలు ……………..
 4. …………… ఊపిరితిత్తి …………….. ఊపిరితిత్తి కంటే పెద్దది.
 5. ఆహారం, వాయువులకు ఉమ్మడి మార్గం …………..
 6. ‘C’ ఆకారపు రింగులు గల శ్వాస వ్యవస్థ భాగము ………………………
 7. పురుష శ్వా స కదలికలో ……………….. ప్రముఖ పాత్ర వహిస్తుంది.
 8. స్త్రీల శ్వాస కదలికలో ……………… ప్రముఖ పాత్ర వహిస్తుంది.
 9. మానవ శరీరంలో నీటిపై తేలియాడే అవయవం …………………
 10. నిశ్వాస గాలిలో ……………. మరియు ………… పరిమాణం అధికంగా ఉంటుంది.
 11. CO2 సున్నపు నీటిని ………… వలె మార్చుతుంది.
 12. పొగాకులోని ప్రమాదకర పదార్థం …………
 13. కాండము ……………. ద్వారా శ్వాసిస్తుంది.
 14. అతిచిన్న రక్తనాళాలు …………
 15. రక్తములోని వర్ణక పదార్థం …………..
 16. వ్యాధి నిరోధకతలో కీలకపాత్ర వహించునవి ……………….
 17. నీలిరంగు రక్తం కలిగిన జీవులు …………………
 18. ప్రపంచ మహమ్మారి ……………………….
 19. రోగ కారక జీవి శరీరంలో ప్రవేశించటాన్ని ………………. అంటారు.
 20. వైరస్ ను ………………….. మాత్రమే చూడగలం.
 21. వైరస్ వ్యాధులు …………….
 22. గుండెకు రక్తాన్ని చేరవేయు నాళాలు …………..
 23. ట్రాకియా వ్యవస్థ …………………. కనిపిస్తుంది.
 24. రక్తములోని ద్రవ భాగము ……………………
 25. రక్తం గడ్డకట్టటంలో తోడ్పడునవి ……………
 26. కోవిడ్-19……………….. ద్వారా వ్యాపిస్తుంది.
 జవాబు:
- శ్వాసించటం
 - 14 నుండి 20
 - ఊపిరితిత్తులు
 - కుడి, ఎడమ
 - గ్రసని
 - వాయునాళము
 - ఉదర వితానం
 - ఉరఃపంజరం
 - ఊపిరితిత్తులు
 - CO2 నీటి ఆవరి
 - తెల్లనిపాల
12. నికోటిన్ - లెటికణాలు
 - రక్త కేశనాళికలు
 - హిమోగ్లోబిన్
 - తెల్ల రక్తకణాలు
 - నత్తలు, పీతలు
 - కోవిడ్-19
 - సంక్రమణ
 - ఎలక్ట్రాన్ మైక్రోస్కోలో
 - జలుబు, పోలియో
 - సిరలు
 - కీటకాలలో
 - ప్లాస్మా
 - రక్త ఫలకికలు
 - లాలాజల తుంపర
 
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
| Group – A | Group – B | 
| A) ట్రాకియా | 1) రక్తం గడ్డకట్టడం | 
| B) చర్మము | 2) వాయు గొట్టాలు | 
| C) మొప్పలు | 3) తేమగా | 
| D) ఊపిరితిత్తులు | 4) వ్యా ధి నిరోధకత | 
| E) తెల్ల రక్తకణాలు | 5) ఎర్రగా | 
| F) రక్త ఫలకికలు | 6) ఉరఃకుహరం | 
జవాబు:
| Group – A | Group – B | 
| A) ట్రాకియా | 2) వాయు గొట్టాలు | 
| B) చర్మము | 3) తేమగా | 
| C) మొప్పలు | 5) ఎర్రగా | 
| D) ఊపిరితిత్తులు | 6) ఉరఃకుహరం | 
| E) తెల్ల రక్తకణాలు | 4) వ్యా ధి నిరోధకత | 
| F) రక్త ఫలకికలు | 1) రక్తం గడ్డకట్టడం | 
2.
| Group – A | Group – B | 
| A) ఆవలించడం | 1) నాసికామార్గం | 
| B) తుమ్మటం | 2) దీర్ఘమైన శ్వాస | 
| C) దగ్గటం | 3) గ్రసని | 
| D) పొలమారటం | 4) శ్లేష్మం | 
| E) ఉక్కిరిబిక్కిరి | 5) పీత | 
| F) సంక్రమణ | 6) రోగకారకం | 
| G) నీలివర్ణం | 7) వాయు నాళములో అడ్డంకి | 
జవాబు:
| Group – A | Group – B | 
| A) ఆవలించడం | 2) దీర్ఘమైన శ్వాస | 
| B) తుమ్మటం | 1) నాసికామార్గం | 
| C) దగ్గటం | 4) శ్లేష్మం | 
| D) పొలమారటం | 3) గ్రసని | 
| E) ఉక్కిరిబిక్కిరి | 7) వాయు నాళములో అడ్డంకి | 
| F) సంక్రమణ | 6) రోగకారకం | 
| G) నీలివర్ణం | 5) పీత | 
మీకు తెలుసా?
→ మానవ శరీరంలో నీటిపై తేలియాడే ఏకైక అవయవం ఊపిరితిత్తులు.
→ గొప్ప శాస్త్రవేత్తలైన వాన హెల్మెంట్ మరియు జోసెఫ్ బ్లాక్ కృషి ఫలితంగా కార్బన్ డై ఆక్సైడ్ కనుగొనబడింది. జోసెఫ్ ప్రీస్ట్ మరియు లావోయిజర్లు ఆక్సిజన్‌ను కనుగొన్నారు.
→ తిమింగలాలు, డాల్ఫిన్లు, సీళ్ళు మొ|| సముద్రపు జీవులు. ఇవి నీటిలో ఉన్నప్పటికి ఊపిరితిత్తులు ఉన్న కారణంగా క్రమం తప్పకుండా నీటి పైకి వచ్చి గాలిని పీల్చుకొని శ్వాసిస్తాయి.
![]()
→ శ్వాసక్రియలో మొక్క ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తాయి. అవే మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. కాబట్టి మనం మొక్కలను నాటడం మరియు పరిరక్షించడం ద్వారా ఎక్కువ ఆక్సిజన్ పొందవచ్చు.