Practice the AP 6th Class Science Bits with Answers Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP 6th Class Science Bits Chapter 8 దుస్తులు ఎలా తయారవుతాయి with Answers
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. మొక్కలు మరియు జంతువుల నుండి పొందిన దారాలను ………. దారాలు అంటారు.
 A) కృత్రిమ
 B) సింథటిక్
 C) సహజ
 D) పైవన్నీ
 జవాబు:
 C) సహజ
2. పత్తి దారం దేని నుండి లభిస్తుంది?
 A) జనపనార
 B) పత్తి
 C) కొబ్బరి
 D) వేరుశెనగ
 జవాబు:
 B) పత్తి
3. గాంధీజీ ఏ రకమైన వస్త్రాల వాడుకకు ప్రాధాన్యత ఇచ్చారు?
 A) ఖాదీ
 B) సిల్క్
 C) ఉన్ని
 D) పాలిస్టర్
 జవాబు:
 A) ఖాదీ
4. గన్నీ సంచులు దేనితో తయారు చేయబడతాయి?
 A) కొబ్బరి
 B) కాటన్
 C) జనపనార
 D) వేరుశనగ
 జవాబు:
 C) జనపనార

5. మంగళగిరి ఏ పరిశ్రమకు ప్రసిద్ది చెందింది?
 A) కలంకారి
 B) హస్తకళలు
 C) తివాచీలు
 D) చేనేత వస్త్రాలు
 జవాబు:
 D) చేనేత వస్త్రాలు
6. ఏ పట్టణం కార్పెట్ పరిశ్రమకు ప్రసిద్ధి?
 A) మచిలీపట్నం
 B) మంగళగిరి
 C) పాండూరు
 D) ధర్మవరం
 జవాబు:
 A) మచిలీపట్నం
7. పాలిస్టర్ దేనితో తయారు చేయబడుతుంది?
 A) ఈథేన్
 B) ఆల్కహాల్
 C) యాసిడ్
 D) పెట్రోలియం
 జవాబు:
 D) పెట్రోలియం
8. దేని వెంట్రుకలతో వెచ్చని బటలు తయారు చేసారు?
 A) పట్టు పురుగు
 B) అడవి దున్న
 C) పంది
 D) ఆవు
 జవాబు:
 B) అడవి దున్న
9. భిన్నమైన దాన్ని ఎంచుకోండి.
 A) సిల్క్
 B) ఉన్ని
 C) కాటన్
 D) పాలిస్టర్
 జవాబు:
 D) పాలిస్టర్
10. కింది వాటిలో ఏది సహజ దారం?
 A) పట్టు
 B) నైలాన్
 C) రేయాన్
 D) ఏదీ కాదు
 జవాబు:
 A) పట్టు
11. పత్తి పోగులను దాని విత్తనాల నుండి వేరు చేయడం
 A) నేత
 B) జిన్నింగ్
 C) అల్లడం
 D) వడకటం
 జవాబు:
 B) జిన్నింగ్

12. సరైన క్రమాన్ని ఎంచుకోండి.
 A) దారపు పోగు → ఫ్యాబ్రిక్ → దారం
 B) దారం → దుస్తులు → దారపు పోగు
 C) దుస్తులు → దారం → దారపు పోగు
 D) దారపు పోగు → దారం → దుస్తులు
 జవాబు:
 D) దారపు పోగు → దారం → దుస్తులు
13. కొబ్బరి పీచును దేని తయారీకి ఉపయోగిస్తారు?
 A) చొక్కాలు
 B) చీరలు
 C) డోర్ మాట్స్
 D) పైవన్నీ
 జవాబు:
 C) డోర్ మాట్స్
14. పాత రోజులలో యుద్ధ సైనికులు ఏ బట్టలు ఉపయోగించారు?
 A) లోహపు
 B) ఉన్ని
 C) నైలాన్
 D) పాలిస్టర్
 జవాబు:
 A) లోహపు

