Practice the AP 7th Class Science Bits with Answers 12th Lesson నేల మరియు నీరు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Science Bits 12th Lesson నేల మరియు నీరు
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
సరియైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్ లో రాయండి.
1. పరిసరాల పరిశుభ్రతకు చేయాల్సిన పని
 A) ఘన వ్యర్థాలను కాలువలో వేయరాదు.
 B) బహిరంగ మలమూత్ర విసర్జన చేయరాదు.
 C) చెత్తను వేరుచేసి పారవెయ్యాలి.
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
![]()
2. మురుగు నీటిశుదీకరణలో భాగం కాట
 A) భౌతిక ప్రక్రియ
 B) రసాయనిక ప్రక్రియ
 C) జీవ సంబంధ క్రియ
 D) సామూహిక క్రియ
 జవాబు:
 D) సామూహిక క్రియ
3. నీటివనరుల సంరక్షణకు వాడే 4R కు చెందనిది
 A) Recharge
 B) Reuse
 C) Revive
 D) Recover
 జవాబు:
 D) Recover
4. మురుగునీటి వలన వ్యాపించే వ్యాధులు
 A) విరోచనాలు
 B) హెపటైటిస్
 C) కలరా
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
5. నీటికి బ్లీచింగ్ కలపటం వలన
 A) మలినాలు పోతాయి
 B) సూక్ష్మజీవులు మరణిస్తాయి
 C) రేణువులు తొలగించబడతాయి
 D) వడపోత జరుగును
 జవాబు:
 B) సూక్ష్మజీవులు మరణిస్తాయి
6. నీటి కొరతకు కారణం
 A) అడవుల నరికివేత
 B) జనాభా విస్పోటనం
 C) పారిశ్రామీకరణ
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
7. ఆక్విఫర్లు అనగా
 A) నీటినిల్వ
 B) రాతిపొర
 C) బోరుబావి
 D) ఇంకుడు గుంట
 జవాబు:
 A) నీటినిల్వ
8. సముద్ర నీటి శాతం
 A) 1%
 B) 3%
 C) 97%
 D) 100%
 జవాబు:
 C) 97%
![]()
9. ప్రపంచ జల దినోత్సవం
 A) జులై – 5
 B) మార్చి – 22
 C) జూన్ – 22
 D) ఆగష్టు – 5
 జవాబు:
 B) మార్చి – 22
10. నేల క్రమక్షయానికి కారణం
 A) గాలి
 B) వర్షం
 C) వరదలు
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
11. ఏ మట్టి పై పొరలలో నీరు నిల్వ ఉంటుంది?
 A) ఇసుక నేల
 B) లోమ్ నేల
 C) బంకమట్టి
 D) మిశ్రమ నేల
 జవాబు:
 B) లోమ్ నేల
12. పెర్కొలేషన్ అనగా
 A) నీరు క్రిందకు భూమి పొరలలో ప్రయాణించటం
 B) నీరు ఊరటం
 C) నీరు ఆవిరి కావటం
 D) నీరు ఇంకిపోవటం
 జవాబు:
 A) నీరు క్రిందకు భూమి పొరలలో ప్రయాణించటం
13. నేల క్షితిజాలలో చివరిది
 A) R – క్షితిజం
 B) C – క్షితిజం
 C) A – క్షితిజం
 D) B – క్షితిజం
 జవాబు:
 A) R – క్షితిజం
14. ఎడఫాలజీ అనగా
 A) నేలపై నీటి ప్రభావం
 B) జీవులపై నేల ప్రభావం
 C) నేలపై లవణ ప్రభావం
 D) నేలపై ఎండ ప్రభావం
 జవాబు:
 B) జీవులపై నేల ప్రభావం
15. అంగుళం మృత్తిక ఏర్పడటానికి పట్టే కాలం
 A) 500 – 1000 సం||
 B) 600 – 10000 సం||
 C) 10-100 సం||
 D) ఏదీ కాదు
 జవాబు:
 A) 500 – 1000 సం||
![]()
16. కింది వాక్యాలు చదవండి.
 P: నీరు చొచ్చుకొని పోయే సామర్థ్యం ఇసుకనేలలకు ఎక్కువ
 Q : నీరు చొచ్చుకొని పోయే సామర్థ్యం బంకమట్టి నేలలకు ఎక్కువ
 A) P మాత్రమే సరైనది.
 B) Q మాత్రమే సరైనది.
 C) P, Qలు రెండూ సరైనవి.
 D) P, Qలు రెండూ సరైనవికావు.