15. ఏ పదార్ధం భూమిలో కుళ్ళిపోవటం చాలా కష్టం?
 A) కాటన్
 B) జనపనార
 C) ఉన్ని
 D) పాలిథీన్
 జవాబు:
 D) పాలిథీన్
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. పత్తిలోని చిన్న చిన్న దారాలను ……. అంటారు.
 2. పత్తి …………… నేలల్లో పెరుగుతుంది.
 3. పుస్తక బైండింగ్ లో ……………………… దుస్తులు ఉపయోగిస్తారు.
 4. మచిలీపట్నం ………… పరిశ్రమకు ప్రసిద్ధి.
 5. ……………. పత్తి త్రిప్పడానికి ఉపయోగించే పరికరం.
 6. భారతదేశంలో ……….. రాష్ట్రం జనపనారను అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది.
 7. కొబ్బరి నార ………… చెట్టు నుండి ఉత్పత్తి అవుతోంది.
 8. వేసవి కాలంలో ……….. బట్టలు వాడతారు.
 9. దారపు పోగు(పీచు) → ……… → దుస్తులు.
 10. పత్తి కాయలనుండి విత్తనాలను తొలగించే ప్రక్రియను ……………… అంటారు.
 జవాబు:
- దారపు పోగు లేదా పత్తి పీచు దారాలు
- నల్ల రేగడి
- కాలికో
- కలంకారి
- తకిలి
- పశ్చిమ బెంగాల్
- కొబ్బరి
- కాటన్
- దారం
- జిన్నింగ్ (వేరు చేయటం)
III. జతపరుచుట
కింది వానిని జతపరుచుము.
1.
| Group – A | Group- B | 
| ఎ) పత్తి | 1) జనుము యొక్క కాండం | 
| బి) పట్టు | 2) పత్తి కాయ | 
| సి) ఉన్ని | 3) పెట్రోలియం | 
| డి) జనపనార | 4) పట్టు పురుగు | 
| ఇ) పాలిస్టర్ | 5) గొర్రెలు | 
జవాబు:
| Group – A | Group- B | 
| ఎ) పత్తి | 2) పత్తి కాయ | 
| బి) పట్టు | 4) పట్టు పురుగు | 
| సి) ఉన్ని | 5) గొర్రెలు | 
| డి) జనపనార | 1) జనుము యొక్క కాండం | 
| ఇ) పాలిస్టర్ | 3) పెట్రోలియం | 
2.
| Group – A | Group – B | 
| ఎ) దుస్తులు | 1) చిన్న తంతువులు | 
| బి) జిన్నింగ్ | 2) దారం నుండి నేసినది. | 
| సి) దారపు పీచు | 3) విత్తనాలను తొలగించే ప్రక్రియ | 
| డి) కాలికో | 4) దారపు పోగు నుండి దారం తయారీ | 
| ఇ) స్పిన్నింగ్ | 5) బుక్ బైండింగ్లో ఉపయోగించే బట్ట | 
జవాబు:
| Group – A | Group – B | 
| ఎ) దుస్తులు | 2) దారం నుండి నేసినది. | 
| బి) జిన్నింగ్ | 3) విత్తనాలను తొలగించే ప్రక్రియ | 
| సి) దారపు పీచు | 1) చిన్న తంతువులు | 
| డి) కాలికో | 5) బుక్ బైండింగ్లో ఉపయోగించే బట్ట | 
| ఇ) స్పిన్నింగ్ | 4) దారపు పోగు నుండి దారం తయారీ | 
3.
| Group – A | Group – B | 
| ఎ) జనపనార | 1) కాలికో | 
| బి) పి.వి.సి | 2) పత్తి కాయ | 
| సి) ప్యాంటు | 3) బంగారు దారపు పోగు | 
| డి) బుక్ బైండింగ్ | 4) కృత్రిమ దారం | 
జవాబు:
| Group – A | Group – B | 
| ఎ) జనపనార | 3) బంగారు దారపు పోగు | 
| బి) పి.వి.సి | 4) కృత్రిమ దారం | 
| సి) ప్యాంటు | 2) పత్తి కాయ | 
| డి) బుక్ బైండింగ్ | 1) కాలికో | 