 జవాబు:
 D) P, Qలు రెండూ సరైనవికావు.
17. ఇసుక నేలలో
 A) మట్టిలో పెద్ద రేణువులుంటాయి.
 B) మట్టిలో ఎక్కువ సన్నటి రేణువులుంటాయి.
 C) పెద్ద రేణువులు సన్నటి రేణువులు సమపాళ్ళలో ఉంటాయి.
 D) మట్టిలో నీరు ఎక్కువ ఉంటుంది.
 జవాబు:
 A) మట్టిలో పెద్ద రేణువులుంటాయి.
18. బంకమట్టి నేలలో
 A) మట్టిలో పెద్ద రేణువులుంటాయి.
 B) పెద్దరేణువులు సన్నటి రేణువులు సమపాళ్ళలో ఉంటాయి.
 C) మట్టిలో ఎక్కువ సన్నటి రేణువులుంటాయి.
 D) మట్టిలో నీరు ఎక్కువ ఉంటుంది.
 జవాబు:
 C) మట్టిలో ఎక్కువ సన్నటి రేణువులుంటాయి.
19. లోమ్ నేలలో
 A) మట్టిలో పెద్ద రేణువులుంటాయి.
 B) పెద్దరేణువులు సన్నటి రేణువులు సమపాళ్ళలో ఉంటాయి.
 C) మట్టిలో ఎక్కువ సన్నటి రేణువులుంటాయి.
 D) మట్టిలో నీరు ఎక్కువ ఉంటుంది.
 జవాబు:
 B) పెద్దరేణువులు సన్నటి రేణువులు సమపాళ్ళలో ఉంటాయి.
20. సీత వంటగది నుండి బియ్యం కడిగిన నీళ్ళను, పప్పుకాయ గూరలు కడిగిన నీళ్ళను బకెట్టులో సేకరించి తోటకు మళ్ళించింది. పై పని ఈ విషయానికి దారి తీస్తుంది.
 A) నీటి స్తబ్దత
 B) నీటి పునర్వినియోగం
 C) నీటిని నిల్వ చేయడం
 D) నీటిని రికవర్ చేయడం
 జవాబు:
 D) నీటిని రికవర్ చేయడం
21. మృత్తికను గూర్చిన శాస్త్రీయ అధ్యయనం
 A) ఎడఫాలజీ
 B) పెడాలజీ
 C) పెడోజనెసిస్
 D) పైవేవీకావు
 జవాబు:
 B) పెడాలజీ
22. విత్తనాలు మొలకెత్తటానికి అనువుగా ఉండే పొర
 A) O క్షితిజం
 B) B క్షితిజం
 C) A క్షితిజం
 D) C క్షితిజం
 జవాబు:
 A) O క్షితిజం
23. చాలా తక్కువ కార్బన్ పదార్థాలు కలిగిన పొర
 A) A క్షితిజం
 B) B క్షితిజం
 C) C క్షితిజం
 D) R క్షితిజం
 జవాబు:
 A) A క్షితిజం
24. త్రవ్వడానికి అనుకూలంగా ఉండని పొర
 A) A క్షితిజం
 B) B క్షితిజం
 C) C క్షితిజం
 D) R క్షితిజం
 జవాబు:
 B) B క్షితిజం
![]()
25. 
 ప్రక్క పటం సూచించునది
 A) ఇసుక
 B) ఇసుక లోమ్
 C) లోమ్
 D) బంకమట్టి
 జవాబు:
 A) ఇసుక
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. soil అనే పదం …………. అనే లాటిన్ పదం నుండి పుట్టింది.
 2. సోలమ్ అనగా లాటిన్ భాషలో …………..
 3. మట్టి వాసనకు కారణం ……………. అనే పదార్థం.
 4. జియోస్మిన్…………….. అను బ్యా క్టీరియా స్పోరుల నుండి విడుదలగును.
 5. సౌందర్య సాధనంగా …………. మట్టిని వాడతారు.
 6. బొమ్మలు, విగ్రహాల తయారీకి …………… మట్టిని వాడతారు.
 7. మృత్తిక ఏర్పడే ప్రక్రియను ………….. అంటారు.
 8. మృత్తిక ఏర్పడే ప్రక్రియలో రాళ్ళు పగిలిపోవడాన్ని …………….. అంటారు.
 9. కర్బన పదార్థాలు కలిసిన మట్టిని ……….. అంటారు.
 10. జీవులపై నేల ప్రభావ అధ్యయనాన్ని ……………….. అంటారు.
 11. ఒక ప్రదేశంలోని అడ్డుపొరలుగా ఏర్పడిన అంశాలన్ని కలిపి ……………… అంటారు.
 12. మృత్తికలోని అడ్డుపొరలను …………………… అంటారు.
 13. రాతి పొరను …………… క్షితిజం అంటారు.
 14. నీరు ఇంకే స్వభావం …………… నేలలకు అధికం.
 15. ……………. ని వలయంగా వంచవచ్చు.
 16. నేలపొరల ద్వారా నీరు క్రిందకు కదలడాన్ని ……… అంటారు.
 17. నల్లరేగడి నేలలు ……… పంటలకు అనుకూలం.
 18. నేలపై పొర కొట్టుకొని పోవడాన్ని ……… అంటారు.
 19. నేల నిస్సారం కాకుండా చూడడాన్ని …………… అంటారు.
 20. ప్రపంచ జల దినోత్సవం ……………..
 21. అంతర్జాతీయ జల దశాబ్దం …………………
 22. భూమిపై మంచినీటి శాతం ………….
 23. భూమిలోనికి నీరు ఇంకే ప్రక్రియను …………. అంటారు.
 24. రాతిపొరల మధ్య నిల్వ చేయబడిన నీరు ……………….
 25. నీటికి బ్లీచింగ్ పౌడర్ కలిపి ………. సంహరిస్తాము.
 26. ………….. వ్యర్ధ జలాన్ని మురుగునీరు అంటారు.
 27. మురుగునీటి శుద్ధీకరణలో దశల సంఖ్య …………
 28. నీటిలోని మలినాలను బరువైన రేణువులుగా మార్చటానికి రసాయనాలకు కలిపే ప్రక్రియ …………………
 జవాబు:
- సోలమ్
 - మొక్కలు పెరిగే తలం
 - జియోస్మిన్
 - అక్టినోమైసిటిస్
 - ముల్తానా
 - షాదూ
 - పీడోజెనెసిస్
 - శైథిల్యం
 - హ్యూమస్
 - ఎడఫాలజీ
 - మృత్తికా స్వరూపం
 - క్షితిజాలు
 - R
 - ఇసుక
 - బంకమట్టి
 - పెర్కొలేషన్
 - పత్తి, మిరప
 - మృత్తికా క్రమక్షయం
 - నేల సంరక్షణ
 - మార్చి 22
 - 2018-2028
 - 1%
 - ఇన్ఫిల్టరేషన్
 - ఆక్విఫర్
 - సూక్ష్మజీవులను
 - గృహ పరిశ్రమ
 - 3
 - గడ్డ కట్టించటం
 
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
| Group – A | Group – B | 
| A) పునఃవృద్ధి (Recharge) | 1) నీటి వనరుల సంరక్షణ | 
| B) పునర్వినియోగం (Reus | 2) బోరుబావుల నీటిమట్టం పెంచటం | 
| C) పునరుద్ధరించడం (Revive) | 3) కుళాయి ఆపివేయటం | 
| D) తగ్గించటం (Reduce) | 4) మురుగు నీటిని శుద్ధి చేయటం | 
| E) 4R | 5) వర్షపాతం పెంచటం | 
| 6) దిగుడుబావులు పూడ్చివేయటం | 
జవాబు:
| Group – A | Group – B | 
| A) పునఃవృద్ధి (Recharge) | 2) బోరుబావుల నీటిమట్టం పెంచటం | 
| B) పునర్వినియోగం (Reus | 4) మురుగు నీటిని శుద్ధి చేయటం | 
| C) పునరుద్ధరించడం (Revive) | 5) వర్షపాతం పెంచటం | 
| D) తగ్గించటం (Reduce) | 3) కుళాయి ఆపివేయటం | 
| E) 4R | 1) నీటి వనరుల సంరక్షణ | 
2.
| Group – A | Group – B | 
| A) సముద్రపు నీరు | 1) మార్చి – 22 | 
| B) మంచినీరు | 2) 97% | 
| C) అవక్షేపించిన నీరు | 3) 1% | 
| D) భూగర్భ ఉపరితలం నీరు | 4) 2% | 
| E) జల దినోత్సవం | 5) 3% | 
జవాబు:
| Group – A | Group – B | 
| A) సముద్రపు నీరు | 2) 97% | 
| B) మంచినీరు | 5) 3% | 
| C) అవక్షేపించిన నీరు | 4) 2% | 
| D) భూగర్భ ఉపరితలం నీరు | 3) 1% | 
| E) జల దినోత్సవం | 1) మార్చి – 22 |